30 September 2016

టీడీపీ సర్కార్ పై ప్రజాగ్రహం

నందికొట్కూరు)))టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా హామీలిచ్చిందని, అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. గడపగడపకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమంలో భాగంగా బానకచెర్ల, బానుముక్కల గ్రామాల్లో పర్యటించారు. పింఛన్‌, రేషన్‌ సక్రమంగా ఇవ్వడం లేదు, పక్కా గృహాల ఊసేలేదు అని ప్రజలు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు.  మోసపూరిత చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఐజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. 
కర్నూలు)))ప్రభుత్వం బంగారు వ్యాపారుల సమస్యలపై దృష్టి సారించాలని వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పాత బస్టాండు సమీపంలోని వెంకటాచలపతి షరాఫ్‌ బజారులో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులకు ప్రజా బ్యాలెట్‌ పత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు పి.జి. నరసింహులు యాదవ్‌ వాటిని పూరించే విధానాన్ని వివరించారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌ విధింపుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బంగారు వ్యాపారులు హఫీజ్‌ఖాన్‌కు విన్నవించుకున్నారు. 
పత్తికొండ)) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను నట్టేట ముంచారని, రుణమాఫీ అంటూ మోసగించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని అల్లుగుండు గ్రామంలో వైయస్‌ఆర్‌ సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమానికి మహిళలు, రైతుల నుంచి విశేష సందన లభించింది. నారాయణరెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

టీడీపీలో గుర్తింపు లేదు

  • అందుకే వైయస్సార్సీపీకి ఓటేశా
  • ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు
  • వైయస్సార్సీపీ గెలుపునకు కృషి చేస్తా

పెడనటౌన్ (ఈడేపల్లి) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని అందుకే తాను వైయస్సార్ సీపీకి ఓటు వేశానని పెడన మున్సిపల్ కౌన్సిలర్(15వ వార్డు) లంకే స్రవంతి వెల్లడించారు. ఓటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ నేటికీ తనకు కౌన్సిలర్ గా గుర్తింపు లేదన్నారు. వార్డు సమస్యలను మున్సిపల్ చైర్మన్, అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 

తన ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కోసం కార్యాలయం చుట్టూ ఆరునెలలపాటు  ప్రదక్షిణలు చేశానని చెప్పారు. తన వార్డులో ఒక్క అభివృద్ధి పని చేయలేదని, నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. మరి కొన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అందువల్లనే తాను టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలుపలేదన్నారు. వైయస్సార్ సీపీకి పట్టంకడితేనే పూర్తిస్థాయిలో పట్టణాభివృద్ధి జరుగుతుందని  తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మినహా అసలు పెడనలో కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైయస్సార్ సీపీని గెలిపించడానికి కృషిచేస్తానని తెలిపారు. అయితే.. తాను అమ్ముడుపోయానని టీడీపీ కౌన్సిలర్‌లు దుష్ర్పచారాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే వాటిని నిరూపించాలని టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. పెడన మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ పీఠాలను వైయస్సార్సీపీ కైవసం చేసుకున్న తెలిసిందే. 

మోసగిస్తే దుర్మార్గులు అనక మరేమంటారు..?

  • దేవతా ముఖ్యమంత్రి అంటారా..?
  • వ్యవసాయం శుద్ధ దండగ అనే క్యారెక్టర్‌ బాబుది
  • ప్రతిపక్షనేత వస్తున్నాడనే బాబు హెలికాఫ్టర్‌ పర్యటన
  • వైయస్సార్సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ 
గుంటూరు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని వ్యక్తిని దుర్మార్గపు ముఖ్యమంత్రి అనక దేవతా ముఖ్యమంత్రి అంటారా? అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఏమని సంబోధించాలో చెప్పాలని టీడీపీ నేతలను నిలదీశారు. గుంటూరు జిల్లా కాకమాను మండలంలో వరద ముంపు ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది రోజులుగా అధిక వర్షాలతో తీవ్రమైన పంట, ఆస్తినష్టం వాటిల్లిందన్నారు. వరద కారణంగా మరణాలు కూడా సంభవించాయని గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నష్టం జరగిందన్నారు. వర్షాభావ ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలను, రైతులను వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి పరామర్శించారని చెప్పారు. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారన్నారు. 

అత్యధిక వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పలు సార్లు హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత చెప్పేంత వరకు రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రకటించిన తరువాత బాబు హడావిడిగా హెలికాఫ్టర్‌ ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారన్నారు. నష్టపడి రైతులను, ప్రజలను పట్టించుకోకుండా రాజకీయ ఆలోచనలతోనే ఉన్నారన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్‌ల సదస్సులో వరద నష్టం గురించి చంద్రబాబు చర్చించకపోవడం దారుణమన్నారు. వర్షాలతో గుంటూరు జిల్లా ఎంతో నష్టపోయిందని, ఆ నష్టాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కరువులో బాబు గొప్పలు
రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే జీడీపీ 12 శాతం పెరిగిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బొత్స విమర్శించారు. గొప్పలు ఎనైనా చెప్పుకోండి కానీ రైతుల నడ్డి విర్చోద్దని ప్రభుత్వానికి సూచించారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కంటే మించిన రుణాలు ఇవ్వోద్దని బ్యాంకర్స్‌మీటింగ్‌లో చెప్పి ఇప్పుడు బ్యాంక్‌లు రుణాలు ఇవ్వడం లేదని బాబు మాట్లాడడం సమంజసమా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులు రుణాలెలా ఇస్తారని నిలదీశారు. వాగులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఉపాధి హామీ పథకం కింద ఇసుక మేటల పనిని వినియోగించుకోవాలని కోరారు. స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి పంట, ఆస్తి నష్టాలను అంచెనా వేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష మాటలపై వాస్తవాలను తెలుసుకోకుండా ఎదురుదాడి చేసి పబ్బం గడుపుకోవడం మానేయాలని బాబుకు సూచించారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వ్యవసాయం అంటే శుద్ద దండగ అని మనస్సులో బలంగా నాటుకుపోయిందన్నారు. అదే విధంగా ఆయన పాలన కొనసాగుతుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా చేసుకోవాలని పదే పదే చెప్పే చంద్రబాబు రైతుల ఇన్‌పుట్‌ సబ్సీడీ, నష్ట పరిహారాన్ని అవినీతికి ఆసరాగా చేసుకోవద్దని హితవు పలికారు. 

బాబు ఎందుకు పోరాడరు

కర్నూలు: కాంగ్రెస్, బీజేపీ వేసిన ప్ర‌త్యేక హోదా విత్త‌నాన్ని పెంచిపోషించిన చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఎటువంటి లాభం లేద‌న‌డం అన్యాయమని వైయస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి తీర‌ని న‌ష్టం జ‌రిగిన వాస్త‌వం ....అన్ని పార్టీలు, వ‌ర్గాల‌కు తెలుస‌ని చెప్పారు.  ఆర్థికంగా ఎటువంటి బ‌లం లేకున్న‌ా, ఏపీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించాయ‌ని బుట్టా రేణుక మండిపడ్డారు. చైత‌న్య‌ప‌థం కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆమె మాట్లాడారు. విభ‌జ‌న స‌మయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా గురించి అస‌లు తెలియ‌ద‌ని ప్ర‌త్యేక హోదా అనే విత్త‌నాన్ని వేసింది కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాలేన‌ని రేణుక పేర్కొన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తానంటే బీజేపీ ప‌దేళ్లు ఇస్తాన‌ని, టీడీపీ ప‌దిహేనేళ్లు కావాల‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాయ‌ని ఆమె ఆరోపించారు. ఏ పార్టీలైతే రాష్ట్రాన్ని విడ‌గొట్టాయో ఆ పార్టీలే ఇప్ప‌డు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు పోరాడి ప్ర‌త్యేక తెలంగాణ‌ను సాధించుకొని రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నప్పుడు,  ఏపీ ప్ర‌జలంద‌రు క‌లిసి పోరాడి హోదాను సాధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధి చేసుకోలేమా అని అన్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్తు ప్ర‌త్యేక హోదాతో ముడిప‌డి ఉంద‌ని, ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని కొన‌సాగిస్తేనే అభివృధ్ధి సాధ్య‌మ‌న్నారు. 


ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చారు
పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకమైన అంశాలేవి లేవని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. వెంకయ్య, చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న ప్యాకేజీ కూడా ఇప్పటి వరకు రాలేదని మండిపడ్డారు. కర్నూలులో జరిగిన చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన బుగ్గన మాట్లాడుతూ... హోదా వస్తేనే ప్రత్యేక రాయితీలతో పరిశ్రమలు మెండుగా వస్తాయన్నారు. పరిశ్రమలు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. చంద్రబాబు రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువొచ్చిందని ప్రజలు గగ్గొలు పెడుతుంటే పుష్కరాలని హడావిడి చేశారని ఫైరయ్యారు. హామీల అమలు అంటే పీవీ సింధూ సన్మానం, ప్రత్యేక హోదా అంటే దోమలపై యుధ్ధ అంటూ ప్రజా సమస్యలను పక్కదొవ పట్టిస్తున్నారన్నారు. అసోంకు హోదా కొనసాగించాలని వారు కోరినప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరగబోతుందని గ్రహించి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలుగా వస్తుంది వస్తుందని చెప్పుకుంటూ చివరకు రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు. 

29 September 2016

వెంకయ్య, బాబు అవిభక్త కవలలు

హైదరాబాద్‌: తెలుగు నాట చంద్రబాబు, వెంకయ్యనాయుడు అవిభక్త కవలల మాదిరిగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో పది సంవత్సరాలు ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వెంకయ్య, చంద్రబాబులు హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా మీద అదేపనిగా మోసాలు
ప్రత్యేక హోదాను ఆర్పే ప్రయత్నం చేస్తున్న తెలుగువారైన వెంకయ్యనాయుడు, చంద్రబాబు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు  రెండున్నర సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా సంజీవని అని హోదాను ఇచ్చి తీరుతాం.. సాధించి తీరుతాం అని అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై భూమన విరుచుకుపడ్డారు. ఏపీకి హోదా కేటాయింపులో అనేక రాష్ట్రాల ప్రతినిధులు అడ్డుపడడంతో ఆ రోజే మనస్సు మార్చుకున్నానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సన్మానాలు చేయించుకొని మరీ చెబుతున్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో విశాఖలో బీజేపీ మ్యానిఫెస్టో పది సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పిన మాటలు గుర్తులేదా అని వెంకయ్యను సూటిగా ప్రశ్నించారు. నాలాంటి అనుభవజ్ఞుడు అధికారంలోకి వస్తేనే హోదా సాధించగలడని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు హోదా సాధనలో అనుభవం ఏమైందని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం, నీతి అయోగ్, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని హోదా సంజీవనని నీరుగారుస్తున్నారని ఫైరయ్యారు. ఏపీకి రెవెన్యూ లోటు రూ. 22 వేల కోట్లు ఇస్తున్నాం కాబట్టి హోదా ఇచ్చే పరిస్థితి లేదని వెంకయ్య వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. హోదా లబ్దిని గుర్తించి తెలుగు జాతి ఏకమై పోరాడుతుంటే ప్యాకేజీ అంటూ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుజాతి ద్రోహులైన అవిభక్త కవలలు వెంకయ్య, చంద్రబాబుల శరీరాలు వేరైనా ఆడే అబద్దాలు మాత్రం ఒక్కటేనని ఎద్దేవా చేశారు.
హోదా ఎందుకు సాధించటం లేదు
కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్న హోదాకు తేడాలేదంటున్న వెంకయ్య.. దానికి దీనికి తేడా లేనప్పుడు హోదానే ఇవ్వొచ్చుగా అని భూమన ధ్వజమెత్తారు. ఎన్నికల మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజలను వంచించిన ద్వయం దిగ్గజాలు బాబు, వెంకయ్య ఇద్దరూ ఎందుకు హోదా సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. గత కొన్ని రోజుల క్రితం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టంగా ఉమ్మడి ఏపీకి రూ. 32 వేల కోట్లు ప్రకటిస్తే హోదా కల్గిన రాష్ట్రాలకు రూ. 91,980 కోట్లు కేటాయించిందన్నారు. దాదాపు ఐదున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికంటే ఏడున్నర కోట్ల జనాభా కల్గిన రాష్ట్రాలకు మూడు రెట్లు ఎక్కువగా నిధులు విడుదల చేసిందని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామం రోజుల్లో మనల్ని పాలించే బ్రిటీష్‌వారు స్వాతంత్య్రం కంటే ఎక్కువ లాభం ఇస్తామని ఉంటే పోరాటాన్ని మానుకునే వాళ్లా? అని ఇద్దరు నాయుళ్లను నిలదీశారు. ప్రాణాలకు తెగించి అమరవీరులు దేశానికి స్వాతంత్య్ర సంపాదిస్తే వీరిద్దరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు హోదా కోసం ఉద్యమాలు చేస్తుంటే బాబు, వెంకయ్యలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ మేలంటూ ఊరేగింపులు, సన్మానాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు.
వెంకయ్యవి చౌకబారు మాటలు
ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పిల్లకాంగ్రెస్‌ అని మాట్లాడిన వెంకయ్య చౌకబారు మాటలను భూమన తీవ్రంగా ఖండించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి వెంకయ్యకు ఇలాంటి చిల్లర మాటలు తగునా అని నిలదీశారు. చిల్లర స్థాయి నాయకుడిగా ఉన్నా వెంకయ్యను బీజేపీ జాతీయ నేతగా కీర్తిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని చురకంటించారు. ఏపీకి హోదా అవసరం లేదని ప్రధానమంత్రి మోడీ చెప్పకపోయినా తెలుగువాడైన వెంకయ్యనాయుడు పదేపదే ఇవ్వబోమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రం నుంచి ఎన్నికయ్యానని ఏపీ ప్రయోజనాలను సర్వనాశనం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం నుంచి ప్రతినిధిగా లేనప్పుడు 3 రోజులకు ఒకసారి ఎందుకు ఏపీలో పర్యటనలు చేస్తున్నారని భూమన విరుచుకుపడ్డారు. 
బాబుది కమీషన్ల ఆరాటం
బీజేపీలో కేంద్రమంత్రిగా ఉంటూ చంద్రబాబు పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని భూమన విమర్శించారు. టీడీపీ నేతలు కూడా పొగడనంతగా వెంకయ్య బాబును పొగుడ్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఇంటి ప్రయోజనం కోసం పోరాటం చేస్తుంటే సీఎం చంద్రబాబు తన కమీషన్లు, తాబేదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. హోదా ఇవ్వొద్దని పార్లమెంట్‌లో ఏ పార్టీ అభ్యంతరం చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ నేత కేవీపీ పెట్టిన ప్రైవేట్‌ బిల్లుకు కూడా రాజ్యసభలో 13 పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. అన్ని వనరులున్న ఏపీకి హోదా ఇస్తే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తోందన్న కుట్రతోనే ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోసం ఏరకంగా పోరాటం జరిగిందో అంతకంటే ఎక్కవగా ప్రజా సంఘాల మద్దతుతో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో హోదా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

నారా చంద్రబాబు కాదు.. నయీం చంద్రబాబు

  • నదులు కాదు..అవినీతి అనుసంధానం
  • టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఎల్లో ట్యాక్సు పై సీఎం స్పందించాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నయీం చంద్రబాబు నాయుడుగా వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతీచోట తన మనుషుల్ని పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.   చంద్రబాబు నదుల అనుసంధానం పేరుతో అవినీతిని అనుసంధానం చేశారని మండిపడ్డారు. ఆయన నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.   రాష్ట్రంలోని ప్రతి పథకంలోనూ అవినీతి, ఎల్లో ట్యాక్స్‌లు అధికమయ్యాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

వెంకటగిరి ఎమ్మెల్యే వ్యవహారమే ఉదాహరణ
తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకపోవడంతోనే ఏం జరిగిందో అందరికీ తెలిసిందని చెప్పారు. ప్రతి అభివృద్ధి పనిలోను చంద్రబాబుకు వాటాలు ముడుతున్నాయని, అందుకే ఎమ్మెల్యేలు ఏం చేసినా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు రామకృష్ణ అవినీతి వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యాడని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
జనాలను మేనేజ్‌ చేయలేవు
అవినీతితో సంపాదించిన డబ్బుతో ఏపీ సీఎం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయగలరేమో గాని జనాలను మేనేజ్‌ చేసే సత్తా ఆయనకు లేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం చేపడితే..నాడు ధనయజ్ఞమని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు మహానేత చేపట్టి ప్రాజెక్టులకు మూడొంతు చొప్పున అంచనాలు పెంచి ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు పోలవరం కాంట్రాక్ట్‌ కోసం తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతికి ప్రోత్సాహం
 అన్నా హజారే శిష్యుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కరువును పారద్రోలుతామని పగల్బాలు పలికిన సీఎం రూ.350 కోట్లు ఖర్చు చేసి రెయిన్‌గన్లు కొని కనీసం పది వేల ఎకరాలు కూడా తడప లేదని విమర్శించారు. డబ్బులు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్‌ చేయడం బాబుకు అలవాటైందని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌సీపీలో ఉంటే ఎమ్మెల్యేలపై కేసులు పెడతారని, అదే ఎమ్మెల్యే టీడీపీలో చేరితే కేసులు ఎత్తివేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు. కేంద్రం నిధులతో చేపట్టే ప్రతి పనిలోనూ టీడీపీ నేతలు కమీషన్లు పొందుతూ అభివృద్ధికి అంతరాయం కలిగిస్తున్నారని, గ్రామ, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి వరకు టీడీపీ నేతల అవినీతి విస్తరించిందని మండిపడ్డారు. అవినీతిని కట్టడి చేయకపోతే టీడీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని, అధికార పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.

28 September 2016

బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే

  • హామీలను విస్మరించి ప్రజలను వెన్నుపోటు పొడిచారు
  • ఇంతటి దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరు
  • రైతులకు దమ్మిడి సాయం చేయడం లేదు
  • ఇప్పటికైనా కళ్లు తెరిచి వరద బాధితులను ఆదుకోవాలి
  • ముంపు ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన

గుంటూరుః చంద్రబాబు సర్కార్ గ్రామాలను, రైతులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. భారీ వర్షాలతో ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టకుండా చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఆనాడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వైయస్ జగన్ పంటనష్టపోయిన రైతులు, బాధిత నిరాశ్రయులకు అండగా నిలిచారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రెడ్డిగూడెంలో వరద బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పాలకులు ఎవరూ తమ వద్దకు రాలేదని, ఏ సహాయం చేయడం లేదని బాధితులు వైయస్ జగన్ వద్ద వాపోయారు. వైయస్సార్సీపీ నేతలే తమను ఆదుకున్నారని చెప్పారు.  ఈసందర్భంగా జననేత మాట్లాడుతూ....ప్రభుత్వం బాధితులకు దమ్మిడి సాయం కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు  గ్రామాల్లోకి రాకుండా పొలిమేరలనుంచే వెళ్లిపోవడం దారుణమని అన్నారు.

రాష్ట్రంలో వేయి కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని లెక్కలు గట్టారు. ఒక్క గుంటూరు జిల్లాకే రూ.120 కోట్లు ఇవ్వాలి. వేయి కోట్లలో 463 కేంద్రం చెల్లిస్తే దాన్ని కూడా బాబు వేరే కార్యక్రమాలకు ఖర్చుచేయడం ఘోరమన్నారు. అసలు ఈమనిషికి రైతుల మీద ప్రేమ ఉందా ..? బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని వైయస్ జగన్ విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి బాబు మాట తప్పారని జగన్ ఫైర్ అయ్యారు. రుణాలు మాఫీ గాకపోవడంతో గత్యంతరం లేక మహిళలు తాళిబొట్లు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకుంటున్న పరిస్థితి తలెత్తిందని అన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు...ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనైపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. బ్యాంకులు బంగారం వేలం వేస్తుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా, రైతులకు రుణాలివ్వొద్దంటూ బాబు బ్యాంకులకు చెప్పడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలో మరొకరు ఉండరని నిప్పులు చెరిగారు. 

అప్పులు చేసి మరీ పంటలు వేసుకుంటే...చేతికొచ్చిన సమయంలో అవి నీట మునగడంతో రైతుకు కన్నీరే మిగిలిందని వైయస్ జగన్ ఆవేదన చెందారు. జూలై, ఆగష్టు చివర వరకు వర్షాలు రాక పంటలు ఎండిపోయాయి. ఉన్న కొద్దోగొప్పో సాగుచేసుకుంటున్న తరుణంలో వర్షాలు ముంచెత్తాయి. లక్షల ఎకరాల్లో ప్రత్తి, వరి, మిరప పంటలు పూర్తిభాగం దెబ్బతిన్నాయి. గ్రామంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇళ్లలో బియ్యం తడిసి ముద్దయ్యాయి. స్కూళ్లో 30 కంప్యూటర్లు నీటిలో తడిసిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే  సాయం చేయకుండా బాబు హెలికాప్టర్లలో తిరగుతున్నాడు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని వైయస్ జగన్  విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు, నిరాశ్రయులకు వైయస్సార్సీపీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, తోడుగా నిలుస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

నగరపాలక సంస్థలో అంతులేని అవినీతి, అక్రమాలు

  • కార్పొరేషన్‌ను ముట్టడించిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు  
  • టెండర్లు వేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడి
  • మంత్రి నారాయణ తీరుపై అనిల్, కోటంరెడ్డిల ఆగ్రహం
 
నెల్లూరు : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి.నారాయణ, నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ డౌన్‌ డౌన్‌ అనే నినాదాలతో నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంతం మార్మోగింది. కార్పొరేషన్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.42 కోట్లకు  సంబంధించి... 10 నెలలుగా టెండర్లు వేయకుండా కాలయాపన చేస్తున్న వైనాన్ని నిరసిస్తూ వైయస్సార్‌సీపీ సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు  పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ముట్టడించారు.

ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ... సబ్‌ప్లాన్‌ నిధులకు టెండర్లు పిలవకుండా మేయర్, అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ సొంత కార్పొరేషన్‌లో ఈ పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. రూ.42 కోట్లను ప్యాకేజీలుగా చేసి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని ఫైర్ అయ్యారు. 

శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్‌లలో సబ్‌ప్లాన్‌ నిధులతో పనులు పూర్తిచేయడం కూడా జరుగుతుందన్నారు. కానీ, నెల్లూరులో ఇంతవరకు అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కమిషనర్‌ను కలిసి టెండర్లు వెంటనే పిలవాలని కోరామని, ఆయన వారంరోజుల్లో పిలుస్తామని చెప్పారన్నారు. 25 రోజులు గడుస్తున్నా టెండర్లు పిలవకపోవడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 28, 29 తేదీల్లో అనిల్‌ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. టెండర్లు పిలకపోతే కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కోటంరెడ్డి హెచ్చరించారు. 
 
నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
కార్యాలయంలో కమిషనర్‌ను కలిసేందుకు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్‌ వెంకటేశ్వర్లు కార్యాలయం బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వారం రోజుల్లో టెండర్లు తప్పనిసరిగా పిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు కమిషనర్‌తో మాట్లాడుతూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి కమిషనర్‌ స్పందిస్తూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు చేపట్టే దీక్షలో తాను కూడా కూర్చుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, విప్‌ బొబ్బల శ్రీనివాసులుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు

27 September 2016

ఫుల్‌ క్లారిటీ... ఫుల్‌ జోష్‌

  • ప్రవాసాంధ్రులతో వైయస్ జగన్
  • బాబు మోసాలను ఎండగట్టిన జననేత
  • పలు ఆసక్తికర విషయాలు వెల్లడి

          ఏపీ ప్రతిపక్ష నాయకుడు ఆదివారం రాత్రి ప్రవాసాంధ్రులతో నిర్వహించిన ‘ముఖామఖి’ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్నికి చేస్తున్న అన్యాయం, మోసాలను ఎండగట్టారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి వలనే మొదటిసారి మంత్రి అయ్యాడని వెల్లడించారు. ఏపీకి హోదా రాకపోవడానికి గల కారణాలు, రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, ఇన్‌సైడర్‌ ట్రెడింగ్, స్విస్‌ చాలెంజ్ మోసం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్ట్‌ వంటి అంశాలపై వైయస్‌ జగన్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన లైవ్‌ ఇంటరాక్షన్‌ కార్యక్రమంతో తాను చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలపై పూర్తి అవగాహనతో ఉన్నట్లు కనిపించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామా చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు. 

తెలంగాణ వచ్చిందిగా... ప్రత్యేక హోదా రాదా?
అసాధ్యమనుకున్న తెలంగాణ వచ్చినపుడు.. పార్లమెంట్‌లో ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించుకోవడం కష్టమేమీ కాదన్నారు. అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉందని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే కేంద్రంలో మా మద్ధతు ఉంటుందన్నారు. వైయస్సార్‌సీపీపై ఆధారపడే ప్రభుత్వమే కేంద్రంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు.. దీన్నీ ప్యాకేజీ అంటారా?
విభజన చట్టం ద్వారా హక్కుగా సంక్రమించిన వాటి కన్నా ఎక్కువగా చేస్తే దాన్ని ప్యాకేజీ అంటారని ప్రతిపక్ష నేత వివరించారు. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే కోతలు వేసి ఇప్పటికే అమలతున్న వాటినే తిరిగి ప్రకటిస్తే అది ఎలా ప్రత్యేక ప్యాకేజీ అవుతుందని ప్రశ్నించారు. అరుణ్‌ జైట్లీ సెప్టెంబరు 7న ప్రకటన చేసే సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిచెప్పారన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవని సవివరంగా చెప్పారు. జైట్లీ ప్రకటనలో రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసినా.. సీఎం చంద్రబాబు స్వాగతించారు కాబట్టే బాబుకు ఇంగ్లీషు రాదని తాను ఎద్దేవా చేశానని కొమ్మినేని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ఆ రోజే మా ఎంపీలతో రాజీనామా చేయించేవాడిని..!
అరుణ్‌జెట్లీ ప్రకటన చేసిన రోజే మా పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిద్దామనిపించింది. అలా చేస్తే సభలోకి వెళ్లి మాట్లాడే వారే లేకుండా పోయే పరిస్థితి. వాస్తవానికి కొట్లాడుతున్నది ఎవరన్నా ఉంటే వైఎస్సార్‌సీపీ ఎంపీలే. అలాంటి వాళ్లు రాజీనామా చేస్తే కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఏదేమైనా  దశలవారీగా పోరాడుతూనే ఉంటాం. సరైన సమయంలో రాజీనామా బ్రహ్మాస్రాన్ని ఉపయోగిస్తాం. ఉద్యమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై మేధావులతో చర్చించాలని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.  

ఆ ఇద్దరూ మాట మార్చారు
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని చెప్పిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని దుయ్యబట్టారు. పైగా సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు 5 కోట్ల ఆంధ్రులను నిలువునా మోసం చేశారనన్నారు. ప్రత్యేక హోదా సంబంధించి పలు సందర్భాల్లో వెంకయ్య, బాబు మాట్లాడిన మాటలను గతవారం ఏలూరులో జరిగిన ‘యువభేరి’లో వీడియోలను యువత సమక్షంలో కూడా ప్రదర్శించిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మాకు కనీసం మద్దతు ప్రకటించకపోగా అభివృద్ధి నిరోధకులమని దుష్ప్రచారం చూస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు ప్రత్యేక హోదా సంజీవని అయినప్పుడు ఇప్పుడు ప్యాకేజీనే ఎలా గొప్పదవుతుందో ఆ నాయుళ్లిద్దరూ ప్రజలకు వివరించాలన్నారు. ఓవైపు ప్రత్యేక హోదా రాలేదని ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉంటే సన్మానాలు చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాదు తన వ్యక్తిగత స్వార్థ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రాని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పిన ప్రజలు ఇప్పుడు మోసం చేస్తున్న టీడీపీ, బీజేపీలకు కూడా బుద్ధిచెప్పే రోజు తొందర్లోనే రాబోతుందని పేర్కొన్నారు. 

పవన్‌ కల్యాణ్ను లైన్‌లో పెట్టుకున్నా లాభంలేదు
ప్రత్యేక హోదా పేరుతో ఒకసారి మోసం చేసిన ప్రజలను మేనేజ్‌ చేయాలంటే కుదరదని వైయస్‌ జగన్‌ అన్నారు. ప్యాకేజీని స్వాగతిస్తున్నామని ఒప్పుకుని ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో టీడీపీ వారిని మేనేజ్‌ చేయాలని చూస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఒకసారి అన్యాయం జరిగితే ఎప్పటికీ విశ్వసించరని అన్నారు. వారి ఆవేశాలు చల్లార్చడానికి పవన్‌ కల్యాణ్ ను లైన్‌లో పెట్టుకున్నా, మరెవరినైనా లైన్‌లో పెట్టుకున్నా ఐదు కోట్లమంది తెలుగు ప్రజలను మాత్రం లైనులో పెట్టడం సాధ్యం కాదని తెలిపారు. 

ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా..?
అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుతగులుతున్నామంటారు. రాజధాని భూదందా, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, ఓటుకు కోట్లు, స్విస్‌ చాలెంజ్‌ ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. రాజధాని నిర్మాణం సందర్భంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తన బినామీలకు, దొంగ కంపెనీలకు కేటాయించి ప్రజాధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు పథక రచన చేశాడని అన్నారు. వాటిని అడ్డుకుంటున్నామన్న అక్కసుతోనే మాపై అభివృద్ధి నిరోధకులమనే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవలేశ్వరం నుంచి రోజుకు 3లక్షల నుంచి నాలుగు లక్షల  క్యూసెక్కుల నీరు, ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల నీరు సముంద్రంలో కలుస్తుందన్నారు. మేము ఆరోజు చెప్పింది కూడా అదే కదా..! పట్టిసీమ అంటూ గోదావరి, ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు తెచ్చి సముద్రంలోకి కలుపుతున్నారు. గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. అలాంటప్పుడు ఆ నీటిని ఒక స్టోరేజీ నిర్మించి భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చని సూచించారు. పోలవరం అన్నది ఆ స్టోరేజీయే. కానీ పోలవరం కట్టడు. పట్టిసీమ అంటాడు. కాలువను నది అంటాడు.. చంద్రబాబుకు మెగలేమేనియో వ్యాధి సోకిందేమోనని అనుమానంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఉప ఎన్నికలకు సిద్ధమా బాబూ..?
అనేక ప్రలోభాలు పెట్టి వైయస్సార్‌ సీపీ టిక్కెట్‌ మీద గెలిచి టీడీపీలో చేరిన 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమా అని జగన్‌ సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బాబు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండం నేర్చుకోవాలి. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం.., మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం మూర్ఖత్వమవుతుందని గట్టిగానే మందలించారు. తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తారు. వాటిని స్వాగతించాలి. తప్పులను దిద్దుకోవాలి. అంతేకాని అసహనంతో ఊగిపోవడం సరికాదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. 

స్వార్థం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోను
తమ విలువైన సమయాన్ని వెచ్చించి తాను నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ప్రవాసాంధ్రులందరికీ ముందుగా వైయస్‌ జగన్‌ కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌ చాలా ఉత్సాహంగా, ధీమాగా కనిపించారు. హోదా కోసం పోరాడుతున్నా.. మీ అందరి మద్దతు కావాలి అని వారిని అడిగారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...‘ ఒకటి మాత్రం చెప్పగలను. మనస్ఫూర్తిగా పోరాడుతా. స్వార్థం, స్వప్రయోజనాల కోసం నా క్యారెక్టర్‌ను ఎప్పుడూ అమ్ముకోలేదు.. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా నా స్వార్థం కోసం చూసుకోను. నా క్యారెక్టర్‌ను అమ్ముకోను. దేనికోసమో రాజీ పడే ప్రసక్తే లేదు. పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని చెప్పగలను. మీ అందరి సహకారం నాకు కావాలి. ఇప్పటికే రెండున్నరేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం.. మరో రెండున్నరేళ్లు కష్టపడుదాం..’ అని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ముఖాముఖి ద్వారా జగన్‌ పిలుపునిచ్చారు

చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఉందేమో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకోమాట... సందర్భానికోరకంగా మట్లాడటం చూస్తుంటే ఆయనకు అల్జీమర్సో, మెగలోమేనియా వ్యాధి ఉన్నట్టుగా అనుమానం వస్తోందన్నారు. ప్రపంచంలో సెల్ ఫోన్ తానే కనిపెట్టానని ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పీహెచ్‌డీ చేశానని, షికాగో యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్‌ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెబుతున్నారని, సత్య  నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా తానే చేశానని అంటాడు. చివరకు రోజుకు 24 గంటలుంటే విద్యుత్తును రోజుకు 27 గంటలు ఇచ్చానంటాడు. నమ్మేవాళ్లుంటే చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతాడని జగన్‌ దుయ్యబట్టారు. ఏదీ ఏమైనా  హోదా సాధనలో భాగంగా వైయస్‌ జగన్‌ ప్రవాసాంధ్రుల మద్దతు కూడగట్టడం ఉద్యమానికి మరింత తోడ్పాటునందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఎన్‌ఆర్‌ఐలతో వైయస్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వైరల్‌గా మారింది. జగన్‌ వ్యాఖ్యలపైనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

అన్నదాతకు అండగా వైయస్ జగన్

  • వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
  • నీటమునిగిన పంటల పరిశీలన

గుంటూరుః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రెండో రోజు వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ, నిరాశ్రయులైన బాధితులను పరామర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్ అనుపాలెం గ్రామానికి చేరుకొని నీటమునిగిన పంటలను పరిశీలించారు. అదేసమయంలో కొండమోడు వాగును పరిశీలించారు.  రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 

చంద్రబాబు రుణాలు మాఫీ చేయకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలింది. భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు వరద నీట మునగడంతో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈసందర్భంగా రైతులకు తోడుగా నిలిచేందుకు వైయస్ జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇంతవరకు అధికారులు గానీ, పాలకులు గానీ ఎవరూ తమ వద్దకు రాలేదని రైతులు వైయస్ జగన్ వద్ద వాపోయారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. 

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తోన్న వైయస్ జగన్

  • రుణాల మాఫీ లేదు, ఇన్ పుట్ సబ్సిడీ రూపాయి ఇవ్వలేదు
  • పంటలు పరిశీలించకుండా విమానాల్లో తిరుగుతున్నాడు
  • రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్

గుంటూరుః రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. భారీ వర్షాలతో పంటలన్నీ దెబ్బతిని రైతన్న దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొట్టడం దారుణమన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో వైయస్ జగన్ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే
()వర్షాల కారణంగా దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో ప్రత్తి, వరి చేలతో పాటు ఒకటిన్నర లక్షలకు పైగా మిరప పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితి.
()ప్రత్తి  కౌలు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంది. 20 వేల పైనే పెట్టుబడి పెట్టారు. మిరపకు సుమారు 50 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. ఏదీ చేతికందని పరిస్థితి. రైతులు ఇంత దారుణంగా బతుకుతుంటే...పంటలను నేరుగా పరిశీలించకుండా బాబు విమానాల్లో తిరుగుతున్నారు
()రైతుల దగ్గరకు పాలకులు గానీ, అధికారులు గానీ రాకపోవడం బాధాకరం. వ్యవసాయానికి  దమ్మిడి ఇవ్వడంలేదు.
()జూలై, ఆగష్టు చివరి వరకు వర్షాలు లేవు. చచ్చి చెడి కొద్దో గొప్పో పంటలను కాపాడుకునే పరిస్థితిలో వర్షాలు ముంచెత్తాయి. 
()గతేడాది ఇన్ పుట్ సబ్సిడీకి సంబంధించి రైతులకు రూపాయి ఇవ్వలేదు
()రాష్ట్రవ్యాప్తంగా రూ. వేయి కోట్లు ఉంటే అందులో రూ.120 కోట్లు ఒక్క గుంటూరు జిల్లాకే రావాలి. ఇంతవరకు రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు
()ఇన్ పుట్ సబ్సిడీ రాక, రుణాలు మాఫీ గాక, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు
()రుణాలివ్వొద్దంటూ బాబు బ్యాంకులకు ఆదేశాలివ్వడంతో పైసా వచ్చే పరిస్థితి లేదు. దీంతో, రైతులు దయనీయ పరిస్థితుల్లో బయట 2,3 రూపాయల వడ్డీకి రుణాలు తెచ్చుకొని అప్పుల చేసి మరీ పంటలు వేస్తే అవి కూడా చేతికందకుండా పోయాయి
()బాబు విమానాల్లో చక్కర్లు కొట్టడం కాదు. భూమి మీదకు వచ్చి రైతుల పంటలను పరిశీలించాలి. వారికి న్యాయం చేయాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. 

26 September 2016

విదేశీయులను నెత్తిన పెట్టుకొని స్వదేశీయులను కించపరుస్తావా

  • బాబు నీ దోపిడీ పరిపాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు
  • ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే విధానాలు మానుకో
  • హోదా ఉన్న రాష్ట్రాల్లో బిజినెస్ లు చేస్తూ..ఇక్కడ ప్యాకేజీనా..?
  • ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల ఫైర్

హైదరాబాద్ః విదేశీయులను నెత్తిన పెట్టుకొని స్వదేశీ ఇంజినీర్లను కించపరుస్తున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. తెలుగు వాళ్లు, భారతీయ ఇంజినీర్లు అసమర్థులు, కమిట్ మెంట్ లేదంటూ  బాబు హేళన చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంజినీర్లను కించపర్చినందుకు క్షమాపణ చెప్పాలని బాబును డిమాండ్ చేశారు. మహాకవి గురజాడ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టిబెట్టవోయ్ అంటే...చంద్రబాబు మాత్రం విదేశమును ప్రేమించుమన్నా, సొంత ప్రజలను ముంచుమన్నా, గట్టి మూటలు కట్టిపెట్టవోయ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ విదేశీయులకు కట్టబెడుతున్న బాబు పరిపాలన విధానాన్నిచూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని బత్తుల చెప్పారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు.  

రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బాటలు వేసుకునే కుట్రలో భాగంగానే ....ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చేందుకు బాబు ఇతర దేశాల వాళ్లను పొగుడుతూ మనవాళ్లను అవమానిస్తున్నారని బత్తుల ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కట్టింది  మన ఇంజినీర్లు కాదా బాబూ..? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు లాంటి ఎంతోమంది ఖ్యాతి గడించిన భారతీయ ఇంజినీర్లను అవహేళన చేయడం దుస్సాహసమేనని బాబుపై ధ్వజమెత్తారు. అమెరికాలోని నాసాలో 36 శాతం భారతీయులే ఇంజినీర్లుగా ఉండి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన విషయం మీకు గుర్తుకు రాదా..? మనవాళ్లు అసమర్థులని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దొడ్డిదారిన ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసే స్థాయికి వచ్చారంటూ చంద్రబాబుపై  నిప్పులు చెరిగారు. 

రాష్ట్రంలో ఇంజినీర్లను ఎక్కడైనా సమర్థవంతంగా పనిచేయనిస్తున్నారా అని బత్తుల బాబును ప్రశ్నించారు.  గ్రామస్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి పనిలో మీకు వాటా కావాలి. మీ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాలి. నీరు-చెట్టు పేరుతో చెరువులు తవ్విస్తున్నామని నమ్మించి మోసం చేసి దోపిడీ చేస్తున్నారు.  స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో సింగపూర్ కు 58 శాతం వాటా ఇచ్చి ప్రభుత్వానికి కేవలం 42 శాతం ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆంతర్యమేంటి..? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని దోపిడీ చేస్తున్నారు. రూ. లక్షల కోట్లు దోచుకొని విదేశాల్లో దాచిపెడుతున్నారు. దోపిడీ వ్యవస్థకు నాయకత్వం అప్పగించే మీ పాలనను ప్రజలంతా చూస్తున్నారు.  సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని బాబును హెచ్చరించారు. 

ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీ కోసం బాబు ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేయడం దుర్మార్గమని బత్తుల విమర్శించారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపిస్తూ ఏపీకి మాత్రం హోదా అవసరం లేదని మాట్లాడడం దారుణమన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆంజనేయులు, గల్లా జయదేవ్  అంతా హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించారే, ఇది నష్టం కోసమా...?హోదా అవసరం లేదని చెబుతున్న వీరంతా అక్కడ పరిశ్రమలు రద్దు చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారా...అందుకు మీరు కట్టుబడతారా అని బాబుకు సవాల్ విసిరారు. ఉత్తరాఖాండ్ లో సుజనా వ్యాపారసంస్థలు ఏర్పాటుచేసుకుంది వాస్తవం కాదా...? అంటే  అక్కడైతే పండుగ, ఇక్కడైతే దండగని ప్రచారం చేస్తారా...?  రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు తీసుకెళ్లి హోదా ఉన్న రాష్ట్రాల్లో బిజినెస్ లు చేస్తూ ఇక్కడ ఓటుకు కోట్లు కోసం వెదజల్లుతున్నారని విరుచుకుపడ్డారు. 
 
ఇతర దేశాలకు ఏపీ భవిష్యత్తును  తాకట్టుపెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు బాటలు వేయడం దారుణమని బత్తుల అన్నారు. దేశంలో సమర్థులును అసమర్థులుగా చిత్రీకరిస్తావా....? ఎవరైనా ఏదైనా సాధిస్తే నావల్లే వచ్చిందని చెప్పుకుంటావా...?భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసే బాబు దోపిడీ పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగువారిని, ఆంధ్రులను కించపర్చేవిధంగా మాట్లాడడాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.  మహానీయుల ఆలోచనను వక్రమార్గం పట్టించే బాబు దొంగ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని బత్తుల చెప్పారు. దోపిడీని పక్కనబెట్టి ఇంజినీర్లకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పజెప్పి స్వతంత్రంగా పనిచేసేలా అవకాశం ఇవ్వాలన్నారు.  పరిపాలన విధానం మార్చుకోవాలని హితవు పలికారు

వివిధ దశల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం

  • ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ఉద్యమం
  • అందరితో కలిసి పోరాట బాట
  • చంద్రబాబు అన్నింట్లో అవినీతే
  • అవసరమైతే ఎంపీలతో రాజీనామా
  • ప్రజల తీర్పుతో కళ్లు తెరిపిస్తాం

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని ప్రతిపక్షనేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వెల్లడించారు. ఖండాంతరాల్లో ఉన్న తెలుగువారిని చైతన్యపరిచేందుకు వైయస్ జగన్ నేరుగా ప్రవాసాంధ్రులతో మాట్లాడారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో అనేక అంశాలపై వైయస్ జగన్ విపులంగా చర్చించారు.
మొదటగా వైయస్ జగన్ ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని వివరించారు. అదే సమయంలో చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ఎండగట్టారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం  హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు.ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్ని వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు వస్తాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అందరినీ కలుపుకు పోతామని, పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుందని ఆయన  భరోసాయిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన అవిభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు.
హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పరని అన్నారు. మన రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.
 ఎన్ఆర్ఐలతో వైయస్ జగన్ ముఖాముఖి
  • చంద్రబాబు లాంటి అబద్దాలకోరు మరెవరూ ఉండరు
  • చంద్రబాబు మాదిరిగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం భారత్ లో ఆయనకే చెల్లు
  • అసాధ్యం అనుకొన్న తెలంగాణను సాధించగలిగినప్పుడు ప్రత్యేక హోదాను సాధించటం కష్టమేమీ కాదు
  • ప్రజాస్వామ్యంలో పోరాటమే పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది.
  • చంద్రబాబు వంటి అబద్దాలు చెప్పేవారు ఎక్కడా ఉండరు.
  • తాను ఎమ్మే చేశానని, పీహెచ్డీ చేశానని చెప్పుకొన్నారు. ఎవరూ డాక్టర్ చంద్రబాబు అని ఎందుకు అనటం లేదు
  • సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, ఇంకా చాలా చెప్పుకోవటం మనం చూశాం

  • ఆయన ఎంత గొప్పగా ఇంగ్లీషు మాట్లాడుతారో అందరికీ తెలుసు
  • అసలు చంద్రబాబుకి అరుణ్ జైట్లీ ప్రకటన ఎంతవరకు అర్థం అయిందో తెలియదు, కానీ స్వాగతించారు
  • శాసనమండలిలో ప్రత్యేక సాయం గురించి ప్రకటన చేశారు, కేంద్రానికి చాలా ధన్యవాదాలు తెలిపారు
  • పోలవరం ప్రాజెక్టు నిబంధనలను అడ్డగోలుగా మార్చారు
  • వ్యవస్థలో మార్పు రావాలి, నేతలను నిలదీసే పరిస్థితి రావాలి
  • ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం
  • పోలవరంకు సంబంధించి కూడా చాలావి ఇవ్వటం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది.

  • అన్యాయంగా అదే పోలవరం కాంట్రాక్టర్ ను కొనసాగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయ పడుతోంది.
  • పోలవరం అథారిటీ ఎంత మొత్తుకొంటున్నా అదే కాంట్రాక్టర్ కు సబ్ కాంట్రాక్టర్లను అప్పగించి నడిపిస్తోంది.
  • కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకపోయినా సరే చంద్రబాబు పట్టించుకోవటం లేదు.
  • కేంద్రంకే బాధ్యత ఇచ్చి ఒత్తిడి చేసి పనిచేయించాల్సింది పోయి, చంద్రబాబు తప్పు దారి పట్టిస్తున్నారు.
  • పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది
  • ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయి

  • రాయితీలు ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు
  • ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులే మోసం చేస్తే పరిస్థితి వస్తే ఇంకెవరికి చెప్పాలి?
  • అరుణ్ జైట్లీ ఏమిచ్చారో అందరికి అర్థం అవుతోంది.
  • రాతపూర్వకంగా అరుణ్ జైట్లీ ఇచ్చిన ప్రకటన ను మనం అంతా చూడవచ్చు.
  • అరుణ్ జైట్లీ విదిలించిన దానికే చంద్రబాబు చంకలు గుద్దుకొంటున్నారు.

  • బుందేల్ ఖండ్ ప్యాకేజీ స్పష్టంగా ఉంటే, అందులో 3,700 కోట్లు కూడా ఇవ్వకుండా తిప్పించినా, చంద్రబాబు థాంక్సు చెబుతున్నారు.
  • ప్రత్యేక హోదాను నిట్టనిలువుగా ముంచేసినా చంద్రబాబు సంతోషం వెలిబుచ్చుతున్నారు.
  • ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతాం
  • ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగుతున్నాం
  • ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారు
  • బీజేపీ రాష్ట్రానికి ఏం చేసినా చేయకపోయినా తన కేసులను పట్టించుకోకపోయినా ఫర్వాలేదని బాబు అనుకుంటున్నారు

  • రాష్ట్ర ప్రజల తరపున నిజాయితీగా పోరాడుతున్నది మాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారు
  • అందరు కలిసి రాబట్టే ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న ప్రతి ఆందోళన విజయవంతం అవుతోంది
  • మా ఆందోళనలతో హోదాపై ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నాం, మా ధ్యేయం హోదా సాధించమే
  • హోదా సంజీవనే.. పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న చంద్రబాబు, వెంకయ్య నాయుడే ఇవాళ మాట మారుస్తున్నారు
  • విభజనపై యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీలో కాంగ్రెస్ ఎలా చతికిలపడిందో.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీది కూడా అదే పరిస్థితి
  • ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఒక్క ప్రధానిమంత్రికే ఉంది

  • ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు చెప్పలేదు. ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖ చూస్తే ఆ విషయం  స్పష్టంగా తెలుస్తుంది
  • ప్రత్యేక హోదా ఉన్న జమ్మూకశ్మీర్ కు ప్రధాని మోదీ రూ. 80 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. అయితే హోదా ఉండనట్టా?
  • 2019లో కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. 280 సీట్లు ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. 22-23 సీట్లు గెల్చుకుంటే కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది
  • వినుకొండ ఎమ్మెల్యే ఎక్కడో ప్రత్యేక హోదా ఇచ్చిన హిమచల్ ప్రదేశ్ లో కంపెనీ పెట్టారు దీనిని ఏమనాలి?
  • హోదా వచ్చే లాభాలతో పారిశ్రామికవేత్తలు వారంతట వారే పెట్టుబడులు పెడతారు

  • అరుణ్ జైట్లీ ప్రకటన వింటే ఎవరికీ థాంక్స్ చెప్పాలని అనిపించదు
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులే పేరు మార్చి ఇస్తున్నారు
  • మన హక్కు ప్రకారం రావాల్సిన వాటినే ఇస్తున్నప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారు
  • రాజధాని విషయంలో చంద్రబాబు అందరినీ తప్పుదోవ పట్టించారు
  • 4 పంటలు పండే భూములను మాయమాటలు చెప్పి రైతుల నుంచి కొట్టేశారు
  • ఇప్పుడు స్విజ్ చాలెంజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు
  • పార్టీ మారి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరు
  • చంద్రబాబు అవినీతి ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు
  • ఏపీలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది

  • ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది
  • అయినా సరే చంద్రబాబు థాంక్సులు చెప్పటం, ఎలా పోరాటం చేస్తారని అడగటం చేస్తున్నారు
  • చదువుకున్న యువత, మంచి నైపుణ్యం ఉన్న యువత ఉంది
  • ప్రత్యేక హోదా వస్తే వాళ్లందరికీ మేలు జరుగుతుంది
  • ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో పోరాడితే కచ్చితంగా హోదా వస్తుంది

  • మనం పోరాడుతుంటే చంద్రబాబు అడ్డుకొంటారు
  • కేంద్రం ఇవ్వకపోయినా, చంద్రబాబు అడ్డుకొంటున్నా కానీ మనం పోరాడతాం
  • ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి రావాలి. మీ అందరి మద్దతు కావాలి
  • పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
  • అసలు చంద్రబాబే పోరాటం చేయాలి, మంత్రుల్ని ఉఫసంహరించాల్సిన పరిస్థితి
  • చంద్రబాబు చేయకపోవటం వల్లనే మనం పోరాడుతున్నాం

  • ఎన్నాళ్లు బతికాం అన్నది ముఖ్యం కాదు , ఎంత బాగా బతికాం అన్నది ముఖ్యం
  • రాజకీయాల్లో ప్రస్తుతం అబద్దాల సీజన్ నడుస్తోంది
  • ఎన్నికల సమయంలో అబద్దాలు చెప్పటం, తర్వాత మరిచిపోవటం చేస్తున్నారు
  • నాకు చక్కటి క్యారెక్టర్ ఉంది. దాన్ని ఎప్పటికీ కోల్పోలేదు, నేను కోల్పోను కూడా
  • ప్రత్యేక హోదా కోసం మీరంతా కలిసిరావాలి. అంతా కలిసికట్టుగా పోరాడుదాం

24 September 2016

ఎన్టీఆర్ కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు

  • స్పీకర్,గవర్నర్ పై దాడి చేసిన చరిత్ర టీడీపీది
  • వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

హైదరాబాద్ : తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందని పెద్ది రెడ్డి మండిపడ్డారు.  సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. 45 రోజుల్లో స్పీకర్కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది.  భేటీ ముగిసిన అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్, గవర్నర్పై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేతలదని, ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించాక కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందులో మంత్రి యనమల పాత్ర కూడా ఉందని పెద్దిరెడ్డి ఆరోపించారు. 

తాము రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టామన్నారు. అసెంబ్లీలో తాము ఎవరిపైనా దరుసుగా ప్రవర్తించలేదని, ఎమ్మెల్యేలెవరిపైనా చర్యలు తీసుకోవద్దని సమావేశంలో కోరినట్లు పెద్దిరెడ్డి తెలిపారు.

ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నది ఎవరు ?

గుంటూరుః చంద్రబాబు ప్ర‌త్యేక హోదాను నీరుగార్చుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని  వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఫైర్ అయ్యారు. గుంటూరులో చైతన్యపథం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశంపై శాసనసభ, మండలిలో వైయస్సార్సీపీ చర్చకు పట్టుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాబు హోదాను నిర్వీర్యం చేస్తున్నాడని మండలిలో ఈఅంశాన్ని లేవనెత్తితే టీడీపీ నేతలు అడ్డుతగిలారని అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే టీడీపీ సభ్యులు త‌న‌పై మాటల యుద్దానికి దిగార‌న్నారు.  ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి గొంతు నొక్కుతుంటే చంద్ర‌బాబు స్పందించ‌క‌పోవ‌డం అత్యంత హేయ‌మైన చ‌ర్యగా అభివర్ణించారు.  హోదాపై చర్చకు అనుమతించని కారణంగానే నిర‌స‌న‌గా తాము వాకౌట్ చేశామని చెప్పారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల అభిప్రాయాల‌ను క‌నీసం తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా సీఎం చేయ‌క‌పోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

ప్ర‌త్యేక ప్యాకేజీలో అంత‌ర్యం ఏమిటి?
- వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌
ఎన్నిక‌ల‌కు ముందు వెంక‌య్య నాయుడు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా కావాలంటే లేదులేదు... పదిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీని స్వాగ‌తించ‌డంలో అంత‌ర్య‌మేమిట‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ప్రశ్నించారు. చైత‌న్య‌ప‌ధం కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... చ‌ంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ, ఉద్యోగాలు, నిరుద్యోగ‌భృతి ఇస్తాన‌ని చెప్పి ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. రుణమాఫీ ఏ విధంగా చేస్తావ‌ని ఎల‌క్ష‌న్ క‌మిటీ చంద్ర‌బాబును అడిగితే... తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా చేశాను, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు నాకు తెలుస‌ని చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మొహం చాటేశారని నిలదీశారు. ఎన్నిక‌ల‌కు ముందు చేసిన మోసాల‌నే ప్ర‌స్తుతం చేస్తున్నార‌న్నారు.  మంత్రులు నారాయ‌ణ‌, పుల్లారావులు గుర్రాలపై ఎక్కి తిరిగి దొంగ స‌న్మానాలు చేయించుకున్నార‌ని, ఇప్పుడు వెంక‌య్య‌నాయుడు సైతం అదేవిధంగా దొంగ స‌న్మానాలు చేయించుకున్నార‌ని విమ‌ర్శించారు. 

బాబుకు శిక్ష తప్పదా...?

()ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
()బ్లాక్ మనీతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూశారు
()తప్పించుకునేందుకు "స్టే" లతో కాలం గడుపుతున్నాడు 
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా...స్టేలతో కాలం గడుపుతున్నాడని వైయస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో  బాబు స్టే తెచ్చున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులోనూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే... 4 వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఏ తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని చంద్రబాబును ఆర్కే సూటిగా ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. బ్లాక్మనీతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ ముమ్మాటికీ చంద్రబాబుదే అని ఆర్కే స్పష్టం చేశారు. అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.

ఓటుకు కోట్లు కేసులో విచారణను రద్దు చేయాలంటూ  చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాల్లో ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్‌డే వాదనలు వినిపించగా బాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారని,  వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని వాదనల సందర్భంగా సుప్రీం జడ్జి లూథ్రాను ప్రశ్నించారు. 

22 September 2016

హోదాపై విద్యార్థులు, యువతకు వైయస్ జగన్ దిశానిర్దేశం

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఎండగట్టిన జననేత
  • ఓటుకు కోట్లు కేసులో పట్టుబడినా తప్పిించుకు తిరగడం బాబుకే చెల్లింది
  • కేసులకు భయపడి ఐదుకోట్ల ఆంధ్రుల హక్కును ఢిల్లీకి తాకట్టుపెట్టాడు

ఏలూరు))ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ నాయుళ్లిద్దరూ (చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు) పొంతనలేని మాటలతో ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నదీ వైయస్ జగన్ వీడియోల ద్వారా తెలియజెప్పారు. ప్రొజెక్టర్ల సాయంతో ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన మాటలను యువభేరి వేదికగా విద్యార్థుకు చూపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని వెంకయ్య నాయుడు మేక మెడలో ఉండే వాటితో పోల్చడం దారుణమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో, బహిరంగ సభల్లో ప్రస్తావించి నేడు ప్యాకేజీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హోదా కోసం పోరాడదామని తాను పిలుపునిచ్చినా ...కేసులకు భయపడి చంద్రబాబు బీజేపీ వారి కాళ్లను విడిచి రావడం లేదని ఆరోపించారు. విలువలు, విశ్వసనీయత గురించి వీరు ఎన్ని జన్మలెత్తినా తెలుసుకోలేరని నిట్టూర్చారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల ద్వారా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా తప్పించుకు తిరగడం బాబుకే చెల్లిందన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇదేమంత పెద్ద విషయం కాదన్నారు. సెప్టెంబర్‌ 7 అర్థరాత్రి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ నిర్ణయానికి అంగీకరించిన బాబు 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. 


ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఏలూరు యువభేరి వేదికగా విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. హోదా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. నీతి అయోగ్, 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వకుండా తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, హోదా కంటే ప్యాకేజీనే బాగుందని ప్రజలను మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా చురకలంటేలా సాగిన జగన్‌ ప్రసంగంతో ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిత్వశాఖ స్వయంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనను చూపిస్తూ ప్రసంగించారు. ప్రత్యేక హోదా పేరుతో కలిగే లాభాలతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయంతో జరుగుతున్న దోపిడీని వివరించారు. గతంలో పలు సందర్భాల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ ప్రశ్నించిన చంద్రబాబు ప్రశ్నకు ఆయా రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరిస్తూ బాబుకు ధీటైన జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఐదు పాయింట్లతో సవివరంగా అవగాహన కల్పించారు. 

సెప్టెంబర్‌ 7 అరుణ్‌జైట్లీ ప్రసంగం ఆధారంగా వివరణ.. 
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు సెప్టెంబర్‌ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రసంగం, దానిపై ఆయన మీడియా విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌ను చూపిస్తూ రాష్ట్రానికి మనకు హక్కుగా రావాల్సిన నిధులే తప్ప కొత్తగా ఏమీ ఇవ్వలేదంటూ తేల్చేశారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే మనకు కూడా కేంద్రం నుంచి రావాల్సిన వాటాల పరంగా వచ్చినవే తప్ప ప్యాకేజీ పేరుతో కొత్తగా వచ్చిందేమీ లేదని వివరించారు. 

హోదా నిర్ణయం ఆర్థిక సంఘానికెక్కడిది..
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్ద అని నిర్ణయించే అధికారం ఆర్థిక సంఘానికి లేదని తెలిపారు. రాష్ట్రాల నుంచి ట్యాక్సుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయాన్ని ఏయే రాష్ట్రాలకు ఎంతెంత పంచాలి అనే సలహాలు ఆర్థిక శాఖకు, ప్రధానికి ఇస్తుందన్నారు. గతంలో 32.5 శాతం ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచేవారని అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 6.94శాతం ఉండేదని, నేడది నవ్యాంధ్రప్రదేశ్‌కు 4.31 శాతం ఉందని వివరించారు. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత రాష్ట్రాల వాటాను 42శాతానికి పెంచినట్లు వివరించారు. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను కూడా కేటాయించారన్నారు. గతంలో ఏపీ ఆర్థిక లోటును పూడ్చేందుకు 22,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఇది కూడా ఆంధ్రాకు ప్రత్యేకంగా వచ్చిందేమీ కాదని కేరళ, పశ్చిమ బంగా రాష్ట్రాలకూ కేటాయించారన్నారు. 

అభిజిత్‌ సేన్‌ ఏమన్నారంటే..
14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం హోదా ఇవ్వడానికి కుదరదని అంటున్న బీజేపీ వాదన సరిగా లేదని పేర్కొంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ రాజ్యసభ్య సభ్యుడు జైరాం రమేశ్‌  చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక సంఘంలో సభ్యుడిగా ఉన్న అభిజిత్‌ సేన్‌ తన మెయిల్‌కు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వమంటూ ఆర్థిక సంఘం ఏనాడూ చెప్పలేదని, అది తమ పరిధిలో అంశం కాదని అభిజిత్‌ సేన్‌ పంపిన మెయిల్‌ను పార్లమెంట్‌లో జైరాం రమేశ్‌ చదివి వినిపించారని జగన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

9 నెలలు ఏం చేశారు
ప్రణాళిక సంఘం రద్దవడం.. నీతి అయోగ్‌ రాకతో ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని చెప్పుకోవడం సమంజసం కాదని జగన్‌ ఆరోపించారు. 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని ప్రణాళిక సంఘం 2 మార్చి, 2014న ప్రకటించారని అయితే నీతి అయోగ్‌ డిసెంబర్‌ 2014 అమల్లోకి వచ్చిందని.. ఈ మధ్యలో జరిగిన 9 నెలల కాలంలో హోదా ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్‌డీసీ (నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌), ప్రణాళికా సంఘాలదేనని తెలిపారు. అయితే వాటికి చైర్మన్‌గా ఉన్న ప్రధానికి హోదా ఇవ్వడం చిటికెలో పని అన్నారు. ఆనాడు వాజ్‌పేయి ప్రధానికి ఉన్న సమయంలో ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కేటాయించిన  విషయాన్ని వైయస్ జగన్ గుర్తుచేశారు. 


కుంటిసాకులు తగనా..?
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతాయని రెండేళ్ల తర్వాత అంటున్నారు.... ఏపీని విడగొట్టేనాడు ఆయా రాష్ట్రాలు అడ్డుగున్నా ఎలా విభజించారని నిలదీశారు. హోదాను ఎగ్గొట్టేందుకు కుంటిసాకులు వెతకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 14వ ఆర్థికసంఘం ఉండగానే ఇంతకుముందు హోదా ఇచ్చిన రాష్ట్రాలకు కొనసాగిస్తున్నారు కదా అని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లో అడిగితే... సంబంధిత మంత్రి  హోదా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా  సమాధానం ఇచ్చారని వైయస్ జగన్ చదివి వినిపించారు.  ప్రత్యేక హోదాకు సంబంధించిన పూర్తి సమాచారం వైయస్సార్‌సీపీ వెబ్‌సైట్‌లో కరపత్రం పొందుపర్చినట్లు వైయస్ జగన్ విద్యార్థులు, యువతకు ఈ సందర్భంగా వివరించారు. 

చంద్రబాబూ... హోదా వలన ప్రయోజనాలివిగో
ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఏమొస్తుందని పదేపదే చెప్పుకొస్తున్న చంద్రబాబు కళ్లు తెరిపించేలా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని వినిపించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోదా సంక్రమించడం వలన తాము సాధించిన అభివృద్ధిని వివరిస్తూ కేంద్రానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను చదివి వినిపించారు. 
ఉత్తరాఖండ్‌లో హోదా అనంతరం 30244 పరిశ్రమలు వచ్చాయని ఇది గతంతో పోల్చితే 130 శాతం అధికమని తెలిపారు. ఆయా పరిశ్రమల ద్వారా 2లక్షలా 45వేల ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. ఉపాధి 490 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. వీటన్నింటి ద్వారా రాష్ట్రానికి 35వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు. 
హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా 10వేల 864 పరిశ్రమల ద్వారా లక్షా 30వేల ఉద్యోగాలు సిద్ధించాయని పేర్కొన్నారు. 

పారిశ్రామిక రాయితీలు...
వంద శాతం పన్ను రాయితీలు
100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ (హోదా ఉంటే జీఎస్టీ రాయితీ కూడా)
అప్పులు తీసుకుంటే 3 శాతం వడ్డీని కేంద్రమే భరిస్తుంది. 
రైల్వే లైన్‌ నుంచి ఫ్యాక్టరీల వరకు సరకుల రవాణాకు అయ్యే ఖర్చులు కేంద్రమే రీయింబర్స్‌ చేస్తుంది. 
50 శాతం విద్యుత్ వినియోగంలో రాయితీ

కేంద్రం ప్యాకేజీ పప్పు బెల్లానికే సరిపోదు
ప్రత్యేక హోదా పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులు పప్పు బెల్లానికే సరిపోవని జగన్‌ ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి హక్కుగా రావాల్సింది తప్ప మనకి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ప్రత్యేకంగా రాలేదని పేర్కొన్నారు. మనకు రావాల్సిన నిధులు కూడా ప్రత్యేక ప్యాకేజీలో చూపుతున్నా అన్నింటికీ సమ్మతమేనని తలూపుతున్న చంద్రబాబు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.