6 November 2017

ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రసంగం హైలైట్స్


– పలానా వ్యక్తి మా నాయకుడని ప్రతి కార్యకర్త చెప్పుకునేలా ఉండాలి.
– రెండు పేజీల్లోనే మ్యానిఫెస్టో తీసుకొస్తాం.
– సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలిచ్చిన సలహాలతో ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టో రూపొందిస్తాం. అధికారంలోకి మ్యానిఫెస్టోను ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం
– మళ్లీ ఎన్నికలకు వెళ్లేముందు ఆ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతాం. ఇవ్వని హామీలను చేసి చూపుతాం. 
– చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన తప్ప ఎవరూ ధనవంతులు కాలేదు
మూడున్నరేళ్లలో ప్రజల మీద లక్షా 9 వేల కోట్లు అదనంగా అప్పు మోపారు. 
– బాబు పాలనలో ఏటా సాగు వీస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. 48 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. 
– రైతులు బ్యాంకుల గడపలు తొక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. 
– ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు రుణాలు ఇవ్వొద్దని.. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వనీయడం లేదు. 
– ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర కల్పించిన పాపాన పోలేదు. ఏటా పొగాకు ఆక్షన్‌ కోసం జగన్‌ వెళ్లి ధర్నా చేయాల్సి వస్తుంది. 
– ఎన్నికలప్పుడు 5 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 
ఎక్కడైనా కనబడితే కాలర్‌ పట్టుకుని చంద్రబాబును అడగండి. 
– కరువు మండలాలను ప్రకటించాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదు. 
– వ్యవసాయ రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. 
– సున్నా వడ్డీకి, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం మానేశారు. నాలుగేళ్లలో రైతులకివ్వాల్సిన 8 వేల కోట్లు ఎగరగొట్టేశాడు.
– రైతులను మోసం చేసిన చంద్రబాబును దొంగ అనాలా.. మోసగాడు అనాలా. 
– చంద్రబాబు పాలనలో రాజధాని చూస్తే ఒక్క కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ కూడా తీసుకురాలేక పోయారు. అలాంటప్పుడు ఉపాధి ఎలా వస్తుంది.
– పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచన ఆయనకు రాదు. 
– కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టిస్తానన్నాడు. ఏం జరిగింది
– ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వలనే రాష్ట్రానికి దుర్గతి పట్టింది. గట్టిగా అడిగితే మోడీ తంతారని చంద్రబాబుకు భయం.
– రాష్ట్రంలో ఏ పరిశ్రమ జరిగి ఆయను 30 శాతం లంచాలు ముట్టాల్సింది.
– చంద్రబాబు అందమైన ముఖాన్ని చూసి పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. 
– సూటూ బూటూ వేసి కనిపించినోడిచేతల్లా సంతకాలు పెట్టిస్తాడు. ఆయన చెప్పిన 20లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ. ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా..
– నాలుగేళ్ల పాలన చూశారు. తొమ్మిదేళ్ల అనుభవం ఉందని ఓట్లు అడుక్కుని గెలిచాడు. ఈ నాలుగేళ్లలో ఒక్క శాశ్వత బిల్డింగైనా కట్టాడా. 
– రీలీజైన సినిమాలు చూసి ఆ సెట్టింగులు కావాలంటాడు. ఇంకా నయం ఇంగ్లిషు సినిమాలు చూసుంటేనా..
– నాలుగు సంవత్సరాల్లో రైతులు భూములు లాక్కోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. 
– రాజధాని ప్రాంతం ఏర్పాటు చేయబోయే విషయాన్ని ముందుగానే తన బినామీలకు లీక్‌ చేసి రైతుల భూములు కారు చౌకగా కొనిపించాడు. 
– బినామీల భూములు వదిలేసి రైతుల భూములు లాక్కున్నాడు. 
– పులివెందుల్లోనే చిత్రావతి, పైడిపాలం ప్రాజెక్టులు వైయస్‌ఆర్‌ హయాంలో 85 శాతం పూర్తయితే చంద్రబాబు 15 శాతం కూడా చేయలేకపోయారు. 
– గేట్లు ఎత్తిన లష్కర్‌ గొప్పోడా.. కట్టినోడు గొప్పోడా..
– ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం... ఉన్నాయా..?
– మా ఎమ్మెల్యేలను సంతలో గొ్రరెలను కొన్నట్టు కొన్నారు. నలుగురిని మంత్రులను చేశారు. ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. 
– నంద్యాల్లో బలమా వాపా.. దమ్ముంటే 20 చోట్ల ఒకేసారి ఎన్నికలు పెట్టు. 
– 20 నియోజకవర్గాలకు నాలుగు వేల కోట్లు నల్లధనం పెట్టాలి. మోడీకి తెలిస్తే కాలితే తంతాడు. 
– చంద్రబాబు పాలనలో చీఫ్‌ సెక్రటరీగా ఉన్న పెద్దాయన రోజుకో స్కాం బయటపెడుతున్నాడు. 
– తహసీల్దార్‌ని కొడితే కేసులండవ్‌.. రిషితేశ్వరి చనిపొతే న్యాయం జరగదు..
విజయవాడలో ఆయన కళ్ల ముందే సెక్స్‌ రాకెట్‌ జరిగితే కనిపించదు.
– ఉద్యోగులను 50 ఏళ్లకే తొలగిస్తున్నారని సాక్షిలో ఆధారాలతో వార్తలొచ్చాయని.. ఇద్దరు సెక్రటేరియట్‌ ఉద్యోగులను తొలగించారు. 
– కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం వద్దని ఉద్యోగులు వేడుకుంటున్నా పట్టించుకోలేదు. 
– మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం. రాజ«ధానిలో ప్రతి గవర్నమెంట్‌ ఉద్యోగికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు.
– చంద్రబాబు హయాంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి మేలు జరగలేదు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు అధికారాలు లేవు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల్లేవు. 
అధికారం ఉన్నదల్లా జన్మభూమి కమిటీలనే దొంగల ముఠాలకు. 
– మహానుభావుడు దేవరకొండ బాల గంగాధర్‌ తిలక్‌ చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు పాలనలో గజానికొక గాంధారి కొడుకు గాంధీ పుట్టిన దేశంలో.. అన్నమాట నిజమైంది. 
– మీరిచ్చిన హామీలతో మేనిఫెస్టో తయారుచేస్తాం. నాన్నగారి పేరు నిలబెట్టేలా.. జగన్‌ అంతే మంచోడని పేరు తెచ్చుకుంటా.. 
– కాసులంటే కక్కుర్తి లేదు.. కేసులంటే భయపడను.. నాకుండేది కసి 
చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలనే కసి ఉంది.. 
– విడిపోయిన ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని నమ్ముతున్నా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించాలి
– వ్యవసాయాన్ని పండగ చేయాలి
– రాబోయే మూడేళ్లలో మద్యపానం నిషేధించాలి
– డబ్బుల్లేక చదువులు ఆగకూడదు. మళ్లీ చదువుల విప్లవం తేవాలి. 
– నేను పోయిన తర్వాత నాన్నగారి ఫొటో పక్కనే నా ఫొటో ఉండాలి
– ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి
– అవినీతిపైన నిర్దాక్షిణ్యంగా పోరాటం చేసి నిందితులను జైల్లో పెట్టించాలి. 
మీ అందరి చల్లని దీవెనలు.. దేవుని ఆశీస్సులతో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ అందరి రుణం తీర్చుకుంటా.. 

No comments:

Post a Comment