17 November 2017

రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నాడ‌ని..


- వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చూసేందుకు ప‌నులు మానుకున్న కూలీలు
- పొలం నుంచి ప‌రుగులు తీస్తున్న రైతులు
క‌ర్నూలు:  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏడు రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలో సాగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజుల పాటు సాగింది. జ‌న‌నేత వ‌స్తున్న స‌మాచారంతో గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు జనం భారీ ఎత్తున హాజరవుతున్నారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనపై వివిధ జాతీయ పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న వ్య‌వ‌సాయ కూలీలు ప‌నులు మానుకొని దారి పొడువునా వేచి చూస్తున్నారు. నిన్న‌ వైయ‌స్‌ జగన్‌ ఆళ్లగడ్డ నుంచి తమ గ్రామం పెద్ద చింతకుంటకు వస్తున్నారని తెలుసుకుని  వ్యవసాయ కూలీలు ఉదయం 8 గంటలకే రోడ్డుపైకి చేరుకున్నారు. పొలం యజమాని ఒత్తిడి చేస్తున్నా వారు అక్కడి నుంచి కదల్లేదు. ‘జగనన్నను చూశాకే వెళ్తాం. మరీ ఆలస్యమైతే సగం కూలీ ఇద్దురు గానీ’ అని అన్నారు. జ‌న‌నేత  ఉదయం 10 గంటలకు వారి వద్దకు వచ్చారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.  రంగమ్మ, ప్రభావతి అనే ఇద్దరు కూలీలను జగన్‌ దగ్గరకు పిలిచి, వారితో కలిసి మూడు నిమిషాలపాటు నడక సాగించారు.

స‌మ‌స్య‌ల వెల్లువ‌:
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ద్వారా త‌మ గ్రామానికి రావ‌డంతో స్థానికులు స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. అన్ని అర్హతలున్నా తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ పెద్దచింతకుంటకు చెందిన పలువురు ప్ర‌తిప‌క్ష నేత‌ ముందు వాపోయారు. గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ తన భర్త పాములేటి ఐదేళ్ల క్రితం మృతి చెందాడని అయితే తనకు వితంతు పింఛన్‌ మంజూరు చేయకుండా తిప్పుతున్నారని వైయ‌స్ జగన్‌ వద్ద వాపోయింది. తనకు ఐదుగురు పిల్లలున్నారని.. కూలీ పని చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు బాలయ్య తనకు పింఛన్‌ రావడం లేదని వాపోయాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచి అందరికీ న్యాయం చేస్తామని వైయ‌స్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వీరంద‌రికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా ఇస్తూ పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు.

No comments:

Post a Comment