17 November 2017

ర‌చ్చ‌బండ సాక్షిగా ‘ప‌చ్చ’ అవినీతి


- వైయ‌స్ఆర్‌సీపీ ర‌చ్చ‌బండ‌, ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మాల‌కు స్పంద‌న‌
- వెల్లువెత్తున్న స‌మ‌స్య‌లు
-  బ‌య‌ట‌ప‌డుతున్న జ‌న్మ‌భూమి క‌మిటీల అరాచ‌కాలు

అమ‌రావ‌తి: ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ రచ్చబండ, పల్లెనిద్ర కా ర్యక్రమాలకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గ్రామ గ్రామాన జ‌న్మ‌భూమి క‌మిటీలు చేస్తున్న అరాచకాలు వెలుగు చూస్తున్నాయి.  రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ నేత‌లు హామీ ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఏర్ప‌డ్డ జ‌న్మ‌భూమి క‌మిటీలు గ్రామాల్లో పెత్త‌నం చెలాయిస్తున్నాయి. ఈ క‌మిటీలు చెప్పిన వారికే పింఛ‌న్లు, రుణాలు, ప‌క్కా గృహాలు మంజూరు చేస్తున్నారు. టీడీపీ నాయ‌కులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్న అవినీతి, అరాచ‌కాలు ర‌చ్చ‌బండ సాక్షిగా వెలుగు చూస్తున్నాయి.

నవంబ‌ర్ 11 నుంచి ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు..
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీ మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నవంబర్‌ 11 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల అధ్య‌క్షుల నేతృత్వంలో నియోజకవర్గ సమన్వకర్తలు,  ఎమ్మెల్యేలు, మండ‌ల సమన్వయకర్తలు ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సింది ఉంటుంది. తొలుత గ్రామాల్లోకి వెళ్లి అక్కడ పార్టీ జెండా అవిష్కరించి వైయ‌స్ఆర్‌  విగ్రహానికి నివాళులర్పిస్తారు. తరువాత రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వివరించి స్లిప్‌లలో వారితో సంతకాలు సేకరిస్తారు. అనంతరం బూత్‌ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారు. గ్రామంలో ప్రభావితం చేసే ఉద్యోగులు, కుల సంఘాల నేతలను కలుస్తారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తారు. మధ్యలో నియోజకవర్గ స్థాయిలోని విద్యాసంస్థ విద్యార్దులతో సమావేశమవుతారు. 

స‌మ‌స్య‌ల వెల్లువ‌
రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో స‌మ‌స్య‌లు వెల్లువెత్తుతున్నాయి.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు జ‌నం అధిక సంఖ్య‌లో హాజ‌రై ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.  ప్ర‌తి గ్రామంలో కూడా రేషన్‌కార్డులు ఇవ్వ‌డం లేద‌ని, అర్హులకు పింఛన్‌ మంజూరు కా లేదని, గ్రామాల్లో మౌలికవసతులు క ల్పించాలని కోరుతున్నారు.  ఎస్టీ రు ణాలకు దరఖాస్తు చేసుకోగా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదని, సరైన రోడ్డు సౌకర్యం లేదు, పాఠశాలకు మూడు కిలోమీటర్ల వరకు విద్యార్థులు నడిచి వెళ్తున్నారని ప్రజలు విన్నవిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకో వడం లేదని, గత ఎన్నికల్లో టీడీపీ మోసపూరిత హామీ లను ప్రకటించి ప్రజలను మభ్య పెట్టిం దని మండిప‌డుతున్నారు.  మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, వైయ‌స్‌. జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.  

No comments:

Post a comment