9 November 2017

పెద్ద‌న్న‌పాడు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైయ‌స్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. సర్వరాజపేట మీదుగా పెద్దన్నపాడు వైయ‌స్ జ‌గ‌న్ చేరుకున్నారు. జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు త‌మ‌కు పింఛ‌న్లు రాలేద‌ని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంద‌లేద‌ని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్క‌డి నుంచి  వైకోడూరుకు వైయ‌స్ జ‌గ‌న్ వెళ్లి గ్రామ‌స్తుల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. 

No comments:

Post a comment