13 November 2017

దిగ్విజ‌యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


  • గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తాలు
  • జ‌న‌నేత‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
  • కుల‌మ‌తాల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న వైనం
  • వైయ‌స్ఆర్ జిల్లాలో జ‌న హార‌తి
  • రేప‌టి నుంచి క‌ర్నూలు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌

వైయ‌స్ఆర్ జిల్లా:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట త‌ల‌పెట్టిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నెల 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి యాత్ర‌ను ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ ఏడు రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలోనే ప‌ర్య‌టించి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. రోడ్ల వెంట రంగు రంగుల ముగ్గులు వేస్తూ, పూల‌వ‌ర్షం కురిపిస్తూ త‌మ అభిమాన నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. మార్గం మ‌ధ్య‌లో విద్యార్థులు, రైతులు, మ‌హిళ‌లు, ఉద్యోగులు,  కాంట్రాక్ట్ కార్మికులు, కుల సంఘాల నాయ‌కులు, ప్ర‌జా సంఘాల నేత‌లు ఇలా ఒక్క‌రేంటి కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ అడుగులో అడుగులు వేస్తున్నారు. ఎవ‌రిని క‌దిలించిన తాము చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌తో ల‌బ్ధిపొందామ‌ని, ఆ మ‌హానేత రుణం తీర్చుకునేందుకు మీ వెంట న‌డుస్తామ‌ని మాట ఇస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో వైయ‌స్ జ‌గ‌న్‌ వివిధ వర్గాల వారికి, ప్రభుత్వ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  యాత్ర‌లో భాగంగా  ఫిజియోథెరపీ వైద్యులు, 108 ఉద్యోగులు, రాష్ట్రీయ బాల స్వస్త్య ఉద్యోగులు, ఆర్‌టీపీపీ, డిస్కం, జెన్‌కోలో 20 నుంచి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు, వీఆర్‌ఏలు, వివిధ కుల సంఘాల నాయకులు జగన్‌కు కలసి వారి సమస్యలు వివరించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వైయ‌స్ జగన్‌ భరోసా ఇవ్వడం వారికి కొండంత ధైర్యాన్నిచ్చింది.  

మీ వెంట మేమున్నాం
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో  అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు క‌లిసి న‌డుస్తున్నారు. మీ వెంట మేమున్నాం మీ సంక‌ల్పం గొప్ప‌దంటూ ముందుకు సాగుతున్నారు. దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో తమ కుటుంబాలు ఆనందంగా బతికాయని, ఇప్పుడు జీతాలు కూడా రావడం లేదని తమ బాధలు చెప్పుకుంటున్నారు.  వైయ‌స్‌ హయాంలో ఎలాగైతే ఆనందంగా ఉండేవారో తాము అధికారంలోకి వచ్చాక అలానే ఉండేలా చూస్తానని వైయ‌స్‌ జగన్‌ వారికి హామీ ఇస్తున్నారు. జ‌న‌నేత  హామీ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని వైయ‌స్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు.  

14 రేపటి నుంచి కర్నూలు జిల్లాలో ‘ప్రజాసంకల్ప యాత్ర’  
కర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 14 నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీ రాత్రి కర్నూలు–కడప జిల్లాల సరిహద్దు ప్రాంతమైన చాగ‌ల‌మ‌ర్రి శివారులోని ఎస్‌ఎస్‌ డాబా వద్దకు ప్రజా సంకల్ప పాదయాత్ర చేరుకుంటుందని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం 8.30 గంటల నుంచి పాదయాత్ర చాగలమర్రి మండలంలో ప్రారంభమవుతుందని, ఈ మేరకు రూట్‌ మ్యాప్‌ ఖరారు అయినట్లు స్పష్టం చేశారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.  వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు క‌ర్నూలు జిల్లా వాసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment