31 October 2017

సమాధానం చెప్పలేక పారిపోయిన మంత్రులు

వైయస్ఆర్ జిల్లాః జిల్లా జడ్పీ మీటింగ్ వాడివేడిగా సాగింది.  పేదల సమస్యలపై చర్చను డైవర్ట్ చేసి మంత్రులు వైయస్ఆర్, వైయస్ జగన్ లపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో వైయస్సార్సీపీ, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు ఎదురైంది.  వైయస్సార్సీపీ గురించి మాట్లాడే ముందు పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఆదినారాయణరెడ్డి  బిత్తరపోయారు.

పేదలకు సంబంధించిన అర్థవంతమైన సమస్యను జడ్పీ మీటింగ్ లో లేవనెత్తితే సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయారని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారాన్ని చూసుకొని మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారన్నారు. ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. పేదలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం మోసం చేస్తే దాన్ని ప్రస్తావించకూడదని పార్టీ ఫిరాయించిన మంత్రి ఆదినారాయణరెడ్డి, దొడ్డిదారిన మంత్రి అయిన సొమిరెడ్డి చెప్పడం హాస్యాస్పదమని రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫైర్ అయ్యారు. 

గృహనిర్మాణాలపై  వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు  మంత్రులను ప్రశ్నించగా నీళ్లు నమిలారు.  పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని ఎమ్మెల్యే రాచమల్లు కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సోమిరెడ్డి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా  కింద కూర్చొని నిరసన తెలిపారు. 

సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి

లక్కిరెడ్డిపల్లె: ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలోని ఆయా శాఖల అధికారులతో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాల్లో రైతులకు సంబంధించిన భూములు ఇప్పటి వరకు కూడా ఆన్‌లైన్‌లో నమోదు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీఆర్‌ఓల ద్వారా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ వెంకటరమణకు సూచించారు. రేషన్‌ కార్డులకు అనేక పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదన్నారు. అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా పేదలకు డీ ఫారాలు అందజేసేలా చూడాలన్నారు. నాలుగు నెలలుగా ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు బిల్లులు రాని విషయాన్ని ఎంపీడీఓ రవికుమార్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్‌లు అందేలా చూడాలని ఆయన కోరారు. బీసీ కార్పొరేషన్‌ రుణాలకు కూడా జన్మభూమి కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలా..? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్‌ రెడ్డి, ఎంపీపీ రెడ్డెయ్య, ఎంపీపీ రెడ్డెయ్య, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ వెంకటనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సయ్యద్‌ అమీర్, సర్పంచ్‌ దిన్నెపాడు రవిరాజు, నాయకులు సుబ్బరాజు, వెంకటేష్, జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబూ.. ముడుపుల వ్యవహారం ఇక ఆపు


  • పోలవరం పేరుతో బాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు
  • కమీషన్ల  కోసమే పోలవరం జాప్యం
  • 16వేల కోట్ల నుంచి 50వేల కోట్లకు అంచనాలు పెంచారు
  • మళ్లీ ఇప్పుడు 2,3వేల కోట్లు పెరుగుతుందని లీకులిస్తున్నారు
  •  ప్రభుత్వ అవినీతిపై కేంద్రం విచారణ జరిపించాలి 
  • పోలవరం నిర్మాణవ్యయం ఎంత, ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలి
  • బాబు ముడుపుల వ్యవహారం మానేయాలి
  • పోలవరం ప్రజలకు అందుబాటులోకి రావడమే వైయస్సార్సీపీ ధ్యేయం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
హైదరాబాద్ః పోలవరం పేరుతో ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటే....ఏమి ఆశించి మేమే చేస్తామని బాబు లాక్కున్నారో స్పష్టం చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. పోలవరాన్ని ఎవరు పూర్తి చేసినా తమకు అభ్యంతరం లేదని,   రాష్ట్రానికి ప్రాణవాయివులాంటి పోలవరం ప్రజలకు అందుబాటులోకి రావడమే వైయస్సార్సీపీ ధ్యేయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడకుండా కేంద్రమే ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి ఉంటే....చంద్రబాబు  కమీషన్ల కోసం, పోలవరాన్ని ఆదాయానికి మార్గంగా ఎంచుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వేల కోట్ల ప్రాజెక్ట్ ను 50వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు మరో 2, 3వేల కోట్లు పెరుగుతుందని లీకులిస్తున్నారని ధ్వజమెత్తారు. 
చంద్రబాబు తన మాయలతో  ప్రజలపై ఆర్థికభారం మోపుతున్నారని పార్థసారధి ఫైర్ అయ్యారు.  ప్రాజెక్ట్ ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, నిర్మాణ వ్యయం ఎంత నిర్ణయించారో స్పష్టం చేయాలన్నారు.  ముడుపులు దండుకొని  ప్రాజెక్ట్ ను వదిలేయడానికి కూడ టీడీపీ వెనుకాడదని అనుమానం వ్యక్తం చేశారు. 

పోలవరాన్ని 2017, 18, 19లోగా పూర్తి చేస్తామంటూ బాబు రకరకాలుగా చెబుతున్నారే తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు. 2017లోనే పోలవరం  పూర్తి చేయాలనుకుంటే ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాబు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేవారని, కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదని పార్థసారధి  విమర్శించారు. ముడుపుల కోసం కావాలనే బాబు పోలవరాన్ని డిలే చేస్తున్నారని పార్థసారధి ఆగ్రహించారు. అందుకే పట్టిసీమ, పురుషోత్తంపట్నంలు తెచ్చి దాంట్లో పిండుకున్నాక 2019కి పోలవరం మీద దృష్టిపెట్టినట్టుగా నటిస్తున్నారన్నారు. వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని నడపడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు.  కేంద్రానికి చెందిన నాలుగు శాఖల్ని మేనేజ్ చేసి మరీ బాబు పోలవరం నిర్మాణం చేస్తున్నారని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్పష్టంగా చెప్పిన విషయాన్ని పార్థసారధి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఎన్నిపార్టీలు అభియోగాలు చేసినా బాబు దున్నపోతు మీద వానపడిన చందాన వ్యవహరిస్తున్నారన్నారు. బాధ్యత గల అధికారి స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు సమాధానం చెప్పడం లేదని చంద్రబాబును నిలదీశారు.

టీడీపీ తంతంగమంతా కేంద్రానికి అర్థమైపోయిందని పార్థసారధి అన్నారు. పోలవరం నిర్మాణవ్యయం పెరిగితే జాతికే నష్టమని, పారదర్శకంగా కరప్షన్ లేకుండా నిర్మాణం చేయాలని కేంద్రమంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారంటేనే బాబు పట్ల వారి అభిప్రాయం ఏంటో తెలుస్తోందన్నారు. కాంట్రాక్టర్ ను మార్చడానికి ముఖ్యమంత్రి స్పైషల్ ఫ్టైట్ లో వెళ్లి మంత్రితో మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని శాఖల అధికారులను పిలుపించుకొని 2, 3వేల కోట్ల భారం ప్రజలపై మోపేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. సబ్ కాంట్రాక్టర్ లకు కూడ అడ్వాన్స్ లు చెల్లించడం దారుణమన్నారు. పోలవరంలో బాబు చేస్తున్న అక్రమాలపై కేంద్రం విచారణ జరిపించి, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్ ను తీసుకురావడం కోసం బాబు ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు, వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ముడుపుల వ్యవహారం ఆపేయాలని హెచ్చరించారు. 

చేనేత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

అనంతపురంః చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేతన్నల రుణాలు మాఫీ చేయలేదని, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. పట్టు రాయితీ బకాయిలు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చింతమనేని దాదాగిరి.. వైయస్సార్సీపీ నేతల ఆగ్రహం

ఏలూరుః దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి  తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడి ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను ఆయన అనుచరులు నోటికొచ్చినట్టు దూషించారు. ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురంలో  తన అనుచరులతో తిరుగుతూ...  వైయస్సార్సీపీ నేత తూతా నిరంజన్‌ ఇంటికి చేరుకున్నారు. నిరంజన్‌ ఇంటి వెనుక భాగంలో ప్రహరీగోడకు పశువులను కట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప కొంకాలను పీకించారు. ప్రభాకర్‌ వెనక భాగం నుంచి ఇంట్లోకి ప్రవేశించి మహిళలను తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.  

కుళాయికి ఏర్పాటు చేసిన మోటార్‌ విద్యుత్‌ వైర్లను కట్‌ చేయించారు. అధికార బలంతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గం కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు చింతమనేని ప్రభాకర్‌ను హెచ్చరించారు. సోమవారం మల్కాపురంలో నిరంజన్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

రాజధాని ఆశలు ఆవిరి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. అసలు రాజధాని నగరాన్ని ఎంపిక చేయడమే ఓ రహస్య పథకంలా చేసిన చంద్రబాబు నేటికీ వాటిని బయటపెట్టడం లేదు. ప్రపంచ రాజధానులను తలదన్నేలా అమరావతి నిర్మాణం అని మూడున్నరేళ్లుగా వింటున్న కాకమ్మ కథల్లో నిజం నేతిబీరలో నెయ్యిలాంటిది. 

అసలు రాజధాని నిర్మాణం జరగాలంటే భూసేకరణ, అంచెలంచల అభివృద్ధి ప్రధానంగా ఉంటాయి. కాని చంద్రబాబుది అడ్డోగోలు వ్యవహారం. దేశదేశాలు తిరగడం, ఎక్కడ ఏది చూస్తే అది అమరావతిలో ఉండాలని అధికారులను ఆదేశించడం. ఆచరణలో మాత్రం ఆవగింజంతైనా ముందుకు సాగకపోవడం ఇలా సాగుతున్నాయి అమరావతి కథలు. 

ఇటీవల భారత దేశంలో ఏర్పాటైన కొన్ని కొత్త నాగరాలను పరిశీలిస్తే రాజధాని అభివృద్ధి అంత సులువు కాదని అర్థం అవుతుంది. డెహ్రాడూన్, రాంచీ, నయారాయపూర్, చంఢీఘడ్ రాజధానులుగా ఏ మాత్రం అభివృద్ధి చెందలేకపోయాయి. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత తనదే అని బాబు చెప్పుకునేది కొత్త రాజధాని గురించి కాదని గుర్తించాలి. ఎన్నో ఏళ్లుగా ఈ పురాతన నగరం, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. దేశం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, శ్రామికులు, ఉద్యోగులు తమ ఆశలు మోసుకుంటూ వచ్చి రాజధాని నిర్మాణానికి తమ శ్రమను, డబ్బును, కాలాన్నీ ధారబోసారు. కాని కొత్త రాజధాని విషయం అలా కాదు. మౌలిక వసతుల దగ్గరనుంచి, పరిపాలన, వాణిజ్యం, నివాసం, రహదారులు, ప్రత్యేకతలు ఇలా అన్నిటినీ మొదటినుంచీ ఎంచుకోవాల్సిందే. 

కాని చంద్రబాబు ఈ విషయంలో దృష్టిపెట్టిందే లేదు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా పెట్టుబడులు కోరుతున్నాం అవిగో కోట్లు ఎగిరొస్తున్నాయిని చెప్పటమే తప్ప ఒక కోటి కూడా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కి ఇంత వరకూ వచ్చిందే లేదు. అప్పనంగా భూములు కట్టబెట్టేయడానికి వేల ఎకరాలైతే సేకరించి పెట్టారు కాని, మౌలిక వసతులు లేకుండా ఏ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావు. దానికి తోడు ఎలాంటి ప్రభుత్వం ఉందో కూడా పెట్టుబడిదారులు అంచనా వేసుకుంటారు. నిరంతరం అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచే ప్రభుత్వాలతో కలిసి పని చేయడానికి కార్పొరేట్లు సిద్ధంగా ఉండవు. వారి పెట్టుబడులకు, షేర్లకు రక్షణ ఉంటుందని భావించిన చోటే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కనీస సౌకర్యాల కల్పన లేకుండా, భూసేకరణలపై వివాదాలతో ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ అనుకుంటారు. నగరీకరణ విషయాల్లో ప్రేరణ కోసం ఇతర రాజధానులను పరిశీలించడం తప్పుకాదు…కానీ పరిశీలలోనే ఏళ్లు గడిచిపోతుంటే కనీస పనులు ఎప్పుడు జరగాలి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఇంకా ఎన్నేళ్లు కలలు కంటూ ఉండాలో అని ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారు.  

నక్కజిత్తుల నిఘా

చంద్రబాబును భయం ఇంకా వీడలేదు. కొన్ని నీడలు వెంట తరుముతుంటే భయం ఎలా వీడుతుంది. తెలంగాణాలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, ఆడియో టేప్ లలో బ్రీఫ్డ్ మీ అంటూ బుక్కైపోయిన తర్వాత తనకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరుగుతుందో అని జడిసిపోతున్నాడు. సచివాలయంలో అడుగుకో కెమెరా, అంగుళానికో నిఘా ఏర్పాటు చేసాడు. సాధారణంగా ప్రభుత్వ  కార్యాలయాల్లో ఎంట్రన్స్ లోనూ, గదుల్లోనూ సిసి కెమెరాలుండటం సాధారణమే. కాని కారిడార్ నుంచి లాబీ దాకా, కార్యలయ కాబిన్ నుంచి క్యాంటీన్ దాకా ఎటు తిరిగినా కెమెరాలే. చివరికి ఉద్యోగులు పని చేసే కంప్యూటర్ లపై కూడా మైక్రో కెమెరాలు పెట్టించారట బాబుగారు. ఉద్యోగుల పనితీరు గమనించడానికి అని అనుకుంటే పొరపాటే. వారి దగ్గరికి ఎవరొస్తున్నారు…ఎవరెవరితో ఉద్యోగులు మాట్లాడుతున్నారు…ఇలాంటివన్నీ తెలుసుకునేందుకే ఈ ఏర్పాటు. అసలు ప్రభుత్వోద్యోగులను ఎప్పుడూ హింసించడం చంద్రబాబుకు అలవాటే అని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. బాత్రూంలో తప్ప అన్ని చోట్లా కెమెరాలు బిగించేయడం దేనికి సంకేతం అంటూ మండిపోతున్నారు. ఈ- ఆఫీస్ విధానంలో టైమ్ లిమిట్ లేకుండా పని చేస్తున్న ఉద్యోగులను ఇలా అవమానించడం, అనుమానించడం దారుణం అని అంటున్నారు. ఇంతకు ముందు డి ఎ ఇవ్వకుండా, ఇప్పుడేమో డిఎ ఇచ్చానని చెప్పి పెండింగ్ లో పెట్టి ఏడిపిస్తున్నాడని వాపోతున్నారు. మారానని బాబు చెబితే మోసపోయామని, ఉద్యోగుల పట్ల బాబు వైఖరి మారలేదని ఆవేదన చెందుతున్నారు. 

అసలు బాబుకింత భయం ఎందుకు పెరిగింది. సొంత ఆఫీసు ఉద్యోగులనే అంతలా నమ్మకపోవడానికి కారణం ఏమిటి అంటే ఓటుకు నోటు ఇష్యూనే అంటున్నారు కొందరు నేతలు. ఆ కేసులో అడ్డంగా దొరికిపోయినప్పటి నుంచి ఎవరెక్కడ తన బండారం బైట పెడతారో అని, అవినీతి పట్టించేస్తారో అని ముందు జాగ్రత్తగా అందరిమీదా నిఘా పెడుతున్నారని అంటున్నారా నేతలు. ఓటుకు నోటు కేసులో కిందా మీదా పడి స్టే అయితే తెచ్చుకున్నాడు కాని, తెలంగాణాలో టిడిపి కాస్తా భూస్థాపితం అయిపోయింది. అక్కడున్న ఏకైక నేత రేవంత్ రెడ్డి కాస్తా ఎదురు తిరిగాడు. చంద్రబాబు వల్ల తన పొలిటకల్ కెరీర్ గంగపాలైందని చివరి మాట అనడమొక్కటే తక్కువ. పార్టీనీ, నేతలను నోటికొచ్చినట్టు తిట్టి చక్కాపోయాడు రేవంత్ రెడ్డి. క్రమశిక్షణకి కేరాఫ్ అడ్రస్ నేను అని చెప్పుకునే బాబు, రేవంత్ ని ఒక్కమాట కూడా అనలేకపోయాడు. ఓటు కు నోటు విషయంలో రేవంత్ నోరు మెదిపితే ఏమౌతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డిని బుజ్జగించుకుంటూ సాగనంపారు. ఈ భయంతో కెమెరాలు ఇంకెక్కడెక్కడ పెట్టారో అని బాత్రూంకి వెళడానికి కూడా భయపడుతున్నారట సెక్రెటేరియట్ ఉద్యోగులు. 

వైయస్సార్సీపీలో చేరిన 500మంది విద్యార్థులు

వైయస్ఆర్ జిల్లాః రాజంపేటలో వైయస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి.  500మంది విద్యార్థులు వైయస్సార్సీపీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసులు రెడ్డి, స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రెహ్మతుల్లా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గృహనిర్మాణాలపై సమాధానం దాటవేసిన మంత్రి..రాచమల్లు నిరసన

వైయస్ఆర్ జిల్లాః జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.   రాచమల్లు మంత్రిని గృహనిర్మాణాలపై నిలదీయగా నీళ్లు నమిలారు.  పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా రాచమల్లు కింద కూర్చొని నిరసన తెలిపారు.

చేనేత రంగానికి చేయూత

ఉరవకొండ: చేనేత కార్మికులకు భరోసా కల్పించడానికి సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి చేయూత ఇవ్వడానికి ప్రతి పక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రగా వస్తున్నాడని పార్టీ చేనేత విభాగం జిల్లా కమీటి సభ్యులు గట్టుర్రిస్వామి, రామదొడ్డిగోపాల్‌లు తెలిపారు. స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో చేనేతల సంక్షేమం కోసం అన్నవస్తున్నాడు అన్న నినాదంతో తయారు అయిన కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈసందర్భంగా చేనేత విభాగం నాయకులు మాట్లాడుతూ.... జవసత్వాలు కోల్పోతున్న చేనేతకు జీవం పోయడానికి అధినేత జగన్‌ ఎంతో పోరాడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 45 యేళ్లకే రూ2వేల ఫింఛన్, రూ1.50 లక్షతో చేనేతలకు ఇళ్లు, మగ్గం నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చారు. దీంతో పాటు శిల్క్‌ కోనగోలు పై రూ2వేల రాయితీ, ప్రతి కార్మికుడికి రూలక్ష వరుకు వడ్డీలేని రుణం లాంటివి ఎన్నో వున్నాయన్నారు. ఈహమీల పై ప్రతి ఇంటికి కరపత్రాలు ఇచ్చి విస్త్రుతంగా ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, చేనేత మండల నాయకులు నిమ్మల వెంకటరమణ, గన్నెమల్లేసి, కాసుల ఆంజినేయప్రసాద్, జడ్‌పీటీసీ తిప్పయ్య, వార్డు సభ్యులు ఈడిగప్రసాద్, లత్తవరం గోవిందు, సులోచన, రామకృష్ణ, మూలగిరిపల్లి ఓబన్న,రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

30 October 2017

రాజోలి రిజర్వాయర్‌ లేకనే కేసీ రైతాంగానికి దుస్థితి


– ఫిబ్రవరి నెలాఖరు వరకూ సాగునీరు ఇవ్వాలి
– నష్టపోయే రైతాంగానికి ఆదుకునేలా నివేదికలు పంపండీ
– పేరుకు స్వచ్ఛాంద్ర ఎక్కడ చూసినా రోగ పీడితులే
– చాపాడు ఎస్‌ఐ శివశంకర్‌పై చర్యలు తీసుకోవాలని మండల తీర్మానం
– మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

చాపాడు: రాజోలి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టకపోవటంతో జిల్లాలోని కేసీ రైతాంగానికి సాగునీటి దుస్థితి ఏర్పడుతోందని మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యలయ సభాభవనంలో సోమవారం మండల అధ్యక్షురాలు టి. వెంకటలక్షుమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ...  కేసీ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదనే నిర్ణయంతో 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 2.9 టీఎంసీ కేపాసిటితో రాజోలి రిజర్వాయర్‌ నిర్మించేందుకు శంఖు స్థాపన చేశారన్నారు. ఆయన మరణాంతరం ఏర్పడిన ప్రభుత్వాలు దీని నిర్మాణం చేపట్టకపోవటంతో కేసీ రైతాంగానికి ఏటా సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా వర్షాలు వచ్చినా సాగునీటి విడుదలపై ప్రభుత్వం, అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన అదును దాటి తర్వాత వరి సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరు వరకూ సాగునీరు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ సాగునీటిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆలస్యంగా వరి సాగు చేసుకునే రైతులు తెగుళ్ల కారణంగా పంటలు దెబ్బతింటే ఈ నివేదికలు ప్రభుత్వానికి పంపాలని, ప్రస్తుత సీజన్‌లో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం 6 వేల మంది రైతుల దరఖాస్తులు అలాగే ఉండిపోయాయని, రైతుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదన్నారు. ప్రభుత్వం పేరుకే స్వచ్ఛాంద్ర అంటూ గొప్పు చెప్పుకుంటోందని, ప్రతి గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పల్లెల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు రోగాల పట్ల అవగాహన కల్పిస్తుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, తహాసీల్దారు పుల్లారెడ్డి, ఎంపీడీఓ రామదాసు తదితరులు పాల్గొన్నారు.

చాపాడు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని మండల తీర్మాణం:
చాపాడు మండల ఎస్‌ఐ శివశంకర్‌ విధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తీర్మాణం చేశారు. మండల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు కేసులను నమోదు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ఇదే క్రమంలో ఏకపక్షంగా వ్యహరిస్తూ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాడనని, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చియ్యపాడు ఎంపీటీసీ మహేష్‌యాదవ్‌ సభలో ప్రతిపాదించగా, మండల అధ్యక్షురాలు బలపరుస్తూ తీర్మాణం చేశారు.

రాజాపై ఎస్సై దౌర్జన్యం..వైయస్సార్సీపీ ఆందోళన

రాజమండ్రి: వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రాపురం ఎస్సై నాగరాజు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రోడ్డుపక్కన కారును ఆపారని, దానిని వెంటనే తీసేయాలంటూ వచ్చిన  ఎస్సై నాగరాజు దారుణంగా, దురుసుగా వ్యవహరిస్తూ  పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో నెలల పసికందు ఉన్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుడా  తమదైన పోలీసు మార్కు జులుంను ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, వైయస్ఆర్ సీపీ నాయకులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు తదితరులు రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. జక్కంపూడి రాజాను కొట్టిన ఎస్సైను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రామచంద్రాపురంలో వైయస్సార్సీపీ బంద్ చేపట్టింది. రాజాపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై నాగరాజును  సస్పెండ్ చేయాలని పార్జీ జిల్లా అధ్యక్షులు కె.కన్నబాబు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

కుట్రపూరితంగానే రాజాపై దాడి


  • కావాలనే వైయస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు
  • నాయకులు, కార్యకర్తలను హింసిస్తున్నారు
  • ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నాడనే రాజాపై దౌర్జన్యం
  • టీడీపీ నేతలు అధికారులను కొట్టినా నో కేసు
  • టీడీపీ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి..తీరు మార్చుకోవాలి
  • జక్కంపూడి రాజాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
  • కుట్ర వెనుక కోణాన్ని చేధించాలి..ఎస్సైపై చర్యలు తీసుకోవాలి
విజయవాడః జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, కావాలనే  వైయస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, సుధాకర్ బాబు, సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ వేధిస్తోందని అన్నారు. రాజాపై దాడి వెనుక ఉన్న కుట్రను చేధించాలని, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగానే వైయస్సార్సీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని...  ప్రభుత్వం, పోలీసుల తీరు మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను, బాబు సర్కార్ కాపులకు చేస్తున్న అన్యాయాన్ని రాజా నిలదీస్తున్నాడనే ఆయనపై కక్షపూరితంగా దాడి చేశారన్నారు. 

నాలుగు నెలల పసిబిడ్డతో కారులో కూర్చున్న రాజాపై కావాలనే ఎస్సై నాగరాజు దౌర్జన్యం చేశాడన్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నాడనే  ఆరోజు ముద్రగడ, ఈరోజు రాజాను ప్రభుత్వం హింసిస్తోందన్నారు.  కారు పార్కు సమస్య ఉంటే చలనాలు రాయాలి గానీ ఇలా  ఈడ్చుకుంటూ, లాఠీలతో కొట్టుకుంటూ  స్టేషన్ కు తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారు. అక్కడ అసలు ఎస్సైకి ఏం పని అని నిలదీశారు. రాజాను హింసించాలన్న ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశారని అర్థమవుతోందన్నారు.  విజయవాడలో ఐపీఎస్ అధికారిపై టీడీపీ ఎంపీ కేశినేని దౌర్జన్యం చేసినా...టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఎమ్మెర్వోను జుట్టుపట్టుకొని లాక్కెనా, వైయస్సార్సీపీ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యగావించబడినా టీడీపీ నేతలపై ఎలాంటి కేసులు, చర్యలు లేవు. ప్రభుత్వం ఈవిధంగా ప్రోత్సహించడం వల్లే ఘోరాలు జరుగుతున్నాయని వైయస్సార్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. రాజాపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

పోలీసులు పచ్చచొక్కాల కార్యకర్తలుగా మారారని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి పోలీసు యంత్రాంగాన్ని నెట్టిన ఘన చరిత్ర బాబు, మంత్రులు,  ఆయన తాబేదారులకే దక్కిందన్నారు.  ఎవరు నోరెత్తినా, అన్యాయాన్ని ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తూ దాడులు చేస్తున్నారని, రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని టీడీపీకి హిత బోధ చేశారు.  రాజాపై దాడితో వైయస్సార్సీపీ యువజన నాయకులను భయబ్రాంతులను చేయాలని చూస్తున్నారని,  మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని టీడీపీని హెచ్చరించారు. తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.  బాబు పాలనలో  పంచాయతీ దగ్గర్నుంచి కార్పొరేషన్ దాకా టీడీపీకి అనుకూలంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలివ్వడం, వారు చెప్పిన వారిని అరెస్ట్ చేయడం. పోస్టింగ్ లు కూడ వారి ఇష్టానుసారం జరుగుతున్నాయన్నారు. 

వి‘శోఖ’ నగరం


– మూడేళ్లలో అన్నీ అలజడులే 
– మహిళల మనోభావాలు పణంగా పెట్టి చంద్రబాబు వికృత చేష్టలు 
– బీచ్‌ ఫెస్టివల్స్, అందాల పోటీలతో న‌గ‌రానికి చెడ్డ పేరు
– పెరిగిన అవినీతి, భూదందాలు

ప్రశాంత వాతావరణానికి.. అందమైన ప్రకృతి రమణీయతకు పేరున్న విశాఖ నగర పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. అందమైన బీచ్‌.. చల్లని గాలులతో పలుకరించే నగర ప్రాముఖ్యతను దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. అభివృద్ధి పేరుతో నగరాన్ని కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. ఆధునిక సాంప్రదాయం ముసుగులో మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విష సంస్కృతికి విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని రోడ్డుపై అసభ్యకరంగా లాగేసి పోలీసు జీపుల్లోకి ఎక్కిస్తున్నారు. 

విశాఖ పేరు చెడగొడుతూ...
చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ మూడేళ్లుగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూనే ఉన్నారు. పిచ్చి తుగ్లక్‌ ఆలోచనలతో ఖజానా నింపుకోవాలని దుర్భుద్ది పుట్టింది. విశాఖలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని హంగామా చేసేశాడు. గోవా తరహాలో బీచ్‌లో టెంట్లు వేసి జంటలను ఆహ్వానిస్తామని.. లిక్కర్‌ పార్లర్లు ద్వారా మద్యం పంపిణీ చేస్తామని.. విదేశీయులను పిలిచి పండగ చేస్తామని గప్పాలు పోయాడు.  ఆయన ప్రకటించిన బీచ్ ఫెస్టివల్‌ విధానాలపై  వైయస్‌ఆర్‌సీపీ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తాజాగా అందాల పోటీల పేరుతో విశాఖ కీర్తిని తగ్గించేలా మరో విష వేదిక నిర్వహించడంపై మహిళా లోకం మళ్లీ భగ్గుమంది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగిన మహిళల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బట్టలు చిరిగి పోతున్నా వారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి  వాహనాల్లో పడేసిన తీరు ప్రభుత్వ తీరుకు నిదర్శనం. మహిళలపై దాడులేకాదు.. భూ కబ్జాలతోనూ విశాఖ పేరును నాశనం చేసేశారు. హుద్‌ హుద్‌ తుపాన్‌ పేరు చెప్పి వేల ఎకరాల భూములకు సంబంధించి రికార్డులు మాయం చేసిన టీడీపీ నాయకులు తమ ఆస్తుల్లో కలిపేసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం యువత నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని జరగకుండా అడ్డుకున్నారు. 

విశాఖే ఎందుకంటే..
బీచ్‌ ఫెస్టివల్స్, అందాల పోటీలు, ర్యాంపు వాక్‌లకు విశాఖ నగరాన్ని కేంద్రంగా చేయడానికి కారణం లేకపోలేదు. రాష్ట్రం విడిపోయాక ఏపీలో విశాఖే పెద్ద నగరం. అందమైన బీచ్‌తో మంచి వాతావరణం విశాఖ సొంతం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, వాడరేవు ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు. వారి ప్రభావం ఇక్కడి వారిపై ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ పట్నం ఒకటి. ఈ నేపథ్యంలో విశాఖను కూడా గోవా మాదిరిగా విదేశీ సంస్కృతికి కేంద్రంగా మార్చి ఖజానా నింపుకోవాలన్నది చంద్రబాబు కల. డబ్బు యావలో ఇక్కడున్న మహిళల మనోభావాలను, తెలుగు సంస్కృతిని  మాత్రం పట్టించుకోలేదు. భాగస్వామ్య సదస్సు పేరుతో హడావుడి చేసినా ఒక్క పైసా పెట్టుబడి తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో మహిళల మనోభావాలను పణంగా పెట్టి విష సంస్కృతిని విశాఖ ప్రజలపై రుద్దాలని చూసి విఫలమయ్యారు. 

వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యులవుదాం

అనంతపురంః రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.  రాజన్న రాజ్యం కోసం ‘వైయస్సార్‌ కుటుంబం’లో భాగస్వామ్యులు కావాలని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురం 39వ డివిజన్‌ లక్ష్మీనగర్‌లోని జన్మభూమినగర్‌లో ‘వైయస్సార్‌ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహమ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేశారు.

ఎన్నికల ముందు సుమారు 600కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా...ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. చంద్రబాబు తమను మోసం చేశారనే భావన అన్ని వర్గాల ప్రజల్లో నెలకొందన్నారు. దివంగత  వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని గుర్తుచేశారు. మళ్లీ రాజన్న రాజ్యం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల్లాంటి పథకాలతో కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ప్రజాసంకల్పయాత్ర సక్సెస్ కావాలని కోరుతూ చెవిరెడ్డి పాదయాత్ర

చిత్తూరుః అధినేత వైయస్ జగన్ చేపట్టనున్న ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  పాదయాత్ర చేపట్టారు. తుమ్మలగుంట నుంచి తిరుత్తణి వరకు 100కి.మీ. పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డికి మద్దతుగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

వైయస్సార్సీపీ రామచంద్రాపురం బంద్

తూర్పుగోదావరిః జక్కంపూడి రాజాపై ఎస్సై నాగరాజు దాడికి నిరసనగా వైయస్సార్సీపీ రామచంద్రాపురం బంద్ చేపట్టింది. ఎస్సై నాగరాజుపై కేసు నమోదు చేయాలని వైయస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.

28 October 2017

పోలవరం జాప్యం టిడిపి పుణ్యమే


పోలవరం నిర్మాణ పనుల్లో అవినీతిని కేంద్రం పసిగట్టింది
విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాజధాని నిర్మాణం రూట్‌ మ్యాప్‌ ఇవ్వాలి
రైతులను మోసం చేసేందుకు మరో డ్రామా 

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీ నిందలు వేయడం దారుణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు.  పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆయన విమర్శించారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని కన్నబాబు ప్రశ్నించారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాట ఫలితంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేశారన్నారు. ఈ ప్రాజెక్టును మేమే కడుతామని పట్టుబడి మరి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి తీసుకుందని, ఆ తరువాత సీఎం తన  బినామీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు. కేంద్రం కంట్రాక్టుదారులను మార్చుతామంటే చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. పోలవరానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుందని మంత్రులు, సీఎం చెప్పారన్నారు. స్వప్రయోజనాల కోసం పోలవరాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ చేస్తున్న అవినీతిని కేంద్రం పసిగట్టిందన్నారు. ఇందులో వైయస్‌ఆర్‌సీపీ చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. గడ్కారిని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు చూపించినా కేంద్రం సంతృప్తి చెందలేదన్నారు. పోలవరం పనులు స్తంభించి పోతే పూర్తి బాధ్యత టీడీపీదే అని చెప్పారు. కేంద్రాన్ని  ఒప్పించి పోలవరాన్ని పూర్తి చేయాలని డిమాండు చేశారు. పోలవరం వ్యవహారంపై విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. పొలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ఎలా జాతీయ ప్రాజెక్టును కడుతారని ప్రశ్నించారు. అక్కడి రైతులు, గిరిజనుల పరిస్థితి ఏంటని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణిత సమయంలో పూర్తి చేయాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని తెలిపారు.

ప్రచార ఆర్భాటమే
చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతి సారి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆయన ప్రచార ఆర్భాటమే తప్పా చెప్పింది ఏమీ లేదని కన్నబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 42 నెలల్లో చంద్రబాబు 40 విదేశీ పర్యటనలు చేశారని విమర్శించారు.  విదేశాలకు వెళ్లిన ప్రతి సారి చంద్రబాబు ఆశ్చర్యానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి సారి కళ్లబొల్లి మాటలు చెప్పడమే తప్ప ఏ ఒక్కటి సాధించలేదని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  విదేశీ పర్యటనలపై బాబుకు మోజు ఉందన్నారు. వెళ్లిన ప్రతి సారి విదేశాల పర్యటనలపై కబుర్లు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. కళ్లబొల్లి మాటలే..ప్రచార ఆర్భాటమే అని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన ప్రతి సారి ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారన్నారు. ఇప్పటివరకు  ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రకటించాలని డిమాండు చేశారు.  ఏ దేశం వెళ్తే ఆ దేశంలా చేస్తానని ప్రకటనలు ఇస్తూ ఆశ్చర్యపోతున్నారే తప్ప..చేసింది ఏమీ లేదన్నారు.  లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ట్రాఫిక్‌ నియంత్రణ విధానం చూశాం. అమరావతిలో కూడా అలాంటివి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క లేఅవుట్‌ చేసి రోడ్డు వేయలేదని తప్పుపట్టారు. ప్రతి సారి సినిమా డైరెక్టర్లను పిలిచి గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారే తప్ప ఏమి చేయడం లేదని ఫైర్‌ అయ్యారు.  రాజధాని అన్నది ఒక ఆకాంక్ష, అందరి కల. అయితే తాత్కాలిక సచివాలయానికే చిల్లు పడిందని గుర్తు చేశారు. ఇక మీరు కట్టే రాజధాని ఎలా ఉంటుందో అన్న భయం ఉందన్నారు. ఇంతకన్న చేతకాని తనం ఉంటుందా? ఎమిరేట్స్‌ వెళ్లాను..అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు.  మన రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలే విదేశాల్లో అబ్ధుతంగా విమానాశ్రయాలు కడుతున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వేత్తలను పిలిచి వారితో మాట్లాడారా? అన్నారు.  ఇక్కడి వారితో మీరు మీటింగ్‌ పెట్టుకుంటే మీ అవినీతి బయటపడుతుందనే విదేశాలకు పరుగులు తీస్తున్నారని ఆరోపించారు. 

ఇన్నాళ్లు వ్యవసాయం గుర్తుకు రాలేదా?
చంద్రబాబుకు ఈ మూడున్నరేళ్లు వ్యవసాయ రంగం గుర్తుకు రాలేదని కన్నబాబు ధ్వజమెత్తారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఐటీ రంగం గురించి మాట్లాడే వాడిని... ఈ సారి  వ్యవసాయ రంగంపై మాట్లాడానని చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు.  ఈ మూడేళ్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎందుకు వ్యవసాయం మీదా దృష్టి పెట్టలేదని నిలదీశారు. ఈ రాష్ట్ర రైతాంగానికి ఏం చేశారని నిలదీశారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పండే వరి, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించలేని మీరు విదేశీ కంపెనీలను రాష్ట్రానికి పిలవడం విడ్డురంగా ఉందన్నారు.  దీపావళి రోజు కూడా ఇంట్లో లేకుండా విదేశాల్లో ఉన్నానని, సమయం వృథా చేయకుండా విమానాల్లోనే స్నానం చేశారని గొప్పలు చెప్పారని తప్పుపట్టారు. అదే దీపావళి రోజు  రైతులు మాత్రం తుపాను వస్తుందని పొలాల్లో జాగరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసింది గొప్పా..రైతులు చేసింది గొప్పా అని సీఎంను నిలదీశారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయని చెప్పాలన్నారు.  వీటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏçర్పాటు చేశారని ప్రశ్నించారు. విదేశీ మోజుతో ప్రజలను మభ్యపెడుతున్నారని తూర్పారబట్టారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీపై నిందలు వేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకు విదేశీ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని, వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండు చేశారు. 

వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్రతో టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు


-ఎన్‌టీఆర్ చావుకు కార‌ణం మీరు కాదా?
- య‌న‌మ‌ల నోటిని ఫినాయిల్‌తో క్లీన్ చేయాలి
వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్‌

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంటే టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంద‌ని పార్టీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్య‌మంత్రి ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఘ‌న‌త చంద్ర‌బాబుది కాదా అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై అవాక్కులు, చ‌వాక్కులు పేల్చితే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. శ‌నివారం జోగి ర‌మేష్ విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ ను వెనక నుంచి వెన్నుపోటు పొడిస్తే ఆ కత్తి అందించింది యనమల రామ‌కృష్ణ‌డే అని ఆరోపించారు. ఎన్టీఆర్  నమ్మి య‌న‌మ‌ల‌కు స్పీకర్‌ పదవి ఇస్తే ఆయనను అసెంబ్లీ లో మాట్లాడకుండా చేసి అవ‌మానించార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ లో ఓడి పోయినా పిలిచి పదవిస్తే ఎన్టీఆర్ పార్టీని, జెండాను, గుర్తును లాక్కున్న చంద్రబాబు లాంటి దౌర్బాగ్యుడ్ని, నమ్మి స్పీకర్‌ పదవి ఇస్తే అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించిన యనమలను అసెంబ్లీలో చూడలేక ఎన్టీఆర్‌ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించార‌న్నారు. 20 మంది వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో పశువుల్లా కొని, వారిలో నలుగుర్ని మంత్రులుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షం అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో తిట్టించ‌డం దారుణ‌మ‌న్నారు. అప్పటి అప్రజాస్వామ్య విధానాలపై ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఇప్పుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించారని వివ‌రించారు. ఈ నిర్ణయంపై ఏ–1 ముద్దాయి జగన్‌ కు ఎన్టీఆర్‌ తో పోలిక అంటూ వ్యంగంగా మాట్లాడుతున్న యనమల నోటిని ఫినాయిల్‌ తో క్లీన్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.  అప్పటి విషయాలపై పూర్తి అసత్యాలు పలుకుతున్న యనమల ను ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించాలన్నారు. విలువలు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే  వైయ‌స్‌ జగన్‌ వాటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వని మీలాంటి వారికోసం అసెంబ్లీకి రావాలా? అమ్ముడు పోయిన మంత్రులను చూడటానికి అసెంబ్లీకి రావాలా అని ప్ర‌శ్నించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి మ‌ర‌ణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్తానంటే సోనియాగాంధీ అందుకు అంగీక‌రించ‌లేద‌ని కాంగ్రెస్‌ పార్టీని సైతం వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చిఏన వీరాధివీరుడు మా నేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి అని కీర్తించారు.  వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు విలువుందా అని చంద్రబాబు అంటున్నార‌ని,  ఆయ‌న‌ చేస్తే పాదయాత్ర.. వేరే వాళ్లు చేస్తే విలువుండదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్రజలకు అబద్దాలు చెప్పార‌ని విమ‌ర్శించారు. అధికారం కోసం నీలా మాట్లాడే నేత వైయ‌స్‌ జగన్‌ కాదన్నారు. గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతులకు, చంద్రబాబు మాటలు న‌మ్మి మోసపోయిన  డ్వాక్రా అక్కచెళ్లెళ్లకు, ప్రత్యేక హోదా, పరిశ్రమలు అంటూ చెప్పి మోసగించబడ్డ నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తున్నార‌ని జోగి ర‌మేష్ వివ‌రించారు. స్వచ్చమైన మనస్సుతో ప్రజల వద్దకు  వైయ‌స్‌ జగన్‌ వెళ్తుంటే చంద్రబాబు, మంత్రుల గుండెల్లో వణుకు పుడుతోంద‌న్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పై అవాకులు, చెవాకులు పేలితే ప్రజలు చూస్తు ఊరుకోరని జోగి ర‌మేష్ హెచ్చ‌రించారు.

క్రెడిట్ స్కోర్ కాదు కుచ్చుటోపీ

రైతుఅన్నపదాన్నేరాష్ట్రాన్నించిదూరంచేయాలనికంకణంకట్టుకున్నారుఎపిసిఎమ్చంద్రబాబునాయుడు. అందుకువత్తాసుపలుకుతున్నారుఆయనకుమారుడునారాలోకేష్. మూడోవిడతరుణమాఫీవిడుదలచేసామనిగప్పాలుకొట్టినబాబుసర్కార్అదిరైతులకుఅందలేదనేవిషయాన్నిమాత్రంబహిరంగంగాచెబుతున్నదేలేదు. రుణమాఫీజరగనిరైతులుబ్యాంకులచుట్టూకాళ్లరిగేలాతిరుగుతున్నారు. ఇప్పటివరకూచిల్లరలావిదిలించినరుణమాఫీసైతంఇన్నేళ్లవడ్డీకిందజమఅయిపోగా, అసలురుణంఅలాగేఉందనిరైతులువాపోతున్నారు. వేలకోట్లరుణమాఫీచేసామనివేదికెక్కినప్రతిసారినిస్సిగ్గుగాచంద్రబాబుఅబద్ధాలుఆడుతూనేఉన్నారు. రాజధానికోసంభూములిచ్చినరైతులకుప్రత్యామ్నాయంగాఇచ్చేభూములనుఅభివృద్ధిచేస్తామనిచెప్పినటిడిపిసర్కార్ఇంతవరకూఆదిశగాఒక్కచర్యాతీసుకోలేదు. రైతులనురాజధానిలోవ్యాపారులనుచేస్తామంటూప్రకటించడంనిజంగాహాస్యాస్పదం. రాష్ట్రానికిఆహారభద్రతనిచ్చేరైతునుముప్పేటదాడితోముంచేయడమేచంద్రబాబువైఖరిగాఉంటోంది. ఉన్నభూములుపోయికొందరువ్యవసాయానికిదూరమైతే, రుణాలుఅందకవ్యవసాయాన్నివదిలేస్తున్నదిమరికొందరు. వ్యవసాయపంటలకుగిట్టుబాటుధరఅందిచాల్సిందిపోయి, వాటినిమానివాణిజ్యపంటలువేసుకోవాలనిఉచితసలహాలుఇచ్చేముఖ్యమంత్రినిమనఆంధ్రప్రదేశ్లోనేచూడగలం.
ఇప్పుడుపెదబాబుగారిబాటలోనేచినబాబుగారూపయినిస్తున్నారు. రుణమాఫీగురించిఎదురుచూడకుండారైతులకుప్రత్యామ్నాయాలుసూచించదలచారట. రైతులకుక్రెడిట్రేటింగ్ఇచ్చిసులభంగా, తక్కువవడ్డీకిరుణాలుఅందేలానూతనవిధానంరూపొందిస్తున్నామనిచెబుతున్నారీరాష్ట్రపంచాయితీ, ఐటిశాఖామాత్యులు. అసలురైతులక్రెడెబులిటీనేదెబ్బతీస్తున్నప్రభుత్వంవీరికిక్రెడిట్స్కోర్ఇస్తాననడంమరీవిడ్డూరంగాఉంది. ఎన్నికలముందుఅన్నవస్తున్నాడు, ఎవ్వరూబ్యాంకురుణాలుకట్టవద్దనిదండోరావేయించారుచంద్రబాబు. రుణమాఫీబేషరతుగాచేస్తామని, అధికారంలోకివచ్చినవెంటనేతొలిసంతకం  దానిపైనేచేస్తామనిచెప్పారు. తీరానమ్మిఓట్లేసినరైతులకుదక్కిందిదగా, మోసమే. నయవంచనలోపిహెచ్డిచేసినచంద్రబాబురుణమాఫీకికావాల్సినన్నీకొర్రీలుపెట్టి, చివరికివిడతలవారీగాచిల్లరవిసురుతున్నారు. అవీఇన్నేళ్లుగాపెరిగిపోయినవడ్డీలకేకొట్టుకుపోతున్నాయి. అసలుఅప్పుఅలాగేఉండి, కొత్తఅప్పులకుఅవకాశంలేకుండాపోతున్నాయి. ఇలాంటిగడ్డుపరిస్థితిలోరైతులకుక్రెడిట్స్కోర్అంటూలోకేష్రాష్ట్రంఅవతలనిలబడికేకలువేస్తున్నారు.
తగ్గిపోతున్నసాగువిస్తీర్ణం
రాష్ట్రంలోగతనాలుగేళ్లలోసాగువిస్తీర్ణంగణనీయంగాతగ్గిపోతోంది. నీరుప్రగతిపేరుతోభూగర్భజలాలుపెంచుతున్నామంటూప్రభుత్వంచెబుతున్నమాటలన్నీఉత్తవేఅనినివేదికలుచెబుతున్నాయి. గతనాలుగేళ్లకాలంలోఖరీఫ్లోచూస్తేసాగువిస్తీర్ణంఏటాతగ్గిపోతోందనివెల్లడైంది. జిల్లాకలెక్టర్లనివేదికల్లోనేఈవిషయాలుబైటపడ్డాయి. 2014-15 ఆర్థికసంవత్సరంనుంచిఈసంవత్సరంఖరీఫ్వరకూచూస్తేసాగువిస్తీర్ణంచాలాతగ్గిందనిఈనివేదికలుతెలియజేస్తున్నాయి. నీరుప్రగతికోసంప్రభుత్వంగతమూడేళ్లలో9,906 కోట్లుఖర్చుచేసింది.
వాగ్దానాలన్నీనీళ్లపాలు
ముంపుప్రాంతాలు, శివారుసాగునేలల్లోసర్కార్సాగునీటినిఇవ్వడానికిజాప్యంచేస్తోంది. దాంతోనారుమళ్లుఆలస్యంఅవుతున్నాయి. అకాలవర్షలాతోనారుమళ్లుమునిగిపోవడం, పూడికతీతలు, ఆధునీకరణపనులుజరగకవరదనీరుమడుల్లోనిలిచిపోవడంతోనారుమళ్లులేకచాలామండలాల్లోరైతులుపంటవిరామాన్నిప్రకటించారు. రుణమాఫీపేరుతోకుచ్చుటోపీపడటంతోబ్యాంకులనుంచిరైతులకుకొత్తరుణాలుఅందటంలేదు. ఇకవ్యాపారులచేతిలోచిక్కిశల్యంఅవ్వడమేగత్యంతరంఅయ్యింది. దాంతోఅప్పులుమరింతపెంచుకోలేనిపరిస్థితుల్లోఅన్నదాతలుకాడినిపక్కనపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోఅన్నిపంటలూఖరీఫ్రబీకలిపిసాధారణంగా155.24 లక్షలఎకరాలుసాగువిస్తీర్ణంఉండేది.  పెట్టుబడులుసమకూర్చుకోలేకచిన్నసన్నకారురైతులుదయనీయపరిస్థితిలోఉండటంతోగతఏడాదిఈవిస్తీర్ణం7.69 లక్షలుతగ్గిపోయింది. ఈఏడాదిఅయితేమరీదారుణంగా 16.51 లక్షలఎకరాలుసాగుకుదూరమైంది. వరి, చెరకు, పప్పుదినుసులు, నూనెగింజలు, జొన్న, గోధుమపంటలవిస్తీర్ణంఏటికేడాదీతగ్గిపోతోంది. పత్తి, మిరపవంటివాణిజ్యపంటలకుసైతంమద్దతుధరలేక, పెట్టుబడులూతిరిగిరాకరైతులుఆత్మహత్యలకుపాల్పడుతున్నారు. నకిలీవిత్తనాలు, కీటకనాశినిరసాయనాలుపనిచేయకపోవడం, ప్రభుత్వంరైతువ్యతిరేకవిధానాలు, పాలకులనిర్లక్ష్యంఅన్నీకలిసికర్షకుడినినేలకుదూరంచేస్తున్నాయి. ఇదిచాలాదురదృష్టకరమైనపరిణామం. ఇలాగేసాగితేఅన్నపూర్ణఆంధ్రప్రదేశ్అన్నానికికూడామరోచోటచేయిచాచాల్సివస్తుందనిహెచ్చరిస్తున్నారువ్యవసాయరంగనిపుణులు.
నదులఅనుసంధానంతోరాయలసీమ, కోస్తారైతులకుసాగునీరు, తాగునీరుఅనిముఖ్యమంత్రిచంద్రబాబుచేసేవన్నీఅసత్యప్రచారాలేఅనిసాగులెక్కలుతేల్చిచెబుతున్నాయి. ప్రకృతివైపరీత్యాలతోనష్టపోయినరైతులకుకనీసంనష్టపరిహారాన్నీఅందించనిచంద్రబాబుదిరైతువ్యతిరేకప్రభుత్వంఅంటున్నారుసామాజికవేత్తలు. నేలనునమ్ముకునేరైతుసేద్యాన్నిపక్కనపెట్టాడంటేఅదిపాలకులకేసిగ్గుచేటు. 

రేషన్‌.. పరేషాన్‌


– చంద్రన్న మాల్స్‌తో ప్రైవేటుకు బార్లా  
– ప్రజా పంపిణీ వ్యవస్థకు పెను ముప్పు
– కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు బాబు సర్కారు యత్నలు

లాభాల వేటలో ఆవురావురుమంటున్న బహుళజాతి సంస్థలు చిల్లర వర్తకంలో ప్రవేశానికి తెలుగు దేశం ప్రభుత్వం తలుపులు బార్లా తీశారు. ’రాష్ట్రమంతా 6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి ఇప్పటికే పుల్లారావు ప్రకటించారు. ఈ మాల్స్‌ను రిలయన్స్, ప్యూచర్‌ గ్రూప్‌లకు అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ మామూలు ధర కంటే 20 శాతం తక్కువకే సరకులు లభిస్తాయని ప్రజలను ఊరించే ప్రయత్నం చేశారు. రేషన్‌ డిపోలకు అనుబంధంగా మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి, అక్కడ ఎవరైనా సరుకులు కొనుగోలు చేసుకోవచ్చని, రేషన్‌ కార్డులతో సంబంధం లేదని’ వివరించారు. అంటే రేషన్‌ షాపులు బహుళజాతి సరుకుల అమ్మకాలకు అడ్డాలుగా మారబోతున్నాయనే.

విలేజ్‌ మాల్స్‌లో అధిక ధరలు  

ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో బియ్యం మినహా మరే ఒక్క సరుకూ అందించడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో, రేషన్‌ డీలర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలోనే రేషన్‌ దుకాణాలను విలేజ్‌ మాల్స్‌లా మార్చి నిత్యావసర సరుకుల (కందిపప్పు, సెనగపప్పు, మినప గుళ్లు)ను బహిరంగ మార్కెట్‌ కన్నా తక్కువ ధరలకు కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే విలేజ్‌ మాల్స్‌ పేరుతో విక్రయించేందుకు రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కొరవడింది. దుకాణాలకు సరఫరా చేసిన పామాయిల్‌ లీటరు ప్యాకెట్‌ రూ.52కు సరఫరా చేస్తే, బహిరంగ మార్కెట్లో రూ.50లకే అందుబాటులో ఉండేది. దీంతో విలేజ్‌ మాల్సులోని నాణ్యత లేని సరుకులు కొనేందుకు రేషన్‌ వినియోగదారులు ఆసక్తి చూపలేదు. 
పథకం ప్రకారం నిర్వీర్యం 
జూలై నుండి చౌక ధరల దుకాణాల్లో చక్కెర పంపిణీని కేంద్రం నిలిపివేసింది. అప్పటి నుండే బియ్యానికి బదులు నగదు బదిలీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం లంకించుకుంది. అందులో భాగంగా రేషన్‌ బియ్యం ఇచ్చినా తీసుకోవట్లేదంటూ కట్టుకథలల్లి ఏకంగా 19 లక్షల తెల్ల రేషన్‌ కార్డులను రద్దు చేసేందుకు కుయుక్తులు పన్నింది. మూడు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ డేగ కన్నేసి శోధించి 19 లక్షల కుటుంబాలు బియ్యం తీసుకోవట్లేదని తేల్చింది. కార్డులు రద్దు చేయదలచిన 19 లక్షల కుటుంబాల్లో 57 లక్షల మంది సభ్యులున్నారు. రేపోమాపో వీరందరూ రేషన్‌ బియ్యం కోల్పోక తప్పదు. కార్డుల రద్దు ఘనకార్యం వలన నెలకు 28 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిగులుతాయని, ఆ మేరకు ప్రభుత్వం భరించే సబ్సిడీ రూ.91 కోట్లు ఆదా అవుతుందన్నది అంచనా. చంద్రబాబు విదేశీ పర్యటనల కోసం కోట్లు గుమ్మరించేందుకు వెనుకాడని ప్రభుత్వం.. పేదలకు సరుకుల పంపిణీలో చిల్లర చేష్టలు చేయడం దుర్మార్గం. 

చిల్లర వర్తకంపై ప్రభావం 

ప్రధాన నగరాల్లో మాల్స్‌ ఏర్పాటు చేయడం ఇప్పటికే చిల్లర వర్తకులపై ప్రభావం చూపుతోంది. వ్యాపారులు 40 శాతం మార్కెట్‌ను కోల్పోయారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు రేషన్‌ దుకాణాల్లో రిలయన్స్, ఫ్యూచర్‌ గ్రూపులను అనుమతిస్తే గ్రామీణ చిల్లర వర్తకులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయం నష్టాల పాలు కావటంతో లక్షల మంది చిల్లర వర్తకంపై ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయినా రేషన్‌ డిపోలను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం వలన సరుకుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో పాటు నిలదీసే హక్కు కూడా లబ్ధిదారులు కోల్పోతారు. సబ్సిడీ కొనసాగించాలనే నియమం కూడా ఉండదు. క్రమంగా కొన్నాళ్లకు రేషన్‌ కార్డులు ఉపయోగపడని విధంగా మారుతాయి
రైతులకూ ముప్పే..

ప్రజాపంపిణీ వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగిస్తే ప్రజల ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. భారత ఆహార సంస్థను మూసేస్తే రైతుల పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. రైతులు పంటలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. దీంతో పంటలు కొనే దిక్కులేక రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. పేదలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. నేడు మరలా అదే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. ప్రజాపంపిణీ ద్వారానే పేదలకు కొద్దోగొప్పో ఆహారం అందుతోంది. ఇప్పటికే పౌష్టికాహారం లేని దేశాల్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం. ఈ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారుతుంది.  

నవరత్నాలతో అన్ని వర్గాల సంక్షేమం

పొదిలిః వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కందుల రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని కుంచేపల్లిలో జరిగిన వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సర్పంచ్‌ కొమ్మసాని కృష్ణారెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛందంగా యువకులు సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వైయస్‌ఆర్‌ స్టిక్కర్లను దర్వాజాలకు అంటించారు. నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ అధ్యక్షులు వెలుగోలు కాశీ, పేరం నాగిరెడ్డి, కొమ్మసాని అశోక్‌రెడ్డి, రవికుమార్, విఘ్ణేశ్వర్, కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శంకరగుప్తంలో వైయస్ఆర్ కుటుంబం

శంకరగుప్తం(మలికిపురం): రాజోలు జోన్ లో  వైయస్సార్‌ కుటుంబం కార్రక్రమం ఉత్సాహంగా జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాల పత్రాలను ప్రజలకు అందించి సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ సెల్‌ నంబరు 9121091210కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి ప్రజలను వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్చారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి హనుమంతరావు , ఉపాధ్యక్షులు ఆచంట బుజ్జి, నేతల శరత్‌ భూషణ్, పప్పొప్పుల మల్లు, అడబాల శ్రీనివాస్,రాపాక లక్ష్మణ్, ఆచంట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయ కర్తగా హర్షవర్థన్ రెడ్డి నియామకం

హైదరాబాద్: గుంటూరు జిల్లాకు చెందిన ఎ.హర్షవర్ధన్ రెడ్డి వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర కార్యాలయం సమన్వయం కర్తగా నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ నియాకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర కార్యదర్శిగా ఆనంద్ ప్రకాశ్ 

పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెల్లెం ఆనంద ప్రకాశ్ ను నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే కృష్ణా జిల్లాకు చెందిన పలువురిని వివిధ పదవుల్లోనూ, అనంతపురం జిల్లా మడక శిర నియోజకవర్గానికి చెందిన వారిని వివిధ పదవుల్లో నియమించారు.

యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకో

విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడించి టీడీపీ నేతలేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. వెనుక నుంచి చంద్రబాబు ముందు నుంచి యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. గతంలో స్పీకర్‌ కుర్చీకే మచ్చ తెచ్చాడని, యనమల వైఖరికి ఎన్టీఆర్‌ కంటతడి పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్‌ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు ఆగడాలను నిరసిస్తూ అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా నడుస్తున్నామని చెప్పారు. 

వైయస్‌ జగన్‌ లండన్‌ పర్యటన

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం లండన్‌‡ బయల్దేరి వెళ్లారు. నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరు నెలల పాటు కొనసాగనుంది. వైయస్‌ జగన్‌ పెద్ద కుమారై వైయస్‌ హర్ష ప్రతిష్టాత్మక లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం చేస్తున్న విషయం విధితమే. కాగా పాదయాత్ర చేపట్టాక కుమార్తెను చూసేందుకు వీలుండదు కాబట్టి శనివారం ఉదయం బయల్దేరి లండన్‌ వెళ్లారు. మూడు రోజుల పాటు జననేత లండన్‌ పర్యటన కొనసాగనుంది. 

పాదయాత్ర విజయవంతం కావాలి

రాయచోటి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా నేతలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.  చిన్నమండెం జెడ్పీటీసీ కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి తదితరులు తిరుమలకు కాలినడకన బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేందుకు కాలినడకన తిరుమలకు వెళుతున్నామన్నారు. 

కోవూరుకు చేరిన ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంశిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా కోవూరుకు చేరింది. 21వ తేదీ నరసరావుపేటలో మొదలైన పాదయాత్ర 3వ తేదీన తిరుమలకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా కోవూరులో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయశాఖామంత్రి సొంత జిల్లాలోనే రైతులు అవస్థలు పడుతున్నారని, ఇదే టీడీపీ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రజలు ఆకాంక్షించిన విధంగా పాలన సాగాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం తిరిగొస్తుందన్నారు. 

27 October 2017

ప్రజా సమస్యల పరిష్కారమే సంకల్పం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహా సంకల్పంతో ముందుకు ఉరుకుతున్నారు. నవంబర్‌ 6 నుంచి 6 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన 125 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మిగిలిన 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నడుం బిగించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో ముందుకు సాగనున్నారు. పార్టీకి జవసత్వాలు సమకూర్చడంతోపాటు రాబోవు ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే మహాసంకల్పంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే సభకు దూరం


  • ఫిరాయింపుదాలరుపై వేటుపడితేనే అసెంబ్లీకి 
  • రాష్ట్రంలో పరిణామాలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌కు వైయస్‌ జగన్‌ లేఖ
  • ప్రజా సంకల్పయాత్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబు
  • రఘువీరారెడ్డి మాటలు అత్యంత దుర్మార్గం
  • రావణాసురుడిలా బాబుకు ప్రతి పార్టీలో ఒక తలకాయ
  • ప్రజలను తప్పుదోవపట్టించే వారిని అడ్డుకునే సమయం ఆసన్నమైంది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశాలనుబాయ్కాట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి తప్పు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి వస్తామని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా అభిప్రాయం తెలియజేశారని చెప్పారు. ఈ మేరకు పార్టీ తీర్మానం చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిపై వైయస్‌ జగన్‌ లేఖ రాసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌కు పంపించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణను విస్మరించి ఏరకంగా ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారనే అంశంపై ఎమ్మెల్యేలంతా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగిందన్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవడం దేశ వ్యాప్తంగా రాకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు. అందుకనే ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామన్నారు.
 
వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టగానే చంద్రబాబు పార్టీ కుట్రలు పన్నుతోందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఓదార్పు యాత్ర చేపట్టిన సమయంలో వైయస్‌ జగన్‌ ఎక్కడ పెద్ద నాయకుడిగా ఎదుగుతాడోనని చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి కుట్రలు చేశారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిని బలవంతంగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు పంపిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ నుంచి రఘువీరారెడ్డిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సమావేశాలు బహిష్కరిస్తే దానిపై మాట్లాడకుండా పద్దతి కాదని మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయకుండా ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.  

రావణాసురుడికి పది తలలు ఉన్నట్లు చంద్రబాబు ప్రతి పార్టీ ఒక తలకాయ ఉంటుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీలో చంద్రబాబుకు మద్దతు తెలిపే పెద్ద తలకాయ ఎవరో అందరికీ తెలుసనీ, అదే మాదిరిగా కాంగ్రెస్‌లో పెద్ద తలకాయతో చర్చలు జరిపి ఏ విధంగా కేసుల్లో ఇరికించారో ప్రజలకు తెలుసన్నారు. ప్రతి రోజు టీవీ ఛానల్స్‌లోకి వచ్చి మేధావులం, విశ్లేషకులం అని చెప్పుకుంటూ వంటినిండా చంద్రబాబు పార్టీ రంగు పులుముకొని ఆ పార్టీకి భజనం చేయడం మంచి పరిణామమా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే వారి ఆలోచనలు అడ్డుకునే సమయం ఆసన్నమైందన్నారు. వాస్తవాలు, ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడేవారిని మాత్రమే ప్రోత్సహించాలన్నారు. 

జననేత వైయస్‌ జగన్‌ పాదయాత్రకు పర్మిషన్‌ రావద్దని చంద్రబాబు కుట్రలు పన్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామనే మాటలు మాట్లాడకుండా ఏదోరకంగా అడ్డంకులు సృష్టించాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. అంటే చంద్రబాబు ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారో ప్రజలకు అర్థం అవుతుందన్నారు. 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు లాక్కున్నారని, వారిపై వేటుపడితేనే అసెంబ్లీకి హాజరవుతామని చెప్పామన్నారు. శాసనసభ బులిటెన్‌లో పార్టీ ఫిరాయించిన వారు, మంత్రి పదవులు చేపట్టినవారు కూడా వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్నట్లు చూపించడం సమంజసం కాదన్నారు. అంటే మా పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా జరిగాయన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 270 రోజులకుపైగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే... చంద్రబాబు అధికారం చేపట్టి 4 ఏళ్లు గడుస్తున్నా కనీసం 75 రోజులు కూడా జరగలేదన్నారు. ఇవి కాక పార్టీ ఫిరాయించిన వారిని విచ్చలవిడిగా ప్రోత్సహించడం, విప్‌ ఇస్తే దాన్ని అంగీకరించకుండా స్పీకరే అడ్డుకోవడం, శాసనసభ మంత్రి క్లాజ్‌లను తొలగించడం, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రశ్నించిన మహిళా సభ్యురాలిని ఏ విధంగా సస్పెండ్‌ చేశారో.. అందరికీ తెలుసన్నారు. 

విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి


  • ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి
  • బాబు పర్యటనలతో ప్రజాధనం దుర్వినియోగం
  • ఒక పార్టీకి కొమ్ముకాస్తూ పచ్చపత్రికల్లో కథనాలు
  • వ్యక్తిగత జీవితాలను కించపర్చడం జర్నలిజమా?
  • చంద్రబాబు ఓటుకు కోటు కేసుపై చిన్న కథనమైనా రాశారా..?
  • సుజయకృష్ణ ముందు నీ వంశగౌరవం కాపాడుకో
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: చంద్రబాబు విదేశీ పర్యటనలతో వచ్చిన పెట్టుబడుల కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూడున్నరేళ్లుగా విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు ఎన్ని పెట్టబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన తాలూకా బృందం రాష్ట్రానికి పెట్టబడులు తెచ్చేదానికంటే వారి వ్యక్తిగత ఆహ్లాదానికి చేస్తున్న కార్యక్రమాలు పర్యటనలు ఉన్నాయన్నారు. 2014 నుంచి ఎన్ని విదేవీ పర్యటనలు చేశారు. ఎన్ని నిధులు వచ్చాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలన్నారు. అదే విధంగా వందల కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లలో ప్రకటించిన విధంగా నిధులు వచ్చాయా లేదా అన్న విషయాన్ని అధికారికంగా  ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పర్యటనలు చేసి వచ్చి వందల కోట్లు వస్తున్నాయని ప్రగల్భాలు పలకడం, అక్కడి తెలుగువారితో సన్మానాలు చేయించుకోవడం ఇక్కడేమో పచ్చపత్రికలు ఆహా.. ఓహో అంటూ రాతలు రాయడం ఇదే సరిపోతుందన్నారు. 

జాతీయ పత్రికలు వాస్తవాలు రాస్తుంటే ప్రాంతీయ పత్రికలు ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికి మరో పార్టీకి చెందిన నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తున్నాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జాతీయ పత్రికలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, డక్కన్‌క్రానికల్ వంటి పత్రికలు మాజీ సీబీఐ డైరెక్టర్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాయన్నారు. కానీ ప్రాంతీయ పత్రికలు మాత్రం ఫోటోలతో సహా వేసి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. మరి ఆ పత్రికలకు ఇచ్చిన చార్జీషీట్‌లు, ప్రాంతీయ పత్రికలు ఇచ్చిన చార్జీషీట్‌లు మారాయా అని ప్రశ్నించారు. అంటే పచ్చపత్రికల తాలూకా దుర్బుద్ధి, దురుద్దేశం బట్టబయలైందన్నారు. ఇది జర్నలిజమా.. ఇవేనా జర్నలిజం విలువలు అని నిలదీశారు. ఎక్కడైనా సీబీఐ డైరెక్టర్‌ను కలిసినట్లుగా నిరూపించగలరా..? లేని దాన్ని ఏ విధంగా సృష్టిస్తారు.. వాస్తవాలు తెలుసుకుని కథనాలు రాయాలని ఆ పత్రికలకు సూచించారు. 

ఓటుకు కోట్ల కేసులో 20 సార్లు చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు ప్రస్తావిస్తే ఈ ప్రతికలు ఒక్కటైనా రాశాయా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. లేని దాన్ని బూతద్ధంలో చూపించి మా వ్యక్తిగత జీవితాలకు ఎందుకు అప్రతిష్ట కలిగించాలని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు రాతలు రాసి చంద్రబాబు పార్టీకి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారా అని నిలదీశారు. 

విజయనగరం జిల్లా మంత్రి సుజయకృష్ణ రంగారావు అవాకులు.. చవాకులు పేలడం కాదు ముందు నీ వంశ గౌరవం కాపాడుకో అని బొత్స సత్యనారాయణ సూచించారు. తాండ్రపారాయుడు వంశ చరిత్ర అని చెప్పుకునే సుజయ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవి అనుభవిస్తుంటే అసలు ఆ వంశమేనా ఈయనది అనే అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎఫ్‌ఐఆర్‌లేని వారిల్లో నేను ఒకడినని, నా మీద ఏదైనా ఆరోపణలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాను కానీ చంద్రబాబులా స్టేలు తెచ్చుకోనన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా ఏదైనా తప్పు చేసి వుంటే చర్యలు తీసుకోండి. చర్యలు కూడా తీసుకోలేని చేతగాని దద్దమ్మలా అని ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉన్న సుజయకృష్ణ రంగారావు ఏదైనా మాట్లాడితే ఆ మాటకు విలువ ఉండాలని సూచించారు. 

రాష్ట్రపతికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ

శాసనసభకు హాజరు కాకూడదనే నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు  ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, అనైతికంగా మంత్రి పదవులను కట్టబెడుతున్న వైనాన్ని లేఖలో వివరిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగేందుకు ఈవిషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయిదు పేజీల ఈ లేఖలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రజా ధనం లూటీ జరుగుతున్న తీరును కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పార్టీ సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.