25 November 2017

డిప్యూటీ సీఎం ఉన్నా ఒక్క పని కూడా చేయలేదు

వెల్దుర్తి: పత్తికొండ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఉన్నా..ఏ ఒక్క పని కూడా చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీదేవి మాట్లాడారు.  ఎన్నికల ముందు చంద్రబాబు అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చారని శ్రీదేవి విమర్శించారు. బాటు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, ప్రజల కోసమే వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించారని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 3 వేల కిలోమీటర్ల మేర  వైయస్‌ జగన్‌ పాదయాత్రగా బయలుదేరారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జననేతకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజలు జననేతకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరిస్తున్నారని చెప్పారు. రుణమాఫీ అంటే వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు. ఎన్నికలకు ముందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి హమీ ఇవ్వకపోయినా రుణమాఫీ చేశారన్నారు. కానీ ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేసిందన్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని నిప్పులు చెరిగారు. ఈ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రజలు జననేతకు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చేది రాజన్న రాజ్యమే అని ఆమే ధీమా వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి బౌతికంగా లేకపోయినా నాకు ప్రతి ఒక్కరు అండగా నిలిచారన్నారు. 

No comments:

Post a comment