29 December 2018

ఏపీ హైకోర్టు గురించి బాబు గుబులు ఇందుకేనా? http://bit.ly/2CE7vHB

హైకోర్టు విభజన జరిగిపోతోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సుప్రీం నుంచి సవ్యమైన మార్గదర్శకాలు కూడా వచ్చేసాయి. తెలంగాణా నుంచి అన్ని వ్యవస్థలూ విడిపడి ఏపీకి తరలిన నేపధ్యంలో కోర్టు మాత్రం ఉమ్మడిగానే ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. ఓ పక్క తెలంగాణా న్యాయవాదులు కోర్టు విభజన జరగాల్సిందే అంటూ పట్టు పట్టారు. ఇక ఓటుకు నోటు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2CE7vHB
via IFTTT December 29, 2018 at 11:29PM

16 comments:

 1. "Jan 1st Even High Court also in our proud Amaravati" అన్న పచ్చ బాకా ఉవ్వాచకు మూ-తోడ్ జవాబు ఇదిగో:

  రేపు అనగా జనవరి 1, 2019 శుభదినాన అన్ని ఆధునిక హంగులతో ICJ Hague తలదన్నే (ఎటువంటి లీకులు లేని) ఉన్నత న్యాయస్థానం ఆవిష్కరణకు ఇవే మా "ముందస్తు" అభినందనలు.

  ఏమంటివి ఏమంటివి? భవనం ఇంకా తయారు కాలేదా? కాంప్ ఆఫీసే "తాత్కాలిక తాత్కాలిక" కోర్టా?

  ఫరవాలేదు చింత వలదు సుయోధనా. ఇది ఖచ్చితంగా మోడీ జగన్ కెసిఆర్ పవన్ రాంగోపాల్ వర్మ వగైరాల కుట్రే.

  మన వాళ్ళను అందరినీ "బ్రీఫ్" చేద్దాం. మనం రాజ్యసభకు పంపిన "లయర్ల"తో హడావుడి పెట్టిద్దాం. మురికి కాలువ శ్రీనివాసులు లాంటి వంధిమాగధులతో స్టేట్మెంట్లు ఇప్పిద్దాం. చా"కిరాయి"రేవు వంటి సైటులలో హంగామా చేద్దాం. వేమూరి & రామోజీ తదితర ఎల్లో చానెళ్లలో ఊదరగొడదాం. ఇంకా కావాలంటే సరికొత్త గ్రాఫిక్స్ వైరల్ చేసేద్దాం.

  ReplyDelete
 2. జై గారూ,
  ఆంధ్రుల పట్ల మీలో వెటకారం ఓ పాలు ఎక్కువే అని పలుమార్లు బయటపడుతోంది సుమండీ. ఎందుకండీ అంత ద్వేషం?

  అన్నట్లు, పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మొన్న నానా మాటలు అంటూ తెలంగాణా రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గారు “ ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు, ప్రజలను అయోమయానికి గురి చేయడానికా?” అన్నారని నిన్నటి ఒక వార్తాపత్రికలో వచ్చింది.

  https://m.sakshi.com/news/politics/kcr-fires-chandrababu-naidu-1148269
  (“రెండు బాకా పేపర్లు” అన్న హెడ్డింగు క్రింద చూడండి)

  మరి అదే లాజిక్ పొడిగిస్తే దేశంలోని ఇతర ప్రాంతాల వార్తలు, ఇతర దేశాల వార్తలు మాత్రం తెలంగాణాలో ఎందుకు? రివర్స్ లో అనాలంటే తెలంగాణ వార్తలు ఆంధ్రాలో ఎందుకు .... అసలు తెలంగాణా వారికి ఆంధ్రుల ఊసెందుకు అని ఎవరైనా నిలదియ్యచ్చుగా? మీ వాక్స్వాతంత్ర్యం మీకుంది గానీ, పైన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారన్న మాటల context లో మీ లాంటి వారికీ అదే ప్రశ్న అని కూడా అనచ్చేమో .... అహ, మాటవరసకి?

  Happy New Year.

  ReplyDelete
  Replies
  1. విన్నకోటవారు, జై గారికి ఆంధ్రులు పచ్చగా ఉండటం నచ్చదండీ! పోనివ్వండి. ఆయన మేధావి వర్గానికి చెందినవారు కాబట్టి గణాంకాలతో సహా ఆంద్రులకు బ్రతికేహక్కు కూడా లేదని నిరూపించటానికి యత్నించగలరు. ప్రక్కగీతను చిన్నది చేయటం ద్వారా తమగీత పెద్దదిగా కనబడేటట్లు చేయాలని భావించేవారితో వాదనలెందుకు చెప్పండి.

   Delete
  2. @విన్నకోట నరసింహా రావు:

   మీ ఉద్దేశ్యంలో చంద్రబాబు & ఆయన భజన పరులు మాత్రమే ఆంధ్రులా? వారిని విమర్శిస్తే ఆంధ్ర ద్వేషమా?

   చంద్రబాబు వ్యాఖ్యలన్నిటికీ నేను మిమ్మల్ని సంజాయిషీ అడగలేదు మరి మీరెందుకు నన్ను కెసిఆర్ మాటల గురించి అడుగుతున్నారు? Just మాటవరసకి..

   @శ్యామలీయం:

   సీనియర్ మోస్ట్ అని డబ్బా కొట్టుకునే ఆయనేదో తన రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా/మోడీ/కెసిఆర్/జగన్/రాంగోపాల్ వర్మ వగైరాలు (సమయసంధర్భాన్ని బట్టి పేర్లు మారుస్తూ) ఆంధ్రను నాశనం చేస్తారని చెప్తున్నాడు. మనమూ నమ్మేయడమే?

   జగన్ అనే పెద్ద గీత ఉంది, కొన్ని రోజులు ఓపిక పడదాం.

   Delete
  3. @ gottimukkala gaarU,

   >>>>జగన్ అనే పెద్ద గీత ఉంది, కొన్ని రోజులు ఓపిక పడదాం.>>>>

   అబ్బా...మీకెందుకండీ అంత అసహనం ? జగన్ గారు గెలుస్తారని మళ్ళీ లక్ష కోట్లు దోచుకోవాలని మీకెందుకంత ఉబలాటం ? తెలంగాణాలో ఉన్నాను కాబట్టి కేసీఆర్ గెలుస్తాడని చెప్పాను. సరి అయిన నాయకత్వం లేని కాంగ్రెస్ గెలవాలని నేను కోరుకోలేదు. ఆంధ్రాలో జగన్ ని గానీ పవన్ ని గానీ ఎందుకు గెలిపించాలో చెప్పండి ముందు.

   Delete
 3. శ్యామల రావు గారు మీ అభిప్రాయాలను మార్చుకోమని నేను ఒత్తిడి చేయను గానండి దయచేసి ఈ క్రింది వీడియో చూడండి. ఉండవల్లి గారు చెప్పేవి అబద్దాలయితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చెయ్యరు? చిన్న చిన్న పిల్లల్ని సోషల్ మీడియా లో పెడుతున్న చిన్న చిన్న పోస్ట్ లకు , లైక్ లకు కేసు లు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇంతింత పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్న ఉండవల్లి ని బొక్కలో వేసి ఎందుకు కుమ్మడం లేదు? మీరు చాలా విషయ జ్ఞానమున్న వారు కదా, ఉండవల్లి గార్ని కూడా కృష్ణారావు గారితోనే తెలివి తక్కువ వాడిగా లెక్కేస్తారా?
  ఆయన చేస్తున్నవి యెంత దారుణమైన ఆరోపణలు? అరెరే ఒక్కరైనా ప్రభుత్వం తరుపున ఒక్కసారి కూడా ఆయన ఛాలెంజ్ ను ఆక్సిప్ట్ చెయ్యరు? మీలాంటి మేధావులు ఇలాంటివన్నీ చూడనట్లుగా ప్రక్కచూపు చూస్తూ వదిలెయ్యడం ఏ మాత్త్రం కరెక్ట్అంటారూ? మీకెలా చంద్రబాబు గారు చుట్టం కాదో, మాకు కూడా ఇతరులు చుట్టం కాదు, కాకబోతే మంచిని మంచిగా చెడును చెడుగా చూడకపోవడమన్నది కూడా తప్పును సమర్ధించడమే అవుతుందండి.
  నేను మిమ్మల్నిలా అడగడమన్నది గొట్టిముక్కల వారన్న ప్రతి మాటను సమర్ధించడం క్రింద రాదనీ గమనించుకోగోరుతాను.

  https://www.youtube.com/watch?v=beRKLVbFHjQ

  https://www.youtube.com/watch?v=u1indDHLV_0

  ReplyDelete
  Replies
  1. https://www.youtube.com/watch?v=R4wySHl7l9U

   Delete
  2. చంద్రబాబు గారు చెప్పిన దేశంలో మొట్ట మొదటిసారి రాఫ్ట్ టెక్నాలజీ గురించి బొంకిన విష్యం ఇక్కడ చూడండి :-

   https://www.youtube.com/watch?v=TQXU7_oUgms

   Delete
  3. రమణ దీక్షితులు, ఉండవల్లి, IVR, తాజాగా EAS: ఇదేదో కొత్త ట్రెండ్ అనుకుంటా.

   Delete
 4. >>>ఆయన చేస్తున్నవి యెంత దారుణమైన ఆరోపణలు? అరెరే ఒక్కరైనా ప్రభుత్వం తరుపున ఒక్కసారి కూడా ఆయన ఛాలెంజ్ ను ఆక్సిప్ట్ చెయ్యరు?>>>

  బోడి చాలెంజ్ లు సుబ్రహ్మణ్యస్వామి కూడా చేస్తుంటాడు. ఆయనే నిజాలు నిరూపించవచ్చు, జగన్ అన్న సాయమో, గొట్టిముక్కల సాయమో తీసుకోవచ్చు కూడానూ... ఎవరైనా లెక్కచేసేవాళ్ళుంటే నేనూ చేస్తా చాలెంజ్...నిలువు గీతలూ, అడ్డగీతలూ గీసినవాళ్ళు బాగుపడినట్లు నేను చూడలేదు. మనకి బాగుపడే యోగం యాగం చేసినా రానపుడు ఎందుకండీ అనవసర వృధా ప్రయాస ?

  ReplyDelete
  Replies
  1. నిహారిక గారు అయితే మీరనే మాట ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా గానీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాల్సిన అవసరం, జవాబివ్వాల్సిన బాధ్యత లేదంటారు, అంతేగా? చేసే పనిలో తప్పుంటే ఎట్టి చూపగూడదంటారు? గొట్టిముక్కల గారన్నట్లుగా చంద్రబాబు గార్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరు ఆంధ్రాకు వ్యతిరేకులే అంటారయితే! అసలు ఇలాంటి మైండ్సెట్ ఏమిటో అర్ధం కావడంలేదు! మీకు కావాల్సింది రాష్ట్ర సంక్షేమమో లేక చంద్రబాబు గారి సంక్షేమమో అర్ధం కావడం లేదు! చూద్దాం శ్యామలరావు గారు కూడా మీ అభిప్రాయాన్నే సమర్ధిస్తారేమో?

   Delete
  2. @ Anonymous,

   చంద్రబాబు గారి గురించి పట్టించుకోవడం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నిక కావాలి అనేవి రెండూ వేర్వేరు విషయాలు. రెండిటినీ కలిపి చూస్తే మీకు కన్‌ఫ్యూజన్ గా ఉంటుంది. అవినీతి విషయం చూస్తే ఏ రాజకీయ నాయకుడూ పనికిరాడు. అవినీతిని పట్టించుకోవద్దా అని మీరు అడగవచ్చు. అవినీతి గురించి పట్టించుకోవాలంటే ఉండవల్లి సరిపోడు. ఒక అపరిచితుడో, ఒక ఠాగూరో రాజకీయాల్లోకి రావాలి.

   మీరేమో ఉండవల్లి గారి మాటలు పట్టించుకోమంటారు. గొట్టిముక్కల గారేమో చంద్రబాబు గారిని పట్టించుకోవద్దని అంటారు. నేనేమో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలో తేల్చమంటున్నాను.

   కేసీఆర్ ఫాం హౌస్ లో కోట్లు దాచాడని అంటున్నారు. కవితక్కేమో అద్దె ఇంట్లో ఉంటున్నాను అని స్టేట్మెంట్లు ఇస్తా ఉండాది. ఎవురిది కరెక్టు? ఎవురు నీతిమంతులో ఎట్లా తేల్చేది ? గొట్టిముక్కల కూడా తేల్చలేకే గమ్మున ఉండ్లా ?

   Delete
 5. “గొట్టిముక్కల సాయమో తీసుకోవచ్చు కూడానూ”

  భలే అన్నారు నీహారిక గారు. గొట్టిముక్కల ఆనందంగా సాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

  ReplyDelete
 6. Everybody counted

  ReplyDelete
 7. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి కేసు NIAకు మార్పిడి. అసమదీయుల మద్దతుతో మానేజ్ చేద్దామనుకున్న కుట్ర భగ్నం చేసిన హైకోర్టు!

  https://www.sakshi.com/news/andhra-pradesh/ap-high-court-transfers-murder-attempt-ys-jagan-case-nia%C2%A0-1149607

  ReplyDelete