27 April 2016

ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఎవరు ?

న్యూఢిల్లీ: ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గన్ నాయ‌క‌త్వంలో పార్టీ నాయ‌కులు సాగిస్తున్న ఢిల్లీ ప్ర‌యాణం విజ‌య‌వంతం అవుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని గాలికి వ‌దిలేసి అడ్డ‌గోలుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దోపిడీ విధానాలు అవ‌లంబించ‌టం, అవినీతిసొమ్ముతో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌టం వంటి విష‌యాల్ని విడ‌మ‌రిచి చెప్పేందుకు ఈ బృందం ఢిల్లీకి చేరింది. ఈ టీమ్ లో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు ఉన్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే పార్టీకి చెందిన సార‌థ్య బృందం అంతా ఢిల్లీలోనే ఉంద‌ని చెప్పుకోవాలి.

ఇంత భారీ సంఖ్య‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిపక్ష పార్టీకి చెందిన నాయ‌కులు ఢిల్లీ కి త‌ర‌లి రావ‌టం ప్రాధాన్యాన్ని సంత‌రించుకొంది. రాజ‌కీయ కురు వృద్ధుడు శ‌ర‌ద్ ప‌వార్‌ను, క‌మ్యూనిస్టు దిగ్గ‌జం సీతారాం యేచూరీ ని క‌లిసి చంద్ర‌బాబు విధానాల్ని విడ‌మ‌రిచి చెప్ప‌టం జ‌రిగింది. త‌ర్వాత కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ బృందం భేటీ అయింది. పార్ల‌మెంటు వ్య‌వ‌హారాల్లో ఎడ తెగని బిజీ గా ఉన్న‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ బృందంతో రాజ్ నాథ్ సావ‌ధానంగా స‌మావేశం అయ్యారు. వైఎస్ జ‌గ‌న్ అందించిన వివ‌రాల్ని సావ‌ధానంగా తీసుకొన్నారు. పార్టీ త‌ర‌పున వేర్వేరుగా అందించిన మెమోరాండంల‌ను ప‌రిశీల‌న‌కు తీసుకొన్నారు. సాయంత్రం జేడీయూ చీఫ్ శ‌ర‌ద్ యాద‌వ్ ను క‌లిశారు. నిష్క‌ళంకుడిగా పేరుగాంచిన శ‌ర‌ద్ యాద‌వ్ కు అవినీతి మంకిలం అంటించుకొన్న చంద్ర‌బాబు ఆగ‌డాల్ని విడ‌మ‌రిచి చెప్పారు.

మొత్తంగా పార్టీ బృందం ద‌ఫ ద‌ఫాలుగా జాతీయ నాయ‌కుల‌తో స‌మావేశం కావ‌టంతో ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఆధారాల‌తో స‌హా చంద్ర‌బాబు అవినీతి మీద రూపొందించిన పుస్త‌కాన్ని రాజ‌కీయ ప్ర‌ముఖులు స్వీక‌రించారు. అడ్డ‌గోలుగా ఎమ్మెల్యేల‌ను కొనుగోలుచేసేందుకు చంద్ర‌బాబు బ‌రితెగించ‌డాన్ని అన్ని వ‌ర్గాలు నిందిస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీ వ‌ర్గాల్లో ఈ విష‌యంమీద చ‌ర్చ‌ను రేకెత్తించ‌టం ద్వారా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ విజ‌యం సాధించార‌న్న మాట వినిపిస్తోంది. 

No comments:

Post a Comment