30 June 2015

2,3 తేదీల్లో వైఎస్ జగన్ తూర్పు, విశాఖ పర్యటన

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే నెల 2,3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని  కాకినాడ ఏజెన్సీలో పర్యటించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఆ నియోజకవర్గం  పార్టీ కో-ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ విలేకరులకు చెప్పారు. ఈ నెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా  పడ్డ ప్రమాదంలో గంగవరం మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది, కొత్తాడకు చెందిన ఒకరు మొత్తం 9 మంది గిరిజనులు మృతి చెందగా, సుమారు 80 మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఆ ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే జగన్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానన్నారని అప్పట్లో నేతలు చెప్పారు. ఆ క్రమంలోనే జగన్ ఇప్పుడు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, కోలుకుంటున్న క్షతగాత్రులను ఓదార్చనున్నారన్నారు. రెండో తేదీ ఉదయం రాజమండ్రికి చేరుకునే జగన్ అక్కడి నుంచి రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని, అనంతరం రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం కారణంగా మృతి చెందిన, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఓదారుస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి కాకినాడలో బస చేస్తారని, 3న ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి తుని నియోజకవర్గంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం విశాఖ జిల్లా అచ్యుతాపురం వెళతారన్నారు. ఇటీవల ధవళేశ్వరం బ్యారేజ్‌పై నుంచి తుఫాన్ వాహనం బోల్తాపడ్డ ఘటనలో ఆ గ్రామానికి చెందిన 22 మంది మరణించారని, జగన్ వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు.

మట్టి ని వదలని పచ్చ చొక్కాలు..!

తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పచ్చ చొక్కాలు అన్ని రకాలుగా ఆదాయ మార్గాల్ని వెదకుతున్నారు. ప్రభుత్వం బాగా ప్రచారం చేసి ప్రారంభించిన నీరు - చెట్టు పథకం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు తూట్లు పొడిచి మట్టి నుంచి డబ్బులు పిండుతున్నారు.
 పథకం ఉద్దేశ్యం
 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల్ని పున రుద్ధరించేందుకు దీన్ని సంకల్పించారు. ఇందులో భాగంగా చెరువుల్ని గుర్తించి, వాటిల్లోంచి పూడికను తీస్తున్నారు. అయితే ఇందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. చెరువుల్లోంచి తీసిన మట్టిని అక్కడే కట్టల్ని బలోపేతం చేసేందుకు వినియోగించాలి. ఆ పని పూర్తయ్యాక ఇంకామట్టి మిగిలిపోతే చెరువు కింద పొలాల్లోకి రైతులు వాడుకోవచ్చు. లేదంటే పేదల ఇళ్ల స్థలాలు మెరక వేసుకొనే వీలు ఉంటుంది. అదే సమయంలో చెరువులో పూర్తిగా గోతులు తీసేస్తే మనుషులు మునిగి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని ఒక మీటరు లోతు వరకే తవ్వాలన్న నిబంధన విధించారు. ఈ నిబంధనలు అన్నీ బాగానే ఉన్నాయి. వీటిని పుస్తకాల్లో భద్రంగా ఉంచేసి, తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా చెలరేగిపోతున్నారు.
 అడ్డగోలు తవ్వకాలు
 నీరు - చెట్టు పథకాన్ని ప్రారంభించిన వెంటనే తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగిపోయారు. ఎక్కడికక్కడ పెద్ద చెరువుల్ని గుర్తించి పనుల్ని దక్కించుకొన్నారు. నిబంధనల్ని పక్కన  పెట్టేసి, అన్ని చోట్ల పనుల్ని తెలుగుదేశం నేతలకే అప్పగించే శారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఎడాపెడా మట్టిని తవ్వి పోస్తున్నారు. ఎక్కడికక్కడ మట్టిని తీసేసుకొంటున్నారు. జిల్లాల్లో ఇప్పుడు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చెరువుల్లోని మట్టికి డిమాండ్ బాగా ఉంది. దీంతో ఈ మట్టిని అడ్డగోలుగా విక్ర యిస్తున్నారు. బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా అడ్డుకొనే వారు లేకుండా పోయారు.
 అధికారులకు బెదిరింపు
 వాస్తవానికి ఇది నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరగాలి. కేటాయింపులన్నీ జన్మభూమి కమిటీల పేరుతో చేసేశారు. అసలే ఈ కమిటీల్లో ఉండేవారంతా తెలుగుదేశం నాయకులే. ఈ నేతలంతా కలిసి కుమ్మక్కై తమకు కావలసిన వారికి పనులు అప్పగించేశారు. తరవాత నిబంధనలు సరి చూడాల్సిన అధికారులకు బెదిరింపులు తప్పటం లేదు. అధికార పక్షం బెదిరింపులకు తట్టుకోలేక అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారుల్ని బలవంతంగా సెలవు మీద పంపిస్తున్నారంటే ఈ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు.
 జిల్లాల వారీగా దుర్వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి.
 1. కృష్ణా - రూ. 100 కోట్లు
 2. గుంటూరు - రూ. 15 కోట్లు
 3. ప్రకాశం - రూ. 10 కోట్లు
 4. నెల్లూరు - రూ. 50 కోట్లు
 5. కర్నూలు - రూ. 1.50 కోట్లు
 6. అనంతపురం - రూ. 2.50 కోట్లు
 7. చిత్తూరు - రూ. 10 కోట్లు
 8. వైఎస్సార్ కడప - రూ. 3 కోట్లు
 9. ప.గోదావరి - రూ. 30 కోట్లు
 10. తూ. గోదావరి - రూ. 6 కోట్లు
 11. విశాఖపట్నం - రూ. 5 కోట్లు
 12. శ్రీకాకుళం - రూ. 1 కోటి
 13. విజయనగరం - రూ. 2కోట్లు

ప్రకాశంలో ప్రజాస్వామ్యం ఖూనీ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇచ్చి కొనుగోళ్లు జరిపి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ అదే అవినీతి పోకడలను ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసి శిబిరాలు నిర్వహించే స్థితికి దిగజారింది. గెలుపు కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమేనని మరోమారు నిరూపించుకుంది. అధికారమదంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాష్టీకాలకు ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చివరకు ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఆందోళనలు చేసినా గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది.
వీడియో క్లిప్పింగుల్లో దొరికినా...
  బలం లేకపోయినాప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలవాలన్న దుగ్ధతో తెలుగుదేశం పార్టీ చేయని అకృత్యం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కి చెందిన 35 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశంలో నిర్భందించారు. ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టారు. జడ్‌పీటీసీలను, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీడియో క్లిప్పింగులు దొరికాయి కూడా. అయినా అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేవారే లేకపోయారు. ప్రకాశం జిల్లాలో అధికారులు, పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించడం దురదృష్టకరం.  అధికార పార్టీకి అధికారులు, పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సర్వ సాధారణంగా కనిపించేదే అయినా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని, పోలీసులను స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న తీరు మాత్రం అత్యంత ఆక్షేపణీయం.
తమిళనాడుకు తరలించారు...
  అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాయడం విచారకరం. ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలను అపహరించడానికి పోలీసులు సహకరించడం మరింత దుర్మార్గం. సరిగ్గా వారంరోజుల క్రితం నెల్లూరులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన 35 మంది ఎంపీటీసీ, జడ్‌పీటీసీలను తెలుగుదేశం పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి ఒక హోటల్ లో నిర్బంధించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి. అనిల్‌కుమార్‌యాదవ్ వెళ్లి వారిని విడిపించడం ప్రపంచమంతా చూసింది. అలా విడిపించిన ప్రజాప్రతినిధులు పోలీసుల రక్షణలో ఉన్నారు. ఉదయాన్నే వారిని ఇళ్లకు పంపిస్తామని చెప్పిన పోలీసులు ఆ తర్వాత అందరినీ తమిళనాడుకు పంపించేశారు. స్థానిక పోలీసులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చెప్పినట్లే నడుచుకోవడం, ఆయన చెప్పిన చోటకు ప్రజాప్రతినిధులను తరలించడం బహిరంగ రహస్యమే.
 దొంగే దొంగా అన్నట్లుంది...
 వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులను అపహరించడమే కాకుండా వైఎస్‌ఆర్‌సీపీపైనే తప్పుడు ప్రచారాలకు దిగడం మరింత హేయమైన చర్య. అధికారపార్టీ తొత్తులా వ్యవహరించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ముందుగానే వైఎస్‌ఆర్‌సీపీపై దుష్ర్పచారాలకు దిగింది. కర్నూలు - ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ వైదొలగినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా అవినీతి చర్యలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా తన అనుకూల చానెల్ అయిన ఏబీఎన్ ద్వారా దిగజారుడు ప్రచారాలకు దిగింది. ఏబీఎన్ దుష్ర్పచార వార్తలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా. ఇదే కాదు కర్నూలులో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను అపహరించి తెలంగాణలో క్యాంపు నిర్వహిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌సీపీపై అభూతకల్పనల కథనాలను కూడా ఏబీఎన్ ప్రసారం చేసింది.
 గవర్నర్, ఈసీలకు విజ్ఞప్తులు నిష్ఫలం..
 తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అపహరించి శిబిరాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు, రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌కు వైఎస్‌ఆర్‌సీపీ పలుమార్లు విజ్ఞాపనలు అందించింది. తమవారిని తెలుగుదేశం పార్టీ చెర నుంచి విడిపించే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తమ ప్రజాప్రతినిధులను అజ్ఞాతంలో నిర్బంధించిన సమయంలో తాము ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలని వారు గవర్నర్‌ను ప్రశ్నించారు. విజ్ఞాపనలను పరిశీలిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన గవర్నర్‌గానీ, ఎన్నికల సంఘం గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అధికార పార్టీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఒంగోలులో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసనగా ధర్నాచేశారు.
  ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు అందించినా రాక్షసరాజ్యంలో న్యాయం ఆశించడం అత్యాశే అవుతుందన్న సూత్రమే నిజమయ్యింది. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ప్రజల గుండెల్లో వైఎస్ : పరామర్శ యాత్రలో షర్మిల

జనం బాధను తన బాధగా భావించినందునే ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.. నాన్న మరణించి ఆరేళ్లయినా..అదే ఆప్యాయత కనబరుస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు కారణం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించిన ఆమె.. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మూడు కుటుంబాలను పరామర్శించారు.  చౌరస్తాలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల..అక్కడ్నుంచి నేరుగా జిల్లెలగూడ గ్రామానికి చేరుకొని వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బి.అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంట పాటు వారితో గడిపిన షర్మిల..అందరినీ పేరుపేరునా పలకరించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అక్కడ్నుంచి పరామర్శ యాత్ర రంగారెడ్డి జిల్లా మంఖాల్‌కు చేరుకుంది. ఈ గ్రామంలోని  జోసఫ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

 రైతుల హృదయాల్లో చెరగని ముద్ర
 దండుమైలారంలో వైఎస్సార్ తనయ షర్మిలకు ఘనస్వాగతం దక్కింది. ఊరంతా కలిసిరాగా..డప్పు వాయిద్యాల మధ్య ఆమె ప్రజలతో కలిసిసాగారు. ఈ గ్రామంలో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన పోకల్‌కార్ మహేశ్వర్‌జీ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.  షర్మిల వెంట  పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రుక్మారెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  ఏనుగు మహిపాల్‌రెడ్డి, అమృతసాగర్, గోపాల్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెబట్, వెల్లల రామ్మోహన్, ఐటీ విభాగం అధ్యక్షుడు సందీప్ కుమార్,  శ్రీనివాస్‌రెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బి.రఘురాంరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, షర్మిలా సంపత్, రమా ఓబుల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, ఎండీ సలీం, డోరెపల్లి శ్వేత, ప్రచార కమిటీ విభాగం కార్యదర్శి డి.అమరనాథ్‌రెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, ఆర్.సతీష్‌రెడ్డి, ఆర్.సంతోష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్, మామిడి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మంగళవారం రంగారెడ్డి జిల్లా  మేడ్చల్‌లో సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి తాము అండగా ఉంటామని సాయిబాబాగౌడ్ కుటుంబ సభ్యులకు షర్మిల భరోసా ఇచ్చారు. పరామర్శ యాత్రలో భాగంగా రెండో రోజు కండ్లకోయ, కేసారం, మాడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లోని వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

27 June 2015

29 నుంచి షర్మిల పరామర్శ యాత్ర

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సోమవారం ప్రారంభం అవుతోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో దిగాలు చెంది వందల మంది అకాల మృత్యువుకు లోనయ్యారు. వీరిని పరామర్శించటం తన బాధ్యతగా వైఎస్ జగన్ భావించారు. అదే మాటను ప్రకటించి ఆచరణలో చూపారు.

  వైఎస్‌జగన్ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ జిల్లాల్లో ఆయన సోద రి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో వైఎస్ జగన్ పరామర్శ యాత్ర పూర్తి చేశారు. తర్వాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వైఎస్ షర్మిల రెండు విడతలుగా పరామర్శ యాత్ర చేశారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు.

  సోమవారం ఉదయం వైఎస్ షర్మిల పర్యటన శంషాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ చేరుకొన్న షర్మిలకు పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతాయి. తర్వాత సరూర్‌నగర్ మండలం జిల్లెల గూడ చౌరస్తాలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి యాత్ర ను ప్రారంభిస్తారు. తర్వాత అదే మండలంలోని కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కు దగ్గరలోని మంద మల్లెమ్మ చౌరస్తాలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతారు. తర్వాత ఆమె పర్యటన రంగారెడ్డి జిల్లాలోని మిగిలిన నియోజక వర్గాల్లో సాగుతుంది. జూలై  ఒకటో తేదీన షర్మిల చేవెళ్ల చేరుకొంటారు. అక్కడ ఆ రోజు ఉదయం 11గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

  మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా చేవె ళ్ల నుంచి ప్రారంభించే వారు. ఏ కార్యక్రమంలో అయినా చేవెళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దాదాపు 100 కు పైగా కార్యక్రమాలు చేవెళ్ల నుంచి ప్రారంభించి విజయవంతం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ప్రజల గుండెల్లో వైఎస్సార్ కొలువై ఉన్నాడు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తర్వాత రెండో తేదీన ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో పర్యటించిన తర్వాత ఈ దశ పరామర్శ యాత్ర ముగుస్తుంది. నాలుగు రోజుల వ్యవధిలో ఏడు నియోజక వర్గాల్లో 580 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 15 కుటుంబాల్ని షర్మిల పరామర్శిస్తారు.
 
 పోస్టర్ల విడుదలతో సన్నాహాలు
 తెలంగాణలో జరుగుతున్న వైఎస్ షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేసే పనిని పార్టీ శ్రేణులు భుజాన వేసుకొన్నాయి. అనేక చోట్ల యాత్ర పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయంలో భాగస్వామ్యం వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ మేరకు పార్టీ నాయకులకు ఈ రూట్ మ్యాప్ ను పంపించారు. పర్యటన జరిగే ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ముఖ్యంగా బహిరంగ సభ జరిగే ప్రాంతాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

 జయప్రదం చేయండి-రాష్ట్ర అద్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
 వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. యాత్ర జరిగే నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జ్‌లతో అన్ని వివరాలు చర్చించారు. ఈ యాత్రలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ప్రతీ కార్యకర్త కొంత దూరమైనా షర్మిల పరామర్శ యాత్రలో పాల్గొనాలని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, నల్లా సూర్య ప్రకాష్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహిపాల్ రెడ్డి, భీష్వ రవీందర్, అమృతసాగర్, సూరజ్ ఎజ్దానీ, ధనలక్ష్మి, ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

26 June 2015

అనేక కుట్రలు..ఒక చంద్రబాబు

ఓటుకి కోట్లు కుంభకోణం సూత్రధారి చంద్రబాబు క్రమంలో కేసులో కూరుకొని పోతున్నారు. కోట్ల రూపాయిలు ఎర వేసి అడ్డంగా దొరికిపోయిన బాబు.. ఈ కేసునుంచి బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రకాల కుట్రలు వీగిపోతుండటంతో విద్వేషాలు రగల్చటం మీదనే ఆశలు పెట్టుకొన్నారు.

కేసును తప్పుదారి పట్టించేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొన్నారు. సీనియర్ పోలీసు అధికారుల బుర్రలన్నీ ఈ కేసు మీద పెట్టేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. కుంభకోణం నుంచి బయట పడే మార్గాల్ని వెతికించారు. ప్రస్తుతం చట్ట పరంగా అన్ని దారులు మూసుకొనిపోతున్నాయన్న సంకేతం వెలువడింది. దీంతో వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.   రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాల మీద దృష్టి సారించమని సీనియర్ ఐఎఎస్ అధికారులకుపురమాయించారు. పనిలో పనిగా ఫోరెన్సిక్ రంగ నిపుణుడు గాంధీ ని ప్రభుత్వ సలహాదారు గా నియమించుకొన్నారు.  చంద్రబాబు నాయుడ్ని ఒడ్డున పడవేయించుకొనేందుకు పభుత్వ ఖర్చులతో నిపుణుల్ని రప్పించుకొన్నట్లు అన్న మాట.  ఈ విధంగా కుంభకోణాలపై పనిచేయమనటం అధికారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. చాలా మంది అధికారులు పైకి చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్న పరిస్థితి. పదే పదే గవర్నర్ పీఠాన్ని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని చంద్రబాబు అండ్ కో దూషించారు. అటార్నీ జనరల్ నేరుగా గవర్నర్ కు లేఖ రాశారని చంద్రబాబు భజన బృందం ప్రచారం చేసింది. సెక్షన్ 8 ఉపయోగించుకోవాలని అటార్నీ జనరల్ సూచించినట్లుగా ప్రచారం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు విస్మయం చెందాయి. ఈ లోగా తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ దీనిపై వాదనలు చెలరేగాయి. అసలు ఇటువంటి లేఖ లేనే లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. దీంతో ఈ మంటల్ని ఆర్పటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. స్వయంగా తప్పుల్లో కూరుకొని పోయిన చంద్రబాబు సాగిస్తున్న ఈ విష ప్రచారాన్ని అంతా తప్పు పడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్నట్లు తెలుస్తోంది.  చంద్రబాబు కి క్రమంగా దారులు మూసుకొని పోతున్నాయి. ఒక వైపు కోట్ల రూపాయిలు ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయారు. తర్వాత అయినా దీనిపై నిజాయితీగా వ్యవహరించి ఉంటే బాగుండేది.కనీసం ధైర్యంగా న్యాయ పోరాటానికి సిద్ధ పడినా సరిపోయేది. కానీ చంద్రబాబు అతి తెలివితో వ్యవహరించారు. రక రకాల కుట్రలు చేసి బయట పడేందుకు ప్రయత్నించారు. అన్ని శక్తుల్ని మోహరించటమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం వివాదాస్పదం అయింది. చివరకు కుట్రలు బెడిసికొట్టడంతో విద్వేషాలు రగల్చటం మీదనే ఆశలు పెట్టుకొన్నారు. అన్ని దారులూ మూసుకొని పోయి జైలు దారి స్పష్టంగా కనిపిస్తోండటంతో చంద్రబాబు ఈ మార్గాన్ని ఎంచుకొన్నారు.  రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చిన చంద్రబాబు వీటిని ఆరకుండా చూసుకొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం జిల్లా ల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పాడాలని చంద్రబాబు అండ్ కో ఇప్పటికే నిర్ధారణకు వచ్చేసింది. అక్కడ ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిపోయి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్ గా వీటిని భగ్నం చేశారు. ఎంపీటీసీ కు రూ.3 లక్షల చొప్పున బేరం పెట్టినట్లు నిర్దారణ అయిది. అయినా వాటిని బయటకు రాకుండా పచ్చ చొక్కాలు జాగ్రత్త పడ్డారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పెద్దగా ప్రయోజనం కలగటం లేదు.
 అటువంటి వార్తలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వీటికి పెద్ద ప్రాధాన్యం దక్కకుండా ఉండాలంటే విద్వేషాల్ని కొనసాగించాలని నిర్ణయించారు.  రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చిన చంద్రబాబు వీటిని ఆరకుండా చూసుకొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం జిల్లా ల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పాడాలని చంద్రబాబు అండ్ కో ఇప్పటికే నిర్ధారణకు వచ్చేసింది. అక్కడ ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిపోయి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. అటువంటి వార్తలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వీటికి పెద్ద ప్రాధాన్యం దక్కకుండా ఉండాలంటే విద్వేషాల్ని కొనసాగించాలని నిర్ణయించారు.ఎన్నికల హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి అనేకహామీలను వదిలిపెట్టారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా ఇప్పిస్తానని చెప్పి ఆ విషయం పట్టించుకోవటం లేదు. రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాలు లాక్కొని సింగపూర్ కంపెనీలకు అప్పగించేస్తున్నారు. ఈ విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చటమే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అన్ని మార్గాల్ని ఆయన ఉపయోగించుకొంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
 అబద్దపు ప్రచారాలు
 ఈ విషయంలో సాధ్యమైనన్ని అబద్దపు ప్రచారాలు చేసేందుకు చంద్రబాబు ఒడిగట్టారు. సూటిగా ఆధారాలు కనిపిస్తున్నా మాయ చేసేందుకు ఆరాటపడ్డారు. చంద్రబాబు అబద్దపు  ప్రచారాలు ఇలా సాగాయి.

 చంద్రబాబు అబద్ద్దం- టేపులు అతికించినవి, ఎక్కడెక్కడో మాట్లాడితే.. ఒక చోట అతికించారు.
 నిజం- ఆడియో, వీడియో టేపులు అతికినవి కావని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు
 చంద్రబాబు అబద్ద్దం- ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసుల విషయం ఎన్నికల సంఘం చూసుకొంటుంది.
 నిజం- ఈకేసు అవినీతి కేసని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఏసీబీ కేసు కూడా ఫైల్ చేయవచ్చని నిర్ధారించింది. కోర్టు తీర్పు వచ్చాక ఈసీ వైపు నుంచి చర్యలు ఉంటాయని చెప్పింది.

 చంద్రబాబు అబద్దం- ఆడియో, వీడియో టేపుల్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోవని ప్రచారం
 నిజం- సాక్ష్యాధారచట్ట ప్రకారం డిజిటల్ సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయి. వీటిని నిపుణుల చేత నిర్దారించాలి. ఇప్పుడు ఆ తంతు కూడా పూర్తయింది

 చంద్రబాబు అబద్దం- సెక్షన్ 8 అమలు చేయాలంటూ గవర్నర్ కు అటార్నీ జనరల్ లేఖ రాశారు
 నిజం- అటువంటి లేఖలు ఏమీ ఇవ్వలేదని కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది

 చంద్రబాబు అబద్దం- అనేకమంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు సహా 120 మంది ఫోన్లు ట్యాప్ చేశారు.
 నిజం- ట్యాపింగ్ జరగలేదని మొబైల్ ఆపరేటర్లు స్పష్టం చేశారు.

 చంద్రబాబు అబద్దం- అవసరమైతే హైదరాబాద్లో ఏపీ పోలీసు స్టేషన్లు అంటూ హడావుడి
 నిజం- చట్టప్రకారం ఇది సాధ్యం కాదని స్పష్టీకరణ. విషయాన్ని పక్క దారి పట్టించేందుకే ఈ హడావుడి అని రుజువు

పచ్చని పంట పొలాలు లాక్కోవటమేనా అభివృద్ధి..!

ఉత్తరాంధ్రలో ప్రభుత్వం తలపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం రానురాను వివాదాస్పదం అవుతోంది. ఎకా ఎకిన వేల ఎకరాల భూముల్ని లాక్కోవటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. పెద్ద పెద్ద విమానాశ్రయాలకు కూడా వందల ఎకరాలు సరిపోతుంటే భోగాపురం ఎయిర్ పోర్టుకి వేలాది ఎకరాలు ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది.
    వాస్తవానికి విశాఖ నగరానికి ఉత్తర దిశగా రియల్ ఎస్టేట్ కదలికలు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే ఇది మొదలైంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల తరపున కొనుగోళ్లు జోరుగా సాగాయి. తర్వాత అన్నీ తమ చేతుల్లోకి వ చ్చాయని నిర్ధారణ అయ్యాక, ఈ భూముల రేటులు పెరిగేట్లుగా స్కెచ్ వేసుకొన్నారు. ఇందుకు అనుగుణంగా వేలాది ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టు ను ప్రకటించారు. అటు విశాఖ పట్నం నగరం, ఇటు ఎయిర్ పోర్టు అంటూ సొంత భూముల రేట్లు పెంచేసుకొన్నారు.  ఒక్కసారిగా ఎయిర్ పోర్టు పిడుగు పడేసరికి భోగాపురం మండలంలోని రైతులకు దిక్కు తోచలేదు. దీన్ని తమకు వద్దని ఎన్నిసార్లు మొత్తుకొన్నా ఉపయోగం లేదు. ఈలోగా ప్రతిపాదిత గ్రామాల్లో కాకుండా వేరే గ్రామాల్లో విమానాశ్రయం నిర్మించాలన్న నిర్ణయం వెలువడింది. దీంతో రోడ్డున పడటం రైతుల వంతయింది. ముంజేరు, చాకివలస, రామచంద్రపేట, భోగాపురం పంచాయతీల్లోని ప్రజలు నిరాశ్రయులుగా మారుతున్నారు. ఒక్కసారిగా పంట పొలాల్ని ప్రభుత్వం లాక్కొంటుందని తెలియటంతో ఆందోళన బాట పట్టారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. గురువారం నాడు వందల మంది రైతులు ఆందోళన కు దిగారు. ఎర్ర బస్సుకే దిక్కు లేదు.. ఎయిర్ బస్సు ఎగిరింతారంట...అంటూ నినాదాలు చేశారు. రెవిన్యూ అదికారులు ప్రమోషన్ల కోసం తమ నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని విన్నవించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతోందని విమర్శించారు. వందల మంది ఒక్కసారిగా ర్యాలీ తీయటంతో భోగాపురం వీధులన్నీ నినాదాలతో దద్దరిల్లాయి. ఈ సందర్భంగా ఆందోళన కారులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పారని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మాట తప్పారని, పేదలకు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. పింఛన్లు, రేషన్ కార్డులు,  వంటివి కొత్త వి రాకపోగా, ఉన్నవాటినే రద్దుచే స్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవేమీ తాము అడగటం లేదని, తమ గ్రామాల్ని వదిలేస్తే తమ బతుకేదో తాము బతుకుతామని వేడుకొంటున్నారు. ఊరంతా ఆందోళనలతో దద్దరిల్లినా అధికార పార్టీ నాయకులు అటుకేసి తొంగి చూడలేదు. దీంతో చివరకు  రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందించి ఆందోళన కారులువెనుదిరిగారు. 

25 June 2015

ఉప్పెనలా ఉద్యమం

 అన్ని జిల్లా కలెక్టరేట్‌ల దగ్గర ఆందోళన
 నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజానీకం
 కదం తొక్కిన రైతులు, కూలీలు, పల్లె వాసులు
 ఆందోళనలో పాలు పంచుకొన్న నాయకత్వ శ్రేణులు

 హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా పెద్ద ఎత్తున రైతులు నిరసన గళం వినిపించారు. అన్ని రకాలుగా రైతుల్ని, వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా జిల్లా పాలనా కార్యాలయాల దగ్గర ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున ఇతర వర్గాల ప్రజలు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. 13 జిల్లా ల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
  రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పటంతో రైతులు కష్టాల్లో ఇరుక్కొని పోయారు. పాత బకాయిలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకర్లు చెబుతుండటంతో అప్పు పుట్టడం లేదు. ఇటు ప్రైవేటు వ్యాపారులు ఇదే అదనుగా వడ్డీలు పెంచటంతో అప్పుల ఊబిలో కూరుకొని పోతున్నారు. అటు, బంగారు ఆభరణాలు వేలం వేస్తామని బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఖరీప్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నా చాలా చోట్ల విత్తనాలు, నారుమళ్ల కొరత వేధిస్తోంది. దీనిపై ప్రభుత్వం దగ్గర సన్నద్దత కరవైంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. కాసులు కురిపించే ప్రాజెక్టులు, పథకాల మీదనే ప్రేమ కురిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి వాదనలు వినిపించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎంతసేపు కుంభకోణం నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రైతు లోకం కొన్ని తరాల పాటు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈవిధమైన వైఫల్యాల మీద పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

 అనంతపురం
  నగరంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగమేఘాలపై పట్టిసీమ నిర్మిస్తున్న చంద్రబాబుకు హంద్రీ- నీవా ప్రాజక్టు కనిపించలేదా అని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ......... ఓటుకు కోట్లు వ్యవహారంలో బిజీగా ఉన్న చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 వైఎస్సార్ జిల్లా
  కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానాక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతు లోకానికి చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందీ నాయకులు విడమరిచి చెప్పారు.

 కర్నూలు జిల్లా
 కర్నూలు నగరంలో జరిగిన రైతు ధర్నాలో పెద్ద ఎత్తున వ్యవసాయ దారులు, కూలీలు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల రాకతో నిరసన వేదిక కిక్కిరిసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగ సమస్యల్ని చంద్రబాబు ఏ రకంగా గాలికి వదిలేసిందీ వివరించారు. వ్యవసాయమంటే చంద్రబాబు కి గిట్టదని అభివర్ణించారు.

 కృష్ణాజిల్లా
 విజయవాడ: రైతుల సమస్యలపై సబ్ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పనతో పాటు పార్టీనేతలు కె.పార్థసారధి, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 పశ్చిమగోదావరి జిల్లా
 వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తెల్గం బాలరాజుతో పాటు పార్టీ నేతలు వంకా రవీంద్రనాథ్, టి.వాసుబాబు, తలారి  వెంకట్రావు, కొఠారు రామచంద్రరావు, కారుమంచి రమేష్, తెల్లం గోళ్ల శ్రీలక్ష్మీ, బండి అబ్బులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్లపై వినూత్న ర్యాలీ నిర్వహించారు.

 తూర్పు గోదావరి జిల్లా
 కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు తీరుకు నిరసగా వైఎస్సార్‌సీపీ నాయకులు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

 విశాఖపట్న జిల్లా
 ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ మహాదర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పాటు పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

 విజయనగరం జిల్లా
 రైతుల సమస్యలపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ మహాధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజేంద్ర దొర, కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అప్పల నాయుడుతో పాటు నెల్లిమర్ల, గజపతినగరం కన్వీనర్లు డా.సురేష్‌బాబు, శ్రీనివాసరావు, అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకురాలు కల్యాణి పాల్గొన్నారు.

బైటపడడానికి కేసీఆర్‌తో బాబు కుమ్మక్కు

 రాష్ర్టప్రయోజనాలు తాకట్టుపెట్టారు
 కృష్ణాజలాలు కోల్పోతున్నా మాట్లాడనిది అందుకే..
 చంద్రబాబును జనం ఛీకొడుతున్నారు
 కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు వచ్చిన స్పందనే రుజువు

 ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా ఇరుక్కున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ కేసు నుంచి బైటపడడానికి గాను ఏకంగా రాష్ర్టప్రయోజనాలనే తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలు, కృష్ణాజలాలు కోల్పోతున్నా మిన్నకుండిన వైనం వంటివాటికి నిరసనగా గురువారం రాష్ర్టవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలు విజయవంతమయ్యాయని ఆమె వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
 ‘‘మోసపూరిత విధానాలు, అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో తాను రైతు వ్యతిరేకినని మరోమారు రుజువు చేసుకున్నారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గల వల్ల రైతుల జీవితాలు 20 ఏళ్ల వెనక్కి నెట్టివేసినట్లయింది. బ్యాంకుల నుంచి దర్జాగా రుణం తీసుకుని వ్యవసాయపనులు మొదలుపెట్టే రైతు ఇవాళ ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దగ్గర కాళ్లావేళ్లాపడి అధిక వడ్డీలకు పెట్టుబడుల కోసం అప్పులు చేసే దుస్థితి ఇవాళ ఏపీలో చూస్తున్నాం. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల విషవలయంలోకి రైతులను నెట్టి కనీసం విత్తనాలను కూడా సమయానికి అందించలేక దాన్ని కూడా వ్యాపారమయం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరిని చూస్తున్నాం. రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న అన్ని విధానాలకు నిరసనగా గురువారం నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట విజయవంతంగా ధర్నాలు జరిగాయి. రైతులు, ప్రజలు స్పందించి ఈ ధర్నాలకు స్వచ్ఛందంగా హజరయ్యారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్న కర్నూలు, ప్రకాశం తప్ప అన్నిజిల్లాల్లోనూ ధర్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడలలో జరిగిన ధర్నాలకు ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ ధర్నాలు చంద్రబాబు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టాయి. విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తున్నా ఒక విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా అక్కడ అధికారి ఎవరూ లేకపోవడం శోచనీయం. విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద స్థానిక ఏసీపీ దౌర్జన్యం చేయడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అక్కడ ఎస్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీద పోలీసులు జులుం ప్రదర్శించడం, అనేక మంది మహిళలను పక్కకు ఈడ్చివేసిన పద్ధతి చాలా గర్హనీయమైన అంశం. ప్రజలపైన, ప్రతిపక్ష పార్టీపైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడాదికాలంగా పాల్పడుతున్న దౌర్జన్యాలలో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నాం. పోలీసులు ప్రతిపక్ష పార్టీపైన విరుచుకుపడడం చూస్తే శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. పోలీసులకు, అధికారులకు కొమ్ములిచ్చిన చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలను కుమ్మమని ఆదేశాలిస్తున్నారనేందుకు వైజాగ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనే సాక్ష్యం. ఈఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు జరిగిన ధర్నాలలో కృష్ణానదికి సంబంధించి నీటిని రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందీ, ఎలా కేసీఆర్‌తో కుమ్మక్కయ్యిందీ వివరిస్తూ కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రజలను కూడా చైతన్యవంతులను చేయడం జరిగింది. బచావత్ అవార్డు ప్రకారం ఏపీ రాష్ట్రానికి రావలసిన కృష్ణా జలాల వాటాకు సంబంధించి ఇటీవల కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కిమ్మనకుండా గట్టిగా వాదించకుండా మనకు రావలసిన జలాల విషయంలో నష్టం జరుగుతున్నా కూడా ఎందుకు రాజీ ధోరణితో వ్యవహరించిందనేటటువంటిది చాలా తేటతెల్లంగా ఈరోజు తెలుస్తున్న విషయం. ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన, ఒక దొంగలాగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కేసు నుంచి బైటపడడానికి కేసీఆర్‌ని మచ్చిక చేసుకోవడానికి, ఆ కేసు నుంచి సాధ్యమైనంత తక్కువ నష్టంతో బైటపడాలన్న  ఉద్దేశంతో ఏకంగా రాష్ట్రానికి నష్టం చేసే కృష్ణా జలాల విషయంలో నోరుమూసుకుని రావడం చూస్తున్నాం. కృష్ణా నీటిని పరీవాహకప్రాంతంలో ఎక్కడైనా సరే ఉపయోగించుకునేలా తెలంగాణకు కృష్ణాజలాల బోర్డు రాసిచ్చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నోరుమూసుకోవడానికి ఆయన కేసే కారణం. ఇవాళ రాజీకి రావడం కోసం చివరకు ఏపీకి నీళ్లు రాకపోయినా పరవాలేదు అనే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించినందునే ఈరోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. రైతులు ఒకపక్కన రుణమాఫీ అమలు కాక, విత్తనాలు దొరక్క,సాగునీరు అందక విపత్కరమైన పరిస్థితుల్లో ఉంటే టీఆర్‌ఎస్‌ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయి కృష్ణాజలాలు కూడా దక్కకుండా చేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు చేసిన ధర్నాలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయి. ఈ ధర్నాలలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరికీ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ర్టప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. అంతేకానీ కేసుల నుంచి బైటపడడానికి గాను పక్కరాష్ర్టంతో కుమ్మక్కు కావొద్దని హెచ్చరిస్తున్నాం. ’’

తెలంగాణలో దొరికిపోయినా జ్ఞానోదయం కలగలేదా?

టీడీపీపై బొత్స సత్యనారాయణ విమర్శ
 హైదరాబాద్ : తెలంగాణలో ఓటుకు కోట్లు కుంభకోణానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి జ్ఞానోదయం అయినట్లు లేదని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సరిపడినంత బలం లేకపోయినా అభ్యర్థులను నిలుపుతూ డబ్బు వెదజల్లి గెలవాలని భావిస్తోందని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తమకు బలం ఉండబట్టే సూత్రబద్ధమైన వైఖరితో అభ్యర్థిని నిలబెట్టామని, కానీ తగినంత బలం లేదని తెలిసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు. దాన్ని బట్టి తెలంగాణలో అనుసరించిన పద్ధతులనే ఇక్కడా అనుసరించాలని భావించినట్లు అర్ధమౌతుందని అన్నారు. సంఖ్యాబలాన్ని తారుమారు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. రాజకీయపార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ నిబంధనల మేరకు అధికారులు నిస్పాక్షికంగా వ్యవహరించాలని బొత్స పేర్కొన్నారు. అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరికాదని, తలదించుకునే పరిస్థితి తెచ్చుకోరాదని బొత్స హితవు పలికారు. అధికారం చేతిలో ఉంది కదా అని నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకొకమారు ఎన్నికలు జరుగుతాయి.. రేపు  అధికారం చేతులు మారితే ఇప్పుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకోవలసి వస్తుందని ఆయన అన్నారు. చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తే అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించకూడదని అన్నారు. ‘‘నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే చట్టాన్ని ఎలా చేతిలోకి తీసుకోవాలో, వాళ్లు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించారో అర్ధమౌతుంది. వ్యవస్థ దారి తప్పితే దాన్ని సక్రమ మార్గంలో పెట్టడం కష్టం. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతిమాలిన పనులు చేయడం సరికాదనే మాకు బలం లేని చోట పోటీకి దూరంగా ఉన్నాం . ఇపుడు వీరు కొత్త డ్రామా తీసుకొచ్చారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వైఎస్ జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. నిజంగా సాక్ష్యాలుంటే ఏం జరిగిందో చెప్పాలి. అదేమీ లేకుండా ఎక్కడో ఎవరో చెబితే దాన్ని వీళ్లు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పటికే మీ మాయ మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. మళ్లీ అలాంటి మోసపు మాటలు చెప్పకండి’’ అన్నారు. ‘‘రాష్ర్ట విభజన నేపథ్యంలో పార్లమెంటులో చట్టం అయినపుడు అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టాన్ని తుచ తప్పకుండా అమలు చేయాలనే మేం ముందునుంచీ చెబుతున్నాం. అందులో సెక్షన్8 ఉన్నా, 9 ఉన్నా అమలు చేయాల్సిందే. రాష్ర్ట విభజన జరిగిన రోజు నుంచే ఇవన్నీ అమలు లోకి వస్తాయి. అంతేతప్ప ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఇపుడు సెక్షన్ -8 అమలు చేయాలనడం తప్పు’’ అని బొత్స వివరించారు.

23 June 2015

ఏపీలో ఏసీబీ ని మూసేస్తారా..!

ఆంధ్రప్రదేశ్ లోని పోలీసు ఉన్నతాధికారులు అంతర్మథనంలో పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర పోలీసు విభాగానికి మచ్చ ను తెచ్చిపెడుతున్నాయి. చంద్రబాబు వ్యక్తిగతంగా చేసిన తప్పుల్ని పోలీసు ఉన్నతాధికారులు భుజాల మీద మోయాల్ని రావటాన్ని పోలీసు పెద్దలు తప్పు పడుతున్నారు. 

 ముందు నుంచి మంచి పేరు
 ఆంధ్రప్రదేశ్ లో పోలీసు విభాగానికి గతంలో మంచి పేరు ఉండేది. చంద్రబాబు పాలించిన తొమ్మిదేళ్లలోనూ భ్రష్టు పట్టించ టానికి ప్రయత్నించారు. తర్వాత దివంగత మహా నేత వైఎస్‌రాజశేఖర్ రెడ్డి పాలనలో పోలీసు అధికారులకు శాంతిభద్రతలకు సంబంధించి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో తీవ్రవాదం, అల్లర్లు బాగా తగ్గిపోయాయి. పోలీసుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడంతో పోలీసు కుటుంబాల్లో రాజన్న పట్ల అభిమానం పాతుకొని పోయింది. తర్వాత ప్రభుత్వాల సమయంలో ఉద్యమాలు   ఊపందుకొన్నప్పుడు రాష్ట్ర పోలీసుల మీద బృహత్తర బాధ్యత పడింది. వివాదాలకు తావు లేకుండా పోలీసు విభాగం చాలా వరకు నెగ్గుకొని రాగలిగింది.
 చంద్రబాబు పాలనతోనే అవస్థలు 
 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం లోకి రాగానే పోలీసు వ్యవస్థను నిస్సిగ్గుగా భ్రష్టు పట్టించటం మొదలెట్టారు. ఎన్నికల ఫలితాలు విడుదలై, ప్రభుత్వం కొలువు దీరకుండానే ప్రతిపక్ష పార్టీ నాయకుల పై దాడులు మొదలైపోయాయి. పోలీసుల్ని నిస్సహాయుల్ని చేసి తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. తర్వాత జిల్లాల ఎస్పీలు, ఐజీలను ఇష్టం వచ్చినట్లు మార్చేసి పచ్చ మార్కు పోలీసింగ్ ఏర్పాటు చేశారు. దీంతో తెలుగుదేశం గూండాలకు పోలీసులే కొమ్ము కాయటం మొదలైంది. అనంతపురం జిల్లా వంటి చోట్ల పోలీసులే పచ్చ గూండాలతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతల హత్యాకాండలో పాలుపంచుకొంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అడపా దడపా పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తే చాలు, వెంటనే స్థానిక తెలుగుదేశం నాయకుల నుంచి ఫోన్ రావటం, విడిపించుకొని వె ళ్లటం కామన్ గా మారింది. జన్మభూమి కమిటీల పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలన్నీ తెలుగుదేశం నాయకులతో నిండిపోయాయి. పోలీసు అధికారుల బదలీలు, బందోబస్తు ఏర్పాట్లు, సిఫార్సులు..అన్నింటా ఈ నాయకులు చేరిపోయి అరాచకానికి నిదర్శనంగా నిలిచారు.
 ఓటుకి కోట్లు కుంభకోణం
 ఓటుకి కోట్లు కుంభకోణం విషయం బయటకు పొక్కగానే చంద్రబాబు నాయుడు చేసిన పని పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించి మంతనాలు ఆడటం. ఆరోజు నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు, సమీక్షలు జరిగిపోతున్నాయి. ఈ కుంభకోణం నుంచి చంద్రబాబును బయటకు లాగటం ఎలా అన్న దాని మీద చర్చోపచర్చలు సాగాయి.. సాగుతూనే ఉన్నాయి. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీప్, ఏసీబీ అధిపతి, ఇతర సీనియర్‌ఉన్నతాధికారులు సీఎం చుట్టూ తిరుగుతున్నారు.
 సూత్రధారులకు శిక్షణ ఇవ్వాల్సి రావటం
 ఇక్కడ కోట్ల రూపాయిల కుంభకోణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు. ఆయన స్వయంగా చేసిన కుంభకోణం అని అందరికీ అర్థం అవుతోంది. అది కూడా తన పార్టీని పక్క రాష్ట్రమైన తెలంగాణలో అధికార ంలోకి తెచ్చుకొనేందుకు చేసుకొన్న కుట్ర. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. అయినా సరే, చంద్రబాబు ఈ కేసు విషయంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి ఉన్నతాధికారులు హాజరవటం తప్పనిసరి చేశారు. అంటే ఇటువంటి కేసుల్లో ఏసీబీ అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు.. ఎటువంటి చర్యలు తీసుకొంటారు..వంటి వివరాల్ని ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడికి వివరించి చెబుతుంటే కేసుల నుంచి బయట పడే మార్గాల్ని ఆయన ఆలోచించుకొంటారన్న మాట. దీన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చి చూసుకొంటున్నా కానీ, లోపల జరిగేది మాత్రం ఇదే అన్న సంగతి అందరికీ అర్థం అవుతుంది.
 మత్తయ్యకు రాచమర్యాదలు
 ఈ కుంభకోణంలో సహ నిందితుడిగా మత్తయ్య పేరు నలుగుతోంది. అసలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను మొద ట కలిసింది మత్తయ్యే అని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు కాగానే తెలుగు తమ్ముళ్లుమత్తయ్యను రాష్ట్రం దాటించేశారు. అప్పటి నుంచి అతడ్ని రాచమర్యాదలతో పోషించటం పోలీసుల పనిగా మారింది. ఒక భారీ కుంభకోణంలో నిందితుడిగా అతడి కోసం ఒక వైపు పోలీసులు వెదకుతుంటే, అతడు దొరక్కుండా రహస్య స్థలంలో కాపలా  కాయాల్సి రావటం ఏపీపోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పైకి మాత్రం మత్తయ్య ఆచూకీ తమకు తెలీదని చెబుతున్నా కానీ, విజయవాడ లో పోలీసు స్టేషన్ కు వచ్చి తెలంగాణ ప్రభుత్వ పెద్దల మీద ఫిర్యాదు ఇస్తే తీసుకొని మర్యాదగానే సాగనంపారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులే మత్తయ్యను కాపాడుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
 ఎమ్మెల్యే సండ్రకు సైతం..!
 ఈ కేసులో నోటీసులు అందుకొన్న తెలుగుదేశం నాయకుడు వేం నరేందర్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విచారణ పూర్తయ్యాక తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన పెరిగిపోయింది. దీంతో ఆరోగ్య కారణాలు సాకుగా చూపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆంధ్రప్రదేశ్ కు జారుకొన్నారు. అక్కడ అనేక నగరాల్లో పోలీసులే రాచ మర్యాదలతో ఆయన్ని పోషిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ, కొందరు పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆయనకు శిక్షణ ఇస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏసీబీ అధికారులు ఏ రకంగా ప్రశ్నిస్తారు, దానికి ఎలా జవాబులు చెప్పాలి, లేదంటే ఏ రకంగా తప్పించుకోవాలి అనేది ఇక్కడ పోలీసు అధికారులు శిక్షణ ఇస్తారన్న మాట. కుంభకోణంలో ఇరుక్కొన్న వారికి తప్పించుకొనే మార్గాలపై శిక్షణ  ఇవ్వాల్సి రావటంపై పోలీసు అధికారులు తమ లో తాము మనస్తాపం చెందుతున్నారు.
 దేశ వ్యాప్తంగా ప్రచారం
 ఈ మొత్తం ఎపిసోడ్ దేశ వ్యాప్తంగా ప్రచారం పొందుతోంది. అందునా ఒక రాష్ట్రంలో పోలీసులు వెదకుతున్న వ్యక్తులకు ..మరో రాష్ట్రంలోని పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరగట ంపై పోలీసు పెద్దలు ఆవేదన చెందుతున్నారు. పోలీసుల్ని వాడుకోవటం గతంలోనూ ఉన్నప్పటికీ, ఈ విధంగా మొత్తం పోలీసు వ్యవస్థను సొంత ప్రయోజనాల కోసం పణంగా పెట్టడం ఎప్పుడూ జరగలేదని వాపోతున్నారు. పోలీసు వ్యవస్థ పరువు తీసేసి, సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
 ఏసీబీ సంగతి ఏమిటి..!
 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధక విభాగం పరిస్థితి ఏమిటనే మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని చిన్న ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా అవినీతి కి పాల్పడితే పట్టుకోవాల్సిన బాధ్యత ఏసీబీదే. అందుకే ఏసీబీ కేసు కడితే ఉద్యోగులు కంగారు పడతారు. అంతే కాదు, ఆయా ప్రభుత్వ శాఖలు లేదా విభాగాల్లో ఏసీబీ కేసు నమోదు అయితే వెంటనే ఆయా ఉద్యోగిని విధుల్లోంచి తొలగిస్తారు. ఆ తర్వాత కేసు తేలే దాకా విధులకు దూరంగా ఉంచుతారు.
  ఇప్పుడు ఈ ఏసీబీ పనితీరు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు తెలంగాణ ఏసీబీ పెట్టిన కేసులో నిందితుడుకి పోలీసు శాఖ రక్షణ కవచంలా నిలుస్తోందన్న మాట వినిపిస్తోంది. స్వయంగా పోలీసులే రక్షణ కల్పిస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. అటువంటప్పుడు చిరుద్యోగుల్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నె ట్టడం ఎంత వరకు నైతికంగా కరెక్టు అన్న మాట వినిపిస్తోంది. పైగా తెలంగాణ ఏసీబీ నోటీసులు అందుకొన్న సండ్ర వెంకట వీరయ్య కు కొందరు పోలీసు అధికారులు కోచింగు ఇస్తున్నార న్న మాట ఉంది. అటువంటప్పుడు మరో అవినీతి అంశం బయట పడితే ఏసీబీ అధికారులు ఇతరుల్ని నోటీసు ఇచ్చి పిలిపిస్తారా లేదా అన్న మాట ఉంది. లేదంటే ఆయా వ్యక్తులు కూడా బయట కోచింగ్ కోసం ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నలు లేవ నెత్తుతున్నారు.
  అన్నింటికి మించి కోట్ల రూపాయల కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు నాయుడుకు... ఈ వివాదం నుంచి బయట పడే మార్గాల కోసం సీనియర్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని అవినీతి బాగోతాల్ని ఏ రకంగా వెలికి తీయగలుగుతారన్న మాట వినిపిస్తోంది. అటువంటి కేసుల్లోని సూత్రధారులు కూడా ఇదే విధంగా ట్యూషన్ లు కోరుకొంటే పరిస్థితి ఏమిటి..!
  మొత్తం మీద కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కార్యకలాపాలు ముందుకు వెళతాయా లేక మందగించిపోతున్నాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అటువంటప్పుడు ఏసీబీ వ్యవస్థ ఎంత వరకు నైతికంగా దర్యాప్తు సాగిస్తుంది. అంతకు మించి ఏసీబీ ఉన్నతాధికారుల మీద ఉంటే నైతికపరమైన ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇన్ని తలనొప్పులకు మూలం చంద్రబాబు కాదా..! ఆయన వ్యక్తిగత కక్ష కోసం మొత్తం వ్యవస్థ ను బలిపెట్టడం కాదా..

ఆంధ్రలోనూ ఓటుకు కోట్లు!

 ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీల కొనుగోళ్లు
 నెల్లూరు లాడ్జిలో వైశ్రాయ్ క్యాంప్
 తెలంగాణలో ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నాయకుల తీరు ఇంకా మారలేదు. ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిలో ఎలాంటి మార్పూలేదు. ఇప్పటికే ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో టేపుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. తీరుమారని తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే విధమైన కొనుగోళ్లకు తెగబడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులను ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రి నారాయణ నాయకత్వంలో స్థానిక సంస్థల ప్రతినిధులను నెల్లూరులోని ఓ హోటల్‌లో దాచిపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు హోటల్‌ను చుట్టుముట్టి టీడీపీ నేతల కుట్రను రట్టు చేశారు. ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకే బలం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి (టీడీపీ), అట్లా చిన వెంకటరెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ) పోటీపడుతున్నారు.అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కంకణం కట్టుకున్న టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను కొనడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలో ఉన్న తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరిస్తూ దాదాపు 30 మంది ఎంపీటీసీలను దారిలోకి తెచ్చుకున్నారు. ఒక్కో ఎంపీటీసీకి 3 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్సుగా రు.50 వేలు ఇచ్చారు. మిగిలిన మొత్తం ఇస్తాం రమ్మని చెప్పి వారిని ప్రత్యేక వాహనాలలో తీసుకొచ్చి నెల్లూరులోని సప్తగిరి లాడ్జిలో దాచి ఉంచారు. ఈ విషయాన్ని పసిగట్టిన నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ అనుచరులతో లాడ్జికి చేరుకున్నారు. లాడ్జిలో వివిధ గదుల్లో బస చేసిన వారంతా ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలుగా గుర్తించారు. అధికార పార్టీ నేతలు తమను బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చి నిర్బంధించారని, వారి మాట వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించారని ఎంపీటీసీలు తెలిపారు. తాము పార్టీ మారబోమని, తమ గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకుని ఉన్నారని వారు పేర్కొన్నారు. కాగా తమ కుట్ర గుట్టు బైటపడిపోవడం, ఎంపీటీసీలు దొరికిపోవడంతో తెలుగుదేశం నాయకులు పోలీసులను ఎగదోశారు. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులను బెదిరించారు. తప్పు చేస్తున్నవారిని వదిలేసి నిలదీస్తున్న తమను బెదిరించడమేమిటని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, అనుచరులు అడ్డం తిరగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తపరిస్థితులు  నెలకొన్నాయి. తెలంగాణలో అడ్డంగా దొరికిపోయినా తెలుగుదేశం నాయకులకు బుద్ధి వచ్చినట్లు లేదని అక్కడకు చేరుకున్న జనం వ్యాఖ్యానించడం వినిపించింది. ఇంత బహిరంగంగా ప్రజాప్రతినిధులను భయపెట్టడం, ప్రలోభపెట్టడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎంతగా బరితెగించిందో అర్ధం చేసుకోవచ్చు. 

బాబు సారధ్యంలో మద్యాంధ్రప్రదేశ్!

స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుండేవారు. ఆచరణలో మాత్రం రాష్ట్రాన్ని ఆయన మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ చూస్తుంటే ఇక పల్లెపల్లెకు మద్యం ఏరులుగా పారడం ఖాయమని తెలిసిపోతోంది. ఊరూరా మాత్రమే కాదు ఇంటింటికీ మద్యం చేరేలా నూతన విధానాన్ని చంద్రబాబు ప్లాన్ చేశారు. కొత్త విధానం ప్రకారం గ్రామాలు, హైవేలు, షాపింగ్‌మాల్స్, సూపర్ - హైపర్ మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా మద్యం అందుబాటులోకి రానున్నది. 
  తాము అధికారంలోకి వస్తే బెల్టుషాపులను రద్దు చేస్తామని, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ‘‘ మద్యం బెల్టుషాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెండో సంతకంగా చేస్తుంది. డీ అడిక్షన్ సెంటర్స్‌ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.’’ అని ఎలక్షన్ మేనిఫెస్టో 16 వ పేజీలో ప్రముఖంగా పేర్కొన్నారు.  కానీ ఎన్నికలు ముగియగానే ఎన్నికల ప్రణాళికను చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు ఏడాది తిరక్కుండానే మద్యంపై కొత్తపాలసీని తీసుకొచ్చారు.
  ఇంటింటికీ మద్యం ఏరులుగా పారేలా... రాష్ర్టంలో తాగుబోతులను పెంచేలా... రాష్ట్రాన్ని మద్యాంధ్రగా మార్చేలా... ఈ కొత్త మద్యం పాలసీని ఖరారు చేశారు.
 - కొత్తమద్యం పాలసీలో మరో కొత్త విషయమేమిటంటే ఈసారి నుంచి ఇక రాష్ట్రప్రభుత్వం నేరుగా మద్యం వ్యాపారంలోకి దిగిపోనున్నది. రాష్ర్టంలోని 4,380 మద్యం షాపులకు గాను 10శాతానికి తగ్గకుండా మండలానికో మద్యం షాపును రాష్ర్టప్రభుత్వమే నిర్వహించబోతున్నది.  ప్రతి మూడు లెసైన్సు షాపుల మధ్య ఓ ప్రభుత్వ షాపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు.
 - షాపింగ్ మాల్స్, సూపర్ - హైపర్ మార్కెట్లలోనూ మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం కొత్త మద్యంపాలసీలో కనిపించిన మరో కొత్త విషయం.
 - ఇంకో కొత్త విషయమేమిటంటే పాలు, కూల్‌డ్రింకుల మాదిరిగా మద్యం కూడా ఆకర్షణీయమైన టెట్రాప్యాక్‌లలో విక్రయించేందుకు కొత్త  మద్యం పాలసీలో చంద్రబాబు సర్కారు ప్లాను వేసింది. నాటుసారా, కల్తీమద్యం, లూజు విక్రయాలను నిరోధించేందుకే ఈ ప్రయత్నం అని చెబుతున్నా మందుబాబులను మరింతగా ఆకర్షించేందుకేనని వేరే చెప్పనక్కరలేదు. యూత్ ఇక కూల్‌డ్రింక్స్ ప్యాకెట్లలో మద్యం టెట్రాప్యాక్‌లను కలిపేసుకుని కనిపించకుండా తీసుకెళ్లేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా మద్యం సేవించేందుకు ఈ ప్లాన్ బాగా ఉపకరిస్తుంది.
 - హైవేల పక్కన ఉన్న మద్యం షాపులను తొలగించాల్సిందిగా రవాణాశాఖ చాలాకాలంగా మొత్తుకుంటోంది. వాటిని చంద్రబాబు సర్కారు అస్సలు ఖాతరు చేయలేదు. 50 మీటర్ల దూరంలో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు నోటిఫై చేసేశారు. రహదారులపై మద్యం తాగడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు 4శాతమేనని ప్రభుత్వం చెబుతుండడం గమనార్హం.
  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మద్యం మహమ్మారికి అవినాభావ సంబంధం ఉంది. బెల్టుషాపులకు, చీప్‌లిక్కర్‌కు శ్రీకారం చుట్టిన పాపం ఆయనదే. 2001లో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టి అధికారికమైన బెల్టుషాపుల ద్వారా కిరాణా కొట్టులో కూడా మద్యాన్ని అమ్మించిన ఘనత నారా వారిది. ఈ విషయాన్ని స్టాక్ హోం యూనివర్సిటీకి చెందిన విఖ్యాత పరిశోధకురాలు మారియా లార్సన్ తన పరిశోధన గ్రంథం ‘వెన్ ఉమన్ యునైట్’లో స్పష్టంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సారా వ్యతిరేక ఉద్యమం, అనంతర పరిణామాలపై ఆమె ఈ గంథాన్ని రచించారు.
  నాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మద్యనిషేధం విధించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్యనిషేధానికి తూట్లు పొడిచారు. మద్యం విక్రయాలను పెంచడం కోసం అధికారులకు టార్గెట్లు పెట్టడం, ప్రమోషన్లు ఇవ్వడం, అధికాదాయం వచ్చే ప్రాంతాలకు బదిలీలను ఎరగా చూపడం వంటివి చంద్రబాబు పాలనలోనే జరిగాయి. టార్గెట్లు చేరుకోలేని అధికారులను బదిలీ చేస్తానని చంద్రబాబు హూంకరించడం కూడా అందరికీ గుర్తే.  దుకాణాల వారీగా కూడా టార్గెట్లు పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు. నాడు విచ్చలవిడిగా దుకాణాలకు అనుమతులిచ్చారు. ప్రతి బజారులోనూ ఓ బారు ఉండేలా చూశారు. బార్లకు వచ్చే జనాలను పెంచడం కోసం బార్లలో డిస్కోథెక్‌లకు అనుమతించారు. ప్రతి మద్యం దుకాణానికి 10 నుంచి 15 బెల్టుషాపులను అనుమతించిన ఘనత చంద్రబాబు నాయుడిది.

22 June 2015

వంకర టింకర విన్యాసాలు

పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్ ల రద్దుకు యోచన 
 హైదరాబాద్‌ః ఓటుకి కోట్లు కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయిన చంద్రబాబు కి పాలన మీద పూర్తిగా పట్టు తప్పుతోంది. కొందరు సలహాదారులు ఇచ్చిన సలహాలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. దీంతో వాటి ప్రభావం ఎలా ఉంటుంది, సాధక బాధకాలు ఏమిటి అనే దానిపై ప్రభుత్వంలోని వారెవ్వరూ పూర్తిగా ఆలోచించటం లేదు. పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్సు రద్దు నిర్ణయం అటువంటిదే అని అంటున్నారు.
 ఏమిటీ పుస్తకాలు..!
 పూర్వం రెవిన్యూ రికార్డులన్నీ రాత పూర్వకంగా ప్రభుత్వ రికార్డుల్లోనే ఉండేవి. భూమి దారుడుకి వీటి వివరాలు సరిగ్గా తెలిసే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలోని భూములన్నింటికి పట్టాదారు పాస్ బుక్‌లు, టైటిల్ డీడ్సులు ముద్రించి ఇవ్వటం మొదలెట్టారు. దీనికోసం అప్పట్లో రెవిన్యూ యంత్రాంగం తీవ్రమైన కసరత్తు చేసింది. ఇదే అదనుగా అప్పట్లో కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులు రికార్డులు తారుమారు చేసి వందలాది ప్రభుత్వ భూములకు తమ పేరిట రికార్డులు సృష్టించుకొన్నారు. మొత్తం వివరాలన్నీ లెక్క తేలాక కొందరు అధికారులు ఈ అక్రమాల్ని గుర్తించినా కానీ,  అధికార పార్టీ నాయకుల జోలికి వెళ్లటం ఎందుకని మెదలకుండా ఊరుకొన్నారు. ఆ విషయాల్ని పక్కన పెడితే అప్పటి నుంచి ఈ పుస్తకాలే అధికారిక రికార్డులుగా చెలామణీ అవుతున్నాయి. పట్టాదారు పాస్ బుక్ లు, ైటె టిల్ డీడ్సు ల్లో రైతు పేరు, చిరునామా ఇతర వివరాల్ని పొందుపరిచి, ఫోటో తో సహా ఉన్న వివరాల్ని మండల రెవిన్యూ అధికారి  సర్టిఫై చేసి ఇస్తారు. దీంతో ఈ పాస్ బుక్ లను భూముల తాలూకా అధికారిక రికార్డులుగా భద్రపరచుకొంటున్నారు.
రుణ పరపతికి ఆధారం
పంట రుణాలు, ఇతర పరపతి మార్గాలకు సెక్యూరిటీ ఉంచుకోవటం ఆనవాయితీ. అందుకే బ్యాంకులు, సహకార సంఘాల్లో రుణం తీసుకొన్నప్పుడు ఈ పుస్తకాల్ని సెక్యురిటీ గా ఉంచుకోవటంతో పాటుగా పంట రుణాల వివరాల్ని ఇందులో నమోదు చేస్తారు. అప్పుడు ఒక భూమి మీద అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని నిరోధించటానికి వీలవుతుంది. రుణ వివరాలు ఇందులో పొందుపరచటంతో రైతులకు కూడా రికార్డులు స్పష్టంగా ఉంటున్నాయి. ఎక్కడెక్కడ ఎంతెంత రుణాలు ఉన్నాయి, వీటి వ్యవధి ఎంత అనే వివరాలు ఇందులో స్పష్టంగా ఉంటాయి. పైగా భూముల సొంతదారులు, కౌలుదారుల వివరాలు కూడా నమోదు చేసుకొనే అవకాశం ఉంటుంది. రెవిన్యూ సిబ్బంది రికార్డుల్లో కూడా ఈ వివరాలు ఉంటాయి.
  కొత్త విధానంతో రైతుల్లో కంగారు
 ఇప్పుడు ఈ పుస్తకాల విధానాన్ని రద్దు చేసేందుకు ్రపభుత్వం ప్రయత్నిస్తోంది. కేవలం వెబ్‌సైట్ లోనే వివరాలు నమోదు చేసి ఉంచి, దీన్నే ప్రభుత్వ రికార్డుగా భావించమంటున్నారు. గతంలో పాస్ బుస్తకాల జారీ లో ఇదే తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ వందల ఎకరాల్ని మాయం చేసిన ఉదంతాల్ని గ్రామాల్లోని ప్రజలు గుర్తు చేసుకొంటున్నారు. ఇప్పుడు కూడా పాస్ బుక్ లు రద్దు చేసి కొత్త విదానంలోకి వెళ్లటం అంటే ఇదే అదనుగా ప్రతీ చోట ప్రభుత్వ భూముల్లో వందల ఎకరాల్ని రికార్డుల్లో మార్చేసి సొంతం చేసుకొంటారన్న మాట వినిపిస్తోంది.
 ప్రైవేటు పరం
 మన భూమి వెబ్‌సైట్ లో ఉంచిన రికార్డులే ఇక నుంచి చెలామణీ అవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వ రెవిన్యూ అధికారులు నిర్వహించే పాస్‌బుక్ లు, ైటె టిల్ డీడ్సు లోనే అవకతవకలు జరుగుతూ  ఉంటే.. ఇక, ప్రైవేటు మీ సేవ ఆపరేటర్లు నిర్వహించే మనభూమి వెబ్ సైట్ లో ఎన్ని అవకతవకలు చోటు చేసుకొంటాయో అని రైతులు కంగారు పడుతున్నారు. పైగా వెబ్ సైట్ లో రికార్డులను రైతులు అర్థం చేసుకోవటం కష్టం అన్న మాట వినిపిస్తోంది.
 రుణమాఫీ ఉదంతమే ఉదాహరణ
 చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పి తుస్సు మనిపించిన రుణమాఫీ ఉదంతాన్ని గుర్తు చేసుకొంటున్నారు. రైతుల్లో ఎవరెవరకు రుణమాఫీ అయింది, ఎందుకు అయింది, ఎందుకు కాలేదు అనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. వెబ్ సైట్ లో చూపించిన రికార్డులే బ్రహ్మ రాతలు అన్నట్లుగా ప్రచారం చేసేస్తున్నారు. దీంతో రుణమాఫీ విషయంలో ఇప్పటికీ జనం జుట్టు పీక్కొంటున్నారు.
 భూముల తికమకలతో గొడవలు
 పల్లెటూళ్లలో చాలా తగాదాలకు మూలం పొలాల సరిహద్దు వివాదాలు. చాలా స్పష్టంగా రైతుల దగ్గర పాస్ బుక్ లు ఉంటేనే ఈ వివాదాలు తలెత్తుతుంటాయి. ఇప్పుడు వీటిని రద్దు చేసి వివరాలన్నీ ఆన్ లైన్ లో ఉంచటంతో సమస్యలు వస్తాయని క్షేత్ర స్థాయిలోని అధికారులు అంటున్నారు. ఒక ప్రాంతానికి చెందిన సరిహద్దులు మార్చేసి, కొంత కాలం పోయాక దీని ఆధారంగా గొడవకు దిగితే చేసేది ఏముంటుంది అని ్రపశ్నిస్తున్నారు. పైగా కొన్ని చోట్ల ఈ వెబ్‌సైట్ నుంచి ప్రభుత్వ భూమికి కూడా టెన్-1 అడంగళ్ వెలువడుతున్న దృష్టాంతాల్ని ఉదహరిస్తున్నారు. పాస్ బుక్ లు లేకపోవటంతో ఈ అడంగళ్ సాయంతో రుణాలు పొందలేక పోతున్నారు. ఇక, పాస్ బుక్ లు రద్దు చేసేస్తే వీటి సాయంతో ప్రభుత్వ భూముల పైన ప్రైవేటు వ్యక్తులు రుణాలు తీసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు మరింత గొడవలు అవుతాయని చెబుతున్నారు.
 కుట్ర దాగి ఉందా..!
 ఇన్ని గొడవలు తలెత్తుతాయన్న సంగతి ప్రభుత్వ పెద్దలకు తెలుసన్న మాట వినిపిస్తోంది. గతంలో మాదిరిగానే రెవిన్యూ రికార్డులు మార్చేసే సందర్బంలో వేలాది ఎకరాల భూమిని ఒక్కసారిగా చేజిక్కించుకొనేందుకు కుట్ర జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. అందుకే ఈ మొత్తం కసరత్తుని చాప కింద నీరులా చేయిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల ఇప్పటికే భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఇప్పుడు ఉన్న అధికారం తర్వాత ఉంటుందో లేదో తెలియనే తెలియదు. అటువంటప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబె ట్టుకొనే కుట్ర జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ప్రతీ జిల్లాలోనూ ప్రభుత్వ భూమిని గుర్తించి బడా నాయకులు ఒక కన్నేసి ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. 

రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు

కృష్ణా నీటి కేటాయింపుల్లో అన్యాయం
కృష్ణా జలాల బోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. బచావత్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఒక కొలిక్కి  రాలేదు. ఏపీని రెండు ముక్కలు చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు చేసి 299 టీఎంసీలు వారు వారికి నచ్చిన విధంగా వాడుకోవచ్చు అని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ఇందుకు గంగిరెద్దు మాదిరిగా తల ఊపింది. కృష్ణా నదికి సంబంధించి మహారాష్ట్ర- కర్ణాటక-తెలంగాణ తరవాత మాత్రమే కృష్ణా ఆయకట్టుకు నీరు వస్తుంది. తెలంగాణ కూడా ఏపీకి ఎగువ రాష్ట్రమే అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా ఉంటే అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చునని చెప్పటం అంటే అటు రాయలసీమకు, ఇటు కృష్ణా డెల్టాకు కూడా అన్యాయం జరిగినా పరవాలేదని ఏపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయటమే. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌తో సంధి కుదుర్చుకునేందుకు వీలుగానే కృష్ణా నీటి బోర్డు ముందు ఏపీ వాదనల్ని బలంగా వినిపించలేదన్నది స్పష్టం అవుతూనే ఉంది. ఇది రాగల సంవత్సరాల్లో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రయోజనాలకు చావు దెబ్బగా మారబోతోంది.
 అనుమతులు లేని ‘పాలమూరు’కు అభ్యంతరం చెప్పరా?
 తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల నీటి వాడకం కోసం ప్రారంభించినా కేంద్ర జల వనరుల శాఖకు అభ్యంతరం చెప్పే బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 90 టీఎంసీల ప్రాజెక్టుమీద కనీసం అభ్యంతరం లేవదీయలేదు. ఏపీ అధికారులను చంద్రబాబు నాయుడు ముందుగానే హెచ్చరించి, ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తవద్దని, తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉందని చెప్పినట్టుగా మొత్తం వ్యవహారం ఏపీ హక్కులను తాకట్టు పెడుతూ నడిచింది. 

బాబు జమానాలో రైతులకు రుణాల బాధలు!

రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అనేక కల్లబొల్లి కబుర్లతో రైతులను మోసపుచ్చిన చంద్రబాబు చివరకు వారికి బ్యాంకుల నుంచి రుణాలు పుట్టని పరిస్థితి తీసుకువచ్చాడు. రుణాలు అందకుండా పోయి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చంద్రబాబు హయాంలో షరా మామూలే. గత తొమ్మిదేళ్ల నరకం ఇపుడు పునరావృతమౌతోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు...వాస్తవంగా ఇచ్చిన రుణాలు....అలాగే వ్యవసాయ టర్మ్ రుణాలు లక్ష్యాలు..వాస్తవంగా ఇచ్చిన రుణాలు...ఖరీఫ్, రబీ సీజన్‌ల వారీగా ఈ విధంగా ఉన్నాయి. ఈ వివరాలు చూస్తే చంద్రబాబు జమానాలో రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో అర్ధమౌతుంది.
 -మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ పంట రుణాల లక్ష్యం 41,978 కోట్ల రూపాయలకు గాను 29,551 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు. ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ టర్మ్ రుణాలు 14,041 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 10,950 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు.
 -మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో పంట, వ్యవసాయ టర్మ్ రుణాల లక్ష్యం 56,019 కోట్ల రూపాయలకు గాను వాస్తవంగా ఇచ్చిన రుణాలు 40,501 కోట్ల రూపాయలు.
 - గత పదేళ్ళలో ఏ సంవత్సరాన్ని తీసుకున్నా బ్యాంకులు ముందుగా ప్రకటించిన వ్యవసాయ రుణాల లక్ష్యం కంటే వాస్తవంగా ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఎక్కువగా ఉంటాయి.
 ఉదాహరణకు 2011-12లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 48 వేల కోట్లు అయితే... వాస్తవంగా ఇచ్చింది 58,511 కోట్లు.
 2012-13లో లక్ష్యం రూ. 52,972 కోట్లు అయితే ఇచ్చింది రూ. 73,648 కోట్లు
 2013-14లో లక్ష్యం రూ. 67,224 కోట్లు అయితే ఇచ్చింది రూ. 73,494 కోట్లు
 2014-15లో లక్ష్యం 56,019 కోట్ల రూపాయలకు గాను వాస్తవంగా ఇచ్చిన రుణాలు 40,501 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 15,500 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చారు. ఇదీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘనత. ఇదీ రైతులకు ఆయనపై ఉన్న ప్రేమ.

అన్నదాతకు అండగా 25న ధర్నాలు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
 ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారు. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఆదుకోవలసిన రాష్ర్టప్రభుత్వాధినేత సొంత సమస్యల్లో బిజీగా ఉన్నారు. రైతులకు విత్తనాలు లేవు.  రుణాలు మాఫీ కాలేదు. కొత్తరుణాలు పుట్టే అవకాశాలు కనిపించడం లేదు.. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు, బంగారు వేలం వేస్తామంటూ బెదిరింపులు.. మద్దతుధరలను అరకొరగా పెంచిన కేంద్రం... ఇదే సమయంలో కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం.... అనుమతులు లేకపోయినా పొరుగురాష్ర్టంలో కొత్త ప్రాజెక్టులు... ఇన్ని జరుగుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. నిజానికి ఆయన ఆధ్వర్యంలోనే మన రైతులకు అన్యాయం జరుగుతోంది. ఈ అంశాలన్నిటిపైనా ఈ నెల 25న కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.
  ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి సుడిగుండంలో చిక్కుకుని పాలనను గాలికి వదిలేశారు. ఏడాదిగా వ్యవసాయ రుణాలు రద్దు కాకపోగా, ఇంతింతై వటుడింతై అన్నట్టు ఏకంగా రూ.1 లక్ష కోట్లకు చేరుకుంటున్నాయి. అదీగాక, జూన్ నెల నాలుగో వారం వచ్చినా ఇంతవరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగలేదు, వ్యవసాయ రుణాలు ఎంత ఇస్తారో నిర్ణయమే కాలేదు. ఇలా జూన్ మూడో వారం వరకు ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ జరగకపోవటం చరిత్రలో ఇదే మొదటి సారి. మరోవైపు విత్తనాలు అందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. చివరికి విత్తనాల పంపిణీకి కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. రైతుకు ఎలా ఇవ్వాలా అని మహానేత డాక్టర్ వైఎస్సార్ ఆలోచిస్తే, రైతుకు ఎలా ఎగ్గొట్టాలా అన్న రీతిలోనే చంద్రబాబు ఏడాది పాలన గడచిపోయింది. చంద్రబాబుగారి వాగ్దానాన్ని నమ్మి బంగారం తాకట్టు పెట్టుకున్న వారందరికీ వేలం నోటీసులు వస్తున్నాయి. మరో వంక, కేంద్ర ప్రభుత్వం వారు  ధాన్యం మద్దతు ధర వరుసగా రెండో ఏడాది కేవలం రూ.50 పెంచి ఊరుకున్నారు. అయినా మద్దతుధరలు పెంచాలంటూ రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక లేఖ రాసే ధైర్యం చంద్రబాబు నాయుడుగారికి  లేదు.  అందుకే ఈ అంశాలన్నింటిపైనా ఈ నెల 25న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ పిలుపును అందుకుని భారీ సంఖ్యలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలో పాల్గొనాల్సిందిగా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.

 అదునుకు విత్తనాలు అందించలేని అనుభవజ్ఞుడు 
 ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది. అదును దాటిపోతుందన్న భయంతో అన్నదాతలు విత్తనాల కోసం అటూఇటూ పరుగులు పెడుతున్నారు. అనంతపురంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాయలసీమలో ఈ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలలో సగం కూడా సరఫరా చేయలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉంది. విత్తనాల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. సర్కారు ఆధ్వర్యంలో సరఫరా కావలసిన విత్తనాలు అరకొరగా మాత్రమే సరఫరా అవుతున్నాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు కనీసం విత్తనాలు కూడా అందించలేకపోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం నాయకులు విత్తనాల కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హీనమైన వ్యాఖ్యలు చేసే స్థాయికి దిగజారారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడం కోసమే రైతులు ఆందోళనలు చేస్తున్నారని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. వేరుశనగ విత్తనాల ధరలు పెరిగినందునే సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ పెరిగిందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

 ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఎప్పుడు బాబూ?
  మే 15న జరగాల్సిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు. జూన్ మూడో వారం ముగుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర వ్యవసాయ రుణ ప్రణాళిక ఖరారుకు ప్రభుత్వానికి తీరిక లేదు.కాబట్టే, జూన్ మూడో వారం వచ్చినా ఇంతవరకూ రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పించాలనే అంశంమీదే చంద్రబాబు నాయుడుకి ధ్యాస లేదు. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ చంద్రబాబు వల్లే ఆగింది. కాబట్టే, రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ రైతులకు బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అదీగాక పూర్తిగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్న చంద్రబాబు ఆ రుణాలు మాఫీ చేయకపోవటం వల్ల, 2014 ఏప్రిల్ 1 నాటికి ఉన్న వ్యవసాయ రుణాల మీద పడిన వడ్డీలో సగానికి కూడా బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఏపీ రైతు రుణం విషయంలో దేశంలో నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇదీ చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఏపీ రైతుని వ్యవసాయ దిగుబడులోనో, వ్యవసాయం మీద వచ్చే ఆదాయంలోనో చంద్రబాబు నెంబర్ 1 చేయలేదు. అప్పుల్లో నెంబర్1గా తయారు చేశాడు.

 అన్నదాతల ఆత్మహత్యలపై చలించని చంద్రబాబు
  ఇన్ని సమస్యలు చుట్టుముడుతుండబట్టే ఎప్పుడూ లేని విధంగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి సభలోనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే... కనీసం 108 వాహనం కూడా అక్కడ లేదు. ఆ రైతును పట్టించుకున్న దిక్కు లేదు. పైగా కళ్ళెదుటే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబులో చలనమే లేదు. ఏం లేదు.. ఏం లేదు.. మీరు కూర్చొండి అంటూ జనాన్ని, మీడియాని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అలాగే గత రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో నమోదు అయిన రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా చంద్రబాబులో చలనం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. మరి ఇప్పుడు ఆ జిల్లాలో పరిస్థితి ఏమిటి?

 పదవిపై నున్న ధ్యాస ప్రజాసమస్యలపై ఏది?
 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా తన పదవిని ఎలా కాపాడుకోవాలి అన్నది మాత్రమే. ఆయన తక్షణం రాజీనామా చేసి వేరే వ్యక్తులకు ముఖ్యమంత్రి పదవి అప్పగించి రైతుల సంక్షేమం, రాష్ట్ర ప్రజల సంక్షేమం దిగజారకుండా కాపాడాలి. ఇప్పుడు పొద్దునలేస్తే గవర్నర్‌ను ఎప్పుడు కలవాలి, కేంద్ర మంత్రులతో ఎప్పుడు సమావేశం కావాలి, వెంకయ్య నాయుడుతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడాలి, తన ఎంపీల ద్వారా, తన కేంద్ర మంత్రుల ద్వారా కేంద్రం ద్వారా ఎలా ఒత్తిడి తీసుకురావాలి, తన ఇంటిలిజెన్స్, తన పోలీస్ బాస్‌లతో సమావేశమై ఏం పథకాలు రూపొందించాలి... ఇదే కదా చంద్రబాబు గారి ఆలోచన. ఇందులో ఏపీ ప్రజల గురించి ఆయన ఆలోచిస్తున్నదేముంది?
  వ్యవసాయం మీద, మన రాష్ట్రానికి చెందాల్సిన నీటి వనరుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న అశ్రద్ధకు, బాధ్యతా రాహిత్యానికి నిరసనగా ఈ నెల 25న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాలన్నింటిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. 

20 June 2015

బాబు వచ్చారు.. జాబులు పోతున్నాయ్..

బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఊదరగొట్టాడు. ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కాడు. జాబులు వచ్చే సంగతి అలా ఉంచితే ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు. జాబులు ఊడబీకే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. చంద్రబాబును ఎన్నుకుని ఎంత తప్పు చేశామో అని అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగాలు పోతున్నవారు వాపోతున్నారు.
  వైఎస్‌ఆర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని ఎన్‌పీఎం సీఎంఎస్‌ఏ (పురుగుమందులు లేని వ్యవసాయం) విభాగంలో జిల్లా వ్యాప్తంగా 812 మందికి ఒక్కసారిగా ఉద్వాసన పలికారు. క్షేత్రస్థాయిలో 575మంది వీఏలు, 115 మంది సీఏలు, కమిటీకి చెందిన 115 మంది, ఏడుగురు ఆపరేటర్ల ఉద్యోగాలను ఊడబీకారు. వీరంతా 2006 నుంచి ఈ విభాగంలో పనిచేస్తున్నారు. సెర్ఫ్ సీఎంఎస్ డెరైక్టర్ సుధాకర్ సెల్ నుంచి ‘మీ సేవలు ఇక చాలు’ అని మెస్సేజ్ వచ్చిందట. ఆ వెంటనే వీరి ఉద్యోగాలు పోయాయి. పై స్థాయిలో నిర్ణయం తీసుకోబట్టే తమ ఉద్యోగాలు పోయాయని వారు వాపోతున్నారు. ఏప్రిల్22 నుంచి ఉద్యోగాల కోసం వీరంతా ఆందోళన చేస్తూనే ఉన్నారు. శుక్రవారంనాడు కడప నగరంలోని ప్రెస్‌క్లబ్ వద్ద వారు ఆందోళన చేశారు. మీడియా ప్రతినిధులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం జరక్కపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. క్షేత్రస్థాయిలో పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలంబడుల ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వడం, అంతర పంట సాగుపై మెళకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసి రైతులను చైతన్యవంతులను చేయడం వీరి బాధ్యతలు. అన్నదాతలకు అందుబాటులో ఉంటూ సాగు సమస్యలను తీర్చడం వంటి కీలకమైన బాధ్యతలు వీరు నిర్వర్తించారు. ఎలాంటి ముందు హెచ్చరికలు లేకుండా కనీసం నోటీసైనా ఇవ్వకుండా తమను ఒక్క సెల్ మెస్సేజ్‌తో ఇంటికి పంపించడం ఎంత అన్యాయమో అని వారు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడికి వ్యవసాయం పట్ల ఎంతటి చిన్నచూపు ఉందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. పైగా గడచిన ఏడాది కాలంగా వీరికి వేతనాలు అందడం లేదు. చంద్రబాబు పీఠం ఎక్కిన తర్వాత వీరికి జీతాలు ఆగిపోయాయి. తొలగించేముందు వేతన బకాయిలు చెల్లించడం కనీస మర్యాద. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ మర్యాదను కూడా పాటించలేదు. వారంతా నిరుపేదలు. చాలీచాలని జీతాలతో ఎలాగోలా ఆ ఉద్యోగాలను చేసుకుంటూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. అలాంటిది వారిని ఉన్నఫళంగా తొలగించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 812 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఒక్కొక్క ఉద్యోగికీ రు.50 వేలకు పైనే వేతన బకాయిలు ఉన్నాయట. వాటిని చెల్లించాలంటూ డీఆర్‌డీఏ పీడీకి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయమూ చూపించకుండా ఇలా రోడ్డున పడేయడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇవే విభాగాలను కొనసాగిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చంద్రబాబు ప్రభుత్వ వేటు వేసింది. ఇప్పటికైనా రాష్ర్టప్రభుత్వం కళ్లు తెరిచి తమ కుటుంబాలను ఆదుకోవాలని లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాట్ అయామ్ సేయింగ్.. వాట్ అయామ్ డూయింగ్...!

వాట్ అయామ్ సేయింగ్..
 వాట్ అయామ్ డూయింగ్...!
 బెదిరించటం, భయపెట్టడం, తప్పు దారి పట్టించటం అజెండా గా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఓటు కి కోట్లు కుంభకోణంలో పూర్తిగా ఇరుక్కొన్న చంద్రబాబును.. తనను బయటకు లాగటమే లక్ష్యంగా అన్ని వ్యవస్థల్ని మభ్య పెడుతున్నారు. అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకు ఉన్న అన్ని దారుల్ని  ఉపయోగించుకొంటున్నారు.

 అర్థరాత్రి హైడ్రామా
 మొట్టమొదట చంద్రబాబు ఆడియో సంభాషణల్ని ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్ కు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. విశాఖలో ఒక న్యాయవాది దాఖలు చేసిన ప్రైవేటు కేసు మీద ఈ నోటీసులు జారీ చేశారు. అక్కడి ఏసీపీస్వయంగా హైదరాబాద్ వచ్చి ఈ  నోటీసుల్ని అందించారు. ఎదురు దాడి ప్రారంభం అయిందన్న సంకేతాలు ఇచ్చేందుకే ఈ నోటీసులు జారీ చేశారన్న మాట వినిపించింది. దీనిపై జర్నలిస్టులు, న్యాయవాదులు ధర్నా కు దిగారు.

 టీ టీడీపీ నేతలే బలిపశువులు
 ఈ పరిణామాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ నేతలతో సమావేశం అయ్యారు. సీనియర్‌నేతలు ఎర్ర బెల్లి దయాకర్‌రావు, వేంపల్లి నరేందర్ రెడ్డి, గరికిపాటి రామ్మోహన్  ఈ భేటీలో పాల్గొన్నారు. టీన్యూస్ కు నోటీసులు, ఇతర పరిణామాలపై చర్చించారు. ఈ విషయంలో టీటీడీపీ నేతల్ని బలి పశువుల్ని చేసేందుకు ముందుగానే నిర్ణయించుకొన్న చంద్రబాబు.. టీన్యూస్ పై విమర్శలు గుప్పించే పనిని అప్పగించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందుల్ని ప్రస్తావించినా పట్టించుకోకుండా ఎదురు దాడికి పురమాయించారు. పనిలో పనిగా ఏసీబీ అడుగుతున్న ప్రశ్నల్ని వేం నరేందర్‌నుంచి అడిగి తెలుసుకొన్నట్లు సమాచారం. దీన్నే మరో ఎమ్మెల్యే సండ్ర కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.

 సండ్ర కు ప్రైవేటు కోచింగ్
 వాస్తవానికి ఇప్పటికే మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కు ప్రైవేటు కోచింగ్ నడుస్తోంది ఏసీబీ నోటీసు అందుకొన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణ అనారోగ్యం కారణం చూపి విచారణకు హాజరు కాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన ఏసీబీ కి తెలియపరిచారు. కానీ, ఆయన్ని విజయవాడకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ పోలీసు ఉన్నతాధికారుల బృందం ఆయనకు కోచింగ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇటువంటి కేసుల్ని దర్యాప్తు చేసిన అధికారిని దీనికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది..దానికి ఎంత జాగ్రత్తగా జవాబులు చెప్పాలి, ఆ జవాబుల మీద తిరిగి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు..వంటి అంశాల్ని ఈ కోచింగ్ లో బోధిస్తున్నట్లు వినికిడి. అంటే నేరాల్ని నియంత్రించేందుకు ద ర్యాప్తు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు.... చివరకు నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ప్రైవేటు కోచింగ్ ఇవ్వాల్సి వస్తోంది. వ్యవస్థల్ని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చారని పోలీసు అధికారులు లోలోపల మథన పడుతున్నారు.

 ఫోరెన్సిక్ నిపుణుల సాయం
 అకస్మాతుగా చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోరెన్సిక్ నిపుణుడు గాంధీని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొంది. అకస్మాతుగా ఫోరెన్సిక్ నిపుణుల సేవల్ని తీసుకోవటంమీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యక్తిగతంగా చేసిన కుట్రల్ని ప్రభుత్వ ఖర్చులతో రిపేర్ చేయిస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు.

 మొబైల్ ఆపరేటర్లకు  పోలీసు బెదిరింపులు
 నామినేటెడ్ ఎమ్మెలే స్టీఫెన్ సన్ తో పాటు ఏసీబీ  అధిపతి ఏకే ఖాన్, నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డి ల మొబైల్ ఫోన్ కాల్సు డేటా ను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ పోలీసు ఉన్నతాధికారుల్ని ఈ పనులకు చంద్రబాబు టీమ్ వినియోగిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, మొబైల్ ఆపరేటర్ల ను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకొన్న తెలంగాణ ఉన్నతాధికారులు కూడా తమ  స్థాయిలో ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తన స్వార్థానికి గాను రెండు రాష్ట్రాల పోలీసు  ఉన్నతాధికారుల్ని పరస్పరం శత్రువులుగా చేసినట్లు తెలుస్తోంది.

 ఫోన్ లో బిజీ బిజీ
 రెండు రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ..పొడి పొడిగానే అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తూ ఫోన్లలో గడుపుతున్నారు. ఈ కేసును రాష్ట్ర ఉన్నతాధికారులకు జీవన్మరణ సమస్యగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు మిగిలిన పనుల్ని పక్కన పెట్టేసి ఈ కేసు వివరాలు తెలుసుకోవటం, విశ్లేషణలు సాగించటం ఎజెండాగా పనిచేస్తున్నారు.
  ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వ్యవస్థను ఈ కేసు విషయంలో వాడుతున్నట్లు అర్థం అవుతోంది. వ్యక్తిగతంగా చంద్రబాబు చేసిన తప్పుల్ని మాయచేసి, ఆయన్ని రక్షించేందుకు ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నట్లు తేలుతోంది. 

19 June 2015

మద్దతుధర ముష్టివేస్తారా...?

నాటి మాటలేమయ్యాయి బాబూ...
స్వామినాథన్ సిఫార్సుల అమలు హామీ హుళక్కి
పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోండి..
వైఎస్‌ఆర్ స్వర్ణయుగంలో సుభిక్షం..
వైఎస్‌కు ముందు ఆ తర్వాత అన్నదాతకు కష్టాలే..

అన్నదాతను ఆదుకుంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని అందుకోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు ఊరూవాడా ఊదరగొట్టారు. ఎన్నికల ప్రచార సభల్లో రైతుల సంక్షేమం గురించి ఎన్నో కబుర్లు చెప్పారు. ఎన్నికల ప్రణాళిక తొలి పేజీలోనే స్వర్ణాంధ్ర నిర్మాణం శీర్షికన అన్నదాతకు ఎన్నో హామీలు గుప్పించారు. పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల ప్రణాళికను బుట్టదాఖలా చేసి రైతులను వారి ఖర్మానికి వారిని వదిలేశారు. రాష్ర్టంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్రమోడి సర్కారు పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా రెండో సంవత్సరం కూడా ముష్టి విదిల్చినట్లుగా మద్దతు ధర పెంచడం చూస్తుంటే ఈ ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం పట్ల ఎలాంటి చిత్తశుద్ధీ లేదని అర్ధమౌతోంది. ఈ ఏడాది ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 50, వేరుసెనగ పంటకు రూ. 30, పత్తికి రూ. 50 ముష్టి వేసినట్టుగా విదిల్చడం చాలా దారుణం.

మద్దతుధరపైనే రైతు మనుగడ...
రైతు పండించిన పంటకు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరను కనీస మద్దతు ధరలుగా నిర్ణయించడమే నేటి రైతు సంక్షోభానికి ప్రధానమైన కారణం. ఏ వస్తువునైనా ఉత్పత్తి చేసినవాడే ధరను నిర్ణయించుకుంటాడు. కానీ రైతులు మాత్రమే పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. వారి పంటల ధరలను ఎవరో నిర్ణయిస్తారు.  దేశంలో నేటికీ 55 శాతం మంది ప్రజలు తినేది వరి అన్నం. ఆహార ధాన్యాల్లో అత్యధికంగా పండించే పంట వరి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఉమ్మడి రాష్ట్రంలోనే ధాన్యం ఉత్పత్తి మూలంగానే రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు వచ్చింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు 41.72 లక్షల హెక్టార్లు అయితే, ఇందులో ఒక్క వరి మాత్రమే 16.42 లక్షల హెక్టార్లు. వరి తర్వాత వేరుసెనగ 10.9  లక్షల హెక్టార్లు. పత్తి 7.7 లక్షల హెక్టార్లు. ఈ మూడు పంటలు కలిపితే సుమారుగా 82 శాతం సాగు జరుగుతోంది. రబీలో 25.8లక్షల హెక్టార్లు సాధారణ సాగు అయితే, ఇందులో వరి మాత్రమే 8 లక్షల హెక్టార్లు. ఈ మూడు పంటల గిట్టుబాటు- ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలపైనే ఆధారపడి ఉన్నది.

గత ఏడాదీ ఇంతే...
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వాస్తవానికి వాటిని ఏనాడో మరచిపోయారు. అధికారానికి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో ధాన్యానికి మద్దతు ధర రూ. 1310 నుంచి రూ. 1360కు అంటే 3.8 శాతం, రెండవ సంవత్సరం 2015-16లో రూ. 1360 నుంచి రూ. 1410కు అంటే 3.67 శాతం, అలానే పత్తికి గత సంవత్సరం రూ. 4000 నుంచి రూ. 4050కు, రాబోయే సంవత్సరానికి రూ. 4050 నుంచి రూ. 4,100కు మాత్రమే పెంచారు. వేరుసెనగకు గత సంవత్సరం ఒక్క రూపాయి పెంచలేదు. రాబోయే సంవత్సరానికి కేవలం రూ. 30 పెంచారు. అన్ని రకాల పంటలకు ఏటా పెట్టుబడులు పెరుగుతూ పోతున్నాయి. కానీ వాటికి అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదు.

వైఎస్ స్వర్ణయుగంలో... అంతకు ముందు.. ఆ తర్వాత...
యూపీఏ ప్రభుత్వ విధానాల మూలంగానే రైతులు సంక్షోభానికి వెళ్ళారని విమర్శిస్తున్న నేతలు వారు మాత్రం చేసిందేమిటి? ఏనాడూ చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తెచ్చి రైతుల పక్షాన మాట్లాడిందే లేదు. మద్దతు ధర పెంపు కోసం పోరాటం చేసిందే లేదు. 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ధాన్యానికి పెరిగిన మద్దతు ధర- రూ. 490 నుంచి రూ. 550 మాత్రమే. అంటే 12.24 శాతం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కాలమే అన్నదాతకు అన్నివిధాలా స్వర్ణయుగం. ఈ 5 ఏళ్ళ కాలంలో ధాన్యానికి పెరిగిన మద్దతు ధర- రూ. 550 నుంచి రూ. 1000. అంటే 81.8 శాతం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి మద్దతు ధరలపై అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటమే కాకుండా పార్లమెంటు సభ్యులు, అప్పటి కేంద్ర మంత్రుల ద్వారా చేసిన ఒత్తిడి పర్యవసానమే ఈ పెరుగుదల.  2009 నుంచి 2014 వరకు పెరిగిన మద్దతు ధర రూ. 1000 నుంచి రూ. 1310 అంటే 31 శాతం. మరలా ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాలకు కలిపి రూ. 1310 నుంచి రూ. 1410కు మాత్రమే పెంచడం జరిగింది. అంటే 7.6 శాతం. తిరిగి 1999-2004 నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన పరిస్థితే పునరావృత్తం అయ్యేటట్లు కనిపిస్తున్నది.

మన రైతులకే ఎక్కువ నష్టం...
మద్దతు ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులు మాత్రమే ఎక్కువగా నష్టపోతున్నారు. ధాన్యం పండించే ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పండే బాస్మతి రకం, పూసా 1121 రకం ఎగుమతులు అవుతాయి. అంతేగాక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిసాలలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో పండే ధాన్యం బంగ్లాదేశ్‌కు బహిరంగంగానే స్మగుల్డ్ అవుతాయి. మన రాష్ట్రంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటం మూలంగా రైతులు పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు.

నష్టాలు తట్టుకోలేకే క్రాప్ హాలిడే...
2011లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత సారవంతమైన, అత్యంత సాగు నీటి వనరులు కలిగిన గోదావరి డెల్టాలోని కోనసీమ ప్రాంతంలోని రైతులు పంట పండించి నష్టపోతున్నాం అని సాగు సమ్మె(క్రాప్ హాలిడే) చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాల్‌కు రూ. 1250. మద్దతు ధర రూ. 1080. ఈ పంట పండించి క్వింటాల్‌కు రూ. 170 అధికారిక లెక్కల ప్రకారమే రైతు నష్టపోయాడు. అదే 2014-15లో ఉత్పత్తి వ్యయం రూ. 1280లు, మద్దతు ధర రూ. 1360. ఒక క్వింటాల్ ఉత్పత్తి మూలంగా రైతు రూ. 248 నష్టపోయాడు. ఇదే నేటి రైతు సంక్షోభానికి ప్రధాన కారణం.

రైతుకు నష్టం... సర్కారుకు లాభం
మన రాష్ట్రంలో 2014-15లో రైతు ఒక క్వింటాల్ ధాన్యం పండించటం ద్వారా ఖర్చు రూ. 1708 - ధర 1360 = రూ. 348 నష్టపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 1360కి 19.5 శాతం పన్నుల ద్వారా రూ. 265 ఆదాయం గడిస్తున్నది.  ఎకరానికి సరాసరి దిగుబడి 22 క్వింటాళ్ళు వస్తే.. ఒక ఎకరం పంట ద్వారా రైతు రూ. 7,656 నష్టపోయాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 5830 ఆదాయం చేకూర్చుకున్నది.
 ఇవేనా రైతు అనుకూల విధానాలంటే..?

పొరుగురాష్ట్రాలను చూసైనా...
రైతుకు భూమి కన్న తల్లి. ఆ కన్న తల్లి లాంటి భూమిని బీడుగా ఉంచడు. ఎంత సంక్షోభంలో ఉన్నా పంటలు పండిస్తూనే ఉంటాడు. మన అందరికీ కావాల్సిన ఆహార ధాన్యాలు వస్తూనే ఉంటాయి కాబట్టి, మనందరికీ ఆహార భద్రత ఇస్తూ పంట ద్వారా తాను పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేక, ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితికి ఎవరు కారకులు? దేశానికి రైతు అవసరం. రైతుకు ఆదాయం అవసరం. రైతుకు ఆదాయం గిట్టుబాటు ధరల నుంచి మాత్రమే రావాలి అనే విషయాన్ని మర్చిపోయి, నేటి పాలకులు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి, వాస్తవాలకు దూరంగా రైతులకు ముష్టి వేసినట్టుగా మద్దతు ధరలు పెంచడం చాలా దారుణం. ధాన్యం పండించే అనేక రాష్ట్రాలు వారి రైతుల శ్రేయస్సు కోసం 2013-14లో ఛత్తీస్‌గఢ్ రూ. 300, కర్ణాటక రూ. 290, కేరళ రూ. 490, మధ్యప్రదేశ్ రూ. 150, తమిళనాడు రూ. 70 బోనస్‌గా క్వింటాల్ ధాన్యానికి ఇస్తున్నాయి.

వాగ్దానాలు మోసం... మిషన్‌లూ మోసం...
గత ఏడాదిలో మద్దతు ధరలు గిట్టుబాటు ధరలుగా లేకపోయినప్పటికీ, ఆ మద్దతు ధరలు కూడా వరి, వేరుసెనగ, పత్తి, మొక్కజొన్న తదితర పంటల రైతులు అమ్ముకోలేక మద్దతు ధరలు కంటే రూ. 200 నుంచి 300 తక్కువకు తెగనమ్ముకున్న విషయం తెల్సిందే. గుంటూరు జిల్లాలో రైతుల పేరు మీద తెలుగుదేశం పార్టీకి చెందిన బ్రోకర్లు అక్రమంగా సీసీఐలో పత్తి అమ్మకాలు సాగించి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్డిన విషయం కూడా తెలిసిందే. మద్దతు ధరలక ంటే తక్కువకు ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవటానికి రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానం రెండు బడ్జెట్లు పూర్తి అయినా దాని ఊసే లేదు. వేదికల మీద మాత్రం రైతు ప్రాధికార మిషన్ ను ప్రారంభించాం అని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. జూన్ నెలలో ఖరీఫ్ ప్రారంభంలోనే తీవ్ర సంక్షోభంలో ఉన్న అనంత రైతు వేరుసెనగ విత్తనం కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి కళ్ళముందు కనిపిస్తోంది. గత సంవత్సరకాలంలో వ్యవసాయానికి సంబంధించి రుణమాఫీ చేయని విషయం, రైతులకు రుణాలు అందించే విషయం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించే విషయం, తుపాను, కరువుకు దెబ్బతిన్న రైతులకు మీ విధానాల మూలంగా ఇన్సూరెన్స్ రాకుండా పోవటం.. ఇలా అన్ని విషయాల్లో రైతుకు సంబంధించినంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కనీసం రాబోయే సంవత్సరంలోనైనా చిత్తశుద్ధితో వ్యవహరించి బూటకపు మాటలు కాకుండా రైతులకు వాస్తవంగా ఉపయోగపడే కార్యక్రమాలను తీసుకోవాలి.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి
మన రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలోని అధికార కూటమిలో భాగస్వామి. రైతులకు మోసపూరిత మాటలు చెప్పకుండా ఇచ్చిన హామీల మేరకు అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.

ఇతరదేశాల్లో మద్దతుధరలు 
మన దేశంలో అందరూ రైతుల గురించే మాట్లాడతారు. కానీ రైతులకు ఒరిగేది మాత్రం శూన్యం. ధాన్యం పండించే దేశాల్లో ఆయా ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధరలను పరిశీలిస్తే...
 2014-15లో థాయ్‌లాండ్ 691.2 డాలర్లు (ఫర్ మెట్రిక్ టన్ ఆఫ్ రైస్)
  ఫిలిప్పైన్స్ 593.7
  చైనా జపానికా 495.5
  చైనా ఇండికా 446.3
  ఇండోనేషియా 411.1
  ఇండియా 311.3

ధాన్యంపై విధిస్తున్న పన్నులు, ఇతర ఖర్చులు
 ఆంధ్రప్రదేశ్- 19.5 శాతం
 ఒడిసా 15.5 శాతం
 పంజాబ్ 14.5 శాతం
 హర్యానా 11.5 శాతం
 ఛత్తీస్‌గఢ్ 9.7 శాతం
 యూపీ 9 శాతం
 బీహార్ 6.5 శాతం
 ఎంపీ 4.7 శాతం
 కర్ణాటక 4 శాతం
 మహారాష్ట్ర 3.55 శాతం
 పశ్చిమ బెంగాల్ 3 శాతం

స్వామినాథన్ కమిషన్ ప్రధానమైన సిఫార్సులేమిటంటే.. 
 1. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు ఉండాలి.
 2. వ్యవసాయ ఉత్పత్తులు పండించటానికి అవుతున్న ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి.
 3. రైతు ఇంటికి తీసుకునివెళ్ళే నికర ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతంతో సమానంగా ఉండాలి.

ఈ ప్రశ్నలకు బదులివ్వు బాబూ!

ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పించుకునే దారులు వెతుకుతూ అందరిపైనా బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు తన మంత్రుల దండుతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆయనకు లేనిపోనివి ఆపాదిస్తున్నారు. తమపై పడిన మరకలను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారు.  ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు, ఆయన చుట్టూ ఉన్న భజనబృందం నీతి, నిజాయితీ ఉంటే ఈ ప్రశ్నలకు బదులివ్వాలి....

 చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి వైయస్‌ఆర్ కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

 1. ఓటు, నోటు కేసు విషయంలో మీరు కేసిఆర్ కాళ్ళు పట్టుకునేందుకు సిద్ధం అయ్యారా? లేదా?

 2. ఢిల్లీలో బేరం, రాయబారం కుదుర్చుకునేందుకు సుజనా చౌదరిని ఉపయోగించి కేటిఆర్ కాళ్ళా వేళ్ళా పడ్డారన్నది నిజం అవునా? కాదా?

 3. ఢిల్లీలో మీ కేంద్ర మంత్రుల్ని, ఎంపీలను ఉపయోగించి ఎన్డీఏ పెద్దలందరినీ ప్రాధేయపడి  గవర్నర్ ద్వారా కాంప్రమైజ్ ఫార్ములా పంపారా? లేదా?

 4. ఆంబోతు, కీలు బొమ్మ వంటి మాటలు మాట్లాడవద్దని తాఖీదులు ఇచ్చారంటే ఇది మీ రాజీలో భాగం కాదా? గవర్నర్‌ను అప్పుడు ఎందుకు అవమానించారు? ఇప్పుడు ఎందుకు మంచి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు?

 5. గాంధీ అనే మీ తాబేదారును  ఫోరెన్సిక్సాక్ష్యాలు తారుమారు చేసేందుకే ఇప్పటికిప్పుడు ఏపీ  అడ్వైజర్‌గా వేసుకున్నది నిజం కాదా?

 6. ఇంతకీ ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఉన్నది మీ గొంతు అవునా? కాదా? స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది నిజం అవునా? కాదా? రేవంత్‌రెడ్డి డబ్బుల మూటలు మోసుకువెళ్ళింది నిజం అవునా? కాదా?

 7. రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో దొరికాడా ? లేదా?

 8. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతల విషయంలో, పోలీసు అంశాల్లో తుది అధికారం ఉంటుందన్న విషయం మీరు అడ్డంగా దొరికిపోయేవరకు గుర్తుకు రాలేదన్నది నిజం కాదా?

 9. ఫోన్‌లో రికార్డు చేయటం తప్పు, ఎమ్మెల్యేకి రూ. 5 కోట్లు ఇచ్చి కొనటం ఒప్పు- అన్నది మీ అభిప్రాయమా?


 10. 2008 అక్టోబరు 18నే తెలంగాణను విడగొట్టండి అని మీ పార్టీలో ఉన్న ఆంధ్రా నాయకులు, రాయలసీమ నాయకులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, ఆ తీర్మానాన్ని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పంపటం నిజం అవునా? కాదా?

 11. టిఆర్‌ఎస్ కంటే ముందే ఏపీని విడగొట్టండని తీర్మానం చేసి పంపింది మీ పార్టీ అవునా? కాదా?

 12. 2009లో మీరు, కేసిఆర్ ఒకరి కండువాలు ఒకరిమీద కప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకుని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసింది నిజం అవునా? కాదా? అప్పుడు మీరు టిఆర్‌ఎస్‌కు ఎన్ని మూటలు సమర్పించుకున్నారో చెప్పే ధైర్యం మీకుందా?

 13. 2008 మొదలు ప్రతి మహానాడులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టండి అని మీరు తీర్మానాలు చేశారా? లేదా?

 14. వైయస్‌ఆర్ మరణం తర్వాత కేసిఆర్ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా రోశయ్య పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ఏపీని విడగొట్టండని టిఆర్‌ఎస్‌కు మద్దతు పలికింది మీరు అవునా? కాదా?

 15. రాష్ట్ర విభజనకు పార్లమెంటులో మొదటి ఓటు వేసింది మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అవునా? కాదా?

 16. ఏపీ సీఎం అయిన తర్వాత కూడా మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో మీ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పటం నిజం కాదా?

 17. తెలంగాణ వాదులకు కోపం రాకుండా పోలవరం ప్రాజెక్టును కట్టకుండా ఆపటంలో,  కేవలం లిఫ్ట్‌లతో సరిపెట్టండి అన్న తెలంగాణ వాదుల డిమాండ్‌ను పట్టిసీమ పేరిట అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక కుట్ర దాగి ఉండటం నిజం కాదా?

 18. రేవంత్‌రెడ్డి మోసిన మూటలు పట్టిసీమ నుంచి మీరు కొట్టిన వందల కోట్ల సొమ్ము నుంచి బయటకు తీసినవి అవునా? కాదా?

 19. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండా కేసిఆర్ ప్రారంభించినా ఈరోజుకు కూడా మీరు కనీసం ఉత్తరం ముక్క కూడా రాయకపోవడం నిజం కాదా?

 20. దొంగల్లా దొరికి కూడా దబాయిస్తున్నారంటే- రాజీ కుదుర్చుకున్నారన్నది స్పష్టం కాదా?

 21. నీ దొంగతనానికి, ఏపీ ప్రజలకు సంబంధం ఏమిటో చెప్పగలవా?

 22. స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్ గారు ఉత్తరం రాశారని అంటున్నావు. ఇలాంటి ఆరోపణ చేయటానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఆ లేఖను బయటపెట్టగలవా?

 23. మేము ఎమ్మెల్యేని ధారాదత్తం చేయలేదు. నువ్వే తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్‌కు ధారాదత్తం చేసింది నిజం అవునా? కాదా?

18 June 2015

వ్యవస్థ కు అవస్థలు

ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు..దీన్ని పూర్తిగా పక్క దారి పట్టించే యత్నంలో ఉన్నారు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా, ఆంద్రజాతికి సంబంధించిన అంశంగా మార్చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ లతో పనులు చేయిస్తూ మాస్టర్ గేమ్ ఆడుతున్నారు. తాజాగా ఢిల్లీ లో ఫిర్యాదులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పేరిట దాఖలు కావటం కూడా ఈ మైండ్‌గేమ్ లో భాగమే. అంతిమంగా చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని పరిహాసం చేస్తున్నారు. 

 అన్ని దారుల్లో విఫలం
 ఓటుకి కోట్లు కుంభకోణంలో ఇరుక్కొన్న దగ్గర నుంచి తప్పించుకొనేందుకు చంద్రబాబు రక రకా మార్గాలు అనుసరించారు. ఢిల్లీ వె ళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని వరుసగా కలిసి వచ్చారు. కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం లేకపోయింది. ఇందులో జోక్యం చేసుకొనేది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. గవర్నర్ ను బ్లాక్ మెయిల్ చేయాలని తీవ్రంగా యత్నించారు. ఆయన మీద ఎల్లో మీడియాలో వరుసగా కథనాలు రాయించారు. అయినా గవర్నర్ తన దారిలోకి రాలేదు. ఎన్నికల సంఘం పరిధిలోనిదంటూ ముందు వాదనలు వినిపించారు. కానీ, ఎన్నికల సంఘం కూడా నేరమయ విషయాలలో జోక్యానికి నిరాకరించింది. దీంతో పాటు దర్యాప్తును పూర్తిగా చేయించాలని ఏసీబీ కి స్పష్టం చేసింది. దీంతో అన్ని దారులు మూసుకొని పోయినట్లయింది.

 రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం
 ఈ పరిస్థితుల్లో కుంభకోణాన్ని మొత్తం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మార్చేసారు. ఇందుకు అనుగుణంగా ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలా బయట పడాలి అనే దానిపై సీనియర్ ఉన్నతాధికారుల్ని పిలిపించి వ్యూహ రచన చేస్తున్నారు. ముందుగానే పచ్చ మీడియాలో పోలీసు ఉన్నతాధికారుల్ని మారుస్తున్నామంటూ కథనాలు రాయించారు. సీటు కాపాడుకోవాలంటే చంద్రబాబు చెప్పినట్లే వినాలన్న మాట అనే మైండ్ సెట్ లోకి  ఉన్నతాధికారులు వెళ్లేట్లుగా బ్లాక్ మెయిల్ చేసి పెట్టారు. అంటే ఒక నేరంలో ప్రధాన సూత్రధారి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కి ... నేరంలోంచి ఎలా బయట పడాలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, ఐఎఎస్ అధికారులు సలహాలు ఇవ్వాలన్న మాట. ఈ విధంగా వ్యవస్థను తన గుప్పిట్లోకి లాక్కొని చంద్రబాబు మాస్టర్ గేమ్ కు ప్రాణం పోశారు.

 గవర్నర్ తో దోబూచులాట
 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు గాలికి వదిలేసిన చంద్రబాబు కి కంట్లోకునుకు లేకుండా పోయింది. ఈ కేసులో ఆరోపణలు మొదలవగానే దాని నుంచి బయట పడేందుకు మీటింగ్ ల మీద మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. కేసు నుంచి బయట పడటం ఎలా అనే ఒకే ఒక్క పాయింట్ ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థల్ని పని చేయిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన చంద్రబాబు.. తర్వాత రాజ్ భవన్ కు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో గవర్నర్ సలహాదారుల్ని పిలిపించుకొని మీటింగ్ పెట్టేశారు. ఉన్నతస్థాయిలోని సంప్రదాయాల్ని గాలికి వదిలేసి  ఈ కేసు విషయంలో సహాయం పొందేందుకు ప్రయత్నించారు. అక్కడ పని జరగక పోవటంతో ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద దిక్కుగా పిలుచుకొనే ప్రధాన కార్యదర్శి, పోలీసు డీజీపీలను ఉపయోగించుకోవటం మొదలెట్టారు. రాజ్ భవన్ కు వెళ్లి విభిన్న అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు మాట్లాడి వచ్చారు. ఈ ఎపిసోడ్ చుట్టూ కథ నడుస్తుండగానే ఈ సమావేశం జరగటం కీలకం.

 ఢిల్లీకి ప్రధాన కార్యదర్శి
 ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే పంపించారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర టెలికాం కమిషన్ ఛైర్మన్ రాకేష్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఫిర్యాదు చేసి వచ్చారు. అటు కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కృష్ణారావు కలిశారు. ట్యాపింగ్ విషయంలో ఫిర్యాదే ఇక్కడ కూడా ప్రధాన అజెండా గా నిలిచిందని సమాచారం. అంటే చంద్రబాబు చేసిన తప్పుకి, కుట్రకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్దానికి  దిగిందన్న మాట.

 మొత్తం మీద ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని చెప్పు చేతల్లోకి తీసుకొని చంద్రబాబు మైండ్‌గేమ్ ను వేగవంతం చేశారు. పరిపాలనను, ప్రజల పట్ల బాధ్యతను తాను ఎలాగైతే గాలికి వదిలేశారో, అదే విధంగా ఉన్నత స్థాయి యంత్రాంగం గాలికి వదిలేసి, తన కళంకాన్ని మోయాలని చంద్రబాబు భావిస్తున్నారు అవినీతి ఊబిలో పూర్తిగా కూరుకొని పోయి, ఆ కళంకాన్ని ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. 

17 June 2015

బాబు తప్పుకొంటే మేలు..!

ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు
 హైదరాబాద్: ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్ర ధారిగా నిలిచిన చంద్రబాబు ఎత్తుగడలు అంతకంతకూ మారుతున్నాయి. కేసుని పక్కదారి పట్టించి ఎలాగైనా ఈ గండం నుంచి బయట పడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విద్వేషాగ్నిలో ప్రజలు నష్టపోయినా ఫర్వాలేదు కానీ, తాను మాత్రం లబ్ది పొందాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. చివరకు రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా తూలనాడుతుండటాన్ని ప్రజాస్వామిక వాదులు తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పు ఒప్పుకొని పదవి నుంచి తప్పుకొంటే మంచిదని, న్యాయ వ్యవస్థ ను గౌరవించాలని సూచిస్తున్నారు. మరి, ఈ మంచి మాటలు చంద్రబాబు చెవికి ఎక్కుతాయా..!
 తప్పు చంద్రబాబుది..!
 ఈ కుట్ర అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విషయం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని తన పార్టీ ఎమ్మెల్యే చేత కొనిపిస్తూ ఆయన దొరికిపోయాడు. కేసు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందినది. అటువంటప్పుడు ఆ కేసును వ్యక్తిగతంగా కానీ, పార్టీ అధ్యక్షుని హోదాలో కానీ ఎదుర్కోవాలి. కానీ దీన్ని పూర్తిగా ఆంద్రప్రదేశ్ ్రపభుత్వ వ్యవహారంగా, ఇంకా చెప్పాలంటే యావత్ ఆంధ్రుల పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మార్చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వీలుగా మంత్రులతో రెచ్చగొట్టే ప్రకటనలు చేయించటం, పచ్చ మీడియాలో రాయించటం చేస్తున్నారు.
 రాజ్యాంగ వ్యవస్థల మీద బురద జల్లుడు..!
 రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థల మీద అదేపనిగా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటుకి నోటు కుంభ కోణంలో పూర్తిగా ఇరుక్కొని పోయిన చంద్రబాబు నాయుడు.. ఈ విషయం లో కేంద్రం తనకు సహకరిస్తుందని, కేంద్రం సాయంతో దీని నుంచి బయట పడవచ్చని భావించారు. కానీ అటు నుంచి ఏ సాయం రాకపోవటంతో గవర్నర్ నరసింహన్ ను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఆటలు కూడా సాగక పోవటంతో వెంటనే పచ్చ దండును ఉసికొల్పారు. మంత్రులు, ఇతర నాయకులతో గవర్నర్ ను తిట్టించే వ్యూహం ప్రారంభించారు. ఒక వేళ కేసులు కానీ ముందుకు వచ్చినట్లయితే గవర్నర్ ను, ప్రతిపక్షాల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకే గాటన కట్టి విద్వేషాలు రగిల్చేందుకు కుట్రకు శ్రీకారం చుట్టారు.
 ఉన్నతాధికారుల్ని చెప్పు చేతల్లోకి తీసుకొనే యత్నం..!
 భయపెట్టడం, బెదిరించటం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. అదే విద్యను ఇక్కడ ఉపయోగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల స్థానాల్లో మార్పులు చేస్తామంటూ ముందస్తుగా ఎల్లో మీడియాలో వార్తలు రాయించారు. తర్వాత వారిని పిలిపించుకొని తన వ్యక్తిగత విషయం లేదా పార్టీ కి సంబంధించిన విషయాన్ని ప్రభుత్వ అంశంగా మార్చేసే కుట్రను అమలు చేశారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ ఉచ్చు లో పడిపోయారు. దీంతో దీన్ని  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మార్చేసే కుట్ర ను అమలు చేశారు.
 రాజ్యాంగ వ్యవస్థలపై కుట్రా..!
 ఒక వైపు గవర్నర్‌వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయటం, ఇటు ఉన్నతాధికారుల్ని చెప్పు చేతల్లోకి తీసుకొని ఆడించటం వంటి చర్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విధంగా ఒక కేసులో ప్రధాన సూత్రధారిగా నిలిచిన వ్యక్తి, పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించుకొని కేసు నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషించటాన్ని ప్రజాస్వామిక వాదులు తప్పు పడుతున్నారు. పనిలో పనిగా ఎదుటి ముఖ్యమంత్రి, లేక ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేసుల్ని తిరగదోడిస్తున్నట్లుగా బహిరంగంగా మంత్రులే చెప్పడాన్ని ఉదహరిస్తున్నారు. అంటే కేసుల దర్యాప్తు చట్ట  పరిధిలో జరగదని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సాగుతుందని చెప్పక నే చెప్పినట్లయింది. నాకు పోలీసు ఉంది, నాకు ఏసీబీ ఉంది అని పదే పదే చంద్రబాబు చెప్పడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
 హితోక్తులు వింటారా..!
 రాజ్యాంగ వ్యవస్థల్ని ఇంత బహిరంగంగా అపహాస్యం చేసిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుల్ని ఒప్పుకోవాలని ప్రజాస్వామ్య వాదులు సూచిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించి పదవిలోంచి తప్పుకోవటం మేలని చెబుతున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకొని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అఘాతం సృష్టించటం తగదని సూచిస్తున్నారు. మరి, ఈ హితోక్తులు చంద్రబాబు చెవికి ఎక్కుతాయా..!

ఈ ప్రశ్నలకు బదులివ్వు బాబూ..!

ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు అధికారాలను, సర్వశక్తులను ఒడ్డుతున్నారు. అయితే చంద్రబాబు గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ కొన్ని మౌలికమైన అంశాలను మరచిపోతున్నారు. ఎలాగైనా ఈ కేసునుంచి బయటపడడం కోసం మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతున్నారు. చంద్రబాబుకు గానీ తెలుగుదేశం నాయకులకు గానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రశ్నలకు బదులివ్వాలి...

  •  స్టీఫెన్‌సన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పటం లేదు? దీనికి బదులివ్వకుండా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఎందుకు సమస్యని పక్కదోవ పట్టిస్తున్నారు? ముందు తేలాల్సింది ఏమిటి? ఇది చూస్తుంటే కన్నంలో దొరికిపోయిన దొంగ తనను పట్టుకున్న పోలీసును ఐడీకార్డు అడిగినట్లుగా లేదూ..?
  •  చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా రెండు పదవులు వెలగబెడుతున్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడారు. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌కుగానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికిగానీ సంబంధం లేని అంశం.  అటువంటప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఎలా అడ్డుపెట్టుకుంటున్నారు?
  •  ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీతోపాటు మొత్తం సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లను మీ కుంభకోణం వ్యవహారంలో ఎందుకు ఇన్‌వాల్వ్ చేస్తున్నారు? 
  •  అధికారులంతా  పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. రాజ్యాంగం తెలిసినవాళ్ళు. చట్టం తెలిసినవాళ్ళు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా తన రెండు కళ్ళ సిద్ధాంతంలో ఒక కన్ను తెలంగాణాకు పార్టీ అధ్యక్షుడిగా చేయించిన నేరానికి వీరంతా ఏ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతున్నారు?
  •  ఓటుకు కోట్లు అంశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీకి ఏం సంబంధం? చంద్రబాబు ఓటుకు కోట్లు స్కాంలో మీరంతా ఎందుకు ఇన్‌వాల్వ్ అవుతున్నారు?
  •  భారతదేశంలో సింగల్ సిటిజెన్‌షిప్ ఉందా.. లేక తెలంగాణ ప్రభుత్వం సిటిజెన్‌షిప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిటిజెన్‌షిప్ అనేవి ఉన్నాయా..?
  •  చంద్రబాబు నాయుడు నేరం తెలంగాణాలో చేశారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కోసం చేశారు. తెలంగాణాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవటం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్ముతో ఇదంతా చేశారు. ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇష్యూగా చూపించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
  •  చంద్రబాబు చేసిన నేరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారసులా? ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులకు లోకేష్ వారసుడా.?
  •  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని మంత్రులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు దొరికిపోయి, చంద్రబాబు మీద చర్యలు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు భయాందోళనలకు గురౌతారు?
  •  స్వయంగా చంద్రబాబు ఈ నేరంలో పాల్గొన్నారు. ఆయన నేరం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సంబంధం? దీనిని రాష్ట్రాల మధ్య గొడవగా చూపించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దీనిని తెలుగు ప్రజలు ఆమోదిస్తారని అనుకుంటున్నారా?
  •  రేవంత్‌రెడ్డి ఎవరి తరఫున, ఎవరి డబ్బుతో, ఎవరి కోసం ఈ పని చేశాడు? స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నాయుడు సంభాషణ చూస్తే బాబే ఈ పని చేయించాడని 100కు 100 శాతం రూఢి అయింది. అయినా  చంద్రబాబు నాయుడు సీఎం పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు?
  •  రేవంత్ డబ్బు వ్యవహారానికి, తనకు ఏ సంబంధమూ లేదని చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు. ఆయన ఆర్గ్యుమెంట్ అంతా... నా ఫోన్‌నే ట్యాప్ చేస్తారా? వేరే రాష్ట్రం ఏసీబీ, వేరే రాష్ట్రం పోలీసుకు తన మీద విచారణ చేసే హక్కుందా... నేనూ సీఎంనే, నాకూ హైదరాబాద్‌లో 10 ఏళ్ళు ఉండే హక్కుంది... నాకూ ఏసీబీ ఉంది,,, నాకూ పోలీసులున్నారు...  నా రాష్ట్రంలో దొంగ కేసులు పెట్టిస్తా...  అనే గగ్గోలు చేస్తున్నారు.. ఈ వాదన చెల్లుతుందా?
  •  చంద్రబాబు నాయుడు నిజంగా నీతిమంతుడే అయితే ఏ విచారణకు అయినా తాను సిద్ధం అని ప్రకటించాలి. కోర్టులకు వెళ్ళి విచారణను నిలుపు చేసేందుకు ప్రయత్నించకూడదు. ఇందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారా?
  •  భారత దేశంలో ఏ పొలిటీషియన్ కూడా ఇంత అడ్డంగా, రెడ్ హ్యాండెడ్‌గా చట్టానికి దొరికి పోయి కూడా... జాతీయ మీడియాలో తాను ఒక టాపిక్ కాకుండా మేనేజ్ చేసుకోలేడు. ఏ రాజకీయ వేత్త కూడా ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికి కూడా పదవిలో కొనసాగలేడు. చంద్రబాబు నాయుడు ఒక్క మీడియానే కాదు... ప్రతి వ్యవస్థనూ మేనేజ్ చేయటానికి 20 ఏళ్ళుగా అలవాటు పడ్డాడు కాబట్టే దొరికి కూడా బెదిరిస్తున్నాడని అనుకోవచ్చా?
  •  ఎన్నికలు ముగిసీ ముగియగానే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలను, జెడ్పీటీసీలూ ఎంపీటీసీలనూ కొన్న చంద్రబాబు... ఇప్పుడు సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చాడు.గత ఎన్నికల సభల్లో ప్రధాని మోడీగారు ఒక మాట అడిగారు. మీకు సీమాంధ్ర కావాలా? స్కామాంధ్ర కావాలా? అని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్కామాంధ్రను ఇచ్చాడన్నది నిజం కాదా?

 సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు. ఆయన అరెస్టుకు అతీతుడు కాడు. అడ్డంగా దొరికిన ఈ దొంగల ముఠా నాయకుడిని తక్షణం సీఎం పదవినుంచి దింపాలి. ఏపీలో దోపిడీ రాజ్‌కు ముగింపు పలకాలి. చంద్రబాబు నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 

16 June 2015

పరిపాలన గాలికి..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నారు. సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు.. తనను తాను బయట పడేందుకు మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్ని, ఇతర అధికారుల్ని పిలిచి వ్యూహ రచన చేస్తున్నారు. మంత్రులు, ఇతర సీనియర్ ఉన్నతాధికారులు సైతం ఇప్పుడు ఇదే పనిలో పడ్డారు. ఇవ న్నీ సరే, ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటి..!ప్రజల కష్ట నష్టాల్ని పట్టించుకొనేది ఎవరు..!

 చంద్రబాబే అసలు దొంగ..!
 ఓటుకి కోట్లు కుంభకోణంలో చంద్రబాబు  అసలు సూత్రధారి అని లోకమంతా చెబుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వచూపుతూ దొరికి పోయినప్పటి నుంచి పలువురు ప్రముఖులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. చంద్రబాబు మాట్లాడారంటూ ఆడియో టేపులు విడుదల అయ్యాక అందరి వైఖరిలోనూ స్పష్టత వచ్చేసింది. రేవంత్ రెడ్డి ని తాను పంపించలేదని కానీ, బేరసారాలు తాను జరపలేదని కానీ చెప్పకుండా చంద్రబాబు ముందుకు వెళ్లడం గమనించాల్సిన విషయం. మొత్తం మీద ఈ కుంభకోణం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఈ కుంభకోణానికి సూత్రధారిగా నిలిచారు... ఈ వ్యవహారాన్ని ఆయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం నడిపించారని అర్థం అవుతోంది.

 తెలుగుదేశం అధ్యక్షుడిగా పాత్ర
 న్యాయ శాస్త్ర లెక్కల ప్రకారం నేరం చేసినప్పుడు సద రు నిందితుడి ఉద్దేశ్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కావాలి. తెలంగాణ లో పార్టీ ప్రయోజనాల కోసం ఆయన ఈ కుంభకోణాన్ని నడిపించారనే మాట వినిపిస్తోంది. అటువంటప్పుడు ఈ కేసులో ఎలా వ్యవహరించాలి లేదా ఈ కేసునుంచి ఎలా బయట పడాలన్నది చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత వ్యవహారం. అంతేకానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అంశం కానే కాదు.

 చంద్రబాబు వ్యవహార శైలి
 తెలుగుదేశం అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు మాత్రం ఈ కేసును ప్రభుత్వం వ్యవహారంగా మార్చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. పదే పదే తాను ముఖ్యమంత్రిని, తాను ముఖ్యమంత్రిని అని చెప్పుకొని వస్తున్నారు. నా దగ్గర పోలీస్ ఉంది, నా దగ్గర ఏసీబీ ఉంది అని ప్రకటిస్తున్నారు. అంతే కాకుండా ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించుకొని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏ విధంగా స్పందించాలి, ఏ రకంగా బయట పడాలి అనే దానిపై చర్చలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను కుంభకోణంలో ఇరుక్కొంటే, దాని మీద పరిష్కారాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగిస్తున్నారు.

 మంత్రులు, ఉన్నతాధికారులు అదే బాటలో..!
 ఇప్పుడు మంత్రులు, ఉన్నతాధికారులు చంద్రబాబు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చంద్రబాబుతో సమావేశాలన్నీ ఈ కుంభకోణం నుంచి ఎలా బయట పడాలి అనే దానిమీదనే జరుగుతున్నాయి. రక రకాల సమాచారాలు తెప్పిస్తున్నారు, రక రకాల విశ్లేషణలు అందిస్తున్నారు. ఇక్కడ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పనుల్లో ఉంటే ఇతర రకాల పరిపాలన విభాగాల్ని గాలికి వదిలేశారు. దీంతో ఇతర రకాల వ్యవహారాలన్నీ మూలన పడ్డాయి.

 రైతుల పరిస్థితి ఇరకాటంలో..!
  ఒకవైపు  ఖరీఫ్ ముంచుకొని వస్తోంది. రైతులకు విత్తనాలు దొరకటం లేదు. ఖరీఫ్ కు ముందు సన్నాహక సమావేశాలు నిర్వహించటం ఆనవాయితీ. వ్యవసాయ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. విత్తనాలు, సబ్సిడీలు, ఎరువుల సరఫరా, ఇతర రకాల అవసరాల్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులకు అప్పులు ఇవ్వాల్సిన బ్యాంకర్లను సమాయత్త పరచటం జరగుతూ ఉంటుంది. అప్పుడే రైతులు సజావుగా ఖరీఫ్ కు సిద్ద పడగలుగుతారు.

 వ్యవసాయ మంత్రి దృష్టంతా అటు వైపే..!
 ఇక్కడ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి చెప్పుకోవాలి. ఏ ముహుర్తాన గుంటూరు జిల్లాలో రాజధాని ప్రకటించారో కానీ, అప్పటి నుంచి మంత్రి పుల్లారావు పూర్తిగా రాజధాని మంత్రిగా మారిపోయారు. అక్కడ రైతుల నుంచి భూములు ఎలా లాక్కోవాలి, ఏ విధంగా వ్యవసాయాన్ని నాశనం చేయాలి అనే దానిమీదనే దృష్టిని కేంద్రీకరించారు. అన్ని రకాలుగా రైతుల్ని భయపెట్టి, ఆందోళనకు గురి చేసి భూములు లాక్కొనేందుకు ప్రయత్నించారు. వ్యవసాయ మంత్రి దృష్టి పూర్తిగా భూముల అక్రమణ మీద ఉండటంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా అదే బాటలో నడిచారు. వ్యవసాయాన్ని , రైతుల్ని అలాగే గాలికి వదిలేశారు. ఒక వైపు రుణమాఫీ జరగక, బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు అల్లాడిపోతున్నారు. విత్తనాలు అందక ఆందోళన చెందుతున్నారు. వీరికి తక్షణ పరిష్కారం చూపేందుకు కూడా రైతులు సిద్దంగా లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

 మొత్తం యంత్రాంగం కుంభకోణం చుట్టూనే..!
 ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కుంభకోణం వైపే మోహరించి ఉంది. ఓటుకి కోట్లు కుంభకోణాన్ని పూర్తిగా ప్రభుత్వ పరమైన అంశంగా మార్చేశారు. రైతుల గురించి ఆలోచించాల్సిన వ్యవసాయ మంత్రి ఎంతసేపూ చంద్రబాబును కేసు నుంచి కాపాడటం మీద దృష్టి పెడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలు తె రిచే సమయం అయినప్పటికీ విద్యా మంత్రి ఆ విషయాలు పట్టించుకోరు. ఈ కుంభకోణాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. హోమ్ శాఖ పూర్తిగా కుంభకోణం అంశంలో మునిగిపోయింది. న్యాయ నిపుణుల్ని రప్పించి పథక రచన చేస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం ముగుస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలకు అందించాల్సిన వనరుల గురించి ఆర్థిక మంత్రి చూసుకోవాలి.  ఆ పనిని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి కేసు గురించి ప్రకటనలు ఇస్తూ గడిపేస్తున్నారని విమర్శ వినిపిస్తోంది. ఇక కార్మిక శాఖ మంత్రి అయితే ఇదే అదనుగా ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేసేందుకు పడిగాపులు కాస్తున్నారని సమాచారం.
  మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడి సొంత వ్యవహారంలో కూరుకొని పోవటంతో ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది. దీంతో ప్రజల కష్టాలు, నష్టాలు పట్టించుకొనే నాథుడు కరవయ్యాడు.