6 November 2017

ప్రతి పేద వాడి గుండెల్లో బతికి ఉండాలన్నదే నా కసి


 • ప్రజల ఆలోచనలతో మ్యానిఫెస్టో రూపొందించేందుకు పాదయాత్ర
 • అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే నా కసి
 • మళ్లీ చదువుల విప్లవం తీసుకువస్తా
 • ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలన్నదే నా కసి
 • ప్రతి ఇంట్లో చిరునవ్వులు చూడాలన్నదే నా కసి
 • ప్రత్యేక హోదా కావాలన్నదే నా కసి
 • చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
 • రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోంది
 • జాబు రావాలంటే బాబు పోవాలి
 • కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తా
 • ఉద్యోగులకు ఇంటి స్థలం, పక్కా ఇల్లు నిర్మిస్తా
 • చంద్రబాబుకు దమ్ముంటే 20 చోట్ల ఎన్నికలకు సిద్ధం కండి
 • నాకు కాసులంటే కక్కుర్తి లేదు..కేసులంటే భయం లేదు
 • నాన్నగారి మాదిరిగా మీ అందరి చేత గొప్పొడిననిపించుకుంటా
 • మీ అందరి దీవెనలు కావాలి
 • ఇవన్నీ చేసేందుకు దేవుడి ఆశీస్సులు కావాలి
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా మీ అందరి చేత గొప్ప వాడిని అని పించుకుంటానని, చనిపోయిన తరువాత ప్రతి పేద వాడి గుండెలో నిలిచి ఉండాలన్నదే నా కసి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పం పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ తన ఆలోచనలు, తాను చేయబోయే పనులను సవివరంగా తెలిపారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను తూర్పారబట్టిన వైయస్‌ జగన్‌ నాడు దివంగత ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి, మంచి పనులను గుర్తు చేస్తూ..తాను పాదయాత్ర ఎందుకు చేస్తున్నాను, ప్రస్తుత పరిస్థితులు ఏంటో వివరిస్తూ..వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక తాను చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారో..ఆయన మాటల్లోనే..

– ఈ రోజు ఇన్ని వేల మంది ఏ ఒక్కరికి కూడా ఈ నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేకపోయినా కూడా ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఎంతదూరానైనా సరే లెక్క చేయకుండా ఆప్యాయతలు పంచేందుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలందరికి, అవ్వలకు తాతలకు, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మహానేతకు మరణం లేదు..
ఈ రోజు మన అందరి మహానేత, ప్రియతమ నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇడుపులపాయలో మన కళ్లముందు కనిపిస్తున్నారు. మహానేతకు మరణం లేదు. కారణం ఏంటో తెలుసా..తాను చనిపోయిన తరువాత కూడా ఇవాల్టికి ప్రతి గుండెలో కూడా బతికే ఉన్నారు కాబట్టి ఆయనకు మరణం లేదు. ఒక్కొక్కసారి రాజకీయాల కోసం చంద్రబాబు మొదలుకొని అధికారంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల తీరు చూస్తే ఆవేదన కలుగుతుంది.  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాల నుంచి తప్పించేలనే దురుద్దేశంతో అధికారంలో ఉన్న వారంత కూడా చేయని ప్రయత్నం లేదు. వీరు చేసిన ప్రయత్నం చూస్తే బాధనిపిస్తుందని. చంద్రబాబు రక్షసత్వం చూసినప్పుడు నన్ను రాజకీయాల నుంచి తప్పించాలన్న ఆలోచన చూస్తే బాధనిపిస్తుంది. తన కుమారుడి వయసు ఉన్న నాపై చంద్రబాబు చేస్తున్న కుట్రలు చూస్తే ఆవేదన కలుగుతుంది.  కానీ నాన్నగారు చనిపోతు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిప్పుడు ఊరట అనిపిస్తుంది. వారు చేయని ప్రయత్నం లేదు. నేను నడిచిన ప్రతి అడుగులో మీరు తోడుగా ఉంటామని ధీమా ఇవ్వబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుVð త్తుతున్నాయి. నాకు తోడుగా నడిచిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నటికి మరిచిపోలేనని, మీరు రుణం తీర్చుకోలేనిది. 

టీడీపీ మ్యానిఫెస్టో ఎక్కడా?
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ రూపొందించిన  మ్యానిఫెస్టోలోని ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఆ మ్యానిఫెస్టో ఎక్కడ ఉందో కూడా కనిపించడం లేదు. ఒక్కసారి రాష్ట్రంలో జరగుతున్న పాలన చూడండి. మీ అందర్ని ఒక్కటే అడుగుతున్నాను. చంద్రబాబు వచ్చిన తరువాత రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా? చంద్రబాబు పాలనతో ఏ ఒక్క కుటుంబమైనా సంతోషంగా ఉందా? ప్రజల గుండెల్లో మరచిపోలేని పాలన ఇవ్వలేదు కాబట్టే ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు చంద్రబాబు పాలనలో చేయని అక్రమాలు లేవు. అరాచకాలు లేవు. ఇలాంటి దారుణమైన పాలనలో రైతులు పూర్తిగా నష్టపోయారు. అక్కచెల్లెమ్మలు మొదలుకొని అవ్వతాతల వరకు, చదువుకుంటున్న ప్రతి పేద పిల్లాడి దాకా ప్రతి నోట వినిపిస్తున్నది ఏంటంటే,చంద్రబాబు అంత మోసగాడు ఎక్కడ లేడన్న మాట వినిపిస్తోంది. చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

భరోసా కల్పించేందుకే పాదయాత
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర మొదలుపెట్టాను. దాదాపు 3 వేల కిలోమీటర్లు సాగుతుంది. ప్రతి ప్రాంతానికి వస్తాను, ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తాను. వారి కష్టాలు, నష్టాలు పూడ్చేందుకు ఏమేం చేయలో  ఈ పాదయాత్రను మొదలుపెట్టాను. నవరత్నాలను మెరుగుపరిచేందుకు మీరిచ్చే సలహాలు తీసుకుంటాను. చంద్రబాబు మాదిరిగా మోసం చేసే పాలన కాదు. ప్రజల నుంచి మ్యానిఫెస్టో రావాలన్న ఉద్దేశ్యంతో ఈ పాదయాత్ర చేపట్టాను. చంద్రబాబు మ్యానిఫెస్టో ఎక్కడ కనిపించదు. కారణం ఏంటో తెలుసా..ఆ మ్యానిపెస్టో కనిపిస్తే చంద్రబాబు కాలర్‌ పట్టుకుంటారని తీసివేశారు. రాజకీయాల్లో ఫలని వాడు మా నాయకుడు అనేలా నాయకుడు ఉండాలి. చంద్రబాబును మా నాయకుడు అని చెప్పే వారు లేరు.


రెండే రెండు పేజీల మ్యానిఫెస్టో..
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండే రెండు పేజీల మ్యానిఫెస్టో తీసుకొని వచ్చి కచ్చితంగా అమలు చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 2019లో గెలిచిన తరువాత ఎన్నికల ప్రణాళికలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేసి గర్వంగా మ్యానిఫెస్టో చూపించి మళ్లీ 2024లో ప్రజలను ఓట్లు అడుగుతాం. ప్రజల ఆలోచనతో మ్యానిఫెస్టో తయారు చే సేందుకు సుదీర్ఘమైన పాదయాత్ర మొదలుపెట్టాను.

అప్పులు పెరిగాయి
రాష్ట్రం విడిపోయి చంద్రబాబు పాలన వచ్చి నాలుగేళ్లు కావోస్తోంది. మన రాష్ట్రంలో ఆస్తులు పెరిగాయంటే లేవు అన్న సమాధానం వస్తుంది. రాష్ట్రంలో అప్పులు మాత్రం పెరిగాయి. 60 ఏళ్లలో రాష్ట్రానికి అప్పుకింద రూ.96 వేల కోట్లు ఇచ్చారు. చంద్రబాబు పుణ్యానా ఆ అప్పు రూ.2.06 లక్షల కోట్లకు చేరింది.  అక్షరాల రూ.1.09 లక్షల కోట్లు అదనంగా మోపారు. ఈ నాలుగేళ్ల కాలంలో వ్యవసాయానికి ఏమైనా మేలు జరిగిందా అంటే లేదు అన్న సమాధానం వస్తుంది. చంద్రబాబు అబద్ధాలు, మోసపు హామీలతో రైతులు అతలాకుతలమవుతున్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి ఏటా సాగు విస్తీరం తగ్గుతూ వస్తోంది. చంద్రబాబు హయాంలో సాగు విస్తిర్ణం తగ్గుతోంది. ఈ నాలుగేళ్లలో రైతులు బ్యాంకుల గడప తొక్కడం లేదు. బ్యాంకర్లతో చంద్రబాబు మీటింగ్‌లు పెట్టి రైతులకు రుణాలు ఇవ్వవద్దు అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి చెబుతున్నారు. బంగారంపై రుణాలు ఇవ్వొద్దు అని ఆదేశిస్తున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో వేదిస్తున్నారు.

ధరల స్థీరికరణ నిధి ఏదీ?
చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. చీని పంట కు రేటు లేదు. గత ఏడాది రూ.80 వేలు ఉంటే, ఈ ఏడాది రూ.20 వేలు మద్దతు ధర ఉంది. ఉల్లి, టమెటలు రోడ్డుపై పోస్తున్నారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక నేనే నిరాహారా దీక్ష చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పొగాకుకు మద్దతు ధర లేదు. ఏ ఒక్క పంటకు కూడా చంద్రబాబు మద్దతు ధర ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు రూ.5 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేస్తానన్నారు. ఎక్కడైనా కనిపిస్తే కాలర్‌ పట్టుకోండి.ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. ఆగస్టు 9 దాకా చూస్తే రాయలసీమ జిల్లాలో మైనస్‌ 19 వర్షపాతం నమోదైంది. అయినా సరే ఈ జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించలేదు. 

ఇదా చంద్రబాబు పాలనా? ఇయనా ముఖ్యమంత్రి..
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటే వీటిని పూర్తిగా బేషరత్తుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు చంద్రబాబు రాకముందు సున్నా వడ్డీకి, పావలావడ్డీకి రుణాలు అందేవి. బాబు వచ్చాక ఈ రుణాలు అందడం లేదు. కారణం సున్నావడ్డీ, పావలావడ్డీకి రుణాలు రావాలంటే ప్రభుత్వం పంట రుణాలకు రూ,2 వేల కోట్లు ఏడాదికి ఇవ్వాలి. చంద్రబాబు నాలుగేళ్లకు రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా పూర్తిగా ఎగ్గొట్టారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టారు. రైతుల జోబుల్లో నుంచి పిక్‌పాకెట్‌ కొడుతున్నారు. ఎడమ చేతితో రుణమాఫి చేస్తున్నట్లు ఫోజు కొడుతున్నారు. నిజంగా ఇలాంటి మోసగాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే భావితరాలు వేలు పెట్టి దొంగ, మోసగాడు అని అంటారు. 
– రాష్ట్ర రాజధాని చూడండి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈసీఐఎస్, బీహెచ్‌ఈఎల్, డీఆర్‌డీఏ, మిథాలి, సీసీఎండి, ఐఐసీసీ అక్కడే ఉంటాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఇవాళ హైదరాబాద్‌ ఆ మాత్రం అభివృద్ధి చెందిందంటే ఈ సంస్థలే కారణం. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచన చంద్రబాబుకు రాదు. ఇదే చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగే సమయంలో పరిశ్రమలు పెట్టిస్తామన్నారు. ఇదే కడపలో స్టీల్‌ ప్యాక్టరీ పెట్టిస్తామన్నారు. ఓటుకు నోట్లు కే సులో సంపాదించిన నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపులతో పట్టుబడిన చరిత్ర చంద్రబాబుది. రాష్ట్రంలో ఏ పని జరిగినా లంచాలు తీసుకుంటున్నారు. గట్టిగా అడిగారంటే మోడీ లాగి తంతారనే భయం. ఇవాళ ఇదే చంద్రబాబు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. చంద్రబాబు ముఖార విందాన్ని చూసి పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు రారు. ఈ ప్రత్యేక హోదాను గాలికి వదిలేసి ఏడాదికి ఒకసారి ఎవరికంటే వారికి సూటుబూటు వేస్తారు. వాళ్లతో సంతకాలు చేయిస్తారు. ఓబులురెడ్డి, సునీల్‌ వంటి నాయకులు వేల కోట్లతో పెట్టుబడులు పెడతారని గొప్పలు చెబుతున్నారు. విశాఖపట్నంలో రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇక్కడైనా ఈ పెట్టుబడులు కనిపించాయా? నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఉంది. నాలుగేళ్లలో రాజధానికి కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? కొత్త సినిమా రిలీజ్‌ అయినప్పుడు ఆ సినిమా చూసి బహుబలిలో ఆ సెట్టింగ్‌ బాగుంది. రాజధాని నిర్మాణం అదిగో అంటారు. సింగపూర్, జపాన్‌కు వెళ్లి అదే రాజధాని అంటారు. ఇంకా నయం చంద్రబాబు ఇంగ్లీష్‌ సినిమాలు చూడలేదు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నారు. రాజధాని వస్తే రైతులకు మేలు జరగాలి. రాజధాని ఇక్కడ వస్తుందని మొదట ఎక్కడెక్కడో చూపించడంతో అక్కడ భూములు కొన్నారు. ఎక్కడైతే రాజధాని వస్తోందో అక్కడ మాత్రం ఆయన తన బినామీలతో భూములు కొనుగోలు చేయించారు. తన బినమీల భూములకు రేట్లు రావాలని మిగతా భూములను అగ్రి జోన్‌గా మార్చారు. మురళీమోహన్‌ మొదలుకొని అందరు బ్రహ్మండమైన ప్లాట్లు వేసుకున్నారు. 

ఒక్క ప్రాజెక్టు కట్టలేదు..
రాష్ట్రంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా చంద్రబాబు కట్టలేదని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు.  పులివెందులలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులు వైయస్‌ఆర్‌ హయాంలో 85 శాతం పూర్తి అయ్యిందో తెలుసు. ఐదేళ్లలో 85 శాతం వైయస్‌ఆర్‌ పూర్తి చేస్తే..చంద్రబాబు నాలుగేళ్లలో లంచాలు తీసుకుని ఆ ప్రాజñ క్టులు పూర్తి చేయలేదు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మిగిలిపోయిన పనులు మాత్రం పూర్తి చేసి గేట్లు ఎత్తుతున్నారు. లష్కర్‌గొప్పొడా? గెట్లు ఎత్తిన చంద్రబాబు గొప్పోడా.
–చట్ట సభల్లోని ఎమ్మెల్యేలను సంతల్లో గొ్రరెలు కొన్నట్లు కొంటున్నారు. 21 మందిని కొనుగోలు చేశారు. వీరిలో నలుగురిని మంత్రులుగా చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఇవాళ మంత్రివర్గం ఉంది. వీరిపై అనర్హత వేటు వేయరు. 21 చోట్ల ఎన్నికలు పెడితే చంద్రబాబు పునాదులు కదులుతాయి. చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నాను. నీవు ప్రజలకు మంచి చేశావనే నమ్మకం ఉంటే 20 చోట్ల ఎన్నికలు పెట్టు రూ.400 కోట్ల నల్లధనం కావాలి. ఇంత ఖర్చు చేస్తే మోడీ కాలితో తంతారని బాబుకు బయం.
–చంద్రబాబు హయాంలో చీఫ్‌ సెక్రటరీగా ఉన్న ఐవైఆర్‌ కృష్ణారావు రోజుకో చంద్రబాబు స్కాం బయటకు తీస్తున్నారు. చంద్రబాబు పాలనలో న్యాయం, చట్టం లేదు. తహశీల్దార్‌ జుట్టుపట్టుకొని వెళ్తున్నా కేసులు లేవు. రిషితేశ్వరి దారునంగా కాలేజీలో చనిపోతే కేసు లేదు. విజయవాడ నగరంలో సెక్స్‌రాకెట్‌ నడుపుతున్నారు కేసులు లేవు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులు సంతోషంగా లేరు. 50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపేందుకు జీవోలు తయారు చేశారు. ఉద్యోగులు భయపడ్డారు. సాక్షి పేపర్‌లో వార్తలు వస్తే చంద్రబాబు మాట మార్చారు. ఈ జీవో ప్రోసిడింగ్‌లు పేపర్‌కు ఎలా వచ్చాయని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. కాంట్రబ్యూటరీ స్కీమ్‌ వద్ద ని ఉద్యోగులు ఏడాదికి పైగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేప్పిన హామీ ఏంటి..కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఒక్క ఉద్యోగం లేదు. జాబు రావాలంటే బాబు పోవాలని వైయస్‌ జగన్‌ నినదించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మంచి చేస్తాను. 
–రాజధాని నిర్మాణం అంటే మొదట ఉద్యోగులు, ఎమ్మెల్యేలకు ఇల్లులు కట్టించి ఇవ్వాలి. ప్రతి గవర్నమెంట్‌ ఉద్యోగికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాను.
–చంద్రబాబు పాలనలో ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు. రుణాలు మాఫీ అని మోసం చేశాడు. ఏ  ఒక్కటి కూడా జరుగకపోగా చంద్రబాబు పాలనలో ఏ గ్రామం చూసినా గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు లేవు. అధికారాలు  లేవు. జన్మభూమి కమిటీలకు అధికారం కట్టబెట్టారు. దొంగల ముఠాకు అధికారం ఇచ్చారు. ఈ దొంగల ముఠా చూస్తే దేవరకొండ బాలగంగాధర్‌ మాటలు గుర్తుకు వస్తాయి. గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇసుక దోపిడీ, పింఛన్ల మాఫియా, ఇళ్ల కోసం లంచాలు, బ్రాందీ షాపుల మాఫియా, ఉపాధి హామీ పనులు కూడా వాళ్లకు సంబంధించిన వారికే పనులు కట్టబెడుతున్నారు. ఇటువంటి అన్యాయపు, మోసపూరిత పాలనలో ప్రజలకు తోడుగా నిలిచేందుకు  ఈ పాదయాత్ర మొదలుపెట్టాను. బ్రహ్మండమైన మ్యానిఫెస్టోను మీ వద్దకే తీసుకొని వస్తానను. మీ అందరి చేత నాన్నగారు ఎంత గొప్పవాడో, వైయస్‌ జగన్‌ కూడా అంతే గొప్పవాడు అనిపించుకుంటా అని మాట ఇస్తున్నాను.

నాకు, బాబుకు ఇదే తేడా..
చంద్రబాబుకు నాకు మధ్య ఉన్న చిన్న తేడా ఏంటో తెలుసా..కాసులు అంటే నాకు కక్కుర్తి లేదు. కేసులు అంటే భయపడను. నాకున్నది ఏంటో తెలుసా కసి ఉంది. ఎప్పటి కూడా ప్రతి పేద వాడి గుండెల్లో బతికి ఉండాలనే కసి ఉంది కాబట్టి మంచి చేస్తాను. విడిపోయిన ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని, దాన్ని తీసుకురావలన్న కసి ఉంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలన్నదే నా కసి. రైతులకు మంచి చేయాలన్నదే. మద్యపానాన్ని తీసివేయాలన్నదే కసి. ప్రతి కుటుంబలో ఆత్మీయతలను పెంచాలన్నదే. నాకున్న కసి ఏంటో తెలుసా..మళ్లీ చదువుల విప్లవం తీసుకురావాలి. పేద వాళ్లను ఇంజనీర్లు, డాక్టర్లను చేయాలన్నదే. ప్రతి పేదవాడికి మంచి చేయాలన్నదే నా కసి. నేను చనిపోయిన తరువాత నాన్నగారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలన్నదే. అవినీతిపై పోరాటం చేయడమే నా కసి. 
–ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు వల్ల పూర్తిగా నష్టపోయిన భరోసా ఇస్తు ముందVడుగు వేస్తున్నారు. ఈ సమయంలో మీ అందరి ఆశీస్సులు, చల్లని దీవేనలు కావాలి. దేవుడు అశీర్వదిస్తే ఏడాదికే మన ప్రభుత్వం వస్తుంది. ఆ పరిపాలన కోసం, మీ  అందరి చల్లని దీవెనలు ఇవ్వాలని మీ అందర్ని కోరుకుంటూ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 

No comments:

Post a comment