31 March 2016

బడ్జెట్ సమావేశాల మీద జన నేత వైఎస్ జగన్ స్పందన

  • ఫిరాయింపుదారుల్ని స్పీకర్ కాపాడుతున్నారు
  • అసెంబ్లీలో ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించాం

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తీరు చంద్రబాబు దుష్పరిపాలనకు అర్థం పడుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడేందుకు స్పీకర్ ను అడ్డు పెట్టుకొంటున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత సమావేశాల తీరు తెన్నుల మీద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడం, రోజమ్మకు హైకోర్టు అండగా నిలవటం, అగ్రి గోల్డ్ బాధితులకు మేమంతా తోడుగా నిలవటం, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై ప్రభుత్వం చేసిన అక్రమ విద్యుత్ కొనుగోళ్లను నిలదీయటం వంటి విషయాల్ని గమనించటం జరిగింది. రాజధాని భూముల్లో ముఖ్యమంత్రే ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతూ, ఓట్ ఆఫ్ సీక్రెసీని భంగపరిచారు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలిసీ, నూజివీడు నాగార్జున యూనివర్శిటీ అంటూ ఫీలర్లు ఇచ్చి ప్రజల ఆలోచనల్ని పక్క దారి పట్టించారు. తర్వాత బినామీలంతా కొనుగోళ్లు చేశాక రాజదాని వస్తుందని ప్రకటించి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. ఇది ఓట్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించటమే అనుకోవాలి. రాజధాని ప్రాంతంలో రక రకాలుగా రైతుల్ని మోసం చేశారు. 
    రాజధాని ప్రాంతంలో రైతుల్ని ఏ రకంగా మోసం చేశారు అనేది తెలుసుకొనేందుకు జోనల్ విధానాన్ని చూడవచ్చు. బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనేందుకు దీన్ని రూపొందించారు. రైతులు మాత్రం భూములు అమ్ముకోడానికి లేకుండా చేశారు. అక్కడ రాజధానిలో బినామీల భూముల్ని ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకోకుండా, రైతుల భూముల్ని మాత్రం తీసుకొన్నారు. ఇదే విషయాన్ని అడగటం జరిగింది. ఇసుక లో చంద్రబాబు స్వయంగా నీకెంత..నాకెంత.. అన్న విధంగా వాటాలు పంచుకొంటూ మాఫియాను నడిపించారు. అక్షరాలా రెండువేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆర్థిక మంత్రి యనమలే స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో పతివ్రత అయిపోయినట్లుగా కబుర్లు చెబుతున్నారు. ఈ విషయాల్నే ప్రశ్నించటం జరిగింది. ’’
అని వైఎస్ జగన్ అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుని ఎండగట్టారు. 

అధికారపక్షం చర్చకు రాకుండా పారిపోయింది

  • సభ నుంచి తప్పించుకున్నా..
  • ప్రజల నుంచి తప్పించుకోలేరు
  • బాబు బాక్సైట్ కోసం తనను టార్గెట్ చేశారుః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ః ద్రవ్య వినిమియ బిల్లును వ్యతిరేకిస్తూ డివిజన్ ను కోరితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి పారిపోయిందని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పిరికిపంద ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఇవాళ అసెంబ్లీ నుంచి తప్పించుకున్నా ప్రజల నుంచి తప్పించుకోలేరని అధికార టీడీపీని హెచ్చరించారు. ప్రలోభాలతో కొనుక్కున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే... ప్రభుత్వం అక్రమంగా తప్పంచుకుందని అన్నారు.

 చట్టసభలకు వీరు ఏవిధమైన మెసేజ్ ఇస్తున్నారో  ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రూల్స్ ప్రకారం పోదామంటే మేమే సుప్రీం అంటారు. రూల్స్ ను డిలేట్ చేస్తున్నారు. మెజారిటీ ఉందని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.  రాక్షస పాలన సాగిస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. బిల్లుపై చర్చకు ఆస్కారముందంటే హేళనగా మాట్లాడుతున్నారు. స్పీకర్ తనకు తాను స్టేట్ మెంట్ ఇచ్చుకొని, వాళ్లకు అనుకూలంగా సభ నడుపుకొని వాయిదా వేసుకొని పోయారని నిప్పులు చెరిగారు. 

బాక్సైట్ కోసం బాబు టార్గెట్
సభ  ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా..లేక నియంత పాలనతో నడుస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.. పాడేరు సంగతి చూస్తానంటూ చంద్రబాబు తనను బెదిరిస్తున్నారని ఈశ్వరి అన్నారు.  చట్టసభల్లో అధికార టీడీపీ తమ గొంతు నొక్కిందని, మైక్ ఇవ్వాలంటూ  తాము నిలదీస్తే  వ్యక్తిగత కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. మహిళలన్నా , గిరిజనులన్నా వివక్ష ఉందని బాబు చెప్పకనే చెప్పారన్నారు. 

గిరిజనులు గొంతు విప్పకూడదా బాబు...? బయపెడుతున్నారా..? మాట్లాడితే 35 ఏళ్ల అనుభవం ఉందని మాట్లాడే ముఖ్యమంత్రి.... స్థాయిని తగ్గించుకొని మాట్లాడాల్సిందిపోయి గిరిజన మహిళలను కించపర్చేలా మాట్లాడుతున్నారు. బాబు తీరును ప్రజలంతా  గమనిస్తున్నారని ఈశ్వరి పేర్కొన్నారు. ఖనిజ సంపద బాక్సైట్ కోసం చంద్రబాబు తనను టార్గెట్ చేశారని గిడ్డి ఈశ్వరి వాపోయారు. దీనిలో భాగంగానే మా గొంతు నొక్కేందుకు కించపర్చేవిధంగామాట్లాడుతున్నారన్నారు. బాబు దూషణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

30 March 2016

సంక్షేమ ఫలాలు అందించటానికి ఎమ్మెల్యేలు పనికిరారా

  • టీడీపీ నేతలకే నిధులన్నీ ఇస్తారా
  • రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తారా

హైదరాబాద్: నియోజక వర్గ అభివ్రద్ధికి నిధులు ఇవ్వటంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డారు. దీని మీద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడారు.
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
  ప్ర‌జ‌ల ఓటుతో శాస‌న‌స‌భ‌లోకి అడుగుపెట్టినా.. అదే స‌భ త‌మ బాధ్య‌త‌లు, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం నుంచి త‌మ‌ను తొల‌గిస్తోంద‌ని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులుగా ఎన్నికైన తాము ఆయా ప్ర‌జ‌లకు కావల్సిన మౌళిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చ‌డానికి అన‌ర్హుల‌మ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల‌వ‌ర‌ద‌రాజులు తనపై పోటీ చేసి ఓడిపోతే ఆయ‌న పేరు మీద టీడీపీ స‌ర్కార్ 42 ప‌నుల‌కు గాను రూ. 2కోట్లు కేటాయించార‌ని, వ‌ర‌ద‌రాజుల‌కు మ‌ద్ద‌తు తెలిపిన టీడీపీ నాయ‌కుడు లింగారెడ్డి పేరు మీద 23 ప‌నుల‌కు గాను కోటి రూపాయ‌లు కేటాయించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల చేత ఎన్నికైన తనకు మాత్రం ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం లేకుండా చేసిన విష‌యాన్ని ప్రొద్దుటురు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష మేర‌కు ప‌ని చేయ‌లేక‌పోతున్నాను అంటే అది నా బాధ్య‌త రాహిత్యం కాద‌ని కేవ‌లం అధికార ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రి అని తెలియ‌జేశారు. వైఎస్సార్‌సీపీ శాస‌న‌స‌భ్యులంద‌రం నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి కోసం గ‌ట్టిన ప‌ట్టుబ‌ట్టామ‌ని తెలిపారు.  నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు   సేవ చేయ‌డానికి ఏవిధంగా అర్హుడిని కాదో.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించ‌డానికి ప‌నికిరాన‌ని చెబుతున్నారో మ‌రి వారే తనకు ఎమ్మెల్యేగా రూ. 2ల‌క్ష‌ల గౌర‌వ వేత‌నం ఎందుకు ఇస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.  టీడీపీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు ఫండ్స్ రిలీజ్ చేయ‌మ‌ని, స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ద్వారా త‌మ‌కు న‌చ్చిన వారికే నిధులు కేటాయిస్తామ‌ని య‌న‌మ‌ల చెప్ప‌డం సిగ్గు చేట‌ని ఆరోపించారు. ఎమ్మెల్యేల‌కు ఫండ్స్ విడుద‌ల చేయ‌కుండా ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను, వారికి ఓట్లు వేసిన కోట్లాది ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని రాచ‌మ‌ల్లు నిప్పులు చెరిగారు. గ‌తంలో దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎమ్మెల్యేల‌కు కోటి రూపాయ‌ల చొప్పున నిధులు మంజూరు చేసిన  విష‌యం గుర్తు చేశారు.   రాష్ట్రం ఎంత‌గానో అభివృధ్ధి చెందుతుంద‌ని చెబుతుంటే వినేవారు మూర్ఖులా అని ప్ర‌శ్నిచారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీకి గ‌ట్టిగానే బుద్ది చెబుతార‌ని, ప్ర‌భుత్వంలో మార్పు వ‌చ్చి అన్ని పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌మ‌దృష్టితో చూడాల‌ని ఆయ‌న చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు.  

ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 
ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ఎమ్మెల్యేల‌కు కాకుండా త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన వారికి నిధులు కేటాయిస్తామ‌నేది ఎలా సాధ్య‌మ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం 74 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు రూ. 2 కోట్లు చొప్పున,  ఇత‌రుల‌కు 24మందికి గానూ రూ. 54 కోట్లు ఇచ్చిన‌ట్లు  క‌న‌బ‌డుతుంద‌ని ఆయన అన్నారు. కాగా ఈ 74, 24 నియోజ‌క‌వ‌ర్గాల‌ లెక్కల్ని  గ‌మ‌నించిన‌ట్ల‌యితే మొత్తం ఒకే పార్టీ వారికి కేటాయించారని చెప్పారు.  అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కాబోయే ఎమ్మెల్యేలు అనుకుంటున్నారో వారి పేర్లు ఉన్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.  
శాస‌న‌స‌భ చేయాల్సిన ప‌ని మొత్తం ఎక్కువ శాతం ఎగ్జిక్యూటివ్‌గా మారుతుంద‌ని, ఇది గ‌త 20 నుంచి 30 సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతుంద‌ని, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యానికొస్తే ఎంపీ నిధులుగానీ, ఇత‌ర రాష్ట్రాల‌కు సంబంధించిన అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల పండ్స్ చూసిన‌ట్ల‌యితే చిన్న‌చిన్న ప‌నుల‌ను ఎప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌నే నియ‌మిస్తార‌ని ఎందుకంటే ప్ర‌జాప్ర‌తినిధులుగా వారు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పే బాధ్య‌త ఉంటుంది కాబ‌ట్టి దీనిని అమ‌లు చేస్తున్నార‌న్నారు. కేర‌ళ రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన వారైనా ఒక్క‌సారి శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నికైతే సంవ‌త్సరానికి రూ. 5 కోట్లు ఇస్తున్నార‌ని,  ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌తి సంవ‌త్స‌రానికి రూ. 4 కోట్లు,  త‌మిళ‌నాడు రూ. 2 కోట్లు, ఒరిస్సా రూ. 2 నుంచి 3 కోట్లు,  బీహార్ రూ. 2 కోట్లు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం  రూ. 3 కోట్లు శాస‌న‌స‌భ్యుల‌కు ఫండ్ప్ రూపంలో అంద‌జేస్తుంద‌ని, అలాంటిది ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఇది అమ‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డం దారుణ‌మైంద‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.  
ప‌క్క‌రాష్ట్ర ఎంపీ క‌వితను ఒక సీనియ‌ర్ జర్న‌లిస్ట్ మీది నూత‌నంగా ఏర్ప‌డిన రాష్ట్రం కాదా మ‌రి మీకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు స‌క్ర‌మంగా అందుతున్నాయా అని ప్ర‌శ్నిస్తే దానిని ఎంపీ క‌విత జవాబు చెబుతూ ఒక ప్ర‌జాప్ర‌తినిధి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారి ప‌ర్య‌టిస్తే ప్ర‌జ‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాలంటే ఎంత‌క‌ష్ట‌మో అర్థ‌మ‌వుతుంద‌ని,  పెళ్లితంతు నుంచి మొద‌లు పెడితే గుడి నిర్మాణం, న‌ల్లా క‌నెక్ష‌న్‌ల వ‌ర‌కు ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను విన్న‌విస్తార‌ని దానికి ప్ర‌భుత్వ అధికారుల మాదిరిగా ఇది నా డిపార్ట్ మెంట్ కాద‌నే అవ‌కాశం ఉండ‌ద‌ని, ఎంతో కొంత బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంద‌న్నారు. మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ఫండ్స్ తీసేసి స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్స్ అని మొదలు పెట్ట‌డం ఎంతవ‌ర‌కు న్యాయమ‌ని ప్ర‌శ్నించారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పేరు చెబితే అన్ని పార్టీల ఎమ్మెల్యేల‌కు నిధులు మంజూరు చేయాల్సి వ‌స్తుంద‌ని అదే ఎస్‌డీఎఫ్ పేరు పెడితే చంద్ర‌బాబుకు న‌చ్చిన‌వారికి ఇవ్వొచ్చు అనే ధోర‌ణి ప్ర‌భుత్వంలో క‌నిపిస్తుంద‌ని విమ‌ర్శించారు.  
గ‌త సంవ‌త్స‌రంలో రూ. 385 కోట్లు కేటాయించి  అందులో రూ. 200 కోట్లు డిఫ్స‌ర్స్‌మెంట్ జ‌రిగింద‌ని, ఈ సంవ‌త్స‌రం రూ. 354 కోట్లు కేటాయించార‌ని  మ‌రి బ‌డ్జెట్ చ‌ర్చ‌లో   ఎందుకు చేర్చ‌లేద‌ని నిల‌దీశారు. అంతేకాకుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రి ఇంచార్జ్‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నాం అంటున్న అధికార సర్కార్ అస‌లు వారిని నియ‌మించేందుకు సీఎంకు ఏ అర్హ‌త ఉంద‌ని ప్ర‌శ్నించారు

టీడీపీ నేత‌ల‌కు దోచిపెడ‌తారా

హైద‌రాబాద్‌: ప్ర‌త్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీ ఎఫ్‌) అనే పేరుతో ప్ర‌భుత్వ నిధుల్ని టీడీపీ నేత‌ల‌కు దోచిపెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నిల‌దీశారు. శాస‌న‌స‌భ‌లో ఎస్ డీ ఎఫ్ నిధుల వినియోగం మీద ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు మాట్లాడారు. దీనికి ప్ర‌త్యేకంగా మార్గ‌ద‌ర్శ‌కాలు అంటూ లేవ‌ని, ముఖ్య‌మంత్రి ఇష్టం మీద ఇస్తార‌ని చెప్పారు. త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. వాకౌట్ చేస్తామ‌ని, దీని గురించి ప్ర‌స్తావ‌న చేస్తున్నామ‌ని చెప్పారు. 


నియోజ‌క వ‌ర్గాల్ని అభివృద్ధి చేయ‌టానికి ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వ‌టం సాంప్ర‌దాయం అని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో ఎమ్మెల్యేల‌కు గ‌ణ‌నీయంగా నిధులు ఇచ్చార‌ని చెప్పారు. దీనికి టీడీపీ స‌భ్యులు అడ్డు చెప్ప‌టంతో వైఎస్ జ‌గ‌న్ అభ్యంత‌రం తెలిపారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడ‌వ‌ద్ద‌ని, చంద్ర‌బాబు బాట‌లోనే మీరంతా న‌డుస్తున్నార‌ని  వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. 
పార్ల‌మెంటులో స‌భ్యులు అంద‌రికీ 5 కోట్ల రూపాయిలు ఇస్తున్నార‌ని, అందులో పార్టీల‌కు అతీతంగా ప్ర‌తీ ఒక్క‌రికి నిధులు ఇస్తార‌ని చెప్పారు. ఎందుకంటే రెండు ల‌క్ష‌ల మంది ఎన్నుకొని గెలిపించారు కాబ‌ట్టి ఆయా నాయ‌కుల అభిప్రాయాల‌కు అనుగుణంగా నియోజ‌క వ‌ర్గాలు అభివృద్ధి చెందాల‌న్న‌ది ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. అయితే ఇక్క‌డ మాత్రం టీడీపీ నాయ‌కులు ఓడిపోయిన నియోజ‌క వ‌ర్గాల్లో ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉంద‌ని చెప్పారు. ఓట‌మి పాలైన టీడీపీ నేత‌ల‌కు, మాజీ టీడీపీనాయ‌కుల‌కు నిధులు ఇస్తున్నార‌ని చెప్పారు కందుల నారాయ‌ణ రెడ్డి, ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి వంటి వార్ల‌కు ఏ ర‌కంగా నిధులు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 

ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు మైక్ క‌ట్ చేశారు. టీడీపీ నేత‌ల పేర్లు చ‌ద‌వ‌టానికి ఆయ‌న ఇష్ట ప‌డ‌లేదు.  మైక్ ను టీడీపీ స‌భ్యుడు శ్ర‌వ‌ణ్ కుమార్ కు ఇచ్చారు. త‌ర్వాత మైక్ ఇచ్చిన‌ట్లే ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కు మైక్ ఇచ్చి క‌ట్ చేశారు. దీనికి వైఎస్సార్సీపీ స‌భ్యులు నిర‌స‌న తెలిపారు.  

29 March 2016

కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా బాబుకు లేదు

  • రూ.1600 కోట్లు నీళ్ల పాలు జేశారు
  • పట్టిసీమలో స్టోరేజ్ కెపాసిటీ లేకున్నా..
  • ప్రాజెక్ట్ పూర్తిచేశామని బాబు చెప్పుకోవడం విడ్డూరం
  • జలవనరులపై నోరెందుకు పెగలడం లేదు బాబు 
  •  ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసు బయటకు తీస్తారని భయం
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్: చంద్రబాబు పట్టిసీమ పేరుతో 1600 కోట్ల రూపాయలను నీటి పాలు చేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమలో స్టోరేజ్ కెపాసిటీ లేకున్నా...పట్టిసీమ పూర్తిచేశామని బాబు గొప్పగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. రూ. 1600 కోట్లు పోలవరానికి కేటాయింపులు చేస్తే ఓ కొలిక్కి వచ్చేది. గాలేరి నగరికి, హంద్రీనీవాకు  ఖర్చుపెట్టి ఉంటే ప్రాజెక్టే పూర్తయ్యేదని వైఎస్ జగన్ చెప్పారు. అవేమీ చేయకుండా చంద్రబాబు రూ.1600 కోట్లు పట్టిసీమలో పెట్టి నీళ్లపాలు జేశారని ధ్వజమెత్తారు. 

ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్ట్పై చర్చలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాను కాపాడానని చంద్రబాబు చెబుతుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు.  180 టీఎంసీల నీరు అవసరమయ్యే కృష్ణా డెల్టాకు,  4 టీఎంసీల నీళ్లు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇచ్చానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు..మా చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నాడని వైఎస్ జగన్ ఫైరయ్యారు. తెలియని వ్యక్తికి చెప్పొచ్చు, తెలిసిన వ్యక్తితో మాట్లాడవచ్చు.అన్నీ తెలుసనే అజ్ఞానితో మాట్లాడడం ఎవరితరం కాదన్నారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా ఉందని వైఎస్ జగన్ చురక అంటించారు. 

పోలవరం ప్రాజెక్టులో 190 టీఎంసీల స్టోరేజ్ ఉందని, అందుకే అది పోల"వరమైందని" చెప్పారు. స్టోరేజ్ కెపాసిటీ కోసమే పోలవరం ప్రాజెక్ట్ను దశాబ్దాలుగా స్టడీ చేసి ప్రతిపాదించారని పేర్కొన్నారు. పోలవరం కుడికాలువలో 70 శాతం పనులు దివంగత మహానేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయడం వల్లే...దాంట్లోంచి నీళ్లు ఇలా కిందికి వస్తున్నాయని చంద్రబాబు చెప్పగలుగుతున్నారన్నారు.  వైఎస్ జగన్ ప్రసంగానికి అడుగడుగునా బాబు అడ్డు తగిలారు. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. 

ఈసందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...తాను ఐదు నిమిషాలు కూడా మాట్లాడకముందే బాబు మధ్యలో లేవడం గంటలకొద్దీ మాట్లాడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు  వైఎస్ జగన్ ను ఉద్దేశించి యంగ్ టైగర్ అని సంభోదించగా..జననేత మాట్లాడుతూ బాబు తాను అవుట్ డేటెడ్ అయిపోయానని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీటిని తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే చంద్రబాబు ఎందుకు స్పందించలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. జలవనరుల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రతో మంతనాలు జరుపుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. చంద్రబాబుకు కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేదని విమర్శించారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసును బయటకు తీస్తారని బాబు భయపడుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

సీీబీఐ విచారణ జరిగితే డొంక కదులుతుందనే సీఐడీ విచారణ



  • చంద్రబాబు దోషులను రక్షిస్తున్నాడు
  • రూ. 10 వేల కోట్ల స్కాం జరిగితే ఇలాగానే వ్యవహరించేది
  • దోషులను ఎక్కడా కూడా అరెస్ట్ చేయడం లేదు
  • విచారణ జరుగుతుండగానే మంత్రి ప్రత్తిపాటి భార్యకు భూములు అమ్మారు
  • హైకోర్టు జడ్జిల నేతృత్వంలో ఆస్తుల వేలం జరగాలిః వైఎస్ జగన్

హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో  చంద్రబాబు దోషులను శిక్షించాల్సింది పోయి రక్షిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్లో 2460 కోట్ల రూపాయల శారద చిట్ఫండ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతోందని, అంతకంటే ఎక్కువ మోసం చేసిన అగ్రిగోల్డ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ అయితే డొంక కదులుతుందనే..చంద్రబాబు తమ చెప్పుచేతల్లో ఉండేవిధంగా సీఐడీ విచారణకు ఆదేశించారని విమర్శించారు. 

అసెంబ్లీలో అగ్రిగోల్డ్పై చర్చలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే... అగ్రిగోల్డ్ కు సంబంధించి  సీఐడీ లెక్కల ప్రకారమే 32 లక్షల మంది బాధితులు ఉన్నారని చెబుతున్నారు. వాస్తవంగా 40 లక్షల పై చీలుకు కుటుంబాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.  సీఐడీ లెక్కల ప్రకారం 6వేల 850 కోట్లు డిపాజిట్ దారులు. వడ్డీలతో  కూడా కలుపుకుంటే  మరో 3150 కోట్లు. అంతా కలిపి దాదాపు 10 వేల కోట్లు అని సీఐడీ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఇంకా లెక్కలు తేలే పరిస్థితి కనిపిస్తోందని వైఎస్ జగన్ చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పెరిగిందని తెలుగుదేశం సభ్యులు  పిచ్చిపిచ్చిగా ఆరోపలు చేస్తున్నారు. అసలు టాపిక్ ఏంది. ఏం మాట్లాడుతున్నామన్నది ఆలోచన చేసుకోవాలి. 1998 మార్చి 31న సెబీ రాసిన లేఖను  వైఎస్ జగన్ చదివి వినిపించారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచిన టీడీపీ, ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దోషులను శిక్షించాల్సింది పోయి, వారిని రక్షిస్తున్నారని ఫైరయ్యారు. 2014లో నెల్లూరులో అగ్రిగోల్డ్పై తొలికేసు నమోదైందని, 2015 జనవరి 5న సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. విచారణ దారుణంగా జరుగుతోందని విమర్శించారు. సీఐడీ విచారణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార పార్టీ నాయకులు పలుమార్లు అడ్డుతగులుతూ ఎదురుదాడికి దిగారు. 

అగ్రిగోల్డ్పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ 2015 ఫిబ్రవరి 20న జీవో 23 ఇచ్చారు. ఇందులో తిరుపతికి సంబంధించిన ఆస్తిని ఎక్కడా ప్రస్తావించలేదు. విచారణ జరుగుతుండగానే అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ అనే వ్యక్తి ఆ ఆస్తిని రూ.14 కోట్లకు అమ్మేశాడు. అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థ రాం ఆవాస్ రిసార్ట్స్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్.. మంత్రి పుల్లారావు భార్యకు ఈ భూములు అమ్మారు. జీవో 23 రావడానికి నెల ముందే పుల్లారావు తన భార్య పేరిట భూములు కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభలో వైఎస్ జగన్ చూపించారు. ప్రభుత్వం అటాట్ చేసిన భూముల్లో ఈ భూమిని చేర్చలేదని స్పష్టం చేశారు.

వెంకాయమ్మ పేరుతో భూములు కొనుగోళ్లు జరిగాయని మంత్రి ఒప్పుకొన్నందుకు సంతోషమని వైఎస్ జగన్ చురక అంటించారు. వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, బోండా ఉమలు మధ్య లేచి సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఐనా సంయమనంతో అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన కష్టాలను వైఎస్ జగన్ సభలో వివరంగా తెలిపారు. 8 లక్షల మంది ఏజెంట్లు ఊళ్లు విడిచిపెడుతున్న పరిస్థితి . వంద చీలుకుపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని జననేత వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం కేసు నీరుగారుస్తుందని అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంఘం హైకోర్టులో సీబీఐ విచారణ కోరిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. 

సీఐడీ అధికారులు సీతారామ్ అవ్వాస్, ఉదయ్ కిరణ్లను అరెస్ట్ చేయలేదు. వీరిద్దరినీ కాకుండా మరో ఐదుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై  సీబీఐ చేత విచారణ జరిపించాల్సిందేనని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జి నేతృత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరగాలని పేర్కొన్నారు. 1998లో సెబి అగ్రిగోల్డ్ కంపెనీని నిషేధించమని చెప్పిన విషయాన్నిజననేత తెలియజేశారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేయలేదని ప్రశ్నించారు. సెబీ అగ్రిగోల్డ్ను బ్యాన్ చేయమంటే.. చంద్రబాబు అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్తో ఫొటో దిగారని మండిపడ్డారు. 

సీఐడీ విచారణ సరిగా జరగడం లేదని వైఎస్ జగన్ చెప్పారు. అగ్రిగోల్డ్ కు 155 కంపెనీలున్నాయని, మిగిలిన అన్నింటిపై ఆరా తీయాలన్నారు.  అగ్రిగోల్డ్ కు సంబంధించిన చైర్మన్ పుత్రుడు దుబాయిలో బంగారం షాపు పెట్టాడు. ఆయనపై ఎక్కడా విచారణ జరగడం లేదు. అరెస్ట్ చేయాల్సిన పనిలేదంటూ సీఐడీ కోర్టుల ముందే దారుణంగా చెబుతోంది.  బాధితులకు న్యాయం చేస్తామని  ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. అగ్రిగోల్డ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

28 March 2016

పట్టిసీమ ప్రారంభోత్సవం లోని మతలబు ఇదే.. !

  • సరిగ్గా ఏడాది క్రితం మొదలైన పనులు
  • ఒక సంవత్సరంలో పూర్తయితేనే అదనపు చెల్లింపులు
  • అందుకే హడావుడిగా ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా పట్టిసీమ కు ప్రారంభోత్సవం చేయటానికి గల కారణం బయట పడింది. ఏడాదిలోగా పనులు పూర్తయ్యాయ  అని పిస్తేనే కాంట్రాక్టర్లకు అదనంగా దోచి పెట్టడానికి వీలవుతుంది. అందుకే హడావుడిగా పని కానిచ్చేశారు అన్న మాట వినిపిస్తోంది.
మొదట నుంచీ అవినీతి సుగంధమే..!
పట్టి సీమ పథకం ఆవిర్భావమే అవినీతి తో మొదలైంది. తెలుగువారికి వర ప్రసాదిని అనదగ్గ పోలవరం పనుల్ని పక్క దారి పట్టించేందుకు చంద్రబాబు పట్టి సీమ ఎత్తిపోతల పథకాన్ని తెర మీదకు తెచ్చారు. దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా జీవో తెచ్చారు. టెండర్లకు కావాల్సిన నిబంధనల్ని అడ్డంగా మార్చేసి, తమకు కావాల్సిన సంస్థకే టెండర్లు దక్కేలా చర్యలు తీసుకొన్నారు. తర్వాత తాపీగా ఆ సంస్థ కు 21 శాతం అదనంగా నిధులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. వాస్తవానికి అంచనా వ్యయం కన్నా ఐదు శాతం మించిన టెండర్లను అనుమతించకూడదు. అయినా సరే, చంద్రబాబు మాయోపాయంతో ఈ ఒప్పందం కుదుర్చుకొంది. ఏడాదిలోగానే పథకం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, దానికే 16 శాతం బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు.
అసలు కథ అప్పటి నుంచి
మార్చి 29, 2015న పనులు మొదలు పెట్టారు. కానీ, నాసిరకంగా ముందుకు సాగించేందుకు రక రకాల చర్యలు చేపట్టారు. పట్టిసీమ అయిపోయిందనిపించేందుకు రక రకాల మార్గాల్ని అన్వేషించారు. ఆగస్టు 15 నాటికి కొలిక్కి తెచ్చేస్తామని ఘనంగా ప్రకటించారు. తీరా చూస్తే ఆ సమయానికి ఏ రకంగానూ ముందుకు అడుగు పడలేదు. దీంతో ఆగస్టు 15 రోజున పనులు ఏమాత్రం కాకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించేశారు. రాయల సీమ నుంచి అరువు తెచ్చిన పంపుతో నామ్ కే వాస్తీగా అయిందనిపించారు.
రెండు చెంబులతో అనుసంధానం
ట్రయల్ రన్ కింద పట్టి సీమ నుంచి నీళ్లు పారించాం అని చంద్రబాబు గొప్పలు చెప్పారు. తీరాచూస్తే నీళ్లు రానే లేదు. గోదావరి నుంచి క్రిష్ణా నదికి నదుల అనుసంధానం చేస్తున్నట్లు, దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం ఘనత తమదే అని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే నీళ్లు రానే రాలేదు. దీంతో రెండు చెంబుల నీళ్లు పోసి అనుసంధానం అయిపోయిందని తేల్చేశారు.
ఇప్పుడు అదే బాటలో ప్రారంభోత్సవం
29వ తేదీ వస్తే ఏడాది పూర్తయిపోతుంది కాబట్టి కాంట్రాక్టర్ కు మేలు కల్పించేందుకు చంద్రబాబు తనదైన వ్యూహాన్న అమలు చేశారు. పనులు పూర్తి కాకపోయినా ప్రారంభోత్సవం  చేసేయాలని నిర్ణయించుకొన్నారు. నీళ్లు ప్రవహించినా, ప్రవహించకపోయినా ప్రారంభోత్సవం చేశారు. దీంతో కాంట్రాక్టర్ కుఅ దనపు చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధం అయింది. 

26 March 2016

బాబే దగ్గరుండి అవినీతి చేయిస్తున్నారు :వైఎస్ జగన్

  • ఫైబర్ ఆప్టిక్ కాంట్రాక్ట్ లో అవినీతి సుగంధం
  • బాబు సన్నిహితులకు రూ. 330 కోట్ల కాంట్రాక్టు
  • టెరా సంస్థల బండారాన్ని బయట పెట్టిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ బండారాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బట్ట బయలు చేశారు. రాష్ట్రంలో టెలివిజన్ చానెల్స్ ను గుప్పెట్లోకి తెచ్చుకొనేందుకే  ఈ ఏర్పాటు చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ అంశం  మీద మాట్లాడారు.
      ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవహారం అన్నది రూ. 330 కోట్లు దోచిపెట్టే పథకం అని అభివర్ణించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక దుకాణాలకు ఈ పాస్ యంత్రాల్ని అమర్చటంలో విఫలం చెందినందుకు టెరా సాఫ్టు వేర్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందని వెల్లడించారు. మరి అదే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనుల్ని ఎలా అప్పగిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ సంస్థ యజమానులకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించారు. దీనికి నేత్రత్వం వహిస్తున్న హరిక్రిష్ణ ప్రసాద్ గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్ని దొంగిలిస్తూ దొరికిపోయినప్పుడు పోలీసు కేసు అయిందని పేర్కొన్నారు.
      ఫైబర్ గ్రిడ్ పనుల కోసం టెండర్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసిందని వైఎస్ జగన్ వెల్లడించారు.  ఈ కమిటీ లో వేమూరు హరిక్రిష్ణ ప్రసాద్ ఒక సభ్యుడు అని వివరించారు. ఈయన ఆధ్వర్యంలో టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థ ఉందని, ఇది టెరా సాఫ్టువేర్ లిమిటెడ్ కు సోదర సంస్థ అని వివరించారు. హరిక్రిష్ణ ప్రసాద్ తన పలుకుబడి ఉపయోగించి కమిటీతో తన సంస్థలకే పనులు దక్కేట్లుగా చేయించుకొన్నారని వైఎస్ జగన్ చెప్పారు. పైగా హెరిటేజ్ ఫుడ్స్ లో డైరక్టర్ గా వ్యవహరించే దేవినేని సీతారామ్ .. 2014 సెప్టెంబర్ దాకా ఈ టెరా సాఫ్టు వేర్ సంస్థకు డైరక్టర్ గా వ్యవహరించారని వివరించారు. దీన్ని బట్టి టెరా సంస్థలకు చంద్రబాబు కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అర్థం అవుతుందని చెప్పారు. ఇది ఎంత దారుణమైన కేటాయింపో అర్థం చేసుకోవచ్చని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబే దగ్గర ఉండి అవినీతి చేయిస్తున్నారని విడమరిచి చెప్పారు. 

విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం

  • స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలే బట్టబయలు చేసిన కుంభకోణం
  • అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 4..5 వేల కోట్ల రూపాయిల మేర కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వసంస్థలే స్వయంగా బయట పెట్టినా, చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోవటం లేదని పేర్కొన్నారు. అయినా సరే, దీన్ని అంగీకరించకుండా ప్రభుత్వం బుకాయిస్తోందని ఆయన వివరించారు. అసెంబ్లీలో విద్యుత్ పద్దుల మీద జరిగిన చర్చలో వైఎస్ జగన్ గణాంకాలతో సహా ఈ విషయాల్ని బట్ట బయలు చేశారు.
      ప్రస్తుతం విద్యుత్ రౌండ్ ది క్లాక్ అంటే 24 గంటలకూ 2 రూపాయిల 71పైసలకు, రాత్రి సమయంలో 1రూపాయి 90 పైసలకు దొరుకుతోంది. అంటే సగటున 2 రూపాయిల 40 పైసలకు దొరికే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 రూపాయిల 11పైసలకు కొనుగోలు చేస్తోందని వైఎస్ జగన్ వివరించారు. దీని మీద స్వయంగా కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ఉండే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన నోట్ లో  ఈ కొనుగోళ్లను ఆక్షేపిస్తూ కామెంట్ రాశారని వెల్లడించారు. దీన్ని నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లు జరిగిన మొత్తం గణాంకాల్ని ఆయన చదివి వినిపించారు. 

25 March 2016

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా

  • రాజకీయంగా సర్వనాశనం చేయాలని చూస్తున్నారు
  • చేయని తప్పుకు క్షమాపణ ఎలా చెబుతారు
  • అధికారపార్టీకి, మహిళకు మధ్య పోరాటం
  • టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు దూషించినా చర్యలు తీసుకోరా
  • కా.మ అని ఈనాడు కూడా రాసింది..చర్యలు ఎందుకు తీసుకోరు
  • టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన రోజా

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన క్లిప్పింగ్ లు వేస్తూ ఎల్లో మీడియా తనను అవమానించడంపై రోజా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలను, అరాచక పనులను ఎత్తిచూపినందుకే అసెంబ్లీ నుంచి తనను కక్షపూరితంగా సస్పెండ్ చేశారని రోజా నిప్పులు చెరిగారు.  చేయని తప్పుకు క్షమాపణ చెప్పాల్సిన పనిలేదని రోజా స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.  సస్పెన్షన్ పై న్యాయస్థానంలో న్యాయపోరాటం కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. సస్పెన్షన్ అన్నది అధికారపార్టీ పురుష అహంకారానికి, మహిళకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంగా రోజా అభివర్ణించారు. మహిళా సమస్యల మీద పోరాడుతుంటే తట్టుకోలేకనే చంద్రబాబు తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని రోజా ఫైరయ్యారు . రికార్డ్ లు బయటకు తీస్తే..ఎవరు ప్రజాసమస్యల మీద మాట్లాడారు. ఎవరి తిట్టడమే పనిగా పెట్టుకున్నారో తెలుస్తోందన్నారు.  అధికారపార్టీ నేతలు దోషిగా తేలుతారని కుండబద్ధలు కొట్టారు. 

రాజకీయంగా తనను సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు న్యాయం జరిగేందుకు గొంతు విప్పిన తనపై అన్యాయంగా కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు దళిత మహిళా ఎమ్మెల్యేలను పావుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం ఉన్న ఇంటి దగ్గరే,  కాల్‌మనీ సెక్స్ రాకెట్ విజృంభించింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహిళలను  వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ప్రశ్నిస్తే... ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ సస్పెండ్ చేశారన్నారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశానికి సంబంధించి 17వ తేదీన 344 కింద వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చామని రోజా పేర్కొన్నారు. 3 కోట్ల మంది మహిళలకు సంబంధించిన ఈ విషయమంమీద..చర్చ కోసం అడిగితే రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి సభలోకి వచ్చాక అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చి, దాన్ని పక్కదోవ పట్టించారని రోజా తెలిపారు. 18వ తేదీ మరోసారి ఇదే అంశంపై నోటీసు ఇచ్చామని, అంబేద్కర్ కూడా ఇలాంటి అంశంపై చర్చ సాగించాలనే చెప్పేవారని రోజా అన్నారు. మహిళను ఓటర్లుగా కాదు మనుషులుగా చూడండి అని తాము అడిగితే... అంబేద్కర్ ఆత్మ కూడా క్షోభించేలా 58 మందిని 344(2) ప్రకారం సస్పెండ్ చేశారని రోజా చెప్పారు. అదే సమయానికి అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరం చూశామన్నారు. 

చంద్రబాబుది ప్రచారపు ఆరాటమే..!

  • నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో శీత కన్ను
  • కేటాయింపులు స్వల్పం, ప్రచారం మాత్రం ఘనం
  • సొంత ఖాతాలో వేసుకొనేందుకు బాబు ఆరాటం


హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుడు దేవినేని ఉమా మహేశ్వర రావు చేస్తున్న ప్రకటనలు.. ప్రభుత్వ ఉద్దేశ్యాలను చెప్పకనే చెబుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపించని ప్రభుత్వం... వాటి ద్వారా వచ్చే లబ్దిని మాత్రం తన ఖాతాలోకి పంపించుకొనేందుకు ఆరాట పడుతోంది.
వాస్తవాలు ఇవే..!
రాష్ట్రానికి నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ముఖ్యం. నదుల నుంచి పారే నీటిని మళ్లించుకొని పొలాల్లోకి పంపిస్తేనే సాగుబడి వర్థిల్లి ప్రజలకు ఆహారం, రైతులకు ఆదాయం సమకూరుతుంది. అందుకే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్నం పనులకు అంత పెద్ద మొత్తంలో నిధుల్ని కేటాయించింది. పదవీ కాలంలో ఎప్పుడూ నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు ఘనతను కూడా ఇక్కడ గమనించాలి.
        వంశధార ప్రాజెక్ట్  అంచనా వ్యయం రూ. 1242 కోట్లు అయితే...బాబు తన హయాంలో రూ. 44 కోట్లు పెట్టారు. మహానేత  వైఎస్సార్ తన హయాంలో రూ.657 కోట్లు వెచ్చించారు. వైఎస్ మరణానంతరం 138 కోట్లు కేటాయింపులు జరిగాయి. దీన్ని బట్టి వాస్తవాలు అర్థం అవుతున్నాయి కదా. పుష్కరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 608 కోట్లు అయితే, బాబు   కేవలం రూ.7.6 కోట్లు వెచ్చించా రు. వైఎస్సార్ తన హయాంలో ప్రాజెక్ట్ కోసం రూ. 538 కోట్లు ఖర్చుపెట్టారు. వైఎస్సార్ మరణానంతరం రూ.61.77 కోట్లు కేటాయింపులు జరిగాయి.
మరో ఉదాహరణ తీసుకొంటే..  తోటపల్లి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.527 కోట్లయితే , వైఎస్సార్ హయాంలో రూ.398.88 కోట్లు కేటాయింపులు జరిగాయి.  బాబు   కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించి కబుర్లు మాత్రం బాగా చెబుతున్నారు.  ఇక తాడిపూడి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 467 కోట్లు అయితే, బాబు రూ.3.23 లక్షలు కేటాయిస్తే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో 384.64 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ మరణానంతరం రూ. 55.19 కోట్లు ఖర్చు చేయటం జరిగింది.
 ప్రచారం కోసం ఆరాటం
       వాస్తవాలు ఇంత చేదుగా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఆరాట పడుతోంది. ప్రాజెక్టుల్లో దాదాపు 90 శాతం పైగా పనులు పూర్తయిన వాటిని గుర్తిస్తోంది. వాటికి మెరుగులు దిద్ది, అంతా తమ ఘనతే అని చెప్పుకొనేందుకు తాపత్రయ పడుతోంది. అందుకే చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుడు దేవినేని ఉమ చేస్తున్న ప్రకటనలు కోటల్ని దాటుతున్నాయని చెబుతున్నారు. వాస్తవాల్ని దాచిపెట్టి చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసమే అన్న మాట స్పష్టంగా వినిపిస్తోంది.

24 March 2016

జలీల్ ఖాన్ పోవడంతో నియోజకవర్గానికి.. పట్టిన దరిద్రం పోయింది

  • కృష్ణానది లాగే టీడీపీ కూడా ఎండిపోతుంది
  • గన్ మ్యాన్, డ్రైవర్ మాత్రమే జలీల్ ఖాన్ వెంట వెళ్లారు
  • కార్యకర్తలంతా వైఎస్సార్సీపీతోనే ఉన్నారు
  • పశ్చిమనియోజకవర్గ కార్యకర్తలతో నేతల సమావేశం
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్  మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుందని ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, కె.పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఈసందర్భంగా పెద్ది రెడ్డి మాట్లాడుతూ  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై  మండిపడ్డారు. అభివృద్ది చూసి వెళ్లామంటూ కళ్లబొర్లు కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ప్రాజెక్టులతో వస్తున్న కమీషన్లతో చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

ఈసందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ...  చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి... మళ్లీ ఎన్నికల్లో గెలివాలి అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ఖాన్పై మండిపడ్డారు. జలీల్ఖాన్ పార్టీ మారడం వల్ల పశ్చిమ నియోజకర్గానికి ఉన్న దరిద్రం పోయిందని అన్నారు. 

అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ... కృష్ణానదిలో నీరు ఎలా ఎండిపోతుందో... రేపు టీడీపీ కూడా అలాగే ఎండిపోతుందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలోకి జలీల్ఖాన్ వెళ్లారన్నారు. ఆయన పార్టీని వీడినా... కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. 
వంగవీటి రాధా మాట్లాడుతూ... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ గెలవాలని జలీల్ ఖాన్కి వంగవీటి రాధా సవాల్ విసిరారు. 

జలీల్ఖాన్ పార్టీ వీడి వెళ్లడం వల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ మంత్రి, కె.పార్థసారథి వ్యాఖ్యానించారు. గన్మాన్, డ్రైవర్, అతని పీఏ మాత్రమే జలీల్ఖాన్ వెంట వెళ్లారని... కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పార్థసారథి పేర్కొన్నారు. 

23 March 2016

నెల్లూరు సభలో వైఎస్ జగన్ ఉద్వేగభరిత ప్రసంగం


  • ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకొన్నా: వైఎస్ జగన్
  • ప్రజల గొంతు నొక్కాలన్నది చంద్రబాబు ప్రయత్నం
  • అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో లాక్కొంటున్నారు
  • త్వరలోనే దేవుడు, ప్రజలు తగిన బుద్ది చెబుతారు

నెల్లూరు: ఎప్పుడూ నాయకుల్ని నమ్ముకోలేదని, ప్రజలు..దేవుడ్ని మాత్రమే నమ్ముకొన్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. ప్రజల చల్లటి దీవెనల సాయంతో చంద్రబాబు తో మరింత బలంగా పోరాడుతానని ఆయన అన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్ లో సీనియర్ నేత ఆనం విజయకుమార్ రెడ్డి, అనుచరులతో సహా వైఎస్సార్సీపీ లో చేరిన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

       నెల్లూరు రూరల్ నియోజక వర్గం నుంచి ఆనం విజయన్న చేరికతో ..మొన్ననే ప్రలోభాలు, అవినీతి సొమ్ములకు ఆశపడి పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు. చంద్రబాబు పాలనలో అవస్థలు పడుతున్న ప్రజల గొంతు. అటువంటి గొంతును నొక్కేయాలని చంద్రబాబు సర్కారు ఆరాట పడుతోంది. ప్రజల తరపున కష్టపడుతున్న వారి  గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.  ఇతర పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బాబు ప్రలోభ పెట్టి లాక్కొంటున్నారు. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకి అర్థం కావాలి, ప్రలోభాలకు లొంగిపోయిన ఎమ్మెల్యేలకు అర్థం కావాలి.

రాజకీయాల్లో గుణం ముఖ్యం

       రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు మన వైపు చూస్తుంటారు. అందుకే మనం రోల్ మోడల్స్ గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవారికి రెండు గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, రెండు క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. రాజకీయ నాయకులకు ఈ రెండు గుణాలు ఉండాలి. ఇవి రెండూ లేకపోతే జనమే కాదు, ఆఖరికి ఇంట్లో ఉండే భార్య కూడా వెంట నిలిచే అవకాశం ఉండదు.  చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అంటే.. అధికారం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీయార్ నే వెన్నుపోటు పొడవటం అన్నది ఆయన వ్యక్తిత్వం. ఇక ఆయన విశ్వసనీయత ఏమిటంటే.. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పటం, తర్వాత ప్రజల్ని మోసగించటం అన్న మాట. ఇక చంద్రబాబుకే వ్యక్తిత్వం, విశ్వసనీయత లేకపోతే ఆయన వెంట కొనుగోళ్లకు ఆశపడి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటమే అనవసరం.

భయపడేది లేదు

       ఎన్నికలకు ముందు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకొంటే.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చాం. అప్పుడు చూస్తే 175 స్థానాలు ఖాళీగా కనిపించాయి. నాయకులు కనిపించలేదు. అయినా భయపడలేదు. అధికారం లో ఉన్న సోనియాగాంధీని చూసి భయపడలేదు. సోనియాగాంధీతో కలిసి కుమ్మక్కై చంద్రబాబు.. నన్ను కేసుల్లో ఇరికించినప్పుడు    భయపడలేదు. ఎందుకంటే పైన ఉన్న దేవుడ్ని, ఇక్కడ ఉన్న ప్రజల్ని నమ్ముకొన్నాను కాబట్టే భయ పడలేదు. అప్పుడు ఇద్దరితో మొదలైన పార్టీ.. ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీల స్థాయికి చేరుకొంది. దేశం మొత్తం మన వైపు చూసేట్లుగా చేయగలిగాం. ఎప్పుడూ నాయకుల్ని నమ్ముకోలేదు. ప్రజలు, దేవుడ్ని నమ్ముకొన్నాం. వాళ్లే ఆశీర్వదిస్తారు.

చంద్రబాబు చెప్పేదంతా మోసం

       వాస్తవానికి ఇటువంటప్పుడు చంద్రబాబు చేయాల్సింది తన హామీలను నిజం చేయటం మీద ద్రష్టి పెట్టాలి. ఎన్నికలకు ముందు రక రకాల అబద్దాలు చెప్పి రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, ఆఖరికి నిరుద్యోగ యువతను మోసం చేశారు. చదువుకొనే పిల్లల్ని మోసం చేశారు. ఎన్నికలకు ముందు ఆ కులం, ఈ కులం అని చెప్పి రక రకాల కులస్తుల్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ప్రజల్ని గాలికి వదిలేశారు. ప్రజల గొంతు వినిపించకుండా ఉండేందుకు అవినీతి డబ్బులతో, ప్రలోభాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.        పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కుప్ప కూలాయి. హిట్లర్ వంటి నియంత  వ్యవస్థలే కూలిపోయాయి. ప్రజల కోపానికి తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో పడిపోయే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడు చూస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే చంద్రబాబుకి మొట్టికాయలు వేస్తారు. చంద్రబాబు ఆఖరికి డిపాజిట్లు కూడా దక్కించుకోకుండా పోతారు.

ప్రజల ఆశీస్సులతోనే..!

       మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి.  మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులతో చంద్రబాబు తో మరింత పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. కష్టం అనిపించినా, తొమ్మిది గంటల నుంచి వేచి ఉన్నా మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా.      ఈ రోజునుంచి విజయ్ అన్న మా కుటుంబంలో ఒకరుగా ఉంటారు. ఆయన్ని మా కుటుంబలోని వ్యక్తిగా చూసుకొంటాం.

 అని వైఎస్ జగన్ ఆత్మీయపూర్వకంగా ప్రసంగించారు.

22 March 2016

శనగ రైతుల్ని ఆదుకోండి: వైఎస్ జగన్

  • బీమా సొమ్ము కోసం రైతుల ఎదురు చూపులు
  • కుంటిసాకులతో వేల మందికి అన్యాయం
  • శనగ రైతుల సమస్యల్ని ప్రస్తావించిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: సమస్యల్లో ఉన్న శనగ రైతుల్ని ఆదుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విన్నవించారు. వైఎస్సార్ జిల్లాలో బీమా సొమ్ములు అందక అవస్థలు పడుతున్నారని వివరించారు. అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్  ఈ సమస్యను ప్రస్తావించారు.
      2012 వ సంవత్సరానికి గాను రబీ సీజన్ లో రైతులు పంటను నష్టపోయారని వివరించారు. ఈ సొమ్ము 2013 లో అందాల్సి ఉందని, కానీ ఇప్పటికీ బీమా సొమ్ములకోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. మొత్తం 56 వేల మంది రైతులకు బీమా సొమ్ము అందాల్సి ఉందని వివరించారు. దీని గురించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీద ఒత్తిడి చేస్తే చివరకు ఇటీవల కొంత మేర నిధులు విడుదల చేశారని చెప్పారు. 29వేల మంది రైతులకు మాత్రమే విడుదల చేశారని వివరించారు. మిగిలిన రైతులకు సంబంధించి దరఖాస్తుల్లో లోపాలు ఉన్నాయని అంటున్నారని, అటువంటి సమస్యలు ఉంటే అప్పుడే చెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పుడు దరఖాస్తుల్లో లోపాలు అంటే రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు.
      తీరా చేస్తే 29వేల మంది రైతులకు గాను రూ.132 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ. 95 కోట్లు మాత్రమే  విడుదల చేశారని చెప్పారు. అటువంటప్పుడు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు. 

21 March 2016

ప్రతిపక్షంపై టీడీపీ కక్షసాధింపు

హైదరాబాద్ః  లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరిగింది.  వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ...టీడీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారమదంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మేకా ప్రతాప్ అప్పారావు( నూజివీడు ఎమ్మెల్యే)
ఒక మ‌హిళ ప‌ట్ల ప్రభుత్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని ఎమ్మెల్యే మేక‌ప్ర‌తాప్ అప్ప‌ారావు అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తీరు దారుణంగా ఉందని ఫైరయ్యారు. కోర్టు ఉత్త‌ర్వులు ప‌ట్టుకొని అసెంబ్లీకి వ‌చ్చినా...రోజాను సభలోకి అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. మహానేత వైఎస్సార్ ప్రతిదాన్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకునే వారని...కానీ, ఈప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విష‌యంపై తమ అధినేత వైఎస్ జగన్ తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.   అధికారపార్టీ నేతలు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని పట్టుకొని కొవ్వెక్కిందని, అసెంబ్లీలోనే పాతేస్తామ‌ని ...ఎన్నిసార్లు రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేసినా వైఎస్ జగన్  ఎంతో ఓర్పుతో స‌భ సంప్ర‌దాయాల‌ను పాటించి మౌనంగా ఉన్నారని అప్పారావు తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాన్ని  టీడీపీ  అణ‌గ‌దొక్కాల‌ని చూస్తోందని,  ఇది స‌రైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్ప‌టికైనా టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. 

రక్షణనిధి (తిరువూరు ఎమ్మెల్యే)
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీస్తున్న ప్రతిపక్ష సభ్యులపై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ప్రభుత్వ అరాచకాలను నిలదీసినందుకే రోజాను అకారణంగా సస్పెండ్ చేశారన్నారు.  ప్రభుత్వం తమ వైఫల్యాలను  ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే... ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలో లేకుండా చేయాలని కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రోజా ధైర్యంగా కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పారు. కోర్టుల కన్నా తామే సుప్రీం అంటూ ప్రభుత్వం రోజాను సభలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కోర్టులో రోజాకు న్యాయం జరుగుతుందని, ఆమెకు అండగా తాము పోరాటం కొనసాగిస్తామని రక్షణనిధి స్పష్టం చేశారు. 

విశ్వేశ్వర్ రెడ్డి( ఉరవకొండ ఎమ్మెల్యే)
టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రతిపక్షం గొంతు నొక్కాలన్న ధోరణితోనే ముందుకు పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రభుత్వం తాను చేసిన  తప్పులను సరిదిద్దుకోకుండా శాసనసభ వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య తగాదా పెట్టేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రూల్ 340(2) ప్రకారం రోజాను సస్పెండ్ చేసే అధికారం సభకు లేదని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, మాకు మాత్రమే రూల్స్ తెలుసంటూ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అంహకూరపూరితంగా వ్యవహరించిందని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైకోర్టు స్టేను సైతం ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

గిడ్డి ఈశ్వరి( పాడేరు ఎమ్మెల్యే)
రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని, సభలో జరిగిన సంఘటనలపై స్పీకర్ కు ఓ సెషన్ మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. రోజా తన హక్కులకు భంగం కలిగిందనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం పోరాటం చేశారన్నారు. హైకోర్టు విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా..రోజాను సభలోకి అనుమతించకపోవడం మహిళలను కించపర్చడమేనన్నారు. ప్రభుత్వం, స్పీకర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. టీడీపీ, బీజేపీ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఈశ్వరి పేర్కొన్నారు.  ఇక ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉందని ఈశ్వరి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పిన దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారని ఫైరయ్యారు. గతంలో తాము మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, గోరంట్ల, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులపై  ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేస్తే దానిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ల దగ్గరకు వచ్చేసరికి క్షమాపణ, మాదగ్గరికొచ్చే సరికి శిక్షనా..?  ఇదెక్కడి న్యాయమని ఈశ్వరి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ అహంకారపూరిత చర్యల్ని ఖండిస్తున్నామన్నారు.  ప్రజావ్యవస్థను, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ న్యాయపోరాంట కొసాగిస్తామని ఈశ్వరి తేల్చిచెప్పారు.  

19 March 2016

ప్రజలారా టీడీపీ దుర్మార్గపు పాలనను గ్రహించండి

  • టీడీపీ ఆంధ్రప్రదేశ్ ను ఆఫ్ఘనిస్తాన్ లా ..
  • ప్రజాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ లా మారుస్తోంది
  • కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటే గౌరవిస్తాం..
  • వ్యతిరేకంగా వస్తే లెక్కచేయమనట్లు వ్యవహరిస్తోంది
  • న్యాయస్థానం తీర్పును అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం
  • ప్రజలు బాబు రెండు చెంపలు వాయించడం ఖాయంఃచెవిరెడ్డి

హైదరాబాద్ః న్యాయస్థానాల కన్నా మా తీర్పే అంతిమమంటూ ప్రభుత్వం తల బిరుసుతనం ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. న్యాయ‌స్థానాల తీర్పు మా తీర్పు ముందు నిల‌బ‌డ‌వని మాట్లాడతున్న అధికారపక్షం...కోర్టుకు ఎందుకు వెళ్లిందని చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి నిల‌దీశారు. కోర్టు తీర్పుపై గౌర‌వం లేన‌ప్పుడు కౌంట‌ర్‌ దాఖ‌లు చేయ‌కుండా ఉండాల‌ని, డివిజ‌న్ బెంచ్ కి ఎందుకు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే గౌరవిస్తాం, లేకుంటే లెక్కచేయమన్న రీతిలో టీడీపీ తీరు ఉందని దుయ్యబట్టారు.  

జైలు కెళ్ల‌క త‌ప్ప‌దు..
కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తున్న చీఫ్ మార్ష‌ల్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీలిద్ద‌రు జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌న్నారు. కోర్టు తీర్పును ధిక్క‌రిస్తే త‌దుప‌రి ప‌రిణామాలు ఎలా ఉంటాయో చీఫ్ మార్ష‌ల్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీలు చూడ‌బోతున్నార‌న్నారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు కదా అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించడంపై  చెవిరెడ్డి చురక అంటించారు. తమకు మైక్ ఇవ్వకుండా కట్ చేస్తుంటే ఎలా మాట్లాడుతారని, మైక్ ఇంటికి తీసుకెళ్లి మాట్లాడాలా అంటూ విరుచుకుపడ్డారు.  

ప్రజాపోరాటం కొనసాగిస్తాం..
టీడీపీ ఏవిధంగా న్యాయ‌స్థానం తీర్పును గౌర‌వించ‌డం లేదో... ఎలా ప్రజావ్య‌తిరేక పాల‌న చేస్తున్నారో... ఇచ్చిన హామీల‌ను ఎలా తుంగ‌లో తొక్కుతున్నారో... ఏర‌కంగా ప్ర‌జాభిమానానికి విలువనివ్వ‌డం లేదో... ఏవిధంగా అసెంబ్లీలో రూల్ 71ను ర‌ద్దు చేశారో దానిపై ప్ర‌జాపోరాటం కొన‌సాగుతుంద‌ని చెవిరెడ్డి బాస్క‌ర‌రెడ్డి తేల్చిచెప్పారు.  ఏ రూల్ అయినా రాజ్యాంగానికి లోబ‌డే అమ‌లవుతాయే త‌ప్ప‌, రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా అమ‌లు కావ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తి దుశ్చ‌ర్య‌ను కోర్టు ద్వారా మేము ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మీడియా ద్వారా తామొక్క‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని ...టీడీపీ దుర్మార్గ‌పు పాల‌న‌, దుశ్చ‌ర్య పాల‌న‌, దుశ్సాసన పాల‌న‌ను గ‌మ‌నించాల‌ని కోరారు. 

ఆఫ్ఘనిస్తాన్ లా ఆంధ్రప్రదేశ్..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆఫ్ఘానిస్తాన్‌గా, ప్ర‌జాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ దేశంలాగా మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోర్టు ఇచ్చిన ప్ర‌తి తీర్పును దేశంలోని ప్ర‌తి శాస‌న‌స‌భ అమ‌లు చేసింద‌ని ...అనంత‌రం ఆ తీర్పుపై పైకోర్టుల‌కు వెళ్లాయని చెప్పారు. చ‌ట్టాల‌ను త‌యారు చేసే వారే చ‌ట్టాల‌ను గౌర‌వించ‌క‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మావైపు ప్ర‌జ‌లున్నార‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం అన్యాయాలను ఎండ‌గ‌డ‌తామ‌న్నారు. 

ముఖ్య‌మంత్రి రేయ్ అంటారా..?
అసెంబ్లీలో స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఒక శాస‌న‌స‌భ్యుడిని రేయ్, నీ అంతుచూస్తాన‌ని మాట్లాడడం. ఒకాయన కొవ్వు ఎక్కువైంద‌ని,  ఇంకొక‌రు ఖ‌బ‌డ్దార్ అని, ఇంకొకాయన బుర‌ద‌లో పందులని, మ‌రొక‌రు సైకోల‌ని, ఒక‌రైతే ఏకంగా అసెంబ్లీలోనే పాతేస్తాన‌ని వ్యాఖ్య‌నించ‌డం చెవుల‌కు విన్న‌సోంపుగా ఉందా అని స్పీకర్ ను ప్ర‌శ్నించారు. న్యాయం అన్న‌ది అంద‌రికీ స‌మానంగా ఉండాల్నారు. రాష్ట్రంలో కొన్ని వంద‌ల స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ..వాటికి ఎందుకు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌ర‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప్ర‌జ‌లు ఓటు అనే ఆయుధంతో ఈ చెంప‌, ఆ చెంప వాయిస్తార‌ని తెలిపారు. తాము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, చేశామని  చూపిస్తే దానిపై స‌మాధానం చెప్ప‌డానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంద‌న్నారు. 

ప్రాథ‌మిక హ‌క్కులు, మౌళిక సూత్రాల‌కు భంగం కలగకుండా స‌భ‌లో స‌భ‌వ్య‌వ‌హారాలు జ‌రిగిన‌ప్పుడే 212 అధికర‌ణ ప‌ని చేస్తుందని చెవిరెడ్డి తెలిపారు. రాజ్యాంగానికి విఘాతం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు మౌళిక సూత్రాల‌ను తుంగ‌లో తొక్కిన‌ప్పుడు కోర్టు జోక్యం చేసుకోవ‌చ్చ‌ని సుప్రీం కోర్టు చెబుతుంద‌ని వివ‌రించారు.  ఏ రాష్ట్రంలో చూసిన కోర్టు తీర్పే వేద‌మ‌ని అన్నారు. 

1964లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక శాస‌న‌స‌భ్యుడిని ఏడు రోజుల పాటు అరెస్ట్ చేయాల‌ని సభ తీర్మానిస్తే... ల‌క్నో కోర్టు దానికి వ్య‌తిరేకంగా తీర్పునిచ్చిందని చెప్పారు.  దానిపై తిరిగి స్పీక‌ర్ డివిజ‌న్ బెంచ్ కు వెళ్లార‌ని, డివిజ‌న్ బెంచ్ సైతం సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పునే వెలువ‌రించింద‌ని చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వివ‌రించారు. కాగా అధికార ప్ర‌భుత్వం తిరిగి రాష్ట్ర‌ప‌తి స‌ల‌హా కోసం ఆశ్ర‌యిస్తే రాష్ట్ర‌ప‌తి ఆ కేసును సుప్రీంకోర్టుకు పంపించార‌ని తిరిగి సుప్రీం కోర్టు సైతం ఒక శాస‌న‌స‌భ్యుడిని ఇష్టానుసారం స‌స్పెండ్ చేసే హ‌క్కు స్పీక‌ర్‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింద‌ని చెప్పారు. 

త‌మిళ‌నాడులో ఆరుగురు శాస‌న‌స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తే వారు హైకోర్టును ఆశ్ర‌యించార‌ని, దీంతో వారి సస్పెన్ష‌న్ చెల్ల‌ద‌ని కోర్టు తీర్పునివ్వ‌డంతో  ప్ర‌భుత్వం తిరిగి వారిని శాస‌న‌స‌భలో కొన‌సాగించార‌ని గుర్తు చేశారు. ఎక్కడైనా కోర్టు తీర్పునిచ్చిన త‌ర్వాత దానిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు. తీర్పు ప్ర‌భుత్వానికి న‌చ్చ‌క‌పోతే ముందు తీర్పును అమ‌లు చేసిన అనంత‌రం డివిజ‌న్ బెంచ్ కి వెళ్లాలని, అంతేకానీ తీర్పును అమ‌లు చేయ‌కుండా వ్య‌వ‌హారించ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్నారు.

న్యాయ వ్యవస్థకు బాసట గా నిలిచిన వైఎస్ జగన్


  • శాసనసభకు దూరంగా ఉంటాం..!
  • మహిళా ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవటం దారుణం
  • న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ చర్చ జరుపుతామన్న చట్ట సభల్ని బహిష్కరిస్తున్నా

హైదరాబాద్: న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ , చట్ట సభల్లో చర్చలు చేపట్టాలన్ని తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తప్పు పట్టారు. న్యాయ వ్యవస్థకు సంఘీభావంగా చట్ట సభల్ని సోమ వారం దాకా బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యే రోజాను అనుమతించకుండా, సభలో నిరసన తెలిపే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నందుకు నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 
వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..!
      చట్ట సభలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అందరూ చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలోకి మహిళా ఎమ్మెల్యే రోజాను అనుమతించక పోవటానికి నిరసనగా, అన్యాయం మీద వాకౌట్ చేయదలచుకొన్నాం... అంటూ మైక్ ఇవ్వమని అడిగితే మైక్ ఇవ్వలేదు. రెండు నిముషాలు మైక్ ఇవ్వమని అడిగినా కూడా మైక్ ఇవ్వటం లేదు. ఇది ఎంతటి అన్యాయం.
చట్ట సభలో ఏం జరిగిందీ అనేది నిన్న చూశాం. స్పీకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి రోజమ్మను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని చెప్పారు. ఇది ఎంతటి అబద్దం. 67 మంది శాసనసభ్యులు మీతో విభేదించారు. మీకు అధికారం లేకపోయినా ఎలా సస్పెండ్ చేస్తారు... రూల్స్ ను అధిగమించి ఎలా సస్పెండ్ చేస్తారు.. అని అడిగిన సంగతి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు అబద్దాలు చెబుతూ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అని చెబుతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా..?
      ఇప్పుడు ఇదే సభ సోమవారం నాడు సమావేశమై చర్చ చేస్తారట. న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ధిక్కరిస్తూ స్పీకర్.. సభను నడిపిస్తున్న తీరుని చూసి నిరసన తెలుపుతున్నాం. ఒక వైపు కోర్టు ధిక్కార నేరం మీద హైకోర్టులో విచారణ సోమవారం నాడు చేపట్టినప్పుడు, అదే న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ ఇక్కడ చర్చ జరుపుతారట. అందుకే అప్పటిదాకా సభను మేం బహిష్కరిస్తున్నాం. చట్ట సభల్లో న్యాయస్థానాలకు ఎంతటి గౌరవం ఇస్తున్నారో చూస్తున్నాం.
      న్యాయస్థానాల ఉత్తర్వులు చూపించి సభకు హాజరు అవుతామని మహిళా ఎమ్మెల్యే రోజా అడిగారు. అయినా సరే న్యాయస్థానం కన్నా మేం పెద్దోళ్లం, మేం అటువంటివి అంగీకరించం అని పాలన సాగిస్తున్న తీరును మేం ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థకు బాసటగా నిలిచేందుకు సోమవారం దాకా సభల్ని మేం బహిష్కరిస్తున్నాం. ఇది ఎంతటి దిక్కుమాలిన సభ అనేది అర్థం అవుతోంది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని చర్చిస్తారట. అంటే న్యాయవ్యవస్థను అవహేళన చేస్తూ ఇక్కడ చర్చలు జరిపి తీర్పులు ఇస్తారట. అందుకే మేం దీన్ని బహిష్కరిస్తున్నాం.
      ఒక వైపు న్యాయస్థానంలో ఇదే అంశం మీద విచారణ జరుపుతున్నప్పుడు, న్యాయస్థానం చేసే విచారణ మీద మీరు విచారణ జరిపి తీర్పు ఇస్తారా. అలా అయితే మీరే విచారణ చేసుకోండి. మీరే తీర్పులు రాసుకోండి.
      నిజంగా ముఖ్యమంత్రి కి సిగ్గు, లజ్జ ఉంటే కనుక.. వేరే పార్టీ నుంచి ఎన్నికై, పార్టీ ఫిరాయించిన 8మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల తీర్పు కోరాలి. చంద్రబాబు నాయుడికి ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము, ధైర్యం లేవు. ఎందుకంటే ప్రజల దగ్గరకు వెళితే ప్రజలు బుద్ది చెబుతారని తెలుసు. పైగా స్పీకర్ కుర్చీని ఉపయోగించి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.
            రాజకీయాల్లో ఉండే వారికి రెండు లక్షణాలు ఉండాలి. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత అవసరం. కానీ చంద్రబాబు వ్యక్తిత్వం ఎటువంటిది అంటే పదవి కోసం సొంత మామ గారిని వెన్నుపోటు పొడిచిన స్వభావం. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన స్వభావం ఆయనది. ఇటవంటి వ్యక్తి లంచాలు, అవినీతి తో సంపాదించిన సొమ్ములను ఎరగా చూపించి, ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటమే కాకుండా స్పీకర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కి సిగ్గు, లజ్జ, రోషం ఉంటే తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేయాలి. ప్రజల ఆశీస్సులు తాజాగా కోరాలి.
      స్పీకర్ వ్యవస్థ ద్వారా ఒక అబలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూనే ఉన్నాం. ఒక అబల తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కోర్టుకి వెళ్లి న్యాయపోరాటం చేసి ఆదేశాలు తెచ్చుకొంటే అన్యాయం చేస్తారా. ప్రజలు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నారు. త్వరలోనే ప్రజలు బుద్దిచెబుతారు. ’’ అని వైఎస్ జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయంపై వినతి

  • టీడీపీ అరాచకాలపై గవర్నర్ కు ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని కోరిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మహిళా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా తెలుగుదేశం చేస్తున్న కుట్రల్ని... గవర్నర్ నరసింహన్ కు తెలియపరిచారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శికి రెండు పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం సారాంశం ఇదే..!
          గవర్నర్ నరసింహన్ గారికి,
      ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనా వళి లోని రూల్ నెం. 340 (2) కింద డిసెంబర్ 18, 2015 నాడు అసెంబ్లీ నుంచి నగిరి శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్ కే రోజా ను ఏడాది పాటు  సస్పెండ్ చేయటం జరిగింది. దీన్ని గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదించగా, మా పార్టీ తరపున మేమంతా నిరసన తెలుపుతున్నప్పటికీ సభలో ఆమోదించినట్లు ప్రకటించారు.
      ఈ నిబంధన 340(2) అనేది ఒక సభ్యుడు లేక సభ్యురాలిని ఆ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయగలరు తప్పితే అంతకు మించి సస్పెండ్ చేయటం కుదరదు. అదే విషయాన్ని మేం తెలియపరిచి నిరసన వ్యక్తం చేశాం. కానీ, తాము తలచుకొంటే ఏదైనా చేయగలం అని, ఎటువంటి కోర్టులు తమను ఏమీ చేయలేవని సదరు మంత్రి సభలో వెల్లడించారు. అయితే ఈ దేశంలో నిర్దిష్టమైన చట్టవ్యవస్థ ఉందని మరిచిపోయారు. అనేక సందర్బాల్లో శాసన వ్యవస్థలో చోటు చేసుకొన్న పరిణామాలపై కోర్టులు జోక్యం చేసుకొన్నాయి. తాజాగా అలగాపురమ్ ఆర్ మోహన్ రాజ్ మరియు ఇతరులు వెర్సస్ తమిళనాడు శాసనసభ అనే కేసులో ఉన్నత న్యాయస్థానం సదరు సభ్యులకు న్యాయం ప్రసాదించింది.
      శాసనసభ నుంచి డిసెంబర్ 18, 2015 నాడు సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానం మీద హైకోర్టు ..శ్రీమతి రోజా కు మార్చి 17, 2016వ తేదీన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. వెంటనే సమావేశాలకు హాజరు అయ్యేందుకు అనుమతిని ఇవ్వటంతో పాటు, ఈ ఆదేశాలను శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శికి  ఈ మెయిల్ ద్వారా పంపటం జరిగింది.
      అంతే కాకుండా అసెంబ్లీ కార్యదర్శికి మార్చి 17, 2016వ తేదీనే మధ్యాహ్నం శ్రీమతి రోజా  ఈ ఉత్తర్వుల కాపీని అందచేయటం జరిగింది. దీన్ని స్వీకరించినట్లు ఆయన ధ్రువీకరించారు.
      ఈ ఆదేశాలకు అనుగుణంగా శ్రీమతి రోజా శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యేందుకు సభకు వెళుతుంటే చీప్ మార్షల్స్ ఆమెను నిలిపివేశారు. దీనిమీద ప్రతిపక్ష నేత గా నేను ఆయన్ని ప్రశ్నించాను. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆమెను నిలిపివేస్తున్నానని చెప్పటం తప్ప ఆయనేమీ నిర్దిష్ట జవాబు ఇవ్వనే లేదు. కనీసం రాత పూర్వకంగా ఉన్న ఆదేశాల్ని చూపటం లేదు. దీనిమీద కొందరు మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాలేదు. శాసనసభ స్పీకర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఒక ఎమ్మెల్యేకు చట్టబద్దంగా సంక్రమించిన హక్కుని కాలరాయటం కన్నా తీరని అవమానం ఏముంటుంది.
      బహిరంగంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఉల్లంఘించటమే కాకుండా తీవ్ర అన్యాయానికి ఒడిగడుతున్న పరిస్థితి మీద మేం నిరసన తెలిపాం. అసెంబ్లీ గేటు దగ్గర ఉదయం 8.45 నుంచి 10.45 దాకా, తర్వాత గాంధీ విగ్రహం దగ్గర మేం శాంతియుతంగా నిరసన తెలిపాం. కానీ ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
      హైకోర్టు ఆదేశాల్ని పాటించాలని గౌరవ శాసనసభ స్పీకర్ కు సూచించాలని ఈ రాష్ట్ర రాజ్యాంగ అధిపతిగా మిమ్మల్ని కోరుతున్నాం.
ధన్యవాదములతో..
వైఎస్ జగన్.

18 March 2016

నిజంగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..!

హైదరాబాద్ : శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని చూస్తుంటే అసలు నిజంగా..మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీలో ఏం జరిగింది అనేది అందరూ చూస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.

అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యే రోజా ను ప్రభుత్వం అడ్డుకోవటంతో శాసనసభ దగ్గర వైఎస్ జగన్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తోటి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేశారు. గవర్నర్ నరసింహన్ లేకపోవటంతో ఆయన కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ దగ్గర వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.  వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం..
      చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను చేతుల్లోకి తీసుకొని పెడదోవ పట్టిస్తున్నారనేది చూస్తున్నాం. శాసనసభలో స్పీకర్ అనే వ్యక్తి రూల్స్ కు వ్యతిరేకంగా తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారు. నిబంధనలు అనుమతించక పోయినా కానీ ఎమ్మెల్యే రోజమ్మను సస్పెండ్ చేయటం చూశాం. నిబంధన 340 ప్రకారం సస్పెండ్ చేశామని చెబుతున్నారు.  కానీ,  ఈ నిబంధన ప్రకారం చూస్తే అసెంబ్లీ సెషన్స్ వరకు మాత్రమే సస్పెండ్ చేయటానికి వీలవతుంది. నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
తర్వాత అసెంబ్లీలో జరుగుతున్న దుర్మార్గాల్ని ఒక్కొక్కటిగా వైఎస్ జగన్ వివరించారు.