8 November 2017

వైయ‌స్ జ‌గ‌న్ వెంట దివ్యాంగుల‌ పాద‌యాత్ర‌

ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌కారం చుట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఎంతో మంది వైయ‌స్ జ‌గ‌న్ వెంట అడుగులో అడుగు వేస్తూ పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు. వీరిలో ప‌లువురు దివ్యాంగులు జ‌త క‌లిశారు. ఓ వ్య‌క్తి త‌న‌కు చూపు కాన‌రాకున్నా వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి ప్ర‌యాణం సాగిస్తున్నారు.  ఇడుపుల‌పాయ నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌తోనే యాత్ర చేస్తున్నాడు. ఆరు నెల‌ల పాటు జ‌గ‌న‌న్న‌తోనే ఉంటాన‌ని ఇంటి నుంచి వ‌చ్చారు. తాను అంధుడ‌నైన‌ప్ప‌టికి రాష్ట్రానికి మంచి జ‌ర‌గాల‌నే ఉద్దేశ్యంతో వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న యాత్ర‌లో తాను భాగ‌స్వామిని కావాల‌ని ముందుకు వ‌చ్చాన‌ని ఆ  అంధుడు తెలిపారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి పేద‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌ని ఆయ‌న గుర్తు చేశారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఆ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇటీవ‌ల త‌న తండ్రికి ని నిమోనియా వచ్చి ఆసుప‌త్రికి వెళ్లే ఆరోగ్య‌శ్రీ ఎందుకు ప‌నికి రాద‌ని బ‌య‌ట‌కు పంపించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప‌రిస్థితి రాకుడ‌నే ఉద్దేశంతోనే వైయ‌స్ జ‌గ‌న్‌తో పాటు ఆరు నెల‌లు పాద‌యాత్ర‌లో పాల్గొంటాన‌ని దివ్యాంగుడు పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం, ఆరోగ్య‌శ్రీ అమ‌ల‌వుతుంద‌ని ఆ అంధ విద్యార్థి ఆశాభావం వ్య‌క్తం చేశారు. పాద‌యాత్ర‌లో పాల్గొంటున్న ఈ అంధ విద్యార్థి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఈ దివ్యాంగుడు ఉత్సాహంగా న‌డ‌వ‌డంతో ప‌లువురు అత‌న్ని అభినందిస్తున్నారు.

No comments:

Post a Comment