28 November 2017

పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లే కొండంత అండ‌

నెల్లూరు:  తనకు భద్రత వద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే కొండంత అండగా ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి స్ప‌ష్టం చేశారు. మ‌రోమారు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను ఆయ‌న నిరాకరించారు. మూడున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే పోలీసు భద్రతా విభాగం ఇద్దరు గన్‌మెన్లను ఆయనకు కేటాయించింది. తనకు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా తెలిపారు. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అనుసరించి మరో రెండుసార్లు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించగా తిప్పి పంపారు.  తాజాగా నిన్న మళ్లీ ఇద్దరు గన్‌మెన్లను కేటాయించగా.. ఈసారీ కూడా అవ‌స‌రం లేద‌ని వెనక్కి పంపారు. పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో భద్రత తప్పనిసరి అని, అందుకే పంపామని పోలీస్‌ అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డీజీపీ, ఇంటిలిజెన్స్‌ డీజీ, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 

పూలేకు వైయ‌స్‌ జగన్ నివాళి

క‌ర్నూలు: మహాత్మ జ్యోతిరావు పూలే వ‌ర్ధంతి సందర్భంగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే  చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. వివ‌క్ష‌త‌ విడనాడి భవిష్యత్‌ తరాలకు సమసమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పూలే చేసిన సేవలను ఆయన స్మ‌రించుకున్నారు. కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. 

బాక్సైట్‌ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా?

విజయనగరం : గతంలో బాక్సైట్‌ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్‌ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సూటిగా ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి టీడీపీలో చేర‌డం ప‌ట్ల పుష్ప‌శ్రీ‌వాణి తీవ్రంగా ఖండించారు. సోమ‌వారం ఆమె విజ‌య‌న‌గ‌రంలో మీడియాతో మాట్లాడారు.  2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాట్లోనే విన్నామ‌న్నారు. వైయ‌స్‌ జగన్‌ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు గిడ్డి ఈశ్వ‌రి చెప్పడం దురదృష్టకరమ‌న్నారు. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే...2014లో మీకు వైయ‌స్‌ జగన్‌ సీటు ఇచ్చారో చెప్పాల‌ని నిల‌దీశారు.  నిన్న, మొన్నటి వరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు రాత్రికి రాత్రే పార్టీ మారేంత అభివృద్ధి ఏం క‌నిపించ‌ద‌న్నారు. గిరిజనులకు టీడీపీ సర్కార్‌ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు ... మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదమ‌ని విమ‌ర్శించారు. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి...ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే మీరు పార్టీ మారారో చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.  వైయ‌స్‌ఆర్‌ సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి అని పుష్ప‌శ్రీ‌వాణి డిమాండ్‌ చేశారు

20వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

క‌ర్నూలు:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు పాద‌యాత్ర ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రను మొద‌లుపెట్టారు. అక్కడ నుంచి హెచ్ కైరవడి, గాజులదిన్నె క్రాస్‌ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం అవుతుంది. గోనెగొండ్లలో పార్టీ జెండా ఆవిష్కరించి, బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రికి వైయ‌స్ జగన్‌ గోనెగండ్లలోనే బస చేస్తారు.

ముగిసిన 19వ రోజు ప్రజా సంకల్ప యాత్ర

కర్నూలు: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 19వ రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే  ముగిసింది. సోమవారం కోడుమూరు నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ ఎ్రరగుడి మీదుగా కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ వేముగోడు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

20వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది.  మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్‌ కిరవడి, గాజులదిన్నె క్రాస్‌ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం అవుతుంది. గోనెగొండ్లలో పార్టీ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 6.30 గంటలకు వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ముగయనుంది. రాత్రికి ఆయన గోనెగండ్లలోనే బస చేస్తారు.

వేముగోడులో జననేతకు ఘన స్వాగతం

కర్నూలు: వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేముగోడు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం కోడుమూరు నియోజకవర్గం నుంచి వైయస్‌ జగన్‌ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్థానికులు తమ సమస్యలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మిగ‌నూరులోకి ప్ర‌వేశించిన వైయ‌స్ జ‌గ‌న్‌

కర్నూలు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 19వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరులోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌వేశించింది. సోమ‌వారం ఉద‌యంవెంకటగిరి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర మొదలుపెట్టారు.  అక్క‌డి నుంచికోడుమూరు సోమప్ప కోట సర్కిల్ లో ఏర్పాటు చేసిన రైతుల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొని రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అనంత‌రం వ‌క్కూరు ఎస్సీ కాలనీలో పార్టీ జెండాను వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరిస్తారు. మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం త‌రువాత గోనేగండ్ల మండ‌లంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. వేముగోడులో ఈరోజు పాదయాత్రను ముగించి, అక్కడే బస చేస్తారు.  

25 November 2017

నారాయ‌ణ‌రెడ్డికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

క‌ర్నూలు:  దివంగ‌త నేత చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా శ‌నివారం జ‌న‌నేత క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చెరుకుల‌పాడు గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం దివంగ‌త నేత‌ నారాయ‌ణ‌రెడ్డి స‌మాది వ‌ద్ద‌కు చేరుకుని పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. నారాయ‌ణ‌రెడ్డి సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని పార్టీ శ్రేణుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.

వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల మ‌ద్ద‌తు

క‌ర్నూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీభావం తెలిపారు. చెరుకుల‌పాడు గ్రామం వ‌ద్ద శ‌నివారం జ‌న‌నేత‌కు క‌లిసిన కాంట్రాక్ట్ కార్మికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌ను రెగ్యుల‌ర్ చేస్తామ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. వీరి స‌మ‌స్య‌లు విన్న వైయస్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

వైయస్ జగన్ ను కలిసిన ముస్లిం సోదరులు..

వెల్దుర్తిలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం నాడు పలువురు ముస్లిం సోదరులు, మత పెద్దలు కలుసుకుని తమ సమస్యలను వివరించారు.   మౌజమ్ పేష్మామ్,ఇమామ్ లకు ఇచ్చిన హామీని తెలుగుదేశంపార్టీ , ప్రభుత్వం విస్మరించిందంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇస్తామని చెప్పి తమ గురించి పట్టించుకోవడం లేదని  ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకుని వచ్చారు. వీరికి న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.

వెల్దుర్తి లో మహిళలతో భేటీ అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి

వెల్దుర్తి:  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 17 వ రోజైనశనివారం నాడు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వెల్దుర్తిలో పలువురు మహిళలు కలుసుకుని తమ గోడు వెలిబుచ్చుకున్నారు. వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న జగన్ , బ్యాంకు రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ చేస్తామన్న తెలుగుదేశం హామీ, కొత్త రుణాల మంజూరు వంటి విషయాలపై సమాచారాన్ని అడిగారు.

చెరుకుల‌పాడు చేరుకున్న జ‌న‌నేత‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే చెరుకుల‌పాడు గ్రామానికి చేరుకున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 17వ రోజు శ‌నివారం వెల్దుర్తి నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి పాద‌యాత్ర‌గా వైయ‌స్ జ‌గ‌న్ చెరుకుల‌పాడు చేరుకోవ‌డంతో గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  ఇక్క‌డి నుంచి పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్ రోడ్డు మీదుగా పాద‌యాత్ర సాగ‌నుంది. 

వెల్దుర్తి నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

క‌ర్నూలు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ప్రారంభమైంది. పాద‌యాత్ర‌లో భాగంగా 17వ రోజు శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు. ఇవాళ‌ వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 6.30 గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు.  

వెల్దుర్తి నుంచి 17వ రోజు ప్రజాసంకల్పయాత్ర

క‌ర్నూలు:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఉదయం 8 గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు చేరుకుంటారు.  ఈ యాత్రలో వైయ‌స్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు.  అనంతరం రాత్రి 7.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ బస చేస్తారు. ఈమేరకు 17రోజు పర్యటన వివరాలను వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.

డిప్యూటీ సీఎం ఉన్నా ఒక్క పని కూడా చేయలేదు

వెల్దుర్తి: పత్తికొండ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఉన్నా..ఏ ఒక్క పని కూడా చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీదేవి మాట్లాడారు.  ఎన్నికల ముందు చంద్రబాబు అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చారని శ్రీదేవి విమర్శించారు. బాటు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, ప్రజల కోసమే వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించారని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 3 వేల కిలోమీటర్ల మేర  వైయస్‌ జగన్‌ పాదయాత్రగా బయలుదేరారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జననేతకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజలు జననేతకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరిస్తున్నారని చెప్పారు. రుణమాఫీ అంటే వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు. ఎన్నికలకు ముందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి హమీ ఇవ్వకపోయినా రుణమాఫీ చేశారన్నారు. కానీ ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేసిందన్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని నిప్పులు చెరిగారు. ఈ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రజలు జననేతకు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చేది రాజన్న రాజ్యమే అని ఆమే ధీమా వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి బౌతికంగా లేకపోయినా నాకు ప్రతి ఒక్కరు అండగా నిలిచారన్నారు. 

వెల్దుర్తిలో కాసేపట్లో బహిరంగ సభ

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో కాసేపట్లో బహిరంగ సభ జరుగనుంది. ఇవాళ ఉదయం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి రామళ్లకోట, బోయినపల్లె మీదుగా సాగుతోంది. కాసేపట్లో వెల్దుర్తి పట్టణంలోని వైయస్‌ జగన్‌పాదయాత్ర చేరుకుంటుంది. వైయస్‌ జగన్‌ కోసం స్థానికులు అధిక సంఖ్యలో వెల్దుర్తికి తరలిరావడంతో మండల కేంద్రం జనసంద్రమైంది.

17 November 2017

అలుపెరగని పది రోజులు


– 137 కిలోమీటర్లు పూర్తి చేసిన జననేత 
– తన దృష్టికొచ్చిన ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీత
– సీపీఎస్‌ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ 
– విలేజ్‌ సెక్రటేరియట్‌తో గ్రామ స్వరాజ్యం 
– విశ్రాంతి సమయం తగ్గించుకుని ప్రజలతోనే మమేకం

ప్రతిపక్ష నాయకుడు, వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పదిరోజుల పాటు పాదయాత్రను పూర్తిచేసిన జననేత కర్నూలు జిల్లా ప్రజలతో కలిసి నడుస్తున్నారు. పది రోజుల్లో 137 కిలోమీటర్లకు పైగానే తన పాదయాత్రను పూర్తి చేశారు. కడప జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగింది. మూడు రోజుల క్రితమే ఆయన కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. జననేత ఎక్కడికి వెళ్లినా అక్కడికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలనే తేడా లేకుండా జననేతను కలిసి తమ సాదక బాధలను చెప్పుకునేందుకు.. తమను ఆదుకుంటాడనే ఆశతో ఎదురుచూస్తున్నారు. 
ప్రజలకు అండగా నిలుస్తూ ముందుకు
పాదయాత్ర సందర్భంగా వివిధ సమస్యలపై తనను కలవడానికి వచ్చే వారితో ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. నడిచే దూరం కళ్లముందే కనబడుతున్నా ఓపిగ్గా ప్రతి ఒక్కరికీ సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. తనను కలవడానికి ఇబ్బంది పడుతున్న వయో వృద్ధులు, వికలాంగులను ఆయనే స్వయంగా వెళ్లి కలుస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. వారి నుంచి వినతులు స్వీకరిస్తూ వీలైన వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ.. కాని వాటికి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. భోజనం సమయంలోనూ విశ్రాంతి తీసుకోకుండా వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడేందుకే మక్కువ చూపిస్తున్నారు. 
సమస్యలసై నిలదీస్తూ..
పాదయాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించే సమయాల్లో స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు.. ప్రజావసరాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కడప జిల్లాలో గాలేరు–నగరి ప్రాజెక్టును సందర్శించి రాబోయే కాలంలో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానని రైతులు భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఆధారం లేని వృద్ధుల కోసం మండలానికో వృద్ధాశ్రమం, ఉద్యోగులకు అండగా ఉంటానని సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని భరోసా కల్పించారు. ప్రతి గ్రామానికి విలేజ్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి.. అందులో పది మంది ఉద్యోగులను నియమించడం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురాబోతున్నామంటూ తేల్చి చెప్పారు. పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్‌ లాంటి సమస్యలేవైనా 72 గంటల్లోనే పరిష్కరిస్తామని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా నియామకాలు చేపడతామని చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో నిష్పక్షపాతంగా పాలన చేయబోతున్నామని తేల్చి చెప్పారు. అన్ని అర్హతలుండీ పింఛన్లకు దూరంగా ఉంటున్న ఎంతోమంది జననేతను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 
పాదయాత్రపై సొంతంగా డైరీ 
పాదయాత్ర సందర్భంగా జననేత ఏరోజుకారోజు కార్యక్రమాలపై సొంతంగా డైరీ రాసుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై డైరీలోనూ స్పందిస్తున్నారు. పాదయాత్రలో తను చూసిన సంఘటనలపై.. ఆయా ప్రాంతాల్లో నడుస్తుండగా ప్రజలు చూపిస్తున్న ఆప్యాయతానురాగాలను ప్రస్తావిస్తున్నారు. పాదయాత్రలో తన అనుభవాలు తన దృష్టికొచ్చిన ప్రజా సమస్యలు.. ఆయా సమస్యలను తాను అధికారంలోకి వచ్చాక ఎలా పరిష్కిరంచబోతున్నారో ప్రధానంగా వివరిస్తున్నారు. 

బోటు ప్రమాదానికి దేవినేని ఉమానే బాధ్యుడు


–22 మంది ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయమా?
– ఏది జరిగినా అధికారులను బాధ్యులను చేస్తున్నారు
– మంత్రులు, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

కృష్ణా నదిలో బోటు ప్రమాదానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమానే బాధ్యుడు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దుర్ఘటనను మసి పూసి మారడికాయ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరిగేషన్‌ శాఖ మంత్రి సొంత నియోజకవర్గ పరిధిలోకి వస్తుందన్నారు. కూత వేటు దూరంలో ముఖ్యమంత్రి ఇల్లు ఉన్నా, ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్నా బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదంలో 22 మంది అమాయకులు చనిపోతే ప్రభుత్వానికి ఈ విషయం చిన్నదిగా కనిపిస్తుందా అని నిలదీశారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటు ఓనర్‌ దొరికారు. టూరిజమ్‌ జీఎంను సస్పెండ్‌ చేశామని ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ధ్వజమెత్తారు. అనధికారికంగా నడుపుతున్న బోటుకు ప్రభుత్వం అండ ఉందని పేపర్లో వచ్చిందని గుర్తు చేశారు. ప్రమాదం ఇరిగేషన్‌ శాఖ మంత్రికి సంబంధించిన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.అధికారులు అనధికార బోట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫైర్‌ అయ్యారు. బోటు మార్గంపై ఇరిగేషన్, టూరిజమ్‌ శాఖలు రూట్‌ మ్యాప్‌ వేయాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నారు.  కూతవేటు దూరంలో సీఎం నివాసం ఉన్నా, అధికారుల కార్యాలయం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

ఇరిగేషన్‌ శాఖ మంత్రికి ముడుపులు
ఈదుర్ఘటనకు బోటు, బోటు డ్రైవరేనా? దీనికి బాధ్యుడు ఇరిగేషన్‌ శాఖ మంత్రినే అని పార్థసారధి ఆరోపించారు. ఆయనకు నెల నెల ముడుపులు ముడుతున్నాయి కాబట్టి అనధికార బోట్లు తిరుగుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారని ఆక్షేపించారు. మంత్రికి సంబంధించిన చెంచాలు ఇసుక దోచుకుంటున్నారని, మట్టిని వదలడం లేదన్నారు. ఆయన అనుయాయులకే నీరు–చెట్టు కింద 150 పనులకు కాంట్రాక్టులు ఇచ్చారన్న సమాచారం ఉందన్నారు. గుంటకాడి నక్కలా దోచుకుంటున్న మంత్రినే ఈ దుర్ఘటనను పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. 

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు
బోటు ప్రమాదంపై ప్రభుత్వ వైఫల్యం ఉందని, అందుకే ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టడం లô దని పార్థసారధి అన్నారు.  చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టూరిస్టుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కనీసం స్వీమ్మర్స్, మోటర్‌ బోట్లు, లైఫ్‌ జాకెట్లు ప్రోవైడ్‌ చేయకుండా టూరిస్టు స్పాట్‌ అని ప్రజలను ఎందుకు మోసం చేశారని చంద్రబాబును నిలదీశారు. మీ మాటలు నమ్మి ప్రజలు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ బోటు ప్రమాదం జరిగిందన్నారు. మొట్టమొదటి నుంచి ఈ ్రçపమాదం ప్రజలకు తెలియకుండా మనిపూసి మారడి కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నేతలపై విమర్శలు చేయడం ఎంటని ప్రశ్నించారు. మృతదేహాలను బంధువులకు చూపకుండా పోస్టు మార్టం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా, ఇరిగేషన్‌ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయకుండా ముడుపులు దండుకోవడమే లక్ష్యంగా దేవినేని ఉమా పని చేస్తున్నారని ఆరోపించారు. 

అవినీతిలో టీడీపీది నాలుగో స్థానం
ప్రపంచంలోనే అత్యంత అవినీతికర పార్టీల్లో టీడీపీ నాలుగో స్థానంలో ఉందని పార్థసారధి తెలిపారు. తాను ఇటీవల ఓ సోషల్‌ మీడియా ఆర్టికిల్‌ చూశానని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైందని, మంత్రులు, టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. బోటు ఘటనపై జూడిషియల్‌ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు.

అభిమాన జనం మధ్య జగన్

-ప్రజాభిమానంతోసాగుతున్నప్రజాసంకల్పయాత్ర
-అడుగడుగునాజగనన్నకుజననీరాజనం
-నాలుగేళ్లరాక్షసపాలనతోవిసిగిపోయినప్రజలు
-యువనేతపైఅభిమానంచాటుకుంటున్నకర్నూలువాసులు
 గతమూడురోజులుగాప్రతిపక్షనేత, వైయస్సార్సిపిఅధినేతవైయస్జగన్మోహన్రెడ్డిప్రజాసంకల్పయాత్రకర్నూలుజిల్లాలోసాగుతోంది. ఆజిల్లాలోఅడుగుపెట్టినక్షణంనుంచిఅశేషప్రజావాహినిరాజన్నబిడ్డకుఎదురేగిస్వాగతంపలుకుతోంది. ప్రతిపల్లె, పట్నంఅతడికోసంపూలబాటనుపరుస్తోంది. తండ్రితీరుగానేప్రజలకష్టాలుతెలుసుకునేందుకువస్తున్నయువనేతనుప్రజలుఆప్యాయంగాపలకరిస్తున్నారు. తమగోడువెళ్లబోసుకుంటున్నారు. నాలుగేళ్లుగానరకాసురపాలనలోభయంతో, బాధలతోబతుకీడుస్తున్నామనిచెప్పుకుంటున్నారు. ఫించన్లురావడంలేదని, రుణమాఫీజరగలేదని, విత్తనాలుదొరకడంలేదని, బ్యాంకులుఅప్పులుఇవ్వడంలేదని, స్థానికనేతలువేధిస్తున్నారని, పోలీస్స్టేషన్లలలోన్యాయంజరగడంలేదనిచెబుతుంటేప్రతిపక్షనేతవారికిధైర్యంచెప్పారు. అరాచకత్వానికిరోజులుదగ్గరపడ్డాయన్నారు. మనప్రభుత్వంవచ్చాకమీసమస్యలన్నీతీరిపోతాయనిహామీఇచ్చారు. చాగలమర్రి, మైదుకూరు, ఆళ్లగడ్డ, దొర్నిపాడుమీదగావైయస్జగన్ప్రజాసంకల్పపాదయాత్రకొనసాగుతోంది. వైయస్మాగుండెల్లోనేఉన్నాడన్నాఅంటూరాజశేఖర్రెడ్డివిగ్రహాన్నిజగన్కుబహూకరించారుకొందరుఅభిమానులు. మరెకొందరుతమఅభిమాననేతకుఉత్తరాలుపంపారు. పాదయాత్రలోనడుస్తూనేవారిలేఖలనుచదివారువైయజ్జగన్.
కర్నూలుజిల్లాకుజరుగుతున్నఅన్యాయంగురించియువతప్రతిపక్షనేతకువివరించారు. చంద్రబాబుఈజిల్లాకుఇచ్చినహామీలుఒక్కటీనెరవేరలేదని, సీమలోయువతకుఉద్యోగాలేలేవనిమధనపడ్డారు. ఈసందర్భంగాకర్నూలుజిల్లాకుచంద్రబాబుప్రకటించినహామీలనువారుగుర్తుచేసారు. కర్నూలునుస్మార్ట్సిటీగారూపొందించడం, నూతనవిమానాశ్రయము, అవుకువద్దనూతనపారిశ్రామికనగరం, హైదరాబాద్ – బెంగళూరుపారిశ్రామికకారిడార్, టెక్స్టైల్స్క్లస్టర్, కోయిలకుంట్లలోసిమెంట్  ఉత్పత్తులహబ్, ఇండియన్ఇనిస్టిట్యూట్ఆఫ్ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, న్యూక్లియర్ఫ్యూయల్టెక్నాలజీ, స్విమ్స్తరహాసూపర్స్పెషాలిటీఆసుపత్రి, టూరిజంసర్కూట్, సోలార్మరియువిండ్పవర్, లైవ్స్టాక్స్రీసెర్చ్మరియుపాలిటెక్నిక్సెంటర్, విత్తనోత్పత్తికేంద్రము, రైల్వేవాగన్లమరమ్మత్తులకర్మాగారం, మైనింగ్స్కూల్, ఫుడ్పార్క్…ఇలానోటికొచ్చినహామీలన్నీఇచ్చి, మేనిఫెస్టోలోకూడాప్రింటుచేయించిమరీపంచినచంద్రబాబువీటిలోఒక్కహామీనైనానెరవేర్చలేదనిఆవేదనవ్యక్తంచేశారు.

పిల్లలను పోషించలేక అనాథాశ్రమంలో విడిచా..

కర్నూలు: ‘నా భర్త పుల్లయ్య టీబీ వ్యాధితో చనిపోయి మూడేళ్లైంది. నాకు చంద్రకళ, స్ఫూర్తి, ధరణి.. ముగ్గురు ఆడపిల్లలు. కేవలం నేను కూలీ పనులు చేసే బతకాలి. పొలం లేదు. పిల్లలను సాకలేక అనాథశ్రమంలో ఉంచి చదివిస్తున్నాను. నేను రోజు కూలి పోతేనే పూట గడుస్తుందన్నా.. మూడేళ్ల నుంచి వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నా రాలేదు. కనీసం మీరైనా పింఛన్‌ ఇప్పించండి’ అని వైయ‌స్‌ జగన్‌ ఎదుట పెద్దచింతకుంటకు చెందిన పి.లీలావతి గోడు వెళ్లబోసుకుంది. జన్మభూమి కమిటీ సభ్యులే తనకు పింఛన్‌ రాకుండా చేస్తున్నారని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెకు పింఛన్‌ వచ్చేలా చూడాలని పార్టీ నాయకులను చేయాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్‌ సొమ్మును రూ.2 వేలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కోర్టు తీర్పు బాబుకు చెంప పెట్టు


ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి
అమ‌రావ‌తి: రాజధాని నిర్మాణంపై ఈ రోజు ఎన్జీటి కోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబు కు చెంపపెట్టు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు . నదీ పరిరక్షణను, హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంలో నివాసం ఉండటం సిగ్గుచేటు అన్నారు. ఎన్జీటి తీర్పు నేపథ్యంలో నైనా ముఖ్యమంత్రి తన   అక్రమ నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాల‌ని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ పరిరక్షణకు సీఎం నివాసం నుంచే ప్రక్షాళన ప్రారంభించాల‌ని కోరారు.  కృష్ణా నదిని అక్కమార్కుల నుంచి, ఇసుక మాఫియా నుండి, టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి కాపాడాల‌ని, అలానే  కొండవీడు వాగును తమకు అనుకూలంగా మళ్ళించాలనే టీడీపీ కుట్రలకు ఎన్జీటీ బ్రేక్ వేసిందని ఆర్కే పేర్కొన్నారు.

మ‌ద్యం దుకాణం తొల‌గించాల‌ని ధ‌ర్నా

అనంత‌పురం: తాడిపత్రి ప‌ట్ట‌ణంలో జ‌నావాసాల మ‌ధ్య ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ను తొల‌గించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. జనావాసాల మధ్య ఉన్న హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ వల్ల స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని, వెంటనే దాన్ని మూసివేయాలని వైయ‌స్ఆర్ సీపీ నేత పెద్దారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన‌ వారిని అడ్డుకునేందుకు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు పెద్దఎత్తున అదే ప్రాంతానికి తరలిరావ‌డంతో ఉధ్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.

ర‌చ్చ‌బండ సాక్షిగా ‘ప‌చ్చ’ అవినీతి


- వైయ‌స్ఆర్‌సీపీ ర‌చ్చ‌బండ‌, ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మాల‌కు స్పంద‌న‌
- వెల్లువెత్తున్న స‌మ‌స్య‌లు
-  బ‌య‌ట‌ప‌డుతున్న జ‌న్మ‌భూమి క‌మిటీల అరాచ‌కాలు

అమ‌రావ‌తి: ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ రచ్చబండ, పల్లెనిద్ర కా ర్యక్రమాలకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గ్రామ గ్రామాన జ‌న్మ‌భూమి క‌మిటీలు చేస్తున్న అరాచకాలు వెలుగు చూస్తున్నాయి.  రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ నేత‌లు హామీ ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఏర్ప‌డ్డ జ‌న్మ‌భూమి క‌మిటీలు గ్రామాల్లో పెత్త‌నం చెలాయిస్తున్నాయి. ఈ క‌మిటీలు చెప్పిన వారికే పింఛ‌న్లు, రుణాలు, ప‌క్కా గృహాలు మంజూరు చేస్తున్నారు. టీడీపీ నాయ‌కులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్న అవినీతి, అరాచ‌కాలు ర‌చ్చ‌బండ సాక్షిగా వెలుగు చూస్తున్నాయి.

నవంబ‌ర్ 11 నుంచి ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు..
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీ మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నవంబర్‌ 11 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల అధ్య‌క్షుల నేతృత్వంలో నియోజకవర్గ సమన్వకర్తలు,  ఎమ్మెల్యేలు, మండ‌ల సమన్వయకర్తలు ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సింది ఉంటుంది. తొలుత గ్రామాల్లోకి వెళ్లి అక్కడ పార్టీ జెండా అవిష్కరించి వైయ‌స్ఆర్‌  విగ్రహానికి నివాళులర్పిస్తారు. తరువాత రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వివరించి స్లిప్‌లలో వారితో సంతకాలు సేకరిస్తారు. అనంతరం బూత్‌ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారు. గ్రామంలో ప్రభావితం చేసే ఉద్యోగులు, కుల సంఘాల నేతలను కలుస్తారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తారు. మధ్యలో నియోజకవర్గ స్థాయిలోని విద్యాసంస్థ విద్యార్దులతో సమావేశమవుతారు. 

స‌మ‌స్య‌ల వెల్లువ‌
రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో స‌మ‌స్య‌లు వెల్లువెత్తుతున్నాయి.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు జ‌నం అధిక సంఖ్య‌లో హాజ‌రై ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.  ప్ర‌తి గ్రామంలో కూడా రేషన్‌కార్డులు ఇవ్వ‌డం లేద‌ని, అర్హులకు పింఛన్‌ మంజూరు కా లేదని, గ్రామాల్లో మౌలికవసతులు క ల్పించాలని కోరుతున్నారు.  ఎస్టీ రు ణాలకు దరఖాస్తు చేసుకోగా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదని, సరైన రోడ్డు సౌకర్యం లేదు, పాఠశాలకు మూడు కిలోమీటర్ల వరకు విద్యార్థులు నడిచి వెళ్తున్నారని ప్రజలు విన్నవిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకో వడం లేదని, గత ఎన్నికల్లో టీడీపీ మోసపూరిత హామీ లను ప్రకటించి ప్రజలను మభ్య పెట్టిం దని మండిప‌డుతున్నారు.  మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, వైయ‌స్‌. జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.  

రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నాడ‌ని..


- వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చూసేందుకు ప‌నులు మానుకున్న కూలీలు
- పొలం నుంచి ప‌రుగులు తీస్తున్న రైతులు
క‌ర్నూలు:  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏడు రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలో సాగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజుల పాటు సాగింది. జ‌న‌నేత వ‌స్తున్న స‌మాచారంతో గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు జనం భారీ ఎత్తున హాజరవుతున్నారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనపై వివిధ జాతీయ పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న వ్య‌వ‌సాయ కూలీలు ప‌నులు మానుకొని దారి పొడువునా వేచి చూస్తున్నారు. నిన్న‌ వైయ‌స్‌ జగన్‌ ఆళ్లగడ్డ నుంచి తమ గ్రామం పెద్ద చింతకుంటకు వస్తున్నారని తెలుసుకుని  వ్యవసాయ కూలీలు ఉదయం 8 గంటలకే రోడ్డుపైకి చేరుకున్నారు. పొలం యజమాని ఒత్తిడి చేస్తున్నా వారు అక్కడి నుంచి కదల్లేదు. ‘జగనన్నను చూశాకే వెళ్తాం. మరీ ఆలస్యమైతే సగం కూలీ ఇద్దురు గానీ’ అని అన్నారు. జ‌న‌నేత  ఉదయం 10 గంటలకు వారి వద్దకు వచ్చారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.  రంగమ్మ, ప్రభావతి అనే ఇద్దరు కూలీలను జగన్‌ దగ్గరకు పిలిచి, వారితో కలిసి మూడు నిమిషాలపాటు నడక సాగించారు.

స‌మ‌స్య‌ల వెల్లువ‌:
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ద్వారా త‌మ గ్రామానికి రావ‌డంతో స్థానికులు స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. అన్ని అర్హతలున్నా తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ పెద్దచింతకుంటకు చెందిన పలువురు ప్ర‌తిప‌క్ష నేత‌ ముందు వాపోయారు. గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ తన భర్త పాములేటి ఐదేళ్ల క్రితం మృతి చెందాడని అయితే తనకు వితంతు పింఛన్‌ మంజూరు చేయకుండా తిప్పుతున్నారని వైయ‌స్ జగన్‌ వద్ద వాపోయింది. తనకు ఐదుగురు పిల్లలున్నారని.. కూలీ పని చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు బాలయ్య తనకు పింఛన్‌ రావడం లేదని వాపోయాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచి అందరికీ న్యాయం చేస్తామని వైయ‌స్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వీరంద‌రికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా ఇస్తూ పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు.

ముగిసిన వైయస్‌ జ‌గ‌న్ పదో రోజు పాదయాత్ర

కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన 10వ రోజు పాదయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. ఇవాళ ఉదయం ఆళ్లగడ్డ పట్టణం నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర చింతకుంట, దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా  సాగింది. పాదయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలను కలిశారు. అలాగే శిల్పాకారులు, మైనారిటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రూప్‌–1 అభ్యర్థులు, వ్యవసాయ కూలీలు కలిశారు. భాగ్యనగరంలోని పత్తి పంటను పరిశీలించారు. దొర్నిపాడు సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొండాపురం వద్ద కేసీ కేనాల్‌ రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. పదో రోజు వైయస్‌ జగన్‌ 13.2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తనను కలిసిన అన్ని వర్గాల ప్రజలకు జననేత సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

15 November 2017

ఏడాది ఓపిక పట్టండి


-  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా
- ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మీయ స్వాగ‌తం
కర్నూలు: చ‌ంద్ర‌బాబు హ‌మీల‌తో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఏడాది ఓపిక ప‌ట్టండి మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, అంద‌రికి న్యాయం జ‌రుగుతుంద‌ని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌.జా సంక‌ల్ప యాత్ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. రాజ‌న్న బిడ్డ‌కు ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. బుధ‌వారం ఉద‌యం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొమ్మిదవ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం నుంచి  వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్ర మొదలుపెట్టగానే వృద్ధులు, మహిళలు.. ఆయ‌న్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కర్నీ జ‌న‌నేత ఆప్యాయంగా పలకరిస్తూ ...ఏడాది ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుందని.....అందరి కష్టాలు తీరుతాయని భరోసా కల్పిస్తున్నారు. వ‌క్కిలేరు వాగు వ‌ద్ద జ‌నం ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం  పెద్దకోట కందుకూరు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు గ్రామస్తులు పూల‌వ‌ర్షం కురిపించారు. రహదారులన్నీ బురదమయం అయినా, అదే రోడ్లపై వెళ్లి ఆయన స్థానికుల్ని పలకరించారు. అంతేకాకుండా వయోభారంతో తన వద్దకు రాలేని వారిని ...అక్కడకు వెళ్లి మరీ పలకరించారు. టార్పాలిన్‌నే పైకప్పుగా చేసుకున్న నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. అలాగే వృద్ధులకైతే పింఛన్‌, రేషన్‌పై హామీ ఇస్తున్నారు. తనను కలిసిన మహిళలకు ....అమ్మ ఒడి పథకంతో చిన్నారులను చదివించే బాధ్యత తనదని హామీ ఇస్తున్నారు. సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా రాబోయే రాజన్నరాజ్యం ఉంటుందని ప్రతిఒక్కరికీ చెబుతూ జ‌న‌నేత‌ ముందుకు సాగుతున్నారు.

మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించండి


–వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
– ప్రజల కన్నీళ్లు తుడిచేందుకే పాదయాత్ర
– రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు ఇలా అందర్ని చంద్రబాబు మోసం చేశాడు
–  మీరు దిద్దింది, మీరు చెప్పిందే మన పార్టీ మ్యానిఫెస్టోలో ఉంచుతా
– మీ అందరి సలహాలు సూచనలతో రెండు పేజీల మ్యానిఫెస్టో ∙
– మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం
– ఇవాళ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి
– చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.
– నాలుగేళ్ల పాలనలో టీడీపీ వేసిన కమిషన్లు ఏమయ్యాయి?
– రాజకీయాల్లో విశ్వసనీయత అర్థం తీసుకువచ్చేందుకే పాదయాత్ర 
–  ఆళ్లగడ్డలో వైయస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం

కర్నూలు: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్రగా బయలుదేరానని, ప్రతి ఒక్కరు మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఆయన ఎండగట్టారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో అన్ని కూడా సవివరంగా వైయస్‌ జగన్‌ తెలిపారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 9వ రోజు వైయస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. సాయంత్రం ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకున్న రాజన్న బిడ్డకు  స్థానికులు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
– ఇన్ని వేల మంది ఇవాళ నాతో అడుగులో అడుగులు వేశారు. ఇవాళ ఏ ఒక్కరికి ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన అవసరం లేకపోయిన వచ్చి సంఘీభావం లె లుపుతున్నారు. నడిరోడ్డు అని కాతరు చేయడం లేదు. ఇంటికి వెళ్లాలన్న సాకులు వెతకడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరి ఆత్మీయతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.
– ఇవాళ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. టీడీపీ పాలనలో మనకు మంచి జరిగిందా? చెడు జరిగిందా అన్నది ప్రశ్నించుకోవాలి. నాలుగేళ్ల పాలన చూశాం. నాయకత్వంలో మనమేదైతే ఆశీస్తామో మనకు రావాల్సింది వచ్చిందా అన్నది ఆలోచించాలి. నాయకుడు అన్న వాడు ఎలా ఉండాలి అని మనం అనుకుంటాం. మన బిడ్డ ఎలా ఉండాలని మనం ఆశీస్తాం. మన నాయకుడు ఎలా ఉండాలని అని అందరూ భావిస్తారు. 
– సినిమాలో కూడా మనకు నచ్చేది హీరోనా? విలనా? ..హీరోనే నచ్చేది. కారణం ఏంటంటే వాళ్లు ప్రవర్తించిన తీరు, గుణగణాలు ఇవన్ని కూడా నాయకత్వాన్ని చూపిస్తాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్న తరునంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇదే చంద్రబాబుకు మళ్లీ ఓటు వేయాలా అన్నది ప్రశ్నించుకోవాలి.
–దారి పోడువునా నాకు అర్జీలు ఇచ్చారు. ఉద్యోగులు వచ్చి అన్న చంద్రబాబు పాలనలో వేగలేకపోతున్నామని చెప్పారు. ఏడాదిగా అడుగుతున్నా రెండు డీఏలు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. 
–దారి పోడుగునా అవ్వ, తాతలు కనిపించారు. మాకు పింఛన్‌ రావడం లేదని, ఇల్లు లేదని ప్రతి నోట వినిపిస్తోంది.
– ప్రతి రైతన్నల దగ్గర నుంచి పంటలకు గిట్టుబాటు ధర లేదన్న అని చెబుతున్నారు. పంటలు అమ్ముకోలేక, అప్పుల బాధ తట్టుకోలేక అధ్వాన్న స్థితిలో ఉన్నారు.
– అన్నా..బ్యాంకుల గడప ఎక్కలేకపోతున్నాం. అప్పులు పుట్టడం లేదని వాపోతున్నారు.
–చదువుకుంటున్న పిల్లలు వచ్చి అన్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. లక్షల్లో ఫీజులు ఎలా చెల్లించాలని పిల్లలు అడుగుతున్నారు.
–పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలు వచ్చి అన్నా..ఆ రోజు పావలావడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
– మీ అందర్ని అడుగుతున్నాను..నాలుగేళ్ల పాలనకు ముందు మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వచ్చేది..ఇవాళ ఎంత వస్తుంది..రూ.500, 600, ఇష్టం వచ్చినట్లు బాదుదే బాదుడు. డబ్బు కట్టకపోతే కరెంటు కత్తరిస్తామని బెదిరింపులు
–టీడీపీ పాలనలో అడుగుతున్నా..రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప నిత్యావసర వస్తువులు ఇవ్వడం లేదు. గతంలో రేషన్‌ షాపుల్లో బియ్యం, కందిపప్పు, పామాయిలు, గోదుమ పిండి, కిరోసిన్, చింతపండు దొరికేది.
– ఎన్నికల సమయంలో చంద్రబాబు మైక్‌ పట్టుకొని ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఒక్క ఇల్లు కట్టించాడా?
– రైతులను మోసం చేశాడు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు. రైతులకు రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. బంగారం ఇంటికి వచ్చిందా? మీ రుణాలు మాఫీ అయ్యాయా?. వడ్డీలకైనా సరిపోతున్నాయా?
– ఆడవాళ్ల ఉసురు తగులుతుందన్న ధ్యాస కూడా చంద్రబాబుకు లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశాడు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు.  ఇవాళ ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తానని చెప్పాడు. కోటి 75 లక్షల ఇల్లు ఉన్నాయి. 45 నెలలకు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు.
–ఇంతటి దారుణంగా రాజకీయాలు జరుగుతున్నప్పుడు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం లేకుండా చేసేందుకు నిసిగ్గుగా సంతలో గొ్రరెలను కొనుగోలు చేసేందుకు ఆరాటపడుతున్నారు. కొంతమందికి డబ్బు ఇస్తారు. కొంత మందికి మంత్రి పదవులు ఇస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
–చట్టాలను కాపాడాల్సింది ఎమ్మెల్యేలు. అటువంటి సభలోనే ఎమ్మెల్యేలను గొ్రరెలను కొనుగోలు చేసినట్లు కొంటున్నారు. వారు రాజీనామా చేయాల్సిన పని లేదంటూ, వారిపై అనర్హత వేటు వేయాల్సిన పని లేదంటూ వారికి కాపాడుకుంటున్నారు. వారిని చట్టసభలో కూర్చోబెట్టుకుంటున్నారు. మంత్రి పదవులు పొందిన మొట్టమొదటి సభలో మేం కూడా పాల్గొంటే వారు చేసిన అన్యాయానికి ఒప్పుకున్నట్లు అవుతుందని, ఇవాళ అసెంబ్లీకి రామని చెప్పాం. అప్పుడైనా చంద్రబాబుకు సిగ్గు వస్తుందని సమావేశాలను బహిష్కరించాం.
– రెండు రోజుల క్రితం 22 మంది బోటు బోల్తా పడి చనిపోయారు. రెండు రోజుల తరువాత మాట్లాడుతున్నాను.  అసెంబ్లీలో టీడీపీ నేతలు ఏం చేశారో తెలుసా. అసెంబ్లీలో సంతాపం తెలిపారు. వదిలేశారు. ఒక మంత్రి రాజీనామా చేయలేదు. సీఎం రాజీనామా చేయలేదు. సీఎం ఇంటికి కొన్ని గజాల దూరంలో ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. కూతవేట దూరంలో బోటు మునిగిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదట. చంద్రబాబు నీవో..నీ కొడుకో విమానం ఎక్కు. విమానం నడిపే డ్రైవర్‌కు లైసెన్స్‌ లేకపోతే మీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. పర్మిషన్‌లేని బోటుకు టికెట్లు అమ్మి ఎందుకు ఎక్కించారు. ఇంతదారుణంగా మనుషులు చనిపోతే అడిగే నాథుడు లేడు.
–ఇంతకు ముందు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్‌లో ఈయన హీరోగా కనిపించేందుకు ఈయనకు కేటాయించిన ఘాట్‌లో స్నానం చేయకుండా ప్రజా ఘాట్‌లో గంట సేపు స్నానం చేశారు. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. బాద్యులేవురు. కమిషన్లు ఉండవు, నివేదికలు లేవు.
–చిత్తూరులో ఎ్రరచందనం స్మగ్లర్లు అంటూ కాల్చి చంపారు. ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే 21 మందిని కాల్చేస్తారా? ఆ కమిషన్‌ ఏమైంది.
–రిషితేశ్వరి అనే విద్యార్థిని ^è నిపోతే ఆ కమిషన్‌ ఏమైంది?
– నడిరోడ్డుమీద ఓ ఎమ్మెల్యే ఇసుక తోడుకుంటుంటే ఓ ఎంఆర్‌వో ప్రశ్నిస్తే ఆ మహిళా అధికారినిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు.
–విజయవాడలో ఆడవాళ్లను సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నారు. టీడీపీకి చెందిన నాయకులు అందులో ఉన్నారు. ఆ కమిషన్‌ ఏమైంది?
– విజయవాడలో చంద్రబాబు నివాసం ఉంటున్న చోట ట్రాన్స్‌పోర్టు కమీషనర్, కానిస్టేబుల్‌ను ఓ ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లి గొడవ పడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ కమిషన్‌ ఏమైంది.
– జన్మభూమి కమిటీ పేరుతో ఓ మాఫియాను తయారు చేశారు. 
– వ్యవస్థలు దాయనీయంగా తయారయ్యాయి. ఇసుక నుంచి మట్టి దాకా, బొగ్గు నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో మాఫియా, లంచాలు తీసుకొని ఒక్క పని లేదు. చంద్రబాబు చేయని మాఫీయానే లేదు.
–రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. అలాంటి వారి కోసం పాదయాత్ర మొదలుపెట్టాను.
– 44 లక్షల పింఛన్లు ఉంటే ఇవాళ తగ్గుతు పోతున్నాయి. అవ్వతాతలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్ర చేస్తున్నాను.
– పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్ర మొదలుపెట్టాను.
– చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందకపోవడంతో ఆ పిల్లలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్ర మొదలుపెట్టా
–ఉద్యోగాలు లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో పాదయాత్ర ద్వారా కాలినడన బయలుదేరాను.
– నవరత్నాలు  ఇది వరకే ప్రకటించా. అందులో మార్పులు చేర్పులు ఉంటే సలహాలు తీసుMýంంటాను. ప్రతి సామాజిక వర్గాన్ని కలుసుకుంటూ 3 వేల కిలోమీటర్లు వెళ్తాను.
– చంద్రబాబు మాదిరిగా కట్టకట్టలుగా మ్యానిఫెస్టోలు తయారు చేయను. రెండు పేజీల మ్యానిఫెస్టో రూపొందిస్తాం.
– రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి మార్పు రావాలన్న ఆశతో పాదయాత్ర చేపట్టాను.
– మీరు దిద్దిందే మ్యానిఫెస్టోలో ఉంటుంది. 2019 ఎన్నికల్లో పెట్టి 2024లో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేశామని, చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశానని మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరి వద్దకు వస్తాను. ఈ ముద్దు బిడ్డను ఆశీర్వదించండి.
– ఎన్నికలప్పుడు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతానని హామీ ఇచ్చారన్నా..ఇప్పుడేమో చేస్తాం, చూస్తామని అంటున్నారని చెబుతున్నారు. ఇలా అందర్ని మోసం చేశాడు. మీ అందరికి తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు.
– ప్రమాదంలో ఓ తల్లి ఒళ్లు కాలిపోయింది. ప్రభుత్వం మాత్రం పింఛన్‌ ఇవ్వడం లేదు. ఈ తల్లి విషయంపై కలెక్టర్‌కు లేఖ రాస్తాను.
–మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి ఊర్లో సచివాలయం ఏర్పాటు చేసి, గ్రామంలోనే 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. వారి ద్వారా మీ సమస్యలు 72 గంటల్లోనే పరిష్కరిస్తాం.

బాబుది కార్పొరేట్‌ కల్చర్‌


– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
– ఉద్యోగులపై ఎందుకంత చులకన భావం
– హక్కుల కోసం ఉద్యమిస్తే లాఠిచార్జ్‌ చేస్తారా
– ఉద్యోగుల పోరాటానికి పూర్తిగా మద్దతు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, ఉద్యోగులపై లాఠీచార్జ్‌ అమానుషమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది.  మొట్టమొదటి నుంచి చంద్రబాబు మనస్తత్వం ఉద్యోగులకు వ్యతిరేకం, వ్యాపారులకు అనుకూలమని, ఆయనది కార్పొరేట్‌ కల్చర్‌ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాసుకున్న మనసులో మాట పుస్తకంలో కూడా ఇదే ఉందని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల పాలనలో కూడా చంద్రబాబు ఉద్యోగులను వేధించారని, వారు ఈ రాష్ట్రానికి శాపం అన్న విధంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలు అనుసరించారని, ఖాళీ ఉద్యోగాలను ¿¶ ర్తీ చేయలేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ అంటూ  కొత్త కొత్త విధానాలు అమలు చేశారన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు రకరకాల కుట్రలు చేస్తుంటారని, అందులో ఇది ఒక తార్కణం అన్నారు.  ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని పార్థసారధి ప్రశ్నించారు. ∙కాంట్రూబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ వద్దు అన్నప్పుడు ప్రభుత్వం తప్పించుకుంటే, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారన్నారు. ఉద్యోగుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుగా ఉంటుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే వారి డిమాండ్లు నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఆత్మసై్థర్యం కోల్పోయిందని మండిపడ్డారు.  ఈ ప్రభుత్వ చర్యలను వైయస్‌ఆర్‌సీపీ ఖండిస్తుందని చెప్పారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వమా?కాదా..
ఆ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణగద్రోక్కడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభించిన ప్రభుత్వాలు మనుగడ సాగించింది లేదన్నారు. ఏపీలో కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమే కాదని, రాష్ట్ర ప్రజల వ్యతిరేక ప్రభుత్వమని పార్థసారది విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ కోర్కేలు కోరే హక్కు ఉందా? లేదా అని ప్రశ్నించారు. పెన్షన్‌ పొందడం అన్నది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు అన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని పోరాటం చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న విధానం వల్ల నష్టపోతున్నామని ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. ఇంతకు ముందు ఉన్న విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు డిమాండు చేస్తుంటే కనీసం వారితో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందోనని నిలదీశారు. లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఆలోచన చేయాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో తమ ప్రభుత్వానికి ఇంత మంచి పేరు రావడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణమని చెప్పినట్లు గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులపై పోలీసులతో లాఠీచార్జ్‌ చేయించిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద కొన్ని రోజులుగా ఉద్యోగులు ధర్నా చేస్తుంటే వాళ్లతో చర్చించి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో అసెంబ్లీ వద్ద అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. శాసన మండలిలో ప్రత్యేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నించే ఎమ్మెల్సీలకు చర్చించే అవకాశం ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపకపోతే ఉద్యమిస్తామని, వారికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని పార్థసారధి తెలిపారు.

పెద్దకోట కందుకూరు చేరుకున్న జగన్‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్ది సేప‌టి క్రిత‌మే పెద్దకోట కందుకూరు గ్రామానికి చేరుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ తన తొమ్మిదోరోజు పాద‌యాత్ర‌ను బుధ‌వారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆర్‌.కృష్ణాపురం నుంచి ప్రారంభించారు. జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

పదోరోజూ ఆళ్లగడ్డలోనే...ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర  లో భాగంగా గురువారంనాడు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే  పాదయాత్ర జరపనున్నారు. ఉదయంఆళ్ల గడ్డ లో ప్రారంభమై, పెద్ద చింతకుంట లమీదుగా  డోర్నిపాడు మండలం భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్స్ , కొండాపురం,  డోర్నిపాడు వరకు కొనసాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది జన సంకల్ప యాత్ర

గంగుల ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు: వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర..జన సంకల్ప యాత్ర అని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అభివర్ణించారు. ఈ యాత్ర అశేష జనవాహిణి నడుమ ఇలాగే రాష్ట్రమంతా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు పేరు పేరున ధన్యవాదాలు.

పోటెత్తిన ఆళ్లగడ్డ

ఆళ్లగడ్డ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఆళ్లగడ్డ పట్టణం జనంతో పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంతగా జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. సాయంత్రం ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అశేష జనవాహిణి హాజరయ్యారు.

14 November 2017

ఇక్కడ ఓటుకు కోట్లు..అక్కడ బోటుకు నోట్లు


–బోటు ప్రమాదానికి బాధ్యులెవరు
– జేసీ నోరు అదుపులో పెట్టుకో
– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పద్మజా

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కమీషన్లకు కక్కుర్తిపడి  అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పద్మజా విమర్శించారు. కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారని గుర్తు చే శారు. ఇప్పుడు బోట్లు అక్రమంగా నడుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కమీషన్లు తీసుకొని అమాయకుల ప్రాణాలు తీశారని వారు ధ్వజమెత్తారు. ఈ ఘటనపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందించకుండా, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీ నోటిని ఫినాయిల్‌తో కడుక్కోమని చురకలంటించారు. నాడు మీ బస్సు ప్రమాదాన్ని చంద్రబాబు కాపాడాడని ఈ రోజు బోటు ప్రమాదాన్ని వెనుకెసుకొస్తున్నారని ఆక్షేపించారు. ఏ ఎండకు ఆ గోడుగు పట్టడం తప్పు కాదని సిగ్గు లజ్జ లేకుండా చెబుతున్న జేసీని మనిషి అంటారా? మరేమైనా అంటారా? అని ప్రశ్నించారు. జేసీ నీకు చాలేంజ్‌ వేస్తున్నాం. ఏ ఒక్క సమస్యపైనైనా నీవు నోరు విప్పావా? కళ్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబుతో కాంట్రాక్టులు పొందడమే నీ «పని అని ఆరోపించారు. మీకు నైతికత అన్నది లేదు. సిగ్గు అన్నది లేదు అని చెప్పుకోవడమా నీ వ్యూహాత్మకత అని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి టీడీపీ నేతలకు చలిజ్వరం పుట్టుకొందన్నారు.  టీడీపీ నేత కంభపాటి రామ్మోహన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.  నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలకు సమాధానం చెప్పండి. అక్కడ ఓటుకు కోట్లు, ఇక్కడ బోటుకు నోట్లు అన్నట్లు మీ అవినీతి సామ్రాజ్యం విస్తరించిపోయింది. బోటు ప్రమాదానికి బాధ్యులు ఎవరు?, నోట్ల కోసం ఓట్లు కొనాలనుకునే మీకు ప్రజలే బుద్ధి చెబుతారని తీవ్రంగా మండిపడ్డారు. 

మంత్రులను ఉసికొల్పుతారా?: పద్మజా
బోటు ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమేనని దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపైకి మంత్రులను చంద్రబాబు ఉసికొల్పుతున్నారని పద్మజా అన్నారు. ఓటు ప్రమాదంపై సమాధానం చెప్పకుండా వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. విజయవాడలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్నది కూడా అక్రమ కట్టడమే అన్నారు. దాదాపు వంద కోట్ల ప్రజా ధనాన్ని ఉపయోగించుకొని తన అధికార నివాసం ఏర్పాటు చేసుకున్నార ని ఆరోపించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జేసీ దివాకర్‌రెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలకడం సిగ్గుచేటు అన్నారు. సీఎం మెప్పుపొందేందుకు జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మీలాంటి వాళ్లను పరజలు ఛీకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సీనియర్‌ అధికారి బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం చేసిన ఎంపీ కేసీనేని నాని, బుద్ద వెంకన్నపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.

ఎవరు పట్టించుకోవడం లేదు:

- నరసింహా, ముత్యాల పాడు
బతకడానికి ఏ ఆధారం లేదు. అమ్మ నాన్నలు లేడు. పింఛన్‌ ఇవ్వమని చాగలమ్రరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

72 గంటల్లోనే సంక్షేమ పథకాలు అందిస్తా: వైయస్‌ జగన్‌ 
 ప్రభుత్వ పథకాలు ఏమీ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కానీ పలకని పరిస్థితి నెలకొంది. నరసింహ మాదిరిగానే చాలా మంది కూడా పింఛన్‌ అందడం లేదు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఇక్కడే తెరచి, మీ గ్రామానికి  చెందిన 10 మందికి గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో పింఛన్, ఇల్లు, ఆరోగ్య శ్రీ వంటి ఏ పథకం కావాలన్న వీరి నుంచే ఇప్పించేలా చర్యలు తీసుకుంటాను. 72 గంటల్లోనే మీకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలు అందజేస్తాం. నరసింహ విషయంపై కలెక్టర్‌కు లేఖ రాస్తాను. చంద్రబాబు స్పందిస్తారో లేదో చూద్దాం.  దేవుడు చంద్రబాబుకు బుద్ధి ఇవ్వాలని, గడ్డి పెట్టాలని, నరసింహకు పింఛన్‌ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

చింత‌కుంట్ల బాలిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

చింత‌కుంట్ల గ్రామానికి చెందిన బాలిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కండువ వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈయ‌న చేరిక‌తో పార్టీ బ‌లం పెరిగింద‌ని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

శెట్టివీడుకు చేరిన వైయ‌స్ జ‌గ‌న్‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 8వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా శెట్టివీడు గ్రామానికి  చేరుకున్నారు. 8వ రోజు చాగ‌ల‌మ‌ర్రి శివారు నుంచి జ‌న‌నేత త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు,  ఉద్యోగ సంఘాల నాయ‌కులు త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. ఇక్క‌డి నుంచి గొడిగ‌నూరు గ్రామానికి వెళ్తారు. గ్రామంలో జెండా ఆవిష్క‌రించ‌నున్నారు.

గులాబీలతో స్వాగతం

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చాగలమ్రరిలో అపూర్వ స్వాగతం దక్కింది. గ్రామానికి విద్యార్థినులు గులాబీలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. కంప్యూటర్లు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

ఘ‌న స్వాగ‌తం

క‌ర్నూలు జిల్లాలో ప్ర‌వేశించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, నాయ‌కులు గౌరు వెంక‌ట్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.

క‌ర్నూలుకు చేరిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


8వ రోజు చాగ‌ల‌మ‌ర్రి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం
7 నియోజకవర్గాలు...250 కిలోమీటర్లు 
కర్నూలు :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మంగ‌ళ‌వారం క‌ర్నూలు జిల్లాకు చేరింది. ఈ నెల 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన జ‌న‌నేత పాద‌యాత్ర ఆ జిల్లాలో ఏడు రోజుల పాటు సాగింది. జ‌న‌నేత‌కు వైయ‌స్ఆర్ జిల్లా ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అడుగ‌డుగునా, గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ ఆత్మీయుడిని అక్కున చేర్చుకున్నారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ‌కు మొర‌పెట్టుకున్నారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ మంగళవారం ఎనిమిదో రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.  కర్నూలు–వైయ‌స్ఆర్‌ జిల్లా సరిహద్దులోని ఎస్‌ఎస్‌ దాబా నుంచి ఉదయం పాద‌యాత్రను మొదలుపెట్టారు. అక్కడ నుంచి చాగలమర్రి గ్రామానికి చేరుకున్నారు.  సందర్భంగా జననేతకు పూలతో అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు మీదుగా చక్రవర్తులపల్లెకు చేరుకుంటారు. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండు సెంటర్‌లో ప్రజలనుద్దేశించి వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అలాగే గొడిగనూరులో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
 
నెలాఖ‌రు వ‌ర‌కు క‌ర్నూలు జిల్లాలోనే..
వైయ‌స్ జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్ర  ఇవాళ కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఈ నెలాఖరువరకు యాత్ర కొనసాగనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి నుంచి మొదలైన ఈ యాత్ర బనగానపల్లె, డోన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల మీదుగా పత్తికొండ నియోజకవర్గం వరకూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వైయ‌స్‌ జగన్‌ నేరుగా తెలుసుకోనున్నారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చడంలో విఫలమైన తీరును ఆయన ఎండగట్టనున్నారు. కర్నూలు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలోనూ ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు.

ఘ‌న స్వాగ‌తం
క‌ర్నూలు జిల్లాలో ప్ర‌వేశించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, నాయ‌కులు గౌరు వెంక‌ట్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.