6 November 2017

ఆ అడుగే ఒక లక్ష్యం


-ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం
-ప్రతి అడుగూ ప్రజల వైపే
-అసెంబ్లీ బహిష్కారం ప్రజాతీర్పును గౌరవించడమే

ప్రభంజనం మొదలైంది. ప్రజా సంకల్పం ఆరంభమైంది. ప్రజానేత అడుగులు ప్రగతికి దారి చూపేందుకు సాగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయ నుంచి పాదయాత్రను ఆరంభించారు. జగనన్న బాటకు బాసటగా నిలివాలని ప్రతి తెలుగువాడి నాడీ కొట్టుకుంటోంది. అందుకే ఇడుపులపాయ ఇసుకేస్తే రాలనట్టుగా ఉంది. భగవంతుని ఆశీర్వాదాలు, తండ్రి వైయస్సార్ దీవెనలు, ప్రజల అండదండలతో వైయస్ జగన్ మహాపాదయాత్రకు నాందీ ప్రస్తావన జరిగింది. ఈ సందర్భంలో ఇడుపుల పాయలో జరిగిన సభకు అనంత వాహినిలా వచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంలో ప్రజలకు తెలియజేసారు. అవినీతిమయం అయిన టిడిపి కి అంతిమ కాలం దగ్గరపడిందని చెప్పారు. కాన్ఫిడెన్షియల్ జీవోలంటూ 2000 జివోలను ఈ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రజాసంఘాలకు చివరకు న్యాయవ్యవస్థకు కూడా తెలియకుండా చీకటీ జీవోలతో రాష్ట్రాన్ని తమకు నచ్చినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో నడిచేదంతా దొంగ ప్రభుత్వమే. ప్రజల తరఫున ప్రభుత్వన్ని నిలదీయాల్సింది ప్రతిపక్షమే. కానీ ఆ ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు. ప్రతపక్ష నాయకులను మాట్లాడనీయరు. సాక్షాత్తూ శాసన సభలో మైకులు కట్ చేసి, దూషణలు  చేసి, గొడవ చేసి ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేసి వారికి అసలు ప్రశ్నించే అవకాశమే లేకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైయస్సార్ సిపి పార్టీ జెండాను చూపించి ప్రజల మద్దతు సంపాదించి గెలిచి, అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, అక్కడ పదవులు అనుభవిస్తున్నారు. ప్రజా తీర్పును అవమానిస్తున్నారు. కనీస విలువలను పాటించకుండా, రాజీనామా చేయించకుండా చంద్రబాబు వారిని అసెంబ్లీలో తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. ఇది అమానుషం. అలాంటి సిగ్గులేని ప్రభుత్వం తీరును వైయస్ జగన్ ప్రజల మధ్య ఎండగట్టబోతున్నారు. ప్రజల సమస్యలు ప్రశ్నించ నీయకుండా ప్రతిపక్ష పార్టీ మైకును అసెంబ్లీలో కట్ చేస్తే, అసెంబ్లీనే బహిష్కరించి ప్రజా తీర్పు కోరుతూ జనం మధ్యలో గొంతు విప్పుతున్నారు. ఇది ఓ సాహసుకుడి యాత్ర. ఓ నవ చరిత్ర నిర్మాత అడుగులు రాసే నవయుగ యాత్ర.

నాయకుడికి ఓ లక్ష్యం ఉంటుంది. అది ప్రజల కోసమే. నాయకుడికి ఓ కల ఉంటుంది. అది ప్రజల సంక్షేమమే. నాయకుడిని నడిపించే ఓ స్ఫూర్తి ఉంటుంది. అది ప్రజలు ప్రేమతో అందించేదే. జగమంత కుటుంబాన్ని వారసత్వంగా అందుకున్న నాయకుడికి ప్రజా బలం, ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అందుకే ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా ఆ నాయకుడి పయనం ఆగదు. ప్రజల కోసం సాగే ప్రస్థానం మారదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి…ఆంధ్రరాష్ట్రం అంతా ఆశతో ఎదురు చూస్తున్న పేరది. ఆయన అడుగులు తమ గడపల ముంగిటకు రావాలని కోరుతున్న క్షణమిది. అది నేడే నిజమౌతోంది. 

No comments:

Post a comment