27 February 2018

లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చాయి?

– ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు
– గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు
– జీడీపీ విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
– బాబు పాలన చూస్తే బాధనిపిస్తోంది
– అడుగడుగునా నీళ్లు లేవని చెబుతున్నారు
– వెలుగొండ ప్రాజెక్టు చూస్తే వైయస్‌ఆర్‌ పాలన గుర్తుకు వస్తోంది
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో వెలుగొండకు మోక్షం లేదు
– చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది
–పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌
 
ప్రకాశం: ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కట్టు కథలతో కాలయాపన చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, అవి ఎక్కడ ఉన్నాయో చూపాలని వైయస్‌ జగన్‌ నిలదీశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే బాధనిపిస్తుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుకు వస్తుందని చెప్పారు. రాజకీయ నాయకుడికి విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత, సిన్సియారిటి ఉండాలని వివరించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారో..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఎండకాలం ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా పొద్దునుంచి వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఒకవైపున బాధలు చెప్పుకుంటూ, మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..నీకు తోడుగా మేమంతా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఈ నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా ఎండను ఖాతరు చేయకుండా నడిరోడ్డు అన్న సంగతిని లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరి ఆత్మీయతలకు ముందుకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అన్నా..నీళ్లు లేవన్నా అంటున్నారు..
మార్కాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే అడుగడుగునా నాకు కనిపించింది ఏంటో తెలుసా..అన్నా..నీళ్లు లేవన్నా అంటున్నారు. బాధనిపించింది. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుకు వస్తోంది. నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతులు అల్లాడుతున్నారు. చంద్రబాబు జాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో చెప్పారు. కానీ బాబు వచ్చిన తరువాత నాలుగేళ్లు కరువు వచ్చింది. రబీ, ఖరీఫ్‌లో మైనస్‌ 34 శాతం వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో మైనస్‌ 70 శాతం వర్షపాతం. ఇంత జరుగుతున్నా కూడా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడి ఇ వ్వాలని కానీ, కరువు మండలంగా ప్రకటించాలని ఈ పాలనకు రావడం లేదు. ఏదైనా కరువు వస్తే ఖరీఫ్‌ నుంచి రైతులను ఆదుకునేందుకు వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ సొమ్ము ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు. ఈ ముఖ్యమంత్రి రైతు శ్రేయోభిలాషి కాదు. ఖరీఫ్, రబీలో కరువు వచ్చి దారుణంగా రైతుల పరిస్థితి ఉన్నా కూడా ఇన్సూరెన్స్‌డబ్బులు కట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాట ఇంతవరకు చంద్రబాబు చెల్లించడం లేదు. ప్రజా సంకల్ప యాత్రలో నేను నిలదీయడంతో నామ్‌కే వాస్తిగా రెండు, మూడు కరువు మండలాలను ప్రకటించారు. కేబినెట్లో మంత్రులు రైతుల గురించి మాట్లడటం లేదు. కేబినెట్‌లో ఎవరి భూములు దోచుకోవాలి,  ఏ కాంట్రాక్టర్‌కు అంచనాలు పెంచి డబ్బులు దోచిపెట్టాలని ఆలోచిస్తున్నారు. 

సాగర్‌ జలాలు తెస్తారని ఎవరైనా ఊహించారా?
 సాగర్‌ జలాలను ప్రకాశం జిల్లాకు తీసుకొని వ చ్చి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తారని ఎవరు ఊహించలేదు. చంద్రబాబు గతంలో 9 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చే శారు. మొదటి సొరంగంలో 12 కిలోమీటర్లు, రెండో సోరంగంలో 9 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కనీసం 4 కిలోమీటర్ల సొరంగం కూడా తవ్వలేదు. ఈ పెద్ద మనిషికి ప్రకాశం జిల్లాకు వస్తే వ వెలుగొండ గుర్తుకు వస్తుంది. జూన్‌ మాసంలో పూర్తి చేస్తామని కథలు చెబుతారు..ఆ తరువాత మరిచిపోతున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 4.30 లక్షల ఎకరాల్లో బూములు సస్యశ్యామలం అవుతాయి. ఎ్రరగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో నీరు అందించే ఈ ప్రాజెక్టును విస్మరించారు. తాగడానికి నీరు లేక ఒళ్లంతా వంకర్లు పొతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితేనే ఈ సమస్యలు తీరుతాయి. ఆ ప్రాజెక్టు పరిస్థితి ౖచూస్తే బాధనిపిస్తుంది. పొదిలిలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా..పాలకులు పట్టించుకోవడం లేదు. ఏ మాత్రం కూడా ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇవాళ మీ అందరితో ఒక్కటే చెబుతున్నాను. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్న నేపథ్యంలో ఒక్కసారి చంద్రబాబు పాలన ఎలా సాగుతుందో ఆలోచించమని కోరుతున్నాను.

మోసం..అబద్ధాలు, అవినీతి, విచ్చలవిడి అధికార దుర్వినియోగం..
నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఆలోచన చేయండి. ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు పాలనలో మోసం, అబద్ధాలు, అవినీతి, విచ్చలవిడి అధికార దుర్వినియోగం, రాజ్యాంగాన్ని తుట్లు పొడుస్తున్నారు. అడ్డగోలుగా ఆడియో, వీడియో టేపులతో దొరికినా కూడా వారు రాజీనామా చేయడం లేదు. 
– రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరల బాదుడే..బాదుడు. పక్క రాష్ట్రంలతో పోలిస్తే..మన రాష్ట్రంలోని డీజిల్, పెట్రోల్‌పై రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దేశంలోనే పెట్రోల్‌ రేట్లలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉంది. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమన్నారు..పిల్లలు తాగి చెడిపోతున్నారు. వస్తునే మద్యాన్ని రద్దు చేస్తామని, బెల్టు షాపులు తీసేస్తామని చెప్పారు. ఇవాళ గ్రామాల్లో తాగడానికి మంచినీరు ఉందో లేదో తెలియదు కానీ, మందు, బెల్టు షాపులు లేని గ్రామాలు లేవు. చంద్రబాబు ఐటేక్‌ పాలనలో ఫోన్‌ కొడితే మందు ఇంటికి వస్తోంది. 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు కరెంటు చార్జీలు తగ్గిస్తామని అన్నారు. కానీ ఈయన సీఎం కాగానే మూడుసార్లు కరెంటు బిల్లులు పెంచారు. గతంలో రూ.50 నుంచి వంద వరకు వచ్చేది.  ఇప్పుడు రూ.500 నుంచి వెయ్యి వరకు కరెంటు బిల్లులు వేస్తున్నారు. ఈ రోజు పొద్దున నా వద్దకు ఓ అక్క వచ్చి మాకు మూడు ఫ్యాన్లు, టీవీ ఉంది. అయితే రూ.8 వేలు కరెంటు బిల్లు వచ్చిందని చెప్పారు.
– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, గోదుమలు, కిరోసిన్‌ వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు.  ఇప్పుడు బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. వెలిముద్రలు పడటం లేదని బియ్యంలో కూడా కోతలు విధిస్తున్నారు. ఈయన పాలన చూస్తే ఇంత దారుణంగా ఉంది. 

బాబు చేసిన మోసాలు మరిచిపోవద్దు
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..బ్యాంకులో బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. చంద్రబాబు రుణమాఫీ రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు. ఆడవాళ్లను మోసం చేయాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఆడవాళ్లు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టం అంటారు. చంద్రబాబు పుణ్యమా అని ప్రతి అక్కచెల్లెమ్మ కన్నీరు పెడుతోంది. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఎన్నికలప్పుడు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ.94 వేలు చంద్రబాబు బాకీ పడ్డారు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే ఆ డబ్బులు ఏమయ్యాయే అడగండి. అప్పుడైనా బుద్ది వస్తుందేమో. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చలేని నాయకుడు ఇంటికి వెళ్లాలి.

చంద్రబాబును పొరపాటున క్షమిస్తే ..
చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున పెద్ద పెద్ద అబద్ధాలు, మోసాలు చేస్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. అయినా నమ్మరని బంగారానికి బోనస్‌గా బెంజీ కారు ఇస్తామంటారు. అంతేకాదు ప్రతి ఇంటికి చంద్రబాబు మనిషి వచ్చి ఓటుకు రూ.3 వేలు చేతిలో పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బు మనదే. మన జô బుల్లో నుంచి దోచేశారు. కానీ ఓటు మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి.  ఇటువంటి మోసాలు చేసే వ్యక్తులను బంగాళఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత అనే అర్థం వస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే..మూడు రోజులుగా విశాఖలో పారిశ్రామికవేత్తల సమ్మిట్‌ చంద్రబాబు జరుపుతున్నారు. రాజకీయ నాయకుడికి  4 గుణాలు ఉండాలి. 1. వ్యక్తిత్వం, 2. విశ్వసనీయత, 3. కమిట్‌మెంట్, 4. సిన్సియారిటీ ఉండాలి. ఈ నాలుగు గుణాలు లేకపోతే అచ్చు చంద్రబాబులా తయారవుతారు.

బాబు మారాడని సంతోషపడ్డాం..కానీ..
ప్రత్యేక హోదా కావాలని మనమంతా అడుగుతున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు చేస్తూ నినదించాం. ప్యాకేజీతో మోసం చేయకండి..ప్రత్యేక హోదా మా హక్కు అని నినదించాం. ఆ రోజు ప్రత్యేక హోదా సంజీవినా అన్న చంద్రబాబు మళ్లీ ప్లెట్‌ మార్చారు. చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యిందని సంతోషపడ్డం. కానీ ఆయనలో చిత్తశుద్ధి లేదు. విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సు ముగింపు సందర్భంగా గవర్నర్‌తో రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పించారు. గతంలో కూడా ఇ లాగే రూ.15 లక్షల కోట్లు వచ్చాయని గత రెండేళ్లుగా బుకాయించారు. ఆ పెట్టుబడులు, లక్షల కొద్ది ఉద్యోగాలు మీకు కనిపించాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్త ఢిల్లీలోని డిప్‌ అన్న ఇండస్ట్రీస్‌లో దరఖాస్తు చేయాలి. ఐఈఈఎంలో ఎంత మంది దరఖాస్తులు పెట్టారన్నది డిసెంబర్‌ 31న డేటా విడుదల చేస్తుంది. గతేడాది నాటికి మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతో తెలుసా కేవలం ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా రాకపోతే..ఈ పెద్ద మనిషి రూ. 15 లక్షల కోట్లు అని ఊదరగొట్టడం రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా? రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిజాయితీగా చెబుతారా? ఉన్నది లేనట్లు అబద్ధాలు చెబుతారా? ఈ నాలుగేళ్లలో వృద్ధిరేటు ఏపీలో పరుగులు తీస్తుందని, 12 శాతం ఉందని  చంద్రబాబు చెబుతున్నారు. దేశంలో 6 నుంచి 7 శాతం జీడీపీ పెరుగుతుంటే..మన రాష్ట్రంలో విడిపోయిన తరువాత 12 శాతం పెరుగుతుందని ప్రజలను మభ్యపెట్టడం సరైంది కాదన్నారు.  నాలుగేళ్లుగా కరువు కారణంగా గిట్టుబాటు ధరలు లేవు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదు. చంద్రబాబు మాత్రం వాస్తవిక పరిస్థితి పక్కన పెట్టి లేనిపోని కథలు చెబుతున్నారు. మన రాష్ట్ర తలసరి ఆదాయం పర్‌ క్యాపిట ఇన్‌కం రూ.1.22 లక్షలు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఈనాడు ఇంటర్య్వూలో చెప్పారు. రాష్ట్రంలో లేని పరిశ్రమలు, ఉద్యోగాలు చూపిస్తే ..ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారని చంద్రబాబును అడుగుతున్నాను. నాలుగేళ్లుగా ఇదే పెద్ద మనిషి ఇదే మాదిరిగా మోసం చేస్తున్నారు. నాలుగు రోజులు క్రితం ప్రత్యేక హోదా పల్లవి ఎత్తుకున్నారు. బాబులో మార్పు వచ్చిందని సంతోష పడితే ఈ రోజు సీఐఐ సదస్సు పెట్టి మళ్లీ రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ముసలి కన్నీరు కార్చుతున్నారు. సీఐఐ సమ్మిట్లలో దొంగ నంబర్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం అవిశ్వాస తీర్మానం పెడతాం..మీరు మద్దతు ఇవ్వమంటే చంద్రబాబు ముందుకు రావడం లేదు. చిత్తశుద్ది ఏ అడుగులో కూడా కనిపించడం లేదు. ఇలాంటి అన్యాయమైన పాలనను, అబద్ధాలు చెప్పే, అవినీతి పాలనను పూర్తిగా బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలని కోరుతున్నాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత తీసుకువచ్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా నిలువమని చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తున్నాను.

వైయస్‌ జగన్‌ను సీఎంను చేద్దాం

ప్రకాశం: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని, అందుకోసం ప్రతి ఒక్కరూ వీర సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే జంకే వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. పొదిలి పట్టణంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైయస్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లినా జనప్రభంజనమే అన్నారు. రాజన్న ముద్దుబిడ్డ వైయస్‌ జగన్‌ను గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందన్నారు. మూడు జిల్లాలకు ముచ్చటైన వెలుగొండ ప్రాజెక్టును వైయస్‌ జగన్‌ నిర్మిస్తారన్నారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించారన్నారు. మహానేత మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయలేని అసమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. మాటలు వద్దు..చేతల్లో చూపించాలని టీడీపీకి సవాల్‌ విసిరారు. మహానేత చనిపోవడమే రాష్ట్రానికి దురదృష్టకరమన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు విలువ లేదన్నారు. సంతలో పశువుల్లా మమ్మల్ని కొంటున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ౖÐð యస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేంత వరకు నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మనల్ని తరిమికొడతారని హెచ్చరించారు. చంద్రబాబు అవినీతి ముఖ్యమంత్రి అని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. జనం కోసమే జగన్‌ అని, వీర సైనికులుగా పని చేసి అన్నను గెలిపించుకుందామని, ముఖ్యమంత్రిగా కూర్చొబెడుదామని, మన ప్రాంతానికి న్యాయం చేస్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ వస్తే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తారని, అగ్రి గోల్డు బాధితులను ఆదుకుంటారన్నారు. జిల్లాలోని 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దామన్నారు. 

ఏడాదికే వెలుగొండ పూర్తి చేస్తాం

ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏడాదికే వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కాపురం, కొండేపి నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు  ఇస్తామన్నారు. పొదిలి పట్టణంలో సమ్మర్‌ స్టోరేజీ ఏర్పాటు చేసి 49 గ్రామాలకు నీరిస్తామన్నారు. పొదిలి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లడారు.  నవరత్నాలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో లంచగొండి పాలన సాగుతుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మన వద్దకు వచ్చారని చెప్పారు. నవరత్నాలతో అందరికి మేలు జరుగుతుందని హమీ ఇచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని వైయస్‌ జగన్‌ తెస్తారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఆయన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఊపిరి ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు. కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్‌ లోపల, బయట రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని, అప్పటికి దిగిరాకపోతే పార్లమెంట్‌ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకాశం జిల్లాను విస్మరించారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మించకుండా తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. నాలుగేళ్లు అయినా కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో 12 కిలోమీటర్లు నిర్మిస్తే..చంద్రబాబు నాలుగేళ్లలో నాలుగు కిలోమీటర్లు కూడా నిర్మించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అన్నారు. ఫ్లోరైడ్‌ కారణంగా 480 మంది అకాల మరణాలు పొందారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, ఏడాదికే వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తారని తెలిపారు.

అదిగో జ‌గ‌న‌న్న‌

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పోటెత్తిన మ‌హిళ‌లు
- అప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ 
ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకొని, క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌త్యేకంగా మ‌హిళ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చి రాజ‌న్న బిడ్డ‌ను చూసి మురిసిపోతున్నారు. త‌మ బాధ‌లు చెప్ప‌కుంటూ స్వాంత‌న పొందుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లా మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని పోతవరంలో రాజన్న తనయుడిని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి వేలాది మంది న‌డుస్తూ త‌మ క‌ష్టాలు చెప్పుకుంటున్నారు. మీ బిడ్డను ఆశీర్వదించండి... తోడుగా ఉండి చల్లని దీవెనలు అందించండి.. మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి అన్ని సమస్యలు పరిష్కరించి అందరి కన్నీళ్లు తుడుస్తా’నంటూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు భరోసా ఇస్తున్నారు.   ప్రజాసంకల్ప యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అడుగడుగునా పూలు చల్లి వైయ‌స్ జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. జ‌న‌నేత‌ వద్ద సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు తుంగలో తొక్కి అందరినీ మోసగించిందని ఆయ‌న‌ దృష్టికి తెస్తున్నారు.  రైతులను, మహిళలను, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. జనం కష్టాలు విని స్పందించిన వైయ‌స్ జగన్‌ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తూనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. మహిళలకు అన్ని విధాలా ప్రభుత్వం సాయమందిస్తుందని ఆడబిడ్డల చదువులకు తానే ఆర్థికసాయం అందిస్తానని వృద్ధులు బాగోగుల కోసం రూ.2 వేలు పింఛన్‌ ఇస్తానని వైయ‌స్ జగన్‌ అందరికీ భరోసానిచ్చారు.  సాయంత్రం పొదిలి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో ప‌ట్ట‌ణం కిక్కిరిపోతోంది. వైయ‌స్ జ‌గ‌న్‌ను చూడాల‌ని ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త‌మ బాధ‌లు చెప్పుకునేందుకు పాద‌యాత్ర దారిలో ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. 
  

1వ తేదీన కలెక్టరేట్‌ల వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా

రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయండి
తెలుగోడి గుండెమంటను ప్రభుత్వాలకు తెలియజేద్దాం
ధర్నాకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు
ప్రత్యేక హోదా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని, హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీన అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతీ, యువకుల భవిష్యత్తుకు, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నాల్లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాకు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు కూడా ప్రకటించడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మార్చి 1వ తేదీన జరగబోయే ధర్నాలో పాల్గొనాలని మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల గుండెమంటను కేంద్రానికి, కుంభకర్ణుడి నిద్రపోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబును లేపే విధంగా ధర్నా ఉంటుందన్నారు. పోలీస్‌ అధికారులు ప్రత్యేక హోదా రాజకీయపక్ష డిమాండ్‌ కాకుండా 5 కోట్ల ప్రజల ఆకాంక్షగా గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  

భూమి ఇవ్వని రైతుపై దాడిచేస్తారా

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ సర్కార్‌
అక్రమంగా రైతు రాంప్రసాద్‌ భూమిలో నిర్మాణాలు
అడ్డుకునేందుకు ప్రయత్నించగా రైతు బట్టలూడదీసి దాడి
సీఐఐ సదస్సుతో లక్షల కోట్లు పెట్టుబడులంటూ బాబు ఆర్భాటం
రోజుకు 20 లక్షల ఉద్యోగాలు అంటూ గొప్పలు
నాలుగేళ్లుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని పరిశ్రమలు పెట్టారు
సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి డిమాండ్‌
హైదరాబాద్‌: రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడానికి నిరాకరించిన రైతుపై టీడీపీ నేతలు, అధికారులు, పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంసజం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందనే సంగతి మీకు తెలియదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. రైతు రాంప్రసాద్‌ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు దాన్ని ఉల్లంఘించారన్నారు. నిర్మాణాలను అడ్డుకోవడానికి వెళ్లిన రూతును బట్టలు ఊడదీసి దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సేకరించిన 33 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిల్లో 2–3 వందల్లో మాత్రమే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారన్నారు. మిగిలిన భూముల్లో టీడీపీ ఎమ్మెల్యే లారీల్లో తన గేదెలను తీసుకువచ్చి మేపుకున్న దుస్థితి నెలకొందన్నారు. 

చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు మంత్రులు అండతో ప్రజలపై హింసకు దిగుతున్నారని పార్థసారధి మండిపడ్డారు. తమ భూమి ఇవ్వనని స్పష్టంగా చెప్పిన రైతుపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసులు, నిర్మాణాలు చేపట్టిన అధికారులు, వారి వెనుక ఉన్నవారిపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ల ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో.. రాష్ట్రంలో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. సీఐఐ సదస్సులని విశాఖలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే నాలుగు సంవత్సరాల్లో రూ. 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్నట్లుగా సంతకాలు పెట్టి ఫొటోలకు ఫోజులు ఇచ్చారన్నారు. గతంలో 10.5 లోల ఉద్యోగాలు వస్తాయన్న చంద్రబాబు ఇప్పుడు కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు, రోజుకు రూ. 50 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారన్నారు. ఇంతకు ముందు జరిగిన పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లలో ఎన్ని లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టారో... ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కాకిలెక్కలు కాకుండా కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ పాలసీ ధ్రువీకరించిన లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ప్రారంభ‌మైన 99వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌

ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 99వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్‌ మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గం, క‌టురివారిపాలెం నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. మ‌రికాసేప‌ట్లో జ‌న‌నేత పాద‌యాత్ర కొండేపి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్రవేశించ‌నుంది. అనంత‌రం అగ్ర‌హారం క్రాస్, ఫిర‌దోసి న‌గ‌ర్‌, గోగినేనిపాలెం మీదుగా ఉప్ప‌ల‌పాడు వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా పాద‌యాత్ర‌లో భాగంగా ఉప్ప‌ల‌పాడులో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కానున్నారు.

99వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 99వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం మార్కాపురం నియోజకవర్గంలోని కటురివారిపాలెం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గంలోని అగ్రహారం, మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తిరిగి మార్కాపురం నియోజకవర్గంలోని తాళమల్ల, ఫిర్దోష్‌ నగర్, గోగినేనిపాలెం, ఉప్పలపాడు వరకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతుంది.

21 February 2018

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీ

 
ప్రత్యేక హోదా సాధనకు విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదాతోనే ప్రజలకు మేలు కలుగుతుందని, చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖకు రైల్వేజోన్‌ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. 
 

మద్యం షాపు తీయించాలని విజ్ఞప్తి

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మాలపాడులో వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు కలిశారు. గ్రామంలో మద్యం షాపును తీయించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపును వ్యతిరేకిస్తే తమపై కేసులు పెట్టారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్సీ అధ్యాయన కమిటీ సమావేశం ప్రారంభం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ అధ్యాయన కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో అధ్యాయన కమిటీ సభ్యులు దళితుల సమస్యలు, కార్యాచరణపై చర్చిస్తున్నారు. 

రైతుల‌ను ఆదుకుంటాం

- ప్ర‌తి ఏటా రైతుల ఖాతాల్లో రూ.12,500
-  ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ 
ఒంగోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం ప్ర‌కాశం జిల్లా లింగంగుంట వ‌ద్ద రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌ని, సాగునీరు అంద‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు భ‌రోసా క‌ల్పించారు. పంటలు చేతికందక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టిడిపి ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, చంద్రబాబునాయుడు రైతు ద్రోహి అని విమర్శించారు. అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల ప్రస్తావన వస్తే వాటిపై స్పందించాల్సింది పోయి అపహాస్యం చేస్తూ మాట్లాడారన్నారు. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.  రైతులకు సాగు నీరు అందటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అందుకే ప్రాజెక్టుల విషయంలో అనవసర గందరగోళాన్ని సృష్టించి జాప్యం చేస్తున్నారని చెప్పారు.  మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారం లోకొస్తే పంటల సాగుకు ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కోసం ప్రతి రైతు ఖాతాలో రూ.12,500 నగదును జమ చేస్తామని హామీ ఇచ్చారు. మండల స్థాయిలో కోల్డ్‌స్టోరేజీ గోడౌన్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతుకు గిట్టుబాటు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికలతో రూ.3 వేల కోట్లు మార్కెట్‌ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపేందకు కేంద్రం సాయంతో రూ.4 వేల కోట్ల పరిహారనిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు.  వైయ‌స్ జ‌గ‌న్ హామీతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

వర్షాలు లేక భూములు బీడుగా మారాయి

 ‘కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో 600 ఎకరాలు మాగాణి భూమికి సాగునీటి సౌకర్యం లేక.. గత ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక భూములు బీడుగా మారాయి. సోమశీల ప్రాజెక్ట్‌ నుంచి వచ్చే సాగు నీళ్లు కావలి వరకు మాత్రమే వస్తాయి. ఈ కాలువను పొడిగించి అదనంగా కాలువ నిర్మాణం చేయడం ద్వారా మాగ్రామానికి సాగునీరు అందుతుంది. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అంటూ రైతులు  వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు.

చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి

 భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి కి  వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్షం తరపున పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన, రాజేంద్రనాథ్, ఆదిములపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ , దెందులూరు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ కోటారి రామచంద్రరావులు అసెంబ్లీ కార్య‌ద‌ర్శిని క‌లిశారు.

బాబును ప‌వ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు?

ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు నాలుగేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌ని నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను నిల‌దీశారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నాడు ప్ర‌శ్నిస్తాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు బాబుకు ప్ర‌శ్నించ‌కుండా ఎందుకు నోరు మూసుకున్నార‌న్నారు. కేంద్రం నిధుల‌లో ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై చంద్ర‌బాబు రోజుకో విధంగా లీకులు ఇచ్చి డ్రామాలు ఆడుతున్నార‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముందు పెట్టి డ్రామాలు ఆడ‌డం మానుకోవాల‌ని బాబుకు హిత‌వు ప‌లికారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. 

మోసం బాబు నైజం

* క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిద‌గ్గ‌ర క‌ట్టే ఫ్లైఓవ‌ర్ నిర్ణీత గ‌డువులోపు పూర్తి అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు
* ఒక్క ఫ్లైఓవ‌ర్ క‌ట్ట‌డానికే తంటాలు.. ఇక రాజ‌ధాని ఎలా నిర్మిస్తారు?
విజ‌య‌వాడ‌: అబ‌ద్ధాలు చెప్ప‌డం.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం చంద్ర‌బాబు నైజ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు క‌న‌క‌దుర్గ‌మ్మ గుడి ద‌గ్గ‌ర క‌ట్టే ఫ్లైఓవ‌ర్ నిర్మాణ‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు అల‌వికానీ హామీలు ఇచ్చి ఒక్క‌టీ కూడా నెర‌వేర్చ‌లేద‌న్నారు. బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ గొప్ప‌లు చెప్పారు త‌ప్పితే అభివృద్ధి ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌న్నారు. విదేశాల‌తో స‌మానంగా రాజ‌ధాని నిర్మిస్తామ‌న్న చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో ఒక్క ఫ్లైఓవ‌ర్‌ను నిర్మించ‌లేక‌పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక్క ఫ్లైఓవ‌ర్ నిర్మించ‌లేని చంద్ర‌బాబు ఇక రాజ‌ధాని ఎలా నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించారు. క‌న‌కదుర్గ‌మ్మ గుడి ద‌గ్గ‌ర ఉన్న ఫ్లైఓవ‌ర్ నిర్ణీత గ‌డువులోగా పూర్తి అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్నారు. బాబు దోచుకోవ‌డం.. దాచుకోవ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం లేద‌ని పెద్ద‌రెడ్డి పేర్కొన్నారు. 

ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ ముందుకు వెళ్తున్న జ‌న‌నేత‌

పాద‌యాత్ర‌గా వ‌స్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. బాబు పాల‌న‌లో ప‌డుతున్న బాధ‌ల‌ను విరిస్తున్నారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని రైతులు, పింఛ‌న్ రావ‌డం లేద‌ని విక‌లాంగులు, వృద్ధులు వారి బాధ‌లు చెప్పుకుంటున్నారు. మ‌రికొంద‌రు త‌మ రేష‌న్ కార్డును తీసేశార‌ని, తాము అన్నానికి కూడా ఇబ్బందులు ప‌డుతున్నామ‌న్నారు. వారి బాధ‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న న‌డుస్తోంద‌ని, ఈ పాల‌న‌ను త‌రిమి కొట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. మ‌న‌మంతా క‌లిసి ఈ దుర్మార్గ పాల‌న‌పై పోరాటం చేసి రాజ‌న్న రాజ్యం తెచ్చుకుందామ‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 

చౌటపాలెం చేరుకున్న జ‌న‌నేత‌

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ చౌటపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. త‌మ‌కు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేద‌ని మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు.

బాబు అంటే పవన్ కు భయమా?

చ‌ంద్ర‌బాబు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భ‌య‌మా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబుపై పోరాడాల్సిన వ్య‌క్తి ప్ర‌తిప‌క్షాన్ని ప్ర‌శ్నించడంలో ఆంత‌ర్య‌మేంటో చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఊపిరి ఉన్నంత వ‌ర‌కు పోరాటం చేస్తుంద‌ని, అందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు. ప‌వ‌న్ బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రు మద్ద‌తిచ్చినా..ఇవ్వ‌క‌పోయినా మిగ‌తా పార్టీల మ‌ద్ద‌తు తీసుకొని మార్చి 231న పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో మంగ‌ళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అంబ‌టి ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే.. 

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది. హోదా కోసం పదవులకు రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వైయస్ జగన్ ఎక్కడా ఛాలెంజ్ చేయలేదు.  ఒకసారి యూట్యూబ్ రివైండ్ చేసి చూసుకోండి. పవన్.. అవిశ్వాసానికి మీ పార్టనర్ ను ఒప్పించండని వైయస్ జగన్ అన్నారు. పవన్ కళ్యాణ్ చిన్నపిల్లవాడిగా వ్యవహరిస్తున్నారు. మేం పోరాట క్రమాన్ని ముందుగా ప్రకటించాం.  మార్చి 1న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తాం. మార్చి 5న పార్లమెంట్ లో ఉద్యమం చేయాలని నిర్ణయించాం. అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ చెప్పారు..ఆయన సలహాను స్వీకరిస్తున్నాం అని  వైయస్ జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు నా పార్టన్ కాదంటూనే పవన్ ప్రతిపక్షాన్ని ప్రశ్నించటం ఏమిటి? చంద్రబాబును ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్ కు ఉంది. 1.25 శాతం ఓట్ల‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దానికి కారణం పవనే అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఈరోజు పవన్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

 ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన సందర్భంగా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ మండిపడ్డారు. ఆ పాచిపోయిన లడ్డూలు తీసుకొన్న చంద్రబాబు బ్రహ్మాండంగా ఉన్నాయన్న చంద్రబాబును ఇంతవరకు ప్రశ్నించకపోవటంతో కారణం ఏమిటి? చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కు భయమా?  చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి? ప్రత్యేకహోదాపై పోరాడింది ప్రతిపక్ష నేత  వైయస్ జగన్ అన్నది వాస్తవామా? కాదా అన్నది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.  

అవిశ్వాసంపై తలా..తోక లేదన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ పై లేదా?: అంబటి రాంబాబు. ఎంపీలు అందర్నీ సమీకరిస్తాం అని పవన్ చెప్పారు. అవిశ్వాసం అక్కర్లేదన్న చంద్రబాబును ఎందుకు పవన్ ప్రశ్నించటం లేదు. మంత్రివర్గం నుంచి చంద్రబాబు ఎందుకు తప్పుకోవటం లేదని పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. మీరు చెప్పిన సలహా మేం స్వీకరించాం. పవన్ నిష్పక్షపాకంగా ఉంటే శభాష్ అంటాం. మీరు ఎవర్నో మోస్తున్నారన్న భావన కలుగుతోంది. మీరు అధికారంలో తీసుకువచ్చిన పార్టీకి 20 మంది ఎంపీలు ఉంటే.. వాళ్లను వదిలేసి.. ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్, తమిళనాడు, ఒరిస్సా వెళ్లి ఒప్పిస్తానటం హాస్యాస్పదం. నువ్వు గెలిపించిన రాజకీయ పార్టీ సరే.. పాత మిత్రుడ్నే ఒప్పించలేని వ్యక్తి.. పొరుగు రాష్ట్రాల ఎంపీలను ఒప్పిస్తారా?ఇది ఎలా ఉందంటే.. ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగురుతాను అందట .. అలా పవన్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేసిన అంబటి. ఏదో  చేస్తున్నారు.. మాకేమీ అర్థం కావటంలేదు. 

జేఎఫ్సీలో పెద్దవాళ్లు అందరూ ఉన్నారు. అందులో ఉన్న పెద్దలందరి మీద అపారమైన గౌరవం ఉంది. ప్రత్యేక హోదాను చంద్రబాబు ముంచారని అనలేపోయారు. చంద్రబాబును ప్రశ్నించలేనంత కాలం.. పవన్ పై అనుమానం ఉంటుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి గారు 184 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది. ఈ ఓటింగ్ లో టీడీపీ ఎంపీలు పాల్గొనమని చంద్రబాబుకు చెప్పు పవన్.నీతి, నిజాయితీలకు సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. పక్క రాజకీయపార్టీ శాసనసభ్యుల్ని కొనుగోలు చేయటం తప్పు అని చంద్రబాబుకు ఎందుకు చెప్పటం లేదు. ఓటుకు కోట్లులో చంద్రబాబు దొరికితే .. ఇలాంటివి చేయటం తప్పు అని ఒక్కమాట అన్నావా పవనూ?

ఆయన నా పార్టనర్ కాదు.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని అనటం ఏమిటి పవనూ? కేంద్రం నుంచి నిధులు ఎన్ని ఇచ్చారో.. తెల్సుకుందాం తప్ప .. ఎలా ఖర్చు చేశారో మనకు అనవసరం అని జేపీ అనటంలో ఆంతర్యం ఏమిటి? ముందు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తుంది. పవన్, చంద్రబాబు వచ్చినా రాకపోయినా ప్రత్యేక హోదాపై మా పోరాటం ఆగదు. ఇప్పటికైనా చంద్రబాబును ఒప్పించి.. మంత్రివర్గం నుంచి తప్పుకోమని ఒప్పించండి పవనూ..ప్రతిపక్షాన్ని విమర్శించడం సరైనది కాదని.. పవన్ తెల్సుకోవాలి. చంద్రబాబూ మంత్రివర్గంలో ఎంత కాలం కొనసాగుతారు? బీజేపీ వాళ్లు ఏం అంటున్నారో తెల్సా?
చంద్రబాబు రాష్ట్రాన్ని ఇప్పటికే ముంచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ఉద్యమంలో కలిసి రావాలి. స్పష్టమైన వైఖరిని పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది.

జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మంగ‌ళ‌వారం విప్ప‌గుంట నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టికే చౌట‌పాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌నతో క‌ర‌చాల‌నం ఇవ్వ‌డానికి పోటీ ప‌డ్డారు. అయితే మ‌హిళ‌లు, రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. మ‌హానేత పాల‌న‌లో త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని, ఇప్ప‌డు బాబు పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యుల‌కు ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఇవ్వ‌కుండా టీడీపీ నేత‌లు వేధిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ త్వ‌ర‌లో మంచి రోజులు వ‌స్తాయ‌ని వారికి భ‌రోసా ఇచ్చారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని ముందుకు క‌దిలారు. 

ప్రారంభ‌మైన 93వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టి పాద‌యాత్ర నేటికి 93వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ విప్ప‌గుంట శివారు నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. లింగంగుంట‌, మాలెపాడు, చౌట‌పాలెం మీదుగా తిమ్మ‌పాలెం వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా చౌట‌పాలెంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌డంతో పాటు తిమ్మ‌పాలెం వ‌ద్ద నిర్వ‌హించే రైతుల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. 

93వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 93వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం కొండేపి నియోజకవర్గంలోని విప్పగుంట శివారు నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పొన్నలూరు మండలం చౌటపాలెం, లింగం గుంట, మాలేపాడు వరకు సాగుతుంది. 12 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. అనంతరం 2.45 గంటలకు పొన్నలూరు, తిమ్మనపాలెం వరకు పాదయాత్ర సాగుతుంది. తిమ్మనపాలెం వద్ద రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.

22న జ‌రిగే ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయండి

ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. నాలుగేళ్లు అవుతున్నా హోదా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా ఈ నెల 22న ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ``ద‌గా ప‌డ్డ యువ‌తా మేలుకో`` అనే నినాదంతో జిల్లా యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్నా పోస్ట‌ర్‌ను అప్ప‌ల‌రాజు ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ‌జ‌న కార్య‌ద‌ర్శి త‌మ్మినేని చిరంజీవి నాగ్‌, పార్టీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

విప్పగుంట వ‌ద్ద ముగిసిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 92వ రోజు కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలోని విప్ప‌గుంట వ‌ద్ద ముగిసింది. ఉద‌యం కందుకూరు శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించి అక్క‌డి నుంచి వెంకటాద్రి పాలెం, అనంత సాగరం క్రాస్‌ రోడ్డు, యెద్లూరు పాడు , పెద్ద వెంకన్నపాలెం, విప్పగుంట వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. 92వ రోజు వైయ‌స్ జ‌గ‌న్ 14 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. 

5 February 2018

అమరజీవికి నిజ‌మైన నివాళి


– నవంబర్‌ 1నే ఆంధ్ర రాష్ట్ర అవతవరణ దినోత్సవం నిర్వహిస్తామని నెల్లూరు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
– మూడేళ్లలో అమరజీవి పేరెత్తని బాబు సర్కారు
– జగన్‌ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు


ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు దాటినా అశాస్త్రీయంగా విభజన జరిగిందని చెబుతూ కాలక్షేపం చేస్తుంటే.. జగన్‌ తనదైన శైలిలో ముందుకుసాగుతున్నారు. విభజన హామీలు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికి పోయి కేంద్రంతో మాట్లాడే సాహసం చేయలేకపోతున్న తరుణంలో.. వైయస్‌ జగన్‌ మాత్రం ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం, పోర్టుల నిర్మాణం, కేంద్రీ విద్యాసంస్థలు, కేంద్రీయ సంస్థల ఏర్పాటు వంటి ప్రధాన హామీలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. 

అస్తమానం చరిత్ర చరిత్ర అనే గగ్గోలు పెట్టే చంద్రబాబు.. అదే చరిత్రను గుంట తీసి మన్ను పోసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యాన్ని, పోరాడి సాధించుకున్న పరిస్థితులను భావితరాలకు కనిపించకుండా చేసిన కుట్రకు జగన్‌ చెక్‌ పెట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో సాధించిన ఆంధ్రప్రదేశ్‌ను.. విభజన నాటి నుంచి చరిత్ర పుస్తకాల్లో కనపడనీయకుండా.. ఆ మహనీయుడి పేరు వినపడనీయకుండా చేసిన.. ఆయన త్యాగాన్ని భావితరాలు స్మరించుకోనీయకుండా నాలుగేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ చరిత్రలో నవంబర్‌ 1 అనే ఒక ముఖ్యమైన తేదీ ప్రాముఖ్యతను క్యాలెండర్‌ నుంచి కనుమరుగు చేసే ప్రయత్నాలకు జగన్‌ గట్టిగా బదులిచ్చారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటన ఇప్పుడొక సంచలనమైంది. అధికారంలోకి వస్తే నవంబర్‌ 1ని గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని.. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకుందామని పిలుపునివ్వడం హర్షించదగ్గ పరిణామం. ఆంధ్రా విభజన జరిగినంత మాత్రాన ఏపీ అవతరణ దినోత్సవాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ గడిచిన మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ నవంబర్‌ 1 వ తేదీని పట్టించుకున్న పాపాన పోలేదు. జపాన్, సింగపూర్, మలేసియా, అమెరికా, ఆఖరికి శ్రీలంక, జింబాబ్వేల గురించి మాట్లాడిన చంద్రబాబు.., ఒక్క పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయలేదు సరికదా ఆయన ఫొటోలకు దండ కూడా వేయలేదు. పైగా ఆయన అమరత్వానికి కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలోనే జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రా, తెలంగాణతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. 

ప్రత్యేక హోదా భిక్ష కాదు..ఆంధ్రుల హక్కు

కృష్ణా జిల్లా : ప్రత్యేక హోదా భిక్ష కాదని, మన ఆంధ్రుల హక్కు అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్ పేర్కొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని విమర్శించారు. సోమ‌వారం ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ..అసమర్ధ ముఖ్యమంత్రి పాలన చేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా మీ మోసపూరీతి మాటలు వినీ వినీ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ నాటకాలు ఆడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులను ఉద్ధేశించి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం యువత, విద్యార్థులు గళమెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రతి కులానికి కార్పొరేషన్‌


–మహిళలకు, రైతన్నలకు వడ్డీ లేని రుణాలు
– నెలకు రూ. 2 వేల పింఛన్,  45 ఏళ్లకే పింఛన్లు 
– పిల్లలు పెద్ద చదువులు చదివితేనే తలరాతలు మారుతాయి
– ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది
– ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి
– ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
– కేంద్ర బడ్జెట్‌ కేబినెట్‌ ఆమోదం తరువాతే ప్రవేశపెడతారు
– కేబినెట్‌లో మీ ఎంపీలు ఎందుకు ఆమోదం తెలిపారు.
– బహిరంగ సభలో ఆకట్టుకున్న ముద్దాయి కథ

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేదరికానికి కులం, మతం అన్న తేడా ఉండదని, అన్ని కులాలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన తనకు మద్దతుగా నిలవాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఏం చేయబోతున్నామన్నది వివరించి చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ..


ఈ రోజు ఎండ కూడా కాస్తా తీక్షణంగానే ఉంది. అయినా కూడా వేలాది మంది నాతో అడుగులో అడుగు వేశారు. ఒకవైపు ఉన్న కష్టాలను చెబుతున్నారు. మరోవైపు అన్నా..మీ వెంటే మేమున్నామని చెబుతున్నారు. ఇక్కడ నడిరోడ్డుపై ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

బాబు ఎప్పుడు సీఎం అయినా..
ఈ రోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు రైతన్నలు నా వద్దకు వచ్చారు. ఆ రైతన్నలు నాతో చెప్పిన మాటెంటో తెలుసా? మా కొవూరు నియోజకవర్గంలోని కొవూరు చక్కెర ఫ్యాక్టరీ 1979వ సంవత్సరం నుంచి నడుస్తోందన్నా..1996లో చంద్రబాబు సీఎం అయ్యారు..ఆ తరువాత ఈ ఫ్యాక్టరీ మూతపడిందన్నా అని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పరిశ్రమ కనిపించినా కూడా చంద్రబాబు దగ్గరుండి వాటిని మూత వేయిస్తున్నారు. ఆ తరువాత పప్పులు, బెల్లానికి ఆ పరిశ్రమ పరికరాలు అమ్ముతున్నారని చెప్పారు. తన బినామీ సీఎం రమేష్‌కు చంద్రబాబు అప్పనంగా అమ్మేశారని ఇదే రైతులు చెప్పారు. కొవూరు చక్కెర ఫ్యాక్టరీని కూడా అమ్మేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారని, కోర్టుకు కూడా వెళ్లామన్నారు. ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించారని ఆ రైతన్నలు అంటుంటే చాలా ఆనందమనిపించింది. ఆ తరువాత నాన్నగారు చనిపోవడం, మన ఖర్మ కొద్ది చంద్రబాబు సీఎం అయ్యారు. కొవూరు మూతపడింది.  ప్రజలను ఏ స్థాయిలో మోసం చేస్తారని చెప్పడానికి సాక్షాత్తు కొవూరుకు వచ్చి ఆ చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాట ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా..ఇవాల్టికి కూడా చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఉంది. రైతులకు బకాయిలు చెల్లించలేదు. దాదాపు 14 మండలాల్లో దాదాపు 5 వేల మంది రైతులకు ఈ చెక్కర ఫ్యాక్టరీ తోడుగా ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రైతులంతా కూడా కన్నీరు పెడుతున్నామని వాపోతున్నారు. ఇదే కొవూరు నియోజకవర్గంలో ఎరువుల తయారీ కోసం ఇఫ్కో సంస్థతో ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీ పెట్టాలని కదలికలు జరిగాయి. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత నాలుగుఅడుగులు ముందుకు వేసింది. ఇఫ్కో సంస్థతో మాట్లాడి..కిసాన్‌ సెజ్‌ కింద తీసుకునేందుకు ప్రతిపాదనలు చేశారు. దురదృష్టవశాత్తు నాన్నగారు మనమధ్య నుంచి వెళ్లిపోయారు. ఇవాళ ఇక్కడ రబీలో పండే వరి పంట రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లానే టాప్‌. ఇలాంటి జిల్లాకు ఎరువుల పరిశ్రమ వస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు లంచాలు తీసుకొని కొక్కోకోలా ఫ్యాక్టరీకి భూములు ఇప్పిస్తారు. ఆ ఫ్యాక్టరీకి రైతుల నుంచి నీళ్లు దోచేసి ఇస్తున్నారు. లంచాలు కోసం కక్కుర్తి పడి ఒక ముఖ్యమంత్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని చెప్పడానికే ఇదే నిదర్శనం. ఇదే నియోజకవర్గంలోని సంగం భ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ కనిపిస్తున్నాయి. నాన్నగారి పాలనలో ఈ ప్రాజెక్టులకు దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఇవాళ మిగిలిపోయిన 20 శాతం పనులు ఎక్కడివిక్కడే ఉన్నాయి. నాన్నగారు బతికి ఉన్నప్పుడు సబ్‌మర్సిబుల్‌ పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. నాన్నగారు చనిపోయాక ఈ పనులు నిలిచిపోయాయి.

ఇంత దారుణమైన పాలన ఎక్కడా లేదు..
ఇక్కడికి వచ్చేసమయంలో ఆక్వా రైతులు నన్ను కలిశారు. కరెంటోళ్లు ఏసీడీ అని పెట్టారన్నా..మమ్మల్ని బాదుడే బాదుడు అని అక్వా రైతులు మొత్తుకుంటున్నారు. రైతులు వాడుకున్న దానికన్న ఎక్కువ వాడుకుంటే లక్షల్లో ఫెనాల్టీలు వసూలు చేస్తూ..డబ్బులు కట్టకపోతే లాక్కెతున్నారని చెబుతున్నారు. ఇంతదారుణంగా పాలన సాగుతోంది.

ఇది చంద్రబాబు పాలనా తీరు
రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న పరిపాలన తీరును  ఒక్కసారి చూడండి. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు పాలనను గమనించమని కోరుతున్నాను. ఇదే పెద్ద మనిషి ఎన్నికల సమయంలో అన్న మాటలు ఏంటీ? మాట మీద నిలబడ్డాడా? రేపు పొద్దున ఎన్నికలు జరిగితే అబద్ధాలు చెప్పేవాడు నాయకుడు కావాలా? అనిఅడుగుతున్నాను. మోసం చేసేవాడు మీకు నాయకుడు కావాలా? అని అడుగుతున్నాను. రెండు మూడు రోజులుగా టీవీలు చూసేవారికి చంద్రబాబు తీరుపై ఆశ్చర్యమనిపిస్తోంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూసిన చంద్రబాబు విలవిలలాడిపోయారట. నాలుగేళ్లుగా చంద్రబాబు ఎన్‌డీయేలో భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందుకు కేంద్ర క్యాబినెట్‌ అంతా కూర్చొని ఆమోదిస్తారు. ఆ తరువాత బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతారు. మొన్న నరేంద్రమోడీ బడ్జెట్‌ ప్రవేశపెడితే అన్యాయం జరిగిపోయిందని చంద్రబాబు గింజుకుంటున్నారు. కేంద్ర క్యాబినెట్లో మీ మంత్రులు ఉండి బడ్జెట్‌కు ఎందుకు ఆమోదం తెలిపారని ప్రశ్నిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాలుగేళ్లు నిరీక్షించామని, విసిగిపోయామని లీకులు ఇచ్చారు. నీ మంత్రులు ఆమోదం తెలిపిన తరువాతే కదా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు. ప్రజలకు తానే అన్యాయం చేశానని ఆయనకు గుర్తుకు వస్తుంది.

అన్నీ దొంగ ఏడుపులే..
‘అనగనగా ఒక ముద్దాయి.. ఆ ముద్దాయి కోర్టు బోనులో నిలబడ్డాడు. కాసేపటికి జడ్జ్‌ వచ్చాడు. జడ్జ్‌ రాగానే ముద్దాయి బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ‘తల్లిదండ్రీ లేనివాడిని.. నేను అనాథను.. నాకు దిక్కెవరు లేరు సార్‌’ అంటూ తనను విడ్చిపెట్టాలని జడ్జ్‌గారిని వేడుకున్నాడు. జడ్జ్‌గారు.. ఈ ముద్దాయి తల్లీదండ్రీ లేని అనాథ అంటున్నాడు. పోలీసులు ఎందుకు తీసుకొచ్చారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగారు. ఏమిటి ఇతడు చేసిన తప్పు అని ప్రశ్నించారు. దానికి.. ‘ఇతనివన్నీ దొంగ ఏడ్పులు. నమ్మకండి సార్‌. తల్లిదండ్రీని చంపి.. బోనులో నిలబడి.. ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడు’ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.. అచ్చం ఆ ముద్దాయి తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు ఉంది’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు. రాష్ట్రం విడిపోవడానికి, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని, దుగ్గరాజపట్నం పోర్టు  ఇవ్వకపోయినా పర్లేదని కేంద్రానికి చెప్పింది బాబేనని, పోలవరం ప్రాజెక్టు ఇంత అధ్వాన్నంగా అగోరించడానికి కారణం కూడా ఆయనేనని నిప్పులు చెరిగారు. ఇన్ని పాపలు, నేరాలు చేసిన బాబుకు, కోర్టులో ఏడ్చిన ఆ ముద్దాయికి ఏమైనా తేడా ఉందా? అని ప్రశ్నించారు. దారుణంగా అబద్ధాలు చెప్పి.. వాటిని నమ్మించే ప్రయత్నం చేయడం, తనకు అనుకూలంగా ఉన్న మీడియా వ్యవస్థను అందుకు వాడుకోవడం బాబు నైజమని మండిపడ్డారు.
ఓటుకు రూ. 3 వేలు ఇస్తారు..
ఇవాళ చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశారు. ఇటువంటి అన్యాయమైన, మోసం చేసే పాలనను క్షమిస్తే..రేపొద్దున ఇదే పెద్ద మనిషి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామంటే వారు నమ్మరని చంద్రబాబుకు తెలుసు. కాబట్టి చంద్రబాబు రేపొద్దున ఏం చెబుతారో తెలుసా? ఇంతకంటే పైస్థాయిలోకి వెళ్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు. మీరు నమ్ముతారా? నమ్మరు కాబట్టి కేజీ బంగారానికి బోనస్‌ అంటూ ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటాడు. నమ్ముతారా అని అడుగుతున్నాను. నమ్మరు అన్న సంగతి తెలిసి..ఓటుకు రూ.3 వేలు కూడా ఇస్తాడు. డబ్బు ఇస్తే వద్దు అని చెప్పవద్దు..కారణం ఏంటో తెలుసా..ఆ డబ్బు మనది..మనల్ని దోచేసి ఆయన సంపాదించారు. డబ్బు తీసుకొని ఈ మనిషికి బుద్ధి చెప్పండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. చెప్పిన మాట నెరవేర్చకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ వ్యవస్థలో నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల కాదు..మీ అందరి తోడు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థలో మార్పు తీసుకొని వస్తా.

సలహాలు ఇవ్వండి..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. అందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే నాకు సలహాలు, సూచనలు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ నవరత్నాల్లో నుంచి పేద వాడి కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.

ఒక్కసారి ఆలోచించండి..
మన పిల్లల చదువుల గురించి చెబుతున్నాను. ఒక్కసారి మీరు మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. మన పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించగలమా? ఫీజులు చూస్తే ఏడాదికి లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు అవుతున్నారు. నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను. నాన్నగారి పాలనలో పేదవారి పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా ఒక భరోసా ఉండేది. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తా అని వైయస్‌ఆర్‌ తోడుగా ఉండేవారు. ఇ దే చంద్రబాబుకు బీసీలపై ప్రేమ అంటే నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమే. నిజంగా పేదవారిపైన ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతున్నారు. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేశారు. వైయస్‌ జగన్‌ అదే పేదవారి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మన పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివేందుకు హాస్టల్‌లో ఉండి మెస్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రతి తల్లిదండ్రులకు చెబుతున్నాను. వారి హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. చదువుల విప్లవం తీసుకువచ్చేందుకు చిన్న పిల్లల పునాదులు వేసేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెడతాం. చిన్న పిల్లలను బడికి పంపించినందుకు తల్లి ఖాతాలో రూ.15 వేలు ఇస్తామని చెబుతున్నాను. 

అవ్వ, తాతల జీవితాల్లో వెలుగులు నింపుతా..
ధరలు ఇవాళ పెరుగుతున్నా చంద్రబాబుకు పింఛన్లు పెంచడానికి మనసు రాదు. కాంట్రాక్టర్లకు మాత్రం పెంచుతారు. అదే అవ్వతాతలకు ఇచ్చే పింఛన్లు మాత్రం పెంచడం లేదు. దీనికి కారణంగా కాంట్రాక్టర్లు లంచాలు ఇస్తారు కాబట్టి వారికి పెంచుతారు. పింఛన్లు పెంచితే జన్మభూమి కమిటీల వద్దే నిలిచిపోతాయని, తనకు లంచాలు రావని పెంచడం లేదు. అదే మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.2 వేలు పెంచుతాం. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పనులకు వెళ్తే కానీ కడుపు నిండని పరిస్థితి ఉంది. వారం రోజులు పనులకు వెళ్తకపోతే పస్తు ఉంటున్నారు. వారందరికీ చెబుతున్నాను. . పింఛన్‌ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తున్నానని చెబుతున్నాను. ఇవాళ చంద్రబాబు పాలనలో పింఛన్‌ వయసు 65 ఏళ్లు ఉంది. మనం అధికారంలోకి వచ్చాక పింఛన్‌ వయసు 60 ఏళ్లకే తగ్గిస్తాం.

అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉంటా
చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తామని ,రుణాలు కట్టొద్దని చెప్పడంతో అక్కా చెల్లెమ్మలు అస్తవ్యస్తంగా ఉన్నారు. చంద్రబాబు రాకముందుకు పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందేవి. ప్రభుత్వాలు బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టేవి. చంద్రబాబు వచ్చాక ప్రభుత్వం తరఫున వడ్డీ డబ్బులు కట్టకుండా ఎగురగొట్టారు. ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెబుతున్నాను. ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ డబ్బంతా మీకే నేరుగా ఇ స్తానని మాట ఇస్తున్నాను. మరో వైపు మీ వడ్డీ డబ్బులు ప్రభుత్వమే కడుతుంది. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకుంటాను.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు. నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. దేశంతో పోటి పడి మన రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌ది. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిచ్చి ఇస్తాను. అంతమాత్రమే కాదు ఆ ఇంటిని అక్కా చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. అది వారికి ఆస్తిగా ఉండబోతుంది. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఆ ఇంటికి తాకట్టుపెట్టి పావలా వడ్డీకే రుణాలు పొందే వీలు కల్పిస్తాను.

ఆ చిట్టి తల్లి మాటలు కదిలించి వేశాయి..
నిన్న ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేలనం జరిగింది. సభ అయిపోయిన తరువాత ఒక చిన్నపాప నావద్దకు వచ్చి..అన్నా..మేం ఓసీలం అన్నా..మాకు కూడా కార్పోరేషన్‌ఇస్తే మాకు కూడా లోన్లు ఇస్తారు కదన్నా అని ఆ చిన్న చిట్టి తల్లి అనింది. ఆమె అన్న మాటలు నన్ను కదిలించి వేసింది. కార్పొరేషన్‌ అన్నది ఏ కులానికైనా ఆ కులానికి అప్పులు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బులతో కాస్తోకూస్తో అవసరాలు తీరుతాయి. పేదరికానికి కులం లేదు..మతం లేదు. ఆ కులాలన్నింటికి కూడా మేలు జరిగేందుకు కమ్మ, రెడ్డిలు, రాజులకు కూడా కార్పొరేషన్‌ఏర్పాటు చేస్తాం. అందరికి రుణాలు ఇస్తేనే పరిస్థితులు మారుతాయి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకు ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. మాట్లాడిన ప్రతి మాటకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నావద్దకు రావచ్చు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అందరికి తెలుసు. బయలుదేరిన మీ బిడ్డకుతోడుగా ఉండమని పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

8న ఏపీ బంద్‌కు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

అమరావతి: ఈ నెల 8న వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, దుగ్గిరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ ప్యాక్టరీ సహా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాల మీద వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ గడిచిన నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అందులో భాగంగా ఈ అంశాలపై ఏ పార్టీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఇస్తోంది. 
 

వైయస్‌ జగన్‌ హామీలకు విశేష స్పందన

కోవూరు: వ్యవసాయ రంగానికి ప్రతిపక్షనే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలకు రైతుల నుంచి విశేష స్పందన వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. కోవూరులో కొనసాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి కావాల్సింది సాగునీరు, రైతుకు కావాల్సింది ఆదాయమని, ఈ రెండిటి ఎజెండాతో వైయస్‌ఆర్‌ పనిచేశారన్నారు. అదే ఎజెండాతో వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. రైతుకు పెట్టబడికి రూ. 12,500, ఉచితంగా బోర్లు వేయిస్తానని, ఉచితంగా తొమ్మిది గంటల కరెంటు, సున్నా వడ్డీలు, రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి హామీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ హామీలపై విశ్వాసంతో ఉన్న ప్రజలు ఆయన్ను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారన్నారు. 

సరైన జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నాం

కొవూరు: సరైన జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మెరిట్‌ ప్రకారం మమ్మల్ని నర్సులుగా తీసుకున్నారని, ఇప్పటి వరకు రెగ్యులరైజ్‌ చేయలేదని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కొవూరులో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న నర్సులు వారి సమస్యను చెప్పుకున్నారు. రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. సమాన పనికి.. సమాన జీతం ఇవ్వడం లేదన్నారు. మా పిల్లల చదువుల కోసం మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

వైయస్‌ జగన్ ఉడెన్ బైక్ బహూకరణ

నెల్లూరు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు పార్టీ నాయకులు, అభిమానులు చిరు కానుకలు అందజేస్తున్నారు. నెల్లూరు జిల్లా దేవురపాలెంకు చెందిన కార్పొరేటర్‌ శివ వైయస్‌ జగన్‌కు ఉడ్‌ ఫ్రేమ్‌తో తయారు చేసిన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. అభిమాని కానుకను స్వీకరించిన వైయస్‌ జగన్‌ బైక్‌పై ఎక్కారు.  

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షం

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నెల్లూరు రైతులు పేర్కొన్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర కొవ్వూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రైతులతో వైయస్‌ జగన్‌ మమేకం అయ్యారు. నవరత్నాలతో జీవితాలకు ఓ భరోసా వచ్చిందని రైతులు, మహిళలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులంతా సస్యశ్యామలంగా ఉండేవారని, ఆయన మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా రైతులకు మేలు చేస్తారని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కాలేదన్నారు. అందుకే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని అందరం కోరకుంటున్నామని రైతులు, మహిళలు తెలిపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో నెలకు రూ.20 కరెంటు బిల్లు కట్టేవార మని, ఇవాళ నెలకు రూ.300 బిల్లు కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రతి విత్తనంలో, మందులో కల్తీ చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ రావాలని మహిళలు నినదించారు.

1 February 2018

జనంతో కలిసిపోతున్న జగన్

వాస్తవానికి జగన్ పాదయాత్ర మీద ప్రతి పదిహేను రోజులకు ఒక వ్యాసాన్ని పోస్ట్ చెయ్యాలని అనుకున్నాను.  అందుకు అనుగుణంగా ఇప్పటికి అయిదు వ్యాసాలు పోస్ట్ చేసాను.  తాజాగా నిన్ననే అనుకుంటాను... ఒక వ్యాసంలో పాదయాత్రను సమీక్షించాను.  

మరి ఇవాళ మరొకటి రాయడానికి కారణం ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు.  ఇప్పుడే ntv  వారు ప్రసారం చేసిన జగన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ చూసాక ఈ వ్యాసాన్ని రాయాలనిపించింది.  ఇదే ఇంటర్వ్యూ ను సాక్షి వారు చేస్తే రాసేవాడిని కాను.  

కారణం మీకు తెలుసు.  NTV  అంటే ఎల్లో మీడియాలో ప్రధానభాగం.  వారు ఇప్పటివరకూ జగన్ పాదయాత్ర గూర్చి పెద్దగా ప్రసారం చేసింది లేదు.  మరి ఈరోజు చెయ్యడానికి కారణం ఏమిటి?  

జగన్ చేస్తున్న పాదయాత్ర గూర్చి పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తుండటం, 

చంద్రబాబు-మోడీ మధ్యన సంబంధాలు తెగుతున్న సూచన కనిపించడం, 

గత మూడున్నర ఏళ్లలో ప్రతిరంగంలోనూ చంద్రబాబు మూటకట్టుకున్న వైఫల్యాలు
,  
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుంది అన్న ఆశలు సన్నగిల్లడం,
 
జాతీయపత్రికలు సైతం జగన్ యాత్ర గూర్చి రాస్తుండటం

వైసిపి అసెంబ్లీని బహిష్కరిస్తే జగన్ తీవ్ర విమర్శలపాలు అవుతాడు అనే అభిప్రాయాలు చెదిరిపోవడం

రోజు రోజుకు జగన్ కు ప్రజాదరణ పెరుగుతున్నదనే స్పృహ పొటమరించడం

తెలుగుదేశం కు ఇంకా  వంత పాడితే వీక్షకులలో చులకన అవుతామన్న భయం 

జనసేనాని ప్రభావం శూన్యం అనే వాస్తవం కళ్ళకు కట్టినట్లు బోధపడటం

కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకపోవడం 

వివిధ ఏజెన్సీలు చేస్తున్న సర్వేల్లో వైసిపి విజయం సాధిస్తుంది అనే ఫలితాలు వస్తుండటం 

ఇంకా జగన్ ను నిర్లక్ష్యం చేస్తే అతని ఆగ్రహానికి గురికాక తప్పదని భావించడం.  

ఇక ఈ ఇంటర్వ్యూ లో జగన్ సంధించిన విమర్శలు, గణాంకాలు, మేధోబద్ధ అంశాలపై జగన్ కు ఉన్న పట్టు ఏమిటో అందరికి అర్ధం అయింది.  ఎదో మసిపూసి మారేడుకాయ చేసినట్లు కాక లెక్కలతో సహా జగన్ వేసిన ప్రశ్నలు తెలుగుదేశం నాయకుల గుండెల్లో డైనమైట్లు పేల్చేట్లు ఉన్నాయి.  ఊరికే "జగన్ లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేదు" లాంటి చచ్చు విమర్శలు కాక... ఇక జగన్ సంధించిన ప్రశ్నలకు అధికారపార్టీ గణాంకాలతో వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఆవరించింది.  

అయితే చంద్రబాబు కేబినెట్లో ఒక్కరికి కూడా డొక్కశుద్ధి లేదు అని నా బలమైన నమ్మకం.  జగన్ విమర్శలకు దీటైన జవాబిచ్చే ప్రజ్ఞావంతులు కన్నుపొడుచుకున్నా ఒక్కరు కూడా చంద్రబాబు గారి మంత్రివర్గం లో లేరు.  చదువుకున్న వాడికి చదువు"కొన్న" వాడికి ఈరోజు జగన్ ఇంటర్వ్యూలో తేడా స్పష్టంగా తెలిసింది...తెలుసుకునే జ్ఞానం ఉన్నవారికి..

వందమంది మూర్ఖులకంటే గుణవంతుడైన పుత్రుడు ఒకడు చాలు.  వేలకొలది నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని నెలరాజు ఒక్కడు తరిమేయగలడు....అంటారు ఆచార్య చాణక్యుడు.
Written by Ilapavuluri