2 January 2018

ప్రజాసంకల్పయాత్ర @50


- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
- వెల్లువెత్తుతున్న స‌మ‌స్య‌లు
- చిత్తూరు జిల్లాలో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
 చిత్తూరు : అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైయ‌స్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది. వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. దారిపొడువునా ప్ర‌జ‌లు ఈ నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో మోస‌పోయామ‌ని త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. ఈ సంద‌ర్భంగా న‌వ‌ర‌త్నాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ, ఇంకా అనేక ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తూ, నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతోంది. జ‌న్మ‌దిన వేడుక‌లు, ప‌ర్వ‌దినాలు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే జ‌రుపుకుంటూ, ప్ర‌జా శ్రేయ‌స్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాజ‌న్న బిడ్డ‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.   అభిమాన నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఊళ్లో అడుగు పెట్టగానే ఎదురెళ్లి ఎంతో ఆత్మీయంగా ఆడ‌ప‌డుచులు దిష్టి తీస్తున్నారు. పల్లెపల్లెనా పూట బాటలే కనిపిస్తున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ ఏ ఊరికి వెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది.  రాజన్న బిడ్డను చూసేందుకు ఊళ్లు ఊళ్లన్నీ కదిలి వస్తున్నాయి. పాద‌యాత్ర నిర్వ‌హించే గ్రామాలు అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ప్ర‌తి ఊర్లో కూడా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న వైయ‌స్ జ‌గ‌న్ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. మ‌రో ఏడాది ఓపిక ప‌ట్టండ‌ని ధైర్యం చెబుతున్నారు. 

No comments:

Post a Comment