17 November 2017

పిల్లలను పోషించలేక అనాథాశ్రమంలో విడిచా..

కర్నూలు: ‘నా భర్త పుల్లయ్య టీబీ వ్యాధితో చనిపోయి మూడేళ్లైంది. నాకు చంద్రకళ, స్ఫూర్తి, ధరణి.. ముగ్గురు ఆడపిల్లలు. కేవలం నేను కూలీ పనులు చేసే బతకాలి. పొలం లేదు. పిల్లలను సాకలేక అనాథశ్రమంలో ఉంచి చదివిస్తున్నాను. నేను రోజు కూలి పోతేనే పూట గడుస్తుందన్నా.. మూడేళ్ల నుంచి వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నా రాలేదు. కనీసం మీరైనా పింఛన్‌ ఇప్పించండి’ అని వైయ‌స్‌ జగన్‌ ఎదుట పెద్దచింతకుంటకు చెందిన పి.లీలావతి గోడు వెళ్లబోసుకుంది. జన్మభూమి కమిటీ సభ్యులే తనకు పింఛన్‌ రాకుండా చేస్తున్నారని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెకు పింఛన్‌ వచ్చేలా చూడాలని పార్టీ నాయకులను చేయాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్‌ సొమ్మును రూ.2 వేలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment