31 August 2016

చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి

  • వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో మొదట ప్రగల్భాలు పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఆడియో టేపులను, ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ నెల 8న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా..రెండు రోజుల క్రితం ఈ కేసును పునర్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశించి 78 గంటలు గడుస్తున్నా..ఇంత వరకు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు పేరును చార్జ్‌షిట్‌లో చేర్చకుండా వెనుకడుగు వేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల గ్యాంగ్‌స్టర్‌ నయీంను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏసీబీ చీఫ్‌గా ఉన్న ఏకే ఖాన్‌కు మంచి పేరుందని, ఆయనకు స్వేచ్ఛ ఇస్తే ఓటుకు కోట్లు కేసులో దాగి ఉన్న నిజా నిజాలు వెలికితీస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో కేసీఆర్‌ నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో బ్రీఫ్డ్‌మీ..అక్కడి నుంచి కేంద్ర మంత్రి సుజనాచౌదరి గవర్నర్‌ నరసింహన్‌తో బ్రిఫ్డ్‌మీ..ఆయన మరోకరితో బ్రిఫ్డ్‌మీ..ఇలా బ్రిఫ్డ్‌ మీ భాషను కొనసాగిస్తున్నారని ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చంద్రబాబును విచారించాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు.
సెప్టెంబర్‌ 2న సేవా కార్యక్రమాలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్‌ 2న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా మహానేత వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారని ఆయన కోరారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించాలని కొండా రాఘవరెడ్డి కోరారు.

సాంకేతిక కారణాలతో ఓటుకు కోట్ల కేసు నీరుగార్చేందుకు సన్నాహాలు

  • సుజనా గవర్నర్‌ను కలవడంలో అంతర్యమేంటి?
  • కేసీఆర్‌ సర్కార్‌  చిత్తశుద్ధితో కేసు పునర్‌ విచారణ చేపట్టాలి
  • వ్యవసాయం, రైతులంటే బాబుకు చులకన
  • సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకునే సిద్ధాంతం బాబుది
  • వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: రాజ్యాంగ విలువలను పరిరక్షించే రాజ్‌భవన్‌ను రాజీభవనం, లాలూచీ భవనంగా చేయొద్దని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశమైన టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చి గవర్నర్‌ను కలవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసును నీరు గార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బొత్స దుయ్యబట్టారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్రంతో భేటీ అయిన సుజనా చౌదరి గవర్నర్‌ను కలిసి ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై చర్చించామని చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ఎవరి చెవ్వుల్లో పూలు పెట్టాలనుకుంటున్నారని బొత్స సుజనా చౌదరిని నిలదీశారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు రాజ్‌భవన్‌ను రాజీ భవన్‌గా చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో హోదా ఇవ్వబోమని ప్రకటించిన  తరువాత మళ్లీ అదే అంశాన్ని గవర్నర్‌తో చర్చించామని చెప్పడం శోచనీయమన్నారు. ఒకవేళ హోదాపై చర్చించాల్సివుంటే ప్రధాని, సంబంధిత అధికారులతో సమావేశం కావాలని కానీ, గవర్నర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైనా రాజ్యంగపరమైన అంశమా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసులో భారతీయ జనతా పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తూ కేసును నీరుగార్చి చట్టాన్ని చేతులోకి తీసుకొని బాబు వ్యక్తిగత స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టామని టీడీపీ నేతలు నిజాన్ని ఒప్పుకోవాలన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టుపెట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు సందర్భాల్లో చెప్పిందని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా వాళ్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఇది వాస్తవమా కాదా ? అని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర రాజ్‌భవన్‌లో రాజీలు కుదర్చడం సమంజసమేనా అని నిలదీశారు. ఓటుకు కోట్ల కేసులో అన్ని ఆధారాలున్నాయి చంద్రబాబును జేజమ్మ కూడా రక్షించలేదని మాట్లాడి 14 నెలలు గడుస్తున్నా ఆ మాటలు ఏమయ్యాయన్నారు. ఛార్జ్‌షీట్‌లో 21 సార్లు చంద్రబాబు పేరు ఉటకించిన తరువాత కూడా ఎందుకు ఆయనపై విచారణ చేపట్టలేదని, ఆయన స్వరనమూనాను ఎందుకు పరీక్షించలేదని తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంటే సామాన్య ప్రజానికానికి ఒక న్యాయం, ముఖ్యమంత్రులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పెద్దస్థాయి వారు పెద్ద తప్పు చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినా పర్వాలేదా ఇదెక్కడి ధ్వంద న్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో జరుగుతున్న వ్యవహారం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా విభజన అంశాలలో ఒక్కదానిపై చంద్రబాబు ప్రభుత్వం రాజీపడినా ప్రధాన ప్రతిపక్షంగా వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబును హెచ్చరించారు. ప్రపంచమంతా చూస్తుండగా రూ. 50 లక్షలు ఇస్తూ దొరికిపోయినా, లోకేష్‌ డ్రైవర్‌ తీసుకువచ్చాడని పత్రికలన్నీ గోషించినా ఎందుకు విచారణ చేపట్టలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసు నుంచి భయటపడటానికి చంద్రబాబు కేసులోని సాంకేతిక లోపాలను వెతుకుతున్నారని, అన్ని రోజులు మనవేకావు అని టీడీపీ సర్కార్‌ను ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఓటుకు కోట్ల కేసులో విచారణ జరిపించాలని, లాలూచీలతో చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. 
తెలియదనడం సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు కరువు, వర్షపాతం వచ్చే అంశాలు నాకు, టీడీపీ ఎమ్మెల్యేలకు, అధికారులకు తెలియదని మాట్లాడడం సిగ్గుచేటని బొత్స విమర్శించారు. అంటే ఏపీలో టీడీపీ పరిపాలన తీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ఒక పక్క నాతిలోని కంప్యూటర్, సెల్‌ఫోన్‌ ద్వారా ఏ గుంతలో ఎంత నీరుందో రెండు నిమిషాల్లో చెప్పేస్తాననే బాబు కరువు పరిస్థితులపై అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం డ్యాష్‌ బోర్డులో ఉన్న అంశాలపై ఎందుకు ఇంత బేలతనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు చెప్పే టెక్నాలజీ మాటలన్ని మాయమాటలేనా అని అనుమానం వ్యక్తం చేశారు. డ్యాష్‌ బోర్డులో ఆగస్టు 1 నుంచి 24 వరకు వర్షపాతం డెఫిషెట్‌గా ఉంటుందని, జిల్లాల వారిగా డిటైల్స్‌ ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వ్యవసాయం, రైతు అంటే చుకన భావన కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యవసాయం శుద్ద దండగ, రైతుకు ప్రధాన శత్రువు చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పరిపాలనలోని డొల్లతనం ఎక్కడ భయటపడుతుందోనని ఈ నెల 12వ తేదిన జరగాల్సిన స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ మీటింగ్‌ను కూడా శాసనసభ సమావేశాల అనంతరం వాయిదా వేశారని చెప్పారు. ఆగస్టు నెలలో రైతుల పంటలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టకుండా, కరువు, ఎండ, పుష్కరాలు వచ్చినా పండగ చేసుకునే ఉద్దేశ్యంతో ఉందన్నారు.  సంక్షోభాన్ని అవకాశంంగా మల్చుకోవాలనే సిద్ధాంతం బాబుదని దుయ్యబట్టారు.  వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటే రూ. 50 కోట్లు ఇచ్చి హెరిటేజ్‌ మజ్జిగ పంపిణీ చేయమంటారు. కరువు వస్తే రెయిన్‌ గన్స్‌ అంటూ పదం పాడుతున్నారన్నారు. నీటిని రెయిన్‌ గన్స్‌ ద్వారా అందజేస్తామని సుమారు రూ. 175 కోట్లు వెచ్చించి కొని వాటిని గోదాంలో నిరుపయోగంగా పెట్టారన్నారు. సుమారు రూ. 1700 కోట్లు వెచ్చించి నిర్వహించిన కృష్ణా పుష్కరాలను ఆధ్యాత్మికతతో చేపట్టకుండా ఉకదంపుడు ఉపన్యాసాలతో భక్తులను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఓటుకు కోట్ల కేసును టీడీపీ మంత్రులు కేసేలేదు... ఎవరినైనా ఎంతకైనా కొనొచ్చు, రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నా పర్వాలేదన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. 

30 August 2016

బాబు తప్పుడు పనులను కొన్ని పత్రికలు కప్పేస్తున్నాయి

  • స్విస్ ఛాలెంజ్ అంతర్జాతీయ కుంభకోణం
  • ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు
  • మీడియా రాజకీయాలు చేయడం తగదు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
హైదరాబాద్ః స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ అంతర్జాతీయ కుంభకోణమని నిప్పులు చెరిగారు. కోర్టులు, కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ లో పారదర్శకత లేదని చెప్పినా వినకుండా చంద్రబాబు దాన్ని కొనసాగించాలనుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్నతప్పడు పనులను సమర్థించుకునేందుకు... అడ్వకేట్ జనరల్ ను కూడా వాడుకోవడం దుర్మార్గమని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే...
()స్విస్ ఛాలెంజ్ విధానమే తప్పుడు విధానం. రెండున్నరేళ్లుగా ఏపీ, సింగపూర్ కు మధ్య  ఒప్పందాలు, వాటాలు ఏవీ బయటకు రానీయకుండా బాబు దాచిపెట్టారు. 
()సింగపూర్ తో సీక్రెట్ ఒప్పందం గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... వివరణకు వాయిదా కోరి నాటకీయంగా, దొంగచాటుగా నోటిపికేషన్ రిలీజ్ చేశారు. 
()ఎవరైనా బిడ్ వేయాలంటే 13 లోపల వేయాలని టైమ్ మాత్రమే ఇచ్చారు. కానీ, క్వాలిఫికేషన్, కండీషన్స్, వివరాలు మార్చలేదు. 
()స్విస్ ఛాలెంజ్ విధానంలా లేదు... అది ఫ్యాక్షనిస్టు ఛాలెంజ్ లా ఉంది. నీకింత, నాకింత అన్నట్లుగా బాబు, సింగపూర్ కంపెనీలు పంచుకున్నాయి.  
()బాబు సింగపూర్ తో టై అప్ అయి ఇంకొకరు రాజధాని కట్టేందుకు రాకుండా చేశారు. మూడవవాళ్లు ఎవరూ జోక్యం కాకుండా చేశారు. దీన్ని వాదించడానికి అటార్నిజనరల్ ను పిలవడం దారుణం. 
()మీరు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి అన్ని వ్యవస్థలను వాడుకోవడం ధర్మమేనా బాబు..?. బాబు, సింగపూర్ కంపెనీలు రాజధానిని పంచుకున్నదానికి ఏజీని వాడుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు
()బీజేపీ, అడ్వకేట్ జనరల్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నిర్ణయాన్ని పరిశీలించుకోండి. అసలు మోడల్ అనేదే లేని స్విస్ ఛాలెంజ్ లో రూల్స్ ఏవీ లేవని కోర్టు తప్పుబడుతుంటే ...బాబు అడ్వకేట్ జనరల్ ను ఉపయోగించుకోవాలనుకోవడం హేయనీయం.   
()ఏజీని అవమానిస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో న్యాయానికి పోకపోగా అక్రమమైన ఛాలెంజ్ ను సమర్థించుకునేందుకు కోర్టును కూడా పక్కదారి పట్టిస్తున్నారు. దొంగచాటుగా నోటిఫికేషన్ ఇవ్వడం. దానిలో మార్పులు లేకపోవడం పాలన అంటారా బాబు..?
() దోపిడీని కాపాడుకోవడానికి బాబు కేంద్రాన్ని,  ఏజీని అందరినీ వాడుకుంటున్నాడు
()చంద్రబాబును కాపాడడానికి కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. బాబు మాదిరి రాజకీయాలు చేయడం పత్రికలకు తగదు.  బాబు చేస్తున్న తప్పుడు పనులను బయటకు రాకుండా కప్పేయడం మంచి పద్ధతి కాదు.
()ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ సంచలనాత్మక నిర్ణయం ఇచ్చింది. బాబును ముద్దాయిగా చేర్చే విషయమై దర్యాప్తు చేయాలని తీర్పు వస్తే కొన్ని పత్రికల్లో వార్తలు వేయకపోవడం బాధాకరం. 
() నేషనల్ పత్రికలు కూడా బ్యానర్ స్టోరీగా ఇచ్చాయి. ఈనాడులో మెయిన్ పైన ఇవ్వలేదు. ఇంకొక పత్రిక  కొద్దిగా వేసి లోపల సర్దుకుంది.
()బాబు దొరికిన దొంగ అని తేలినా కూడా ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తూ... కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను కప్పేస్తున్నాయి. 
()ముఖ్యమంత్రిని అవినీతి నిరోధక శాఖ మందలించినంత పనిచేస్తే దాన్ని దాచేసే ప్రయత్నం చేసిన  మీడియాకు మాట్లాడే హక్కు ఎక్కడుంది.
()స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా అలాగే చేశారు. బాబు ఏం చేసినా సమర్థించడం నైతికత అనిపించుకోదు. 
()బాబు తప్పుడు పనికూడా దొరతనం అవుతుందా. ఓటుకు కోట్లు కేసులో బాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయన తప్పు లేదన్నట్లు కప్పిపుచ్చడం మంచి పద్ధతి కాదు
()స్విస్ ఛాలెంజ్ అంతర్జాతీయ కుంభకోణం. సింగపూర్ కంపెనీలకు 40 వేల ఎకరాలను రూ.కోట్ల రూపాయలకు ప్లాట్లు చేసి అమ్ముకునే పరిస్థితి వస్తుంది . 
()సింగపూర్ కంపెనీ పోయాక మళ్లీ చంద్రబాబు, లోకేష్ బినామీ కంపెనీలు వస్తాయి. ఎకరం కోట్ల రూపాయలకు అమ్ముకొని పోతారు. రైతులకు మిగిలేది బూడిద ఏపీకి మిగిలేది శోకమే. 
()మేకిన్ ఇండియాను...మేకిన్ సింగపూర్ , మేకిన్ జపాన్ చేస్తున్నప్పుడు భారతీయ కంపెనీలకు ఎక్కడ అవకాశం ఉంటుందని బాబు తీరుపై పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. 

బాబు తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయి

  • టీఆర్ఎస్, టీడీపీ లాలూచీ పడ్డాయి
  • ఎమ్మెల్యేలను కొన్న డబ్బంతా ఎక్కడిది చంద్రబాబు
  • వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు
  • వైయస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు
విశాఖః  తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్న చంద్రబాబు... నిజంగా నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను  కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ  ప్రశ్నించారు.  ఎమ్మెల్యేను కొన్న డబ్బంతా ఎక్కడిదని బాబును నిలదీశారు.  ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యంతో చంద్రబాబు ఉన్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సమంజమని కడిగిపారేశారు. చంద్రబాబు డొల్లతనం,  నైజం ఏంటో అందరికీ తెలుసునని అన్నారు. 

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.  ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయని ధ్వజమెత్తారు.  బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను కూడా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు’ అని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి  ప్రజాస్వామ్య పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలన్నారు.  

హైద‌రాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎవరూ కాపాడలేరని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి అన్ని సాక్ష్యాధార‌ల‌తో కోర్టును ఆశ్ర‌యించార‌ని, త్వ‌ర‌లోనే అన్ని వాస్తవాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం చంద్ర‌బాబును ర‌క్షించాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని, అందుకు ప్ర‌తిఫ‌లంగా బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తెలంగాణ‌కు తాక‌ట్టు పెట్టార‌ని అంబ‌టి మండిప‌డ్డారు. 

ఓటుకు కోట్లు కేసు చేప‌ట్టి 14 నెల‌లు అవుతున్నా తెలంగాణ స‌ర్కార్ అద‌న‌పు చార్జీషీట్ ఎందుకు దాఖ‌లు చేయ‌లేదని అంబటి ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం వైయ‌స్సార్‌సీపీ ఎంత‌వ‌ర‌కైనా పోరాడుతుందని స్పష్టం చేశారు.  ప్రత్యేకహోదాపై ప‌వ‌న్‌క‌ళ్యాన్ అడిగిన ప్ర‌శ్నల‌కు చంద్ర‌బాబు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీలు స‌మాధానం చెప్పాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు అంబటి బదులిచ్చారు.  ప్ర‌త్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అని అంబటి తేల్చిచెప్పారు.  చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను అణిచివేయాల‌ని చూస్తే..వైయ‌స్ జ‌గ‌న్‌ ప్ర‌త్యేక హోదాను సాధించేందుకు ఉద్య‌మ రూపం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదాను స‌జీవంగా ఉంచిన నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌ అని తెలిపారు. చంద్ర‌బాబు రాజీ వ‌ల్ల రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటున్నాయని,  ప్ర‌త్యేక హోదా కోసం ఎవరు కలిసి వచ్చినా పోరాడేందుకు వైయ‌స్సార్‌సీపీ సిద్ధంగా ఉందని అన్నారు. 

29 August 2016

సెప్టెంబర్ లో కడపలో వైయస్ జగన్ పర్యటన

  • రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
  • 1వ తేదీ.. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల పరిశీలన
  • 2వ తేదీ..వైయస్ఆర్ వర్థంతి కార్యక్రమానికి హాజరు
  • 3వ తేదీ..రైతు మహాధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు
వైయస్ఆర్ కడప: రాయలసీమ రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 29వ తేది నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాను సెప్టెంబర్‌ 3వ తేదికి వాయిదా వేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.  పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అంజద్‌బాషాలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కేసీ కెనాల్, తెలుగుగంగ, గండికోట ప్రాజెక్టులకు నీరందించాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం కనిపించలేదన్నారు.

నీళ్లు ఇస్తామని చెబుతున్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండా దాగుడు మూతలాడుతున్నారని మండిపడ్డారు. ఈ  ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ విషయాన్ని కలెక్టర్‌ దష్టికి కూడా తీసుకుపోయామన్నారు. అయినా చలనం లేకపోవడంతో అఖిలపక్ష నేతలతో కలిసి ఈనెల 29వతేది కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్‌ 1న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ జిల్లాకు వస్తుండటంతో ధర్నాను 3వ తేదికి వాయిదా వేశామన్నారు. 1వ తేది జిల్లాలో పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను వైయస్‌ జగన్‌ పరిశీలిస్తారని, 2వ తేది వైయస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని, 3వ తేది కడప కలెక్టరేట్‌ ఎదుట అఖిల పక్షనేతలతో కలిసి నిర్వహించే రైతు మహా ధర్నాలో పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతాంగమంతా ఈ మహాధర్నాలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

‘సీమ’ ప్రాజెక్టులు ప్రస్తావనకు రాకపోవడం దారుణం– రఘురామిరెడ్డి
ఇటీవల జరిగిన కష్ణా ట్రిబ్యునల్‌ బోర్డు సమావేశంలో నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులను దష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. రాయలసీమలోని ప్రాజెక్టులు ఈ సమావేశంలో ప్రస్తావనకు కూడా రాకపోవడం అత్యంత దారుణమన్నారు.  రెండేళ్లుగా కేసీ కెనాల్‌కు నీళ్లు రాలేదని, ఈఏడు కూడా రాకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. సీమ రైతాంగాన్ని ఆదుకొనే విషయంలో తమ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుందని, అసెంబ్లీలో కూడా గట్టి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

మాట తప్పి మోసం చేస్తున్నారు– రవీంద్రనాథ్‌రెడ్డి
కేసీ కెనాల్‌ పరిధిలో 90 వేల ఎకరాలకు నీరిస్తామని చెప్పిన మంత్రి గంటా మాటతప్పి మోసం చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గండికోట, బ్రహ్మం సాగర్‌లో 12 టీఎంసీలు నిల్వ ఉంచుతామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్దలు కష్టా ట్రిబ్యునల్‌ బోర్డు సమావేశంలో మాత్రం బ్రహ్మంసాగర్‌కు 6టీఎంసీలు, గండికోటకు 5 టీఎంసీలు కేటాయించాలని చెప్పడం దారుణమన్నారు. జనవరి 15 వరకూ కేసీకి నీరివ్వాలని, వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సీమను అశ్రద్ధ చేయొద్దు– ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
రాయలసీమను ఏమాత్రం అశ్రద్ధ చేసినా తీవ్ర నష్టం ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హెచ్చరించారు. 2014లో శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి కోసం 92 టీఎంసీలు కిందికి వదిలినా చుక్కనీరు కూడా రాయలసీమకు రాలేదన్నారు. దీనివల్ల మూడోసారి సీమలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి లేపడానికే ధర్నా– శ్రీనివాసులు
మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే రైతు మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి అయితే అతివష్టి లేకపోతే అనావష్టి సంభవించడం ఆన వాయితీగా మారిందన్నారు. మంత్రివర్గ అనుచరులకు పంచిపెట్టడానికే పుష్కరాలు నిర్వహించారని ఆరోపించారు. రాయలసీమలో కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

విభజన చట్టంలోని హామీలపై కూడా ప్రశ్నిస్తారు– అంజద్‌బాషా
సెప్టెంబర్‌ 3న జరిగే రైతు మహాధర్నాలో రైతు సమస్యలతోపాటు విభజన చట్టంలోని హామీలపై కూడా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తారని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంటు ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడతారని చెప్పారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్, బద్వేల్‌ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి

  •  హోదా వచ్చేంతవరకూ వైయస్సార్‌సీపీ పోరాడుతుంది 
  • వైయస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ


  విశాఖపట్నం: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.  విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో నిధులు, రాయితీలు వస్తాయని, వాటి విలువ రూ.1.45 లక్షల కోట్లని చెప్పారు. హోదా ఇవ్వకుండా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఈ నిధులకు సమానం కాదని పేర్కొన్నారు. దీనిపై బహిరంగ చర్చకు వచ్చే వారెవరైనా ఉంటే తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ వైయస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. విశాఖకు రైల్వేజోన్, విద్యా సంస్థలను కూడా ప్రత్యేక హోదా బిల్లులో పొందుపరిచారని, వాటిని సాధించేవరకూ వదిలేది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ర్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని దుయ్యబట్టారు.

 పవన్ కల్యాణ్‌ను స్వాగతిస్తాం
 పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆచితూచి విమర్శలు చేశారని, అయితే, ప్రత్యేక హోదాపై ఆయన పోరాడతాననడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన వైయస్సార్‌సీపీతో కలసి పోరాటం చేయడానికి ముందుకొస్తే తాము స్వాగతిస్తామన్నారు.

 కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు
 ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్రజల అభిమతానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి, జనానికి తీరని ద్రోహం చేసిన ద్రోహుల పార్టీతో తాము కలిసేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్థమైందని, అందుకే రాష్ర్టంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేం దుకు సాహసించడం లేదన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో, ఢిల్లీలో అనేక సార్లు పోరాటాలు చేశారన్నారు. ఇకపైనా ఇదే ఒరవడి  కొనసాగుతుందని తెలిపారు.

 ఏపీ అప్పుల వాటా రూ.1.50 లక్షల కోట్లు
 రాష్ట్ర విభజన తర్వాత  ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల అప్పులు వాటాగా వచ్చాయని వి.విజయసాయిరెడ్డి చెప్పారు. 

భగీరథయత్నం.. మహానేత జలయఙ్ఞం

ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పనిచేసిన మహానేత
() పరిపాలనలో సాగునీరు, వ్యవసాయం కు పెద్ద పీట
() రైతు బాంధవుడిగా నిలిచిన వైయస్సార్

దేశానికి అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల కరవు కాటకాలతో పట్టెడన్నం కోసం అలమటించింది. పది మంది ఆకలిని తీర్చే అన్నదాత ఆకలికేకలు పెట్టాడు. సేద్యం పడకేయడం.. అప్పుల భారం ఉరితాళ్లకు వేలాడేలా కర్షకులను పురిగొల్పాయి. మహాప్రస్థానం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో అడుగడుగునా విషాదగీతాలు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని కదలించాయి. అధికారంలోకి వస్తే ఉప్పు సంద్రం పాలవుతోన్న వరద నీటిని ప్రాజెక్టుల ద్వారా మళ్లించి.. ప్రతి ఎకరాకు నీళ్లందించి.. కరవు రక్కసిని తరిమికొడతానని బాస చేశారు.

         తెలుగు నేల మీద రైతుల గురించి, సాగునీటి అవసరాల గురించి చిత్త శుద్ధితో ఆలోచించిన ఘనత దివంగత మహానేత డా. వైయస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. ప్రతీ కుటుంబానికి ఇల్లు, ప్రతీ ఎకరాకు సాగునీరు అన్నదే తమ లక్ష్యంగా ఆయన పనిచేశారు. అందుకే ఆయన అపర భగీరథునిగా నిలిచారు.  అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో 85 ప్రాజెక్టులను ప్రారంభించి.. 97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటూ మరో 23.53 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు.
             
                 ఉమ్మడి రాష్ట్రానికి 2004 వరకూ అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి సాగునీటి రంగానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ. అప్పటికి 9 ఏళ్లుగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ రంగాల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు.  వైయస్‌ రాజశేఖరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులను ప్రాజెక్టులకు కేటాయించారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించారు.

జలయజ్ఞంతో  ఊపిరి
ప్రతీ కుటుంబానికి ఇల్లు, ప్రతీ ఎకరాకు సాగునీరు అన్నదే తమ లక్ష్యంగా వైయఎస్ఆర్ పనిచేశారు. తెలుగు నేల మీద జలయజ్ఞం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి అపరభగీరథునిగా నిలిచారు. జయహో వైయస్సార్ అనిపించుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను కొన్ని ప్యాకేజీలుగా విడగొట్టారు. వేగంగా పూర్తయి, ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా వీటి ద్వారా నేరుగా రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడింది.   

       వైయస్‌ హాయాంలో పూర్తయిన ప్రాజెక్టులు
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ప్రాజెక్టు పేరులబ్దిపొందిన జిల్లా
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
భూపతిపాలెం రిజర్వాయర్‌-  తూర్పుగోదావరి
చాగల్నాడు-  తూర్పుగోదావరి
పెద్దగడ్డ రిజర్వాయర్‌- విజయనగరం
సురంపాలెం రిజర్వాయర్‌ - తూర్పుగోదావరి
మద్దువలస - శ్రీకాకుళం
పెద్దెరు రిజర్వాయర్‌- విశాఖపట్టణం
కొవ్వడకాల్వ- పశ్చిమగోదావరి
రామతీర్థం రిజర్వాయర్‌ - ప్రకాశం
స్వర్ణముఖి బ్యారేజి- నెల్లూరు
వెలిగల్లు   -    కడప
ఆలిసాగర్‌   -   నిజామాబాద్‌
గుత్పా  -    నిజామాబాద్‌
సుద్దవాగు  -    ఆదిలాబాద్‌
నెట్టెంపాడు ఎత్తిపోతల  -    మహబూబ్‌నగర్‌
బీమా ఎత్తిపోతల   -  మహబూబ్‌నగర్‌
కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల   -  మహబూబ్‌నగర్‌
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
వైఎస్‌ హాయాంలో పాక్షికంగా పూర్తయి...నీటిని విడుదల చేసిన ప్రాజెక్టులు 
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ప్రాజెక్టు పేరులబ్ది పొందిన జిల్లా
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
వంశధార - శ్రీకాకుళం
జంఝావతి - విజయనగరం
తోటపల్లి - విజయనగరం, శ్రీకాకుళం
పుష్కరం-  తూర్పుగోదావరి
తాడిపూడి - పశ్చిమగోదావరి
వెంకటనగరం- తూర్పుగోదావరి
ముసురుమిల్లి- తూర్పుగోదావరి
గుండ్లకమ్మ   -   ప్రకాశం
సోమశిల  - నెల్లూరు, ప్రకాశం
తెలుగుగంగా కర్నూలు-  కడప, చిత్తూరు
గురురాఘవేంద్ర    -     కర్నూలు
ఎస్‌ఆర్‌బిసి - కర్నూలు, కడప
పులివెందుల - బ్రాంచికెనాలకర్నూలు, కడప
హంద్రీ–నీవా - కర్నూలు, అనంతపురం, చిత్తూరు
పులిచింతల - గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి
మైలవరం - కడప
ఏఎమ్మార్పీ - నల్లగొండ
ఎస్సారెస్పి–2- వరంగల్, ఖమ్మం, నల్లగొండ
మత్తడివాగు - ఆదిలాబాద్‌
దేవాదుల - వరంగల్‌
గొల్లవాగు - ఆదిలాబాద్‌
రాలివాగు - ఆదిలాబాద్‌
కిన్నెరసాని - ఖమ్మం
కల్వకుర్తి ఎత్తిపోతల - మహబూబ్‌నగర్‌
ఎల్లంపల్లి- కరీంనగర్‌
మధ్యమానేరు- కరీంనగర్‌

సాగునీటి ప్రాజెక్టుల పురోగతి
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హంద్రీనీవాకు కేవలం రూ.13 కోట్లే ఖర్చు చేశారు. దివంగత నేత వైయస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు రూ.6,800 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. 

రాయలసీమలోని మరో ప్రాజెక్టు గాలేరు-నగరిపైనా చంద్రబాబుకు ఏవూత్రం ప్రేమ లేదు. తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు కేటాయిస్తే.. వైఎస్‌ఆర్ హయాం, తర్వాతి ప్రభుత్వాల హయాంలో రూ.4,600 కోట్లు ఖర్చు చేశారు.   గాలేరు-నగరిలో ఎంత పెండింగ్ పనులు ఉన్నాయో చూస్తే అర్థవువుతుంది . 

1996లో వెలిగొండ ప్రాజెక్టును నిర్మిస్తానని బాబు టెంకాయ కొట్టారు. ఎన్నికల తర్వాత ప్రాజెక్టును గాలికొదిలేశారు. బాబు తొమ్మిదేళ్లలో కేవలం రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఏడాదికి రూ.2 కోట్లు కూడా ఖర్చు చేయులేదన్నవూట. వైయస్‌ఆర్ ఏకంగా రూ.3 వేల కోట్లు కేటాయించారు. 
 
పోలవరాన్ని అడ్డుకునే కుట్ర!
బంగారంలాంటి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టే ప్రయుత్నం చేస్తోంది. పట్టిసీమ పేరుతో దారుణానికి పాల్పడుతోంది. పోలవరం నిర్మిస్తే గోదావరి వరద జలాల్ని 200 టీఎంసీల మేరకు నిల్వ చేసుకునే అవకాశముంది. ఇందులో 80 టీఎంసీలను  కృష్ణాడెల్టాకు మళ్లిస్తే.. ఆ మేరకు నీటిని   శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరికి మళ్లించుకుని రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు పారించుకోవచ్చు. అయితే ఈ పని చేయుకుండా పట్టిసీమ పేరుతో చంద్రబాబు నాటకం ఆడుతున్నారు.     
 
వైయస్సార్ తోనే సాధ్యం
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చలవతోనే అనేక ప్రాజెక్టులు, పథకాలు ఒక కొలిక్కి వచ్చాయి. పట్టి సీమ కూడా వైయస్సార్ చలవతో పూర్తి అయిన పోలవరం కుడి కాల్వ ద్వారా మాత్రమే సాద్యం అయింది. వైయస్సార్ చేపట్టిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి చంద్రబాబు మురిసిపోతుండడం ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు
                    ఇక చెరువులు వంటి చిన్ననీటి పారుద‌ల‌కు సంబంధించి వైయ‌స్ ప్ర‌భుత్వం 2004-09 మ‌ధ్య రూ. 2,266,40 కోట్ల‌ను బ‌డ్జెట్‌లో కేటాయించి రూ. 1,679.85 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. 3,75,116 ఎక‌రాల ఆయ‌కట్టును ఏర్ప‌ర్చింది. 11,21,411ఎక‌రాల్ని స్థిరీక‌రించింది. దీనితో రైతు ఆదాయాలు, ఆహార ఉత్ప‌త్తులు పెరిగాయి. 
            అంతిమంగా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవ తోనే పనులు ఒక కొలిక్కి వచ్చాయి. భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువులు, జలాశయాల పనుల్ని ఒక కొలిక్కి తెచ్చారు. కొంత మేరకైనా రైతులకు సాగునీరు అందుతోందంటే, దాని ఖ్యాతి దివంగత మహానేత కు దక్కుతుంది. 

27 August 2016

ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు

  • ‘స్విస్’ఛాలెంజ్ కాదు చంద్రన్న ఛాలెంజ్ 
  • రాష్ట్రాన్ని దోచుకునేందుకే స్విస్‌ ఛాలెంజ్‌ పద్దతి
  • రాష్ట్రాన్ని విదేశీయులకు దోచిపెడుతున్నారు
  • బాబుపై  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్‌: స్విస్‌ ఛాలెంజ్‌ విధానంతో చంద్రబాబు ఆంధ్రరాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. విదేశీ కంపెనీలకు 58 శాతం వాటాతో  వేల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.  స్విస్‌ ఛాలెంజ్ పేరుతో చంద్రబాబు ఏపీకి చేస్తున్న లూటీపై హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో  బుగ్గన మీడియాతో మాట్లాడారు. 

రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పీఏసీ చైర్మన్‌గా స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. దీంట్లో అనేక ముఖ్యమైన విషయాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు. అమరావతి నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. సింగపూర్‌ కంపెనీలతో కలిసి ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని బుగ్గన గణాంకసహింతగా వివరించారు. ఈ కమిటీలో నలుగురు సింగపూర్‌ ప్రతినిధులు ఉంటే ఇద్దరు మాత్రమే ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. సింగపూర్‌ కంపెనీలు మూడు కలిసి ఒకగ్రూప్‌గా ఏర్పడి ప్రపోజల్‌ ఇస్తారు. వాళ్లకు 58 శాతం వాటా, ఏపీకి 42 శాతం వాటా కల్పిస్తారన్నారు.

రాజధానిలో ముఖ్యభాగ నిర్మాణానికి రూ. 3 వేల కోట్ల చిల్లర ఖర్చు అయితే వాటిలో రూ. 300 కోట్లు విదేశీ పెట్టుబడులు, రూ. 2 వందల కోట్లు ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సివస్తుందన్నారు. అంతేగాక రూ. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసి మిగిలిన 2 వేల కోట్ల బ్యాలెన్స్‌ నిధులు రాజధాని ప్రాంతంలో ప్లాట్ల్‌ వేసి అమ్మి ఖర్చు పెట్టనున్నారని వివరించారు. ప్లాట్ల రూపంలో వచ్చిన డబ్బుల్లో ఏపీ వాటా 42 శాతం ప్రకారం లాభాలన్ని ఖర్చు చేస్తే సింగపూర్‌ కంపెనీలు మాత్రం వచ్చిన లాభాల్లో కేవలం 7 వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపోజల్‌లో ఉందన్నారు. ‘ఎర్నిపోకబుల్‌ పవర్‌ ఆఫ్‌ అథర్ని’ ప్రకారం ఏపీపై సర్వహక్కులను, అప్పులు చేసి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకునే రైట్స్‌ను కూడా ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీలకు కల్పిస్తుందన్నారు.

 అదే విధంగా రాజధాని నిర్మాణంలో అప్పు విషయంలో సింగపూర్‌ కంపెనీలకు ఎటువంటి బాధ్యత ఉండదని, అప్పుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇవ్వాలంటూ ప్రపోజల్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. అంతేకాకుండా విదేశీ కంపెనీలు మేనేజ్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా అమరావతిలో రియలెస్టేట్‌ వెంచర్‌ను వేస్తారని చెప్పారు. దీనిలో మొత్తం 5.5 శాతం టర్నోవర్‌పై ఫ్రీ, అది చాలక ఒకవేళ ఆ వెంచర్‌లో ఏదైనా భవనం నిర్మాణం చేపట్టి అద్దెకు ఇస్తే మళ్లీ దాంట్లో ఒకటిన్నర నెల రెంట్‌ ఆ కంపెనీకి ఇవ్వాల్సివస్తుందన్నారు. రియలెస్టేట్‌ ఏజెన్సీలు, బ్రోకర్‌లకంటే ఎక్కువ దోచుకునేందుకు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 

ఏపీకి అప్పులు.. సింగపూర్‌కు లాభాలు
భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్‌ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందని బుగ్గన ధ్వజమెత్తారు.  సింగపూర్‌ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని చెప్పారు. మన ఒప్పందాలు చూసి మిగతా రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితి తలెత్తిందన్నారు.  ప్రజలను గందరగోళారికి గురి చేస్తున్నారని వాపోయారు. అయినవారికి మేలు చేసేందుకు ఏ నుంచి జడ్‌ వరకు అన్ని అక్షరాలు వాడుకుని ఇష్టమొచ్చినట్టుగా సంస్థలు స్థాపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్‌ కంపెనీలు అల్లుళ్ల కంటే ఎక్కువై కూర్చుకున్నాయని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు, సింగపూర్‌కు లాభాలు అన్నరీతిలో ఈ ఒప్పందాలున్నాయన్నారు. సుమారు 16 వందల ఎకరాల చుట్టూ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5,500 కోట్లు ఖర్చు చేయాలని, అదిగాక మట్టి, ఇసుక, రోడ్లు, విద్యుత్, నీళ్లు, గ్యాస్‌ కనెక్షన్‌లు కూడా చౌకధరలకే ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు సిద్ధపడిందన్నారు. రాజధాని నిర్మాణంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోని సింగపూర్‌కు ఎందుకు అప్పగించడం అని టీడీపీ సర్కార్‌ను బుగ్గన ప్రశ్నించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అమరావతి నిర్మాణం నిలిపివేస్తే పెట్టుబడులకు అదనంగా వడ్డీలు, చక్రవడ్డీలు సింగపూర్‌కు చెల్లించేలా నిబంధనలు ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టడానికి మన భారతీయులు లేరా అని చంద్రబాబును ప్రశ్నిస్తే,  మనవాళ్లు మురికివాడలకే పనికొస్తారంటూ చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 స్విస్‌ ఛాలెంజ్‌ విధానం పేరుతో చంద్రబాబు దుబాయ్, అబుదాబిలోని బిల్డింగ్‌లను కాపీ, పేస్ట్‌ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గతంలో తరిమెల నాగిరెడ్డి ’తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకం రాశారని ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే ’అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌’ అని పేరు పెడతారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలా లేదని, చంద్రన్న ఛాలెంజ్, చంద్రన్న కానుకల్లా ఉందన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ద్వారా రాష్ట్ర ఆస్తిని విదేశాలకు ధారాదత్తం చేసి దోపిడీకి గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు.  

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన

డ్రైనేజీ స‌మ‌స్య తీవ్రంగా ఉంది
క‌ర్నూలు(నంద్యాల‌):  కాల‌నీలో డ్రైనేజీ స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని, దీంతో దోమ‌ల బెడ‌ద భ‌రించ‌లేకున్నామ‌ని నంద‌మూరిన‌గ‌ర్ వాసులు వైయ‌స్సార్ సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ రాజ‌గోపాల్ రెడ్డి ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప‌ట్టణంలోని ప‌లు కాల‌నీల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు పాల‌న‌పై ఆయ‌న మార్కులు వేయించారు. 
స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునే వారేరి
ప‌త్తికొండ‌(మ‌ద్దికెర‌):  గ్రామాల్లో నిత్యం స‌మ‌స్య‌లు తాండివిస్తున్న ప‌ట్టించుకున్న నాధుడే కరువ‌య్యార‌ని ప‌లువురు పాల‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డి మండ‌ల ప‌రిధిలోని హంప‌, బొమ్మ‌న‌ప‌ల్లి, కొత్త‌ప‌ల్లి గ్రామాల్లో ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.... చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌కు ఉచిత విద్యుత్‌, ఆరోగ్య‌శ్రీ‌, ఫీజు రీయంబర్స్‌మెంట్ త‌దిత‌ర ప‌థ‌కాల‌ను లేకుండా చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

రాష్ట్రంలో మోసగాడి పాలన
ఆళ్ల‌గ‌డ్డ‌(గంగ‌వ‌రం): ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌ర్చిన హామీల‌కు, బాబు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంత‌న‌లేద‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ డాక్ట‌ర్ రామ‌లింగారెడ్డి ప్ర‌శ్నించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న శిరివేళ్ల మండ‌ల ప‌రిధిలోని గంగ‌వ‌రం గ్రామంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. అనంత‌రం వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అందజేసి, బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. ఈసందర్భంగా ప్రతీ ఒక్కరూ మోసకారి పాలనపై ధ్వజమెత్తారు. 


స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం

()రాజధాని అభివృద్ధి పేరుతో రాక్షస పాలన
()రైతుల భూములతో రియల్ వ్యాపారం

రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు.
ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు.
 
హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి.

స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ప్రతిపక్ష వైయస్సార్సీపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది.

పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే...
పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.

ఏపీని దేశం ముందు చేతగాని రాష్ట్రంలాగా నిలబెట్టాడు

  • ఏపీని చంద్రబాబు అనాథ రాష్ట్రంగా మార్చాడు
  • సొంత సోకులే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు
  • బాబు స్థానంలో సామాన్యుడున్నా ఏపీకి న్యాయం జరిగేది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ 
హైదరాబాద్ః రాష్ట్ర్లంలో చేతగాని దద్దమ్మ పాలన సాగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఎంతసేపు జాతరలు, లేజర్ షోలు, ప్రత్యేకవిమానాలు, కోట్లాది రూపాయలు దుబారా చేయడం తప్ప...చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా కృష్ణా, గోదావరి జలాలను తోడుకుపోతుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు బదులు ఓ సామాన్యుడు ఆ కుర్చీలో ఉన్నా రాష్ట్రానికి ఈదుర్గతి పట్టేది కాదని పద్మ అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే...
()తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలపై అడ్డగోలుగా ప్రాజెక్ట్ లు కట్టుకుంటూ పోతుంటే...యాప్ లు, టెక్నాలజీలంటూ చంద్రబాబు చిదానందస్వామి లాగ వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. 
()కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఎందుకు ప్రశ్నించడం లేదు. కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు.
()కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఇంతవరకు నీటి కేటాయింపులపై నిర్ణయం జరగలేదు. 
()నిర్ణయం జరగని నీటి కేటాయింపుల్లో  900 టీఎంసీలు వస్తాయని కేసీఆర్ ఎలా మాట్లాడుతారు.  టీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రభుత్వంతో నీటి ఒప్పందాలు , ప్రాజెక్ట్ ల  రీడిజైన్ లు చేసుకుంటుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు
()అసలు కృష్ణా, గోదావరి నదులపై ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే అపెక్స్ కమిటీ, కేంద్రజలసంఘం, నిర్వాహణ బోర్డు అనుమతి తీసుకోవాలి. కేసీఆర్ ఏ అనుమతి తీసుకున్నారు.
()గోదావరిపై 900 టీఎంసీలు వాటా ఉందని  కేసీఆర్ ప్రాజెక్ట్ లు కట్టుకుంటుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడ ఎందుకున్నట్టు. రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ లు పూర్తయితే ఏపీకి చుక్క నీరు రాదు. ఎడారిగా మారుతుంది. ఇంత ప్రమాదకర పరిస్థితిలుంటే..కేంద్రంలో భాగస్వామిగా ఉండి, ఇద్దరు మంత్రులుండి తెలంగాణ వైఖరిపై చంద్రబాబు కేంద్రం వద్ద మాట్లాడకపోవడం దారుణం.  
()ప్రత్యేకహోదా చట్టంలో లేదు కాబట్టి హోదా ఇవ్వమనడం సరికాదు . చట్టంలో పొందుపర్చిన పోలవరానికి సంబంధించి.. నిర్వాహణ బాధ్యత  మొత్తం కేంద్రందే అయినప్పుడు ఎందుకు పూర్తి చేయరు అని బాబు ఎందుకు అడగడం లేదు.
()టెక్నాలజీని అడ్డుపెట్టుకొని బాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. పాలనతో మెప్పించలేకపోయారు. ఆయన సర్వేలోనే బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా నిర్ణయాలు వస్తున్నాయి. 
()ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రంతో  రాజీపడ్డారు. 13 రాష్ట్రాలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని అడుగుతుంటే బాబు దద్దమ్మలాగా కూర్చున్నాడు
() కృష్ణా, గోదావరి జలాల విషయంలో బాబు అలుసు చూసుకొని తెలంగాణ దూకుడుగా పోతోంది. కర్నాటక ప్రభుత్వం కూడా తుంగభద్రపై జలాశయం కడతామంటున్నారు. ఏపీకి చుక్కనీరు రాకుండా దిగ్బందనం చేస్తున్న పరిస్థితులు కనబడుతుంటే... నీరో చక్రవర్తిలాగా బాబు ఫిడేల్ వాయిస్తున్నాడు. 
()బాబును రాష్ట్రం తరపున ఎందుకు క్షమించాలి. టీడీపీ వల్ల ఏపీ అనాథలాగా మారింది. చంద్రబాబు ఏపీని చేతగాని రాష్ట్రంలాగా దేశముందు నిలబెట్టారు. 
()మీరు ముఖ్యమంత్రి కాదా బాబు..? ఏపీ నష్టపోతుంటే ఎందుకు మాట్లాడరు. కృష్ణా, గోదావరి జలాలు కేసీఆర్, ఫడ్నవీస్ ల సొంత వ్యవహారం కాదని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు.  మీ తెలివి, సీనియారిటీ, టెక్నాలజీ ఏమైంది. సామాన్యునికి పట్టెడు అన్నం పెట్టలేని చేతగాని ప్రభుత్వం. బాబు స్థానంలో సామాన్యుడు కూర్చున్నా ఏపీకి న్యాయం జరిగేది. 
()ఓటుకు నోటుకు కేసులో కేసీఆర్ కు సాగిలబడి పోయి ఏపీకి అన్యాయం చేస్తున్నావ్.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల తరపున నిలబడండి. 
()ఏపీలో ఏం జరుగుతున్నా ప్రతిపక్షం మాట్లాడవల్సి వస్తోంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో నీటి యుద్ధాలు జరుగుతాయని  వైయస్ జగన్ ముందే హెచ్చరించారు.  రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కర్నూలులో దీక్ష చేశారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర జలశాఖ మంత్రికి లేఖలు కూడా రాశారు. 
()ఎంతసేపు ప్రతిపక్షం పోరాడుతుందే తప్ప....ముఖ్యమంత్రి లేఖ రాయడు. కేంద్రాన్ని అడగడు. ఎంతసేపటికి బాబుకు జాతరలు, లేజర్ షోలు, ప్రత్యేకవిమానాలు, ఆహ్వానాలు, కోట్ల రూపాయల దుబారాలు కావాలి. మీ సొంత ప్రచారానికి ఆహ్వానాలు పంపిస్తున్నారు. మరి రాష్ట్ర హక్కుల కోసం సుప్రీంకోర్టు, ప్రధాని తలుపు ఎందుకు కొట్టరు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులను ఎందుకు ప్రశ్నించరు. 
()చంద్రబాబు ఏపీ మీ జాగీరు కాదు. కేనలం మీరు 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారంతే. ప్రజలు రాష్ట్రాన్ని మీకు రాసివ్వలేదు. ఒక్క అన్యాయం కాదు మీరు చేస్తుంది. ప్రత్యేకహోదా సంజీవనా, రాకపోయిన పర్వాలేదని ముఖ్యమంత్రి, మంత్రులు, లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. 
()హోదా,  నీళ్లు తీసుకురాలేనప్పుడు ముఖ్యమంత్రిగా బాబు ఉండి ఏం లాభం. తెలుగు ఆత్మగౌరవం ఏమైంది. హోదా సాధించుకోలేని దద్దమ్మలు ఏపీ ప్రజలు అని మిగతా పార్టీలు వేలెత్తి చూపుతుంటే పౌరుషం లేదా..? 
()తెలంగాణ కడుతున్న ప్రాజెక్ట్ లను కూడా అడగలేకపోతున్నావంటే ప్రజలు నిన్ను క్షమించరు. మీడియా ముందు గంటల కొద్దీ కూర్చుంటే నీళ్లు వస్తాయా...? టెక్నాలజీ గురించి మాట్లాడితే పోలవరం పూర్తవుతుందా...? పనికొచ్చే పని ఒక్కటి చేయడం లేదు. 
()అన్నీ అబద్ధపు మాటలు, మోసపోరిత విధానాలే. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఏపీకి ఈదుర్గతి పట్టడం బాధాకరం.  అడిగే వాడు లేడు. ఇచ్చేవాడు అంతకన్నా లేడు. ఏపీకి ఎందుకీ కర్మ. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నీటి జలాలు రాకపోతే ఏపీకి భవిష్యత్తే లేదు. 

26 August 2016

గడపగడపకు కార్యక్రమం@50 డేస్

  • గడపగడపలో వైయస్సార్సీపీకి జననీరాజనం
  • మహోద్యమంలా కొనసాగుతున్న కార్యక్రమం
  • బాబు అవినీతి పాలనపై పెల్లుబికిన ఆగ్రహం
  • ఎన్నికల హామీలు విస్మరించిన బాబుపై మండిపాటు
  • ప్రజాబ్యాలెట్ లో చంద్రబాబుకు ఓటమి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంగా సాగుతోంది. గడపగడపలో  వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రాజన్న తనయుడు జగనన్న సైన్యాన్ని ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. బొట్టు పెట్టి హారతిచ్చి అపూర్వస్వాగతం పలుకుతున్నారు. ప్రజాశ్రేయస్సే పరమావధిగా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నానంటూ అండగా నిలుస్తున్న  ప్రతిపక్ష నేత, జననేత వైయస్ జగన్.... ప్రజల పార్టీ వైయస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఐదుకోట్లమంది ప్రజాభిమానాన్ని సంపాదించుకుంది. నేటికి గడగడపకూ కార్యక్రమాన్ని ప్రజల మధ్య దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని ముందుకు సాగుతోంది. 


అధికారం కోసం వందలాదిగా అమలుగానీ హామీలు గుప్పించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ప్రజలను నయవంచన చేశారు. హామీలను విస్మరించి, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ... అవినీతి, అక్రమాలే ధ్యేయంగా  బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న బాబు దురాగతాలపై వైయస్సార్సీపీ అలుపెరగకుండా పోరాడుతోంది. ఈనేపథ్యంలోనే బాబు మోసాలను, అన్యాయాలను, అవినీతిని ప్రజల్లో ఎండగట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ..పార్టీ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  



అధ్యక్షులు వైయస్ జగన్... ప్రియతమ నేత వైయస్ రాజశేఖరెడ్డి జయంతి రోజున ఇడుపులపాయలో స్వయంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా బాబు చేసిన మోసాలను వివరిస్తున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇంటింటికీ కరపత్రాలను అందించారు.  పాసా, ఫెయిలా..? మార్కులు వేయాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాబ్యాలెట్ లో బాబుకు ఓటమి ఎదురైంది. 



ప్రతీ గడపలో బాబు పాలనపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీ, ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, పక్కా ఇళ్లు ఇలా ఏఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. వితంతులు, వికలాంగులు, వృద్ధులకు వచ్చే పెన్షన్లు, రేషన్ లలో కోతపెట్టిన పచ్చపార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీ చేస్తాం, ఇదీ చేస్తామని అబద్ధపు హామీలతో చంద్రబాబు తమను నమ్మించి నట్టేట ముంచారని వైయస్సార్సీపీ నేతల వద్ద ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మహానేత వైయస్సార్ పాలన స్వర్గంలా ఉండేదని  గుర్తుకు తెచ్చుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాజన్న ఆశయాలు నెరవేరాలన్నా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతీ ఒక్కరూ విశ్వసిస్తున్నారు. 

రెండేళ్లలోనే బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. ప్రజాసమస్యలను గాలికొదిలి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన చంద్రబాబు సర్కార్ కు తగిన బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర్రంలోని ప్రతీ పౌరుడు ఎదురు చూస్తున్నాడు. ఎఫ్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీని గెలుపించుకుంటామని చెబుతున్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకొని తమ జీవితాలను బాగు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వ‌ర్షాకాల స‌మావేశాల‌ను ఐదు రోజులే నిర్వ‌హించ‌డం దారుణం

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదు
  • రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • స‌మావేశాల‌ను నాలుగు వారాల పాటు నిర్వ‌హించాలి
శాస‌న‌మండ‌లిలో వైయ‌స్సార్‌సీపీ ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు
హైద‌రాబాద్‌ః  రాష్ట్రానికి సంబంధించిన అనేక స‌మ‌స్య‌లను చ‌ర్చించాల్సి ఉండ‌గా, ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహించాలనుకోవడం సరైంది కాద‌ని శాసనమండలిలో వైయ‌స్సార్‌సీపీ ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు  అన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాలి త‌ప్ప తూతూ మంత్రంగా కాద‌ని చంద్ర‌బాబుకు హిత‌బోద చేశారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితిలో ఉంద‌న్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో అటు బ్యాంకుల‌కు రుణాలు చెల్లించ‌లేక ఇటు పంట‌ల‌ను సాగు చేసేందుకు డ‌బ్బులు లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆయ‌న వెల్లడించారు.

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాట‌ల్లోనే..
- రాష్ట్రంలో వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉన్నాయి. అన్ని వ‌ర్గాల్లో తీవ్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ఉన్నాయి.
- రాష్ట్రంలో 40.95ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట‌లు సాగు కావాల్సి ఉండ‌గా... ఇప్ప‌టి వ‌ర‌కు అందులో 30శాతం కూడా సాగు కాలేదు
- రాష్ట్ర ప్ర‌భుత్వం రుణమాఫీని అమ‌లు చేయ‌కపోవ‌డంతో రైతులు బ్యాంకులకు రుణాలు క‌ట్ట‌లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.
- వ‌ర్షాకాల స‌మావేశాల‌ను కనీసం 3 నుంచి 4 వారాల పాటు నిర్వ‌హించాలి
-  ప్ర‌త్యేక హోదా, స్విస్ ఛాలెంజ్, రాజ‌ధానిలో అక్ర‌మ భూ కేటాయింపులు, సుమారు 500 సంక్షేమ వ‌స‌తి గృహాల తొల‌గింపు వంటి ఎన్నో ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సి ఉంది. ఇందుకు కేవ‌లం ఐదు రోజులు స‌రిపోవు
- టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతున్నా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఒక్క ప‌క్కాగృహం కూడా నిర్మించ‌లేక‌పోయింది
- గోదావ‌రి పుష్క‌రాల్లో జ‌రిగిన ప్రాణాన‌ష్టంపై నియ‌మించిన సోమ‌యాజుల క‌మిటీ ఇప్ప‌టికీ ఎటువంటి నివేదిక‌ను స‌మ‌ర్పించ‌లేక‌పోయింది
- కృష్ణా పుష్క‌రాల్లో ఎక్క‌డ ఆధ్యాత్మికం క‌నిపించ‌లేదు. కేవ‌లం టీడీపీ పార్టీ కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించారు.
- జీఎస్‌టి బిల్లుపై ఆమోదం తెలియ‌జేస్తే స‌రిపోతుంద‌నే విధానం స‌రైంది కాదు
- రాష్ట్రంలో అనేక దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదులు, గాంధీ విగ్ర‌హం, మ‌హానేత వైయ‌స్సార్ విగ్ర‌హాల‌ను కూల్చ‌డం దారుణం
- ఇంత‌టి రాక్ష‌స పాల‌న ఏ రాష్ట్రంలో కూడా లేదు
- స‌దావ‌ర్తి భూముల వేలంపై భారీ కుంభ‌కోణం జరిగిన విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు
-  కాపుల రిజ‌ర్వేష‌న్లు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పూర్తివుతుంద‌న్నారు. ఇంత‌వ‌ర‌కు ఎటువంటి స్ప‌ష్ట‌త లేదు
- జీడీపీలో రాష్ట్రానికి 30వ ర్యాంకు వ‌చ్చింది... కానీ, దానికి భిన్నంగా రాష్ట్రం అభివృధ్ధిలో ముందుకు వెళ్తుంది అని టీడీపీ చెప్ప‌డం సిగ్గుచేటు
- ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌ర ఏళ్లు అవుతున్న ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల ఎందుకు అమ‌లు కాలేదు చంద్ర‌బాబు 
- నిరుద్యోగులు, రైతులు,  ఇలా ప్రతీ ఒక్కరి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది
- ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌పై అసెంబ్లీ స‌మావేశాల్లో క్షుణ్ణంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంది. 
- న‌యీం ఎన్‌కౌంట‌ర్‌లో సైతం టీడీపీ పెద్ద‌వారు ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి
- ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది
- కృష్ణ న‌ది జ‌ల‌ాల్లో మాకు సైతం హ‌క్కు ఉంద‌ని ఓ వైపు తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతున్నా టీడీపీకి చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేదు
- కృష్ణా డెల్టాలో చుక్క‌నీరు లేదు. ప‌ట్టిసీమ నుంచి నీళ్లు వ‌స్తాయ‌నుకుంటే అదీ లేదు
- రెండున్న‌రేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు వ‌య‌స్సు దాటిపోతోంది. మరి వారి పరిస్థితి ఏంటి?
- ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అసెంబ్లీ స‌మావేశాల నిర్ణ‌యాల‌కు ముందే ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నాం. తూతూమంత్రంగా సమావేశాలు జరపడం సరికాదు. కనీసం నాలుగు వారాలైనా నిర్వహించాలి