14 November 2017

మీ పిల్లలను నేను చ‌దివిస్తా


– వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
– చదువుల విప్లవం తీసుకొని వస్తాను
–అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తాం
– మీ కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర 
– మీరు దిద్దిన మ్యానిఫెస్టోనే అమలు చేస్తాను
– చంద్రబాబు పాలనలో అభివృద్ధి మూడు అడుగులు వెనక్కి
– మనమందరం కలిసి నాలుగు అడుగులు ముందుకు తీసుకెళ్తాం
– ముత్యాలపాడు బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ముత్యాలపాడు:  చదువుల కోసం ఏ ఒక్కరు ఇబ్బంది పడుకూడదని, మీ పిల్లలను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హమీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకువస్తానని, అందుకు మీరందరు తోడుగా నిలవాలని ఆయన కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం  8వ రోజు కర్నూలు జిల్లాలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా చాగలమ్రరిలో ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముత్యాలపాడుకు చేరుకున్ను జననేతకు ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు. ముత్యాలపాడు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఎండగడుతూ..తమ ప్రభుత్వం వస్తే అమలు చేసే పథకాలను వివరించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
 
– వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో పాదయాత్ర ముంగించుకొని ఇవాళ కర్నూలు జిల్లాకు వచ్చాను. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని తనకు చెప్పారు. అభివృద్ధి అంటే నాలుగు అడుగులు ముందుకు వేయడం అయితే చంద్రబాబు పాలనలో మూడు అడుగులు వెనక్కి వేసింది. ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి నాలుగు అడుగులు ముందుకు నడిపించేందుకు ఇవాళ ఈ పాదయాత్ర చేపడుతున్నాం. అభివృద్ధి అంటే నిన్న కన్న ఇవాళ బాగుండటం, ఇవాల్టి కన్న రేపు బాగుండటం అభివృద్ధి అంటాం.
– చంద్రబాబు నాలుగేళ్ల పాలన కంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకుంటే రాష్ట్రం ముందుకు పోయిందా? వెనక్కి పోయిందా అంటే ఎవరి నోట విన్నా అందరు నష్టపోయామని చెబుతున్నారు.
–  రైతుల పరిస్థితి దారుణంగా మారింది. చంద్రబాబు నాడు వ్యవసాయ రుణాలు అన్ని మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకు రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మిమ్మల్ని అడుగుతున్నా..బ్యాంకుల్లో రుణాలు మాఫీ అయ్యాయా? బంగారం  ఇంటికి వచ్చిందా? చంద్రబాబు చేసిన రుణమాఫీ వ డ్డీలకైనా సరిపోయిందా? వడ్డీలకు కూడా సరిపోలేదు. రైతులు వడ్డీలు కట్టలేక, బ్యాంకు రుణాలు కట్టలేక, రుణాలు రెన్యువల్‌ కాక, ఇన్సూరెన్స్‌ రాక అవస్థలు పడుతున్నారు. నాడు చంద్రబాబు రూ.5 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి తీసుకువస్తానని చెప్పారు. ఇవాళ పత్తికి రేటు ఉందా ? కనీస మద్దతు ధర రూ.4400 ఉంటే, రూ.3 వేలకు కొనే నాథుడు లేడు. మినుము, పసుపు, వరి, కందికి రేటు లేదు. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థ రంగ ప్రవేశం చేసిన తరువాత వాళ్లంతా రైతుల వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేసిన తరువాత అప్పుడు రేట్లు ఆకాశానానికి అంటిస్తారు. నాలుగేళ్లుగా ఇదే జరుగుతుంది. రూ.5 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి అన్నారు. ఏమైంది ఆ ధర ల స్థీరికరణ ని«ధి. ఇక్కడ ఉన్న రైతులు కేసీ కెనాల్‌ మీద ఆధారపడ్డారు. 

మహానేత పాలనలో రెండు పంటలు పండేవి:
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రెండు పంటలు పండేవని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు.  చంద్రబాబు పాలనలో ఒక్క పంటకు నీరు అందడం లేదు. రాజోలి ప్రాజెక్టుకు నాన్నగారు నిధులు కేటాయించారు. నాన్నగారు బతికి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. ఇవాళ ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే వారు లేరు. గుండ్రెవుల ప్రాజె క్టును పట్టించుకోవడం లేదు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా మనకు నీళ్లు రావడం లేదు. రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేనేతలు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాపీ చేయలేదు. అక్కచెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న ద్యాస కూడా లేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ఇప్పటికి రూ.90 వేలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు.
–  చంద్రబాబు ఆ రోజు మైక్‌ పట్టుకొని ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. 
– రేషన్‌ షాపులకు వెళ్తే గతంలో చక్కెర, పామాయిల్, కిరోసిన్, కంది పప్పు ఇన్ని దోరికేవి. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. అన్ని రకాలుగా మోసాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం కరెంటు బిల్లు వంద, యాభై రూపాయలు వచ్చేది. ఇవాళ కరెంటు బిల్లు రూ.500, 600 వస్తుంది. ఇవే కాదు..చంద్రబాబుకు నచ్చకపోతే రూ.20 వేలు కూడా ఫైన్‌ వేస్తున్నారు.
– ఈ పరిపాలన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరందరికి తోడుగా ఉండేందుకు పాదయాత్రగా బయలుదేరాను. ఎళ్లకాలం చంద్రబాబు పాలన సాగదు. ఏడాదిలో మనందరి పాలన వస్తుంది. ఈ పాదయాత్రలో సలహాలు, సూచనలు, ఆలోచనలు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. 
– మన పార్టీ అధికారంలోకి వచ్చాక నవరత్నాలను ప్రకటించాను. వాటిలో కూడా మార్పులు చేర్పులు చేసేందుకు సలహాలు ఇవ్వమని కోరుతున్నాను. మనమిచ్చే మ్యానిఫెస్టో చంద్రబాబు మాదిరిగా కట్టలు కట్టలు ఉండవు. చంద్రబాబు మెన్నటి మ్యానిఫెస్టో ఆన్‌లైన్లో కనిపించడం లేదు. 
– నెట్‌లో మ్యానిఫెస్టో కనిపించిందంటే చంద్రబాబును కొడుతారని తీసివేశారు. మన మ్యానిఫెస్టో రెండు, మూడు పేజీలే ఉంటుంది.  మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూసేలా మ్యానిఫెస్టో రూపొందిస్తాం. చెప్పనివే కాదు..చెప్పనివి కూడా అమలు చేస్తాం. ఇవన్ని అమలు చేశామని చెప్పి 2024లో మళ్లి మీ అందరి వద్దకు వస్తాను. రాజకీయాల్లో విశ్వసనీయతకు విలువ ఉండాలి. 
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయ అనే పదానికి అర్థం తీసుకురావాలి. మాటమీద నిలబడని నాయకుడికి పుట్టగతులు ఉండవన్న మార్పు తీసుకురావాలి. ఇదే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. మారుతి కారు కొనిస్తానంటాడు. ఎందుకంటాడంటే మిమ్మల్ని మోసం చేయవచ్చు అన్న ఆలోచన ఆయనది. పలాని వాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగురవేసేలా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరికి కనిపించే అంశం. ప్రతి ఇంట్లో సంతోషం చూపించే అంశం. 

ఫీజులన్నీ నేనే చెల్లిస్తా..
మీ పిల్లలను నేనే చదివిస్తానని, ఫీజులన్నీ నేనే చెల్లిస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పేదవాడి పిల్లాడు చదవాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచన చేయండి. ఇంజనీరింగ్‌ ఫీజులు లక్షలు దాటుతున్నాయి. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బుల కోసం ఇల్లు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితి మార్చడం కోసం మన పార్టీ అధికారంలోకి వస్తే మళ్లి నాన్నగారి సువర్ణయుగాన్ని తీసుకురావడం. పేదవాడి చదువుల కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకుడదు. మీ పిల్లలను నేను చదవిస్తాను. ఫీజులన్నీ నేను కడుతాను. పిల్లాడు కాలేజీకి వెళ్లినప్పుడు హా స్టల్‌ బిల్లులు, మెస్‌ చార్జీల కోసం రూ.20 వేలు ఇస్తాను. నాన్నగారి ఫొటోతో పాటు నా ఫోటో కూడా ఉండేలా అంత గర్వంగా చేస్తాను.
–  తల్లులకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారి పిల్లలను చదివించలేని పరిస్థితి ఉంది. ఆ తల్లిదండ్రులకు చెబుతున్నాను. పిల్లలను మీరు చేయాల్సిందల్లా..మీ పిల్లలను బడికి పంపించండి. బడికి పంపించినందుకు ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నాను. పిల్లాడు గొప్పగా చదువుకోవడానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
– చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. పనులకు పోతేకాని కడుపు నిండని పరిస్థితి ఉంది. పింఛన్‌ నెలకు రూ.2 వేలు చెల్లిస్తాను. బడుగు, బలహీన, మైనార్టీలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చే పరిస్థితి కల్పిస్తాను. ఏ పేద వాడు కూడా బతకడానికి ఇబ్బంది పడకూడదు.  రాబోయే రోజుల్లో నవరత్నాలకు సంబంధించి మిగతా విషయాలు కూడా చెబుతాను. మీ అందరి చల్లని దీవేనలు, ఆశీస్సులు కోరుతున్నాను. అడుగులో అడుగు వేయాలని కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. 

No comments:

Post a Comment