16 July 2016

బాబు పాదం..భయం భయం

  • పుష్కరాలంటేనే భయపడేలా చేస్తున్న టీడీపీ
  • ఇంకా కళ్ళముందే కదలాడుతున్న తొక్కిసలాట ఘటన
  • బాబు పబ్లిసిటీ పిచ్చి  కారణంగా గోదావరి పుష్కరాల్లో  29 మంది బలి
  • అయినా ముఖ్యమంత్రిపై కొరవడిన చర్యలు
  • కృష్ణాపుష్కరాల నేపథ్యంలో మళ్లీ ప్రజల్లో అలజడి

ఏపీః 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. భక్తి, విశ్వాసంతో నదిలో పవిత్రస్నానం చేసి  కష్టాల నుండి విముక్తిని ప్రసాదించమని దేవతలను కోరుకుంటారు. ఇందుకోసం  సుదూర ప్రాంతాల నుంచి  ప్రజలు పెద్ద ఎత్తున నుంచి తరలివస్తుంటారు. ఐతే, ఏపీలో పుష్కరాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. కృష్ణా పుష్కరాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. అందుకు కారణం గత గోదావరి పుష్కరాల్లో జరిగిన భయానక దుర్ఘటన ఇంకా రాష్ట్ర ప్రజల కళ్ల ముందు కదలాడుతోంది. 

బాబు పాదం మోపితే ఏమవుతుందోనని ఆందోళన.. 
చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కర ఘాట్ లో 29 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే.  షూటింగ్ కోసం సామాన్య భక్తుల ఘాట్ లోకి బాబు పాదం మోపడంతో అక్కడ అలజడి మొదలైంది.  ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో కళ్లముందే క్షణాల్లో 29 మంది అమాయక ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. దేవుని పుణ్యం కోసం వచ్చిన భక్తులకు చంద్రబాబు చేసిన పుణ్యకార్యం కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో, ఏపీలో పుష్కరాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. మళ్లీ ఆపాదం కృష్ణా పుష్కరాల్లో మోపితే ఏమవుతుందోనని భయపడుతున్నారు. మరోవైపు, గోదావరి పుష్కరాల పేరుతో వందలాది కోట్లు దోచుకున్న చంద్రబాబు టీం..కృష్ణా పుష్కరాల పేరుతో మరింత దోపిడీకి స్కెచ్ వేశారు. 

కష్టాలు తీరాలంటే జననేత రావాలి..
గోదావరి పుష్కరాల మరణాలకు ఏడాది అయినా ఇంతవరకు బాబుపై ఒక్క కేసు లేదు. విచారణ అంతకన్నా లేదు. ప్రజల బాగోగుల కోసం తపించాల్సిన ముఖ్యమంత్రే...తన పబ్లిసిటీ కోసం  వారి ప్రాణాలు హరింపజేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రతీ ఒక్కరూ బాబుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో బాబు పాదం మోపిన నాటి నుంచి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కరువు కాటేస్తోంది. కాలం చిన్నబుచ్చుకుంంది. దీంతో బిక్కచిక్కిన రైతన్నలు బతకలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తోనే సాధ్యమని ప్రజలంతా కోరుకుంటున్నారు. వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment