23 July 2016

ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే స్థాయిలో లేరు... భ‌య‌పెట్టే స్థాయిలో ఉన్నారు

గుంటూరు) ఎక్క‌డ విలువైన భూములు క‌న‌బ‌డితే అక్క‌డ చంద్ర‌బాబు... ఆయ‌న త‌న‌యుడు లోకేష్ క‌న్ను ప‌డుతోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు. లోకేష్ బినామీ దారులు రూ. 3 - 4 ల‌క్ష‌లకు భూముల‌ను కొనుగోలు చేసి... వాటిని రూ. 4 - 5 కోట్ల‌కు అమ్ముకుంటే త‌ప్పులేదుగానీ, అదే ఒక సామాన్య పేద రైతు వంశ‌ప‌ర్యంప‌రంగా వ‌స్తున్న భూమిని కాపాడుకోవ‌డం కోసం పోరాటం చేస్తే నేర‌మా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయటంపై ఆయన మండిపడ్డారు. అంబటి ఏమన్నారో ఆయన మాటల్లోనే...
 * భూముల‌ను లాండ్ పూలింగ్‌కు ఇవ్వ‌క‌పోతే వారిపై భూ సేకరణ నోటిఫికేష‌న్లు జారీ చేయ‌డం సిగ్గు చేటు
* ప్ర‌జ‌ల‌ను బెదిరిస్తే భ‌య‌ప‌డుతార‌ని బాబు అనుకోవ‌డం ఆయ‌న భ్ర‌మ‌.
* ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే స్థితిలో లేరు. భ‌య‌పెట్టే స్థాయిలో ఉన్నారు. పేద రైతుల పోరాటానికి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంది.
* వేలం పాట పేర టీడీపీ బినామీలు దేవాల‌య భూముల‌ను మింగేస్తున్నారు... చంద్ర‌బాబు దిన‌చ‌ర్య భూముల‌ను మింగేయ‌డ‌మే.
 భూ కేటాయింపు విధానం లోపభూయిష్టం
* అసెంబ్లీలో 50శాతానికి పైగా సీట్లు ఉంటే ఆ పార్టీకి నాలుగు ఎక‌రాల భూమి... 50 శాతానికి త‌క్కువ‌గా ఉంటే అర ఎక‌రం ఎలా కేటాయిస్తారు..?
* కేవ‌లం రాజ‌ధాని ప్రాంతంలో నాలుగు ఎక‌రాల భూమిని కాజేయ‌డం కోస‌మే బాబు అవినీతి పాల‌సీలు
* దేశంలో గుర్తింపు కలిగిన రాజ‌కీయ పార్టీల‌కు పార్టీ కార్యాల‌యాల కోసం భూములిచ్చే సంప్ర‌దాయం ఉంది
* టీడీపీ ఈ సంప్ర‌దాయాన్ని అడ్డుపెట్టుకొని కీల‌క‌మైన ప్రాంతాల్లో భూముల‌ను కాజేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతోంది
* అసెంబ్లీలో 50 శాతం సీట్లు ఉన్నాయి కాబ‌ట్టి టీడీపీకి నాలుగు ఎక‌రాల భూమిని కేటాయిస్తారు.... 2019లో టీడీపీకి 50శాతం సీట్లు రాక‌పోతే ఇప్పుడు తీసుకున్న నాలుగు ఎక‌రాల భూమిని తిరిగి ఇచ్చే దమ్ము బాబుకు ఉందా..?
* ఎప్పుడు సీట్ల ప‌రంగా భూ కేటాయింపులు ఎప్పుడు జ‌ర‌గ‌లేదు
* చంద్ర‌బాబు కేవ‌లం భూదాహంతో నాలుగు ఎక‌రాలు కాజేయాల‌ని చూస్తున్నారు... 
* టీడీపీ వేల కోట్ల అవినీతి పాల్ప‌డుతుంది క‌దా... కీల‌క‌మైన ప్రాంతంలో నాలుగు ఎక‌రాల భూమిని కూడా కొనుగోలు చేయ‌లేరా అని ప్ర‌శ్నించారు

బాబుది భూ దోపిడీ
* బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక జిల్లాల్లో కీల‌క‌మైన ప్రాంతాల్లోని భూముల‌ను పార్టీ కార్యాల‌యాల కోసం కాజేసేందుకు జీవోలు విడుద‌ల చేశారు. 
* చంద్ర‌బాబు అధికారంలో లేన‌ప్పుడు మ‌చిలీప‌ట్నం పోర్టుకి వెయ్యి ఎక‌రాలు చెబుతారు...
* ఆయ‌న అధికారంలో ఉంటే మాత్రం  ల‌క్ష‌ల ఎక‌రాలు కావాల‌ని చెప్ప‌డం దౌర్భాగ్యం.
* రాజ‌ధాని కోసం 35వేల ఎక‌రాల‌ను తీసుకున్నారు. డీ నోటిఫై చేయ‌మ‌ని చెప్పి సుమారు ల‌క్ష ఎక‌రాల‌ను రాజ‌ధాని కోసం తీసుకొని ఏం చేస్తారో అర్థం కావ‌డం లేదు.

అందరికీ ఇబ్బందులు
* స‌రైన వ‌స‌తులు లేకున్న సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగుల‌ను  హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.
* మ‌రి హైకోర్టు విభ‌జ‌న మాత్రం ఇప్పుడు వ‌ద్ద‌ని ఎందుకు వారిస్తున్నారో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి
* అర్హులైన పేద‌వారికి మూడు సెంట్ల భూమి ఇస్తాన‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు
* అధికారంలోకి రాగానే ఉన్న భూముల‌ను లాక్కుంటున్నారు...
* పేద‌వారికి మూడు సెంట్ల భూమిని ఇవ్వ‌కుండా... రాజ‌కీయ పార్టీల‌కు భూములు కేటాయించ‌డం అవ‌స‌రమా..?
* దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 5 సంవ‌త్స‌రాల మూడు నెల‌లు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని ప‌రిపాలించినప్పటికీ ఏనాడు ఏ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌లేదు.. 
* మ‌రి బాబు విదేశీ ప‌ర్య‌టన‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి
* స్విస్ ఛాలెంజ్ విధానం  మొత్తం దోపిడీ విధాన‌మే.
* బాబు కుటుంబ స‌భ్యుల కంపెనీలే సింగ‌పూర్‌లో బినామీల పేర ఉన్నాయి 

No comments:

Post a Comment