17 June 2015

ఈ ప్రశ్నలకు బదులివ్వు బాబూ..!

ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు అధికారాలను, సర్వశక్తులను ఒడ్డుతున్నారు. అయితే చంద్రబాబు గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ కొన్ని మౌలికమైన అంశాలను మరచిపోతున్నారు. ఎలాగైనా ఈ కేసునుంచి బయటపడడం కోసం మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతున్నారు. చంద్రబాబుకు గానీ తెలుగుదేశం నాయకులకు గానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రశ్నలకు బదులివ్వాలి...

  •  స్టీఫెన్‌సన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పటం లేదు? దీనికి బదులివ్వకుండా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఎందుకు సమస్యని పక్కదోవ పట్టిస్తున్నారు? ముందు తేలాల్సింది ఏమిటి? ఇది చూస్తుంటే కన్నంలో దొరికిపోయిన దొంగ తనను పట్టుకున్న పోలీసును ఐడీకార్డు అడిగినట్లుగా లేదూ..?
  •  చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా రెండు పదవులు వెలగబెడుతున్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడారు. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌కుగానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికిగానీ సంబంధం లేని అంశం.  అటువంటప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఎలా అడ్డుపెట్టుకుంటున్నారు?
  •  ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీతోపాటు మొత్తం సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లను మీ కుంభకోణం వ్యవహారంలో ఎందుకు ఇన్‌వాల్వ్ చేస్తున్నారు? 
  •  అధికారులంతా  పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. రాజ్యాంగం తెలిసినవాళ్ళు. చట్టం తెలిసినవాళ్ళు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా తన రెండు కళ్ళ సిద్ధాంతంలో ఒక కన్ను తెలంగాణాకు పార్టీ అధ్యక్షుడిగా చేయించిన నేరానికి వీరంతా ఏ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతున్నారు?
  •  ఓటుకు కోట్లు అంశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీకి ఏం సంబంధం? చంద్రబాబు ఓటుకు కోట్లు స్కాంలో మీరంతా ఎందుకు ఇన్‌వాల్వ్ అవుతున్నారు?
  •  భారతదేశంలో సింగల్ సిటిజెన్‌షిప్ ఉందా.. లేక తెలంగాణ ప్రభుత్వం సిటిజెన్‌షిప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిటిజెన్‌షిప్ అనేవి ఉన్నాయా..?
  •  చంద్రబాబు నాయుడు నేరం తెలంగాణాలో చేశారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కోసం చేశారు. తెలంగాణాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవటం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్ముతో ఇదంతా చేశారు. ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇష్యూగా చూపించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
  •  చంద్రబాబు చేసిన నేరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారసులా? ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులకు లోకేష్ వారసుడా.?
  •  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని మంత్రులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు దొరికిపోయి, చంద్రబాబు మీద చర్యలు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు భయాందోళనలకు గురౌతారు?
  •  స్వయంగా చంద్రబాబు ఈ నేరంలో పాల్గొన్నారు. ఆయన నేరం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సంబంధం? దీనిని రాష్ట్రాల మధ్య గొడవగా చూపించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దీనిని తెలుగు ప్రజలు ఆమోదిస్తారని అనుకుంటున్నారా?
  •  రేవంత్‌రెడ్డి ఎవరి తరఫున, ఎవరి డబ్బుతో, ఎవరి కోసం ఈ పని చేశాడు? స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నాయుడు సంభాషణ చూస్తే బాబే ఈ పని చేయించాడని 100కు 100 శాతం రూఢి అయింది. అయినా  చంద్రబాబు నాయుడు సీఎం పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు?
  •  రేవంత్ డబ్బు వ్యవహారానికి, తనకు ఏ సంబంధమూ లేదని చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు. ఆయన ఆర్గ్యుమెంట్ అంతా... నా ఫోన్‌నే ట్యాప్ చేస్తారా? వేరే రాష్ట్రం ఏసీబీ, వేరే రాష్ట్రం పోలీసుకు తన మీద విచారణ చేసే హక్కుందా... నేనూ సీఎంనే, నాకూ హైదరాబాద్‌లో 10 ఏళ్ళు ఉండే హక్కుంది... నాకూ ఏసీబీ ఉంది,,, నాకూ పోలీసులున్నారు...  నా రాష్ట్రంలో దొంగ కేసులు పెట్టిస్తా...  అనే గగ్గోలు చేస్తున్నారు.. ఈ వాదన చెల్లుతుందా?
  •  చంద్రబాబు నాయుడు నిజంగా నీతిమంతుడే అయితే ఏ విచారణకు అయినా తాను సిద్ధం అని ప్రకటించాలి. కోర్టులకు వెళ్ళి విచారణను నిలుపు చేసేందుకు ప్రయత్నించకూడదు. ఇందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారా?
  •  భారత దేశంలో ఏ పొలిటీషియన్ కూడా ఇంత అడ్డంగా, రెడ్ హ్యాండెడ్‌గా చట్టానికి దొరికి పోయి కూడా... జాతీయ మీడియాలో తాను ఒక టాపిక్ కాకుండా మేనేజ్ చేసుకోలేడు. ఏ రాజకీయ వేత్త కూడా ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికి కూడా పదవిలో కొనసాగలేడు. చంద్రబాబు నాయుడు ఒక్క మీడియానే కాదు... ప్రతి వ్యవస్థనూ మేనేజ్ చేయటానికి 20 ఏళ్ళుగా అలవాటు పడ్డాడు కాబట్టే దొరికి కూడా బెదిరిస్తున్నాడని అనుకోవచ్చా?
  •  ఎన్నికలు ముగిసీ ముగియగానే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలను, జెడ్పీటీసీలూ ఎంపీటీసీలనూ కొన్న చంద్రబాబు... ఇప్పుడు సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చాడు.గత ఎన్నికల సభల్లో ప్రధాని మోడీగారు ఒక మాట అడిగారు. మీకు సీమాంధ్ర కావాలా? స్కామాంధ్ర కావాలా? అని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్కామాంధ్రను ఇచ్చాడన్నది నిజం కాదా?

 సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు. ఆయన అరెస్టుకు అతీతుడు కాడు. అడ్డంగా దొరికిన ఈ దొంగల ముఠా నాయకుడిని తక్షణం సీఎం పదవినుంచి దింపాలి. ఏపీలో దోపిడీ రాజ్‌కు ముగింపు పలకాలి. చంద్రబాబు నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 

No comments:

Post a Comment