30 July 2016

వైయస్సార్ విగ్రహ తొలగింపు దారుణం

 • తీసిన చోటే తిరిగి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
 • లేకపోతే తామే విగ్రహం పెట్టాల్సి వస్తుంది
 • ప్రభుత్వానికి వైయస్సార్సీపీ నేతల హెచ్చరిక

హైద‌రాబాద్‌: మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచే విధంగా ప‌రిపాల‌న చేస్తే... చంద్ర‌బాబు మాత్రం పేద‌వాడి ఆత్మ‌గౌర‌వాన్ని కేంద్రం, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తాక‌ట్టు పెడుతున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.    వైయ‌స్సార్ విగ్ర‌హాన్ని తొల‌గించినంత తేలిక‌గా ప్ర‌జ‌ల హృద‌యాల్లోంచి ఆ మహనీయున్ని తొల‌గించ‌లేర‌న్నారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏమన్నారంటే...

* వైయస్సార్ విగ్రహ తొలగింపు దుర్మార్గపు చర్య. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు అవలంభిస్తున్నారు
* చంద్రబాబువన్నీ విధ్వంసకర ఆలోచనలే.
* బాబు ప్రత్యేక హోదా సాధనలో విఫలమై.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే వైయస్సార్ విగ్రహాన్ని తొలగించారు
* ప్ర‌జ‌లు రాజ‌న్న విగ్ర‌హాన్ని చూసి ఆ మహానేత పాలనను తలచుకుంటున్నారన్న భయంతోనే బాబు విగ్రహాల తొలగింపుకు పాల్పడుతున్నాడు 
* వైయ‌స్సార్ విగ్ర‌హం తొల‌గించాల‌నుకుంటే ముందుగా విగ్ర‌హం ఏర్పాటు చేసిన వారిని గానీ .. లేకుంటే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని గానీ సంప్ర‌దించాలి.
విజ‌య‌వాడ‌లో ప‌డ‌మ‌ట ఉన్న ఎన్టీయార్ విగ్రహం కొంత‌మేర ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉన్నా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దాన్ని తొల‌గించ‌లేదు.
* క‌నీసం నోటీసు కూడా ఇవ్వ‌కుండా వైయ‌స్సార్ విగ్ర‌హం తొల‌గించ‌డం దారుణం
* బాబు ఇప్ప‌టికే వైయ‌స్సార్ ప‌థ‌కాల‌కు తూట్లు పొడిచి... పేద‌వాడికి వెన్నుపోటు పొడిచాడు
* ప్ర‌భుత్వం పథకాలు పేద‌వాడికి అందాలంటే టీడీపీ కార్య‌కర్త‌ల ముందు చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డాల్సిన దుస్థితి నెల‌కొంది
* వైయస్సార్  విగ్ర‌హాన్ని సంస్క‌ార హీనంగా తొల‌గించ‌డాన్ని ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 
* రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌డంలో చంద్ర‌బాబు దారుణంగా విఫ‌లం చెందారు.
* కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్ర‌భుత్వానికి  ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చెబుతున్నా..బాబుకు బుద్ధి రావడం లేదు
* అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దు. నిబంధనలు ప్రకారం వ్యవహరించాలి
* ఇప్ప‌టికైనా  వైయ‌స్సార్ విగ్ర‌హాన్ని తిరిగి నెలకొల్పాలి.
* లేనిప‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అదే చోట  విగ్ర‌హాన్ని పెట్టాల్సి వ‌స్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆగష్టు 2న ఏపీ బంద్

 • హోదాపై టీడీపీ, బీజేపీ దుర్మార్గ వైఖరికి నిరసనగా బంద్
 • ముఖ్యమంత్రి అసమర్థత వల్లే బీజేపీ హోదా ఇవ్వడం లేదు
 • ఓటుకు నోటు కేసు, అవినీతి కేసుల భయంతోనే బాబు నోరుమెదపడం లేదు
 • హోదాపై దొంగాట ఆడుతున్న టీడీపీపై వైయస్సార్సీపీ ఆగ్రహం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగష్టు 2న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదలచేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంతో రూఢీ అయింది. అయినప్పటికీ నిర్లజ్జగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టు కూడా స్పష్టమైంది.

బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదు. టీడీపీ పట్టుబట్టదు. ఆ రెండు పార్టీల దుర్మార్గ వైఖరికి నిరసనగా, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని... ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునిస్తోంది. ప్రతీ ఒక్కరూ ఈ బంద్‌లో పాల్గొని  విజయవంతం చేయాలని  విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక హోదా సంజీవని కాదని, సాక్షాత్తూ  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నందువల్లే బీజేపీ ఈ నిర్ణయానికి రాగలిగిందని పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రే చెలగాటం ఆడారని మండిపడ్డారు.

తన మీద కేసులు లేకుండా చూసుకుంటే చాలు, ఏపీ ప్రజలకు ఎంత అన్యాయం చేసినా నోరుమెదపబోమన్న వైఖరి వల్లే బీజేపీ ఈ దుస్సాహసానికి ఒడిగట్టిందన్నారు.  రాజ్యసభలో చర్చ జరిగిన తీరు, టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకత్వం ఈ సందర్భంగా చేసిన ప్రకటనలు, రెండేళ్లుగా ఆడుతున్న డ్రామాలు మొత్తం.. ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని తెలిపారు. ఈ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అధ్యక్షులు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
 కేసుల భయంతోనే...
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్న సంకల్పమే చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి బాధ కలిగించిందని చంద్రబాబు బేలగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా కేంద్రంపై పోరాడాలనే ఆలోచన టీడీపీ అధినేతకు రాకపోవడం గమనార్హం. హోదా కోసం తెలుగుదేశం గట్టిగా పట్టుబట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.

కానీ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభలో చేసిన ప్రసంగాలు హోదా సాధనపై వారికి చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశాయి. జైట్లీ ప్రకటన బాధ కలిగించిందని మాత్రమే చంద్రబాబు అన్నారు కానీ.. కేంద్రం నుంచి వైదొలగుతామనో, మంత్రులతో రాజీనామా చేయిస్తామనో కనీసం హెచ్చరికగా కూడా ఆయన మాట్లాడలేకపోయారని వైయస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోవడం, రాష్ట్రంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో.. హోదా కోసం ఒత్తిడి చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

29 July 2016

సీమ ప్రజలకు అన్యాయం చేస్తున్న బాబు

 • శ్రీశైలం ప్రాజెక్ట్ నిండకుండా కక్ష సాధింపు
 • చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ ద్రోహి
వైయస్సార్ జిల్లాః  పులివెందుల‌, గండికోట‌కు నీళ్లు ఇస్తామ‌ని చెప్పడమే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో మాత్రం శూన్య‌మ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురాంరెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డిలు బాబుపై మండిపడ్డారు.  శ్రీ‌శైలం ప్రాజెక్టు నిండకూడ‌ద‌న్న క‌క్ష సాధింపుతో టీడీపీ పాల‌న సాగుతుందన్నారు. కేసీ కెనాల్‌, తెలుగుగంగ‌, గాలేరు - న‌గిరికి ఖరీఫ్ కు నీళ్లు ఇవ్వొద్దన్న ఆలేచనలో బాబు ఉండడం దారుణమన్నారు.  చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
 
మ‌రిన్ని విష‌యాలు వారి మాట‌ల్లోనే...
* బాబు వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మేలు కలగలేదు... కేవ‌లం డ‌బ్బులు సంపాదించుకోవ‌డ‌మే బాబు ల‌క్ష్యం.
* రెండేళ్ల క్రితం గండికోట‌కు నీళ్లిస్తామ‌ని బాబు హామీ ఇచ్చారు... ఇంత‌వ‌ర‌కు అది అమలు కాలేదు
* 13సార్లు రాయ‌ల‌సీమకు వ‌చ్చిన చంద్ర‌బాబు గండికోట‌, పులివెందుల‌కు నీళ్లు ఇస్తాన‌న్నహామీ ఏమైంది
* రాయ‌ల‌సీమ‌కు ఇంత అన్యాయం జ‌రుగుతున్నా ఇక్కడి టీడీపీ నాయ‌కులు స్పందించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు
* శాస‌న‌స‌భ్యులు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి టీడీపీలో చేర్చుకోవ‌డ‌మే ధ్యేయంగా టీడీపీ ప‌ని చేస్తోంది.
* ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం, ప్ర‌జల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో టీడీపీ పూర్తిగా విఫ‌ల‌మైంది
* జిల్లాలో ఉన్న టీడీపీ నాయ‌కులంద‌రు కాంట్రాక్ట‌ర్లుగా మారారు
* కేవ‌లం కాంట్రాక్టుల కోస‌మే ప్ర‌భుత్వంతో ప‌ని చేస్తున్నారే త‌ప్ప... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏనాడు ఆలోచించ‌డం లేదు
* కృష్ణాడెల్టాలో తాగునీరు ఉన్నా శ్రీ‌శైలం నుంచే ఎందుకు నీటిని తీసుకెళ్తున్నారు 
* శ్రీ‌శైలం నీటిని కింద‌కు వ‌దల‌వ‌ద్ద‌ని ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీకు విన్న‌వించి క‌నీసం వారం కూడా గ‌డ‌వ‌క ముందే నీటిని వ‌ద‌లివేయ‌డం దుర్మార్గం
* ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ... ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చుతూ... ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న పార్టీల‌కు ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌వుతారు... అంతేకానీ ప్ర‌జ‌లపైకక్షసాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించ‌దు.
* చంద్ర‌బాబు స‌ర్కారుకు రాయ‌ల‌సీమ‌పై చిత్త‌శుద్ధి లేదు... ఇప్ప‌టికైనా రైతులంద‌రు క‌లిసి ఉద్య‌మం చేయాలి
* రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త వ‌హిస్తూ... సీమ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నారు.
* రాయ‌ల‌సీమ‌లో ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే రైతులందరూ కూలీలుగా మారే దుస్థితి నెల‌కొంటుంది
* రాయ‌ల‌సీమ‌కు నీటి కేటాయింపుల‌పై త్వ‌ర‌లోనే ఉద్య‌మిస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. 

ప్రజలకు అండగా వైయస్సార్సీపీ

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త పెట్ల ఉమా శంకర్ గణేష్ గడపగడపలో పర్యటించారు. బాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజెప్పారు. మీ అందరికీ జ‌గ‌న‌న్న అండ‌గా ఉంటార‌ని భరోసా ఇచ్చారు . మాకవరపాలెం మండలం, గంగవరం పంచాయతీల‌లోఆయన ప‌ర్య‌టించారు.

     విశాఖ జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు  గుడివాడ అమర్నాథ్ ఆధ్వ‌ర్యంలో కశింకోట మండలము లోని తాల్లపాలెం సంత లో గడప గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ప్రభుత్వ వైపల్యాలను గడపగడపకు వెళ్లి  ప్రజలకు వివ‌రించారు. గ్రామ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు  నాయ‌కుల దృష్టికి తీసుకెళ్ళారు. కార్యక్రమములో పార్టీ నాయకులు గొల్లవెల్లి శ్రీనివాస్ రావు, శ్రీధర్ రాజు, గొర్లె సూరి బాబు, సోము నాయుడు, గణేష్, పి.డి.గాంధీ, జగన్, జాజుల రమేష్, వేగి త్రినాధ్, గైపుడి రాజు, భాభి, గంటా సముద్రా, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

28 July 2016

చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదు...వెంటనే దిగిపోవాలి

 • ప్ర‌త్యేక హోదా ఇచ్చే ఆలోచ‌న మోడీకి లేదు
 • ప్ర‌త్యేక హోదా తీసుకురావాల‌న్న ధ్యాస బాబుకు లేదు
 • హోదాకోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్సీపీ
 • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

హైదరాబాద్ః  కాంగ్రెస్ పార్టీ అత్యంత అరాచ‌కంగా, దుర్మార్గంగా, పాశ‌వికంగా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించి శవంగా మారితే... ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌కుండా టీడీపీ పార్టీ జీవ‌చ్ఛవంలా మారింద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తిరుప‌తిలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటే.... దానికి చంద్ర‌బాబు ప‌దేళ్లు కాదు... ప‌దిహేను సంవ‌త్స‌రాలు కావాల‌ని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇరు పార్టీలు ప్ర‌జ‌ల‌ను అడ్డంగా మోసం చేశాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా సాధించి అభివృద్ధిలో ముందంజ‌లో ఉన్నాయ‌న్న విష‌యం బాబు తెలుసుకోవాల‌ని సూచించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.  

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాటల్లోనే....
* ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో హామీల‌ు ఇచ్చి  మోసం చేసిన టీడీపీపై ఎప్పుడెప్పుడు ప్ర‌తీకారం తీర్చుకుందామ‌ా అని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు.
* టీడీపీ,బీజేపీలు త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఏపీకి ప్ర‌త్య‌క‌హోదా ఇస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పాయి.
* ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌లు ఎన్నో పోరాటాలు... ఆందోళ‌న‌లు చేసినా బాబుకు విన‌ప‌డ‌టం లేదు.
* ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాదు... ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రాభివృధ్ధి జ‌ర‌గ‌దు అని చెబుతున్న టీడీపీ ముఠా సిగ్గుతో త‌ల‌దించుకోవాలి
* ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ఎన్నో నిధులు తీసుకొస్తాన‌న్న బాబు హామీ ఏమైంది.

ప్ర‌జాగ్ర‌హానికి గురైతే అంతే....
* ఉమ్మ‌డి రాష్ట్రాన్ని ప్ర‌జల అభిప్రాయానికి వ్య‌తిరేకంగా విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ శవంగా మారి.. ప్ర‌జల నిర‌ాధార‌ణ‌కు గురైంది
* ఊపిరి లేని కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లును ప్ర‌వేశ‌పెడితే దానికి టీడీపీ మేము సైతం చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న‌డం విడ్డూరం
* ప్ర‌త్యేక హోదా అన్నది క్యాబినెట్ నిర్ణ‌య‌మ‌ని తెలిసి కూడా టీడీపీ ప‌ట్టుబ‌ట్ట‌కపోవడం దారుణం.
* ప్ర‌త్యేక హోదా ఇచ్చే ఆలోచ‌న మోడీకి లేదు... అడ‌గాల‌న్న ధ్యాస చంద్రబాబుకు లేదు...
* ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే త‌మ పాలిత రాష్ట్రాల్లో ఉన్న‌ట్టువంటి ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఏపీకి త‌ర‌లివెళ్తాయ‌న్న భ‌యంతోనే మోడీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం లేదు..

ప్ర‌త్యేక హోదా కోసం పోరాడి అరెస్ట్ అయిన ఏకైక వ్యక్తి వైయ‌స్ జ‌గ‌న్‌..
* ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించ‌వ‌ద్ద‌ని ఎన్నో ఆందోళ‌నలు చేసిన ఏకైక పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ
* విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో నాలుగు ల‌క్ష‌ల మందితో నిర‌స‌న తెలిపిన ఘ‌న‌త వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీదే
* విభ‌జ‌న అనంత‌రం ప్ర‌త్యేక హోదా కోసం అనేక మార్లు దీక్ష చేసిన ఏకైక నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
* ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో క‌లిసి ఢిల్లీలో నిర‌హార దీక్ష చేసి అరెస్ట్ అయ్యారు. మరెన్నో ఉద్యమాలు చేశారు.

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు అనర్హుడు..
* బాబు ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి  ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల గొంతు కొయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. 
* ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై నేను పోరాడ‌ను.. ఒత్తిడి చేయ‌ను అనే ముఖ్య‌మంత్రి రాష్ట్రానికి అవ‌స‌రామా..?
* ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయ‌లేని వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌డానికి అన‌ర్హుడు...
* విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్టంగా ఉన్న పెట్రోలియం యూనివ‌ర్సిటీ... గిరిజ‌న యూనివ‌ర్సిటీ.... చెన్నై- వైజాగ్ ఇండ‌స్ట్రీయ‌ల్ క్యారిడ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు ఏర్పాటు కాక‌పోవ‌డం సిగ్గుచేటు...
* తిరుప‌తిని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా ప్ర‌క‌టించి... సాక్ష్యాత్తు ప్ర‌ధాని మోడీ దానిని ప్రారంభించి దాదాపు ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఒక్క ప్ర‌యాణం కూడా ప్రారంభం కాలేదు
* అమ‌రావ‌తిలో మెట్రో రైలు ఊసే లేదు... తుంగ‌రాజుప‌ట్నంను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. దానికి స్పంద‌న లేదు...
* రాజ్య‌స‌భ‌లో టీడీపీ నేత‌లు పాట‌లు ప‌ాడితే ప్ర‌త్యేక హోదా రాదు
* కేవీపీ  ప్రైవేటు మెంబర్ బిల్లును ఉప‌సంహరించుకుంటే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్నార‌ని చెప్ప‌డం హేయనీయం
* చంద్ర‌బాబుకు రాజ‌కీయ సంక‌ల్పం లేక‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రావ‌డం లేదు...
* ఒక్క ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్ని రంగాల్లో రాణిస్తుంది... దేశంలో 11 రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా ద్వారా అభివృద్ధిలో ముందుంటున్నాయి...
* ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే మేము రాజీనామా చేస్తామ‌ని టీడీపీ మంత్రులు, ఎంపీలు చెబితే క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా వ‌స్తుంది.
* ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌ని ప‌రిస్థితి వ‌స్తే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే అర్హ‌త త‌న‌కు లేద‌ని రాజీనామా చేసేందుకు బాబు సిద్ధంగా ఉండాలి

హోదాపై చర్చకు విజయసాయిరెడ్డి నోటీస్

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై చర్చ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ ఉదయం రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. పునర్విభజన చట్టం అమలు తీరుపై ఇవాళ మధ్యాహ్నం రెండుగంటలకు రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. 

గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిన్న రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

27 July 2016

ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు

 • అదీచేస్తాం ఇదీ చేస్తామని రెండేళ్లుగా చెబుతూనే ఉన్నారు
 • రాయలసీమ జిల్లాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
 • కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకురాకపోతే ఉద్యమించక తప్పదు
 • బాబు మేల్కోవాలి..కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
 • వైయస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి

వైయస్సార్ జిల్లాః విభజన చట్టంలోని హామీలను సాధించుకోవడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా బాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కళ్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీస్తున్న బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డిలు హెచ్చరించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఏమన్నారో వారి మాటల్లోనే...

 • రాయలసీమ జిల్లాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
 • కడపలో స్టీల్ ప్లాంట్ గురించి క్లారిటీ ఇవ్వకపోవడం దారుణం. 
 • పాఠశాలలు, పరిశ్రమలు, హాస్పిటల్ లు ఏది వచ్చినా బాబు అమరావతికి తరలిస్తున్నారు. 
 • మంత్రులు, ముఖ్యమంత్రి తలో మాట మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు
 • తడబాటు నిర్ణయాలు కాకుండా కడపలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా చూడాలి.
 • రాబోయో అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై కూడా పోరాడుతాం.
 • విభజన చట్టంలోని హామీలను సాధించుకోవడంలో టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందింది.
 •  తెలుగుదేశం నాయకులు పార్లమెంట్ లో ప్రత్యేకహోదాపై కనీస నోరెత్తడం లేదు. 
 • పార్లమెంట్ లో ఇంత జరుగుతున్నా హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడం గానీ, అడగడం గానీ చేయడం లేదు.
 • హోదా కోసం వైయస్సార్సీపీ అనేకమార్లు పోరాటం చేసింది.  అధ్యక్షులు వైయస్ జగన్ ఏకంగా ఢిల్లీలో దీక్షలు చేసి కేంద్రంపై తిరగబడి మాట్లాడారు.
 • కానీ అధికార పక్షం ఏమాత్రం నోరువిప్పడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించే పరిస్థితి ఉంది. ప్రజలు చాలా నిరాశ, నిస్పహల్లో ఉన్నారు. తాగడానికి నీళ్లు లేని ప్రాంతంలో కనీసం ఉక్కుపరిశ్రమ వస్తేనైనా ఉద్యోగాలు వస్తాయి. కుటుంబాలు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
 • బాబు  కళ్లబొల్లి మాటలు చెబుతున్నారు తప్ప ఏదీ కార్యరూపం దాల్చడం లేదు. 
 • బాబు మేల్కోవాలి. రెండేళ్లయిపోయింది.  సీట్లు రానంత మాత్రాన రాయలసీమ ఆంధ్రలో భాగం కాదని అనుకోవద్దు.
 • సీమపై దృష్టిపెట్టాలి. మాటలు కాకుండా  చేతల్లో చూపించాలి. 
 • వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు పేలవంగా వస్తున్నాయి. గట్టిగా అడగాలి. 
 • రైల్వే జోన్, హోదా సహా అన్నింటిపై వైయస్సార్సీపీ పోరాటం చేస్తుంది. 
 • ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది. 
 • అది చేస్తాం, ఇది చేస్తామని మాటలతో మభ్యపెడితే ప్రజలే బాబుకు తగిన బుద్ధి చెబుతారు.

టీడీపీ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

గడపగడపకూ వైయస్సార్ కార్య‌క్ర‌మంలో ప్రజలు తమ కష్టాలను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులతో పంచుకుంటున్నారు.  తూర్పు గోదావ‌రి జిల్లా పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మామిడికుదురు మండ‌లం అప్ప‌నప‌ల్లి గ్రామంలో గడపగడపలో పర్యటించారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని చిట్టిబాబు ధ్వజమెత్తారు. 
గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కె.ముర్వ‌కొండ‌, వీరాపురం, నేహ్రున‌గ‌ర్‌, ప‌గిడ్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే ఐజ‌య్య పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు.
చంద్ర‌బాబు అవినీతి, మోసాలను వైయస్సార్సీపీ శ్రేణులు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త సి.హెచ్‌.నారాయ‌ణ రెడ్డి ఆధ్వ‌ర్యంలో స్థానికంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వహించారు.  అవినీతి, అక్ర‌మాలే ల‌క్ష్యంగా టీడీపీ నాయ‌కులు ప‌ని చేస్తున్నార‌ని నారాయణరెడ్డి ఆగ్రహించారు. చంద్ర‌బాబు త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం ప్ర‌జ‌ల‌ను బ‌లిచేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. 

26 July 2016

ఆత్మీయ ప‌ర్య‌ట‌న‌

విశాఖ‌ప‌ట్నం: ప్రతిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఆద్యంతం ఆత్మీయంగా సాగింది. బాధితుల కుటుంబాల్ని ప‌ల‌క‌రించి ధైర్యం చెప్పి స్వాంత‌న చేకూర్చారు.
బంగాళాఖాతంలో గ‌ల్లంతైన విమానంలో ప్ర‌యాణించిన ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. కుటుంబ పెద్ద తిరిగి వ‌స్తాడో, తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయాడో తెలియ‌న ప‌రిస్థితిలో జీవిస్తున్నారు. ఇంత‌టి ఆందోళ‌న చెందుతున్న కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించేందుకు ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ కు విచ్చేశారు.
అక్క‌డ మొద‌ట‌గా 104 ఏరియాలో భూపేంద్ర‌సింగ్ ఇంటికి చేరుకొన్నారు. బుచ్చిరాజుపాలెంలో ఎన్‌. చిన్నారావు ఇంటికి , గోపాల‌ప‌ట్నం లో పి. నాగేంద్ర‌రావు ఇంటికి వెళ్లారు. కుటుంబ పెద్ద క‌నిపించ‌కుండా పోతే ఏర్ప‌డే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌నకు బాగా తెలుస‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. క‌ల‌త చెంద‌కుండా ధైర్యంగా ఉండాల‌ని స్వాంత‌న ప‌లికారు. అనంత‌రం వేప‌గుంట లో జి శ్రీనివాస‌రావు కుటుంబాన్ని, అప్ప‌న్నపాలెంలో బీ సాంబ‌మూర్తి కుటుంబాన్ని, మాధ‌వ‌ధార లో ఆర్వీ ప్ర‌సాద్ రావు కుటుంబ‌స‌భ్యుల్ని ప‌ల‌కరించారు. ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో ధైర్యం వ‌హించాల‌ని పేర్కొన్నారు.

జ‌న నేత వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఆయా కాల‌నీల్లో వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలుసుకొని విప‌రీతంగా జ‌నం విచ్చేశారు. వైయ‌స్ జ‌గన్ ను క‌లిసేందుకు పోటీ ప‌డ్డారు. 

మళ్లీ రాజన్న రాజ్యం రావాలి

వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి స్వయంగా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండేళ్లుగా పింఛన్లు రాక, రేషన్ అందక, రుణాలు మాఫీ గాక, కొత్త రుణాలు రాక, ఉద్యోగాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్న విషయాన్ని ప్రజలు వైయస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. బాబుకు ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన నాయకులు వైయస్ జగన్ ను సీఎం చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని నేతలు ప్రజల్లో భరోసా కల్పించారు. 
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కల్లూరు చెంచు నగర్ లో గడపగడపలో పర్యటించారు. మరోవైపు, పత్తికొండ  నియోజకవర్గ సమన్వయకర్త సి.హెచ్. నారాయణరెడ్డి ప్రతీ గడపకు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు.  ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని 42వ డివిజన్ లో ప్రతీ గడపలో పర్యటించారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి సమాధానాలు రాబట్టారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు ఒక్క మార్కు కూడా వేయలేదు. 

ఒక్క స్విస్ చాలెంజ్.. టాప్ టెన్ ప్రశ్నలు

ఎంత మంది వద్దంటున్నా చంద్రబాబు నాయుడు మాత్రం స్విస్ ఛాలెంజ్ నే ఇష్ట పడుతున్నారు. సుప్రీంకోర్టు, కేల్కర్ కమిటీ, కేంద్రంలోని పెద్దలు, ఇతర రాజకీయ పార్టీలు వద్దని చెబుతున్నా వినటం లేదు. సింగపూర్ బినామీ సంస్థలకు మొత్తంగా రాజధాని భూముల్ని దోచిపెట్టేందుకు తాపత్రయ పడుతున్నారు. స్విస్ ఛాలెంజింగ్ విధానం మీద ఎన్నెన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం నుంచి జవాబివ్వటం లేదు.
1.     స్విస్ ఛాలెంజ్ విధానం సరికాదని సుప్రీంకోర్టు స్వయంగా వెల్లడించినా  ప్రభుత్వం ఎందకు పట్టించుకోవటం లేదు
2.     సింగపూర్ బినామీ కంపెనీలకు చాలా సరళంగా నిబంధనలు రూపొందించిన సర్కారు, బయట కంపెనీల విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తోంది.
3.     సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య (జీటూజీ) ఒప్పందమని ముందు చెప్పారు.  కేంద్రం సరేనంది. అంతే.. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని పక్కకు జరిపి ప్రైవేటు కంపెనీలను ఎందుకు రంగంలోకి దింపారు.
4.      ‘స్విస్ చాలెంజ్’పై సుప్రీంకోర్టు తీర్పును, మార్గదర్శకాలను ఉటంకిస్తూ రాష్ర్ట ఆర్థికశాఖ స్వయంగా విడుదల చేసిన సర్క్యులర్‌ను ఎందుకు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవటం లేదు.
5.      స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎవ్వరికీ ప్రభుత్వం ఇవ్వకూడదు. ఈ విధానంలో పాల్గొనే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపరాదు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పలు సార్లు సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. అలాగే వారితో సంప్రదింపులు జరిపేందుకు ఏకంగా మం త్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు.
6.     రాష్ర్టప్రభుత్వానికి ఈ ప్రాజెక్టులో 51% వాటా ఉండాలని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల కల్పన (ఏపీఐడీఈ) చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టారు. ప్రభుత్వ వాటాను 42 శాతానికి ఎందుకు పరిమితం చేస్తున్నారు.
7.     స్విస్ చాలెంజ్ విధానంలో ఏ ఏ ప్రాజెక్టులు చేపట్టనున్నారో అందరికీ తెలిసేలాగ పారదర్శకంగా ప్రభుత్వం ప్రకటించాలి. కానీ ఏఏ ప్రాజెక్టులను స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టనున్నదీ ఎందుకు ప్రకటించలేదు.
8.     స్విస్ చాలెంజ్ విధానంలో ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారో చాలా ముందుగా పూర్తి వివరాలతో బహిరంగంగా ప్రకటించాలి.  ఎటువంటి ప్రాజెక్టులు స్విస్ చాలెంజ్ విధానంలోకి వస్తాయో స్పష్టం చేయాలి. కానీ మొదట నుంచీ చంద్రబాబు గోప్యత పాటిస్తున్నారు.
9.      స్విస్ చాలెంజ్ విధానంలో కంపెనీలు తమంతట తాముగా ప్రాజెక్టును ఎంతకు చేపడతాయో తెలియజేయాలి. ప్రభుత్వం ఎలాంటి వివరాలను అందజేయరాదు. కానీ, ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఎదురు లేఖ రాసింది.
10.                         బాబు బినామీ ఆస్తులన్నీ సింగపూర్ లోనే ఉన్నాయి. వాటిని పెంచుకునేందుకే స్విస్ ఛాలెంజ్ విధానం అన్న విమర్శ వినిపిస్తున్నప్పటికీ ఎందుకు జవాబు ఇవ్వటం లేదు
ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టే స్విస్ ఛాలెంజ్ కు తాము వ్యతిరేకం అని వైయస్సార్సీపీ ప్రకటించింది.  

25 July 2016

ప్రజాబ్యాలెట్ లో బాబుకు సున్నా మార్కులు

వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవ్వూరు మండలం కడవలూరు మండలంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై అడిగి తెలుసుకున్నారు. కరపత్రాన్ని అందించి మార్కులు వేయమని కోరారు. మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని చంద్రబాబు తమను మోసం చేశాడని ప్రజలు టీడీపీపై దుమ్మెత్తిపోశారు. తమకు ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ  వచ్చి ఆదుకునే నాయకుడు వైయస్ జగన్ అని, ఆయన సీఎం ఐతేనే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఘంటాపథంగా తేల్చిచెప్పారు. ప్రజాబ్యాలెట్ లో బాబుకు జీరో మార్కులు వేశారు.  
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గోనెగండ్ల పట్టణంలో నిర్వహించిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోయజకవర్గంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి గడపగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. అవి నెరవేర్చని పక్షంలో రానున్నది మన ప్రభుత్వమని, వైయస్ జగన్ వచ్చిన వెంటనే మన కష్టాలన్నీ తీరిపోతాయని ధైర్యం కల్పించారు. 

స్విస్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టం

దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
బాబు కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు
రైతులు, కూలీలు, కార్మికులందరినీ రోడ్డున పడేశారు
ఇంత అవకతవకలు జరుగుతుంటే కేంద్రం నిద్రపోతుందా?

విజయవాడః రాష్ట్రంలో చంద్రబాబు ఆకృత్యాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని వైయస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి మండిపడ్డారు. చట్టాలను, కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ బాబు  స్విస్ ఛాలెంజ్ విధానం కొనసాగించడం దారుణమని అన్నారు. పేదల పొట్టగొట్టి బాబు పెద్దలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో గౌతంరెడ్డి మాట్లాడారు.

ఏమన్నారో ఆయన మాటల్లోనే...
 • బాబు రాజకీయ పార్టీల్ని, మతాధిపతుల్ని, ప్రజల్ని ఎవర్ని ఖాతరు చేయడం లేదు.  చట్టాల్ని, కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు. 
 • స్విస్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టమని కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ తేల్చింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
 • పారదర్శకంగా, జవాబుదారిగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని గోప్యంగా ఉంచరాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
 • కానీ, బాబు నియమ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ నేను చెప్పిందే అమలు చేస్తానంటూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడు
 • తెల్లారి లేస్తే సింగపూర్, చైనా అంటూ  పరుగులు పెట్టడంలో ఆంతర్యమేంటో బాబు చెప్పాలి. 
 • రాష్ట్రంలో నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు వేయకుండా సింగపూర్ కు వెళ్లి అక్కడ సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు
 • బాబు బినామీ ఆస్తులన్నీ సింగపూర్ లోనే ఉన్నాయి. వాటిని పెంచుకునేందుకే స్విస్ ఛాలెంజ్ విధానం. 
 • భారత భూబాగాన్ని వేరేవాళ్లకు ఇవ్వాలంటే నిబంధనలకు లోబడి ఇవ్వాలి. కానీ బాబుకు అవేమీ పట్టడం లేదు.  
 • సీఆర్డీఏకు కేవలం 42 శాతం మాత్రమే ఇచ్చి, సింగపూర్ వాళ్లకు 58 శాతం కట్టబెట్టడం దారుణం. 
 • కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంపై సరైన అగాహన, నియంత్రణ ఉందా లేదా..?
 • రాష్ట్రంలో ఇంత అవకతవకలు జరుగుతున్నా...! బాబు యాక్ట్ లు ఉల్లంఘించి యాక్టింగ్ చేస్తుంటే వాటిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 
 • కేంద్రం నిద్రపోతుందా...? కేంద్రప్రభుత్వం కూడా దీనిలో ముద్దాయిగా ఉన్నట్లు భావించాల్సి వస్తుంది.
 • స్విస్ ఛాలెంజ్ విధానం తప్పుడు విధానమని కేంద్ర కమిటీయే చెప్పింది. 
 • ప్రజాధనాన్ని దోచుకునేందుకే బాబు సింగపూర్ లోని తన సంస్థలను తీసుకొస్తున్నారు.
 • ప్రతీ పనిని బాబు గోప్యంగా చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 
 • స్విస్ ఛాలెంజ్ విధానాన్ని దేశమంతా వద్దంటున్నా నీవు ఎందుకు పెడుతున్నావు బాబు..?
 • ఇది సరైంది కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల్నికూడా తుంగలో తొక్కారు. 
 • స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే  ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 
 • స్వదేశీ కంపెనీలను కూడా ఆహ్వానించాలి. నియమనిబంధనలకు అనుగుణంగా పారదర్శకత చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.
 • మీ బినామీ ఆస్తులను పెంచుకోవడం కోసం మీ కంపెనీలనే తీసుకొచ్చి..రాజధానిలో మీరే పెట్టుబడులు పెట్టి వాటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. 
 • పేదవాడి భూములు లాక్కొని పెద్దలకు కట్టబెడుతున్నారు. 
 • లక్షలాది మంది వ్యవసాయకూలీలు, రైతులు, కార్మికులను  రోడ్డున పడేశారు. 
 • 12 లక్షల ఎకరాల్ని తీసుకుంటానని బాబు చెప్పడం దారుణమని గౌతంరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్ర‌బాబు భూ దోపిడీ

తిరుప‌తి:  రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు  దోపిడీ పెరిగింది. గ‌డిచిన రెండేళ్లలో రూ. 1.5 ల‌క్ష‌ల కోట్ల అవినీతి చోటు చేసుకుంది. పాల‌న గాడి త‌ప్పింది. అభివృద్ధి పూర్తిగా ప‌డకేసింది. రైతులు, కార్మికులు, డ్వాక్రా మ‌హిళ‌లు బాబు మోసాల‌కు బ‌ల‌య్యారు. రాష్ట్ర‌మంతా దోపిడీ వ్య‌వ‌స్థ వేళ్లూనుకుంటోంద‌ని పుంగ‌నూరు ఎమ్మెల్యే, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పాల‌క ప‌క్షంపై ధ్వ‌జమెత్తారు. పెద్దిరెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం అనంత‌రం భారీ ప్ర‌జా బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో చంద్ర‌బాబు భూ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింద‌న్నారు. ఇదే బాట ప‌ట్టిన మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కూడా ఆయ‌న త‌న‌యుడితో క‌లిసి నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల భూముల‌ను స్వాధీనం చేసుకోవ‌డం అధికార పార్టీ దౌర్జ‌న్యానికి ప‌రాకాష్ట‌గా క‌నిపిస్తోంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

 వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ ప్ర‌భుత్వం పేద‌ల నుంచి బ‌ల‌వంతంగా గుంజుకున్న భూముల‌న్నింటినీ తిరిగి అప్ప‌గిస్తామ‌న్నారు. పార్టీ నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న మాట‌గా ప్ర‌జ‌ల‌కు చెప్ప‌మ‌న్న‌ట్లు ప్ర‌జ‌ల క‌రతాళ ధ్వ‌నుల మ‌ధ్య పేర్కొన్నారు. అధికారం ఉంద‌ని ప్ర‌జ‌లు, వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల‌పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయిస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని పెద్దిరెడ్డి హెచ్చ‌రించారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డటం మంత్రి బొజ్జ‌ల‌కు ప‌ద్థతి కాద‌ని హిత‌వు చెప్పారు. తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు, గంగాధ‌ర‌నెల్లూరు ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి, బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి ప్ర‌భృతులు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగ ఎంపీపీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, న్యాయ‌వాది ప‌ట్టాబి, ఏర్పేడునేత శ్రీ‌రాములురెడ్డి త‌దిత‌రులు పెద్దిరెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

23 July 2016

ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు

న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ  లోక్‌సభలో తమ పార్టీ  ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతుందని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే  మూడుసార్లు లోక్‌సభను స్తంభింపజేసిందని తెలిపారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హోదా సాధన కోసం వైయస్సార్సీపీ గుంటూరులో ఎనిమిది రోజులపాటు దీక్ష చేసిందని గుర్తుచేశారు. దీనిపై వివిధ జిల్లాల్లో ఆందోళన చేపట్టామన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన  ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సుబ్బారెడ్డి విమర్శించారు.

 ‘ప్రకాశం’ను వెనుకబడిన జిల్లాల్లో చేర్చాలి
 వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ చట్టానికి సవరణను ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లును శుక్రవారం నాటి లోక్‌సభ ప్రైవేట్ మెంబర్ బిజినెస్ ఎజెండాలో పొందుపరిచారు. అయితే సభ మధ్యాహ్నమే వాయిదాపడడంతో ఈ బిల్లు రాలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతోపాటు అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా ఇందులో చేర్చాలని వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లులో ప్రతిపాదించారు.

ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే స్థాయిలో లేరు... భ‌య‌పెట్టే స్థాయిలో ఉన్నారు

గుంటూరు) ఎక్క‌డ విలువైన భూములు క‌న‌బ‌డితే అక్క‌డ చంద్ర‌బాబు... ఆయ‌న త‌న‌యుడు లోకేష్ క‌న్ను ప‌డుతోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు. లోకేష్ బినామీ దారులు రూ. 3 - 4 ల‌క్ష‌లకు భూముల‌ను కొనుగోలు చేసి... వాటిని రూ. 4 - 5 కోట్ల‌కు అమ్ముకుంటే త‌ప్పులేదుగానీ, అదే ఒక సామాన్య పేద రైతు వంశ‌ప‌ర్యంప‌రంగా వ‌స్తున్న భూమిని కాపాడుకోవ‌డం కోసం పోరాటం చేస్తే నేర‌మా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయటంపై ఆయన మండిపడ్డారు. అంబటి ఏమన్నారో ఆయన మాటల్లోనే...
 * భూముల‌ను లాండ్ పూలింగ్‌కు ఇవ్వ‌క‌పోతే వారిపై భూ సేకరణ నోటిఫికేష‌న్లు జారీ చేయ‌డం సిగ్గు చేటు
* ప్ర‌జ‌ల‌ను బెదిరిస్తే భ‌య‌ప‌డుతార‌ని బాబు అనుకోవ‌డం ఆయ‌న భ్ర‌మ‌.
* ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే స్థితిలో లేరు. భ‌య‌పెట్టే స్థాయిలో ఉన్నారు. పేద రైతుల పోరాటానికి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంది.
* వేలం పాట పేర టీడీపీ బినామీలు దేవాల‌య భూముల‌ను మింగేస్తున్నారు... చంద్ర‌బాబు దిన‌చ‌ర్య భూముల‌ను మింగేయ‌డ‌మే.
 భూ కేటాయింపు విధానం లోపభూయిష్టం
* అసెంబ్లీలో 50శాతానికి పైగా సీట్లు ఉంటే ఆ పార్టీకి నాలుగు ఎక‌రాల భూమి... 50 శాతానికి త‌క్కువ‌గా ఉంటే అర ఎక‌రం ఎలా కేటాయిస్తారు..?
* కేవ‌లం రాజ‌ధాని ప్రాంతంలో నాలుగు ఎక‌రాల భూమిని కాజేయ‌డం కోస‌మే బాబు అవినీతి పాల‌సీలు
* దేశంలో గుర్తింపు కలిగిన రాజ‌కీయ పార్టీల‌కు పార్టీ కార్యాల‌యాల కోసం భూములిచ్చే సంప్ర‌దాయం ఉంది
* టీడీపీ ఈ సంప్ర‌దాయాన్ని అడ్డుపెట్టుకొని కీల‌క‌మైన ప్రాంతాల్లో భూముల‌ను కాజేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతోంది
* అసెంబ్లీలో 50 శాతం సీట్లు ఉన్నాయి కాబ‌ట్టి టీడీపీకి నాలుగు ఎక‌రాల భూమిని కేటాయిస్తారు.... 2019లో టీడీపీకి 50శాతం సీట్లు రాక‌పోతే ఇప్పుడు తీసుకున్న నాలుగు ఎక‌రాల భూమిని తిరిగి ఇచ్చే దమ్ము బాబుకు ఉందా..?
* ఎప్పుడు సీట్ల ప‌రంగా భూ కేటాయింపులు ఎప్పుడు జ‌ర‌గ‌లేదు
* చంద్ర‌బాబు కేవ‌లం భూదాహంతో నాలుగు ఎక‌రాలు కాజేయాల‌ని చూస్తున్నారు... 
* టీడీపీ వేల కోట్ల అవినీతి పాల్ప‌డుతుంది క‌దా... కీల‌క‌మైన ప్రాంతంలో నాలుగు ఎక‌రాల భూమిని కూడా కొనుగోలు చేయ‌లేరా అని ప్ర‌శ్నించారు

బాబుది భూ దోపిడీ
* బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక జిల్లాల్లో కీల‌క‌మైన ప్రాంతాల్లోని భూముల‌ను పార్టీ కార్యాల‌యాల కోసం కాజేసేందుకు జీవోలు విడుద‌ల చేశారు. 
* చంద్ర‌బాబు అధికారంలో లేన‌ప్పుడు మ‌చిలీప‌ట్నం పోర్టుకి వెయ్యి ఎక‌రాలు చెబుతారు...
* ఆయ‌న అధికారంలో ఉంటే మాత్రం  ల‌క్ష‌ల ఎక‌రాలు కావాల‌ని చెప్ప‌డం దౌర్భాగ్యం.
* రాజ‌ధాని కోసం 35వేల ఎక‌రాల‌ను తీసుకున్నారు. డీ నోటిఫై చేయ‌మ‌ని చెప్పి సుమారు ల‌క్ష ఎక‌రాల‌ను రాజ‌ధాని కోసం తీసుకొని ఏం చేస్తారో అర్థం కావ‌డం లేదు.

అందరికీ ఇబ్బందులు
* స‌రైన వ‌స‌తులు లేకున్న సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగుల‌ను  హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.
* మ‌రి హైకోర్టు విభ‌జ‌న మాత్రం ఇప్పుడు వ‌ద్ద‌ని ఎందుకు వారిస్తున్నారో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి
* అర్హులైన పేద‌వారికి మూడు సెంట్ల భూమి ఇస్తాన‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు
* అధికారంలోకి రాగానే ఉన్న భూముల‌ను లాక్కుంటున్నారు...
* పేద‌వారికి మూడు సెంట్ల భూమిని ఇవ్వ‌కుండా... రాజ‌కీయ పార్టీల‌కు భూములు కేటాయించ‌డం అవ‌స‌రమా..?
* దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 5 సంవ‌త్స‌రాల మూడు నెల‌లు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని ప‌రిపాలించినప్పటికీ ఏనాడు ఏ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌లేదు.. 
* మ‌రి బాబు విదేశీ ప‌ర్య‌టన‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి
* స్విస్ ఛాలెంజ్ విధానం  మొత్తం దోపిడీ విధాన‌మే.
* బాబు కుటుంబ స‌భ్యుల కంపెనీలే సింగ‌పూర్‌లో బినామీల పేర ఉన్నాయి 

22 July 2016

హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు

 • టీడీపీ కుట్రల్ని ప్రజలు గమనించాలి
 • హోదా కోసం ఎవరు పోరాడినా మా మద్దతుంటుంది
 • ప్రత్యేకహోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయం
 • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్: ప్రత్యేకహోదాపై టీడీపీ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటోందని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హోదాకు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంట్ కు రానున్న నేపథ్యంలో... టీడీపీ చావు తెలివి తేటలు ప్రదర్శిస్తోందన్న అనుమానం, భయాందోళన కలుగుతోందని  బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొత్స ఇంకా ఏమన్నారంటే...

 • రాష్ట్రానికి హోదాయే సంజీవని ... ప్రత్యేకహోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయం
 • ప్రత్యేకహోదా కోసం ఎవరు పోరాడినా మద్దతిస్తామని ఎన్నో సార్లు చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. 
 • ఇప్పటికే హోదా కోసం అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో ఎన్నో ఆందోళనలు చేపట్టాం. 
 • ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలో, ఢిల్లీలో ధర్నాలు-దీక్షలు చేశాం. కేంద్రపెద్దలను కలిశాం. యువభేరి సదస్సులు నిర్వహించాం.
 • 2015 ఆగష్టు 31వ తేదీన .. 2016 మార్చి 16న అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానాలను సమర్థించాం.
 • ప్రత్యేక హోదాపై ప్రత్యేక బిల్లు అవసరం లేదన్నది మా అభిప్రాయం.  
 • ఎందుకంటే, పార్లమెంటు సాక్షిగా ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. దాన్ని బీజేపీ కూడా అంగీకరించింది. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని ఆనాడు వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. 
 • హోదాతో పాటు పోలవరానికి సంబంధించి తెలంగాణ నుంచి కొన్ని మండలాలు కలపాలనే విషయాలు కూడా విభజన సమయంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేశారు.  కానీ, ప్రత్యేక హోదాను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.
 • ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటుతో ఎందుకు ముడిపెడుతున్నారు.
 • పార్లమెంట్ ఆమోదం కావాలని కోరడం ద్వంద్వవైఖరికి నిదర్శనం. దీనికి టీడీపీయే పూర్తి బాధ్యత వహించాలి.
 • పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లును మేం సమర్థిస్తాం. రాజ్యసభలో బిల్లు ఓకే అయినా అది చట్టం అవ్వాలంటే లోక్ సభలో కూడా పూర్తి మెజారిటీ కావాలి. 
 • లోక్ సభలో ఎన్డీఏ భాగస్వామ్యాలదే మెజారిటీ. అందులో టీడీపీ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 
 • లోక్ సభలో బిల్లు వీగిపోయందని చంద్రబాబు చావు తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి మేధావితత్వం బాబుకు ఎక్కువ.
 • ఏ విధంగా కప్పదాట్లు వేయాలి. ఎలా బురదజల్లాలన్న విషయాల్లో బాబు దిట్ట. 
 • నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉండి హోదా కోసం ఎందుకు ఒత్తిడి చేయడం లేదు
 • హోదా అన్నది కేబినెట్ తీసుకునే నిర్ణయం. నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదని  టీడీపీ కుంటిసాకులు  చెబుతోంది.
 • స్విస్ ఛాలెంజ్ తప్పు అని అందరూ చెబుతున్నా కేబినెట్ నిర్ణయమే అంతిమ నిర్ణయమని బాబు మాట్లాడుతున్నాడు.
 • బాబు దుర్భుద్ది. దొంగబుద్ది అన్నీ తర్వాత బయటపడతాయి. 
 • టీడీపీ కుతంత్రాల్ని, కుయుక్తుల్ని ప్రజలు గమనించాలి. 
 • ఏదేమైనా తమ పార్టీ అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడమేనని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ఇక్కడ మోసం.. అక్కడ పోరాటం..!

 •  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 20 శాతం కూడా పూర్తికాని రుణ‌మాఫీ
 •  తెలంగాణ‌లో పూర్త‌యిన రెండోవిడ‌త బ‌కాయి చెల్లింపులు
 • ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో రుణ‌మాఫీ చేయ‌కుండా తెలంగాణలో పోరాటం అంటున్న టీడీపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రైతుల్ని గాలికి వదిలేసిన టీడీపీ తెలంగాణ లో మాత్రం ప్రేమ ఒలకపోస్తోంది. రుణమాఫీ అంటూ రైతుల్ని నిండా ముంచేసిన చంద్రబాబు గిమ్మిక్కుల్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు.

ఏపీ లో దొంగాట ఇలా
 రుణ‌మాఫీ విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు, ఎన్నో ష‌ర‌తులు, మ‌రెన్నో వ‌డ‌పోత‌ల‌తో కోత‌లు పెట్టిన చంద్ర‌న్న‌స‌ర్కారు, వాట‌న్నింటినీ దాటుకొని అర్హ‌త సాధించిన రైతుల‌కు సొమ్ము చెల్లించే విష‌యంలో ప‌లు మ‌భ్య‌పెట్టే కార్య‌క్ర‌మాల‌కు చేప‌ట్టింది. రెండ‌వ కిస్తీ చెల్లింపుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైళ్ల‌పై సంత‌కాలు చేయ‌డం, వివిధ శాఖ‌లు జీవోలు ఇవ్వ‌డం మిన‌హా నేటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుద‌ల చేయ‌లేదు. అర‌కొర‌గా విడుదలైన సొమ్మును సైతం బ్యాంకుల‌కు బ‌దిలీచేయ‌ట్లేదు. అదిగో మాఫీ, ఇదిగో జీవో అన‌డంతో రైతులు బ్యాంకులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణలో దొంగ ప్రేమ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రుణ‌మాఫీ ప‌రిస్థితి ఇలా ఉంటే చంద్ర‌బాబు తెలంగాణ లో రుణ‌మాఫీల‌పై పోరాటం చేస్తాన‌టం విడ్డూరం. తెలంగాణ ప్ర‌భుత్వం ల‌క్ష‌లోపు రుణాలు మాఫీ చేస్తాన‌ని తెలిపి వాటిలో రెండు ద‌శ‌ల‌లో ఇప్ప‌టికే 50 శాతం బ‌కాయిలు చెల్లించింది. మూడ‌వ ద‌శ కిస్తీ చెల్లిపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొద‌టి విడ‌త కిస్తీ చెల్లింపు కూడా స‌క్ర‌మంగా చేయ‌లేదు. కానీ తెలంగాణ‌ రాష్ట్రంలో రుణ‌మాఫీ అమ‌లు చేయ‌డానికి, రైతుల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి చంద్ర‌బాబు పోరాటం చేస్తాన‌న‌డం హాస్యాస్ప‌దం. ఈ మేరకు టీ టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ రైతుల తరపున పోరాటం చేస్తామని ప్రకటిస్తున్నారు. 
త‌ల్లికి అన్నం పెట్ట‌లేని వాడు పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు కొనిస్తాన‌న్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రుణ‌మాఫీ చేయ‌కుండా తెలంగాణలో రుణమాఫీ కోసం పోరాటం చేస్తారంట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల మేనిఫెస్టో ప్ర‌కారం అంద‌రికీ రుణ‌మాఫీ చేస్తాను. తాక‌ట్టు పెట్టిన మీ పుస్తెల తాడు మీ ఇంటికి వ‌స్తుంది. తాక‌ట్టు పెట్టిన మీ ద‌స్తావేజులు మీ ఇంటికి వ‌స్తాయి అని మాట‌లు ప‌లికిన బాబు వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. మొద‌టి విడ‌త రుణ‌మాఫీలో 20 శాతం కూడా మాఫీ జ‌ర‌గ‌లేదు. బ్యాంకుల నుంచి చాలా మంది రైతులకు ఇప్ప‌టికే బంగారు న‌గ‌ల వేలం నోటీసులు అందాయి. ఇదీ చంద్రబాబు నైజం. 

చంద్ర‌న్న పాల‌న‌లో అన్నీ చందాలే..

 • కృష్ణా పుష్క‌రాల‌కు విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యం
 • కాపు ప‌థ‌కాల అమ‌లుకు డొనేష‌న్‌లు
 • కాపు ప‌థ‌కాల‌కు డొనేష‌న్ల సేక‌ర‌ణ‌పై కాపు సంఘాల ఆగ్ర‌హం
 • ఇంత వ‌ర‌కూ వెళ్ల‌డించ‌ని పాత విరాళాల వివ‌రాలు

    ప్ర‌జ‌ల నుంచి ఏ రూపాయి వ‌చ్చే అవ‌కాశం ఉన్నా వ‌ద‌ల‌కూడ‌ద‌ని చంద్రబాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టుంది. హుద్ హుద్ తుఫాను,  రాజ‌ధాని నిర్మాణం, స్మార్ట్ ఏపీ అంటూ గతంలో చందాలు పోగు చేసింది. ఆ డబ్బులన్నీ ఎటు పోయాయో ఎవరికీ తెలీదు. ఇప్పుడు తాజాగా మరో సారి చందాల సేకరణకు తెర దీశారు. 
పుష్కరాల పేరుతో కలెక్షన్లు
కృష్ణా పుష్కరాల్ని చందాల కోసం వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాదాపు వేల కోట్ల రూపాయిల డబ్బుల్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరో వైపు ప్రజల్లో భక్తి భావాన్ని క్యాష్ చేసుకొనేందుకు ఈ చందాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పుష్కరాల సమయంలో వచ్చే భక్తులకు తాగునీరు అందిస్తాం, చందాలు ఇవ్వండంటూ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  కృష్ణా పుష్క‌రాల‌లో 50 ల‌క్షల మ‌జ్జిగ ప్యాకెట్‌లు,  2 కోట్ల మంచినీరు బాటిళ్ళు సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యించారు.   
కాపు కార్పొరేషన్ కు విరాళాల సేకరణ
 కాపు కార్పొరేష‌న్ ద్వారా అమ‌లు చేసే ప‌థ‌కాల‌కు కూడా చందాలు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. కాపు కార్పొరేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం, విద్యా ప‌థ‌కాల‌కు విరాళాలు సేక‌రిస్తున్నారు. అధికారికంగా కాపు కార్పొరేష‌న్ వెబ్‌సైట్ ద్వారా డొనేష‌న్‌లు కోరుతున్నారు. ఎక్కువ చందాలు ఇచ్చిన వారి పేర్లు కాపు భ‌వ‌నాల‌కు పెడ‌తామ‌ని తెలిపారు. విదేశీ విధ్యా యోజ‌న ప‌థ‌కంలో విద్యార్థుల‌కు చందాల డ‌బ్బుల‌తోనే వ‌సతులు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. క‌నీసం రూ. 5 వేలు  త‌గ్గ‌కుండా విరాళాలు ఇవ్వాల‌ని క‌ట్టాఫ్ కూడా పెట్టారు. విరాళాలు వ‌చ్చేంత వ‌ర‌కు ప‌థ‌కాల అమ‌లుని పెండింగ్ పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డం, ఎన్నడూ లేనివిధంగా కాపు కార్పొరేష‌న్ ప‌థ‌కాల‌కు చందాలు సేక‌రించ‌డంపై కాపుల‌నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. 
కలెక్షన్ పాయింట్ లు ఖరారు
పుష్క‌రాల కోసం విరాళాలు సేక‌రించ‌డానికి విజ‌య‌వాడ కార్పొరేష‌న్ కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో  యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ప్ర‌త్యేక అకౌంట్‌లును ఓపెన్ చేశారు. ఇప్ప‌టికే హుద్ హుద్ తుఫాను చందాలు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, స్మార్ట ఆంధ్ర వంటి ప‌నుల‌కు చందాలు వ‌సూలు చేశారు. ఇంత వ‌ర‌కూ చందాల సేక‌ర‌ణ ద్వారా ఎంత డ‌బ్బు సేక‌రించారో ఇప్ప‌టి వ‌ర‌కు వివ‌రాలు బయట పెట్టలేదు.  ఇప్పుడు కృష్ణా పుష్క‌రాల పేరిట ఎంత మొత్తాన ప్ర‌జాధ‌నాన్ని దోచుకోబోతున్నారో అన్న మాట వినిపిస్తోంది.

16 July 2016

చంద్ర‌బాబు కాదు మందుబాబు

 • బాబు రాష్ట్రంలో మ‌ద్యాన్ని ఏరులై పారిస్తున్నారు
 • ప్రజలను దోచుకోవడమే బాబు విజన్ 20
 • మద్యం ఉత్పత్తిలో ఏపీని నంబర్ 1 చేయాలని చూస్తున్నాడు
 • ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్నాడు.. చుక్కనీరివ్వడం లేదు
 • కానీ నారావారి సారా స్రవంతి మాత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది
 • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
హైదరాబాద్ః మ‌ద్యం ఉత్ప‌త్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే నంబ‌ర్ 1 చేయ‌డానికి బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మండిపడ్డారు. ప్ర‌తీ ఇంటికి రూ. 2 తో 20 లీట‌ర్ల మంచినీళ్ల‌ను ఎన్టీయ‌ార్ సుజ‌ల‌స్ర‌వంతి ద్వారా అందిస్తామ‌ని చెప్పిన బాబు....   రెండు చుక్క‌ల నీరు కూడా అందించ‌డం లేద‌ని అంబటి ఫైరయ్యారు. ఆపథకం ఎక్కడపోయిది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  . హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే....

 • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని చంద్ర‌బాబు అవినీతి రాష్ట్రంగా మార్చార‌ు.
 • ఎన్టీఆర్ సుజ‌ల‌స్ర‌వంతి సంగతి దేవుడెరుగు ... నారా వారి సారా స‌వ్రంతి మాత్రం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది.
 • మ‌ద్యం తాగ‌ాల‌నుకునే వారికి ఎక్కడా లోటు రాకుండా టీడీపీ పుష్క‌లంగా మ‌ద్యం అందించే కార్య‌క్ర‌మం చేస్తుంది.
 • 8.78 కోట్ల ఫ్రూఫ్ లీట‌ర్ల మ‌ద్యాన్ని ప్రైవేట్ రంగంలో ఉత్ప‌త్తి చేయాల‌ని బాబు ఒక జీవోను విడుద‌ల చేశార‌ు.
 • మళ్లీ కొత్త‌గా 1,489 ల‌క్ష‌ల ఫ్రూఫ్ లీట‌ర్ల‌ మ‌ద్యం ఉత్ప‌త్తికి అనుమ‌తుల‌ను మంజూరు చేస్తూ మ‌రో జీవోను విడుద‌ల చేశారు.
 • మ‌ద్యం వినియోగం త‌గ్గిస్తాం... ప్ర‌తి ఊర్లో డీ ఎడిక్ష‌న్ సెంట‌ర్లు పెడ‌తాం... ద‌శ‌ల వారీగా మ‌ద్యాన్ని నిషేదిస్తామ‌న్న బాబు హామీ ఏమైంది.
 • హైవే పక్క‌న మ‌ద్యం దుకాణాలు ఉంటే డ్రైవ‌ర్లు మ‌ద్యం సేవించి ప్ర‌మాదాల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అక్కడ దుకాణాలు ఉండొద్ద‌ని గ‌త ప్ర‌భుత్వాలు జీవోల‌ను విడుద‌ల చేశాయి. 
 • చంద్ర‌బాబు వ‌చ్చిన త‌ర్వాత హైవేలు అయిన ప‌ర్వాలేదు... మ‌ద్యం దుక‌ణాల‌ను ప్రారంభించండి అని అధికారుల‌కు చెప్ప‌డ‌మే కాకుండా టేట్రాప్యాక్‌ల‌ను తీసుకురావ‌డం సిగ్గు చేటు. 
 • ప్ర‌జ‌ల‌ను మ‌ద్యానికి బానిస  చేసేటువంటి కార్య‌క్ర‌మాల‌ను త్వ‌రిత‌గ‌తిన అమ‌లు చేయ‌డంతో చంద్ర‌బాబు నంబ‌ర్‌ వన్ స్థానంలో ఉన్నాడు. 
 • మ‌ద్యం వ‌ల్లే కుటుంబాలు చిన్న‌భిన్నం అవుతున్నాయ‌ని... తాను అధికారంలోకి రాగానే బెల్టు షాపుల‌ను పూర్తిస్థాయిలో ర‌ద్దు చేస్తాన‌ని చంద్ర‌బాబు త‌న పాద‌యాత్ర‌లోప్ర‌గాల్భాలు ప‌లికారు.
 • బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీలో ఏ ఒక్క చోటైనా మ‌ద్యం దుకాణాల‌ను ర‌ద్దు చేశారా .
 • ర‌ద్దు చేయ‌క‌పోగా నూత‌న మ‌ద్యం దుకాణాల‌కు లైసెన్సులు జారీ చేస్తూ ఏపీలో మ‌ద్యాన్నిఏరులై పారిస్తున్నారు. 
 • కేవ‌లం క‌మిష‌న్ల కోసమే ప‌ట్టిసీమ‌, మ‌ద్యం ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మాలు 
 • ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతిని ముంచేశారు.... క‌మిష‌న్లు ఇస్తే త‌ప్ప ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి ప్రారంభం కాద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది
 • రెక్క‌ాడితే గానీ డొక్క‌ాడ‌ని వారిని దోచుకునేందుకే బాబు విజ‌న్-20.
 • మ‌ద్యాన్ని విప‌రీతంగా తాగించ‌డం, క‌ల్తీ మ‌ద్యం విక్ర‌యాలు చేయించ‌డ‌మే విజ‌న్‌-20 అని ఆరోపించారు.
 • రాష్ట్రంలో ఇలాగే మ‌ద్యాన్ని కొన‌సాగిస్తే ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బ‌దులు మందు బాబు అని పిలుస్తార‌ు. 
 • మంత్రి నారాయ‌ణ కోసం ప్ర‌భుత్వ విద్యాల‌యాలు మూయించేశారు.
 •  చైనా వారి కోసం దేవాల‌యాలు కూల్చారు.
 • క‌మిష‌న్ల కోసం మ‌ద్యాన్ని పెంచి పోషించి కాపురాల‌ను కూల్చొద్దని బాబును డిమాండ్ చేస్తున్నాం. 
 • గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల స్పందన మ‌హోద్యమంగా ఉంది. 

బాబు పాదం..భయం భయం

 • పుష్కరాలంటేనే భయపడేలా చేస్తున్న టీడీపీ
 • ఇంకా కళ్ళముందే కదలాడుతున్న తొక్కిసలాట ఘటన
 • బాబు పబ్లిసిటీ పిచ్చి  కారణంగా గోదావరి పుష్కరాల్లో  29 మంది బలి
 • అయినా ముఖ్యమంత్రిపై కొరవడిన చర్యలు
 • కృష్ణాపుష్కరాల నేపథ్యంలో మళ్లీ ప్రజల్లో అలజడి

ఏపీః 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. భక్తి, విశ్వాసంతో నదిలో పవిత్రస్నానం చేసి  కష్టాల నుండి విముక్తిని ప్రసాదించమని దేవతలను కోరుకుంటారు. ఇందుకోసం  సుదూర ప్రాంతాల నుంచి  ప్రజలు పెద్ద ఎత్తున నుంచి తరలివస్తుంటారు. ఐతే, ఏపీలో పుష్కరాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. కృష్ణా పుష్కరాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. అందుకు కారణం గత గోదావరి పుష్కరాల్లో జరిగిన భయానక దుర్ఘటన ఇంకా రాష్ట్ర ప్రజల కళ్ల ముందు కదలాడుతోంది. 

బాబు పాదం మోపితే ఏమవుతుందోనని ఆందోళన.. 
చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కర ఘాట్ లో 29 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే.  షూటింగ్ కోసం సామాన్య భక్తుల ఘాట్ లోకి బాబు పాదం మోపడంతో అక్కడ అలజడి మొదలైంది.  ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో కళ్లముందే క్షణాల్లో 29 మంది అమాయక ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. దేవుని పుణ్యం కోసం వచ్చిన భక్తులకు చంద్రబాబు చేసిన పుణ్యకార్యం కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో, ఏపీలో పుష్కరాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. మళ్లీ ఆపాదం కృష్ణా పుష్కరాల్లో మోపితే ఏమవుతుందోనని భయపడుతున్నారు. మరోవైపు, గోదావరి పుష్కరాల పేరుతో వందలాది కోట్లు దోచుకున్న చంద్రబాబు టీం..కృష్ణా పుష్కరాల పేరుతో మరింత దోపిడీకి స్కెచ్ వేశారు. 

కష్టాలు తీరాలంటే జననేత రావాలి..
గోదావరి పుష్కరాల మరణాలకు ఏడాది అయినా ఇంతవరకు బాబుపై ఒక్క కేసు లేదు. విచారణ అంతకన్నా లేదు. ప్రజల బాగోగుల కోసం తపించాల్సిన ముఖ్యమంత్రే...తన పబ్లిసిటీ కోసం  వారి ప్రాణాలు హరింపజేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రతీ ఒక్కరూ బాబుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో బాబు పాదం మోపిన నాటి నుంచి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కరువు కాటేస్తోంది. కాలం చిన్నబుచ్చుకుంంది. దీంతో బిక్కచిక్కిన రైతన్నలు బతకలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తోనే సాధ్యమని ప్రజలంతా కోరుకుంటున్నారు. వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.