14 November 2017

ఇక్కడ ఓటుకు కోట్లు..అక్కడ బోటుకు నోట్లు


–బోటు ప్రమాదానికి బాధ్యులెవరు
– జేసీ నోరు అదుపులో పెట్టుకో
– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పద్మజా

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కమీషన్లకు కక్కుర్తిపడి  అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పద్మజా విమర్శించారు. కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారని గుర్తు చే శారు. ఇప్పుడు బోట్లు అక్రమంగా నడుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కమీషన్లు తీసుకొని అమాయకుల ప్రాణాలు తీశారని వారు ధ్వజమెత్తారు. ఈ ఘటనపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందించకుండా, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీ నోటిని ఫినాయిల్‌తో కడుక్కోమని చురకలంటించారు. నాడు మీ బస్సు ప్రమాదాన్ని చంద్రబాబు కాపాడాడని ఈ రోజు బోటు ప్రమాదాన్ని వెనుకెసుకొస్తున్నారని ఆక్షేపించారు. ఏ ఎండకు ఆ గోడుగు పట్టడం తప్పు కాదని సిగ్గు లజ్జ లేకుండా చెబుతున్న జేసీని మనిషి అంటారా? మరేమైనా అంటారా? అని ప్రశ్నించారు. జేసీ నీకు చాలేంజ్‌ వేస్తున్నాం. ఏ ఒక్క సమస్యపైనైనా నీవు నోరు విప్పావా? కళ్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబుతో కాంట్రాక్టులు పొందడమే నీ «పని అని ఆరోపించారు. మీకు నైతికత అన్నది లేదు. సిగ్గు అన్నది లేదు అని చెప్పుకోవడమా నీ వ్యూహాత్మకత అని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి టీడీపీ నేతలకు చలిజ్వరం పుట్టుకొందన్నారు.  టీడీపీ నేత కంభపాటి రామ్మోహన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.  నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలకు సమాధానం చెప్పండి. అక్కడ ఓటుకు కోట్లు, ఇక్కడ బోటుకు నోట్లు అన్నట్లు మీ అవినీతి సామ్రాజ్యం విస్తరించిపోయింది. బోటు ప్రమాదానికి బాధ్యులు ఎవరు?, నోట్ల కోసం ఓట్లు కొనాలనుకునే మీకు ప్రజలే బుద్ధి చెబుతారని తీవ్రంగా మండిపడ్డారు. 

మంత్రులను ఉసికొల్పుతారా?: పద్మజా
బోటు ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమేనని దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపైకి మంత్రులను చంద్రబాబు ఉసికొల్పుతున్నారని పద్మజా అన్నారు. ఓటు ప్రమాదంపై సమాధానం చెప్పకుండా వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. విజయవాడలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్నది కూడా అక్రమ కట్టడమే అన్నారు. దాదాపు వంద కోట్ల ప్రజా ధనాన్ని ఉపయోగించుకొని తన అధికార నివాసం ఏర్పాటు చేసుకున్నార ని ఆరోపించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జేసీ దివాకర్‌రెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలకడం సిగ్గుచేటు అన్నారు. సీఎం మెప్పుపొందేందుకు జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మీలాంటి వాళ్లను పరజలు ఛీకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సీనియర్‌ అధికారి బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం చేసిన ఎంపీ కేసీనేని నాని, బుద్ద వెంకన్నపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.

No comments:

Post a Comment