12 August 2016

అధికారం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది

  • ఏపీలో ఎంతమంది నయీంల్ని పెంచి పోషిస్తారో
  • దోషుల్ని ప్రజలముందు పెట్టాలి
  • ప్రత్యేకహోదాపై టీడీపీ డ్రామాలాడుతోంది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
హైదరాబాద్ః నయీంను పెంచి పోషించింది చంద్రబాబు, టీడీపీ నాయకులేనన్న ఆధారాలు వెలువడడం చూస్తే...అధికారం కోసం టీడీపీ  ఎటువంటి అడ్డదారులైనా తొక్కుతుందని తెలుస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమంది నయీంలను పెంచిపోషిస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయని అన్నారు. ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ హోదాను సాధిస్తారన్న భయంతోనే లోకేష్ హోదాను తక్కువ చేసి చూపించేందుకు తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
()టీడీపీ అధికారం కోసం ఎటువంటి అడ్డదారులైనా తొక్కుతుందనడానకి నయీం కేసు విచారణే నిదర్శనం. రౌడీల్ని పెంచి పోషించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించి డబ్బు సంపాదించడం, కుర్చీ అంటిపెట్టుకోవాలనుకోవడం దారుణం.
()నయీం చేసిన హత్యలు, భూకబ్జాలు, దోపిడీలు ఎంత నేరమో ఆయన్ను పెంచిపోషించిన వారు చేసింది కూడా అంతకంటే ఘోరం. దీనిపై పారదర్శకమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఉన్న దోషుల్ని నయూంతో ఉన్న లింకుల్ని పూర్తిగా చేధించి ప్రజల ముందు పెట్టాలి. 
()ఏవిధంగా అధికారం కోసం, కుర్చీ కోసం నేరస్తుల్ని... రాజకీయ, అధికార వ్యవస్థలు వాడుకుంటున్నాయో  దాన్ని తేటతెల్లం చేయాలి. నయీం కేసులో ఏ వన్ గా తెలుగుదేశం మాజీ మంత్రి ఉన్నారని వార్తలు వచ్చాయి. నయీం అనుచరులు కూడా టీడీపీ మాజీ మంత్రి అనుచరులేనని వార్తలు వస్తున్నాయి. నయీం చేసిన ఘోరాలను, ఆయన్ను పెంచి పోషించిన వారి చిట్టాను కూడా విప్పాల్సిన అవసరం ఉంది.
()రాబోయే రోజుల్లో ఏపీలో ఎంతమంది నయీంల్ని ప్రభుత్వం పెంచిపోషిస్తుందోనన్న భయందోళన కలుగుతోంది. ఇప్పటికే రాజధానిలో లక్షల ఎకరాల కుంభకోణం జరిగిందన్న వార్తలు చూశాం. రాబోయే రోజుల్లో ఏపీలో ఇలాంటి వారెంతమంది బయటపడతారో భయపడే పరిస్థితులున్నాయి.
()ఓటుకు నోటు కేసులోంచి తప్పించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణాలమీద ప్రాజెక్ట్ లు కడుతున్నా చంద్రబాబు నోరు విప్పని దౌర్భాగ్య పరిస్థితి.
()ఓటుకు నోటు కేసు కారణంగా పదేళ్ల హక్కున్న హైదరాబాద్ ను చూడటానికి కూడా భయపడే దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుది . నయీం కేసు నుంచి తప్పించుకోవడానికి మళ్లీ దేన్ని తాకట్టుపెడతారో భయపడే పరిస్థితి. 
()ప్రత్యేకహోదాపై టీడీపీ డ్రామాలాడుతుంది. ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ప్రత్యేకహోదా వద్దన్నదే టీడీపీ విధానంగా కనిపిస్తోంది. హోదాపై చంద్రబాబు ఓ రకంగా మాట్లాడుతారు. ఢిల్లీలో వాళ్ల ఎంపీలు మరో రకంగా నాటకమాడుతారు. హోదాపై  టీడీపీ వేషాలు ఎలా ఉన్నాయో వాళ్ల ఎంపీ శివప్రసాద్ ను చూస్తేనే అర్థమవుతోంది.  ఎంపీల్లో కొందరేమో గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి విన్యాసాలు చేస్తారు. ఇంకోపక్క ఏపీకి ఏమీ రాదని మళ్లీ టీడీపీ ఎంపీలే చులకనగా మాట్లాడుతారు
()రాష్ట్రానికి హోదాను సాధించుకునేందుకు ప్రైవేటు బిల్లును అవకాశంగా తీసుకోవాల్సిందిపోయి...ఓటింగ్ కు రాకపోతే తెలుగుదేశం మంత్రులు బల్లాలు చర్చి సంతోషం వ్యక్తం చేయడం దుర్మార్గం. 
()ఏడాది క్రితం  హోదా నా పేటెంట్ అని చంద్రబాబు అన్నదాన్నే వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నాడు. హోదాను తక్కువ చేసి చూపించడానికి లోకేష్ ఎందుకు తాపత్రయపడుతున్నారో చెప్పాలి. వైయస్ వల్లే హోదా వచ్చిందనుకుంటారని భయమా. లేకపోతే  హోదానే వద్దన్నది లోకేష్ అభిప్రాయమో స్పష్టం చేయాలి.
()హోదా సంజీవనా..హోదాతో ఏ ఉద్యోగాలొచ్చినయు. సమస్యలన్నీ తీరిపోతాయా అని లోకేష్ హోదాను తక్కువచేసి చూపే ప్రయత్నం చేయడం దారుణం. 
() ఇప్పటికే ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఢిల్లీ నడిబొడ్డున నిరాహార దీక్ష చేశారు. గుంటూరులో నిరవధిక నిరాహర దీక్ష చేపట్టారు. యువభేరి కార్యక్రమాలు నిర్వహించారు. హోదా కోసం మా పార్టీ కట్టుబడి ఉంది. ఏపీకి హోదా ద్వారానే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. హోదాతోనే ఏపీ పారిశ్రమికంగా అబివృద్ది చెందుతుంది. ప్రత్యేక హోదాతోనే ఏపీకి ప్రత్యేకలాభం చేకూరుతుంది. 
()రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని మాట్లాడుతున్న టీడీపీ నాయకులు...మీ విధానం అదే అయితే ధైర్యంగా చెప్పండి.  తండ్రి ఓ మాట, కొడుకో మాట ఢిల్లీలో ఎంపీలు మరోమాట చెప్పి ప్రజలను ఎందుకు గందరోళానికి గురిచేస్తున్నారు. హోదాను నీరుగారుస్తారా. హోదా సాధించడం చేతగాదగని చేతులెత్తేందుకు సిద్దపడుతున్నారా. 
()చంద్రబాబు 30సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించేదేమిటి. పోలవరం సాధించారా. రాజధానికి ఏమైనా అదనంగా సాధించారా.హోదా కోసం ప్రత్యేక హామీ ఏమైనా తీసుకొచ్చారా. 30 సార్లు వెళ్లడం వల్ల విమానఖర్చులు తడిసిమోపెడు అయ్యాయి తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.
()బాబు బలహీన నాయకత్వం మూలంగా రాష్ట్ర హక్కలను కేంద్రం వద్ద తాకట్టుపెడుతున్నారని ప్రజలు బాధపడుతుంటే...మనుమడిని చూడలేకపోతున్నారంటూ లోకేష్ నాటకాలాడుతున్నారు. మనుమడిని చూడకుండా బాబు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదు. 
() హోదా కోసం ఏవిధమైన పోరాటాలు చేసేందుకైనా వైయస్సార్సీపీ సిద్ధంగా ఉంది. 
()రెండేళ్లుగా బాబు చెవిలో పువ్వులు పెడుతున్నారు తప్ప ఏ ఒక్కటీ చేయడం లేదని పార్థసారథి ఫైర్ అయ్యారు. 

No comments:

Post a Comment