30 January 2018

నడుస్తూ.. నడిపిస్తూ


– పాదయాత్రలోనే అభ్యర్థుల ప్రకటన
– కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీగా చంద్రమౌళి
– పత్తికొండ నుంచి చెరుకులపాటి నారాయణ రెడ్డి భార్యకే అవకాశం 
– పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉత్సాహం 


వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్పయాత్రతో ఏపీ చరిత్రలో మరో నూతన అధ్యాయానికి తెర తీశారు. గత నవంబర్‌ 6న చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఉరకలెత్తే ఉత్సాహంతో అప్రతిహతంగా సాగిపోతోంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. రాయలసీమ నాలుగుజిల్లాలను పూర్తి చేసుకుని నెల్లూరులో అడుగుపెట్టింది. సడలని ఆత్మవిశ్వాసం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. తండ్రి ఆశయ సాధన కోసం చేపట్టిన పాదయాత్రకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విసిగి వేసారిన ప్రజలు జననేతకు ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాయకుడిగా వైయస్‌ జగన్‌పై నమ్మకంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. 
 
ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలే అండగా వైయస్‌ జగన్‌ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండే విధంగా ప్రజా సంకల్పయాత్రలోనే అభ్యర్థులను ప్రకటిస్తూ కొత్త విధానానికి తెరతీశారు. స్థానిక ప్రజలకు పార్టీ నాయకులను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే విధంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజగకవర్గాల్లో ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడంతో ఇదే ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
రాయలసీమలో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన
ఎన్నికలకు ఏడాది ముందుగానే రాయలసీమ జిల్లాల నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌. వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో ఖాళీ అయిన పత్తికొండ స్థానంలో ఆయన భార్యను సమన్వయ కర్తగా నియమించిన వైయస్‌ జగన్‌.. కర్నూలు జిల్లాలో పత్తికొండలో జరిగిన పాదయాత్రలో భాగంగా ఆమెనే పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి ౖÐð యస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే జిల్లా నుంచి కర్నూలు టౌన్‌ నుంచి మైనారిటీ నాయకుడు హఫీజ్‌ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటింపజేశారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్రకొచ్చిన సమయంలో మరో అభ్యర్థిని ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌలిని చంద్రబాబుపై పోటీకి నిలుపుతూ స్వయంగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన బోయ, వాల్మీకి కులస్తుల ఆత్మీయ సభలో మరో కీలక ప్రకటన చేశారు. వాల్మీకి, బోయ కులాలకు చెందిన వ్యక్తిని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఒక ఎంపీ స్థానం నుంచి పోటీకి నిలుపుతామని ప్రకటించి ఆయా కులాలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ రెండు కులాలను ఎస్టీల్లో చేరుస్తామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి దారుణంగా మోసం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా కులాలకు రాజకీయంగా అండగా నిలిచే విధంగా వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటన బోయలు, వాల్మీకిల్లో సంతోషం నింపింది. 

ఓవైపు పాదయాత్రతో జగన్‌ దూసుకుపోతుంటే ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీసి తద్వారా ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే చంద్రబాబు లక్ష్యం పాదయాత్రకు తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రజలను చూసి జావగారిపోతోంది. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎంతో సంయమనంతో వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర జగన్నాయకుడి దృఢ సంకల్పంపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తోంది. ప్రజల్లో కూడా తమకు ఎలాంటి నాయకుడైతే బాగుంటుందో ఒక స్పష్టత వస్తోంది. 

తప్పుడు కేసులతో పోలీసు వ్యవస్థకే మచ్చ

కృష్ణా: రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు కేసు పెట్టడం పోలీసు వ్యవస్థకే మచ్చ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. మంత్రి దేవినేని ఉమా ఆదేశాలతో తనతో పాటు మరో 11 మందిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇబ్రహీంపట్నంలో పోలీసుల అత్యుత్సాహం చూపుతున్నారని విమర్శించారు. మంత్రి దేవినేని ఉమా ఆదేశాలతో నే తప్పుడు కేసుకు యత్నిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన వాక్‌విత్‌ జగనన్న  ర్యాలీలో వృద్ధుడు చనిపోయాడంటూ కట్టుకథలు అల్లారని ఫైర్‌ అయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రామయ్య చనిపోయాడంటున్న స్థానికులు చెబుతుంటే,  తాము చెప్పినట్లు వినాలని రామయ్య కుటుంబ సభ్యులపై పోలీసుల ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. శవ రాజకీయాలతో ఇబ్బంది పెట్టొద్దని కుటుంబ సభ్యుల వేడుకున్నా వినడం లేదన్నారు. ర్యాలీ వల్లే చనిపోయాడని స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆటో డ్రైవర్‌పై ఒత్తిడి తెస్తున్నారని తప్పుపట్టారు. ఎలాంటి ట్రాఫిక్‌ ఆటంకాలు ఎదురు కాలేదంటున్న ఆటో డ్రైవర్‌ చెప్పినా వినడం లేదన్నారు. మాట వినలేదని ఆటోడ్రైవర్‌ను  అరెస్టు చేసేందుకు యత్నించడగా స్థానికులు అడ్డుకున్నట్లు చెప్పారు.  మృతుడు రామయ్య కుమారుడిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారని నిలదీశారు. మంత్రి దేవినేని ఆదేశంతోనే నాపై తప్పుడు కేసు పెట్టారని జోగి రమేష్‌ మండిపడ్డారు. వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమానికి వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక తనతో పాటు 11 మందిపై కేసు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక సాక్షిగా ఉన్న ఆటో డ్రైవర్‌ను బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తామని జోగిరమేష్‌ పేర్కొన్నారు. 

నా తండ్రిని ఆఖరి చూపు చూసుకుంటా

సైదాపురం: సౌదీలో మృతి చెందిన తన తండ్రి మృతదేహాన్ని ఆఖరి చూపు చూసుకునే భాగ్యం కల్పించాలని సైదాపురం మండలం కొమనేటూరు గ్రామానికి చెందిన జ్యోతి వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకుంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కొమనేటూరు గ్రామానికి వచ్చిన జననేతను జ్యోతి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన బాధను జననేతకు చెప్పుకుంది. 2016లో తన తండ్రి అధిపతి బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడని జనవరి 11వ తేదీన తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదన్నారు. అధిపతి పనిలో పెట్టుకున్న యజమాని పది రోజుల్లో మృతదేహం పంపిస్తానని చెప్పి, ఇప్పుడు పోస్టుమార్టం చేసి పంపిస్తే రూ. 2 లక్షల ఖర్చు అవుతుందని, నా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నాడని వాపోయారు. మీరే ఎలాగైనా మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని జననేతకు మొరపెట్టుకున్నారు. 

గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం

అమరావతి:  మహాత్మాగాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన చూపిన బాట నేతలకు శిరోధార్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. జాతి పిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన, సోమినాయుడు, అవుతు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ప్రాణం పోయినా పార్టీ మార‌ను

నూజివీడు : నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు స్ప‌ష్టం చేశారు.  నూజివీడును ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాన‌ని,  దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి  అందించిన తోడ్పాటు చాలా గొప్పదని గుర్తు చేశారు.  మహానేత కుమారుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు.  తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రజల మనిషినని, నిత్యం ప్రజలలో ఉండేవాడినని, రాబోయే ఎన్నికలలో తిరిగి గెలిచి నూజివీడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు  ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా చైర్మ‌న్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

నెల్లూరు : యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సోషల్‌ మీడియా చైర్మన్‌గా పనిచేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువత, విద్యార్థులతోపాటు అన్నివర్గాల ప్రజల కోసం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అవిరళ కృషికి ఆకర్షితుడనై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో చేరినట్లు కేతంరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని, ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత‌కు చెప్పుకొని సాంత్వ‌న పొందుతున్నార‌న్నారు. ప్ర‌జ‌ల ప‌క్షాన వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్శితుడ‌నైయ్యాన‌ని, మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం జ‌గ‌న‌న్న తెస్తాడ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. 

జాతిపితకు వైయ‌స్‌ జగన్‌ నివాళులు

నెల్లూరు: జాతిపిత మహాత్మాగాంధీ 70వ వర్థంతి ఈ సందర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జగన్‌​ మోహన్‌ రెడ్డి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ సైదాపురం గ్రామంలోని బ‌స చేసే ప్రాంతం వ‌ద్ద ఏర్పాటు చేసిన గాంధీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు, సీనియ‌న్ నాయ‌కులు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, త‌ల‌శీల ర‌ఘురాం, త‌దిత‌రులు గాంధీజీకి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

ఊటూకూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే ఊటూకూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.

సిద్ద‌య్య కోన‌లో ఘన స్వాగతం

నెల్లూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. 75వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  జననేత వైయ‌స్‌ జగన్‌కు సిద్ద‌య్య కోన‌లో ప్రజల నుంచి ఘ‌న‌ స్వాగతం లభించింది.

సైదాపురం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

నెల్లూరు :  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  75వ రోజు మంగళవారం ఉదయం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం శివారు నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి సిద్ధయ్య కోన, పొక్కనదాల క్రాస్‌ మీదుగా ఊటకూరు, గిద్దలూరు క్రాస్‌, తురిమెళ్ల కు పాదయాత్ర చేరుకుంటుంది. దారిపోడవునా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతారు. తురిమెళ్లలో ఆయన వైయ‌స్ఆర్‌  సీపీ జెండాను ఆవిష్కరిస్తారు.  అక్కడి నుంచి కలిచేడుకు ఆయన చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖాముఖి ఉంటుంది. కలిచేడులోనే ఆయన రాత్రి బస చేస్తారు.

ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్‌

నెల్లూరు : వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన వెంటకగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక‍్కనదాల క్రాస్‌, ఊటకూరు, గిద్దలూరు క్రాస్‌, తురిమెళ్ల, కలిచేడు వరకూ  ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ తురిమెళ్లలో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అలాగే కలిచేడులో చేనేతలతో ముఖాముఖి అవుతారు. వైయ‌స్‌ జగన్‌ రాత్రికి కలిచేడులోనే బస చేస్తారు. 

వెయ్యి కిలోమీటర్ల ఫైలాన్‌ ఆవిష్కరణ

నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫైలాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అక్కడ వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. జననేతకు ఘన స్వాగతం పలికి, కాబోయే సీఎం జిందాబాద్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

18 January 2018

మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

సీఎం నియోజకవర్గంలో మహిళలపై దాడి
వివస్త్రను చేసి వీడియోలు తీసిన టీడీపీ నేతలు
వాటిని సోషల్‌మీడియాలో పెట్టి పైశాచిక ఆనందం
ఘటన జరిగి 24 గంటలైనా స్పందించని చంద్రబాబు
ఆయనొస్తేనే బాగుంటుందని ప్రచారం ఇందుకేనా?
రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయి
చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించరా?
కనీసం కేసులు కూడా పెట్టనివారు మీరు పోలీసులా?
చంద్రబాబు అధికార అహం దించేందుకు మహిళా లోకం ఒక్కటవ్వాలి
హైదరాబాద్‌: చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను అత్యంత అమానుషంగా వివస్త్రను చేసి టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, ఆ ఘటనను వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి పచ్చనేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు కల్పించే రక్షణ ఇదేనా..? కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గంజర్లపల్లిలో జరిగిన ఘటనకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులైన ఇద్దరు దంపతులపై పక్కన ఉన్న మహిళ దుర్భాషలాడడం, తరువాత వారిపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రోద్భలం ఉందని క్లీయర్‌గా తెలుస్తుందన్నారు. మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి, నోటితో కొరికి ఇంత దారుణం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని విన్నాం.. కానీ ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి దుర్ఘటన జరగడం సిగ్గుచేటన్నారు. 

విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనుచరులు భూకబ్జాలకు ఎదురెళ్లిన దళిత మహిళలను వివస్త్రను చేశారని, అదే విధంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో జల్లిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు అనుచరులు సుదమ్మ అనే మహిళలను చెప్పుకాలితో ఎగిరి ఎగిరి తంతే ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇంత దారుణం జరిగితే ఏమీ ఎరుగనట్లు చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాడని మండిపడ్డారు. బాబు కుటుంబం సభ్యులు రక్తదానాలు గురించి సూక్తులు చెబుతున్నారని, మీ కుప్పం నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై మీకు చీమ కుట్టినట్లుగా కూడా లేదా.. అని చంద్రబాబు కుటుంబ సభ్యులను వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. టీడీపీకి గిట్టనవారిని ఏమైనా చేయొచ్చు అనే సంకేతాన్ని చంద్రబాబే ఇస్తున్నారన్నారు.
మొట్టమొదటి సారిగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మా వాళ్లను చూసీచూడనట్లుగా వదిలేయాలని చంద్రబాబే చెప్పారని, చంద్రబాబు చర్యలతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ఎమ్మార్వోను ఇసుకలో వేసి కొట్టినా కేసులు ఉండవు. మీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఐపీఎస్‌ను దుర్భాషలాడినా చర్యలుండవు. పైగా చంద్రబాబే దగ్గరుండి రాజీ చేయించారని గుర్తు చేశారు. రిషితేశ్వరి మృతిపై ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా..అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ఆయన వస్తేనే మహిళలకు రక్షణ అని ప్రచారం చేయించిన చంద్రబాబు వస్తే ఇంత దారుణఃగా ఉంటుందని అనుకోలేదని మహిళలు గగ్గోలు పెడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. నూలుపోగు లేకుండా ఒక మహిళను నిలబెడితే చర్యలు తీసుకోని చంద్రబాబు చొక్కా పట్టుకోరా ఎవరైనా.. అని ప్రశ్నించారు. మీ ఇళ్లలో మగాళ్లకు తోలు మందమై పరిపాలన చేస్తున్నారని, పారిశ్రామిక వేత్తల సదస్సు గురించి మాట్లాడుతున్న నారా భువనేశ్వరి, బ్రహ్మణి.. కుప్పంలో ఇంత దారుణమైన సంఘటన జరిగితే మీరు బయటకు వచ్చి మాట్లాడరా..అని నిలదీశారు. ‘‘చిత్తూరు కలెక్టర్, ఎస్పీ భార్యలను అడుగుతున్నా.. మీ ఇళ్లలో మగవారు మానవత్వం మరిచిపోయారేమో.. మీకేమైంది.. రాష్ట్ర డీజీపీ భార్యను అడుగుతున్నా.. ఇంత దారుణాలు జరుగుతున్నా.. కేసులు పెట్టకపోతే.. ఇళ్లలో మీ భర్తను ప్రశ్నించరా..’’ కనీసం కేసు పెట్టడానికి భయపడుతున్న మీరు పోలీసులేనా..అని విరుచుకుపడ్డారు. 
 
మనిషికి రక్షణ కల్పించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లు పచ్చచొక్కాలు వేసుకొని గంగిరెద్దుల్లా తలలు ఊపుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కుప్పంలో ఒక మహిళలను వివస్త్రను చేసి 24 గంటలు అయినా కేసు పెట్టరా.. రాక్షస పాలన అనేందుకు ఇది నిదర్శనం కాదా.. అని మండిపడ్డారు. పదవులు ఎందుకు అలంకరించుకునేందుకా అని నిలదీశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఐఏఎస్‌ అధికారిణిని లైగింక వేధింపులకు గురిచేస్తున్నారంటే దిక్కులేదు.. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురు మంత్రి బంధువులు దాడి చేస్తున్నారని రోడ్డుపై బైఠాయిస్తే రాజీలు చేశారు. ఇదేనా చంద్రబాబు పరిపాలన అని ప్రశ్నించారు. ప్రజల కంటే నేను గొప్పవాడిని, ప్రజాస్వామ్యం కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాడని, మహిళలపై ముఖ్యమంత్రి చేసే నీతి వ్యాఖ్యలు మేకవన్నెపులి లాంటిదని అర్థం అవుతుందన్నారు. కుంజర్లపల్లిలో జరిగిన ఘటనపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని, కుప్పం, రాష్ట్ర మహిళలకు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా చంద్రబాబు తలకెక్కిన అహంను దించాలని మహిళలకు పిలుపునిచ్చారు. 

భూములు వెన‌క్కి ఇప్పిస్తాం

శ్రీకాళహస్తి:  విమానాశ్ర‌యం కోసం ప్ర‌భుత్వం పేద‌ల నుంచి తీసుకున్న భూమిని తిరిగి వెన‌క్కి ఇప్పిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన రామ్మూర్తి కలిసి.. తన సమస్యను విన్నవించుకున్నారు. రామ్మూర్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. విమానాశ్రయ నిర్మాణం కోసం ఆయన భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కొంది. దీంతో భూమి కోల్పోయిన ఆయనకు కనీసం సరైన పరిహారం కూడా ఇవ్వలేదు. దీనిపై అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టులకు వెళ్లినా లాభం లేకపోయింది. దీంతో పాదయాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ను కలిసి.. సహాయం చేయాల్సిందిగా రామ్మూర్తి అభ్యర్థించారు. స్పందించిన వైయ‌స్‌ జగన్ మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ రికార్డుల‌ను ప్ర‌క్షాళ‌న చేయిస్తాన‌ని, తప్పు చేసిన అధికారుల‌ను ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం తీసుకున్న భూములను వెన‌క్కి ఇప్పిస్తామ‌ని మాట ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో రామ్మూర్తి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  

నేనున్నాను

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పోటెత్తున్న జ‌నం
- దారిపొడువునా క‌ష్టాలు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
- న‌వ‌ర‌త్నాల‌పై హ‌ర్షాతిరేకాలు

చిత్తూరు:  కష్టాల్లో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు, వారికి భరోసా కల్పించేందుకు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రజలు ఆయనకు పల్లె పల్లెనా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఊరు ఊరంతా కదిలి రాజన్నబిడ్డను నిండు మనస్సుతో ఆశీర్వదిస్తోంది. జ‌న‌నేత‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. తమ కష్టాలు చెప్పుకొని సాంత్వన పొందుతున్నారు. ఇవాళ ఉద‌యం  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది.  పాదయాత్రలో ఉన్న వైయ‌స్ జగన్‌కు దారి పొడవునా ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు. అంద‌రికి అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బతికున్నప్పుడు బీసీలందరికీ ఒక భరోసా ఉండేది. ఇంటికి ఒక్కరైనా డాక్టరో, ఇంజనీరో అయితే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆయన నమ్మారు. అందుకే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రూపొందించి పేదలకు ఉన్నతవిద్యను దగ్గరచేశారు. ఆయన చూపిన బాటలోనే నేను కూడా బీసీలకు తోడుంటా. బీసీల అభ్యున్నతి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. నేను ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తాను’’ అని వైయ‌స్‌ జగన్‌ బీసీలకు మాటిచ్చారు. చట్టసభల్లో ప్రతి కులానికీ ప్రాతిని ధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని కులాలనూ గుర్తించడం, వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు టీటీడీ, శ్రీకాళహస్తి వంటి కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా బీసీ సామాజికవర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో బీసీల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని వైయ‌స్‌ జగన్ అంద‌రికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

వైయస్‌ జగన్‌ ప్రకటనతో బీసీల్లో హర్షాతిరేకాలు

–  బీసీలంతా వైయస్‌ జగన్‌కే మద్దతు 
– బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లు

చిత్తూరు: బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో బీసీల్లో హర్షాతికేరాలు వినిపిస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో గురువారం ఆయన పాల్గొని వైయస్‌ జగన్‌తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీసీలంతా కూడా వైయస్‌ జగన్‌కే మద్దతు పలుకుతున్నారని చెప్పారు.  రాష్ట్రంలో 148 బీసీ కులాలు ఉన్నాయని, వారందరికీ న్యాయం చేసేలా మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏరకంగా  జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించారో, అదే ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లును ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రపతి ఆమోదం తరువాత రాజ్యసభకు వస్తుందన్నారు. ఈ విధంగా మా పార్టీ వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా కృషి చేస్తుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు బీసీల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ బీసీలు తమకు మద్దతిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. టీడీపీ పాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని, ఒక్క వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీలకు ఏమైతే చేశారో అవన్నీ కూడా వైయస్‌ జగన్‌ చేస్తారని నమ్ముతున్నారన్నారు. అనిన వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతుగా నిలుస్తున్నారని, వారి సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు.   నవరత్నాలను ఇదివరకే ప్రకటించారని, వాటిలో మార్పులు, చేర్పులపై ప్రజల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. అందరికి తగిన న్యాయం చేసే విధంగా వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.  

ఈ ప్రభుత్వానికి కనికరం లేదు

చిత్తూరు: పేదల పట్ల, వారి ఆరోగ్యం పట్ల తెలుగు దేశం ప్రభుత్వానికి కనికరం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.  రేణిగుంట మండలం పరకాల గ్రామానికి చెందిన గౌతమి అనే నాలుగేళ్ల చిన్నారి క్యాన్సర్‌ కారణంగా కంటి చూపు కోల్పొయింది. ఆ పాపకు వైద్యం చేయించే స్థోమత లేక గురువారం ప్రజా సంకల్ప యాత్ర ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను చిన్నారి గౌతమి తల్లిదండ్రులు కలిశారు. తమ బిడ్డ క్యాన్సర్‌ కారణంగా కంటి చూపు కోల్పొయిందని, అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికే వైద్యం కోసం మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లో రూ.5 లక్షలు ఖర్చు చేశామని, ఇక వైద్యం చేయించేందుకు తమకు స్థోమత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ రకమైన వ్యాధులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసేవారని,  ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇలాగే ఆలస్యం చేస్తే మరో కంటికి కూడా చూపు పోయే ప్రమాదం ఉందని వారు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి బాధ విన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చిన్నారులకు కాంక్లీయర్‌ ఇన్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి వ్యాధులకు వైద్యం అందించడం లేదన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తామని, ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తామని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. జననేత హామీతో గౌతమి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

వెన్నుపోటు బాబు నైజం

చిత్తూరు: ఓడిపోయిన చంద్రబాబును ఎన్‌టీ రామారావు అక్కున చేర్చుకుంటే..ఆయనకే వెన్నుపోటు పొడిచారని, అది చంద్రబాబు నైజమని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అదే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తన గురువు వెంకటప్ప పేరును పులివెందులతో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైయస్‌ఆర్‌ ట్రస్ట్‌ పేరుతో వెంకటప్ప స్కూల్‌ ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారని వైయస్‌ జగన్‌ వివరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపానాయుడిపేటలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు వైయస్‌ జగన్‌ సమాధానం చెబుతూ..ఈ తేడాను వివరించారు. స్థానికులు ఏం ప్రశ్నలు అడిగారంటే..


చంద్రబాబు మమ్మల్ని భిక్షగాళ్లను చేశారు: శాంతి
బీసీల ఆశీస్సులు జగనన్నకు ఉంటాయి. చంద్రబాబు బీసీలకు అండగా ఉంటానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. పెద్ద కొడుకుగా ఉంటానని చెబితే నమ్మి ఓట్లు వేయించుకొని దగా చేశాడు. ఇప్పుడు మమ్మల్ని భిక్షగాళ్లుగా చేశాడు. వైయస్‌ఆర్‌ హయాంలో అందరికి న్యాయం చేశాడు. వైయస్‌ఆర్‌ చెప్పింది కొన్ని పథకాలు ..చేసింది ఎన్నో పథకాలు..రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే మా నాన్న బతికి ఉండేవారు. మళ్లీ ఆ రాజన్న రాజ్యం రావాలంటే మా జగనన్నకే సాధ్యం. 
––––––––––––––––––
రజకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి:  ప్రసాద్‌
కుమ్మరి కులవృత్తిని సంఘ పరంగా, సామాజిక పరంగా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. మా కులం గురించి వైయస్‌ జగన్‌ ఆలోచించాలి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మా కులం నుంచి ఎమ్మెల్సీగా ఐలయ్యను చేశారు. మా కులానికి గుర్తింపు లేదు. టీటీడీలో మా కులానికి ఒక్క డైరెక్టర్‌ పోస్టు ఇవ్వాలని కోరుతున్నాను. వెంకటేశ్వరస్వామికి నైవేద్యం ఇ చ్చే మట్టి పాత్ర కరువైంది. కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చెరువుల్లో కుమ్మర్లను అడ్డుకుంటున్నారు. పుట్టుక నుంచి చావు వరకు వెంట వచ్చేది ఒక్క మట్టి కుండ ఒక్కటే. మాకు రాజకీయ వాట దమాషా పద్ధతిలో కేటాయించాలని కోరారు.  వైయస్‌ఆర్‌ వారసుడిగా పేదల పక్షాన ఉండాలని కోరుతున్నాను.
వైయస్‌ జగన్‌: రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రతి కులానికి కూడా ప్రతినిధ్యం కల్పిస్తాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వివిధ పదవులు కల్పించి తోడుగా నిలుస్తాను.
––––––––––––––––––––
చేనేతల కోసం గొప్ప నిర్ణయం తీసుకోండి:  భక్తవత్సలం
చేనేత కార్మికులను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్రంతో పోరాడి చేనేతలకు సబ్సిడీలో ముడి సరుకు ఇచ్చారు. 50 ఏళ్లకే చేనేతలకు పింఛన్‌ఇచ్చారు. మేం ఆత్మ గౌరవంతో బతికాం. చేనేతలను ఆదుకున్న ఘనత వైయస్‌ఆర్‌దే. మూతపడిన సొసైటీలను పునరుద్ధరించారు. చేనేత కార్మికుడు ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లేదు. చేనేత కార్మికులతో ఓట్లు వేయించుకొని చంద్రబాబు మోసం చేశాడు. మీరు మా పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఆదుకోవాలి. మా కోసం గొప్ప నిర్ణయం తీసుకోండి.

వైయస్‌ జగన్‌: ఇదే జిల్లాలోనే చేనేత సదస్సు జరిగింది. మనందరి ప్రభుత్వం వచ్చాక ఎంత గొప్పగా చేనేత రంగంలో తోడుగా ఉంటానంటే తాను చనిపోయిన తరువాత నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టుకునేంత గొప్పగా చేనేతలకు మేలు చేస్తాను.
––––––––––––––––––––
సీఎంకు మూడు ప్రశ్నలు: శ్వేత
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు ప్రశ్నలు వేస్తున్నాను. నాకు సమాధానం కావాలి.  మా కులాన్ని 2008లో బీసీల్లో చేర్చారు. మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వచ్చేవి. లక్ష రూపాయలు లోన్‌ తీసుకుంటే సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు వడ్డీలు కట్టలేకపోతున్నాం. మాకు ముందు లాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నాను. నేను సీఎంను మూడు ప్రశ్నలు అడుగుతన్నాను. అభివృద్ధి నా వల్లే అని చెప్పుకుంటున్నారు. నాకు సమాధానం కావాలి. ప్రత్యేక హోదా కావాలని అందరం కోరుకున్నాం. ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి జరుగుతుందని జగనన్న అంటున్నారు. చంద్రబాబు ఎందుకు ఈ విషయాన్ని విస్మరించారు. హోదా వస్తే మా పిల్లకు ఉద్యోగాలు వస్తాయి. రాజశేఖరరెడ్డి పాలనలో మా పిల్లలను చదివించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏం చేయాలి. అన్నా ..మీరు సీఎం అయ్యాక..మా పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు చేసి ఇక్కడే ఉపాధి కల్పించాలి. రెండోవది జన్మభూమి కమిటీలు వేశారు. ఈ కమిటీల ద్వారా అభివృద్ధి చెందింది ఎవరూ? మూడోది చిత్తూరు జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీలు మూత వేశారు. మీరు సీఎం అయ్యాక వీటిని తెరిపించాలి.

వైయస్‌ జగన్‌: చంద్రబాబుకు నాన్నకు ఓ చిన్న తేడా చెబుతున్నాను. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో చంద్రబాబు చంద్రగిరి ప్రజలు 2500 ఓట్లతో గెలిపించారు. ఐదేళ్ల పాటు వైయస్‌ఆర్‌ పుణ్యమా అంటూ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 17000 ఓట్లతో ఓడిపోయారు. చంద్రబాబు ఓడిపోయినా కూడా అల్లుడు కదా అని ఎన్‌టీఆర్‌ ఆప్యాయత చూపించారు. ఆదరించిన అదే ఎన్‌టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఇది చంద్రబాబు నైజం. నాన్నగారి విషయంలో ఇదే ఊదాహరణ చెబుతున్నాను. నాన్నగారు వెంకటప్ప మాస్టర్‌ ఇంట్లో చదువుకున్నారు. ఆయన వడ్డెర కులస్తుడు. ఆ తరువాత వెంకటప్ప మాస్టర్‌ను మరిచిపోలేదు. దాదాపు 12 ఏళ్లుగా అదే మాస్టర్‌ పేరుతో పులివెందులతో వైయస్‌ఆర్‌ మొమెరియల్‌ పేరుతో వెంకటప్ప పేరుతో స్కూల్‌ నడుపుతున్నాం. యూనిఫాం దగ్గర నుంచి పిల్లలకు అన్ని ఉచితంగా ఇస్తున్నాం. బ్రహ్మండమైన మార్కులతో పిల్లలు చదువువుతున్నారు. ఈ స్కూల్‌ను ఇప్పుడు భారతీ చూస్తున్నారు. ఆ మాస్టర్‌ పేరుతో ఏకంగా స్కూల్‌ పెట్టించి వెంకటప్ప పేరు పులివెందులలో బ్రతికే ఉందని చెప్పడానికి సజీవ సాక్షం. ఓడిపోయిన చంద్రబాబును అక్కున చేర్చుకొని ఎన్‌టీఆర్‌ మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చేందుకు ఆయన చేసింది వెన్నుపోటు. ఇది ఆయన నైజం.
––––––––––––––––––––––––
ఆడవాళ్లకు స్వాతంత్య్రం ఉందా?: లక్ష్మీ 
ఆడవాళ్లకు స్వాతంత్య్రం లేదు. మా మామకు పింఛన్‌ ఇవ్వాలని ప్రతి జన్మభూమిలో అర్జీ ఇస్తున్నాం. ప్రతి సారి వయసు లేదని చెబుతున్నారు. ఓటు కార్డులో 67 ఏళ్లు ఉంది, ఇవాల్టికి పింఛన్‌ ఇవ్వడం లేదు. ఓట్లప్పుడు తప్పుడు మాటలు చెప్పడం ఎందుకు. నిజాయితీగా బతకాలి. అలా కానప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఆడవాళ్లు స్వతంత్రంగా బతికే రోజులు పోయాయి. ప్రతి భర్త తాగి వచ్చి వేధిస్తున్నారు. కుటుంబాలు ఎన్నో నాశనం అవుతున్నాయి. బెల్టు షాపులు తీసేస్తా అన్నాడు. ఇప్పుడేమో వీధిలో షాపు పెడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎందుకో? నేను చంద్రబాబుకు ఓటే వేయను. జగనన్న ముఖ్యమంత్రి కావాలి.

వైయస్‌ జగన్‌: మనందరి ప్రభుత్వం వచ్చాక మందు అన్నది లేకుండా చేస్తా? మద్యం నిషేదించిన తరువాతే మళ్లీ ఓట్లు అడుగుతానని మాట ఇస్తున్నాను.
––––––––––––––––––––––
ఇలాంటి పాలన మాకొద్దు 
ఉదయ్‌ కుమార్, ఎంఏ బీఈడీ
చంద్రబాబు తన మేనిఫెస్టోలో రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మేం అడిగామా? ఇప్పుడేమో ఏం పని చేయకపోతేనే నిరుద్యోగ భృతి అంటున్నారు. ఉన్నత చదువులు చదివి ఇంటి వద్ద ఉంటారా?  25 ఏళ్లు వచ్చినా ఓటు హక్కు లేదు. మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడికి వెళ్లు..ఇక్కడికి వెళ్లు అంటున్నారు. ఎందుకంటే మాకు ఓటు హక్కు ఉంటే టీడీపీ ఓడిపోతుందని భయం. మా ఊర్లో సిమెంట్‌ రోడ్లు వేస్తామని మూడు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటికి ఒక్క ఇటుక వేయలేదు. సంక్రాంతికి వీధిలైట్లు వేయలేదు. కడుపు మండుతోంది. ఇలాంటి పాలన మాకొద్దు .

వైయస్‌ జగన్‌: ఎన్నికలు దగ్గర వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి, పింఛన్లు, ఆరోగ్య శ్రీ గుర్తుకు వస్తుంది. ప్రజలను మళ్లీ మోసం చేయాలనే ఆలోచన చంద్రబాబుది.
––––––––––––––––––––
పూసల పరిశ్రమను పునరుద్ధరించాలి:  రోశయ్య, పాపానాయుడిపేట
మా గ్రామానికి ఎంతో మంది గొప్పొలు వచ్చారు. ఓట్ల కోసం ఏవేవో చెప్పారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వైయస్‌ఆర్‌ హయాంలో  మాగ్రామంలో 300 ఇల్లు ఇచ్చారు. మా దురదృష్టం కొద్ది వైయస్‌ఆర్‌ చనిపోయారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. మీరు సీఎం కాగానే ఆ ఇల్లు పూర్తి చేసి మా కల నెరవేర్చాలి. పూసల పరిశ్రమ ఇప్పుడు నిర్వీర్యం అయ్యింది. మూడి సరుకు తెచ్చి దాన్ని ఐదు విధాలుగా తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. మిషనరీతో తయారు కావడంతో ఉపాధి లేక మా గ్రామస్తులు వలస వెళ్తున్నారు. ఆ పూసల పరిశ్రమను పూర్తిగా పునరుద్ధరిస్తాం.
వైయస్‌ జగన్‌: పూసల పరిశ్రమ పునరుద్ధరించాలంటే ఏం చేయాలి. దానిపై విధి విధానాలు చెబితే మీకు న్యాయం చేస్తాం. 
–––––––––––––––––––––––
రాము, వేర్పేడు మండలం
పరిశ్రమల పేరుతో వేర్పేడు మండలంలో రైతుల భూములను టీడీపీ నేతలు లాక్కున్నారు. రాజధాని బూముల కంటే ఎక్కువగా లాక్కుంటున్నారు. 
వైయస్‌ జగన్‌: మన ప్రభుత్వం వచ్చాక భూ రికార్డులను పారదర్శకంగా చేస్తాం. తప్పులు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. బాధితులకు రావాల్సిన భూములను వారికి పువ్వుల్లో పెట్టి ఇస్తాం. బీసీ అధ్యాయన కమిటీలో మీరందరూ మమేకం కండి. బీసీ డిక్లరేషన్‌లో మీ అందరి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకొని మేలు చేస్తాం.

16 January 2018

అప్పలాయగుంటలో స‌మ‌స్య‌ల వెల్లువ‌

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని అప్ప‌లాయ‌గుంట‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, ఇల్లు మంజూరు కావ‌డం లేద‌ని, మంచినీటి స‌మ‌స్య‌ను తీర్చాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వారి స‌మ‌స్య‌లు విన్న జ‌న‌నేత మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు. 

సంక్షేమ పథకాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం

చిత్తూరు: సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిందని నగరి నియోజకవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో ఆయా వర్గాల ప్రజలు మంగళవారం వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకే సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వితంతు పింఛన్లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వచ్చినా తరువాత ఉన్న జాబులు పోయాయని యువత ఆందోళన వ్యక్తం చేశారు.  ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో బెంగుళూరులో ఉపాధి పొందుతున్నామని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తన ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకుంటున్నారని, వైయస్‌ జగన్‌ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.
 

అపాయింట్‌మెంట్లు ఎందుకు దొరకడం లేదు

– దుగ్గిరాజుపట్నం పోర్ట్‌ ఏమైంది?
– విశాఖ రైల్వే జోన్‌ ఏమైంది?
– రాజధాని కట్టలేక పోయారు..పోలవరం ఏమైంది?
– అమరావతికి రూ.2500 కోట్లు, విజయవాడ డ్రైనేజీకి వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చిందట.
– నాలుగేళ్లలో నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు కట్టారు
– సీఎం చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు

హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా సీఎం చంద్రబాబుకు దొరకడం లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అసలు మీకేందుకు కేంద్రం అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏడాది తరువాత ప్రధాని అపాయింట్‌మెంట్‌ ముఖ్యమంత్రికి దొరకకపోవడం, కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడకు ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నాలుగేళ్లుగా మభ్యపెడుతూ.. నాలుగేళ్లలో నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు కట్టడం తప్ప సాధించింది ఏమీ లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ దొరికిందని ఊదరగొడుతున్నారని, ఒక ముఖ్యమంత్రికి ఏడాది పాటు ఎందుకు అపాయింట్‌మెంట్‌ దొరకలేదని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తాను రాష్ట్రం కోసం 30 సార్లు ఢిల్లీ వెళ్లానని చెబుతుంటారన్నారు. నాలుగేళ్లలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ మేలు జరిగిందని నిలదీశారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాలుగు టెంపరరీ బిల్డింగులు కట్టించారని, అది కూడా నాలుగు చినుకులు పడితే కారిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని  ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం సాధించలేదన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, వైజాగ్‌ – చెన్నై కారిడార్‌ అన్నారు.  ప్రత్యేక హోదా, దుగ్గిరాజు పట్నం పోర్టు, అమరావతి నిర్మాణం, పోలవరం ఇలా ఏది కూడా సాధించలేకపోయారన్నారు. దుగ్గిరాజుపట్నం పోర్టు అన్నది 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నారన్నారు. 2018లోపే మొదటి ఫేజ్‌ కంప్లింట్‌ కావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పుడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి అయోగ్‌పై కొత్త కథ చెబుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల తరువాత సీఎం ఢిల్లీకి వెళ్లి  ప్రధానికి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. సామాన్య ప్రజలు కలెక్టర్‌ వద్దకు వెళ్లి అర్జీ ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. 

రాజధాని ఏమైంది? 
అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. జపాన్, మలేసియా, టర్కీ, లండన్, సింగపూర్‌ అంటూ ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంతవరకు ఏం మేరకు కట్టించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ టెంపరరీ భవనాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని కోసం లక్ష ఎకరాల భూమి తీసుకొని ఏం చేస్తారని నిలదీశారు. త్వరలోనే చంద్రబాబు మోసాలన్నీ కూడా బయటపడుతాయన్నారు. ఐదు వేల ఎకరాలు రాజధానికి సరిపోతాయని మేమంటే..వీరికి రాజధాని నిర్మించడం ఇష్టం లేదని చంద్రబాబు నిందలు వేశారన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రాజధానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి బిల్డింగ్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. 

పోలవరంపై కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కట్టు కథలు అల్లుతుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కనీసం పోలవరం నిర్మిస్తే అర్ధరాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలు, విధి విధానాలు అంటూ కాలయాపన చేస్తుందని  విమర్శించారు. పోలవరం అన్నది రెండు, మూడు రాష్ట్రాలకు సంబంధించిందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కేంద్రం కడితే ఉపయోగకరంగా ఉండేదన్నారు. అలాంటి ప్రాజెక్టును మేం కడుతామని చంద్రబాబు తీసుకొని మళ్లీ ఈ రోజు పోలవరాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును తీసుకొని ఇంతవరకు ఏం చేశారన్నారు. తెలుగు జాతికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన సొంతూరుకు వెళ్లడం, తీరా ఆయన్ను కలిసేందుకు వీలు పడక విమానంలో తిరిగి రావడం ఏంటన్నారు. ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలి కానీ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి  వెళ్లడం, తీరా కలువకుండా వెనక్కి రావడం ఏంటని ప్రశ్నించారు. అసలు మీకు కేంద్రం నుంచి అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని ప్రశ్నించారు.

కేంద్రం నిధులకే లెక్కలు లేవు
కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు, విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చిందని చెబుతుంటే ఈ నిధులకు లెక్కలు లేవని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. దుగ్గిరాజు పట్నం పోర్టును ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టు ప్రకారం 24 వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉండేదని, రూ.14 వేల కోట్లతో రూ.7 వేల కోట్లు మాత్రమే లోటు బడ్జెట్‌ ఉందని కేంద్రం చెబుతుందన్నారు. అయితే మళ్లీ చంద్రబాబు రూ.16 వేల కోట్లు లోటు ఉందని లేఖలు రాస్తున్నారన్నారు. ఇన్ని సార్లు మీరు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏంటని, కేంద్రంలో ఉన్న మీ మంత్రులు ఏం చేస్తున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.

ప్రత్యేక హోదాతో మెడికల్‌ విద్యార్థులకు ప్రయోజనం

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే మెడికల్‌ విద్యార్థులకు మేలు జరుగుతుందని చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్న కుషాల్‌ అన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో విద్యార్థులు మేము సైతం అంటున్నారు. చైనాలో మెడికల్‌ చదువుతున్న కుషాల్‌ అనే విద్యార్థి  మంగళవారం వైయస్‌ జగన్‌ను కలిశారు. జింజో మెడికల్‌ యూనివర్సిటీలో తాను ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని చైనాలో పలుమార్లు ఆందోళన చేపట్టామన్నారు. ఈ పోరాటానికి ఆ దేశంలోని విద్యార్థులు కూడా మద్దతు తెలిపారన్నారు. వైయస్‌ జగన్‌ లాంటి నాయకుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం సంతోషంగా ఉందన్నారు. తామంతా వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

చెక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తా

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో చెరకు రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. చెరకు  ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పొయామని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఈ మూతపడిన ఫ్యాక్టరీలను వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు.  రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

నవరత్నాలతో ప్రజల్లో హర్షాతిరేకాలు

చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. జననేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు విశేషస్పందన లభిస్తుందన్నారు. చిత్తూరులో సాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని విమర్శించారు. బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారన్నారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారన్నారు. ఇక్కడికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా నవ రత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తప్పరనిప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. పిల్లలను చదవించే బాధ్యత వైయస్‌ జగన్‌ తీసుకుంటున్నారన్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

– హైకోర్టు వద్దన్నా..కోళ్లకు కత్తులు కట్టి పందేలు
– వందల ఎకరాల్లో కోడి పందేల కోసం బరులు తయారు చేశారు
– బరులు కట్టి, ఫ్లెక్సీలు పెట్టి మరీ కోడి పందెలు నిర్వహిస్తున్నారు.
– పందేలను నిర్వహిస్తోంది సాక్షాత్తు టీడీపీ నేతలే
– కోళ్లకు కత్తులు కట్టకుండా ఆడండని సీఎం చెప్పారు
– ప్రతిపక్ష నేతలను అడ్డుకునే పోలీసులు ఇప్పుడేం చేస్తున్నారు 

విజయవాడ: రాష్ట్రంలో జూదం, కోడి పందేలు యధేచ్ఛగా జరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో కోళ్లకు కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా టీడీపీ నేతలే దగ్గరుండి వందల ఎకరాల్లో కోడి పందేల కోసం బరులు తయారు చేశారని ఆయన మండిపడ్డారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఎద్దుల పందాలతో ప్రజలు రిలాక్స్‌ అవుతారన్నారు. గంగిరెద్దులు, హరిదాసులతో చాలా కోలాహలంగా జరిగే పండుగ అన్నారు. మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని సంతోషంగా గడిపారన్నారు. అయితే ఒక బాధకరమైన పోటీ కూడా జరుగుతుందన్నారు. న్యాయస్థానం కోడి పందేలు కత్తులు కట్టి జరుపకూడదని సూచించింది. ^è క్కగా, సాంప్రదాయబద్ధంగా కోడి పందెలే నిర్వహించమని చెప్పందన్నారు. హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని, ఈ సారైనా పాటించాలని ఆదేశించిందన్నారు. ముఖ్యమంత్రి కూడా మీ సాంప్రదాయాన్ని నేరవేర్చుకోండి, కత్తులు కట్టుకోవద్దని సూచించారు. కానీ కోళ్లకు కత్తులు కట్టి వందల ఎకరాల్లో పిచ్చులు తయారు చేసి, ఫ్లడ్‌లైట్స్‌ ఏర్పాటు చేసి పందెలు నిర్వహిస్తున్నారన్నారు. వీటన్నింటిని టీడీపీ నేతలే నిర్వహించడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక చోట కోడి పందెలు నిర్వహిస్తే..అక్కడ మందు అమ్ముకునేందుకు, తిండి పదార్థాలు అమ్ముకునేందుకు టీడీపీ నేతలకు కోటి రుపాయాలు ఇచ్చారన్నారు. పోలీసు వ్యవస్థ ఈ మూడు రోజుల పాటు ఎందుకు నిర్వీర్యమైందన్నారు. పేకాటాలు, జూదం ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీవీల ముందు కత్తులు లేనట్లు నటన చేస్తూ, వారు వెళ్లిపోగానే కత్తులతో పోటీలు నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వైయస్‌ జగన్‌ విశాఖలోని క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తే పోలీసులు వందలాది మంది వచ్చి అడ్డుకుంటారు, అలాగే ముద్రగడ పాదయాత్ర చేస్తామంటా పోలీసులు మొహరిస్తున్నారు. మేం జన్మభూమిలో పాల్గొంటామంటే అడ్డుకున్నారు. అదే టీడీపీ నేతలు కోడిపందెలు నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. సంప్రదాయం ముగుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని, టీడీపీ నేతలే నిర్వాహకులు కావడం దుర్మార్గమన్నారు. ప్రజా ప్రతినిధులే ఇలాంటి అసాంఘిక శక్తులగా మారడం బాధాకరమన్నారు. క్రికెట్‌ పోటీల మాదిరిగా ఫ్లడ్‌ లైట్స్‌ వెలుగులో బరులు ఏర్పాటు చేసి కోడి పందెలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. క్రికెట్‌బెట్టింగ్‌లు కట్టే వారిని పట్టుకుంటున్న పోలీసులు కోడి పందెలు ఆడే వారిని ఎందుకు పట్టుకోవడం లేదన్నారు. సంప్రదాయంగా వస్తున్న ఆటను జూదంగా మార్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బులు సంపాదించడం దురదృష్టకరమన్నారు.  సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ జూద గృహాలు నిర్వహిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. బెల్టు షాపులు రద్దు అని చంద్రబాబు అన్నారు. కానీ బడిలు వద్ద బహిరంగంగా మద్యం అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని, న్యాయస్థానం అంటే వీరికి లెక్కలేదన్నారు. కోడి పందేలు వేసి రక్తసిక్తం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చంద్రబాబు సమాధానం చెప్పాలని  అంబటి రాంబాబు డిమాండు చేశారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకపోవడం దుర్మార్గమని, ప్రజల బలహీనలపై సొమ్ము చేసుకోవడాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని అంబటి రాంబాబు అన్నారు. కోడి పందేలు నిర్వహించిన వారిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. 

8 January 2018

బాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?


– చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం
– జన్మభూమి కమిటీ పేరుతో మాఫియా
–మరుగుదొడ్లకు కూడా లంచాలు అడుగుతున్నారు.
– పింఛన్లలో అసమానతలు కనిపిస్తున్నాయి.
–చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి.
– తిరుపతి, కాణిపాకం దేవస్థానాలకు పాలక మండలి కరువు
– ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
– ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలి.
– మీ పిల్లలను నేను చదివిస్తాను.
 – పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తా
– ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తా

చిత్తూరు: నాలుగేళ్ల పాలనలో ఏమీ చేయకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనిఆయన ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 56వ రోజు పూతలపట్టు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  

బాబు ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ..
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సహకార రంగ చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందుకు ఈ నియోజకవర్గానికి పక్కనే చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ కనిపిస్తోంది. ఇక్కడికి రాకముందు ఒక టెంట్‌ వేసి ఆందోళన చేపట్టి..నన్ను పిలిచారు. ఆ చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని చూçస్తే బాధనిపించింది. మన జిల్లాలో 6 ఫ్యాక్టరీలు ఉంటే రెండు మాత్రమే ప్రభుత్వానికి, మిగతావి ప్రవేట్‌ సంస్థలు. అదేంటో కాని చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా సహకార రంగంలోని రెండు చక్కెర పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఆశ్చర్యమనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సహకార రంగంలోని పరిశ్రమలు నడిచేలా చూడాలి. రైతులకు తోడుగా ఉండాలి. రైతులకు కొనుగోలు చేసే సమయంలో గిట్టుబాటు ధర కల్పించాలి. ఇదే జి ల్లాలో పుట్టిన చంద్రబాబు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని చూస్తే బాధనిపిస్తుంది. చంద్రబాబు ఉన్నప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. అదే వైయస్‌ఆర్‌ వచ్చాక ఆ ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించారు. మహానేత చలువ వల్ల ఆ ఫ్యాక్టరీలు మళ్లీ పదేళ్లు నడిచాయి. మళ్లీ మన ఖర్మకొద్ది చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ వెంటనే రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇవాళ పంట పండించడానికి ఖర్చులు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు సహకార రంగంలోని రెండు ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. ప్రైవేట్‌ రంగానికి చెందిన ఫ్యాక్టరీలు వాళ్లకు గిట్టుబాటు అయ్యే రేటుకు చెరుకును కొనుగోలు చేస్తున్నారు. ఇదే రైతన్నలు ఇష్టం లేకపోయినా చెరుకును అమ్ముకోవాలంట. రైతులు బెల్లం చేసుకొని బయట అమ్ముకోవటం చంద్రబాబుకు ఇష్టమట. చెక్‌ పోస్టులు పొట్టి నల్లబెల్లాన్ని అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. భూమిని బట్టి నల్ల బెల్లం దొరుకుతుంది. రైతులను నష్టపరిచేందుకు, ప్రైవేట్‌ ఫ్యాక్టరీలకు మేలు చేసేలా జీవోలు జారీ చేస్తున్నారు.

పథకం ప్రకారం డైరీలు మూత వేయించాడు
చంద్రబాబు ఒక పథకం ప్రకారం జిల్లాలోని డైరీలను మూత వేయించాడని వైయస్‌ జగన్‌ అన్నారు. ఇదే చంద్రబాబు రైతులకు తోడుగా ఉండాల్సింది పోయి..మన ఖర్మకొద్ది ఇదే చంద్రబాబు హెరిటేజ్‌ ఫ్యాక్టరీని పెట్టారు. ఆయన డైరీ కోసం చిత్తూరు డైరీని నాశనం చేశారు. చిత్తూరు డైరీలో తనకు నచ్చిన వారితో పాలన మండలి ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారం మూత వేయించాడు. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా నష్టాల బాట అంటూ మూసి వేయించారు. సహకార రంగ పాల వ్యాపారంలో రైతులకు గిట్టుబాటు ధర ఉంటుంది. ఈ మనిషిని చూసినప్పుడు ముఖ్యమంత్రిగా అర్హుడా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

మహానేత పాలనను గుర్తుకు తెచ్చుకోండి
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని వైయస్‌ జగన్‌ అన్నారు. మహానేత బతికి ఉన్నప్పుడు హంద్రీనీవాకు దాదాపు 80 శాతం పనులు పూర్తి చేయించారు. మిగిలింది ఆ కాల్వను తీసుకొచ్చి చిత్తూరులో కలపడమే. చంద్రబాబు నోట్లో నుంచి పచ్చి అబద్ధాలు తప్ప వేరేవి రావడం లేదు. చంద్రబాబు సీఎం కాకముందే రూ.6 వేల కోట్లు ఖర్చు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క కాల్వ కూడా తవ్వలేకపోతున్నారు. వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే. ఇదే ముఖ్యమంత్రి నెలకొసారి ప్రైవేట్‌ విమానం ఎక్కి సింగపూర్, జపాన్, రష్యా, స్విజ్జర్‌ల్యాండ్‌ అంటూ విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్తారు. సింగపూర్‌కు వెళ్తే ఈ రాష్ట్రాన్ని సింగపూర్‌ అంటారు. ఇలా ఏదేశం వెళ్తే ఆ దేశంలాగా మన రాష్ట్రాన్ని చేస్తామని మోసం చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 400 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కొదాంట్లో 30 మంది ఉపాధి పొందుతున్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో వేలకొద్ది ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు సీఎం కాగానే గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు విఫరితంగా కరెంటు బిల్లులు, రాయితీలు పెంచారు. ఇలా దగ్గరుండి రేట్లు పెంచితే ఎలా నడుస్తాయి. 

పాలక మండలి ఏదీ?
ఇదే చంద్రబాబుకు పరిపాలనపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అనడానికి ఒక్క ఉదాహరణ. జిల్లాలో తిరుపతికి పాలక మండలి లేదు. ఇప్పటికి 8 నెలలుగా పాలక మండలికి బోర్డు లేదు. కాణిపాకం గుడిలో అయితే పాలక మండలి అన్నది గత మూడేళ్లుగా లేదు.

డాక్టర్లేరి?
పూతలపట్టు వెళ్లే రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి ఏటా వంద మంది ఈ రహదారుల్లో చనిపోతున్నారు. మన వద్ద రెండు కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ డాక్టర్లు ఉండటం లేదు. ప్రమాదం జరిగితే తిరుపతి, చిత్తూరుకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఇదే నియోజకవర్గంలో పింఛన్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. జన్మభూమి కమిటీ పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. పింఛన్లు, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాలి. పింఛన్లకు 60 ఏళ్ల వయస్సు సరిపోదట..కాళ్లు, చేతులు లేకపోతే సరిపోదట..జన్మభూమి కమిటీలు సిపార్సులు చేయాలట. పై నుంచి కింద దాక అవినీతే. చంద్రబాబు పైన మేస్తున్నారు. మద్యం, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, చివరికి గుడి భూములు వదలకుండా చంద్రబాబు మేస్తున్నారు. కిందమాత్రం జన్మభూమి కమిటీలకు వదిలిపెట్టారు. 

 ఒక్కసారి ఆలోచించండి..
నాలుగేళ్ల పాలన మనమంతా చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇదే చంద్రబాబు తనకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలట. ఒక్క ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు అంటున్నారంటే ఆయన కళ్లు ఎక్కడున్నాయో ఆలోచించండి. అయ్యా చంద్రబాబు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని నీవు అంటున్నావు. ఈ నాలుగేళ్లలో నీవు మోసం, అవినీతి, అబద్ధాలు చెబుతున్నారు. ఇంతకు చంద్రబాబుకు సిగ్గు ఉందా?. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లులు షాక్‌ కొడతాయని అన్నారు. వస్తూనే కరెంటు బిల్లులు తగ్గిస్తా అని చంద్రబాబు అన్నారు. గతంలో కరెంటు బిల్లులు రూ.50, 70, 100 లోపు వచ్చేవి. ఇవాళ అదే బిల్లు రూ.500, 700, 1000 చొప్పున వస్తున్నాయి. కర్నాటక బార్డర్‌లో పెట్రోల్‌ పోయించుకుంటే లీటర్‌కు రూ.5 తక్కువగా ఉంది. రేషన్‌ షాపుల్లో ఇప్పుడు బియ్యం తప్ప మరేది ఇవ్వడం లేదు. మరోవైపు చంద్రన్న మాల్స్‌ పేరుతో దోపిడీకి తెర లేపారు. చంద్రన్న మాల్స్‌లో చక్కెర కేజీ 48, చింతపండు కేజీ రూ.290, పామాయిల్‌ రూ.70, గోదుమలు రూ.35 ఉంది. హోల్‌షెల్‌ ధర కన్న 40 శాతం తక్కువకు అమ్ముతున్నామని చంద్రబాబు మంత్రులు అంటున్నారు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాగానే ఉన్న జాబులు ఊడగొడుతున్నారు.
– చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క ఇల్లైనా కట్టించాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలు అన్ని బేషరత్తుగా మాఫీ చేస్తామన్నారు. నాలుగేళ్ల తరువాత బంగారం ఇంటికి వచ్చిందా?. నోటీసులు మాత్రమే ఇంటికి వస్తున్నాయి. రుణమాఫీ రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. 

ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు..
ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు రావాలి. ఇదే చంద్రబాబును మనం క్షమిస్తే..రేపు చంద్రబాబు మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్దాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ అంటారు. అంతేకాదు ప్రతి ఇంటికి బెంజీ కారు కొనిస్తానంటారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి, హామీ నెరవేర్చకపోతే ఇంటికి పోవాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇందుకోసం వైయస్‌ జగన్‌కు మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయబోతున్నామని నవరత్నాల ద్వారా మనం చెప్పాం. ఇందు కోసం సూచనలు, సలహాలు ఇవ్వమని మిమ్మల్నే కోరుతున్నాను.

నేను రెండు అడుగులు ముందుకు వేస్తా..
ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఒక్కసారి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. చంద్రబాబు దృష్టిలో నాలుగు కత్తెర్లు ఇస్తే అదే బీసీల మీద ప్రేమ. పేదవాడి మీద ప్రేమంటే ఎలా ఉంటుందంటే నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకోండి. పేదరికం పోవాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజినీర్, డాక్టర్‌ కావాలి. సువర్ణయుగంతో నాన్నగారు పేదలను పెద్ద పెద్ద చదువులు చదివించి తోడుగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలు ఇంజినీరింగ్‌ చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ముష్టి వేసినట్లు రూ.30 నుంచి రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇవి కూడా ఏడాది నుంచి రావడం లేదని పిల్లలు చెబుతున్నారు. మిగిలిన డబ్బు ఆ పేదవాడు కట్టాలంటే సాధ్యమా? నాన్నగారు పేదవాడికి కోసం ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నానున. మీ పిల్లలను నేను చదిస్తాను. అంతేకాదు విద్యార్థులకు అయ్యే హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ ఖర్చులు నేనే ఇస్తాను. ప్రతి ఏటా విద్యార్థికి రూ.20 వేలు ఇస్తాను. అంతేకాదు చిట్టి పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు వేస్తాను. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయితే తల రాతలు మారుతాయి.

పింఛన్‌ రూ.2 వేలు ఇస్తాం
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు రూ. 2 వేలకు పెంచుతున్నాను. పెన్షన్‌ వయస్సు 60 సంవత్సరాల నుంచి 45 ఏళ్లకు తగ్గిస్తాం. వయస్సు పెరిగేకొద్దీ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి వాటి కోసం వేరే వ్యక్తులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కాంట్రాక్టులకు మాత్రమే అంచనాల పేరుతో నిధులు కేటాయిస్తున్నారు. అవ్వతాతలకు మాత్రం పింఛన్లు పెంచడం లేదు. ఇవాళ పనులకు వెళ్తే గాని కడుపు నిండని పరిస్థితి నెలకొంది. అందుకే చెబుతున్నాను. పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నాను. 

ఆడపడుచుల పేరుతో  ఇల్లు రిజిస్ట్రర్‌ చేస్తాం..
నాన్నగారి పాలనలో దేశం మొత్తం 47 లక్షలు ఇల్లు కడితే, ఒక్క ఏపీలోనే 48 లక్షల ఇల్లు కట్టారు. ఇవాళ ప్రతి పేదవాడికి చెబుతున్నాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఇల్లు కట్టించడమే కాదు ఆ ఇంటికి ఆడపడుచు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేయించి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడితే ..వారికి డబ్బు అవసరమైతే బ్యాంకుల్లో రుణం పొందేలా చూస్తాను. పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని మాట ఇస్తున్నాను. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఎంత అప్పులు ఉన్నాయో ఆ మొత్తం కూడా నాలుగు దఫాలుగా ఆ డబ్బులు ఆ అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడతానని హామీ ఇస్తున్నాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే నాకు చెప్పవచ్చు. ఎవరైనా నన్ను కలువవచ్చు. ఈ రాజకీయ వ్యవస్థను బాగుచేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని మీ అందరికి కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశమిద్దాం

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇద్దామని ఎమ్మెల్యే సునిల్‌ పిలుపునిచ్చారు. పూతలపట్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు హంద్రీనీవా నీరు తీసుకురాకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్‌గా ఉన్న తనను ఎమ్మెల్యేగా చేశారని చెప్పారు. ప్రజల కోసం అనునిత్యం వైయస్‌ జగన్‌ శ్రమిస్తున్నారని, సంక్షేమమే తన ఊపిరిగా పని చేస్తున్నారని, ఆయనకు ఉన్న నిబద్ధత మరెవరికి లేదని, దళితుల ఆత్మబంధువు అని కొనియాడారు. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారన్నారు. మనమంతా కలిసి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధిస్తారని చెప్పారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు.

బాబూ అది నోరా.. తాటిమట్టా


  • ఇంకా ఎంతకాలం అబద్ధాలతో మభ్యపెడతారు
  • ఇరిగేషన్‌పై రూ. 50 వేల కోట్ల ఖర్చు పచ్చి అబద్ధం
  • ఖర్చు చేసింది మొత్తం రూ. 27,898 మాత్రమే
  • చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది
  • ప్రపంచస్థాయి రాజధాని ఎక్కడ నిర్మించారో చెప్పాలి
  • వాస్తవం మాట్లాడినందుకు అంబటిని హౌస్‌ అరెస్ట్‌ చేస్తారా?
  • గ్రామాలకు వెళ్లి మీరే అడగండి ఎవరి పెన్షన్‌ వస్తున్నాయో చెబుతారు
  • పాలనపై నమ్మకం లేక క్షుద్రపూజలకు దిగన చంద్రబాబు
  • ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్‌: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశానని చెప్పడానికి అది నాలుకా.. తాటిమట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై నాలుగేళ్లలో వాస్తవంగా ఖర్చు చేసింది జీఓ 22ను ప్రకారం రూ. 27,898 మాత్రమేనని, దాంట్లో రూ. 16,186 కోట్లు మాత్రమే ప్రాజెక్టుపైన ఖర్చు చేశారన్నారు. మిగిలినవి అంచెనాలు పెంచుకొని కాజేశారని ఆరోపించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై చంద్రబాబు అని అబద్ధాలు మాట్లాడుతున్నారని, కర్నూలు సభలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశానని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు నాలుగు సంవత్సరాల్లో రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశారంటే చంద్రబాబు వ్యవసాయం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టే అర్థం అవుతుందన్నారు.
 
చంద్రబాబుకు ముని శాపం ఉందని, ఆయన నిజం చెబితే తల వెయ్యిముక్కలు అవుతుందని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పడూ అనేవారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాల్లో రూ. 1.20 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో లక్ష పక్కనబెట్టినా.. రూ. 20 వేలు కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేయలేకపోయారన్నారు. కొత్త సంవత్సరం కదా మనిషి మారి వాస్తవాలకు కొంత దగ్గరకు వస్తాడనుకున్నా.. కానీ ఆయన తీరు మార్చుకోలేదన్నారు. రైతు రుణమాఫీ రూ. 24 వేల కోట్లు చేశానని చెబుతున్నారు కానీ వాస్తవంగా రూ. 12 వేలు కూడా చేయలేదన్నారు. అదే విధంగా డ్వాక్రా రుణమాఫీ చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడని వాస్తవానికి రూ. 6 వేల కోట్లు కూడా చేయలేదన్నారు. ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతూ ఇంకా ఎంతకాలం పరిపాలన సాగిస్తారని బొత్స ప్రశ్నించారు. 

ప్రపంచస్థాయి రాజధాని కడతానని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పటి వరకు అమరావతి శాశ్వత రాజధానికి ఒక ఇటుక కూడా వేయలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని ప్రశ్నించారన్నారు. దానికి కేంద్రం రాజ్‌భవన్, అసెంబ్లీకి కలిపి 2014–15లో రూ. 500 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 500 కోట్లు 2015–16లో 350 కోట్లు, అర్బన్‌ డౌలప్‌మెంట్‌కు 2014–15లో రూ.250 కోట్లు, 2015–16లో రూ. 450 కోట్లు, మొత్తం రూ. 1500 కోట్లు ఇచ్చామని చెప్పారన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1583 కోట్లు ఖర్చు చేశామని నివేదిక ఇచ్చిందన్నారు. 

హైదరాబాద్‌ స్థాయి కాకుండా ప్రపంచస్థాయి రాజధాని అన్నారు. ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధానిలా అమరావతి రూపుదిద్దుతానన్నారు. రూ. 1583 కోట్లు అదనంగా ఖర్చు చేశామని చెప్పారు కానీ అసలు రాజధాని ఎక్కడ నిర్మించారో తెలియడం లేదన్నారు. నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే.. అయినప్పుడు ఇన్నీ వందల కోట్లు ఎందుకు ఖర్చు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎందుకిలా ప్రజలను మభ్యపెడుతున్నారు చంద్రబాబూ అని బొత్స నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలు, అవినీతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రంగు మొత్తం బయటపడిందని, ఇక ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబును అక్రమంగా హౌస్‌ అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో నిజమైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందడం లేదని అంబటి రాంబాబు వాస్తవం చెబితే.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అందరికీ అందుతున్నాయని, బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారన్నారు. దీంతో ప్రజలకు పెన్షన్‌లు అందుతున్నాయో లేదో.. తెలుసుకునేందుకు వెళ్తున్న అంబటిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోలీసు బందోబస్తుతో గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేయాలన్నారు. అది వాస్తవం కాదు కాబట్టే అంబటిని అరెస్టు చేశారన్నారు. ఎందుకు ఇలా అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తారని టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 

పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లి చెప్పుకున్నట్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంమీద కేంద్రం, కేంద్రం మీద రాష్ట్రం చెప్పుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారని, ఏ ప్రతిపక్షంగా పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుందో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తోటపల్లి ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ హయాంలో రూ. 600ల కోట్లు ఖర్చు చేసి 85 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులకు రూ. 200ల కోట్లు ఖర్చు చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అట్టహాసంగా రాయలసీమకు నీరు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కానీ జీవో 22ను తీసుకొచ్చి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు తన పరిపాలనపై నమ్మకం లేక క్షుద్రపూజలు, కోటల్లో తవ్వకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎలాంటిదంటే ఆయన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌కు నేటికీ సున్నం కూడా వేయించలేని దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు కట్టిపెట్టి, వాస్తవాలకు దగ్గరగా వచ్చి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.