30 April 2016

వైఎస్ జగన్ ను చర్చకు పిలిచే స్థాయి లోకేష్ కు లేదుః

లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు
బాబు అవినీతి, అక్రమాలను ఎండగడతాం
ఢిల్లీ పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు
దేశంలోనే ఏపీని అవినీతిలో నం.1 చేశాడు
త్వరలోనే బాబుకు తగిన బుద్ధి చెబుతారు
ఫిరాయింపుదారులంతా రాజీనామా చేయాల్సిందే
అప్పటివరకు సేవ్ డెమొక్రసీ కొనసాగుతూనే ఉంటుంది
వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందిః అంబటి

గుంటూరుః చంద్రబాబు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రజాధనాన్ని దోచుకొని ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఎరవేస్తున్నారని నిప్పులు చెరిగారు. రెండేళ్లలోనే బాబు లక్షా 34 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిని చూసి ఢిల్లీపెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ...వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయాలని చూస్తున్న బాబు కుట్రలను ఢిల్లీలో అందరికీ వివరించామన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.  

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ను చర్చకు పిలిచే స్థాయి లోకేష్ కు లేదని అంబటి రాంబాబు చురక అంటించారు. టీడీపీ కుట్రలకు వ్యతిరేకంగా పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్ అని అంబటి అన్నారు. ఏనాడు ప్రజల నుంచి గెలవని తండ్రి చాటు బిడ్డ లోకేష్ కూడా సవాల్ లు విసరడం హాస్యాస్పదమన్నారు. మీ ముఖారవిందాలకు వైఎస్ జగన్ అవసరం లేదని మా కార్యకర్తలను చర్చకు పంపిస్తాం మీరు సిద్ధమా అని లోకేష్ కు అంబటి ప్రతి సవాల్ విసిరారు. లోకేష్ తన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 

చర్చ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పెడతారా లేక విజయవాడలో పెడతారో రేపు సాయంత్రానికల్లా టైమ్ , ప్లేస్ చెప్పాలని అంబటి అధికార టీడీపీకి సవాల్ విసిరారు. కరప్షన్ చక్రవర్తి బాబు అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరకుమారుల్లాగా పారిపోవద్దని హెచ్చరించారు. లోకేష్ తన వల్ల కాకపోతే దేవినేని ఉమ, సుజనా చౌదరి లేక ప్రత్తిపాటి వారు కూడా కాకపోతే టీడీపీ పోలీస్ జేడీ రాములును కూడా చర్చకు తెచ్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. మీరు మీ నాన్న ఏవిధంగా దోచుకుంటున్నారో ప్రజలకు తెలుస్తుందన్నారు. చర్చలో గెలవకపోతే మీరు కేసులు పెట్టైనా గెలిపించుకుంటారంటూ ఎద్దేవా చేశారు.

కేంద్రమంత్రులు వైఎస్ జగన్ కు అపాయి మెంట్ ఎందుకిచ్చిందంటూ యనమల మాట్లాడుతున్నాడు. ఆయనకు అసలు సిగ్గుందా అంటూ అంబటి మండిపడ్డారు. అపాయిట్ మెంట్ ఎందుకిచ్చారో విజయవాడలో అరవడం దేనికని వెళ్లి మీ మిత్రపక్ష నేతలనే అడగాలన్నారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి బ్యాంకులకు వందలకోట్లు ఎగ్గొట్టినా ఆయన మంత్రివర్గంలో కలవొచ్చట. ఓటుకు కోట్లు కేసులో రోజూ కోర్టుకు వెళుతున్న రేవంత్ రెడ్డి పార్టీకి అధ్యక్షుడిగా ఉండొచ్చట. కానీ కేంద్రమంత్రులు మాత్రం వైఎస్ జగన్ కు అపాయిట్ మెంట్ ఇవ్వొద్దట. అలా మాట్లాడేందుకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ యనమలపై చిర్రెత్తారు. 

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీ స్థాయిలో బాబు అవినీతి బండారాన్ని బయటపెట్టడంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, అపాయిట్ మెంట్ ఇస్తే పరువు పోతుందని కేంద్రపెద్దల వద్ద బావురుమన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ను విమర్శించే నైతిక హక్కు  చంద్రబాబు, యనమల, లోకేష్ కు లేదని అంబటి అన్నారు.  లోకేష్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో ఢిల్లీకి వెళ్లిన బాబుకు యూపీఏ గవర్నమెంట్ లో ఒక్క మంత్రి కూడా అపాయిమెంట్ ఇవ్వలేదని అంబటి తెలిపారు. కానీ తాము కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అరుణ్ జైట్లీ , ధర్మేంద్ర ప్రదానును కలుసుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రులు మాకు అవకాశమిచ్చి చెప్పిందంతా విన్నా కూడా ఇంకా లోకేష్ కు అర్థం కాకపోవడం మూర్ఖత్వమన్నారు. 

తాము ఆస్తులు ప్రకటిస్తే వైఎస్ జగన్ ఎందుకు ప్రకటించడం లేదని లోకేష్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాబు ప్రకటించిన ఆస్తులన్నీ అతుకుల బొంత అని అంబటి అన్నారు. అన్నీ అబద్ధాలు చూపిస్తూ అభూత కల్పనలతో ప్రతి సంవత్సరం ఆస్తుల పేరుతో ఓడ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ స్థాయిలో మీరు రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైనాన్ని, ఎమ్మెల్యేలను ఏవిధంగా కొంటున్నారో కేంద్రమంత్రులకు సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఎన్సీపీ నేతలకు తెలియజెప్పామన్నారు.  బాబు చేస్తున్న బాగోతాలు తమకు కూడా అందాయని ఢిల్లీ పెద్దలు చెప్పిన విషయాన్ని అంబటి ధృవీకరించారు. దీనిపై వారు సీరియస్ గా స్పందించారని చెప్పారు. 

టీడీపీలోకి వెళ్లిన వారంతా రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు న్యాయస్థానాల ద్వారా వస్తాయని అంబటి తెలిపారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఫిరాయింపుదారులు  రాజీనామా చేసేవరకు సేవ్ డెమొక్రసీ కొనసాగుతుందని, బాబు చేస్తున్న ఘోరాలను వివరించేందుకు వైఎస్సార్సీపీ నిరంతర కృషి చేస్తుందని అంబటి వెల్లడించారు. బుకాయించే కార్యక్రమాలు చేయడంలో లోకేష్ కూడా వాళ్ల బాబుని మించిపోయాడని అంబటి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుమైన దోపిడీకి త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని అంబటి హెచ్చరించారు. భారతదేశంలోనే అవినీతిలో ఏపీని బాబు నంబర్ వన్ చేశాడని అంబటి దుయ్యబట్టారు. మిత్రపక్షం బాబుకు తొందరలోనే సరైన బుద్ధి చెబుతుందన్నారు. 

మే 2న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు

 • కరువు బాధలు పట్టని సర్కార్
 • అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
హైదరాబాద్ః ప్రజలు కరువుతో అల్లాడుతుంటే దాన్ని గాలికొదిలేసి...ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతూ ఎంతమంది వచ్చారని లెక్కలేసుకోవడం సిగ్గుచేటని  వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు వైఫల్యం మూలంగా  కరువు దెబ్బకు  ప్రజలు, మూగజీవాల జీవాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంతసేపు ఎమ్మెల్యేలను కొంటూ సంతోషపడుతున్నారే గానీ...ప్రజల బాధలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. 

ఏ ప్రభుత్వమైనా మార్చిలోనే వేసవి కాలంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్లాన్ చేసుకోవడం పరిపాటి అని పార్థసారథి అన్నారు.  జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులందరితో సమావేశం పెట్టి ...కరువు, తాగునీటి సమస్యలపై ప్రణాళికలు రూపొందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కానీ  ఏఫ్రిల్ చివరి వారం వచ్చినా కూడా కరువును, నీటి ఎద్దడిని ఏవిధంగా ఎదుర్కోవాలన్న సూచిక లేకుండా ఈప్రభుత్వం పనిచేయడం దారుణమని పార్థసారథి ఫైరయ్యారు. బాబు ఎంతసేపు  ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తప్పితే వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. 

అనంతపూర్ ను బాబు రాబోయే రెండేళ్లలో కోనసీమ కంటే పచ్చగా తయారు చేస్తాడంటూ కలల్లో విహరిస్తున్న టీడీపీ నేతలకు...తాజాగా జిల్లాలో నెలకొన్న  కరువు కనిపించడం లేదా అని నిలదీశారు.  తాగునీరు లేక ప్రజలు పడుతున్న అవస్థలు.  పశుగ్రాసం లేక మూగజీవాలు విలవిలాడుతున్న పరిస్థితి మీకు కానరావడం లేదా అని కడిగిపారేశారు.  కరువు, తాగునీరు, పశుగ్రాసం సమస్యలను  బాబు, టీడీపీ నేతలు మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. 

కృష్ణా జిల్లాకు పోయి నదుల అనుసంధానం చేశాం. బ్రహ్మాండంగా పంటలు పండించామని కలల్లో విహరింపజేస్తున్నారు. రైతులు పంటలు వేసుకోలేని దుస్థితి కల్పించి....కృష్ణా, గోదావరిని కలిపేశాం. అంతా బాగుందని నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.  కరువు దృష్ట్యా  రైతులను ఏవిధంగా ఆదుకోవాలి,  పంచాయతీలకు ఎంత నిధులు కేటాయించాలి. ట్యాంకర్ల ద్వారా నీటిని ఏవిధంగా సరఫరా చేయాలన్న కార్యాచరణ ఈప్రభుత్వానికి లేకపోవడం హేయనీయమని  పార్థసారథి తూర్పారబట్టారు. బాబు వస్తే జాబు అన్నారు. జాబు సంగతేమో గానీ బాబు వస్తే కరువు వస్తుందని మాత్రం  నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పశువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు  చేసేవారమని పార్థసారథి ఈసందర్భంగా గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి పశుగ్రాసం కొనుక్కొని కరువు జిల్లాలకు సరఫరా చేసే విధానం ఉండేదని, కానీ ఈప్రభుత్వానికి పశువుల గురించి పట్టించుకునే ప్రణాళికలేవీ లేకపోవడం బాధాకరమన్నారు. ఓ పక్క కరువు, ఇంకో పక్క నిధులు లేవంటారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని దుయ్యబట్టారు. బాబుకు ఎంతసేపు ఏవిధంగా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుదామన్న  ధ్యాసే తప్ప ...ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రాష్ట్రంలో నెలకొన్న కరువు దృష్ట్యా నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు... మే 2న అన్ని మండల , నియోజకవర్గ కార్యాలయాల్లో  ధర్నాలు చేపడుతున్నట్లు పార్థసారథి ప్రకటించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. పార్టీ నేతలందరూ ఈధర్నాలో పాల్గొంటారని చెప్పారు.  తమ అధ్యక్షులు వైఎస్ జగన్ కూడా మే 2వ తేదీ..ఉదయం 10 నుంచి 11 వరకు మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.  ఇక టీడీపీలోకి వెళ్లే వారంతా తాయిలాల కోసం వెళుతున్నారు తప్ప మరొకటి లేదని పార్థసారథి ఫైరయ్యారు. 

29 April 2016

వైఎస్సార్సీపీ ఢిల్లీ పర్యటన కు చక్కటి స్పందన

 • జాతీయ నాయకుల్ని కలిసిన పార్టీ నాయకులు
 • పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో హస్తిన పర్యటన
 • పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టూర్


న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బ్రందం ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అరాచకాల మీద జాతీయ స్థాయిలో చర్చను రేకెత్తించగలిగారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ అవినీతి కుంభకోణాల మీద రూపొందించిన పుస్తకం.. చంద్రబాబు, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం పలువురిని ఆకర్షించింది.
జాతీయ నాయకులతో భేటీ
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తో కలిసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి గా ఢిల్లీ కి చేరటంతో పరిస్థితి వేడెక్కింది. ముఖ్యమైన పార్టీలైన సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, జేడీయూ వంటి పార్టీల అగ్ర నేతల్ని కలిశారు. అవినీతి పనులతో లక్షల కోట్ల రూపాయిలు పోగేసుకోవటం, ఈ డబ్బుల్ని ఉపయోగించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయటం వంటి పనుల్ని జాతీయ పార్టీల నాయకులకు తెలియ చేశారు. ఫిరాయింపుల్ని అడ్డగోలుగా ప్రోత్సహిస్తున్న వైనాన్ని వివరించి చెప్పారు.
కేంద్ర మంత్రులకు ఫిర్యాదు
రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఉండటం, ప్రధానమంత్రి ఇతర షెడ్యూల్స్ తో బిజీగా ఉండటంతో సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ ని కలిశారు. విచ్చలవిడిగా అవినీతి చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబు అవినీతి చర్యల్ని సవివరంగా తెలియపరిచారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని అందించారు. చంద్రబాబు అవినీతి చర్యల మీద సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. అవినీతికి అడ్డుకట్ట వేయకపోతే ఏర్పడబోయే దుష్పరిమాణాల్ని వివరించి చెప్పారు.
ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు
ఎన్నికల సంస్కరణలకు సంబంధించి వైఎస్సార్సీపీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల చర్యలు తీసుకొనే అధికారం స్పీకర్ నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించాలని చెప్పటం, ప్రధాన ఎన్నికల హామీలను గాలికి వదిలేస్తే ఆ పార్టీలను తర్వాత ఎన్నికల్లో బహిష్కరించాలని డిమాండ్ చేయటం, తెలుగు నాట ఎన్నికలు ఒకేసారి జరిపించమనటం వంటి ప్రతిపాదనలు చేసింది.
సంచలనం రేకెత్తించిన పుస్తకం
చంద్రబాబు సాగిస్తున్న అవినీతి దందా మీద వైఎస్సార్సీపీ పుస్తకం రూపొందించింది. చంద్రబాబు..ఎంపరార్ ఆఫ్ కరప్షన్ అనే ఈ పుస్తకంలో అవినీతి బాగోతాన్ని పూసగుచ్చినట్లు వివరించటం జరిగింది. దీనికి సపోర్టుగా జీవో కాపీలు, స్కాన్ డ్ డాక్యుమెంట్లు పొందుపరిచారు. 128 పేజీల ఈ పుస్తకంలో గ్రాఫ్ లు, టేబుళ్లు సవివరణాత్మకంగా ఉన్నాయి. జాతీయ నాయకుల్ని కలిసి ఈ పుస్తకాన్ని అందించినప్పుడు వారు ఆసక్తికరంగా దాన్ని తిలకించారు. వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సంబంధిత పక్షాలు అందరికీ దీన్ని అందించటం జరిగింది.

ఆ పుస్త‌కం ఒక సంచ‌ల‌నం..!

న్యూఢిల్లీ: చంద్ర‌బాబు అవినీతి సామ్రాజ్యం మీద రూపొందించిన *చంద్ర‌బాబు.. ఎంప‌రార్ ఆఫ్ క‌ర‌ప్ష‌న్‌* అనే పుస్త‌కం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.128 పేజీల ఈ పుస్త‌కంలో మూడు ప్ర‌ధాన అంశాల్ని చ‌ర్చించ‌టం జ‌రిగింది. 31 కుంభ‌కోణాల‌కు చంద్ర‌బాబు ఏ విధంగా పాల్ప‌డిన‌దీ ఆధారాల‌తో స‌హా అందించ‌టం జ‌రిగింది. వీటికి తోడుగా జీవో కాపీలు, రిజిస్ట‌ర్ డాక్యుమెంట్ల ప్ర‌తులు జ‌త ప‌రిచారు. ఆయా కుంభ‌కోణాల్లో ఎంత మేర‌కు ల‌బ్ది చేకూరిన‌దీ వివ‌రించారు. వీటి ద్వారా సంపాదించిన సొమ్ముల‌తో చంద్ర‌బాబుఏ విధంగా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్న‌దీ తెలియ చేశారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఏ ర‌కంగా అప‌హాస్యం చేస్తున్న‌దీ స్ప‌ష్టం చేశారు.
ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో బాగంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మ‌రియు పార్టీ నాయ‌కుల బృందం ఢిల్లీ లో పర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో జాతీయ నాయ‌కుల్ని క‌లిసి ఈ పుస్త‌కాల్ని అందిస్తున్నారు. ఆయా పార్టీల నాయ‌కులు, కేంద్ర మంత్రులు ఆస‌క్తిగా ఈ పుస్త‌కాన్ని పరిశీలిస్తున్నారు. వివ‌రాల్ని అడిగి తెలుసుకొంటున్నారు. మొత్తం మీద ఈ పుస్తకం అందరి దృష్టిని ఆక‌ర్షించింద‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. 

27 April 2016

ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఎవరు ?

న్యూఢిల్లీ: ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గన్ నాయ‌క‌త్వంలో పార్టీ నాయ‌కులు సాగిస్తున్న ఢిల్లీ ప్ర‌యాణం విజ‌య‌వంతం అవుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని గాలికి వ‌దిలేసి అడ్డ‌గోలుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దోపిడీ విధానాలు అవ‌లంబించ‌టం, అవినీతిసొమ్ముతో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌టం వంటి విష‌యాల్ని విడ‌మ‌రిచి చెప్పేందుకు ఈ బృందం ఢిల్లీకి చేరింది. ఈ టీమ్ లో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు ఉన్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే పార్టీకి చెందిన సార‌థ్య బృందం అంతా ఢిల్లీలోనే ఉంద‌ని చెప్పుకోవాలి.

ఇంత భారీ సంఖ్య‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిపక్ష పార్టీకి చెందిన నాయ‌కులు ఢిల్లీ కి త‌ర‌లి రావ‌టం ప్రాధాన్యాన్ని సంత‌రించుకొంది. రాజ‌కీయ కురు వృద్ధుడు శ‌ర‌ద్ ప‌వార్‌ను, క‌మ్యూనిస్టు దిగ్గ‌జం సీతారాం యేచూరీ ని క‌లిసి చంద్ర‌బాబు విధానాల్ని విడ‌మ‌రిచి చెప్ప‌టం జ‌రిగింది. త‌ర్వాత కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ బృందం భేటీ అయింది. పార్ల‌మెంటు వ్య‌వ‌హారాల్లో ఎడ తెగని బిజీ గా ఉన్న‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ బృందంతో రాజ్ నాథ్ సావ‌ధానంగా స‌మావేశం అయ్యారు. వైఎస్ జ‌గ‌న్ అందించిన వివ‌రాల్ని సావ‌ధానంగా తీసుకొన్నారు. పార్టీ త‌ర‌పున వేర్వేరుగా అందించిన మెమోరాండంల‌ను ప‌రిశీల‌న‌కు తీసుకొన్నారు. సాయంత్రం జేడీయూ చీఫ్ శ‌ర‌ద్ యాద‌వ్ ను క‌లిశారు. నిష్క‌ళంకుడిగా పేరుగాంచిన శ‌ర‌ద్ యాద‌వ్ కు అవినీతి మంకిలం అంటించుకొన్న చంద్ర‌బాబు ఆగ‌డాల్ని విడ‌మ‌రిచి చెప్పారు.

మొత్తంగా పార్టీ బృందం ద‌ఫ ద‌ఫాలుగా జాతీయ నాయ‌కుల‌తో స‌మావేశం కావ‌టంతో ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఆధారాల‌తో స‌హా చంద్ర‌బాబు అవినీతి మీద రూపొందించిన పుస్త‌కాన్ని రాజ‌కీయ ప్ర‌ముఖులు స్వీక‌రించారు. అడ్డ‌గోలుగా ఎమ్మెల్యేల‌ను కొనుగోలుచేసేందుకు చంద్ర‌బాబు బ‌రితెగించ‌డాన్ని అన్ని వ‌ర్గాలు నిందిస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీ వ‌ర్గాల్లో ఈ విష‌యంమీద చ‌ర్చ‌ను రేకెత్తించ‌టం ద్వారా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ విజ‌యం సాధించార‌న్న మాట వినిపిస్తోంది. 

26 April 2016

బాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నడా..?

 • బాబువి దిగజారుడు రాజకీయాలు
 • మోసాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రలోభాలు
 • ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు

న్యూఢిల్లీః అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చంద్రబాబు...ప్రజల కోపాగ్ని నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు.  ఢిల్లీలో వైఎస్ జగన్ బృందం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యింది. బాబు అవినీతి పాలనపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని హోంమంత్రిని కోరినట్లు ఈసందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

పట్టపగలే ప్రజలు చూస్తుండగానే ఒక్కో ఎమ్మెల్యేకు  బాబు 20,30 కోట్లు ఎరవేస్తున్నారు.  ఇంతింత డబ్బులతో ఎమ్మెల్యేలను  కొనుగోలు చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని మరొకటి ఉండదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తీసుకుపోయే ధైర్యం లేదు.  నమ్మకం లేని పరిస్థితుల్లో బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పాలనను చూసి  ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర పరువు ఏవిధంగా తీస్తున్నాడో సీతారాం ఏచూరి మీడియాకు చెప్పారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మీ అందరి సహకారం కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా రావాలి అని వైఎస్ జగన్ మీడియాముఖంగా చెప్పారు. 

డీ లిమిటేషన్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ....దాన్ని వల్ల ఓ 50 మంది ఎమ్మెల్యేలకు ఉద్యోగాలిస్తాయి తప్ప సామాన్య ప్రజానికానికి ఎలాంటి లాభం ఉండదన్నారు.  ప్రజలకు కావాల్సింది విభజన హామీలు అమలు అవుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమన్నారు. ప్రత్యేకహోదా అడగకుండా డీలిమిటేషన్ అడిగితే బాబు అంత చరిత్ర హీనుడు మరొకరు ఉండరని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో  ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉండి కూడా అలా జరగకపోవడం అన్యాయంమన్నారు.  కచ్చితంగా బాబు అనైతిక, అవినీతి కార్యక్రమాలపై ఎంక్వైరీ జరగాలన్నారు. శరద్ పవార్ కు ఇచ్చిన నోట్  తో పాటు...విభజన హమీలకు సంబంధించిన నోట్ ను కూడా హోంమంత్రికి ఇచ్చామని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేకహోదా, పోలవరం, రైల్వే జోన్ సహా అనేక విభజన హామీల ప్రస్తావన లెటర్ కూడా అటాచ్ చేసి ఇచ్చినట్లు తెలిపారు. 

వైఎస్సార్సీపీ పోరాటానికి సీపీఎం పూర్తి మద్దతుః ఏచూరి

 • ఎమ్మెల్యేలను కొనడం దారుణం
 • ఏపీ ఇలా అభివృద్ధి అవుతుందనుకోలేదు
 • అవినీతిని ఇక్కడితో ఆపకపోతే దేశానికే ప్రమాదం
 • పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్లమెంట్ లో పోరాడుతాం

న్యూఢిల్లీః అవినీతి సొమ్ముతో ఎమ్మల్యేలను కొనడం దారుణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫైరయ్యారు. ఇలాంటి రాజకీయాలను దేశంలో తాను ఎప్పుడూ చూడలేదని ఏచూరి అన్నారు. కొత్త రాష్ట్రం ఏపీ అభివృద్ధి చెందుతుందని భావించాం గానీ ఇలా  అవినీతిలో అభివృద్ధి చెందుతుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. ఇది చాలా అవమానకరమన్నారు. ఈ అవినీతి రాజకీయాలను ఇక్కడితే ఆపకపోతే దేశంలో ప్రజాస్వామ్యమన్నదే లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం కోల్పోతే వ్యవస్థలను ఎవరూ కాపాడలేరన్నారు. 

చట్టాలు ఉల్లంఘించి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం దుర్మార్గమని ఏచూరి మండిపడ్డారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని సీతారాం ఏచూరి అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని...దీనిపై తాము పోర్లమెంట్ లో పోరాడుతామని ఏచూరి చెప్పారు. వైఎస్సార్సీపీ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉత్తరాఖాండ్ లో కన్నా ఘోరంగా ఏపీలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నాయని ఏచూరి ధ్వజమెత్తారు. ప్రజలు ఎవరికి ఓట్లు వేసి గెలిపిస్తారో దానికే విలువ లేకపోతే ఇక అర్థమేముంటుందని ఏచూరి వాపోయారు. ఎక్కడ వీలైతే అక్కడ ఫిరాయింపులపై పార్లమెంట్ లో పోరాడుతామన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు.  

చంద్రబాబు నీచ రాజకీయాలపై వైఎస్సార్సీపీ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తోంది. సేవ్ డెమోక్రసీ నినాదంతో హస్తినలో పోరాటం కొనసాగిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పార్టీ ఆఫీసులో కలుసుకున్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాల గురించి వైఎస్ జగన్ ఏచూరికి వివరించారు. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక కాపీని వైఎస్ జగన్ ఏచూరికి అందజేశారు. 

25 April 2016

పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు

 • ఢిల్లీ బయలుదేరిన వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు
 • జాతీయస్థాయిలో బాబు దుర్నీతిని ఎండగట్టనున్న నేతలు
 • రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్న వైఎస్ జగన్

హైదరాబాద్: కోట్లాది రూపాయలు, పదవులు ఎరచూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు దుర్నీతిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అనే నినాదంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తున్న చంద్రబాబుపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి  ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా వివధ  జాతీయపార్టీ  నాయకులను కలుసుకొని  బాబు కుట్ర రాజకీయాలను వైఎస్ జగన్ వివరించనున్నారు. మూడు రోజుల పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉంటారు. 

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ చంద్రబాబే స్వయంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాను కప్పుతున్న వైనాన్ని దేశం దృష్టిని ఆకర్షించేలా తెలియజేయబోతున్నారు. చంద్రబాబు అనైతిక, అవినీతి పాలనపై వైఎస్ జగన్  ఈనెల 23న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదేరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో  ‘సేవ్ డెమొక్రసీ’లో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో  కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అన్నిచోట్లా భారీ సంఖ్యలో ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.  

ఈ నేపథ్యంలో రాష్ర్టంలో అధికార టీడీపీ సాగిస్తున్న అరాచక రాజకీయ కార్యకలాపాల గురించి జాతీయస్థాయిలో ఎండగట్టే చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీయాత్ర తలపెట్టింది.  వివిధ జాతీయ పార్టీల అధ్యక్షులు లేదా పార్లమెంటరీ పార్టీల నేతల్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌లను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలవాలని నిర్ణయించారు. వారిచ్చే సమయాన్ని బట్టి ఈ మూడు రోజుల్లో కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారు.

బీజేపీ ని రాచిరంపాన పెడుతున్న పార్టీ ఏది ?

నెల్లూరు: సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో త‌న బుద్ది బ‌య‌ట పెట్టుకొంటోంది. బీజేపీ ని అడుగ‌డుగునా అవ‌మానిస్తూనే ఉంది. తాజాగా నెల్లూరు జిల్లా లో బీజేపీ, టీడీపీ నాయకుల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి.
నెల్లూరు జిల్లా వెంక‌ట గిరి లో చేనేత కార్మికుల కోసం ఉపాధి క‌ల్ప‌న స‌ద‌స్సు ని బీజేపీ ఏర్పాటు చేసింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ దీనికి మోకాల‌డ్డే ప్ర‌య‌త్నం చేశారు. చేనేత కార్మికులు, చేనేత జౌళి శాఖ అధికారులను పిలిపించి బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరుకావద్దని హెచ్చరించినట్లు స్థానికంగా గుసగుసలు వినిపించాయి. అటు చేనేత కార్మికుల్ని కూడా ఎమ్మెల్యే అనుచ‌రులు బెదిరించిన‌ట్లు స‌మాచారం. ఇందుకు తగ్గట్టుగానే  సదస్సుకు చేనేత కార్మికుల పలుచగా హాజరయ్యారు, చేనేత, జౌళీశాఖ జిల్లా అధికారులు డుమ్మాకొట్టారు. దీంతో  బీజేపీ నాయకులు తెలుగుతమ్ముళ్లపై విమర్శలకు దిగారు.
పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి విమర్శనాస్త్రాలు సంధిం చగా, మృదుస్వభావి అయిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సైతం ఒకింత ఘాటుగా స్పందిం చారు. మిత్రపక్షమవడంతో సంయమనం పాటిస్తున్నామని, పోరాట పటిమ లేక కాదు.. అవసరమైతే రోడ్లపైకి ఈడ్చగలమని అన్నారు. వరద బాధిత చేనేతలకు జన్మభూమి కమిటీలు నిర్ధారిస్తేనే పరిహారం మంజూ రు చేస్తారా.. వృద్ధులు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇస్తారా అని విరుచుకుపడ్డారు. 50 శాతం ఓట్లతో గెలిచి నా నియోజకవర్గంలో 100 శాతం ప్రజలకు సేవ చేయాలన్నారు. మీ వారికి న్యాయం చేసుకో, ఇతరులకు అన్యాయం చేస్తే సహించబోమన్నా రు. 

23 April 2016

బాబుకు సిగ్గు, శరం ఉంటే ..

 • అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలకు ఎర
 • సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడు
 • ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి
 • ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో రెఫరెండంగా తీసుకుందాం
 • సవాల్ ను స్వీకరించే దమ్ముందా బాబు
 • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్ః రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ...అలా వచ్చిన బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడని నిప్పులు చెరిగారు.  ఒక్కో ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు ఎరచూపుతున్నారని,  బాబు అవినీతిపై విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అవినీతి డబ్బులతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దుర్మార్గాలను ఆపాలని గవర్నర్ కు చెప్పామన్నారు.  రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ సవాల్ చేస్తున్నాం. నీ దగ్గర అధికారం, డబ్బులు, పోలీసులు ఉన్నారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు సపోర్ట్ పలుకుతున్నాయి. ఇంత ధన బలం, అధికారం ఉంది. అలాంటప్పుడు అనైతికంగా చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించడం లేదు. వారిని అనర్హులుగా ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని, ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేకే తీసుకుపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా కాపాడుతున్నాడని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. 

67 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది వెళ్లినంత మాత్రాన పార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదని వైఎస్ జగన్ అన్నారు. బాబు చేస్తున్న పాపాలకి..ఆ12న మందిని ప్రజల దగ్గరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  బాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమున్నా...సిగ్గు, రోశం ఏ కోశాన ఉన్నా పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో, దేవుడు ఎవరికి దీవెనలు అందిస్తారో రెఫరెండంగా తీసుకుందామన్నారు. సవాల్ ను స్వీకరించే దమ్ము నీకు ఉందా అని వైఎస్ జగన్ బాబును ఛాలెంజ్ చేశారు.  
 
రాష్ట్రంలో అవినీతి ఏవిధంగా జరుగుతుందో గవర్నర్ కు వివరించామన్నారు. చంద్రబాబు  ఏరకంగా జీవోలు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేశారు. నిబంధనల ప్రకారం ఈబీసీలో రేట్లు పెంచే అవకాశం లేకున్నా...కొంత మంది కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఏవిధంగా లబ్ది చేకూర్చారో గవర్నర్ కు తెలియజేశామన్నారు. పెట్రోల్ , డీజిల్, స్టీల్ తక్కువకే దొరుకుతోంది. సాండ్ ఫ్రీగా లభిస్తోంది, సిమెంట్ ధరలు పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 22 విడుదల చేసి కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే కార్యక్రమం ఏవిధంగా చేశాడో వివరించామన్నారు. 

పట్టిసీమలో ఎలాంటి స్టోరేజ్ కెపాసిటీ లేకపోయినా .... కేవలం డబ్బులు దండుకునేందుకు 22 శాతం ఎక్సస్ కు రూ. 1600 కోట్లలో  రూ. 500 కోట్లు లూటీ చేశారన్నారు. ఇసుక మాఫియాలో చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాకింత నీకింత అన్నట్లుగా  భాగాలు పంచుకుని ఏవిధంగా వేలకోట్లు తిన్నారో కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజధాని ప్రాంతంలో  బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్  సీక్రసీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి చంద్రబాబు,మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు తీరని అన్యాయం చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పలానా చోట్ల రాజధాని వస్తుందని బాబుకు తెలిసి కూడా అది బహిర్గతం చేయకుండా తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే చెప్పాడు.  తన బినామీలు రైతుల నుంచి  భూములు కొన్నాక ... డిసెంబర్ లో అమరావతిలో రాజధాని అని ప్రకటన చేశాడు. మేలో ప్రమాణస్వీకారం చేస్తే డిసెంబర్ దాకా మిస్ లీడ్ చేశాడు. అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అంటూ గందరగోళం సృష్టించారు. బినామీలు అమరావతిలో భూములు కొన్నాక డిసెంబర్ లో ఇక్కడ వస్తుందని చెప్పాడు. చంద్రబాబు చేసిన మోసాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాక మరేమంటారని ప్రశ్నించారు. 

జోనింగ్ పద్ధతిని తీసుకొచ్చి చంద్రబాబు తన బినామీల భూములను కమర్షియల్ జోన్ లో పెట్టి, రైతుల భూములను అగ్రికల్చర్ జోన్ లో పెట్టారు. తద్వారా రైతులు భూములు అమ్ముకోలేని పరిస్థితిని తీసుకొచ్చి...తన బినామీల భూముల రేట్లు పెంచి అమ్ముకునేందుకు మాత్రం వెలుసులు బాటు కల్పించుకున్నారు. కరెంట్ తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నా కూడా ప్రైవేటు వ్యక్తులతో ఎక్కువ  రేట్లకు కరెంట్ కొనుగోలు చేసే ఒప్పందం చేసుకున్నారు. దీన్ని  తప్పుబడుతూ ఇండియన్ ఎనర్జీ ఎక్స్ చేంజ్ ఏపీఈఆర్సీకి లెటర్ రాసింది. ఈవిషయాలన్నింటినీ గవర్నర్ కు వివరించామని వైఎస్ జగన్ చెప్పారు. 

నల్లధనం ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు. మంత్రిపదవులు ఎరచూపడం మరో తప్పు. వైఎస్సార్సీపీ గుర్తుపై ఆఎమ్మెల్యేలు గెలిచారు. ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేశారు. అలా గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కోవడం దుర్మార్గం. వారు రాజీనామా చేయకపోవడం,స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించకపోవడం ఎంతవరకు సబబు. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంది. చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చుతున్న పరిస్థితికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. దీంతో పాటు ఈనెల 25న ఢిల్లీ వెళ్లి బాబు అవినీతి డబ్బులను ఎరగా చూపుతున్న వైనాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న విధానాన్ని ప్రధాని, రాష్ట్రపతి, ఇతర రాజకీయ పక్షాలకు వివరిస్తాం. లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం.స్పీకర్ కు లెటర్ ఇచ్చాం. ఇంతటితో ఇది ఆపబోం.  స్పీకర్ కూడా ఇందులో భాగస్వామి కాబ్టటి ఆయన వాళ్లను ఎలాగూ అనర్హులుగా ప్రకటించరు. గనుక కోర్టులో  కూడా పోరాడుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

22 April 2016

సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోళ్లు

చంద్రబాబు నీచ రాజకీయాలపై ప్రజాగ్రహం

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి, అక్రమాలే పరమావధిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అవినీతి సొమ్మును వెదజల్లుతూ నిస్సిగ్గుగా,  ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేస్తున్న చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణ‌లో ఎమ్మెల్యేలను  కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయ‌ల‌ు ఇవ్వజూపుతూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...ఇప్పుడు అదే దుర్బిద్ధిని ఏపీలో కొనసాగిస్తున్న విధానంపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. 

రాజ్యాంగ విలువ‌లకు తిలోదకాలిస్తూ , ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిహాసం చేస్తూ పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్న బాబు చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా ..వైఎస్సార్‌సీపీ ఈ నెల 23న సేవ్ డెమొక్ర‌సీ ఆందోళ‌న చేపట్టనుంది.   దీనికి వామ‌ప‌క్షాల‌ు స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన సంఖ్యాబ‌లం ఉన్న‌ప్ప‌టికీ అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టంపై ఆయా పార్టీల నేత‌లు విరుచుకు ప‌డుతున్నారు. ఇది ఎమ్మెల్యేల‌ను ఎన్నుకున్న ఓటర్ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని, ఇలాగే వ్య‌వ‌హారిస్తే ప్ర‌జా విప్ల‌వాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

అధికారంలోకి వ‌చ్చాక ఐదేళ్ల వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌తో అవ‌స‌రం లేద‌నే విధంగా బ‌రితెగించి వ్య‌వ‌హారిస్తే ప్ర‌జ‌లే ప్ర‌తిప‌క్ష‌మ‌వుతార‌ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తున్న చంద్రబాబు తీరుపై రాష్ట్రావ్యాప్తంగా విస్తృత‌మైన చర్చ జ‌రుగుతోంది. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కోసం వైఎస్సార్‌సీపీ చేప‌ట్టిన సేవ్ డెమొక్ర‌సీ ఉద్య‌మంలో తామూ భాగ‌స్వాముల‌వుతామ‌ని ప్ర‌జ‌లు భారీగా ముందుకు వ‌స్తున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో  వైఎస్సార్సీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతారు. అదేవిధంగా పెద్ద ఎత్తున బహిరంగసభలు నిర్వహించి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారు. 

21 April 2016

రాజవంశం పరువు తీసిన రాజా వారు

 • పుట్టిన రోజు వేళ బాబు నీచ రాజకీయాలు
 • రాజీనామా చేయకుండా పచ్చకండువా కప్పుకోవడం సిగ్గుచేటు
 • ఆనాడు వైస్రాయ్ లో వెన్నుపోటు జాతర
 • ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైనం
హైదరాబాద్ః చంద్రబాబు అప్రజాస్వామిక విధానాన్ని నిరసిస్తూ ఈనెల 25న వైఎస్సార్సీపీ తలపెట్టిన సేవ్ డెమెక్రసీ ఆందోళనను 23న నిర్వహిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఈనెల 25న రాష్ట్రపతి అపాయిమెంట్ లభించే అవకాశం ఉన్నందున తేదీని రెండ్రోజుల ముందుకు మార్చినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు దీన్ని గమనించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పెను ప్రమాదం వచ్చింది గనుక   జాతీయస్థాయిలో కూడా దీనిపై ఉద్యమం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. దీన్ని జాతీయస్తాయిలో ఎలుగెత్తకపోతే ప్రజాస్వామ్యానికి సమాది కట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో జాతీయస్థాయిలో ఆందోళనకు కంకణం కడుతూనే..బాబు కుట్ర రాజకీయాలను  రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా నిరసనలు చేపడుతామన్నారు. 

బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు ముఖ్యమంత్రి సమక్షంలో పచ్చకండువా కప్పుకొని చేసిన వ్యాఖ్యలు  హేయనీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు.  తమది రాజవంశం, ఉన్నతస్థాయిలో ఆలోచిస్తాం. పార్టీలు మారే చౌకబారు రాజకీయాలు చేయమని మాట్లాడిన బొబ్బిలి రాజావారు...అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే పార్టీ మారుతున్నానంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలు మీకు గత ఎన్నికల్లో ఏం తీర్పుఇచ్చారు రాజా వారు.  ప్రజలు నిన్ను వైఎస్ జగన్ తో ఉండమని గెలిపించారు. అలాంటి నీవు బాబు ఇచ్చే వంద,150 ఎకరాల కోసమో, మంత్రి పదవి కోసమే  వెళుతూ ప్రజల తీర్పును తుంగలో తొక్కావ్. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే హక్కు నీకు ఎవరిచ్చారని నిలదీశారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ రాజకీయాలు చేసేవాళ్లే నీతివంతులన్నట్లుగా బొబ్బిలి రాజా మాట్లాడుతున్నాడు. పచ్చకండువా కప్పుకుంటే తప్ప చంద్రబాబు ప్రజలకు రేషన్ ఇవ్వడు, ఇళ్లు ఇవ్వడనే కప్పుకుంటున్నారా.   రాజీనామా అంటే ఎందుకంత ఉలికిపడుతున్నారు. మీది రాజవంశమయితే, పౌరుషం, సత్తా ఉంటే  పదవికి రాజీనామా చేసి వెళ్లాలి. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును కాలతన్నుతున్న సుజయకృష్ణకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. 

కేంద్రమంత్రిగా ఉండి రాష్ట్రానికి వెంట్రుకంత సహాయం కూడా చేయని అశోక గజపతిరాజు... వైఎస్ జగన్ పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. అశోకగజపతి రాజు దళారీగా మారాడు.  వంశం పేరు చెప్పుకొని  సుజయకృష్ణ రంగారావు తాండ్రపాపారాయుడు పరువు దిగజార్చాడు.  బొబ్బిలి చరిత్రను మలినం చేసి.... ఈ రాజకీయాలే గొప్ప రాజకీయాలన్న బ్రాండింగ్ చేసుకుంటున్నారు. వీళ్లందరినీ ముంచడానికి  కృష్ణా, గోదావరి నదులు కూడా సరిపోవని వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు. చంద్రబాబు మార్కు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.  

అన్యాయమైన ఏపీకి మోడీ-బాబు జోడితో ఏపీకి ఏదో  న్యాయం జరుగుతుందని మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించారు. రైతులు, మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ అన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. కాపులకు, ఎస్సీలకు, వివిధ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. వందలకొద్దీ హామీలు గుప్పించి ఇవాళ ఏ ఒక్కటీ అమలు చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పలానా పని చేశానని చెప్పుకునే దమ్ము లేక,  కాళ్లకింద భూమి కదులుతుండడం వల్లే... చంద్రబాబుకు  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నాడని పద్మ ఫైరయ్యారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే ..ఎవరూ తమ అవినీతిని ప్రశ్నించకూడదన్న దుర్భిద్దితో ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలన్న కుటిలనీతికి పాల్పడుతున్నాడు.  వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక, గోముఖ వ్యాఘ్యాల్లాగా అందరూ కలిసి జననేతపై బండలు వేస్తన్నారని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు.  కాల్ మనీ స్కాం లో 200 సీడీలతో  ఆడియా, వీడియాలతో పట్టుబడిన తమ్ముళ్లను కేసుల నుంచి తప్పించి...దాన్ని ఎవరూ అడగకూడదన్న ఉద్దేశ్యంతో బాబు  ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టాడని మండిపడ్డారు. ప్రజల తీర్పును గౌరవించరు. ఎన్నికలంటే వణుకు. రాజీనామా అంటే పారిపోతున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూ పచ్చకండువాలు కప్పి జాతర చేస్తున్నాడు. ఆ నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడుస్తూ వైఎస్సాయ్ హోటల్ లో కండువాలు కప్పి జాతర చేశారు. ఇవాళ  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మరో జాతర చేస్తున్నాడు. 

ప్రతిపక్షం మాట నిలుపుకోవడం లేదని మాట్లాడుతున్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది మీరు. మీరు విఫలమై ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోవడం అవివేకమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  ప్రతిపక్షం బలంగా ఉందనే చంద్రబాబుకు తన బలంమీద నమ్మకం లేక....వైఎస్సార్సీపీని  బలహీనం చేయాలన్న  కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. జాతీయస్థాయిలో ఎంతోమందిని  ప్రధానులను చేశా,  రాష్ట్రపతిలను చేశానని చెప్పుకుంటున్నావే...ఈ రకంగా కండువాలు కప్పితే నవ్విపోరా బాబు . ఏపీకి ఇదేమన్నా రోగమా అని ఉమ్మేయరా బాబు అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 

రాష్ట్ర పరువును బాబు ఢిల్లీ బజారున పడేశారని వాసిరెడ్డి పైరయ్యారు. పుట్టినరోజు వేళ ఎవరైనా మంచి పని చేయాలనుకుంటారు. అమ్మా, నాన్నల రుణం తీర్చుకునేందుకు ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకుంటారు. దానీ చంద్రబాబు అనే ఈపెద్దమనిషి రాజీనామా చేయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పి నీచ రాజకీయాలు చేస్తున్నారు.  నీతి, నిజాయితీతో కూడిన నికార్సయిన  రాజకీయాలు చేయడం ఈజన్మలో నీకు చేతకాదా బాబు అంటూ చురక అంటించారు.  ఒక్క వ్యక్తితోనైనా నిజాయితీ పరుడినని చెప్పుకోగలిగారా..? బాబు ఆయన చేసిన అవినీతే రాజకీయం అనుకుంటున్నాడని పద్మ మండిపడ్డారు. 

చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు ...కులాల మధ్య చిచ్చు, ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్న స్కాంలు బయటకు వస్తున్నా ...ఆ రాజకీయాలే మాకు నచ్చాయంటూ  ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం సిగ్గుచేటు. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతున్న జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రజల  గురించి మాట్లాడే అర్హత లేదని పద్మ అన్నారు. బాబు ఎమ్మెల్యేలను కొనొచ్చేమే గానీ ప్రజలను కొనలేరని దుయ్యబట్టారు.అభివృద్ధి చేశామన్న మాటే నిజమైతే...పచ్చకండువాలు కప్పిన  ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించాలని బాబుకు సవాల్ విసిరారు. 

అశోకగజపతి రాజు లాంటి వాళ్లు మాట్లాడ్డం చూస్తుంటే వాళ్ల నైతికత ఏ స్థాయిలో పతనమవుతోందో అర్థమవుతోంది. ఒక్క వైఎస్ జగన్ మీద ఇంతమంది కక్షగట్టి కుట్రలు చేస్తునారు.  వైఎస్ జగన్ ను అడ్డుకోవడం కోసం ఉచ్చం, నీచం అన్నిమర్చిపోయారు. మనిషి రాజకీయ పతనం ఇవాళ చూస్తున్నాం. నీతిగా వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక మీకు మీరే పతనం అయిపోతున్నారు. ఎందాకా ఈరాజకీయం కొనసాగిస్తారో చూస్తాం అంటూ పద్మ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

20 April 2016

పార్టీ ఫిరాయింపుల‌కు మూలం ఏంటి ? • రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు
 • నీటి ఎద్దడిని నివారించడంలో విఫలం
 • ప్రజాసమస్యలు గాలికొదిలి ఎమ్మెల్యేలకు ఎర
 • ప్రధాని, రాష్ట్రపతి, ఈసీ దృష్టికి ఫిరాయింపుల వ్యవహారం
 • ప్రభుత్వ దుర్మార్గాలపై నిరసన సెగలు
 • ఈనెల 25న ఖాళీ బిందెలతో నిరసన
 • మే 2న జిల్లా కేంద్రాల దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
హైదరాబాద్ః  భానుడి భ‌గ‌భ‌గ‌ల‌ను త‌ట్టుకోలేక రాష్ట్రంలో ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతుంటే... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పార్థ‌సార‌ధి మండిపడ్డారు. క‌రువు, నీటిఎద్ద‌డికి సంబంధించి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోని కారణంగానే ఈపరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవడం మానేసి.. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డంపైన దృష్టి సారించడం సిగ్గుచేటని టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. 

క‌రువు పరిస్థితులను శాశ్వ‌తంగా ప‌రిష్కరించ‌గ‌లిగే ప్రాజెక్టుల్ని, రాష్ట్రానికి రావాల్సి నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు ముందుకు రాని ప్రభుత్వం....రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఫిరాయింపుదారుల‌ను మాత్రం ప్రోత్సహిస్తుందని ఫైరయ్యారు.  రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు ఏన్నడూ లేని విధంగా ప‌శువులు క‌బేళాలకు త‌ర‌లిపోతున్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌రువు పరిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు...తన హయాంలో ప‌శుక్రాంతి ప‌థ‌కం పేర పేద‌ల‌కు ఉచితంగా ప‌శువుల‌ను అందజేశార‌ని గుర్తు చేశారు. కానీ, బాబు  ప‌శువుల‌కు కనీసం నీటిని కూడా స‌మ‌కూర్చ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

వ‌డ‌దెబ్బ‌, ఎండ‌వేడిమిని త‌ట్టుకునేందుకు హెరిటేజ్ మ‌జ్జికను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ంటూ బాబు కోట్ల రూపాయిలు చెల్లించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. నీటి ఎద్ద‌డి ఉన్న రాష్ట్రాల్లో  ఆయా ప్రభుత్వాలు రైళ్ల ద్వారా నీటిని అందిస్తున్నా...చంద్రబాబు మాత్రం క‌రువుపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించ‌డం సిగ్గుచేట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ, కోట్లాది రూపాయ‌లు ఎర‌చూపి ఎమ్మెల్యేలను కొంటున్న తీరును నిరసిస్తూ ....సేవ్ డెమోక్రసీ పేరున  ఈ నెల 25న ప్ర‌తి జిల్లా కేంద్రంలో కొవ్వుత్తుల ప్ర‌ద‌ర్శ‌న నిర్వహిస్తామన్నారు. కరువుపై ప్రభుత్వం అలసత్వానికి నిర‌స‌న‌గా మే 2న అన్ని మండ‌ల కేంద్రాల్లో ఖాళీ బిందెల‌తో నిర‌స‌న‌లు తెలుపుతామన్నారు. 

నీటి ఎద్ద‌డిని ప‌రిష్కరించడంలో  టీడీపీ విఫ‌లం
వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి అనంత వెంక‌ట్రామిరెడ్డి 
తాగునీటి ఎద్ద‌డిని ప‌రిష్కరించ‌డంలో టీడీపీ విఫ‌ల‌మైందని  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రాంరెడ్డి అన్నారు. త్వరలోనే   వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంద‌రు...ఫిరాయింపులను ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్రపతి, ఈసీ దృష్టికి తీసుకెళ్తారని అనంత స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయడం అనైతిక చర్యగా అభివర్ణించారు. అదేవిధంగా గత ఏడాదికి సంబంధించిన పంట‌న‌ష్ట ప‌రిహారం... ఇంత‌వ‌ర‌కు రైతుల‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న ఆగ్రహం వెలిబుచ్చారు.  సుప్రీంకోర్టు సైతం ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా నిధులు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధులను కూడా బాబు తన కార్యకర్తలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. 

19 April 2016

పేపర్లో తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నారు

 • పార్టీ మారే ప్రసక్తే లేదు
 • తామంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులం
 • వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నాం

పార్టీ మారుతున్నారంటూ తమపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసురెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి వైఎస్సార్సీపీలోనే ఉన్నానని, మంత్రి పదవిని సైతం వదిలి వచ్చానని చెప్పారు. తామంతా వైఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానులమని స్పష్టం చేశారు.  పార్టీ మారే ప్రసక్తే లేదని, తమపై వస్తున్న వార్తలన్నీ అభూత కల్పనలేనని కొట్టిపారేశారు.  

వైఎస్ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని బాలినేని తేల్చిచెప్పారు. చిన్న చిన్న సమస్యలున్నా, అధ్యక్షులు వైఎస్ జగన్ అంతా సర్దుబాటు చేస్తారని చెప్పారు. అంత మాత్రం దానికే ఎవరూ పార్టీ వీడే పరిస్థితి ఉండదన్నారు. వ్యక్తిగత కారణాలతోనే కొద్దికాలం దూరంగా ఉన్నాను తప్ప అంతుకుమించి మరేమీ లేదన్నారు. 

తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలిపారు. తామంతా వైఎస్ జగన్, శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదని ఆయన అన్నారు. 

అమ్మ అంటే అందుకే ఇష్టం

వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 60 వసంతాలు పూర్తి చేసుకొన్న వైఎస్ విజయమ్మను కలిసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలు చెబుతున్నారు.
1956 లో ఏప్రిల్ నెల 19న జన్మించిన వైఎస్ విజయమ్మ స్వగ్రామంలోనే చదువును పూర్తి చేశారు. తర్వాత 1972 వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో వివాహం అయ్యాక పులివెందులలో ఎడుగూరి సందింటి కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టారు. అప్పటి నుంచి అత్తింటి వారి గౌరవాన్ని పెంచే విధంగా మెలగుతూ వచ్చారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగిగా .. కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు పాలు పంచుకొంటూ వచ్చారు. జీవితంలో ఏ నాడూ తనను విసుక్కోలేదని వైఎస్సార్ స్వయంగా ఆమెకు కితాబు ఇచ్చారు.
దివంగత మహానేత మరణం తర్వాత వైఎస్ విజయమ్మ రాజకీయం ప్రవేశం చేయాల్సి వచ్చింది. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడినందుకు గాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీ తరపున  తిరిగి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్ ను కేసుల్లో ఇరికించిన పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షురాలిగా, శాసనసభ పక్ష నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీని ఆమె ముందుక నడిపించారు. ప్రజలకు సంబంధించిన అనేక అంశాల మీద ఆమె పోరాటాన్ని సాగించారు.
పార్టీ కార్యాలయం, వైఎస్ జగన్ నివాసానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలు, నాయకుల్ని ఆమె అభిమానంగా చూస్తుంటారు. వైఎస్సార్ అభిమానులు అందరినీ ఆప్యాయంగా పలకరించటం ఆమెకు అలవాటు. అందుకే ఆమె పుట్టిన రోజున అంతా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

18 April 2016

జనంలోకి వెళ్దాం. నీకు ఓట్లు వేస్తారో, నాకు వేస్తారో తేల్చుకుందాం

 • అబద్ధాలు చెప్పడం, మోసం చేయడమే బాబు నైజం
 • ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు 
 • అవినీతిపై ఎంక్వైరీ జరుగుతుందని బాబు భయం
 • అందుకే రాష్ట్ర ప్రజల ప్రయోజానాలు తాకట్టు పెట్టాడు
 • దమ్మూ, ధైర్యం ఉంటే కొనుక్కున్నఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
 • అప్పుడే అయిపోలేదు..అసలు పోరు ఇప్పుడే మొదలైంది
 • అందరం కలిసికట్టుగా రైల్వో జోన్ కోసం ఉద్యమిద్దాంః వైఎస్ జగన్
విశాఖపట్నంః చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోవడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం..అయిపోయాక ప్రజలను మోసం చేయడమే బాబుకున్న విశ్వనీయత అని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని...బాబును రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. బాబు పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారు గనుకే ఇవాళ రాష్ట్రంలో ధర్నాలు, దీక్షలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో గుడివాడ అమర్నాథ్ ను పరామర్శించిన జననేత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని, లేనిపక్షంలో దీక్ష చేస్తానని అమర్ నెలరోజుల ముందే చెప్పిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలంటూ ముఖ్యమంత్రికి, ప్రధానికి సైతం లేఖ రాశారని పేర్కొన్నారు. ఎటువంటి స్పందన లేకపోవడం వల్లే బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున అమర్నాథ్ దీక్షకు కూర్చున్నారని వైఎస్ జగన్ చెప్పారు. 

బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బాబు ఇచ్చిన రుణాలు రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదు. డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. రుణాల మాఫీ దేవుడెరుగు. రూ. 2 వడ్డీలు కట్టే దుస్థితికి తీసుకొచ్చాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ ఫోజులు కొట్టాడు. బాబుకయితే ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది గానీ...రాష్ర్టంలో ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. పైపెచ్చు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి...ఇప్పుడు దానిపై మాట తప్పుతున్నారు.  కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ అన్నాడు. దాని ఊసేలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్నెళ్ల వరకు జీతాలు చెల్లించడం లేదు. ఇలా ప్రతి ఒక్కరినీ బాబు మోసం చేస్తున్నారని  వైఎస్ జగన్ మండిపడ్డారు.  

ప్రత్యేకహోదా వస్తే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభించేవన్నారు. ఆ హోదాను కూడా చంద్రబాబు కేంద్రం వద్ద పణంగా పెట్టాడని, దాని గురించి అడిగే నాథుడే కరువయ్యాడన్నారు. వైఎస్సార్సీపీ తరపున తాము అడుగుతున్నాం కాబట్టే ఇవాళ హోదా బతికుందని జననేత స్పష్టం చేశారు. లేకపోతే అడిగేవాడే లేడన్నారు.  హోదా మాదిరే విశాఖకు రైల్వే జోన్ వస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రైల్వే జోన్ లేని కారణంగానే ఉద్యోగాల కోసం ఒరిస్సాకు వెళుతున్న ఏపీ నిరుద్యోగులను అక్కడివాళ్లు తరిమికొట్టే పరిస్థితి వచ్చిందని వాపోయారు. 

సికింద్రాబాద్ రైల్వే జోన్ తెలంగాణకు వెళ్లిపోయింది.  ఏపీకి రావాల్సిన రైల్వే జోన్ ఒరిస్సాకు వెళ్లిపోయింది. ఉద్యోగాల కోసం ఒరిస్సాకు వెళుతున్న ఏపీలోని యువకులు అక్కడ తలెత్తుకొని పరీక్షలు రాయలేని పరిస్థితి.  విశాఖకు రైల్వే జోన్ వస్తే 16 హెచ్ వోడిలు వస్తాయి. కొత్త రైళ్లు, లైన్లు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మెరగువుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకహోదా తీసుకురారు. ఉద్యోగాలు ఇవ్వరు. బాబును ఒక్కటే  సూటిగా అడుగుతున్నా. అధికారంలోకి వచ్చి రెండేళ్లయిపోయింది. మీరు ఏం చేస్తా ఉన్నారు.  ప్రత్యేకహోదా , రైల్వే జోన్, పోలవరానికి సంబంధించిన వనరులు సహా ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని వైఎస్ జగన్ బాబును కడిగే పారేశారు. కేంద్రంలో ఇంకా మీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆడియా, వీడియో టేపులతో అఢ్డంగా దొరికిపోయిన కేసులో, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసిన దానిపై  విచారణ జరుగుతుందనే...చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రం వద్ద పణంగా పెట్టాడని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు తన పాలన గురించి గొప్పగా డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరమని వైఎస్ జగన్ తూర్పారబట్టారు.  చంద్రబాబు నిన్ను  ప్రజలు ఏవిధంగా వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలంటే... దమ్మూ, ధైర్యం ఉంటే అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి రా. జనంలోకి వెళ్దాం. నీకు ఓట్లు వేస్తారో, నాకు వేస్తారో తేల్చుకుందామంటూ బాబుకు సవాల్ విసిరారు. ఆ ఎమ్మెల్యేలను గెలిపించి తీసుకొస్తానన్న నమ్మకం కూడా బాబుకు లేదని జననేత ఎద్దేవా చేశారు. 

దీక్షా శిబిరంపై రాత్రి 11 గంటలప్పుడు దాడి చేసి...బలవంతంగా  దీక్షను భగ్నం చేస్తూ అమర్నాథ్ ను ఏవిధంగా ఆస్పత్రికి తరలించారో అంతా చూశాం. ఈ ఉద్యమం ఇంతటితో అయిపోలేదని, అసలు పోరాటం ఇప్పుడే మొదలైందన్న విషయం  బాబు గుర్తుంచుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా పోరాడుదామని రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అందుకోసం అందరి సహయసహకారాలు వైఎస్సార్సీపీకి కావాలన్నారు. రాబోయే కాలంలో రైల్వే జోన్ కోసం ఐక్యంగా గట్టిగా ఉద్యమిద్దామన్నారు. అమర్నాథ్ దీక్షకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అమర్ దీక్షను చూసైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. లేకుంటే దేవుడు, ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని జననేత హెచ్చరించారు. 

బ‌ల‌వంతంగా దీక్ష భ‌గ్నానికి యత్నం

విశాఖపట్నం:  ప్ర‌త్యేక రైల్వే జోన్ కోసం చేస్తున్న నిర‌వ‌ధిక నిరాహార దీక్ష పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించింది. విశాఖ‌ప‌ట్నంలో వైఎస్సార్సీపీ త‌ర‌పున పార్టీ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్ నాథ్ దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేసేందుకు య‌త్నం చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 20న విశాఖ వ‌స్తున్నార‌ని పార్టీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. దీని కోసం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం కుట్ర‌ల్ని అమ‌లు చేసింది.


విశాఖకు రైల్వే జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ  గుడివాడ అమర్‌నాథ్ నాలుగు రోజులుగా  నిరవధిక నిరాహార దీక్షను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా సంఘాల నాయ‌కులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి వెల్లువలా వచ్చిన నాయకులు, ప్రజల రద్దీ రాత్రి తగ్గింది. దీక్షా శిబిరంలో ఉన్నవారు విశ్రమిస్తున్న సమయంలో ఒక్కసారిగా వందలాది మంది  పోలీసులు  వచ్చి చుట్టుముట్టారు. అక్కడున్నవారు తేరుకునే లోపే క్షణాల్లో అమర్‌నాథ్‌ను దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. 
ఈ సమ‌యంలో పోలీసులు దారుణంగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద విరుచుకు పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని పక్కకు నెట్టివేస్తూ రోడ్డుపై సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లోకి ఎత్తి పడేశారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐఆర్‌సీయూ విభాగంలో ఉంచారు. ఆస్పత్రిలోనూ అమర్‌నాథ్ దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యానికి నిరాకరిస్తున్నారు. పోలీసులు తనను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చినా అక్కడే దీక్ష కొనసాగిస్తానని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

17 April 2016

చంద్రబాబు పర్యటనలతో సామాన్యులు కుదేలు

 • పర్యటనలకు బలవంతంగా తీసుకెళుతున్న నాయకులు
 • లీడర్లకు మాత్రం కాసుల పంట

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జన సమీకరణ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హడావుడిలో టీడీపీ నేతలు మాత్రం కాసులు రాబట్టుకొంటున్నారు.
వరుసగా టూర్లు
ఓటుకి కోట్లు కుంభకోణం లో దొరికిపోయినప్పటి నుంచి చంద్రబాబు హైదరాబాద్ లో పెద్దగా ఉండటం లేదు. విజయవాడలో సమీక్షలు పెట్టడం లేదంటే జిల్లాల్లో పర్యటించటం పనిగా పెట్టుకొన్నారు. దీంతో దాదాపుగా వారంలో 3,4 రోజులు ఏదో ఒక జిల్లాలో పర్యటన నడుస్తోంది. పర్యటనలు చంద్రబాబు కోసం పెడుతున్నప్పటికీ జనానికి అవస్థలు తప్పటం లేదు. పింఛన్ దారుల్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ చేస్తున్నారు.  సీఎం సభకు రాకపోతే పింఛన్ లు, రేషన్ కార్డులు తీసివేస్తామంటూ జన్మభూమి కమిటీల ముసుగులోని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. దీంతో సామాన్యులు హడలి పోతున్నారు. మరో వైపు జన సమీకరణ కోసం ప్రైవేటు స్కూల్స్ నుంచి బస్సులు లాక్కొంటున్నారు. బస్సులు పంపించాక అవి వచ్చే దాకా పిల్లల్ని ఇంటికి పంపించటానికి ఉండటం లేదు. కొన్ని చోట్ల అయితే ఏకంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చేస్తున్నారు.
నేతలకు సందడే సందడి
చంద్రబాబు పర్యటన టీడీపీ నేతలకు మాత్రం కాసుల్ని రాలుస్తోంది. ఎక్కడ పర్యటన ఉన్నా కొద్ది రోజుల ముందు మాత్రమే ఖరారు అవుతోంది. దీంతో సభకు సంబంధించిన ఏర్పాట్లను నామినేషన్ పద్దతిలో అప్పగించేస్తున్నారు. దీనికి ఎంత ఖర్చు అనేది లెక్కా పత్రం కూడా ఉండటం లేదు. దీంతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారు. వేదిక ఏర్పాటు, లైటింగ్, మైక్ ల నిర్వహణ, డెకరేషన్, ఏసీలు, కూలర్ల తరలింపు, వాటర్ సరఫరా, ఆహార వసతి వంటి పనులన్నీ తెలుగు తమ్ముళ్లకు దక్కుతున్నాయి.
నలిగిపోతున్న అధికారులు
చంద్రబాబు పర్యటనలు రెవిన్యూ అధికారులకు విసుగు తెప్పిస్తోంది. పరిపాలనకు సంబంధించిన పనుల మీద ద్రస్టి పెట్టలేకపోతున్నారు. బాబు పర్యటన పేరుతో ప్రతీ సారి 5,6 రోజులు ఏర్పాట్ల కు తర్వాత 1,2 రోజుల సమీక్షలకు సరిపోతోంది. నెల తిరిగే సరికి మళ్లీ పర్యటన వచ్చి పడుతోంది. దీంతో రెవిన్యూ అధికారులు అసహనం చెందుతున్నారు.

16 April 2016

టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వేణుగోపాలకృష్ణ

 • టీడీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే
 • అప్పుల ఊబిలో రైతులు
 • తాగునీటి కోసం ప్రజలు విలవిల
 • ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ దారుణం
 • ప్రభుత్వాసుపత్రిలోని మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
హైదరాబాద్ః  టీడీపీ అధికారంలో వ‌చ్చిన‌ప్పటి నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి శ్రీ‌నివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ దారుణంగా ఉందని మండిపడ్డారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం ప్ర‌భుత్వానికి ముందు చూపు లేక‌పోవ‌డం వ‌ల్లేనని విమర్శించారు.  ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వెంటిలేటర్స్ లేకపోవడంతో 3,200 మంది మ‌ర‌ణించారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని తూర్పరబట్టారు. రాజధాని ప్రాంతమైన ఒక్క గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 552 మంది మ‌ర‌ణించార‌ని వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 

లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... గుంటూరు ఆస్ప‌త్రిలో ఎల‌ుక‌లు సంచరిస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు కరిచి ఓ పసికందు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో వెంటిలేట‌ర్లు లేని కార‌ణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా టీడీపీ సర్కార్ నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవ‌లం ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, జాప్యంతో జ‌రుగుతున్న మరణాలేనని, ప్ర‌భుత్వమే అందుకు పూర్తి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. 

పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందించాల‌న్న సంక‌ల్పంతో మహానేత వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడితే... చంద్రబాబు ప్రభుత్వం ఆపథకానికి నిధులు తగ్గించే పనిలో ఉండడం దారుణమన్నారు. ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్టుకు సుమారు రూ. 400 కోట్లు త‌గ్గించడం హేయ‌మైన చ‌ర్య అన్నారు. నిధులు త‌గ్గించడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మేల్కొని ఆరోగ్య‌శ్రీ‌కి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాల‌ని వేణుగోపాల కృష్ణ డిమాండ్ చేశారు. 

ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌మేర‌కు ప‌ని చేయాల్సిన ప్ర‌భుత్వం వారి స్వార్థ్యం కోసం ప‌ని చేయ‌డం సిగ్గు చేట‌న్నారు. గ‌డిచినా రెండేళ్ల కాలంలో ఎక్కడ కూడా చంద్రబాబు  ప్ర‌భుత్వాసుప‌త్రుల‌పై శ్రద్ధ వహించిన పాపాన పోలేదన్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రికి వెళ్తే మ‌ర‌ణ‌మే శ‌ర‌ణం అనే ధోర‌ణి క‌న‌బ‌డుతుంద‌ని ఆయన వాపోయారు. జ‌న‌వ‌రిలో వెంటిలేట‌ర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్ల‌యితే 3,200 మంది ప్రాణాలు ద‌క్కేవ‌న్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ప్రజల ప్రాణాలను రక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. 

ఎర్ర‌చంద‌నం దొంగ‌ల‌ను అరిక‌ట్ట‌డంలో  ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారని.... ఆయ‌న సొంత ఊరిలోనే ఎర్ర‌చంద‌నం దుంగలు దాచి ఉంచిన సంఘటనలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్ర‌బాబు నోరువిప్పితే న‌దుల అనుసంధానం అనే మాట‌లు త‌ప్ప రాష్ట్రంలో తాండ‌విస్తున్న క‌రువును ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. న‌దుల అనుసంధానం జ‌రిగితే కృష్ణా, గోదావ‌రి జిల్లాల్లో నీటి ఎద్ద‌డిని ఎందుకు గుర్తించ‌లేక‌పోతున్నార‌ని వేణుగోపాల కృష్ణ నిల‌దీశారు. ప్ర‌చార‌ాల‌కే త‌ప్ప ప్ర‌జావ‌స‌రాల‌కు టీడీపీ ప‌ని చేయ‌డం లేద‌ని చెప్ప‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. ఇప్ప‌టికైనా బాబు స‌ర్కార్ ప్ర‌జా అవ‌స‌రాల‌కు క‌ట్టుబ‌డి ప్రణాళిక‌లు చేయాల‌ని సూచించారు. 

ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు అప్పుల పెనుభారంతో విలవిలలాడుతున్నారని వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. టీడీపీ సర్కార్ నిర్వాకం కారణంగా  రాష్ట్రం 85వేల  కోట్ల నుంచి 93వేల కోట్ల అప్పుల‌కు చేరుకుంద‌ని అన్నారు. భూగ‌ర్భజ‌లాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చంద్రబాబు చెప్ప‌డం హాస్య‌ాస్ప‌ద‌మ‌న్నారు. మహిళ‌లు కిలోమీట‌ర్ల కొద్దీ దూరం  వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. ఏ స‌మ‌స్య‌పై కూడా స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు స‌ర్కార్ ఉంద‌ని దుయ్య‌బట్టారు. 

చంద్రబాబుకి వైఎస్సార్సీపీ ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్

 • కరువు, ఇతర సమస్యల మీద ఉద్యమ కార్యాచరణ
 • సీఎమ్ఎస్ సర్వే ఒక బూటకం
 • అన్నీ సవ్యంగా ఉంటే ఎన్నికలకు వెళదామా

హైదరాబాద్: కోట్ల రూపాయిలతో ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ, ప్రజల్ని కొనలేరని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు బంధువుల సంస్థ అయిన సీఎమ్ఎస్ చేసిన సర్వే సత్య దూరం అని ఆయన విశ్లేషించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సమస్యల మీద పోరుబాట
 కరవు సహా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యల మీద ఉద్యమాన్ని నిర్మించేందుకు వైఎస్సార్సీపీ సమాయత్తం అవుతోంది. ఈ మేరకు ఈ నెల 19న పార్టీలో జిల్లా అధ్యక్షులు, ఇన్ ఛార్జీలతో అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొన్నట్లు   అంబటి రాంబాబు వెల్లడించారు. సమస్యలు తీర్చకుండా ప్రభుత్వం... ప్రజల ద్రష్టిని పక్కకు మళ్లించే పనులు చేపడుతోందని ఆయన వివరించారు. ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఈ నెల 19 న ఖరారు అవుతుందని అంబటి వివరించారు.
సీఎమ్ఎస్ సర్వేకు విశ్వసనీయత లేదు
ఇటీవల సర్వే చేశామని చెబుతున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ చంద్రబాబు బంధువులకు సంబంధించినది అని అంబటి చెప్పారు. అందులో చంద్రబాబుకి ప్రత్యామ్నాయం లేదని, ఆయన పనితీరు బ్రహ్మాండం అని రాయించుకోవటంలో తప్పేమీ లేదని అన్నారు. ఇదంతా ప్రజలకు భ్రాంతి కల్పించటం మాత్రమే అని ఆయన వివరించారు. అటువంటప్పుడు మా పార్టీలోకి రండి రండి అని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించటం ఎందుకు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదే సీఎమ్ ఎస్ సంస్థ 2004 ఎన్నికలకు ముందు సర్వే చేసి ఫలితాలు ప్రకటించిందని గుర్తు చేశారు. మూడోసారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని, బాబు హ్యాట్రిక్ చేయబోతున్నాడని డబ్బా కొట్టిందని, దీన్ని బట్టి ఆ సంస్థ చేసే సర్వేల విశ్వసనీయత అర్థం అవుతుందని చెప్పారు.
అవినీతి పరంపర
          భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నైతిక విలువల్ని మంట కలుపుతున్నారని అంబటి మండిపడ్డారు. సీఎం కార్యాలయంలోనే పచ్చ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయమే లేని ముఖ్యమంత్రి అయితే ఈ తతంగం ఎందుకు అని ప్రశ్నించారు. డీఎస్సీ నుంచి డీజీపీ దాకా అంతా సొంత మనుషులే అని, అవినీతి ద్వారా కోట్లు సంపాదించారని అంబటి చెప్పారు. గూడ్సు రైళ్లతో పంపించుకోగలిగినంత సొమ్ముల్ని కూడబెట్టకొన్నారని అంబటి ఎద్దేవా చేశారు. నిజంగా అంతటి పలుకుబడి ప్రజల్లో ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళితే గెలిచే ధైర్యం లేదన్న సంగతి తెలుసు కాబట్టే చంద్రబాబు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, జనానికి ఉపయోగపడే కొత్త పథకాలేవీ తీసుకొని రాలేదని అంబటి విశ్లేషించారు. అటువంటప్పుడు అంతా తన వైపే ఉన్నారని సర్వేలు చేయించి, లీకులు ఇవ్వటం భ్రాంతికి గురిచేయటం మాత్రమే అని ఆయన అన్నారు.
          ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సైకిల్ గుర్తు మీద పోటీ చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ ప్రజల్ని  కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు.