27 April 2015

భూదాహం తీరనిది!


 పేద రైతుల నుంచి బలవంతంగా సమీకరణ
 రాజధాని కోసం ఇప్పటికే 30వేల ఎకరాలు లాక్కున్నారు
 టూరిజం పేరుతో మరో 10వేల ఎకరాల సేకరణకు నిర్ణయం
 ఉద్యోగుల క్వార్టర్ల కోసం ఇంకా పూలింగ్..

 హైదరాబాద్ ః సామదానభేద దండోపాయాలతో రైతులను భయభ్రాంతులకు గురిచేసి రాజధాని పేరుతో 30 వేల ఎకరాలను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూ దాహం ఇంకా తీరినట్లు లేదు. టూరిజం అభివృద్ధి చేసే పేరుతో మరో 10 వేల ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో కృష్ణాజిల్లాలోని రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటి వరకు కృష్ణానదికి దక్షిణం వైపున గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. ఇపుడు టూరిజం అభివృద్ధి పేరుతో కృష్ణాజిల్లాలో కూడా భూములు సమీకరించడానికి సిద్ధమవుతోంది. కృష్ణానదికి ఉత్తరం వైపున పదివేల ఎకరాలను సేకరించనున్నామని రాష్ర్ట మున్సిపల్ మంత్రి పి. నారాయణ చేసిన ప్రకటన కృష్ణా రైతుల్లో గుబులు రేపుతోంది. ఈ పది వేల ఎకరాలే కాక కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో కూడా మరికొంత భూమిని సమీకరించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
 ఆందోళనలో కంచికచర్ల, నందిగామ రైతులు
 రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు నిర్మించేందుకు కంచికచర్ల, నందిగామ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజధానికోసం 30 వేల ఎకరాలను సేకరించి మరలా ఇపుడు ఉద్యోగుల క్వార్టర్ల పేరుతో మరో చోట భూ సమీకరణకు పూనుకోవడంపై రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాజధానికి దగ్గరి ప్రాంతం కావడంతో కంచికచర్ల, నందిగామ ప్రాంతంలో భూమి మంచి రేటు పలుకుతోందని అక్కడి వారు ఆనందంగా ఉన్నారు. అయితే ఇపుడు రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రకటన వారికి పిడుగుపాటులా మారింది. రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మించనుండడంతో అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాంతాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు కూడా బలి కానున్నాయని తెలియడంతో ఈ రెండు ప్రాంతాల రైతులు ఇపుడు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
 విజయవాడకూ పొంచి ఉన్న ప్రమాదం
      ఇవేకాక విజయవాడ నగరంలోని, చుట్టుపక్కల భూములను కూడా చంద్రబాబు సర్కారు సమీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజధాని పరిధి ఇప్పటి వరకు 225 చ.కి.మీగా ఉంది. దీనిని 375 కిలోమీటర్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించడాన్ని బట్టి చాలా ప్రాంతాలకు ఇది విస్తరించే అవకాశం ఉంది. కొత్తగా క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని బట్టి విజయవాడ నగరంలోనూ, చుట్టుపక్కల కొన్ని భూములను సమీకరించే లేదా సేకరించే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి... ఏ ప్రాంతంలో సమీకరణకు భూములు  అనువుగా ఉన్నాయి... వంటి వివరాలు సేకరించే పనిలో సీఆర్‌డీఏ అధికారులు ఉన్నారని సమాచారం.
 రెండు లక్షల ఎకరాలు లాక్కుంటారు...!
      నిజానికి  భూదాహం ఇక్కడితో కూడా ఆగేలా లేదు. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా అక్కడి కార్పొరేట్ కంపెనీలను మన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ.... రాష్ర్టంలో రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అన్ని అనుమతులూ ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. అంటే రాజధానితో ముడిపడి ఉన్న రెండు జిల్లాల్లోనూ బాబుగారు రెండు లక్షల ఎకరాలు సేకరించి ఉంచుతారన్నమాట. వాటిని కార్పొరేట్ కంపెనీలకు, తన మాట ప్రకారం నడుచుకునే బినామీ కంపెనీలకు కట్టబెడతారన్నమాట.


23 April 2015

సర్కారుకే శాశ్వత హక్కులు


  భూ సమీకరణ చేపట్టింది ఎవరి కోసం..? రాజధాని రైతుల ప్రయోజనాల కోసమే... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఊదరగొట్టింది ఇదే. అయితే భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా బాబుగారి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ భూములపై వారికి ఇక ఏమాత్రం హక్కులు లేకుండా చేయడానికి వీలుగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భూములపై ప్రభుత్వానికి శాశ్వత హక్కులు లభించేలా రైతులతో డెవలప్‌మెంట్ కమ్ ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఒకసారి ఒప్పందం జరిగాక దాన్ని తిరగదోడడానికి వీలు లేని) ఒప్పందం కుదుర్చుకోవాలని సీఆర్‌డీఏ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఒప్పందం చేసుకున్న తర్వాత భూ యజమాని చనిపోయినా, దివాలా తీసినా ఆ భూమిపై సంబంధిత రైతుకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి హక్కు ఉండదని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా పలు తిరకాసులు పెట్టింది. భూములు ఇవ్వడానికి సిద్ధపడిన రైతుల కౌలులో మెలికపెట్టింది. రైతులకు చెల్లించే కౌలుకు, వారు తీసుకున్న రుణాలకూ లంకె పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భూములు తనఖా పెట్టి రైతులు తీసుకున్న అప్పుల కింద కౌలును జమ చేసుకోవాలని నిర్ణయించింది. ఏటా మే 1 లోగా పదేళ్లపాటు రైతులకు కౌలు చెల్లించనున్నట్లు తాజా మార్గదర్శకాలలో పేర్కొంది. ఈ మార్గదర్శకాలలోని మరికొన్ని ముఖ్యాంశాలేవంటే...
 - సర్కారుకు ఇచ్చిన భూముల్లో రైతులు సాగు చేసిన పంటలకు ఈ ఒప్పందంలో భాగంగానే నష్టపరిహారం చెల్లిస్తారు. ముందుగా అంగీకరించిన మొత్తం కన్నా ఎక్కువ పరిహారం చెల్లించాలని అడిగే హక్కు రైతులకు ఉండదు.  ఎక్కువ పరిహారం కోరుతూ కోర్టులను ఆశ్రయించే హక్కు కూడా రైతులకు ఉండదు.
 - ఒప్పందం చేసుకునే సమయంలోనే ఆ భూమికి సంబంధించి రైతులు చెల్లించిన శిస్తు రసీదులు, వినియోగ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి.
 - భూముల లీజు, లెసైన్సులపై గతంలో కుదుర్చుకున్న అవగాహన పత్రాలు, ఉమ్మడి కుటుంబ హక్కులు ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి రద్దవుతాయి.
 - రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భూములను ఎవరూ కొనుగోలు చేయరాదని, రిజిస్ట్రేషన్లు కూడా చేయరాదని పేర్కొంటూ సీఆర్‌డీఏ ప్రకటనలు ఇవ్వాలి.
 - భూములను అభివృద్ధి చేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు సృష్టించే హక్కు గానీ, స్టే తెచ్చుకునే అవకాశం గానీ రైతులకు ఉండదు.
 - రైతులతో కుదుర్చుకునే ఒప్పందాన్ని ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడైనా రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.20 April 2015

కొత్త విదేశాంగ మంత్రి గా చంద్ర‌బాబు నాయుడు ?


దేశానికి విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిగా ఉండే నాయ‌కుడు త‌ర‌చు విదేశాల‌కు వెళ్లి వ‌స్తుంటారు. ఇత‌ర దేశాల‌తో మ‌న దేశ సంబంధ బాంధ‌వ్యాల్ని ప‌రిపుష్టం చేయ‌టం ఈ శాఖ మంత్రి ప‌ని. ఆయ‌న త‌ప్పితే ఇత‌ర కేంద్ర మంత్రులు పెద్ద‌గా విదేశాల‌కు వెళ్ల‌రు. సంద‌ర్భాన్ని బ‌ట్టి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి మాత్రం వెళ్లి వ‌స్తుంటారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అయితే మొత్తం ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో 1,2 సార్లు విదేశాల‌కు వెళితే గొప్ప‌. అది కూడా ఆయా రాష్ట్రాల అవ‌స‌రాల్ని బ‌ట్టి వెళ్లి వ‌స్తుంటారు.
త‌న‌కు తాను హైటెడ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారం చేసుకొనే చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఈ విష‌యంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈ ప‌దేళ్ల‌లో ఐదు సార్లు విదేశాల‌కు వెళ్లి వ‌చ్చారు. అంటే స‌గ‌టున రెండు నెల‌ల‌కోసారి విదేశాల‌కు వెళ్లి వ‌స్తున్నారు. ఆయ‌న కూడా మంత్రులు, స‌ల‌హాదారులు, ఉన్న‌తాధికారులు..అబ్బో ఒక టీమ్ వెళ్లి వ‌స్తున్నారు.  ఈ సారైతే చంద్ర‌బాబుకు మంచి క‌వ‌రేజ్ ఇచ్చే ఎల్లో మీడియాకు చెందిన ప్ర‌తినిధుల్ని కూడా వెంట బెట్టుకొని వెళ్లారు.

ఇంత మంది వెళుతున్నందుకు ప్ర‌త్యేక విమానాలు, ఇత‌ర సౌక‌ర్యాలు త‌ప్ప‌నిస‌రి అవుతోంది. ఇక విదేశాల్లో వ‌స‌తి సౌక‌ర్యాలు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే సొమ్ములు క‌రిగిపోతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.
తేదీలు                                  - దేశం
న‌వంబ‌ర్ 12 నుంచి 14 దాకా    - సింగ‌పూర్
న‌వంబ‌ర్ 24 నుంచి 29 దాకా    - జ‌పాన్
జ‌న‌వ‌రి  20 నుంచి 23 దాకా     - స్విట్జ‌ర్లాండ్‌
మార్చి   29 నుంచి 31 దాకా     - సింగ‌పూర్
ఏప్రిల్     12 నుంచి 17 దాకా     - చైనా
ఇన్ని దేశాలు చుట్టి వ‌చ్చిన చంద్ర‌బాబు టీమ్ కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే ఖ‌ర్చు పెట్టారు.  రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ చేయాలంటే డ‌బ్బులు లేవంటారు, ఆరోగ్య‌శ్రీ పేద‌ల‌కు ఆప‌రేష‌న్లు చేయించాలంటే డ‌బ్బులు లేవంటారు, క‌నీసం వృద్ధులు, వితంతువుల‌కు పెన్ష‌న్లు ఇవ్వాలంటే డ‌బ్బులు లేవంటారు, మ‌రి సొంత‌టీమ్ తో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు డ‌బ్బులు నీళ్ల‌లా ఖ‌ర్చు పెడుతున్నారా అని సామాన్యుడు అడుగుతున్నాడు. 

ప‌ట్టిసీమ తో గోదావ‌రి ప్రాంతానికి వ‌చ్చే ఇక్క‌ట్లు..!

ప‌ట్టి సీమ క‌డితే గోదావ‌రి వ‌ర‌ద నీరు స‌ద్వినియోగం అవుతుంద‌ని, దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని కొంద‌రు డ‌బ్బా కొడుతున్నారు. కానీ త‌ర‌చి చూస్తే ఇలాంటి అనాలోచిత చ‌ర్య‌ల‌తో త్వ‌ర‌లోనే గోదావ‌రి ఎడారి గా మారిపోయే ప్ర‌మాదం ఉంది. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఓకే కానీ, మిగిలిన 9 నెల‌ల పాటు చాలా త‌క్కువ నీళ్లు మాత్ర‌మే గోదావ‌రి లో ప్ర‌వ‌హిస్తాయి. ఆ కాస్త నీటిని రిజ‌ర్వాయ‌ర్ లేని ఎత్తిపోతల ప‌థ‌కం ద్వారా తోడేస్తే ఇక గోదావ‌రి జిల్లాల రైతుల‌కు సాగునీరు అంద‌డం క‌ష్టం అవుతుంది. అంతిమంగా వ‌ర‌ద‌లు లేని రెండో పంట సీజ‌న్ లో ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. 

 # గోదావరికి స్తున్న నీరు చాలా క్కువగా ఉంది. అంటే అసలు నీటి ప్రవాహం 1,500 క్యూసెక్కులు,సీలేరు నుంచి 4వేలు, బైపాస్ చేయగా స్తున్నది 2వేల క్యూసెక్కులు. ఉపదుల ప్రవాహాల్ని లుపుకొంటేదాదాపు ఏడు ఏడున్న వేల క్యూసెక్కుల నీరు స్తోంది. రి దీని నుంచి ఎనిమిదిన్న వేల క్యూసెక్కులనీటిని తోడేసేందుకు పట్టిసీమలో ప్రణాళికలు చిస్తున్నారు. అంటే దిగువ ఉన్న గోదావరి డెల్టాఎండిపోవాల్సిందేనా..!
# గోదావరికి లు అంటే జూలై నెల చివరి నుంచి సెప్టెంబర్ చివరి దాకా, ప్పితే అక్టబర్ దాకా స్తాయి.దాదాపుగా 60 నుంచి 90 రోజుల పాటు లు పొంగితే గొప్ప. కానీ ఏడాదిలో ఆరు నెలలు, ఏడు నెలలపాటు గోదావరి పొంగుతుందని తెలుగుదేశం నేతలు గొప్పలు చెబుతున్నారు. 
# జూలై నెలాఖరు నుంచి అక్టోబర్ దాకా దాదాపు 10 వేల క్యూసెక్కుల మేర నీరు పారింది అనుకొందాం. ఆతర్వాత నీటిమట్టం పడిపోవాల్సిందే. రి అప్పుడు కూడా ఎగువ నీరు తోడటం ఆపుతారా..లేదా..!
# ప్రస్తుతం గోదావరి జిల్లాల రైతులు రెండో పంట మీదనే ఆధారడుతున్నారు. మొదటి పంట ఎప్పుడూవలు, ప్రకృతి బీభత్సాలకు ష్ట పోతూంటారు. అటువంటి రెండో పంటకు ట్టి సీమ తో ముప్పు పొంచిఉంది దా.
# పోలరం ప్రాజెక్టుపూర్తయితే 194 టీఎమ్సీల నీటిని నిల్వచేసుకొనే వెసులుబాటు లుగుతుంది. అప్పుడువ నీటిని ఆపుకొని రెండో పంటకు మృద్ధిగా నీటిని ఇచ్చుకోవచ్చు.
# ట్టి సీమలో ఎక్కడా నీటిని నిల్వ చేసుకొనే వెసులుబాటు లేదు. అటువంటప్పుడు ఏకబిగిన తోడుకొంటూపోతే, రెండో పంట నీటి రిస్థితి ఏమిటి..
#లోకల్ గెజిట్ ఆర్డర్ - 1962 ప్రకారం దిగువ ప్రాంతాలకు మొదగా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ట్టి సీమపుణ్యమా అని నీరు గ్గిపోతే ణీయ స్యను ఎలా ఎదుర్కొంటారు.
సూటిగా చెప్పాలంటే ఏడాది పొడ‌వునా తెలంగాణ లోని ఏడు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌తోటి నీటిని తోడ‌తారు. 1,2 ఏడాదుల్లో ఇవి పూర్త‌వ‌టం ఖాయం, నీటిని తోడ‌టం ఖాయం. అద‌నంగా ప‌ట్టిసీమ పేరుతో ఏడాది పొడ‌వునా 8వేల క్యూసెక్కుల నీటిని తోడేస్తే ఇక దిగువ‌న గోదావ‌రికి వ‌చ్చే వంద‌ల క్యూసెక్కులు కూడా ఉండ‌దు. అప్పుడు దిగువ‌న ఉన్న గోదావ‌రి జిల్లాలు ఎండిపోవాల్సిందే క‌దా..!