16 September 2016

బాబు గద్దెనెక్కాక ఓటర్లకు వెన్నుపోటు

  • అధికారం కోసం ఆచరణకు సాధ్యంకాని హామీలు
  • బాబు గద్దెనెక్కాక ఓటర్లకు వెన్నుపోటు 
  • ఎన్నికల హామీల అమలులో టీడీపీ బోల్తా
  • సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా తాకట్టు
  • ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

పదేళ్ల పాటు అధికారానికి దూరమైన నారా చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కడం కోసం ఆడని అబద్ధం లేదు. 2014 ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కాని హామీలు టీడీపీ మేనిఫెస్టోలో చేర్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఏ ఊరికి వెళ్లిన రైతులు, డ్వాక్రా మహిళల బ్యాంకు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఏ పేపర్లో చూసినా, ఏ గోడపై చూసినా ఇదే రాతలు కనిపించాయి. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఆరు వందల వాగ్దానాలు చేశారు.  రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు మించి హామీలు గుప్పించారు. పదవి చేపట్టిన ఆరు మాసాలలో కాపు వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చుతామన్నారు. రజకులను ఎస్సీ వర్గంలో చేరుస్తామని తాయిలాలు ఇచ్చారు. ఇలా ఎన్నో వాగ్దానాలు గుప్పించిన బాబు...గద్దెనెక్కాక మోసం చేయడమే తన నైజమని నిరూపించుకున్నారు, ప్రజలను పచ్చిదగా చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నాడు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌కు నాడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసిన బీజేపీ, టీడీపీలు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా కూడా ఈ హామీకి తూట్లు పొడిచారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారు. బాబు మెతక వైఖరి కారణంగా కేంద్రం హోదాకు బదులు చిల్లర విదిల్చి, దానికి ప్రత్యేక ప్యాకేజీ అని పేరు పెట్టింది. ప్రతి పనిలోనూ చంద్రబాబు కమీషన్లు దండుకుంటూ పాలనను గాలికొదిలేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కె ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందేమిటీ?... అధికారంలోకి వచ్చి రెండేన్నరేళ్లయినా చేసిందేమిటి? 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు చేసిన ఆరు వందల వాగ్ధానాల్లో కనీసం పది హామీలు కూడా నెరవేర్చ లేదని జూలై 8 నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా వెల్లడవుతోంది. ఏ ఇంటికి వెళ్లిన చంద్రబాబు పాలనకు ప్రజలు ఫెయిల్‌ మార్కులు వేస్తున్నారు. 

జన్మభూమి కమిటీలకు పెత్తనం
చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారం లేకుండా చేశారు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పెత్తనం వాటికి కట్టబెట్టారు. ఏ సంక్షేమ పథకం అమలు కావాలన్న ఈ జన్మభూమి కమిటీల ఆమోదం అవసరమని నిబంధనలు పెట్టడంతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, చివరకు ఎమ్మెల్యేలకు సైతం అభివృద్ధి నిధులు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెడుతున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి దోచుకుందామనే ఆలోచనలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం వంటి మహోన్నతమైన వ్యవస్థను చంద్రబాబు కలుషితం చేస్తున్నారు. ఇప్పటికైనా బాబు అరాచకాలపై ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాల్లో ప్రతి ఒక్కరం భాగస్వాములమై ఒత్తిడి తెస్తేనే పాలకుల్లో మార్పు వస్తుంది.

ఎన్నికలకు ముందు బాబు చేసిన వంద  వాగ్దానాలు..
1. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.  
2. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం బేషరతుగా బ్యాంకునుంచి విడిపిస్తాను అన్నాడు.  
3. గతంలో మాదిరిగా వ్యవసాయ రుణాలు వడ్డీ లేకుండా రూ. 1లక్ష లోపు, పావలా వడ్డీకే రూ. 3లక్షల లోపు రుణాలు అందజేస్తామన్నారు.
4. రుణ మాఫీ జరగకపోయినా, గతంలో మాదిరిగా రైతులకు పంటల బీమా అందజేస్తామన్నారు.
5. తమ వ్యవసాయ రుణాలపై 14% అపరాధ వడ్డీ కట్టకుండా రైతులు బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి లేకుండా చేస్తామన్నారు.
6. రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్తు అందజేస్తామన్నారు.
7. రైతుల కోసం రూ. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.  
8. కౌలు రైతులకు రుణమాఫీ చేస్తాం అన్నారు. 
9. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు రైతు పెట్టిన ఖర్చుకు 50 శాతం లాభం వేసి కనీస మద్దతు ధర ఇస్తాం అన్నారు.  
10. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మెగా ఫుడ్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
11. మహిళలకు పూర్తిగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు.
12. డ్వాక్రా సంఘాలకు లక్షవరకు వడ్డీ లేని రుణం ఇస్తాం అన్నారు. 
13. డ్వాక్రా సంఘాలకు గతంలో మాదిరి వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు.
14. మహిళల భద్రత కోసం మహిళా డ్రైవర్లు నడిపే ఆటోలు, ట్యాక్సీలు, ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేస్తాం అన్నారు.   15. పేద మహిళలందరికీ స్మార్ట్‌ సెల్‌ఫోన్లు ఇస్తానన్నారు.  
16. మహిళల భద్రతకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
17. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.
18. ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించే వరకు నెలకు రూ. 2,000 వరకు భృతి ఇస్తాం అన్నారు.
19. పోటీ పరీక్షలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతాం అన్నారు.  
20. ఏటా ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం అన్నారు. 
21. ప్రతి నిరుద్యోగికీ స్వయం ఉపాధికి రూ. లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు  ఇప్పిస్తామన్నారు.
22. ఆరు నెలల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.  
23. బాబు మాట మేరకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు.
24. ఎన్నికల హామీ ప్రకారం హోంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యా వాలంటీర్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు.
25. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచుతాం అన్నారు.  
26. మద్యం అమ్మకాలు తగ్గిస్తాం, బెల్టు షాపులన్నీ రద్దు చేస్తాం అన్నారు.  
27. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం చేస్తాం అన్నారు.  
28. పేదలకు 3 సెంట్ల భూమిలో లక్షన్నరతో పక్కా ఇల్లు అన్నారు. 
29. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు.  
30. పన్నుల భారం తగ్గిస్తామన్నారు.  
31. అవినీతి రహిత సుపరిపాలన అందిస్తాం అన్నారు.  
32. అన్ని వ్యాధులకు రూ. 2.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం అన్నారు.  
33. ప్రతి జిల్లా కేంద్రంలో ఎయిమ్స్‌ తరహాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు.
34. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ ఇస్తామన్నారు.  
35. ప్రతి నియోజకవర్గానికి వృద్ధాశ్రమాలు కడతాం అన్నారు.  
36. పేదలకు, కార్మికులకు రూపాయికే టిఫిన్, రూ.5కే భోజనం అన్నారు. 
37. కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్‌ కంప్యూటర్లు అందిస్తాం అన్నారు.  
38. కాలేజీ విద్యార్థులందరికీ ఐప్యాడ్‌ ఇస్తాం అన్నారు.  
39. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. 
40. పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం అన్నారు.  
41. హైస్కూల్, ఇంటర్‌ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తాం అన్నారు.  
42. బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులనే నియమిస్తాం అన్నారు. 
43. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలూ కల్పిస్తామన్నారు.  
44. ఇంటర్మీడియట్‌ వరకు పిల్లలందరికీ ఉచిత బస్సు పాస్‌ ఇస్తామన్నారు.  
45. ఇంటింటికీ రూ.2లకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తాం అన్నారు.  
46. ప్రతి గ్రామానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికీ కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు.  
47. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేస్తాం అన్నారు. 
48. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ నాటికి ఇల్లు ఉండేలా
ప్రభుత్వ స్థలాల కేటాయింపు చేస్తాం అన్నారు.  
49. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ పెడతాం అన్నారు.  
50. బీసీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
51. ఆధార్‌తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారా?
52. స్కాలర్‌షిప్పులకు బీసీల ఆదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుతాం అన్నారు.  
53. ధరలకు అనుగుణంగా హాస్టల్‌ మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్పులు పెంచుతాం అన్నారు. 
54. బీసీ కుల వృత్తులపై  వృత్తి, సేవల పన్నులు రద్దు చేస్తాం అన్నారు. 
55. నేతన్నలకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ఇస్తామన్నారు. 
56. నేతన్నల రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నారు.  
57. ఒక్కో చేనేత కుటుంబానికి లక్ష రుణం ఇస్తామన్నారు.  
58. నేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.  
59. నేతన్నలకు రూ. 1.5లక్షలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు నిర్మిస్తాం అన్నారు. 
60. చేనేత సంఘాలకు 50 శాతం సబ్సిడీతో మగ్గాలు ఇస్తాం అన్నారు.  
61. ఇతర చేతివృత్తుల వారందరికీS విద్యుత్‌ రాయితీ ఇస్తాం అన్నారు.  
62. సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇస్తాం అన్నారు.  
63. గాండ్లను బీసీ–బీ నుంచి ఎస్సీలుగా, సగరలను బీసీ–డీ నుంచి బీసీ–ఏగా, పూసల వారిని బీసీ–డీ నుంచి బీసీ– ఏగా, కురుమలను బీసీ–బీనుంచి ఎస్టీలుగా, వాల్మీకి(బోయ)లను ఎస్టీలుగా, పద్మశాలీలను బీసీ–బీ నుంచి బీసీ–ఏగా మారుస్తాం అన్నారు. 
64. కాపులను బీసీలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు.  
65. కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు బడ్జెట్‌లో పెడతాం అన్నారు. 
66. ఐఎస్‌బీ, నల్సార్, ట్రిపుల్‌ ఐటీ లాంటి సంస్థల్లో ఎస్సీ విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామన్నారు.  
67. వడ్డీ లేని ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ విధానం అమలులోకి తీసుకు వస్తాం అన్నారు.  
68. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రంగా మారుస్తాం అన్నారు.
 69. పోలవరం ప్రాజెక్టును 3 ఏళ్ళలోగా పూర్తి చేస్తామన్నారు.
 70. విద్యుత్‌ చార్జీలను పెంచబోం అన్నారు.
71. అసైన్డ్‌ భూములు, డీకేటీ భూములన్నింటికీ పట్టాలు ఇస్తాం అన్నారు.  
72. గర్భిణులకు పౌష్టిక ఆహారం కోసం రూ.10 వేలు ఇస్తాం అన్నారు.  
73. ఆడబిడ్డ పుడితే రూ.25వేల డిపాజిట్‌ చేసి,
యుక్తవయసు నాటికి రూ.2లక్షలు ఇస్తాం అన్నారు. 
74. ప్రతి గ్రామానికి తారు రోడ్డు–ప్రతి వీధికీ సిమెంట్‌ రోడ్డు, ఇంటింటికీ మరుగుదొడ్డి... నిర్మిస్తాం అన్నారు.  
75. కర్నూలు–అనంతపురం, రాజమండ్రి–కాకినాడ, విజయవాడ– గుంటూరు, నెల్లూరు– చిత్తూరు ఐటి
కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు.  
76. అన్ని జాతీయ రహదారులను ఆరు లేన్లుగా మారుస్తామన్నారు.  
77. ఆంధ్రప్రదేశ్‌కు 15 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు.  
78. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సంస్థకు రాయితీలు, ప్రోత్సాహకాలు.. అన్నారు.
79. బుల్లెట్‌ ట్రై న్స్‌ ప్రవేశపెడతాం అన్నారు.  
80. ఇసుక రేవులను పంచాయితీలకే అప్పగిస్తామన్నారు.  
81. ఆదాయ పరిమితి లేకుండా ఎస్సీలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తాం అన్నారు.  
82. గిరిజనుల పిల్లలకు కేజీ నుంచి  పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం అన్నారు.  
83. భూమి లేని గిరిజనులకు 2 ఎకరాల భూమి ఇస్తాం అన్నారు. 
84. గిరిజన యువతుల వివాహాలకు రూ. 50 వేలు సాయం చేస్తాం అన్నారు. 
85. గిరిజనులకు రూ. 5లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తామన్నారు.  
86. పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ల  స్థలాలు ఇస్తామన్నారు. 
87. వికలాంగులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు.  
88. లారీ, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.  
89. ప్రతి మండల కేంద్రంలోనూ జెనరిక్‌(చౌక) మందులషాపులు ఏర్పాటు చేస్తామన్నారు.  
90. దళిత క్రైస్తవులను ఎస్సీల్లోకి చేర్చటానికి చర్యలు తీసుకుంటాం అన్నారు.  
91. మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థికీ రోజూ కోడిగుడ్డు ఇస్తాం అన్నారు. 
92. కవులు, కళాకారులకు రూ. 5,116 గౌరవ వేతనం ఇస్తామన్నారు.  
93. సింగపూర్‌ లాంటి రాజధాని అని బాబు ఎన్నికలకు ముందు చెప్పారు.
94. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పారు.
95. ప్రభుత్వ భూములు ఇస్తాం అని కేంద్రం చట్టంలో చెప్పినా.. తుళ్లూరు, మంగళగిరి రైతుల భూములు
పూలింగ్‌ పేరిట తీసుకున్నారు.  
96. సింగపూర్‌ కంపెనీలు మనకు మంచి చేయటానికే వస్తున్నాయంటున్నారు. 
97. ఆపదలో ఉన్న మహిళలకు ఫోన్‌కాల్‌ వచ్చిన 5 నిమిషాల్లో సాయం అన్నారు. 
98. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 50శాతం రాయితీ అన్నారు. 
99. రాష్ట్ర నిర్మాణంలో తనకు అనుభవం ఉందని బాబు గొప్పులు చెప్పారు.
100. ప్రత్యేక హోదా పదిహేనేళ్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారు.

No comments:

Post a Comment