27 February 2018

ఏడాదికే వెలుగొండ పూర్తి చేస్తాం

ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏడాదికే వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కాపురం, కొండేపి నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు  ఇస్తామన్నారు. పొదిలి పట్టణంలో సమ్మర్‌ స్టోరేజీ ఏర్పాటు చేసి 49 గ్రామాలకు నీరిస్తామన్నారు. పొదిలి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లడారు.  నవరత్నాలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో లంచగొండి పాలన సాగుతుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మన వద్దకు వచ్చారని చెప్పారు. నవరత్నాలతో అందరికి మేలు జరుగుతుందని హమీ ఇచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని వైయస్‌ జగన్‌ తెస్తారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఆయన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఊపిరి ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు. కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్‌ లోపల, బయట రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని, అప్పటికి దిగిరాకపోతే పార్లమెంట్‌ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకాశం జిల్లాను విస్మరించారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మించకుండా తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. నాలుగేళ్లు అయినా కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో 12 కిలోమీటర్లు నిర్మిస్తే..చంద్రబాబు నాలుగేళ్లలో నాలుగు కిలోమీటర్లు కూడా నిర్మించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అన్నారు. ఫ్లోరైడ్‌ కారణంగా 480 మంది అకాల మరణాలు పొందారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, ఏడాదికే వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తారని తెలిపారు.

No comments:

Post a Comment