18 August 2016

మహిళలు బాబును శాపనార్థాలు పెడుతున్నారు

  • రెండున్నరేళ్లు దాటినా హామీల అమలు జరగడం లేదు
  • టీడీపీ సర్కార్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
  • గడపగడపకూ కార్యక్రమం తొలిదశలో విజయవంతం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
హైదరాబాద్ః  చంద్రబాబు పాలనను ప్రజలు చీకొడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో వంచించిన బాబుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా వైయస్సార్సీపీ  వినూత్న ప్రక్రియతో దేశ రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించిందని చెప్పారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
()రెండున్నరేళ్లు అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. వితంతులు, వికలాంగులు, వృద్ధులకు పెన్షన్ లు అందడం లేదు. జన్మభూమి కమిటీలు పేద ప్రజలపై వివక్ష చూపుతున్నాయి. నీరు-చెట్టు పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్న దుర్భర పరిస్థితులున్నాయి. 
() నిధుల్లో వివక్ష చూపుతోంది. రాజకీయ కక్షతో పీల్డ్ అసిస్టెంట్ లు, ఆదర్శరైతులను అందరినీ తొలగిస్తున్నారు.  కొత్త ఇళ్లు ఇవ్వకపోగా... పాతవాటికి బిల్లులు కూడా ఇవ్వడం లేదు. 
()రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ అన్నారు. ఇంటికో ఉద్యోగం. ఉద్యోగం లేనివారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.  ఇలా అనేక హామీలిచ్చారు. ఏ ఒక్కటీ చేయడం లేదు. 
()చంద్రబాబుపై ప్రజలు తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. బాబుపై  పూర్తి అసంతృప్తితో రగులుతున్నారు, మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.  గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం పూర్తయ్యే నాటికి ఇది ఉద్యమస్ఫూర్తిగా రూపుదిద్దుకుంటుంది. 
()గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు  ఉత్సాహంతో వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జెస్, శాసనసభ్యులు, పార్టీ శ్రేణులన్నీ పెద్ద ఎత్తున గడగడపకూ కదిలి ప్రజల అవసరాలు, వారికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలుసుకోవడం జరిగింది.
()ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా,  ప్రజా బ్యాలెట్ ను వారికి పంపిణీ చేశాం.  40 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నిక్కచ్చిగా పనిచేశారు. తాము తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నీరాజనాలు అందుతున్నాయి.
()గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం తొలిదశలోనే విజయం సాధించింది. మళ్లీ నెల రోజుల తర్వాత మధ్యంతర సమీక్ష జరపొచ్చు. పార్టీశ్రేణులు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మంచి కార్యక్రమం.  ఓ రాజకీయపార్టీకి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఫీలవుతున్నాం. దీన్ని సక్సెస్ పుల్ గా చేస్తాం.
()క్షేత్ర స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై ప్రతి ఒక్కరం సమీక్షలు తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కు అందించాం. ఆయన ఇచ్చిన మరికొన్ని సలహాలతో తిరిగి మరో నెల రోజులపాటు విధుల్లోకి వెళుతాం. 
()ఈకార్యక్రమం తర్వాత పార్టీ పెద్దలు, నాయకులు,  గ్రామ ప్రజలు అంతా కలిసి కూర్చొని సమావేశాన్ని నిర్దేశించుకుంటాం.
()ఆరుమాసాల కాలం ఈకార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెలలో 16 రోజులకు తగ్గకుండా ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నిర్దేశించింది. 
()గ్రామ, మండల, సమన్వయ కమిటీలు  జవాబుదారితనంతో కూడిన సమీక్ష జరిపాక పార్టీకి డాక్యుమెంటరీ అందజేయాలని ఆదేశించడం జరిగింది. పార్టీ అనుబంధ విభాగాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది

No comments:

Post a Comment