3 January 2018

బాబుకు ఎందుకు ఓట్లేయాలి?


– మోసం చేయడానికి కూడా హద్దుండాలి
– 85 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన ఘతన వైయస్‌ఆర్‌దే
– పులివెందులలో చంద్రబాబు ఫోజులు కొడుతున్నారు
– ప్రాజెక్టులు కట్టినోడు గొప్పోడా..? గేట్లు ఎత్తిన లష్కర్‌ గొప్పోడా..?
– చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశాడు
– మూడుసార్లు కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెంచారు
– రాజన్న రాజ్యంలో ప్రతి ఇంటా సిరులు దొర్లాలి 
– ప్రతి రైతు కుటుంబం చిరునవ్వుతో ఉండాలి
 – యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

చిత్తూరు: నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరికి మేలు చేయని నీకు ఓట్లేందుకు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలన్న వ్యాఖ్యలను వైయస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హమీ నెరవేర్చలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తే చంద్రబాబు అక్కడికి వెళ్లి ఫోజు కొడుతున్నారని తప్పుపట్టారు. మహానేత పాలనలో దాదాపు 85 శాతం పనులు పూర్తి చేస్తే..మిగతా పనులు పూర్తి చేయలేని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రాజెక్టులు కట్టిన వారు గొప్పా? గేట్లు ఎత్తిన వారు గొప్పా అని ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా కిలికిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబును పోల్చుతూ చెప్పిన పులి కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది.   

వైయస్‌ జగన్‌ చెప్పిన పులి కథ 
అనగనగా ఓ అడవిలో  ఒక పెద్ద పులి ఉండేది. అది అడవిలో ఉన్నప్పుడు మోసాలు చేసేది. జంతువులను విపరీతంగా తినేది. ఎవరిని లెక్కపెట్టకుండా తన స్వార్థం కోసం ఎవరినైనా తినేది. ఆ పులి చేస్తున్న అన్యాయాలను, హత్యలను తట్టుకోలేక అక్కడున్న మిగతా జంతువులను ఆ పులిని అడవిలో నుంచి తరిమేశారు. ఇంచుమించు  చంద్రబాబు కూడా 9 ఏళ్లు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తే ఆయన్ను తరిమేశారో అలాగే ఆ పులిని తరిమేశారు. కొన్నేళ్ల తరువాత ఆ పులి అడవిలోకి వచ్చింది. ఇప్పుడు జంతువులు తాను చెప్పే మాటలు నమ్మరని భావించి తనకు వృద్ధాప్యం కాబట్టి వేటాడే శక్తి లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ పులి ఒక మనిషిని చంపేసి ఆ వ్యక్తి వద్ద ఉన్న బంగారం కడియం తీసుకొంది. ఆ తరువాత నక్క జిత్తుల ఉపాయం పన్నింది. ఆ అడవి నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే ఓ చెరువు దాటాలి. ఆ చెరువు గట్టుపై కూర్చోన్న ఆ పులి అయ్యా.. నేను మారిపోయాను, నన్ను ఆదరించండి.. నా వద్ద బంగారం కడియం ఉంది. దీన్ని నేను ఏం చేస్తాను. మీరే తీసుకోండి అని నమ్మబలికింది.  మొదట మనుషులు నమ్మలేదు. ఆ తరువాత మారింది కదా అని నమ్మి దగ్గరకు వెళ్తే ఆ పులి తన మాయదారి బుద్ధిపొనిచ్చుకోలేదు. దగ్గరకు వచ్చిన మనుషులను మింగేసింది. ఇంచుమించు చంద్రబాబుది ఇదే తీరు. ప్రజలు కూడా చంద్రబాబుకు అనుభవం ఉంది కదా అని ఓట్లు వేస్తే..తీరా అధికారంలోకి వచ్చాక∙తన స్వార్థం కోసం ఎవర్ని వదిలిపెట్టలేదు. రైతులను, అక్కచెల్లెమ్మలను, చివరకు పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఒక్కొ కులానికి ఒక్కో మేనిఫెస్టో తెచ్చారు. అందర్ని మోసం చేశాడు.

బాబుకు కళ్లు నెత్తికొచ్చాయి:
ఇవాళ రాష్ట్రం వైపు ఒక్కసారి చూడండి. ఇదే పెద్ద మనిషి ఏమంటున్నారో తెలుసా. ఆయనకు ఓటేయకపోతే ప్రజలు సిగ్గుపడాలంటా? ఆయన్ను చూసి ప్రజలు కేరింతలు కొడుతున్నారట. నిజంగా ఆయన కళ్లు నెత్తికెక్కాయి. అయ్యా చంద్రబాబు ..నీకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలా? నీవు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే నీవు సిగ్గుపడాలా? అయ్యా చంద్రబాబు ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నాను. నీ పాలనలో ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు, కరెంటు చార్జీలు పెంచావు. ఇంటి పన్ను కూడా వదిలిపెట్టలేదు. పెట్రోలు ధరలు విపరీతంగా పెంచావు. ఇదే రేషన్‌ షాపుల్లో గతంలో 9 రకాల సరుకులు దొరికేవి. ఇవాళ ఒక్క బియ్యం తప్ప ఏమీ దొరకడం లేదు. అధికారంలోకి రాకముందు ఒకమాదిరి, అధికారంలోకి వచ్చాక మరో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇదే పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తానన్నారు. నాలుగేళ్ల పాలనలో కరెంటు బిల్లు రూ.500, 1000 చొప్పున వస్తోంది. 

సీఎం పదవి కోసం..
ముఖ్యమంత్రి అయ్యేందుకు చంద్రబాబు ఎన్నో హమీలు ఇచ్చాడు.  ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా?.  బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రైతుల రుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మీ బంగారం ఇంటికి వచ్చిందా?. ఈ పెద్ద మనిషి పుణ్యమా అని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. రైతులకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?  జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇవాల్టికి ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు. ఉద్యోగాలు తీసుకురాలేకపోయారు. ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా వల్ల సాధ్యం. హోదా ఉంటే పారిశ్రామిక వేత్తలు వస్తారు. అటువంటి ప్రత్యేక హోదా గురించి ఎన్నికల ముందు చంద్రబాబు 15 ఏళ్లు తీసుకొని వస్తానన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ప్రత్యేక హోదా తీసుకువచ్చాడా అని అడుగుతున్నాను. తన స్వార్థం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారు.

మీకు ఎలాంటి నాయకుడు కావాలి? 
 మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చెబుతున్న నేపథ్యంలో రేపు మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పే వారు నాయకులు కావాల అని అడుగుతున్నాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోని విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు రావాలి. ఏ నాయకుడైనా చెప్పిన హామీ నెరవేర్చకపోతే ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఈ వ్యవస్థ మారాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల సాధ్యం కాదని, నాకు మీ అందరి ఆశీస్సులు, మీ అందరి తోడు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలకు అర్థం వస్తుంది.

పులివెందులకు నీరు తెచ్చింది నీవ్వా? 
పులివెందులకు నీళ్లు తెచ్చానని చంద్రబాబు ఫోజు కొడుతున్నారు. ఆయన గట్ల మీద పండుకున్నారట. పైడిపాలెం ప్రాజెక్టు విలువ రూ.700 కోట్లు..చంద్రబాబు దానికి పెట్టింది కేవలం రూ.23 కోట్లు మాత్రమే. మిగతాదంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పెట్టారు. నాలుగేళ్లలో రూ.23 కోట్లు ఖర్చు చేసి ఆ క్రెడిట్‌ అంతా తాను తీసుకుంటున్నారు. చిత్రావతి ప్రాజెక్టుకు వైయస్‌ఆర్‌ రూ.290 కోట్లు ఖర్చు చేసి యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టారు. గండికోట నుంచి నీళ్లు ఇచ్చేందుకు దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేశారు. ఇదే చంద్రబాబు రూ.72 కోట్లు ఖర్చు చేసి ఇవాళ పులివెందులలో ఫోజు కొడుతున్నారు. ఒక మనిషి మోసం చేయడానికి హద్దుపొద్దు ఉండాలి. ప్రాజెక్టులు కట్టిన వాడు గొప్పొడా? గేట్లు ఎత్తిన లష్కర్‌ గొప్పోడా?
– పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 70 శాతం పూర్తి చేశారు. హంద్రీనీవా నీళ్లు తెచ్చి అనంతపురం, చిత్తూరు జి ల్లాలను సస్యశ్యామలం చేయాలని భావించారు. అనంతపురం వరకు కాల్వ తవ్వించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అదిగో నీళ్లు అంటూ మభ్యపెడుతున్నారు. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు ఉందా ? చంద్రబాబుకు ప్రాజెక్టులు, రైతులపై ఎటువంటి ప్రేమ లేదు.
– సహకార రంగంలోని చిత్తూరు డైరీ వల్ల రైతుకు మేలు జరుగుతుంది. ఇలాంటి సంస్థలను ఏ ముఖ్యమంత్రి అయినా కాపాడాలి. ఈ డైరీని ఒక పద్ధతి ప్రకారం మూయించేశారు. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు నాడు చిత్తూరు డైరీకి పాలకమండలి సభ్యుడిగా ఉండేవారు. ఈయన పాలక మండలిలోకి చేరకముందు రైతులకు సకాలంలో డబ్బులు అందేవి. దొరబాబు వచ్చాక నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు ఇచ్చి దాన్ని నష్టాల్లోకి నెట్టారు. ప్లాన్‌ ప్రకారం దాన్ని మూయించారు.
 పాడి ఉన్న ఇంటా నిధులు దొర్లునట..ఇది సామెత. ఇదే చంద్రబాబు హయాంలో రైతులు పూర్తిగా నష్టపోయారు. చిత్తూరు డైరీని పునరుద్ధరిస్తా. ప్రతి రైతుకు లీటర్‌కు రూ.4 ఇస్తానని మాట ఇస్తున్నాను.
– నవరత్నాలను మనం ప్రకటించాం. ఈ పథకాలతో ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. ఇందులో కూడా ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వండి.
– రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయబోతున్నామంటే..రైతులకు ప్రధానంగా నాలుగు సమస్యలు ఉంటాయి. పంటలు వేసే ముందుకు పెట్టుబడులకు డబ్బులు దొరక్కపోతే సాగు సాధ్యం కాదు. రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి.
1.  రైతులకు మేలు చేసేందుకు ప్రతి రైతు కుటుంబానికి మే మాసంలో రూ.12,500 ఇస్తాం. రైతులు బ్యాంకులు, వడ్డీవ్యాపారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు, పావలావడ్డీ రుణాలు రావడం లేదు. కారణం చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టకపోవడంతో ఇలాంటి రుణాలు అందడం లేదు. ఆ పరిస్థితిని మార్చేస్తాం. మనం అధికారంలోకి వచ్చాక రైతులు తీసుకుంటున్న రుణాలన్ని కూడా సున్నా వడ్డీకే ఇస్తాం. 
2. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులకు నష్టాలు వస్తాయి. ఇక్కడ చాలా మంది టమాట రైతులు ఉన్నారు. వీరికి గిట్టుబాటు ధర లేదు. 30 కేజీల డబ్బా వంద రూపాలయకు అడుగుతున్నారు. రవాణా, కూలీల ఖర్చు తీసేస్తే రైతుకు గిట్టుబాటు కావడం లేదు. వేరుశనగ, మిర్చి, ప్రత్తి, చెరుకు పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. పంటలు వేయకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి కొనుగోలు చేస్తాం.
3. రైతులు అకాల వర్షాలు, కరువులు వచ్చిన సమయంలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్తారు. కరువు వచ్చిందని ఒప్పుకోవడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు. రాయలసీమలో మైనస్‌ వర్షపాతం నమోదైంది. మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత కరువు, అకాల వర్షాలు కురిసినా కూడా రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ప్రకృతి వైఫరీత్యాల నిధి రూ. 4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం.
4. పంటలు వేసిన రైతులకు నీళ్లు ఇస్తాం. చంద్రబాబు హయంలో ప్రాజెక్టు పనులు నత్తనడకనా సాగుతున్నాయి. ఆయనకు నీళ్లు పారించాలన్న తాపత్రయం లేదు. కాంట్రాక్టులకు ఎలా మేలు చేయాలని, వారి నుంచి కమీషన్లు తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. మన ప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు తోడుగా ఉంటానని, రాజన్న రాజ్యంలో ప్రతి కుటుంబం చిరునవ్వుతో ఉండాలన్నదే తన ధ్యేయమని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 

No comments:

Post a Comment