22 July 2016

హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు

 • టీడీపీ కుట్రల్ని ప్రజలు గమనించాలి
 • హోదా కోసం ఎవరు పోరాడినా మా మద్దతుంటుంది
 • ప్రత్యేకహోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయం
 • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్: ప్రత్యేకహోదాపై టీడీపీ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటోందని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హోదాకు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంట్ కు రానున్న నేపథ్యంలో... టీడీపీ చావు తెలివి తేటలు ప్రదర్శిస్తోందన్న అనుమానం, భయాందోళన కలుగుతోందని  బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొత్స ఇంకా ఏమన్నారంటే...

 • రాష్ట్రానికి హోదాయే సంజీవని ... ప్రత్యేకహోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయం
 • ప్రత్యేకహోదా కోసం ఎవరు పోరాడినా మద్దతిస్తామని ఎన్నో సార్లు చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. 
 • ఇప్పటికే హోదా కోసం అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో ఎన్నో ఆందోళనలు చేపట్టాం. 
 • ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలో, ఢిల్లీలో ధర్నాలు-దీక్షలు చేశాం. కేంద్రపెద్దలను కలిశాం. యువభేరి సదస్సులు నిర్వహించాం.
 • 2015 ఆగష్టు 31వ తేదీన .. 2016 మార్చి 16న అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానాలను సమర్థించాం.
 • ప్రత్యేక హోదాపై ప్రత్యేక బిల్లు అవసరం లేదన్నది మా అభిప్రాయం.  
 • ఎందుకంటే, పార్లమెంటు సాక్షిగా ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. దాన్ని బీజేపీ కూడా అంగీకరించింది. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని ఆనాడు వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. 
 • హోదాతో పాటు పోలవరానికి సంబంధించి తెలంగాణ నుంచి కొన్ని మండలాలు కలపాలనే విషయాలు కూడా విభజన సమయంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేశారు.  కానీ, ప్రత్యేక హోదాను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.
 • ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటుతో ఎందుకు ముడిపెడుతున్నారు.
 • పార్లమెంట్ ఆమోదం కావాలని కోరడం ద్వంద్వవైఖరికి నిదర్శనం. దీనికి టీడీపీయే పూర్తి బాధ్యత వహించాలి.
 • పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లును మేం సమర్థిస్తాం. రాజ్యసభలో బిల్లు ఓకే అయినా అది చట్టం అవ్వాలంటే లోక్ సభలో కూడా పూర్తి మెజారిటీ కావాలి. 
 • లోక్ సభలో ఎన్డీఏ భాగస్వామ్యాలదే మెజారిటీ. అందులో టీడీపీ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 
 • లోక్ సభలో బిల్లు వీగిపోయందని చంద్రబాబు చావు తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి మేధావితత్వం బాబుకు ఎక్కువ.
 • ఏ విధంగా కప్పదాట్లు వేయాలి. ఎలా బురదజల్లాలన్న విషయాల్లో బాబు దిట్ట. 
 • నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉండి హోదా కోసం ఎందుకు ఒత్తిడి చేయడం లేదు
 • హోదా అన్నది కేబినెట్ తీసుకునే నిర్ణయం. నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదని  టీడీపీ కుంటిసాకులు  చెబుతోంది.
 • స్విస్ ఛాలెంజ్ తప్పు అని అందరూ చెబుతున్నా కేబినెట్ నిర్ణయమే అంతిమ నిర్ణయమని బాబు మాట్లాడుతున్నాడు.
 • బాబు దుర్భుద్ది. దొంగబుద్ది అన్నీ తర్వాత బయటపడతాయి. 
 • టీడీపీ కుతంత్రాల్ని, కుయుక్తుల్ని ప్రజలు గమనించాలి. 
 • ఏదేమైనా తమ పార్టీ అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడమేనని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

No comments:

Post a Comment