14 November 2017

ప‌చ్చ బొట్టు..వైయ‌స్ఆర్ మీద ఒట్టు


- నాడు ష‌ర్మిళ‌, నేడు వైయ‌స్ జ‌గ‌న్ వెంట న‌డుస్తున్న వీరాభిమాని
- వైయ‌స్ఆర్ కుటుంబం వెంటే రామ‌కృష్ణ‌

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జా రంజ‌క పాల‌న అందించి ఎంద‌రో హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఇవాళ ఆయ‌న బౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన ప్ర‌జ‌ల గుండెల్లో గూడు క‌ట్టుకున్నారు. ఆయ‌న ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందిన వారు రాజ‌న్న‌ను దేవుడిలా కొలుస్తున్నారు. వీరి కోవ‌కే చెందిన జంప‌న రామ‌కృష్ణ కుమార్ రాజా కూడా ఒక‌రు. ఈయ‌నకు మ‌హానేత కుటుంబం అంటే ఎన‌లేని అభిమానం. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం రాజ‌న్న కూతురు ష‌ర్మిళ పాద‌యాత్ర‌లో కూడా రామ‌కృష్ణ అడుగులు వేశారు. తాజాగా ఈనెల 6వ తేదీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో కూడా రామ‌కృష్ణ జ‌న‌నేత‌తో క‌లిసి పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు. జంపన రామక్రిష్ణ కుమార్‌రాజా స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని కృష్ణ దేవిపేట. నెత్తిన దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ కనిపించేలా చుట్ట చుట్టుకుంటారు. ఎక్కడ వైయ‌స్ఆర్‌సీపీ పాదయాత్రలు జరుగుతుంటే అక్కడ ఆయ‌న ప్రత్యక్షమవుతారు. ప్రచార రథం ముందు నడుస్తూ యాత్రకు వచ్చిన అభిమానులను పక్కకు జరగాలని సూచిస్తుంటారు. ఇడుపుల‌పాయ నుంచి కూడా వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలోనూ ఇలానే చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు.
వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యే వ‌ర‌కు..
యాత్ర ప్రారంభమైన ఆరో తేదీ నుంచి ఆయన వైయ‌స్‌ జగన్‌ వెంట నడుస్తున్నారు. ఇప్పటికే వైయ‌స్‌ జగన్‌ ఓదార్పుయాత్ర, షర్మిళ పాదయాత్రలో పాల్గొన్నాని చెప్పారు. దివంగత సీఎం వైయ‌స్‌ అంటే తనకు అభిమానమని, ఆ అభిమానంతోనే జగనన్న వెంట నడుస్తున్నాని చెప్పారు. జగనన్న సీఎం అయ్యేవరకు పార్టీ కార్యక్రమాలు మాననని ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా పాల్గొంటానని చెప్పారు. ఆయన చేయి మీద ఒక పచ్చ బొట్టు ఉంటుంది. అందులో ‘అమ్మ, నాన్న వైయ‌స్ఆర్‌.. వైయ్ జగన్‌’ అని ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నారు. ఆయన  అభిమాన్ని మిగ‌తా వారు ఉప్పొంగిపోతున్నారు.

No comments:

Post a Comment