23 June 2015

ఏపీలో ఏసీబీ ని మూసేస్తారా..!

ఆంధ్రప్రదేశ్ లోని పోలీసు ఉన్నతాధికారులు అంతర్మథనంలో పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర పోలీసు విభాగానికి మచ్చ ను తెచ్చిపెడుతున్నాయి. చంద్రబాబు వ్యక్తిగతంగా చేసిన తప్పుల్ని పోలీసు ఉన్నతాధికారులు భుజాల మీద మోయాల్ని రావటాన్ని పోలీసు పెద్దలు తప్పు పడుతున్నారు. 

 ముందు నుంచి మంచి పేరు
 ఆంధ్రప్రదేశ్ లో పోలీసు విభాగానికి గతంలో మంచి పేరు ఉండేది. చంద్రబాబు పాలించిన తొమ్మిదేళ్లలోనూ భ్రష్టు పట్టించ టానికి ప్రయత్నించారు. తర్వాత దివంగత మహా నేత వైఎస్‌రాజశేఖర్ రెడ్డి పాలనలో పోలీసు అధికారులకు శాంతిభద్రతలకు సంబంధించి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో తీవ్రవాదం, అల్లర్లు బాగా తగ్గిపోయాయి. పోలీసుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడంతో పోలీసు కుటుంబాల్లో రాజన్న పట్ల అభిమానం పాతుకొని పోయింది. తర్వాత ప్రభుత్వాల సమయంలో ఉద్యమాలు   ఊపందుకొన్నప్పుడు రాష్ట్ర పోలీసుల మీద బృహత్తర బాధ్యత పడింది. వివాదాలకు తావు లేకుండా పోలీసు విభాగం చాలా వరకు నెగ్గుకొని రాగలిగింది.
 చంద్రబాబు పాలనతోనే అవస్థలు 
 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం లోకి రాగానే పోలీసు వ్యవస్థను నిస్సిగ్గుగా భ్రష్టు పట్టించటం మొదలెట్టారు. ఎన్నికల ఫలితాలు విడుదలై, ప్రభుత్వం కొలువు దీరకుండానే ప్రతిపక్ష పార్టీ నాయకుల పై దాడులు మొదలైపోయాయి. పోలీసుల్ని నిస్సహాయుల్ని చేసి తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. తర్వాత జిల్లాల ఎస్పీలు, ఐజీలను ఇష్టం వచ్చినట్లు మార్చేసి పచ్చ మార్కు పోలీసింగ్ ఏర్పాటు చేశారు. దీంతో తెలుగుదేశం గూండాలకు పోలీసులే కొమ్ము కాయటం మొదలైంది. అనంతపురం జిల్లా వంటి చోట్ల పోలీసులే పచ్చ గూండాలతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతల హత్యాకాండలో పాలుపంచుకొంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అడపా దడపా పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తే చాలు, వెంటనే స్థానిక తెలుగుదేశం నాయకుల నుంచి ఫోన్ రావటం, విడిపించుకొని వె ళ్లటం కామన్ గా మారింది. జన్మభూమి కమిటీల పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలన్నీ తెలుగుదేశం నాయకులతో నిండిపోయాయి. పోలీసు అధికారుల బదలీలు, బందోబస్తు ఏర్పాట్లు, సిఫార్సులు..అన్నింటా ఈ నాయకులు చేరిపోయి అరాచకానికి నిదర్శనంగా నిలిచారు.
 ఓటుకి కోట్లు కుంభకోణం
 ఓటుకి కోట్లు కుంభకోణం విషయం బయటకు పొక్కగానే చంద్రబాబు నాయుడు చేసిన పని పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించి మంతనాలు ఆడటం. ఆరోజు నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు, సమీక్షలు జరిగిపోతున్నాయి. ఈ కుంభకోణం నుంచి చంద్రబాబును బయటకు లాగటం ఎలా అన్న దాని మీద చర్చోపచర్చలు సాగాయి.. సాగుతూనే ఉన్నాయి. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీప్, ఏసీబీ అధిపతి, ఇతర సీనియర్‌ఉన్నతాధికారులు సీఎం చుట్టూ తిరుగుతున్నారు.
 సూత్రధారులకు శిక్షణ ఇవ్వాల్సి రావటం
 ఇక్కడ కోట్ల రూపాయిల కుంభకోణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు. ఆయన స్వయంగా చేసిన కుంభకోణం అని అందరికీ అర్థం అవుతోంది. అది కూడా తన పార్టీని పక్క రాష్ట్రమైన తెలంగాణలో అధికార ంలోకి తెచ్చుకొనేందుకు చేసుకొన్న కుట్ర. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. అయినా సరే, చంద్రబాబు ఈ కేసు విషయంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి ఉన్నతాధికారులు హాజరవటం తప్పనిసరి చేశారు. అంటే ఇటువంటి కేసుల్లో ఏసీబీ అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు.. ఎటువంటి చర్యలు తీసుకొంటారు..వంటి వివరాల్ని ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడికి వివరించి చెబుతుంటే కేసుల నుంచి బయట పడే మార్గాల్ని ఆయన ఆలోచించుకొంటారన్న మాట. దీన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చి చూసుకొంటున్నా కానీ, లోపల జరిగేది మాత్రం ఇదే అన్న సంగతి అందరికీ అర్థం అవుతుంది.
 మత్తయ్యకు రాచమర్యాదలు
 ఈ కుంభకోణంలో సహ నిందితుడిగా మత్తయ్య పేరు నలుగుతోంది. అసలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను మొద ట కలిసింది మత్తయ్యే అని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు కాగానే తెలుగు తమ్ముళ్లుమత్తయ్యను రాష్ట్రం దాటించేశారు. అప్పటి నుంచి అతడ్ని రాచమర్యాదలతో పోషించటం పోలీసుల పనిగా మారింది. ఒక భారీ కుంభకోణంలో నిందితుడిగా అతడి కోసం ఒక వైపు పోలీసులు వెదకుతుంటే, అతడు దొరక్కుండా రహస్య స్థలంలో కాపలా  కాయాల్సి రావటం ఏపీపోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పైకి మాత్రం మత్తయ్య ఆచూకీ తమకు తెలీదని చెబుతున్నా కానీ, విజయవాడ లో పోలీసు స్టేషన్ కు వచ్చి తెలంగాణ ప్రభుత్వ పెద్దల మీద ఫిర్యాదు ఇస్తే తీసుకొని మర్యాదగానే సాగనంపారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులే మత్తయ్యను కాపాడుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
 ఎమ్మెల్యే సండ్రకు సైతం..!
 ఈ కేసులో నోటీసులు అందుకొన్న తెలుగుదేశం నాయకుడు వేం నరేందర్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విచారణ పూర్తయ్యాక తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన పెరిగిపోయింది. దీంతో ఆరోగ్య కారణాలు సాకుగా చూపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆంధ్రప్రదేశ్ కు జారుకొన్నారు. అక్కడ అనేక నగరాల్లో పోలీసులే రాచ మర్యాదలతో ఆయన్ని పోషిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ, కొందరు పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆయనకు శిక్షణ ఇస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏసీబీ అధికారులు ఏ రకంగా ప్రశ్నిస్తారు, దానికి ఎలా జవాబులు చెప్పాలి, లేదంటే ఏ రకంగా తప్పించుకోవాలి అనేది ఇక్కడ పోలీసు అధికారులు శిక్షణ ఇస్తారన్న మాట. కుంభకోణంలో ఇరుక్కొన్న వారికి తప్పించుకొనే మార్గాలపై శిక్షణ  ఇవ్వాల్సి రావటంపై పోలీసు అధికారులు తమ లో తాము మనస్తాపం చెందుతున్నారు.
 దేశ వ్యాప్తంగా ప్రచారం
 ఈ మొత్తం ఎపిసోడ్ దేశ వ్యాప్తంగా ప్రచారం పొందుతోంది. అందునా ఒక రాష్ట్రంలో పోలీసులు వెదకుతున్న వ్యక్తులకు ..మరో రాష్ట్రంలోని పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరగట ంపై పోలీసు పెద్దలు ఆవేదన చెందుతున్నారు. పోలీసుల్ని వాడుకోవటం గతంలోనూ ఉన్నప్పటికీ, ఈ విధంగా మొత్తం పోలీసు వ్యవస్థను సొంత ప్రయోజనాల కోసం పణంగా పెట్టడం ఎప్పుడూ జరగలేదని వాపోతున్నారు. పోలీసు వ్యవస్థ పరువు తీసేసి, సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
 ఏసీబీ సంగతి ఏమిటి..!
 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధక విభాగం పరిస్థితి ఏమిటనే మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని చిన్న ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా అవినీతి కి పాల్పడితే పట్టుకోవాల్సిన బాధ్యత ఏసీబీదే. అందుకే ఏసీబీ కేసు కడితే ఉద్యోగులు కంగారు పడతారు. అంతే కాదు, ఆయా ప్రభుత్వ శాఖలు లేదా విభాగాల్లో ఏసీబీ కేసు నమోదు అయితే వెంటనే ఆయా ఉద్యోగిని విధుల్లోంచి తొలగిస్తారు. ఆ తర్వాత కేసు తేలే దాకా విధులకు దూరంగా ఉంచుతారు.
  ఇప్పుడు ఈ ఏసీబీ పనితీరు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు తెలంగాణ ఏసీబీ పెట్టిన కేసులో నిందితుడుకి పోలీసు శాఖ రక్షణ కవచంలా నిలుస్తోందన్న మాట వినిపిస్తోంది. స్వయంగా పోలీసులే రక్షణ కల్పిస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. అటువంటప్పుడు చిరుద్యోగుల్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నె ట్టడం ఎంత వరకు నైతికంగా కరెక్టు అన్న మాట వినిపిస్తోంది. పైగా తెలంగాణ ఏసీబీ నోటీసులు అందుకొన్న సండ్ర వెంకట వీరయ్య కు కొందరు పోలీసు అధికారులు కోచింగు ఇస్తున్నార న్న మాట ఉంది. అటువంటప్పుడు మరో అవినీతి అంశం బయట పడితే ఏసీబీ అధికారులు ఇతరుల్ని నోటీసు ఇచ్చి పిలిపిస్తారా లేదా అన్న మాట ఉంది. లేదంటే ఆయా వ్యక్తులు కూడా బయట కోచింగ్ కోసం ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నలు లేవ నెత్తుతున్నారు.
  అన్నింటికి మించి కోట్ల రూపాయల కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు నాయుడుకు... ఈ వివాదం నుంచి బయట పడే మార్గాల కోసం సీనియర్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని అవినీతి బాగోతాల్ని ఏ రకంగా వెలికి తీయగలుగుతారన్న మాట వినిపిస్తోంది. అటువంటి కేసుల్లోని సూత్రధారులు కూడా ఇదే విధంగా ట్యూషన్ లు కోరుకొంటే పరిస్థితి ఏమిటి..!
  మొత్తం మీద కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కార్యకలాపాలు ముందుకు వెళతాయా లేక మందగించిపోతున్నాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అటువంటప్పుడు ఏసీబీ వ్యవస్థ ఎంత వరకు నైతికంగా దర్యాప్తు సాగిస్తుంది. అంతకు మించి ఏసీబీ ఉన్నతాధికారుల మీద ఉంటే నైతికపరమైన ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇన్ని తలనొప్పులకు మూలం చంద్రబాబు కాదా..! ఆయన వ్యక్తిగత కక్ష కోసం మొత్తం వ్యవస్థ ను బలిపెట్టడం కాదా..

No comments:

Post a Comment