13 September 2016

యనమల వయసుకు తగ్గట్లు వ్యవహరిస్తే బాగుంటుంది

  • రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టే అధికారం బాబుకు ఎవరిచ్చారు
  • ప్రజల పక్షాన హోదా కోసం నినదించాం..అది ప్రజాస్వామ్యంలో హక్కు
  • స్పీకర్, గవర్నర్ లపై దాడి చేసిన సంస్కృతి టీడీపీది
  • ఎన్టీఆర్ బిక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఆయనచేతే కన్నీరు పెట్టించారు
  • అసత్య ప్రచారం మానుకోకపోతే టీడీపీకి తగిన గుణపాఠం తప్పదు
  • ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్ః స్పీకర్ ను బూచిగా చూపుతూ అధికార టీడీపీ తమపై బురదజల్లుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రత్యేకహోదా కోసం ప్రజల వాయిస్ వినిపించేందుకు... ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామే తప్ప స్పీకర్ , సెక్రటరీలపై దాడి చేసే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. స్పీకర్ పై దాడి చేశారు, సెక్రటరీ మెడకు వైర్ చుట్టారంటూ మంత్రి యనమల మాట్లాడడం దుర్మార్గమన్నారు. యనమలకు, ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాం.... మేం ఎవరిపై దాడి చేయలేదని కాణిపాకం వినాయకుడు, తిరుపతి వెంకన్నసాక్షిగా ప్రమాణం చేస్తాం. దాడి చేశామని అసత్య ప్రచారం చేస్తున్న మీరు దేవుడి మీద ప్రమాణ చేయగలరా అని సవాల్ విసిరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. 

రాష్ట్ర శ్రేయస్సు, యువత భవిష్యత్తు కోసం హోదాపై తాము అసెంబ్లీలో పట్టుబడితే ...అధికారపక్షం స్టేట్ మెంట్ ఇచ్చి తప్పించుకొని పోవాలని చూసిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సమైక్యంగా పోరాడుదామని హోదాపై చర్చ కోరితే... తప్పులు బయటకొస్తాయని ముఖ్యమంత్రి సభను వాయిదా వేసుకొని పోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కుదేపిస్తున్న హోదా కోసం తాము సభలో పోరాడుతుంటే...మార్షల్స్ ను తెప్పించి సభలో గందరగోళం సృష్టించి స్పీకర్, సెక్రటరీలపై దాడి చేశారంటూ అబంఢాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపికి టీడీపీ చేస్తున్న ద్రోహాన్ని ప్రజల పక్షాన తాము గళమెత్తామే తప్ప...వారిపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. స్పీకర్ ను సార్ అని సంబోధిస్తూ తాము సభలో హోదా ఆకాంక్షను ప్రతిబింబించిన విషయాన్ని మరవొద్దని సూచించారు.  

37 ఇయర్స్ ఇండస్ట్రీ అని మాట్లాడుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు వయసుకు తగ్గట్లు వ్యవహరిస్తే బాగుంటుందని చెవిరెడ్డి హితబోధ చేశారు. ఎన్టీఆర్ బిక్షతో రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవిస్తూ ఆయనకు మైక్ ఇవ్వకుండా కంటతడి పెట్టించిన సంస్కృతి యనమలదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చైర్ కింద టపాసులు పెట్టారు.  కుతూహలమ్మ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆమె చేత కన్నీరు పెట్టించారు. నాగం జనార్దన్ రెడ్డి  టీడీపీలో ఉన్నప్పుడు మైక్ విరగ్గొట్టి స్పీకర్ మీద దౌర్జన్యం చేయలేదా...రేవంత్ రెడ్డి గవర్నర్ సీటు పీక్కొచ్చి బయటపడేశారు.  అన్నీ మీరు చేసి మమ్మల్ని అంటారా...?   ప్రజల తరపున ప్రభుత్వ దుర్మార్గాల్ని ఎండగట్టడం తప్ప తమకు వేరే ఉద్దేశ్యం లేదని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేపట్టడం తమ హక్కు అని నొక్కి వక్కానించారు.  

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసత్యాలతో గ్లోబల్ ప్రచారం చేయడం మానుకోవాలని అధికార టీడీపీని హెచ్చరించారు. యనమలకు, స్పీకర్ కు మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉంటే అది వారు తేల్చుకోవాలే తప్ప తమపై అపవాదు వేయడం సరికాదన్నారు. ప్రత్యేకహోదా రాకపోతే తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళనతో న్యాయం కోసం రోడ్డుమీదకు వచ్చారని, బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చర్చ జరపాలని నిలదీశామన్నారు. హోదా ఉద్యోగం లాంటిదని రిటైర్ అయ్యేవరకు ఉంటుందని.. ప్యాకేజీ అప్పటికప్పుడు చేసే సాయం లాంటిదని మాత్రమేనన్నారు.  

విభజన తర్వాత 13వ షెడ్యూల్ లో పొందుపర్చిన అంశాలనే  ఇచ్చారు తప్ప కేంద్రం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని చెవిరెడ్డి అన్నారు. దాంట్లో కూడా కోత విధించారని.... రైల్వే జోన్,  కోస్టల్ కారిడార్, స్టీల్ ప్లాంట్ లాంటి వాటికి పరిష్కారమే చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా చంద్రబాబు, మోడీ, పవన్ కల్యాణ్ లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  పార్లమెంట్ దేవాలయం సాక్షిగా కాంగ్రెస్ హోదా ఐదేళ్లు అంటే, కాదు పదేళ్లు అని వెంకయ్యనాయడు అన్నారని....చంద్రబాబు 15 ఏళ్లు కావాలని కోరారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని వాడవాడలా చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో పెట్టారని..గద్దెనెక్కాక బాబు ప్రజలను మోసం చేశారన్నారు. 

అర్థరాత్రి ఏం కొంపలంటుకుపోయాయని ప్యాకేజీని ప్రకటించారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. బలవంతంగా జైట్లీచేత అర్థరాత్రి ప్రకటన ఇప్పించడం...దాన్ని స్వాగతిస్తున్నాని ముఖ్యమంత్రి చెప్పడమేంటని నిలదీశారు. టీడీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుతూ హోదాను ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఇచ్చిన హోదా అమలు ఉన్నప్పుడు....ఏపీకి వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. 14వ ఆర్థికసంఘం ఒప్పుకోవడం లేదని కుంటిసాకులు చెప్పడం సరికాదన్నారు. ఎక్కడా అభ్యంతరం లేదని 14వ ఆర్థికసంఘం చెబుతోందని, మరి టీడీపీ, బీజేపీలకు వచ్చిన ఇబ్బంది ఏంటో చూపించాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టే అధికారం బాబుకు ఎవరిచ్చారని చెవిరెడ్డి నిలదీశారు. 
2014 మార్చి 1న విభజన జరిగాక జరిగిన క్యాబినెట్ లో హోదా అప్రూవల్ అయ్యింది. 13వ ఆర్థికసంఘంలో  కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మరి అలాంటప్పుడు 2015లో వచ్చిన 14వ ఆర్థికసంఘం ఇబ్బంది పెట్టడమేంటని కడిగిపారేశారు. హోదాకు ఎందుకు ఒప్పుకోరు. ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు. ఓటుకు కోట్లు కేసునుంచి తప్పించుకునేందుకు పైన బీజేపీని...ప్రశ్నించిన ప్రతిపక్షాన్నిలోపల వేసేందుకు రాష్ట్రంలో డీజీపీని బాబు వాడుకుంటున్నారని విమర్శించారు. కేసు -సూట్ కేస్- లోకేష్ మాదిరి బీజేపీ-డీజీపీలా రాష్ట్ర పరిస్థితి  తయారైందన్నారు. 

No comments:

Post a Comment