21 February 2018

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీ

 
ప్రత్యేక హోదా సాధనకు విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదాతోనే ప్రజలకు మేలు కలుగుతుందని, చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖకు రైల్వేజోన్‌ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. 
 

మద్యం షాపు తీయించాలని విజ్ఞప్తి

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మాలపాడులో వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు కలిశారు. గ్రామంలో మద్యం షాపును తీయించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపును వ్యతిరేకిస్తే తమపై కేసులు పెట్టారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్సీ అధ్యాయన కమిటీ సమావేశం ప్రారంభం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ అధ్యాయన కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో అధ్యాయన కమిటీ సభ్యులు దళితుల సమస్యలు, కార్యాచరణపై చర్చిస్తున్నారు. 

రైతుల‌ను ఆదుకుంటాం

- ప్ర‌తి ఏటా రైతుల ఖాతాల్లో రూ.12,500
-  ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ 
ఒంగోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం ప్ర‌కాశం జిల్లా లింగంగుంట వ‌ద్ద రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌ని, సాగునీరు అంద‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు భ‌రోసా క‌ల్పించారు. పంటలు చేతికందక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టిడిపి ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, చంద్రబాబునాయుడు రైతు ద్రోహి అని విమర్శించారు. అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల ప్రస్తావన వస్తే వాటిపై స్పందించాల్సింది పోయి అపహాస్యం చేస్తూ మాట్లాడారన్నారు. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.  రైతులకు సాగు నీరు అందటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అందుకే ప్రాజెక్టుల విషయంలో అనవసర గందరగోళాన్ని సృష్టించి జాప్యం చేస్తున్నారని చెప్పారు.  మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారం లోకొస్తే పంటల సాగుకు ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కోసం ప్రతి రైతు ఖాతాలో రూ.12,500 నగదును జమ చేస్తామని హామీ ఇచ్చారు. మండల స్థాయిలో కోల్డ్‌స్టోరేజీ గోడౌన్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతుకు గిట్టుబాటు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికలతో రూ.3 వేల కోట్లు మార్కెట్‌ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపేందకు కేంద్రం సాయంతో రూ.4 వేల కోట్ల పరిహారనిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు.  వైయ‌స్ జ‌గ‌న్ హామీతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

వర్షాలు లేక భూములు బీడుగా మారాయి

 ‘కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో 600 ఎకరాలు మాగాణి భూమికి సాగునీటి సౌకర్యం లేక.. గత ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక భూములు బీడుగా మారాయి. సోమశీల ప్రాజెక్ట్‌ నుంచి వచ్చే సాగు నీళ్లు కావలి వరకు మాత్రమే వస్తాయి. ఈ కాలువను పొడిగించి అదనంగా కాలువ నిర్మాణం చేయడం ద్వారా మాగ్రామానికి సాగునీరు అందుతుంది. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అంటూ రైతులు  వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు.

చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి

 భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి కి  వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్షం తరపున పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన, రాజేంద్రనాథ్, ఆదిములపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ , దెందులూరు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ కోటారి రామచంద్రరావులు అసెంబ్లీ కార్య‌ద‌ర్శిని క‌లిశారు.

బాబును ప‌వ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు?

ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు నాలుగేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌ని నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను నిల‌దీశారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నాడు ప్ర‌శ్నిస్తాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు బాబుకు ప్ర‌శ్నించ‌కుండా ఎందుకు నోరు మూసుకున్నార‌న్నారు. కేంద్రం నిధుల‌లో ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై చంద్ర‌బాబు రోజుకో విధంగా లీకులు ఇచ్చి డ్రామాలు ఆడుతున్నార‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముందు పెట్టి డ్రామాలు ఆడ‌డం మానుకోవాల‌ని బాబుకు హిత‌వు ప‌లికారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు.