13 November 2017

జననేతను కలిసిన విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తమ గ్రామాలకు వస్తున్న ౖవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 7వ రోజు దువ్వూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిశారు. విద్యార్థి సంఘాల నాయకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో చదువులు మధ్యలోనే ఆపుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఉపకార వేతనాలు రెండేళ్లుగా అందడం లేదని, హాస్టళ్లు మూసి వేస్తున్నారని, మెస్‌ చార్జీలు చెల్లించడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులు కూడా తమ బాధలు చెప్పుకున్నారు. పీఆర్‌సీ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, బదిలీలు చేపట్టాలని మొరపెట్టుకున్నారు. అలాగే స్థానికులు తమకు పింఛన్లు అందడం లేదని, రేషన్‌కార్డులు, జాబు కార్డులు ఇవ్వడం లేదని, పక్కా ఇల్లు పచ్చ చొక్కాలకే మంజూరు చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు చెప్పారు. వీరి సమస్యలను ఓపికతో విన్న ప్రతిపక్ష నేత త్వరలోనే మంచి రోజులు వస్తాయని అందరికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. అశేష జనవాణిని నడుమ వైయస్‌ జగన్‌ దువ్వూరు నుంచి ఇక్కుపల్లికి చేరుకొని అక్కడి జంక్షన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
‘అమ్మ ఒడి’ 
 మని తెలిపారు. ఉన్నత చదువులకు అయ్యే ఫీజు మొత్తాన్ని భరిస్తామని, ప్రోత్సాహకంగా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.చదువే అభివృద్ధికి మార్గమని, చాలా సమస్యలకు పరిష్కారమని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే మార్గమని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మ ఒడి’కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులకు అయ్యే ఫీజు మొత్తాన్ని భరిస్తామని, ప్రోత్సాహకంగా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారం 
ఇద్దరు పిల్లలను బడికి పంపించే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు అక్క, చెల్లెమ్మల చేతికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే కడుతుంది. ఫీజులు కట్టడంతో పాటు ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులకు ఖర్చులకు మరో రూ.20 వేలు ఇస్తాం. అలా చేయడం వల్ల ఆ పిల్లలు గొప్పగా చదువుకుంటారు. ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రత్యేకహోదా రావాలి. దాని సాధనకు మీరంతా కలిసిరావాలి.  

No comments:

Post a Comment