18 January 2018

వెన్నుపోటు బాబు నైజం

చిత్తూరు: ఓడిపోయిన చంద్రబాబును ఎన్‌టీ రామారావు అక్కున చేర్చుకుంటే..ఆయనకే వెన్నుపోటు పొడిచారని, అది చంద్రబాబు నైజమని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అదే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తన గురువు వెంకటప్ప పేరును పులివెందులతో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైయస్‌ఆర్‌ ట్రస్ట్‌ పేరుతో వెంకటప్ప స్కూల్‌ ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారని వైయస్‌ జగన్‌ వివరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపానాయుడిపేటలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు వైయస్‌ జగన్‌ సమాధానం చెబుతూ..ఈ తేడాను వివరించారు. స్థానికులు ఏం ప్రశ్నలు అడిగారంటే..


చంద్రబాబు మమ్మల్ని భిక్షగాళ్లను చేశారు: శాంతి
బీసీల ఆశీస్సులు జగనన్నకు ఉంటాయి. చంద్రబాబు బీసీలకు అండగా ఉంటానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. పెద్ద కొడుకుగా ఉంటానని చెబితే నమ్మి ఓట్లు వేయించుకొని దగా చేశాడు. ఇప్పుడు మమ్మల్ని భిక్షగాళ్లుగా చేశాడు. వైయస్‌ఆర్‌ హయాంలో అందరికి న్యాయం చేశాడు. వైయస్‌ఆర్‌ చెప్పింది కొన్ని పథకాలు ..చేసింది ఎన్నో పథకాలు..రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే మా నాన్న బతికి ఉండేవారు. మళ్లీ ఆ రాజన్న రాజ్యం రావాలంటే మా జగనన్నకే సాధ్యం. 
––––––––––––––––––
రజకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి:  ప్రసాద్‌
కుమ్మరి కులవృత్తిని సంఘ పరంగా, సామాజిక పరంగా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. మా కులం గురించి వైయస్‌ జగన్‌ ఆలోచించాలి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మా కులం నుంచి ఎమ్మెల్సీగా ఐలయ్యను చేశారు. మా కులానికి గుర్తింపు లేదు. టీటీడీలో మా కులానికి ఒక్క డైరెక్టర్‌ పోస్టు ఇవ్వాలని కోరుతున్నాను. వెంకటేశ్వరస్వామికి నైవేద్యం ఇ చ్చే మట్టి పాత్ర కరువైంది. కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చెరువుల్లో కుమ్మర్లను అడ్డుకుంటున్నారు. పుట్టుక నుంచి చావు వరకు వెంట వచ్చేది ఒక్క మట్టి కుండ ఒక్కటే. మాకు రాజకీయ వాట దమాషా పద్ధతిలో కేటాయించాలని కోరారు.  వైయస్‌ఆర్‌ వారసుడిగా పేదల పక్షాన ఉండాలని కోరుతున్నాను.
వైయస్‌ జగన్‌: రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రతి కులానికి కూడా ప్రతినిధ్యం కల్పిస్తాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వివిధ పదవులు కల్పించి తోడుగా నిలుస్తాను.
––––––––––––––––––––
చేనేతల కోసం గొప్ప నిర్ణయం తీసుకోండి:  భక్తవత్సలం
చేనేత కార్మికులను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్రంతో పోరాడి చేనేతలకు సబ్సిడీలో ముడి సరుకు ఇచ్చారు. 50 ఏళ్లకే చేనేతలకు పింఛన్‌ఇచ్చారు. మేం ఆత్మ గౌరవంతో బతికాం. చేనేతలను ఆదుకున్న ఘనత వైయస్‌ఆర్‌దే. మూతపడిన సొసైటీలను పునరుద్ధరించారు. చేనేత కార్మికుడు ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లేదు. చేనేత కార్మికులతో ఓట్లు వేయించుకొని చంద్రబాబు మోసం చేశాడు. మీరు మా పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఆదుకోవాలి. మా కోసం గొప్ప నిర్ణయం తీసుకోండి.

వైయస్‌ జగన్‌: ఇదే జిల్లాలోనే చేనేత సదస్సు జరిగింది. మనందరి ప్రభుత్వం వచ్చాక ఎంత గొప్పగా చేనేత రంగంలో తోడుగా ఉంటానంటే తాను చనిపోయిన తరువాత నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టుకునేంత గొప్పగా చేనేతలకు మేలు చేస్తాను.
––––––––––––––––––––
సీఎంకు మూడు ప్రశ్నలు: శ్వేత
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు ప్రశ్నలు వేస్తున్నాను. నాకు సమాధానం కావాలి.  మా కులాన్ని 2008లో బీసీల్లో చేర్చారు. మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వచ్చేవి. లక్ష రూపాయలు లోన్‌ తీసుకుంటే సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు వడ్డీలు కట్టలేకపోతున్నాం. మాకు ముందు లాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నాను. నేను సీఎంను మూడు ప్రశ్నలు అడుగుతన్నాను. అభివృద్ధి నా వల్లే అని చెప్పుకుంటున్నారు. నాకు సమాధానం కావాలి. ప్రత్యేక హోదా కావాలని అందరం కోరుకున్నాం. ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి జరుగుతుందని జగనన్న అంటున్నారు. చంద్రబాబు ఎందుకు ఈ విషయాన్ని విస్మరించారు. హోదా వస్తే మా పిల్లకు ఉద్యోగాలు వస్తాయి. రాజశేఖరరెడ్డి పాలనలో మా పిల్లలను చదివించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏం చేయాలి. అన్నా ..మీరు సీఎం అయ్యాక..మా పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు చేసి ఇక్కడే ఉపాధి కల్పించాలి. రెండోవది జన్మభూమి కమిటీలు వేశారు. ఈ కమిటీల ద్వారా అభివృద్ధి చెందింది ఎవరూ? మూడోది చిత్తూరు జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీలు మూత వేశారు. మీరు సీఎం అయ్యాక వీటిని తెరిపించాలి.

వైయస్‌ జగన్‌: చంద్రబాబుకు నాన్నకు ఓ చిన్న తేడా చెబుతున్నాను. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో చంద్రబాబు చంద్రగిరి ప్రజలు 2500 ఓట్లతో గెలిపించారు. ఐదేళ్ల పాటు వైయస్‌ఆర్‌ పుణ్యమా అంటూ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 17000 ఓట్లతో ఓడిపోయారు. చంద్రబాబు ఓడిపోయినా కూడా అల్లుడు కదా అని ఎన్‌టీఆర్‌ ఆప్యాయత చూపించారు. ఆదరించిన అదే ఎన్‌టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఇది చంద్రబాబు నైజం. నాన్నగారి విషయంలో ఇదే ఊదాహరణ చెబుతున్నాను. నాన్నగారు వెంకటప్ప మాస్టర్‌ ఇంట్లో చదువుకున్నారు. ఆయన వడ్డెర కులస్తుడు. ఆ తరువాత వెంకటప్ప మాస్టర్‌ను మరిచిపోలేదు. దాదాపు 12 ఏళ్లుగా అదే మాస్టర్‌ పేరుతో పులివెందులతో వైయస్‌ఆర్‌ మొమెరియల్‌ పేరుతో వెంకటప్ప పేరుతో స్కూల్‌ నడుపుతున్నాం. యూనిఫాం దగ్గర నుంచి పిల్లలకు అన్ని ఉచితంగా ఇస్తున్నాం. బ్రహ్మండమైన మార్కులతో పిల్లలు చదువువుతున్నారు. ఈ స్కూల్‌ను ఇప్పుడు భారతీ చూస్తున్నారు. ఆ మాస్టర్‌ పేరుతో ఏకంగా స్కూల్‌ పెట్టించి వెంకటప్ప పేరు పులివెందులలో బ్రతికే ఉందని చెప్పడానికి సజీవ సాక్షం. ఓడిపోయిన చంద్రబాబును అక్కున చేర్చుకొని ఎన్‌టీఆర్‌ మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చేందుకు ఆయన చేసింది వెన్నుపోటు. ఇది ఆయన నైజం.
––––––––––––––––––––––––
ఆడవాళ్లకు స్వాతంత్య్రం ఉందా?: లక్ష్మీ 
ఆడవాళ్లకు స్వాతంత్య్రం లేదు. మా మామకు పింఛన్‌ ఇవ్వాలని ప్రతి జన్మభూమిలో అర్జీ ఇస్తున్నాం. ప్రతి సారి వయసు లేదని చెబుతున్నారు. ఓటు కార్డులో 67 ఏళ్లు ఉంది, ఇవాల్టికి పింఛన్‌ ఇవ్వడం లేదు. ఓట్లప్పుడు తప్పుడు మాటలు చెప్పడం ఎందుకు. నిజాయితీగా బతకాలి. అలా కానప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఆడవాళ్లు స్వతంత్రంగా బతికే రోజులు పోయాయి. ప్రతి భర్త తాగి వచ్చి వేధిస్తున్నారు. కుటుంబాలు ఎన్నో నాశనం అవుతున్నాయి. బెల్టు షాపులు తీసేస్తా అన్నాడు. ఇప్పుడేమో వీధిలో షాపు పెడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎందుకో? నేను చంద్రబాబుకు ఓటే వేయను. జగనన్న ముఖ్యమంత్రి కావాలి.

వైయస్‌ జగన్‌: మనందరి ప్రభుత్వం వచ్చాక మందు అన్నది లేకుండా చేస్తా? మద్యం నిషేదించిన తరువాతే మళ్లీ ఓట్లు అడుగుతానని మాట ఇస్తున్నాను.
––––––––––––––––––––––
ఇలాంటి పాలన మాకొద్దు 
ఉదయ్‌ కుమార్, ఎంఏ బీఈడీ
చంద్రబాబు తన మేనిఫెస్టోలో రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మేం అడిగామా? ఇప్పుడేమో ఏం పని చేయకపోతేనే నిరుద్యోగ భృతి అంటున్నారు. ఉన్నత చదువులు చదివి ఇంటి వద్ద ఉంటారా?  25 ఏళ్లు వచ్చినా ఓటు హక్కు లేదు. మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడికి వెళ్లు..ఇక్కడికి వెళ్లు అంటున్నారు. ఎందుకంటే మాకు ఓటు హక్కు ఉంటే టీడీపీ ఓడిపోతుందని భయం. మా ఊర్లో సిమెంట్‌ రోడ్లు వేస్తామని మూడు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటికి ఒక్క ఇటుక వేయలేదు. సంక్రాంతికి వీధిలైట్లు వేయలేదు. కడుపు మండుతోంది. ఇలాంటి పాలన మాకొద్దు .

వైయస్‌ జగన్‌: ఎన్నికలు దగ్గర వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి, పింఛన్లు, ఆరోగ్య శ్రీ గుర్తుకు వస్తుంది. ప్రజలను మళ్లీ మోసం చేయాలనే ఆలోచన చంద్రబాబుది.
––––––––––––––––––––
పూసల పరిశ్రమను పునరుద్ధరించాలి:  రోశయ్య, పాపానాయుడిపేట
మా గ్రామానికి ఎంతో మంది గొప్పొలు వచ్చారు. ఓట్ల కోసం ఏవేవో చెప్పారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వైయస్‌ఆర్‌ హయాంలో  మాగ్రామంలో 300 ఇల్లు ఇచ్చారు. మా దురదృష్టం కొద్ది వైయస్‌ఆర్‌ చనిపోయారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. మీరు సీఎం కాగానే ఆ ఇల్లు పూర్తి చేసి మా కల నెరవేర్చాలి. పూసల పరిశ్రమ ఇప్పుడు నిర్వీర్యం అయ్యింది. మూడి సరుకు తెచ్చి దాన్ని ఐదు విధాలుగా తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. మిషనరీతో తయారు కావడంతో ఉపాధి లేక మా గ్రామస్తులు వలస వెళ్తున్నారు. ఆ పూసల పరిశ్రమను పూర్తిగా పునరుద్ధరిస్తాం.
వైయస్‌ జగన్‌: పూసల పరిశ్రమ పునరుద్ధరించాలంటే ఏం చేయాలి. దానిపై విధి విధానాలు చెబితే మీకు న్యాయం చేస్తాం. 
–––––––––––––––––––––––
రాము, వేర్పేడు మండలం
పరిశ్రమల పేరుతో వేర్పేడు మండలంలో రైతుల భూములను టీడీపీ నేతలు లాక్కున్నారు. రాజధాని బూముల కంటే ఎక్కువగా లాక్కుంటున్నారు. 
వైయస్‌ జగన్‌: మన ప్రభుత్వం వచ్చాక భూ రికార్డులను పారదర్శకంగా చేస్తాం. తప్పులు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. బాధితులకు రావాల్సిన భూములను వారికి పువ్వుల్లో పెట్టి ఇస్తాం. బీసీ అధ్యాయన కమిటీలో మీరందరూ మమేకం కండి. బీసీ డిక్లరేషన్‌లో మీ అందరి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకొని మేలు చేస్తాం.

No comments:

Post a Comment