14 November 2017

క‌ర్నూలుకు చేరిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


8వ రోజు చాగ‌ల‌మ‌ర్రి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం
7 నియోజకవర్గాలు...250 కిలోమీటర్లు 
కర్నూలు :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మంగ‌ళ‌వారం క‌ర్నూలు జిల్లాకు చేరింది. ఈ నెల 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన జ‌న‌నేత పాద‌యాత్ర ఆ జిల్లాలో ఏడు రోజుల పాటు సాగింది. జ‌న‌నేత‌కు వైయ‌స్ఆర్ జిల్లా ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అడుగ‌డుగునా, గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ ఆత్మీయుడిని అక్కున చేర్చుకున్నారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ‌కు మొర‌పెట్టుకున్నారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ మంగళవారం ఎనిమిదో రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.  కర్నూలు–వైయ‌స్ఆర్‌ జిల్లా సరిహద్దులోని ఎస్‌ఎస్‌ దాబా నుంచి ఉదయం పాద‌యాత్రను మొదలుపెట్టారు. అక్కడ నుంచి చాగలమర్రి గ్రామానికి చేరుకున్నారు.  సందర్భంగా జననేతకు పూలతో అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు మీదుగా చక్రవర్తులపల్లెకు చేరుకుంటారు. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండు సెంటర్‌లో ప్రజలనుద్దేశించి వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అలాగే గొడిగనూరులో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
 
నెలాఖ‌రు వ‌ర‌కు క‌ర్నూలు జిల్లాలోనే..
వైయ‌స్ జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్ర  ఇవాళ కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఈ నెలాఖరువరకు యాత్ర కొనసాగనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి నుంచి మొదలైన ఈ యాత్ర బనగానపల్లె, డోన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల మీదుగా పత్తికొండ నియోజకవర్గం వరకూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వైయ‌స్‌ జగన్‌ నేరుగా తెలుసుకోనున్నారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చడంలో విఫలమైన తీరును ఆయన ఎండగట్టనున్నారు. కర్నూలు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలోనూ ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు.

ఘ‌న స్వాగ‌తం
క‌ర్నూలు జిల్లాలో ప్ర‌వేశించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, నాయ‌కులు గౌరు వెంక‌ట్‌రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.

No comments:

Post a Comment