17 November 2017

ముగిసిన వైయస్‌ జ‌గ‌న్ పదో రోజు పాదయాత్ర

కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన 10వ రోజు పాదయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. ఇవాళ ఉదయం ఆళ్లగడ్డ పట్టణం నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర చింతకుంట, దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా  సాగింది. పాదయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలను కలిశారు. అలాగే శిల్పాకారులు, మైనారిటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రూప్‌–1 అభ్యర్థులు, వ్యవసాయ కూలీలు కలిశారు. భాగ్యనగరంలోని పత్తి పంటను పరిశీలించారు. దొర్నిపాడు సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొండాపురం వద్ద కేసీ కేనాల్‌ రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. పదో రోజు వైయస్‌ జగన్‌ 13.2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తనను కలిసిన అన్ని వర్గాల ప్రజలకు జననేత సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment