23 August 2015

బ‌ల‌వంతంగా భూసేక‌ర‌ణ త‌గ‌నిప‌ని : జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

రాజ‌ధాని కోసం బ‌ల‌వంతంగా భూముల్ని సేక‌రించ‌టం త‌గ‌ని ప‌ని అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఈ మేర‌కు సామాజిక వెబ్ సైట్ ట్విట‌ర్ లో ఆయ‌న ట్వీట్ చేశారు నిస్స‌హాయులైన రైతుల నుంచి ప్ర‌భుత్వం  బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌టాన్ని తాము గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి రాజ‌ధాని పేరుతో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి, తుళ్లూరు, అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు లాక్కోవ‌టం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచీ రైతుల ప‌క్షాన నిల‌బ‌డి పోరాడింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. ఈ ప్రాంతంలో రాజ‌ధాని పెట్టేందుకు తాము వ్య‌తిరేకం కాద‌ని, కానీ బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌టం త‌గ‌ని పని అని పార్టీ వాదిస్తూ వ‌చ్చింది. శుక్ర‌వారం నాడు మొద‌ట‌గా భూ స‌మీక‌ర‌ణ కు నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌రుణంలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఈ చ‌ర్యను వ్య‌తిరేకించారు. ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ప్ర‌భుత్వం నిరుపేద‌ల నుంచి భూముల్ని లాక్కోవ‌టం సిగ్గుచేటు అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జ‌ల ప‌క్షాన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ‌ర్నాలు

ఎల్లప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్షాన‌, ప్ర‌జ‌ల కోసం పోరాడే నాయకుడు వైఎస్ జ‌గ‌న్‌. ఈ నెల 25న‌, 26న ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌ర్నాలు చేప‌డుతున్నారు. కృష్ణాజిల్లా కొత్త మాజేరులో విష‌జ్వ‌రాలు ప్ర‌బ‌ల‌టంతో బాధ్య‌త‌గ‌ల ప్ర‌తిప‌క్ష నేత గా వైఎస్ జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించి వాస్త‌వాలు వెలికి తీశారు. విష జ్వ‌రాల‌తో జ‌నం చ‌నిపోతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవటంపై మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. దీనికి నిర‌స‌న‌గా కృష్ణా జిల్లా ముఖ్య‌కేంద్రం మ‌చిలీ ప‌ట్నంలో ఈ నెల 25న ధ‌ర్నా చేప‌ట్ట‌నున్నారు. మ‌రో వైపు భూ స‌మీక‌ర‌ణ పై రాజ‌ధానిరైతులు ఆందోళ‌న చెందుతున్నారు. బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌టంపై మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వమే రాక్ష‌సంగా చ‌ర్య‌ల‌కు దిగుతుండ‌టాన్ని నిర‌సిస్తున్నారు. బాధితుల ప‌క్షాన వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 26న ధ‌ర్నా చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే రైతుల‌కు వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుగా నిలిచి పోరాటాన్ని న‌డిపిస్తోంది.

12 August 2015

వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో బంద్ 29కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ తలపెట్టిన బంద్‌ను ఒకరోజు వాయిదా వేసినట్లు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఈనెల 28న బంద్ నిర్వహించాలని పిలుపునివ్వగా, అదేరోజు వరలక్ష్మి వ్రతం ఉందని, శ్రావణమాసంలో మహిళలు చాలా పవిత్రంగా భావించే ఈరోజున బంద్ పాటించడం భావ్యం కాదని, తర్వాతి రోజైన 29వ తేదీకి వాయిదా వేశామన్నారు. కాగా, వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాతో స్పెషల్ ప్యాకేజీలంటూ టీడీపీ నేతలు కొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు.  ప్యాకేజీలు టీడీపీ నేతలు పంచుకోడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, అందుకే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఆయన ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందన్నారు. 

10 August 2015

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?

 అరెస్టు, లాఠీచార్జీలపై జగన్ ఆవేదన
 ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని అడిగేందుకు వచ్చిన తమను అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యను నివేదిస్తూ శాంతియుతంగానే వ్యవహరించినా పార్లమెంటు వైపు తమను వెళ్లనీయలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని జగన్ అన్నారు.పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన దాదాపు 3 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివచ్చారని, శాంతియుతంగా తమ డిమాండ్‌ను వినిపిస్తున్నారని వివరించారు. శాంతిభద్రతల పేరుతోనూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని చెబుతూ తమ మార్చ్ ఫాస్ట్‌ను అడ్డుకున్నారని ఆయన చెప్పారు.  ఏ కార్యకర్తా గాయపడకుండా తాను స్వచ్ఛందంగా అరెస్టు అయ్యానని ఆయన ప్రకటించారు. పోలీసులు లాఠీచార్జి చేస్తే కార్యకర్తలు గాయపడతారని జగన్ అన్నారు. అందుకే ఏపీ నుంచి తరలి వచ్చిన ఏడుగురు ఎంపీలు, 66 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు.. అందరూ స్వచ్ఛందంగా అరెస్టయ్యారని జగన్ వివరించారు.

జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు

 పార్లమెంటు స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
 మార్చ్‌ఫాస్ట్‌ను అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జ్
 పార్లమెంటువైపు మార్చ్‌ఫాస్ట్‌గా కదలివెళుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వారిని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ బయట రోడ్డుపైనే జగన్ బైఠాయించారు. విచక్షణారహితంగా కొట్టడంతో కడప జిల్లాకు చెందిన రైతువిభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయమైంది. తాము శాంతియుతంగానే ముందుకు కదులుతున్నా పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని ప్రసాదరెడ్డి చెప్పారు. పక్కకు ఈడ్చేశారని, ఇష్టానుసారం లాఠీలతో కొట్టారని ఆయన మీడియాకు వివరించారు. అంతకుముందు జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పోలీసులు కార్యక్రమాన్ని విరమించాలని జగన్‌ను కోరారు. పార్లమెంటువైపు మార్చ్‌ఫాస్ట్ వద్దని జగన్‌కు సూచించారు. ఎలాగైనా పార్లమెంటువైపు మార్చ్‌ఫాస్ట్ జరపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు ఎలాగైనా వారిని అడ్డుకోవాలని ఢిల్లీ పోలీసుల యత్నం.. వెరసి పార్టీ కార్యకర్తలకు, ఢిల్లీ పోలీసులకు మద్య తోపులాటకు దారితీసింది. వైఎస్ జగన్‌ను ముందుకు కదలనీయకుండా పోలీసులు ఆయన చుట్టూ మోహరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కట్టడి చేశాయి. భారీ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన భద్రతా దళాలు... వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను నిలువరించాయి. దీంతో జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

వైఎస్‌ఆర్‌సీపీ ఢిల్లీ ధర్నా విజయవంతం

28న రాష్ర్ట వ్యాప్తంగా బంద్- అసెంబ్లీనీ స్తంభింపజేస్తాం
 ధర్నాలో పకటించినవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  
 ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గాను ఈ నెల 28వ తేదీన రాష్ర్టవ్యాప్త బంద్ పాటించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పినపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సవ్యవసాచుల వలె విచ్చేసిన ప్రతి అన్నకు, తమ్ముడికి, ప్రతి అక్కకు చెల్లెలికి, ప్రతి అవ్వకు తాతకు శిరసు వంచి చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్ ప్రసంగం ప్రారంభించగానే శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశంపై మనకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలిపేందుకు ఢిల్లీ వీధుల్లో మన స్వరం వినిపించేందుకు వచ్చామని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని విభజించిన రోజే చెప్పాం. రాష్ట్రాన్ని విడగొట్టకండి అని మొత్తుకుని చెప్పాం.. 19 నెలల క్రితం రాష్ర్ట విభజనను 60శాతం మంది ప్రజలు ఒప్పుకోకపోయినా నిరంకుశంగా విభజించారు. విభజన బిల్లును వ్యతిరేకించినందుకు మమ్మల్ని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు..’’ అని జగన్ వివరించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి, పార్లమెంటు డోర్లు మూసి, లైట్లు బంద్ చేసి, మైక్‌లు, లైవ్ టెలికాస్ట్ కట్‌చేసి మరీ నాడు రాష్ర్ట పునర్విభజన బిల్లును ఆమోదింపజేశారని వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలని అందరి కంటే ముందుగా తామే లేఖ ఇచ్చామని, రాష్ర్ట విభజన జరగాలని కోరుకున్నామని.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చెబుతోందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా స్వార్థంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆక్షేపించారు. 

 ప్రత్యేకహోదా ఎందుకంటే..
 మనఖర్మ ఏమిటంటే ప్రత్యేక హోదా అంటే కూడా ఏమిటో చాలా మంది నాయకులకు తెలియడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వల్ల రెండు రకాల మేళ్లు జరుగుతాయని వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రా్నకి ప్రత్యేక గ్రాంట్లు వస్తాయని, 90శాతం గ్రాంటు, 10శాతం మాత్రమే రునం అవుతుందని వివరించారు. రాష్ట్రానికి ఊరికే డబ్బిస్తారు కాబట్టి రాష్ర్టం బాగుపడే అవకాశం ఉంటుందని, అదే ప్రత్యేక హోదా లేని రాష్ర్టం అయితే గ్రాంటు కేవలం 30శాతం మాత్రమే ఉంటుందని, మిగిలినదంతా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తారని, ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ టాక్స్, ఆదాయపు పన్ను లేకుండా పరిశ్రమలు పెట్టవచ్చని జగన్ తెలిపారు. అలా అయితేనే ఉత్సాహవంతులు ముందుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పుతారని, దాంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని జగన్ పేర్కొన్నారు. వాటి వల్ల రాష్ర్టం అంతా బాగుపడే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు.

 14వ ఆర్థికసంఘానికి ఆ అధికారం లేదు
 14వ ఆర్థిక సంఘం నివేదిక వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని జగన్ విమర్శించారు. నిజానికి ఓ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా అనే విషయం చెప్పడానికి ఆర్థిక సంఘానికి ఏ మాత్రం అధికారం, హక్కు లేవని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను చదివి వినిపించారు. రాష్ట్రాలకు రుణాలకు సంబంధించి మాత్రమే ఫైనాన్స్ కమిషన్ ప్రమేయం ఉంటుందని వివరించారు. అది కాక ప్లాన్ లోటు గురించి గానీ, ప్లాన్ గ్రాంటు గురించి కానీ ఎలాంటి కేటాయింపు చేసే అధికారం ఫైనాన్స్ కమిషన్‌కు ఉండదని జగన్ వివరించారు. నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌డీసీ)కి మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చే లేదా ఇవ్వకపోయే అధికారం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

 చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు?
 రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని కోరామని, అయినా బాబు స్పందించలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుదామని అడిగినా చంద్రబాబు స్పందించలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని తెలిసినా.. కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. మంగళగిరిలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశామని, ప్రత్యేక హోదా రాదని, ఇక ఉద్యోగాలు రావన్న ఆవేదనతో మునికోటి అనే వ్యక్తి ఆత్మార్పణ చేశాడని జగన్ వివరించారు. 65మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది ప్రజలు అందరూ ఇక్కడకు వచ్చి ధర్నా చేస్తున్నారని, ఇంతమంది ఆవేదన మీకు అర్ధం కావడం లేదా చంద్రబాబూ అని జగన్ ప్రశ్నించారు.

 ఓటుకు కోట్లు కేసు నుంచి బైటపడేందుకే...
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఐదు కోట్ల రూపాయల ఆఫర్‌తో అడ్డంగా దొరికి పోయి.. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి బైటపడేందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని జగన్ అన్నారు. అలా తన స్వార్థం కోసం రాష్ర్త ప్రయోజనాలనే తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఓటుకు కోట్లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వీడియో, ఆడియో టేపులున్నాయని, డబ్బిస్తూ సాక్ష్యాలతో సహా పట్టుబడిన కేసులో చంద్రబాబును ఈ రోజు వరకు ఎందుకు అరెస్టు చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను మాత్రమే కాదని, బిజినెస్‌లైన్ అనే జాతీయ పత్రిక స్వయంగా అడిగిందని ఆ పత్రిక క్లిప్పింగ్‌ను జగన్ చూపించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం విచారణ జరగకుండా చూసుకునేందుకు రాష్ట్రాన్నే ఫణంగా పెట్టారని బిజినెస్‌లైన్ చెప్పిందని జగన్ వివరించారు.

 పోలవరంపై కేంద్రం గడ్డిపెట్టినా బుద్ధిరాలేదా..?
 గోదావరి ఎప్పుడు పొంగినా పోలవరం ప్రాజెక్టుతో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ నీళ్లతో రాష్ర్టమంతా బాగుపడే అవకాశం ఉంటుందని జగన్ వివరించారు. కానీ చంద్రబాబు లంచాలు, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారని జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ తప్ప ఏమీ జరగడం లేదని, పదేపదే దీని గురించి  ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని చంద్రబాబుకు కేంద్రం గడ్డిపెడుతూ లేఖ రాసిందని జగన్ తెలిపారు. ఎడమకాలువలో కూడా కాంట్రాక్టర్ పనులు చేయట్లేదని కేంద్రం రాసిందని, కానీ చంద్రబాబు ఇదే కాంట్రాక్టరుకు రు.290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజె క్టు మీద నువ్వు చూపిస్తున్న శ్రద్ధ ఏంటి.. కాంట్రాక్టరు బాగోలేదని ఈరోజు గుర్తుకొచ్చిందా.. అడ్వాన్సు ఇచ్చేటపుడు గుర్తురాలేదా.. అని చంద్రబాబును జగన్ నిలదీశారు. కాంట్రాక్టులు చేసేది రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన సంస్థ కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మరింత దోపిడీ జరుగుతోందని జగన్ విమర్శించారు.

 28న రాష్ర్ట బంద్
 ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, ఇకముందు మరింత ఉధృతం చేస్తామని జగన్ ప్రకటించారు. ఈనెల 28న రాష్ర్ట బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో చంద్రబాబును నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు మీడ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికే అసెంబ్లీ జరగడానికి మూడు రోజుల ముందు 28 వ తేదీన రాష్ర్టవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నామని జగన్ చెప్పారు. మధ్యాహ్నం సరిగ్గా 3.35 గంటలకు వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలసి ఆయన పార్లమెంటుకు మార్చ్‌ఫాస్ట్ చేపట్టారు. 

4 August 2015

జనం చచ్చిపోతున్నాసర్కారు మొద్దు నిద్ర

విషజ్వరాల మరణాలపై నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
కొత్తమాజేరులో బాధిత కుటుంబాలకు పరామర్శ


కృష్ణాజిల్లా కొత్త మాజేరు గ్రామంలో జనం విషజ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా ఆ గ్రామంలో 18 మంది మరకు మరణించారని, అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆయన విమర్శించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో వరుసగా సంభవిస్తున్న మరణాలపై స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రామంలో మంగళవారం మద్యాహ్నం పర్యటించారు. నాలుగురోజుల వ్యవధిలో ఐదుగురు మరణించినా కూడా ఆరోగ్యశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రికానీ ఇక్కడకు రాలేదని, వాళ్లే వచ్చి ఉంటే పరిస్థితి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే ఇంతమంది మరణించేవారు కాదని జగన్ అన్నారు. గ్రామంలో డాక్టర్లున్నా, వాళ్లు మందులు ఇస్తున్నా కూడా జ్వరాలు తగ్గక ఆ జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మే 11న గ్రామంలో మొట్టమొదటి మరణం సంభవించింది. అప్పటి నుంచి వెంటవెంటనే ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 18 మంది మరణించారు.. కానీ ఇక్కడ ప్రజలు మరణిస్తుండడానికి కారణమేంటని ఎవరూ పట్టించుకోలేదు’’ అని జగన్ పేర్కొన్నారు. గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్యశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అక్కడకు వచ్చి పరిస్థితి విచారించలేదని జగన్ పేర్కొన్నారు. వాళ్లు వచ్చి ఉంటే పరిస్థితి తీవ్రత తెలిసి ఉండేదని, వెంటనే వైద్య శిబిరాలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంత మంది మరణించేవారు కాదని జగన్ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం ఇచ్చే మందులు పనిచేయట్లేదని, కేవలం జ్వరాలతోనే మనుషులు చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు పట్టకపోవడం దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు. అధికారులు అస్సలు పట్టించుకోలేదని, ఎమ్మార్వోను నిలదీసినా ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు జగన్‌కు వివరించారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్లు స్థానికుడొకరు జగన్‌కు తెలిపారు. చర్యలు తీసుకోవలసిందిగా చెబుతానన్నారని, ఎమ్మార్వో మాత్రం కంటి తుడుపు చర్యగా ఒక ఏఎన్‌ఎంని సస్పెండ్ చేశారు తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అతను వివరించాడు. ఇంత జరుగుతున్నాన ఏ మంత్రీ తమ గ్రామానికి రాలేదని, తమ గోడు పట్టించుకునేవారే లేరని స్థానికులు వివరించారు. స్థానిక ఎమ్మార్వో అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని వారు జగన్‌కు ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లాలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు చ‌క్క‌టి స్పంద‌న‌

కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ కు ఆత్మీయ స్వాగ‌తం లభించింది. హైద‌రాబాద్ నుంచి ఈ ఉద‌యం విమానంలో బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకొన్నారు. అక్క‌డ నుంచి రోడ్ మార్గంలో కొత్త మాజేరుకి బ‌య‌లు దేరారు. మొద‌ట‌గా వ‌ల్లూరు పాలెంలో ఆయ‌న‌కు స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆత్మీయ స్వాగతం ప‌లికారు.కొత్త మాజేరు లో రెండున్న‌ర నెల‌ల నుంచి అంతు చిక్క‌ని విష .జ్వ‌రం పీడిస్తోంది. ఈ రెండు న్న‌ర నెల‌ల్లోనే 18 మంది మృత్యు వాత ప‌డ్డారంటే దీని విస్తృతిని అర్థం చేసుకోవ‌చ్చు. రెండు వేల జ‌నాభా క‌లిగిన ఈ గ్రామంలో ప్ర‌తీ రెండు ఇళ్ల‌కు ఒక‌రు చొప్పున ఈ జ్వ‌రంతో బాధ ప‌డుతున్నారు. ఈ ఊరికి ప్ర‌ధానంగా ఒక చెరువు, దీని ఆధారంగా ఏర్పాటు చేసిన వాట‌ర్ ప్లాంట్ మాత్ర‌మే తాగునీటి అవ‌స‌రాలు తీరుస్తున్నాయి. ఈ చెరువు లో నీరు క‌లుషితం కావటంతో అదే క‌లుషిత నీటిని అర‌కొర గా శుభ్ర‌ప‌ర‌చి ఊరంతా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.ఊర్లో విష‌జ్వ‌రాలు ప్ర‌బ‌లాయి అని తెలిసిన వెంట‌నే వైఎస్సార్‌సీపీ నాయకులు బృందాలుగా రెండు సార్లు అక్క‌డ ప‌ర్య‌టించారు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను మండ‌ల అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అయిన‌ప్పటికీ ఫ‌లితం లేదు. తూతూ మంత్రంగా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. విషయ తీవ్ర‌త‌ను గుర్తించిన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించారు. 

1 August 2015

Releasing anti-ragging poster


YSRCP President Sri YS jagan Mohan Reddy releasing anti-ragging poster

గుండెల్లో కొలువైన నాయ‌కుడు వైఎస్సార్‌

అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్ర‌ప‌టాన్ని తొల‌గించ‌టంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర నిర‌స‌న తెలిపింది. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీకి వెళ్లి స్పీక‌ర్ ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించింది. స్పీక‌ర్ అందుబాటులో లేక‌పోవ‌టంతో అసెంబ్లీ కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ ను క‌లిసింది. స్పీక‌ర్ కు విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని కోరుతూ కార్య‌ద‌ర్శి చేతికి ఒక విన‌తి ప‌త్రాన్ని అంద చేశారు. అసెంబ్లీ లాంజ్ లో తొల‌గించిన దివంగ‌త మ‌హా నేత వైఎస్సార్ చిత్ర ప‌టాన్ని త‌క్ష‌ణ‌మే ఏర్పాటు చేయాల‌ని ఆ విన‌తి ప‌త్రంలో పేర్కొన్నారు.  ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మ‌న‌స్సులోని ఆవేద‌న‌ను బ‌య‌ట పెట్టారు.  వైఎస్సార్ ఫోటో ను ఎందుకు తొల‌గించార‌ని ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు. దీనికి బ‌దులిస్తూ స్పీక‌ర్ అనుమ‌తితోనే ఫోటోను తొల‌గించామ‌ని కార్య‌ద‌ర్శి చెప్పారు. దీనిపై ఎమ్మెల్యేలు అభ్యంత‌రం తెలియ చేస్తూ అక్క‌డ బైఠాయించారు. అసెంబ్లీ స‌మావేశాల లోపు ఫోటోను ఏర్పాటు చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. దీంతో స్పీక‌ర్ రాగానే చ‌ర్చించి, వైఎస్సార్ ఫోటోను ఏర్పాటు చేస్తామ‌ని కార్య‌ద‌ర్శి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ నాయ‌కులు ధ‌ర్నాను విర‌మించారు.