30 December 2017

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బాబు ఏమన్నారు?


– తంబళ్లపల్లి బహిరంగ సభలో వైయస్‌ జగన్‌
– ప్రత్యేక హోదా సంజీవిని, 15 ఏళ్లు హోదా కావాలన్నారు
– ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ 
– నాలుగేళ్ల బాబు పాలనలో బ్యాంకుల నోటీసులు మాత్రమే ఇంటికి వచ్చాయి
– ప్రజలను మోసం చేసే చంద్రబాబు పాలన మనకు అవసరమా? 
– బీసీల మీద నిజమైన ప్రేమ చూపించింది వైయస్‌ఆర్‌ ఒక్కరే
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను చదివించే బాధ్యత నాది
–పొదుపు సంఘాల రుణాలు అక్కచెల్లెమ్మల చేతికిస్తాం
– ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తా
– హంద్రీనీవా నీరు తీసుకొచ్చి చెరువులు నింపుతా
– చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా

చిత్తూరు: చంద్రబాబు పాలనను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి పదవి కోసం తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిలబడి చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారని, 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి మాట తప్పారని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఇలా మోసం చేసే వ్యక్తిని పొరపాటున మళ్లీ ఎన్నుకుంటే రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం ఉండదన్నారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, నవరత్నాల్లాంటి పథకాలను అమలు చేసి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తానని వైయస్‌ జగన్‌ హామీ  ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 47వ రోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

– వేల మంది నాతో పాటు అడుగులో అడుగు వేశారు. వేలాది మంది ఎండను ఖాతరు చేయకుండా నడిరోడ్డుపై నిలబడ్డారు. చిక్కని చిరునవ్వుతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
– నాలుగేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ పరిపాలన కొనసాగుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని, సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తన కార్యకర్తలకు ఉద్భోద చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరంతా చూశారు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నాను.
– నాలుగేళ్ల క్రితం ఈ పెద్ద మనిషి ఏమన్నారు. చంద్రబాబు పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదే పెద్ద మనిషి ఇదే తిరుపతిలోనే వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏమన్నారు. ప్రత్యేక హోదా సంజీవని, 15 ఏళ్లు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. కాస్తోకూస్తో ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. ఇవాళ డిగ్రీ అయిపోతే పిల్లొడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగాల కోసం చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు వస్తాయి. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఇదే ప్రత్యేక హోదా తీసుకువచ్చాడా?
– ఎన్నికలప్పుడు ఇదే పెద్దమనిషి ఏం చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తామన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఇంటింటికీ రూ.90 వేలు బాకీ పడ్డాడు.
– అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చాక మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు. గతంలో ఇంటికి రూ.60, 70 వచ్చేది. ఇప్పుడు రూ.500, 1000 వస్తుంది.
– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం,కందిపప్పు, కారంపొడి, పసుపు, చక్కెర, కిరోసిన్‌ వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇవాళ రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప వేరేవి దొరకడం లేదు. చంద్రబాబు మోసం చేయడంలో ఏస్థాయికి చేరాడంటే..ఇటీవల చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేశారు.  ఈ మాల్స్‌లో హోల్‌సెల్స్‌రేట్ల కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. చంద్రబాబు మంత్రులు మాత్రం మార్కెట్‌ కంటే 40 శాతం తక్కువకు అమ్ముతున్నామని చెబుతున్నారు. ఇది మోసం కాదా?
– బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇవాళ బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. బాబు చేసిన రుణమాఫీ పథకం చివరకు వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా?.
– ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్నాడు. నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా?
–చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశాడు. ఆ పార్టీ మేనిఫెస్టోలో అన్ని కూలాలను దగా చేశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశాక..ఇలాంటి పాలన కావాలా అని అడుగుతున్నాను. ఇలా మోసం చేసే వాడికి పొరపాటున మళ్లీ అవకాశం ఇస్తే రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదాన్ని మరిచిపోతారు. మీరంతా చిన్న చిన్న మోసాలను నమ్మరని, రేపు ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు. ఒక బెంజీ కారు ఇస్తానంటాడు. ఈ వ్యవస్థ మారాలంటే ఒక్క వైయస్‌ జగన్‌తో సాధ్యం కాదు. మీరంతా వైయస్‌ జగన్‌కు తోడుగా నిలవాలి. ఏదైనా హామీ ఇస్తే అది నెరవేర్చకపోతే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాలి. అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది.
– రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వ చ్చాక మనం ప్రకటించిన నవరత్నాలను కొన్ని విషయాలు చెబుతున్నాను. ఇందులో ఏమైనా సూచనలు,సలహాలు ఇవ్వాలన్న నేను స్వీకరిస్తాను.
–ఇవాళ పేదవాళ్లు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉందా? గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటుంటారు. నాలుగు కత్తెర్లు ఇస్తే అది బీసీలపై ప్రేమా? పేదవాళ్లపై, బీసీలపై నిజమైన ప్రేమ చూపింది ఒక్క మహానేతనే. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చారు. మహానేత పాలనలో ప్రతి పిల్లాడికి భరోసా ఉండేది. ఇంజనీరింగ్, డాక్టర్‌ ఇలా పెద్ద పెద్ద చదువులను తాను చదవిస్తానని వైయస్‌ఆర్‌ భరోసా ఇచ్చారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ ఇంజనీరింగ్‌ చదివే పరిస్థితి ఉందా? ఏడాదికి ఇంజనీరింగ్‌ ఫీజు లక్ష పైగా ఉంది. ప్రభుత్వం ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు ఆ పేదవాళ్లు ఎక్కడి నుంచి కడుతారు. పేదవాడికి చదువుకునే పరిస్థితి లేదు. ప్రతి పేద కుటుంబానికి తోడుగా ఉండేందుకు నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి. పూర్తిగా డబ్బులు నేను చెల్లిస్తాను. ఇంజీనీరింగ్, డాక్టర్లు చదివే విద్యార్థులకు మెస్‌ చార్జీలు, హాస్టల్‌ చార్జీలకు అయ్యే ఖర్చు కోసం ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తాను. చిన్న పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు జమా చేస్తాం. మన తలరాతలు మారాలంటే ఆ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నారు. ఇదీ బీసీలపై ఉన్న ప్రేమంటే.
– ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెబుతున్నాను.  చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్లుకు ఇచ్చే సొమ్ము మాత్రం పెంచుతారు. గతంలో పోలిస్తే సిమెంట్, ఇనుము, అల్యూమినీయం రేట్లు తగ్గాయి, అయినా కాంట్రాక్టర్లకు అంచనాల పేరుతో డబ్బులు పెంచుతారు. కానీ అవ్వతాతలకు ఇచ్చే పింఛన్‌ డబ్బులు పెంచడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక 45 ఏళ్లకే పింఛన్‌ఇస్తానని, ప్రతి నెల రూ.2 వేల చొప్పున పింఛన్లు ఇస్తానని మాట ఇస్తున్నాను. పేదరికంలో ఉండి పనులకు వెళ్తేనే కడుపులు నిండే పరిస్థితి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో ఉంది. వారికి తోడుగా ఉండేందుకు పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాను. 
– ప్రతి పేద వాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇదే తంబళ్లపల్లిలో 29 వేల ఇల్లు కట్టించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి, ఆ అక్కాచెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెబుతున్నాను. ఆ ఇల్లు బ్యాంకుల్లో పెట్టి రుణం కూడా పొందే వీలు కల్పిస్తాం.
– పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెమ్మలకు చెబుతున్నాను. మన ప్రభుత్వం వచ్చాక ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా నాలుగు దపాల్లో మాఫీ చేసి, ఆ డబ్బు ఆ అక్కా చెల్లెమ్మలకు ఇస్తానని మాట ఇస్తున్నాను.
–టమోటాలు 35 కేజీలు రూ.100కు కొనే నాథుడు లేడు. 44 కేజీల బస్తా ఇవాళ రూ.1200 అడుగుతున్నారు. మన జిల్లాలో ఉన్న చెరుకు సహకార ఫ్యాక్టరీలు చంద్రబాబు పాలనలో మూతపడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.57 కోట్లు ఇచ్చి చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించారు. మళ్లీ మనఖర్మ కొద్ది చంద్రబాబు సీఎం కావడంతో ఆ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. పాడి ఉన్న ఇంటా సిరులకు కొదువ ఉండదట. ఇదే చంద్రబాబు హయాంలో హెరిటేజ్‌ అనే సంస్థ పెట్టి రైతుల నుంచి తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ప్రతి రైతుకు చెబుతున్నాను. పొరుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్‌ సంస్థలకు పాలు అమ్మితే లీటర్‌కు 4 రూపాయాలు ఎక్కువగా ఇస్తారు. ఇ దే మన రాష్ట్రంలో ధరలు తగ్గిస్తున్నారు. ఎందుకో తెలుసా హెరిటేజ్‌ సంస్థకు లాభం చేకూర్చేందుకు. అదే మన ప్రభుత్వం వచ్చాక ప్రతి లీటర్‌కు రూ.4 పెంచుతానని హామీ ఇస్తున్నారు.
–తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ కారణంగా కాళ్లు సొట్టపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీనీవా పనులు పూర్తి చేయడం లేదు. హంద్రీనీవా నీరు తెచ్చి ప్రతి చెరువును నింపుతానని మాట ఇస్తున్నాను.  రాబోయే రోజుల్లో ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వమని కోరుతున్నాను. మీ బిడ్డ పాదయాత్రగా బయలుదేరారు. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాను. 

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

చిత్తూరు :  పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరారు. 47వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయ‌స్‌ జగన్‌ను ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు శ‌నివారం కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. అలాగే ఏళ్ల తరబడి మున్సిపాలిటీలో పనిచేస్తున్నా కనీస వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జననేత దృష్టికి తీసుకెళ్లారు. వీరి సమస్యలు విన్న వైయ‌స్ జగన్‌ సానుకూలంగా స్పందించారు. మరో ఏడాది ఓపిక పట్టండి..ఆ తరువాత మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీపై  ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. 

నాలుగు క్యాలెండర్‌లు మారినా ఆడవారి రాత మారలేదు



  • చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ఆర్కే రోజా
  • బాబు పాలనలో అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి
  • అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి పెట్టడం హిందూ సాంప్రదాయమా?
  • దేవాలయాల్లో పూజలు చేయొద్దని కొత్త జీవో
  • పురిటిలో ఉన్న ఆడపిల్లను కూడా మోసం చేస్తావా బాబూ
  • నాలుగేళ్లుగా మహిళా సంక్షేమానికి నువ్వు చేసిందేంటీ?
  • గజానికి ఒక గాంధారీ పుత్రుడు గాంధీ గారి దేశంలో అన్నట్లుగా పాలన 
  • వైయస్‌ఆర్‌లా ఒక్క శాతం కూడా లేని చంద్రబాబు పాలన

హైదరాబాద్‌: 2017 నారావారి నరకాసుర నామ సంవత్సరంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అభివర్ణించారు. చంద్రబాబు పాలన అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలుగా కొనసాగుతుందని మండిపడ్డారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారని విరుచుకుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ధైర్యంతో తన మ్యానిఫెస్టోలో మహిళల కోసం పెట్టిన పేజీని తెరిచి చూడగలరా.. అని ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రంలో ఆడవారిపై జరుగుతున్న ఆగడాలపై ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు క్యాలెండర్‌లు, నాలుగు బడ్జెట్‌లు మారినా ఆడవారి తలరాతలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులను రద్దుకు రెండో సంతకం పెడతానని మోసం చేశాడని మండిపడ్డారు. డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీన సాక్షాత్తు వెంకటేశ్వరస్వామితో పాటు ఏ గుడిలో అలంకరణ చేయొద్దు.. ఇది మన సంస్కృతి కాదని జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు బార్లకు, వైన్స్‌లకు ఎందుకు పర్మిషన్‌ ఇచ్చారని ప్రశ్నించారు. మందుబాబులు ఆడవారిపై దాడులు చేసినా పర్వాలేదా.. ఇదేనా హిందూ సాంప్రదాయం అని నిలదీశారు. మద్యం షాపులు తెరవొచ్చు కానీ దేవాలయాలు తెరవకూడదని చంద్రబాబు దిగజారిపోయి మాట్లాడుతున్నారన్నారు.
 
చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని రోజా మండిపడ్డారు. ఒక్కొక్కటిగా వివరిస్తూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు
– టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు పునర్జీవింపజేస్తానని చంద్రబాబు చెప్పాడు. డ్వాక్రా సంఘాలకు రూ.14,204 కోట్లు ఇస్తే రుణమాఫీ పూర్తిగా అయిపోతుంది. చంద్రబాబు దోచుకున్నదాంట్లో అక్కచెల్లెమ్మల అప్పులు 1 శాతం ఉంటుంది. మహిళలపై గౌరవం ఉంటే మాఫీ చేసేవాడు కానీ హామీ ఇచ్చి కూడా మోసం చేశాడంటే ఏ మేరకు మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారో అర్థం చేసుకోండి. చంద్రబాబు గ్రామాలకు వెళితే.. నిలదీయడానికి ప్రతి మహిళా సిద్ధంగా ఉంది. 
– పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.30 వేలు వేస్తామన్నారు. నాలుగేళ్లుగా ఒక్క ఆడపిల్ల కూడా రాష్ట్రంలో పుట్టలేదా.. ఒక్క బిడ్డకైనా డబ్బులు వేశారా.. పురిటిలోని మహిళలను కూడా చంద్రబాబు మోసం చేసేది నిజం కాదా..? పండంటి బిడ్డ పథకం ద్వారా పౌష్టికాహారం కోసం రూ.10 వేలు ఇస్తానని గాలికొదిలేశారు. గర్భవతులను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. 
– పేద మహిళలకు స్మార్ట్‌ ఫోన్‌లు అన్నాడు. ఒక్క ఫోన్‌ కొడితే 5 నిమిషాల్లో వచ్చి అన్యాయం చేసిన వారి తాటతీస్తామన్నాడు. ప్రమాదంలో ఉన్న మహిళల రక్షణ కొరకు జీపీఎస్‌ టెక్నాలజీని ఉపయోగించి సెల్‌ఫోన్‌ ద్వారా పనిచేసే అలారం వ్యవస్థను పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానం చేస్తామన్నాడు. కానీ అన్యాయం అవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి పంపుతున్నారు. 
టీడీపీ నేతల చేతుల్లో అన్యాయానికి గురైన మహిళలు 
– పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నర్సాపురం రోడ్డుపై శ్రీగౌతమి అనే యువతి వారి చెల్లెలతో స్కూటీపై వెళ్తుంటే.. టీడీపీ నేత సజ్జ బుజ్జి భార్య శిరీష కారుతో గుద్ధి చంపితే బాధితురాలికి ఎవరు న్యాయం చేశారు. 
– రిషితేశ్వరి అనే అమ్మాయిని ప్రిన్సిపల్‌ దగ్గరుండి ర్యాగింగ్‌ను ప్రోత్సహించి ఆత్మహత్య చేసుకునే విధంగా 
పరిస్థితులు క్రియేట్‌ చేశాడు. ఆ ప్రిన్సిపల్‌పై దూళిపాల నరేంద్ర, దేవినేని ఉమలు కేసులు పెట్టకుండా చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాడేంత వరకు ఆ తల్లిదండ్రులను ఉడకాడించారు. ఇప్పటి వరకు ఆ కేసులో పురోగతి లేదు.  
– అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సుదమ్మ అనే మహిళ పశువులకు నీటి తొట్టి కొంచెం పక్కకు కట్టండి అని చెపితే పయ్యావుల కేశవులు అనుచరులు చెప్పుల కాళ్లతో ఎగిరెగిరి తన్నారు. స్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే నామమాత్రపు కేసుగా రాసుకొని స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. అంటే పోలీసులు ఎవరికి న్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. 
– చిత్తూరులో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురుకు అవమానం జరిగింది.. టీడీపీ కార్యకర్తల వల్ల రోడ్డుపై కూర్చొని ధర్నా చేసే దౌర్భాగ్య పరిస్థితి. టీడీపీలో ఏ విధంగా గుండాలు, రౌడీలు రాజ్యమేలుతున్నారు. 
ఇవన్నీ చూస్తుంటే గజానికి ఒక గాంధారీ పుత్రుడు గాంధీ గారి దేశంలో అన్న బాలగంగాధర్‌ మాటలు గుర్తుకు వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలోకి వెళ్లినా దుర్వోధనుడు, దుశ్యాసనుడు లాంటి కీచకులు మహిళలపై దాడులు చేస్తున్నారు.  
– విశాఖ జిల్లా పెందుర్తి మండలం జె్రరిపోతులపాలెంలో బండారు సత్యనారాయణ ముఖ్య అనుచరులు ఏ విధంగా ఒక మహిళను వివస్త్రను చేసి ఈడ్చికొట్టారో ప్రపంచమంతా చూసింది. రాష్ట్రంలో దుశ్యాసన పాలన ఏ విధంగా ఉందో విదేశాల్లో ఉన్న మహిళలు పవన్‌ కల్యాణ్‌కు ట్వీట్‌ చేశారు. అయినా చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విషయంపై స్పందించలేదు. కానీ వైయస్‌ జగన్‌ చలించి వెంటనే వైయస్‌ఆర్‌ సీపీ మహిళా కమిటీల ద్వారా ధర్నాలు చేయించి ఆమెకు న్యాయం చేయించారు. ఆ మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారు. 
– టీడీపీ మహిళా ప్రజాప్రతినిధి జానీమూన్‌ తన కుటుంబాన్ని పచ్చనేతలు చంపేస్తారని ప్రెస్‌మీట్‌ పెట్టి కన్నీరు పెట్టుకుంటే ప్రతిపక్షం అండగా ఉండి ఆమెకు న్యాయం చేసింది. చంద్రబాబు దిగొచ్చి మంత్రులను ఆమె ఇంటికి పంపించారు. 
– ఎప్పుడైతే వనజాక్షిని ఇసుకలో వేసికొట్టినప్పుడు చింతమనేనిపై చర్యలు తీసుకొనివుంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయివుండేవి కాదు.   
– చంద్రబాబు కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉండేవారు. విస్తరణ పేరుతో బీసీ మహిళను, ఎస్సీ మహిళను తొలగించారు. మూడును ఐదు చేస్తే తప్పా..? మహిళలు మంత్రిత్వశాఖను మోయలేరా.. చంద్రబాబూ?
– దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అతిపెద్ద మంత్రిత్వశాఖ హోంశాఖను సబితాఇంద్రారెడ్డికి ఇచ్చి ఆశీర్వదించారు. తన కేబినెట్‌లో 5 ముఖ్యమైన శాఖలను మహిళలకు ఇచ్చి సువర్ణ పరిపాలనను అందించారు.  
– ఫీజురియంబర్స్‌మెంట్‌ ద్వారా మహిళలను డాక్టర్లు, ఇంజనీరింగ్‌ చదువులు చదివించారు. పావలా వడ్డీలు ఇచ్చి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించారు. అభయహస్తం పేరుతో మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేశారు. వైయస్‌ఆర్‌ పాలనలో ఒక్క శాతం కూడా చంద్రబాబు చేయలేదు.  
– అమరావతిలో గొప్పగా మహిళా పార్లమెంటరీ సభ పెట్టి దాంట్లో చంద్రబాబు, ఆయన బంధువులను పిలుచుకొని పొగిడించుకున్నారు. సభలో ఎక్కడైనా మహిళల గురించి పోరాడిన వారిని పిలిచారా..? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలిపించి అవమానించారు. విజయవాడలో కిడ్నాప్‌ చేసి తిప్పితిప్పి పక్కరాష్ట్రం హైదరాబాద్‌లో వదిలిపెట్టారు. 
– మహిళలను టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోడే ప్రసాద్‌లు కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ ద్వారా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఒక మహిళగా చట్టసభలో పోరాడితే సంవత్సరం పాటు సస్పెండ్‌ చేశారు. బుద్ధి వెంకన్న, బోడే ప్రసాద్‌లపై చర్యలు తీసుకోకుండా వారిని చట్టసభల్లో పక్కనే కూర్చొబెట్టుకుంటున్నారు. ఇదేనా చంద్రబాబుకు మహిళలపై ఉన్న గౌరవం.. 
 

వైయ‌స్ఆర్‌సీపీ జెండా రెప‌రెప‌లు

- దిగ్విజ‌యంగా సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-  అధినేత‌తో క‌లిసి అడుగులు వేసిన ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి,  భూమ‌న 
- హార‌తులు ప‌ట్టిన మ‌హిళ‌లు
- కేరింత‌లు కొట్టిన యువ‌త‌
చిత్తూరు: జ‌నం కోసం వైయ‌స్ జ‌గ‌న్ ఎత్తిన జెండా వైయ‌స్ఆర్ అంటూ చిత్తూరు జిల్లాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప‌రెప‌లాడుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జిల్లాలోని పాద‌యాత్ర సాగే గ్రామాల్లో పార్టీ జెండాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. సామాన్య కార్య‌క‌ర్త నుంచి పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ జెండా చేత‌బూని అధినేత‌తో క‌లిసి అడుగులు వేయ‌డంతో పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్స‌హం వ‌చ్చింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 47వ రోజు చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి ప్రారంభం కాగా,  ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట, ఎగువ బోయనపల్లి వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా బోరెడ్డివారికోట వ‌ద్ద పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ద్వార‌క‌నాథ్‌రెడ్డిలు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా విజ‌య‌సాయిరెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిలు భుజాన జెండా పెట్టుకొని అధినేత‌తో క‌లిసి న‌డ‌వ‌డం క‌నువిందు చేసింది.  

జ‌న‌సంద్రం
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ గ్రామాల‌కు వ‌స్తున్నార‌ని స‌మాచారం తెలియ‌డంతో గ్రామ‌స్తులు ప‌నులు మానుకొని ప‌డిగాపులు కాస్తున్నారు.  చిత్తూరు జిల్లాలోని తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాలు జ‌న‌సంద్రంగా మారాయి.  మంగళ వాయిద్యాలు, డప్పుల మోతలు, పరుగులు తీస్తూ యువకులు వేసే ఈలలతో కోలాహలంగా మారింది. జనవాహినితో కదలి వస్తున్న విపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి మురిసిపోయింది. నాయకుడొచ్చాడని సంబరపడింది.  మ‌హిళ‌లు హార‌తులు ప‌ట్టి ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతుండ‌గా, పార్టీ నాయ‌కులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలుకుతున్నారు. అన్నొస్తున్నాడ‌ని యువ‌త కేరింత‌లు కొడుతున్నారు. పొలం గ‌ట్లు, బ‌స్సు టాప్‌లపైనుంచి జ‌న‌నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీప‌డుతున్నారు. పాద‌యాత్ర చేసే గ్రామాల్లో  పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు


– వైయస్‌ఆర్‌సీపీ నేతలు అరుణ్‌కుమార్, రాజశేఖర్‌
–టీడీపీ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారు
– టీడీపీ పాలనలో దళితులకు ఉద్యోగ అవకాశాలు లేవు
– ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. టీడీపీ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ సీనియర్‌ నేత కె. రాజశేఖర్‌తో కలిసి అరుణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.
దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళనగా మాట్లాడం బాధాకరమన్నారు. పార్టీ ఫిరాయించిన మంత్రి ఆదినారాయణ దళితులు శుభ్రంగా ఉండరని అనడం దారుణమన్నారు. దళితులకు అత్యంత ముఖ్యమైంది భూమి అన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు ఎంతోకొంత భూమి పంపిణీ చేశారన్నారు. కానీ, ఏపీలో దళితుల నుంచి భూములు లాక్కోవడం దేశంలో ఇక్కడే చూశామన్నారు. రాజధాని పేరుతో వేల ఎకరాలు లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దళితులకు నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా కట్టించిందా అని ప్రశ్నించారు. టీడీపీ లక్ష ఇల్లు కట్టించామని చెప్పుకుంటున్నారని, అందులో దళితులకు కట్టించిన ఇల్లు ఎన్ని అని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 42 లక్షల పక్కా ఇల్లు కట్టించారని గుర్తు చేశారు. దళితులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. 

ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు.  50 శాతం ఖాళీలు ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాకులాక్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. దళిత విద్యార్థులకు ఒక్క స్కాలర్‌ షిప్‌ లేదన్నారు. విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో ఎన్ని నిధులు కేటాయించారు. ఎంత ఖర్చు చేశారని, ఎన్ని నిధులు దారి మళ్లించారని ఆయన ప్రశ్నించారు. అందులో ఖర్చు చేసింది 45 శాతమే కదా అని హిందు న్యూస్‌ పత్రిక చెప్పిందన్నారు. డబ్బులు కేటాయించరు, కేటాయించిన దాంట్లో ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టాలను అనుసరించి పరిపాలన చేయాలన్నారు. మీరు దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి కదా అని నిలదీశారు. ప్రతి దళితుడు కూడా చంద్రబాబు వెళ్లాలని కోరుతున్నారన్నారు. మీరు దళితులకు ఒక్క మేలైనా చేశారా అని ప్రశ్నించారు.  

దాడులు కొనసాగుతూనే ఉన్నాయి: కె.రాజశేఖర్‌
టీడీపీ పాలనలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పార్టీ సీనియర్‌ నేత కె. రాజశేఖర్‌ విమర్శించారు.   నాడు కారంచెడులో మొదలైన అరాచకాల పరంపర చంద్రబాబు పాలనలో కొనసాగుతూనే ఉన్నాయన్నారు.  గరగప్రరు, దేవరపల్లి, జె్రరిపోతులపాలెంలో దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. టీడీపీ నేతలకు భూ దాహం తీరడం లేదన్నారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలో దాదాపు 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న దళితుల భూములను రాష్ట్ర ప్రబుత్వం చెట్టు–నీరు పేరుతో పండించిన పంటలు కూడా తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపక్షంగా వైయస్‌ఆర్‌సీపీ అక్కడ ఉద్యమించడంతో ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. మంత్రి నక్కా ఆనంద్‌బాబు, జూపూడి ప్రభాకర్‌ వచ్చి మీ భూములు మీకు ఇస్తున్నామని ప్రకటించి, మరో వైపు టీడీపీ ఎంపీటీసీతో కోర్టు నుంచి స్టే తెప్పించారని తప్పుపట్టారు. గరగప్రరులో అంబెడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి దళితులను గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇలా దళితులపై అరాచకాలు చేస్తున్న టీడీపీకి అమరావతిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసే అర్హత లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని రాజశేఖర్‌ హెచ్చరించారు.

జననేత పేరువింటే టీడీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయ్‌

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెప్పగానే టీడీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, బొప్పన భవకుమార్‌లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి జననేతపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు అవినీతిపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఎల్లుండి ప్రకాశం బ్యారేజీ వద్దకు చర్చకు రావాలని సవాలు విసిరారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అయినా టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు అవినీతిపై చర్చకు రమ్మంటే టీడీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

ప్ర‌ధాని దృష్టికి రాష్ట్ర స‌మ‌స్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నెల‌కొన్న అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని కోరారు. శ‌నివారం విజ‌య‌సాయిరెడ్డి పార్ల‌మెంట్‌లో ప్ర‌ధానిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా  క‌డ‌ప‌కు చెందిన ఫాతిమా మెడిక‌ల్ కాలేజ్ సమస్యని పరిష్కరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే  విభ‌జ‌న చ‌ట్టంలోని ప్రత్యేక హోదా అంశంపై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు.  పోలవరం ప్రాజెక్టు ని త్వరితగతిన పూర్తి చేయాలని విజయసాయిరెడ్డి ప్రధానిని కోరారు. విశాఖ‌కు రైల్వే జోన్, రాయలసీమకి స్టీల్ ఫ్యాక్టరీ తోపాటు రాష్ట్రానికి సంభందించిన అనేక సమస్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా రాజ్యసభలో సమర్ధవంతంగా చాలా చక్కగా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ మంచి పార్లమెంటేయన్ గా గుర్తింపు తెచ్చుకొంటున్నావని, దీనిని ఇలాగే కొనసాగించాలని విజ‌య‌సాయిరెడ్డిని ప్రధాని మోడీ ప్రశంసించటం గమనార్హం .

27 December 2017

రాష్ట్రపతి గారు..టీడీపీ ప్రభుత్వ అరాచకాలు మీ దృష్టికి వచ్చాయా


– టీడీపీ పాలనలో దళితులను కొడుతున్నారు.
– దళితులను అడుగడుగునా కించపరుస్తున్నారు

విజయవాడ: రాష్ట్రపతి గారూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దళితులపై చేస్తున్న అరాచకాలు, అక్రమాలు మీ దృష్టికి వచ్చాయా అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మన రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని, ఓ దళిత వ్యక్తి రాష్ట్రపతిలాంటి మహోన్నత పదవిలోకి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. బుధవారం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జునతో కలిసి పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఏపీలో  ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి గారు గమనించారా అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే వేరే పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పి తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు..ఈ తీరును గమనించారా రాష్ట్రపతి గారు అని ప్రశ్నిస్తున్నామన్నారు. అధికారులపై దౌర్జన్యం, లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడాల్సిన ప్రభుత్వం ఏవిధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. ఏవిధంగా అధికారులపై దౌర్జన్యం చేస్తున్నది మీరు ఒక్కసారి గమనించాలని రాష్ట్రపతిని వేడుకుంటున్నామన్నారు.  టీడీపీ ఎమ్మెల్యే దోపిడీని అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌ను నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చిన విషయం మీ దృష్టికి వచ్చిందా అని అడుగుతున్నామన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసింది మీరు తెలుసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏవిధంగా కాలరాస్తుందో తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ఏవిధంగా అవినీతికి పాల్పడుతున్నారో తెలుసుకోవాలని విన్నవిస్తున్నామన్నారు. దళితులపై ఏవి«ధంగా దాడులు చేస్తున్నారో తెలుసుకోవాలని కోరుతున్నామన్నారు. ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అని సీఎం అన్న విషయాన్ని తెలుసుకోవాలని వేడుకున్నారు. దళితులకు ఇచ్చిన భూములు ఎలా లాక్కుంటున్నారో తెలుసుకోవాలని వేడుకుంటున్నామన్నారు. దళితులు కూడా సమాజంలో గౌరవ స్థానంలోకి రావాలని గత ప్రభుత్వాలు భూములు ఇస్తే..ఆ భూములను లాక్కొన్ని వాటిని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కట్టబెడుతోందో గమనించాలన్నారు. దళితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అడుగడుగునా కించపరుస్తుందన్నారు. దిగజారిన ఈ ప్రభుత్వ విధానాలను గమనించాలని రాష్ట్రపతిని వేడుకున్నారు. స్థానిక సంస్థలను ఏవిధంగా అణగద్రోక్కుతుందో మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ రోజు సర్పంచ్, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంఆర్‌వోలు ప్రజలకు సంక్షేమ పథకాలను చేర్చలేని నిస్సాహయ స్థితిలో ఉన్నారని, ఈ విధానాలను గమనించాలని కోరారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకం కావాలన్నా టీడీపీ కార్యకర్తల వద్దకు వెళ్లి అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో పాస్‌ చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో గమనించాలన్నారు. ఈ నిధులను అక్రమ మార్గంలో ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. కూలీలు వలసలు వెళ్లకూడదన్న గొప్ప ఆలోచనతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని తీసుకొని వస్తే..ఆ ఫలాలు కూలీలకు అందకుండా తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. నెలల తరబడి కూలీలకు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. బంగారు తల్లి అనే పథకాన్ని ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం ఒక్క మహిళకు కూడా సాయం చేయలేదన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌కు రాతపూర్వకంగా హామీ ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదన్నారు.

కొత్తపల్లి గీతపై చర్యలు తీసుకోవాలి

న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి గీతపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలో పార్టీ ఫిరాయింపులపై నిర్వహించిన సదస్సులో ఎంపీ మేకపాటి పాల్గొని ప్రసంగించారు.   జేడీయూ ఎంపీలపై ఇటీవల రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేసినట్లుగానే పార్టీ మారిన కొత్తపల్లి గీతపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడో న్యాయం, ఏపీలో మారో న్యాయం సరికాదని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలని ఆయన కోరారు.

బాబులా కాకుండా నిబద్ధతతో పనిచేస్తా

అనంతపురం: చంద్రబాబులా కాకుండా తాను నిబద్ధతతో పని చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో మాట్లాడారు. మేం విలువలతో కూడిన రాజకీయం చేస్తామని తెలిపారు. మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డికి చెప్పా..రాజీనామా చేశాకే చక్రపాణిరెడ్డి పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. నేను చంద్రబాబు లాగ కాకుండా నిబద్ధతతో పనిచేస్తానని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్పారు. మేం ఏం చేయబోయేది ముందుగానే ప్రకటిస్తామని వైయస్‌ జగన్‌ వెల్లడించారు.  మా మేనిఫెస్టోను ఇంటర్‌నెట్‌లో పెడతామని, మేం మాటకు కట్టుబడకపోతే ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించొచ్చు అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు చూడమని, అర్హులందరికీ న్యాయం చేస్తామని జననేత స్పష్టం చేశారు.
 – పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు, పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుంది. అవినీతి పరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులకు చంద్రబాబు గేట్లు ఎత్తుతున్నారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని వైయస్ జగన్ పేర్కొన్నారు.  

రాష్ట్రాన్ని ఆదుకోండి

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఓ వినతిపత్రాన్ని అందజేశారు.  పోలవరం పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని, విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించాలని అందులో కోరారు. కేంద్ర సంస్థల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వైయస్‌ జగన్‌ భరోసాతో కొండంత ధైర్యం

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసాతో అనంతపురం జిల్లా ప్రజలకు కొండంత ధైర్యం వచ్చిందని ఊరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 4 నుంచి అనంతపురం జిల్లాలో మొదలైందని చెప్పారు. జననేత ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు, సమస్యలు చెప్పుకున్నారన్నారు. ఆయన ఇప్పుడు అధికారంలో లేరని తెలిసి కూడా, కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.  ఈ జిల్లా ప్రజలు వైయస్‌ జగన్‌ను అమితంగా ప్రేమిస్తార ని చెప్పారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి అవసరమైన లీడర్‌గా అందరూ భావిస్తున్నారని చెప్పారు. కేవలం చదువు వల్లనే ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని వైయస్‌ జగన్‌ భావించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని జననేత పేర్కొన్నారని తెలిపారు. జిల్లాలో వైయస్‌ జగన్‌ 260 కిలోమీటర్లు పైబడి పాదయాత్ర చేశారని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. 

26 December 2017

2019లో వైయస్‌ఆర్‌సీపీకే ప్రజలు పట్టం

అనంతపురం: 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ..సుదూరపు బాటసారి వైయస్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. దారిపొడువునా ప్రజా సమస్యల వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ భవిష్యత్తులో అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని వివరించారు. టీడీపీ లాగా అమలుకు సాధ్యం కాని హామీలు వైయస్‌ జగన్‌ ఇవ్వడం లేదని చెప్పారు. 45 సంవత్సరాలకు పింఛన్‌ ఇవ్వడం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని పెన్షన్‌ పథకం ప్రకటించామన్నారు. దీనిపై టీడీపీ రాద్దాంతం చేయడం సరికాదన్నారు.  మేం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టీడీపీకి ఓట్లు వేయలేదని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో  చేనేత పింఛన్లు 75 నిలుపుదల చేశారన్నారు. ఇందుకోసం తాను రెండు రోజుల పాటు దీక్ష చేసినట్లు రాచమల్లు తెలిపారు.

ఇది ఒక ఉద్వేగభరితమైన నిర్ణయమే

45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలలందరికీ నెలకు రూ.2,000

-  60 ఏళ్లకే వృద్ధాప్య  పింఛన్‌

 అనంత‌పురం:  చేనేత కార్మికుల ఆత్మహత్యలకు పేద‌రిక‌మే కారణమ‌ని తెలిసి తాను ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, పేదింటి మ‌హిళ‌ల‌కు వైయ‌స్ఆర్ చేయూత పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద మహిళలకు ‘వైయ‌స్ఆర్ చేయూత పెన్షన్‌’ కింద నెలకు రూ.2,000 అందిస్తామని  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. క్రిస్మస్‌ పర్వదినం రోజు ‘జగన్‌ స్పీక్స్‌’ పేరుతో విడుదల చేసిన ఓ వీడియోలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.

పేరేదైనా గానీ..
ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు చూసి 45 ఏళ్లకే పెన్షన్‌ అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వైయ‌స్ జ‌గ‌న్ వివరించారు. పేరేదైనా గానీ పేదింటి మహిళలకు నెలనెలా రూ.2వేలు ఇచ్చి ఆదుకోవడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అంతేకాక అందరికీ వృద్ధాప్య పెన్షన్‌ను 60 ఏళ్లకే ఇస్తామని, వారికి కూడా రూ.2వేలు అందించి ఆసరాగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.   

ఎవరూ ప‌ట్టించుకోలేదు..
‘‘45 ఏళ్లకే పెన్షన్‌ అనే భావన ఏ నేపథ్యంలో వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశం. పాద యాత్ర ప్రారంభం కావడానికి ఒక వారం రోజుల ముందు.. 37 రోజులుగా ధర్మవరంలో చేనేత కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎవరూ వాళ్ల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పటికే ధర్మవరంలో 35 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అక్కడ నిరాహారదీక్షలో పాల్గొంటు న్నవారంతా మహిళలు. చాలా బాధ అనిపిం చింది. అక్కడికి వెళ్లినపుడు ఈ ఆత్మహత్యలకు కారణమేమిటమ్మా అని వాళ్లను అడిగాను. బతకడానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయన్నా.. పనులకు పోతేగానీ కడుపు నిండని పరిస్థితి అని చెప్పారు. చేనేత కార్మికులే కాదు ఎవరిని తీసుకున్నా కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నారంటే పనులకు పోతేగానీ కడుపు నిండని పరిస్థితి. పొరపాటున వీళ్లకు ఒక వారంరోజుల పాటు జ్వరం వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా పనులకు పోకపోతే వీళ్ల పరిస్థితి ఎంత దారుణమంటే పస్తు పడుకోవలసిన పరిస్థితి. అంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అది చూసిన నాకు చాలా బాధనిపించింది. నిజానికి ఇది ఒక ఉద్వేగభరితమైన నిర్ణయమే. ఒక నిర్ణయం తీసుకుని ఆరోజు ప్రకటించాను.

పలకరించిన పాపాన పోలేదు..
45 ఏళ్లకే పెన్షనా అని విమర్శించేవాళ్లు విమర్శిస్తారు. చాలామంది వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ వాస్తవమేమి టంటే.. వీళ్లకెవరికీ కూడా ఆ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి అన్న స్పృహ లేదు. ఆ కుటుంబాలను వీళ్లెవరూ ఓదార్చలేదు. ఎలా బతుకుతున్నారని పలకరించిన పాపాన పోలేదు. వీళ్లకు తెలుసుకోవాలన్న తాప త్రయం అంతకన్నా లేదు. అవసరమైతే పేరు మారుద్దాం.. ‘వైయ‌స్ఆర్  చేయూత పెన్షన్‌’ అని పెడదాం. కచ్చితంగా 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు నెలకు రూ.2,000 ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంటాం. కనీసం రూ.2వేలన్నా ఆ అక్కకు చేరితే ఆ కుటుంబం బతకడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం.

 అందరికీ 60 ఏళ్లకే పెన్షన్‌ 
అంతేకాదు పెన్షన్ల వయసు కూడా ఇవాళ 65 ఏళ్ల వయసు నిండితే తప్ప పెన్షన్‌ ఉండటం లేదు. దీన్ని 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ వర్తించేలా చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు మొన్నటివరకు 58 ఏళ్లకే రిటైర్మెంట్‌. అలాంటిది ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. అంటే 60 ఏళ్లకు వృద్ధులు అన్న భావన కల్పించింది. పెన్షన్ల దగ్గరకు వచ్చేసరికి సర్కార్‌ అవ్వాతాతల పట్ల వివక్ష చూపిస్తోం ది. అందుకే 65 ఏళ్లకు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల వయోపరిమితిని తగ్గించి అందరికీ 60 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తాం. ప్రతి ఒక్కరికీ రూ.2,000 ఇస్తాం. వారితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకు 45 ఏళ్లకే రూ.2,000 వైయ‌స్ఆర్‌ చేయూత కింద అందించి  తోడుగా ఉంటాం.  అవ్వాతాతలకు వయసు మీరే కొద్దీ ఒక్క ఆహారానికే కాదు మందులకు, ఆసుపత్రికీ ఖర్చవుతుంది. చిన్నచిన్న వ్యాధులకు కూడా వీరు ఎక్కడికీ పోలేని పరిస్థితి. ఎవరిపైనా ఆధారపడలేని స్థితి. అలాంటి అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే. కాబట్టి వాళ్లందరికీ తోడుగా ఉండే కార్యక్రమం కచ్చితంగా చేసి తీరతాం. పెన్షన్‌ కచ్చితంగా రూ.2,000 చేయాల్సిన అవసరం ఉంది.’’ అని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

44వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

అనంతపురం : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను మీదుగా 10 గంటలకు గాజులవారిపల్లె చేరుకుంటుంది. అనంతరం చామలగొంది క్రాస్ నుంచి 11 గంటలకు ధనియని చెరువు చేరుకున్న వైయ‌స్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌.పి కుంట మండలంలోని ధనియని చెరువులో వైయ‌స్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ధనియని చెరువులో మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. డి కొత్తపల్లి, కొట్టాలవారిపేట మీదుగా సాగిన పాదయాత్ర 5 గంటలకు బండారుచెట్లుపల్లికి చేరుకుంటుంది.  

పోరాట యోధుడు


  • పోరాట యోధుడు
  • ప్రజా సమస్యల పరిష్కారమే జననేత ధ్యేయం
  • 600ల కి.మీ దాటిన ప్రజా సంకల్పయాత్ర
  • వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అడుగడుగునా ఆదరణ
  • రాజన్న బిడ్డపై ప్రతి గ్రామంలో పూలవర్షం
  • మా భవిష్యత్తు నువ్వేనంటూ జెండా మోస్తున్న చిన్నారులు
  • అడుగులో అడుగేస్తున్న ఆంధ్రరాష్ట్ర ప్రజానికం
  • పేద బతుకులను రూపుమాపుతానని వైయస్‌ జగన్‌ భరోసా
అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కరమే ఆయన ధ్యేయం.. రాజకీయాల్లో విశ్వసనీయత తీసుకురావాలనేది ఆయన సంకల్పం... ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడడు. ప్రతీ నిమిషం ప్రజల కోసమే ఆరాటం. పోరాటం. చంద్రబాబు తప్పుడు హామీలు నమ్మి మోసపోయిన ప్రజలను అక్కున చేర్చుకునేందుకు, వారి కష్టాలన్నీ విని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేపట్టారు. తన తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తరహాలో సుమారు 6 నెలల పాటు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర మొదటి అడుగు నేడు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద 6 వందల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కటారుపల్లి వద్ద 600ల కిలోమీటర్లు దాటిన సందర్భంగా వేప మొక్కును నాటారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా ఆదరణ, ఆప్యాయత లభిస్తుంది. ఇప్పటి వరకు కడప, కర్నూలు, ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్‌ జగన్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొంత మంది ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. రాజన్న బిడ్డ మన వాడకు వచ్చాడంటూ ప్రజలంతా పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. పలుచోట్ల వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో పూలవర్షం కురిపిస్తున్నారు. వైయస్‌ జగన్‌తో కరచాలనం చేసేందుకు ప్రజలు, సెల్ఫీలు తీసుకునేందుకు యువత పోటీపడుతున్నారు. జగనన్నా నువ్వే మా భవిష్యత్తుకు మార్గం అని చిన్నారులు చేతిలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా పట్టుకొని జననేత అడుగులో అడుగేస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ అధైర్యపడొద్దమా.. మీకు నేనున్నా.. అంటూ ధైర్యం చెబుతూ వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారు. 

చంద్రబాబు పాలనతో విసిగిపోయామని ప్రజలంతా వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకుంటున్నారు. పెన్షన్‌ రావడం లేదని వృద్ధులు, వికలాంగులు, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు, రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదని మహిళలు, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నా అని యువత ఇలా ప్రతి ఒక్కరూ పాదయాత్రకు తరలివచ్చి జననేతకు వారి సమస్యను చెప్పుకుంటున్నారు. ‘ఇంకో సంవత్సర కాలం ఈ మోసపు ప్రభుత్వం ఉంటుంది. తరువాత మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వస్తుంది’. మన ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారు. అంతే కాకుండా పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్, అర్హులందరికీ ఇళ్లు, రుణమాఫీ, రైతు పంటకు గిట్టుబాటు ధర ఇలా అన్ని పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తామని, గ్రామ సచివాలయంలో సమస్య చెబితే అడిగిన 72 గంటల్లోనే పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేస్తామని వివరిస్తున్నారు. 

నవంబర్‌ 6వ తేదీన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటికీ 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమ్రరి మండలంలో 100 కిలోమీటర్లు, డోన్‌ నియోజకవర్గం ముద్దనూరులో 200 కిలోమీటర్లు, ఎమిగనూరు బిఅగ్రహారం మండలం కారుమంచిలో 300ల కిలోమీటర్లు, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి వద్ద 400ల కిలోమీటర్లు, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు వద్ద 500ల కిలోమీటర్లు, కదిరి నియోజకవర్గంలో కటారుపల్లిలో 600ల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 

దనియానిచెరువులో పార్టీ జెండా ఆవిష్కరణ

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 44వ రోజు కదిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉదయం గండ్ల పెంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర దనియానిచెరువుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ దినియాని చెరువు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చారు. 

వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగ దంపతులు

అనంతపురం: వైయస్‌ఆర్‌ సానుభూతిపరులు అంటూ మాకు రావాల్సిన పింఛన్‌ మూడు నెలల పాటు నిలిపివేశారని దివ్యాంగ దంపతులు రామాంజనేయులు, చౌడేశ్వరి వైయస్‌ జగన్‌కు వివరించారు. బియ్యం 15 కేజీలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.  పాపను చదివించుకోవడం కష్టంగా ఉందని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మన ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.3 వేలు ఇస్తానని, పిల్లలను చదివించే బాధ్యత నాదే అని భరోసా కల్పించారు.

తాళ్ల కాల్వ చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రితం తాళ్ల కాల్వ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు.

వైయస్‌ఆర్‌ సీపీలోకి బీసీ నేతలు

అనంతపురంకదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏపీ రజక సంఘం నేత లోగిడి జయన్న, పిడుగురాళ్ల బీసీ నేత కందుర్తి గురువాచారి, రజక సంఘం నేతలు పార్టీలో చేరారు. 

ఆదర్శరైతు వ్యవస్థను పునరుద్ధరిస్తా

అనంతపురం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి మంచిపేరు రాకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు కుట్రపూరితంగా ఆదర్శ వ్యవస్థను తొలగించారని రైతులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. కదిరి నియోజకవర్గంలో కటారుపల్లిలో ప్రజా సంకల్పయాత్రలో వారు పాల్గొని వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, రైతులకు వారధిగా పనిచేసేందుకు గతంలో వైయస్‌ఆర్‌ ఆదర్శ రైతులను నియమించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఊడబెరికారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్‌ జగన్‌ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ  వారికి భరోసా ఇచ్చారు. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. 

22 December 2017

జనం మెచ్చిన నాయకుడు


– ప్రతి కష్టంలోనూ అండగా నిలిచిన జననేత
– ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు
– ప్రతి అడుగూ ‘వైయస్‌ఆర్‌ కుటుంబానికి’ అండగా 

ఇద్దరితో మొదలై.. ప్రభంజనంగా మారిన వైయస్‌ఆర్‌సీపీ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌ రా్రçష్టంలో ఒక చరిత్ర. ఓదార్పు యాత్రకు అనుమంతించలేదని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదిరించి బయటకొచ్చిన జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అనుక్షణం అండగా నిలిచారు. అంతటి ఆదరణ చూపిన ప్రజల రుణం తీర్చుకుంటూ వైయస్‌ జగన్‌ టీడీపీతో యుద్ధమే చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా నిస్వార్థంగా ప్రజల పక్షాన చేస్తున్న పోరాటమే ఆయన్ను జనానికి మరింత చేరువ చేసింది. 
వైయస్‌ కొడుకు నుంచి ప్రతిపక్ష నాయకుడి దాకా..
వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో రాష్ట్రం దిక్కులేదనిదైంది. మహానేత మరణ వార్త విని తట్టుకోలేక ఎంతోమంది అభిమానులు గుండెలు పగిలి చనిపోయారు. వారందరికీ అండగా నిలిచేందుకు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కూడా ఎదిరించి బయటకొచ్చి జనామోదంతో సొంతంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసింది. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన క్షణం నుంచి నేటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. తల్లీకొడుకులే ప్రజాప్రతినిధులుగా వైయస్‌ఆర్‌సీపీ ప్రస్థానం 2014 నాటికి ప్రభంజనంగా మారింది. 67 మందితో ప్రతిపక్షంగా అవతరించింది. కేవలం రెండు శాతం స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసినా వెనకడుగు వేసింది లేదు. తొలిరోజు నుంచే ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో, ప్రజా క్షేత్రంలో అలుపెరుగుని పోరాటం చేస్తూనే ఉన్నారు.
 
ప్రతిసమస్యపైనా ముందున్నాడు..

ప్రజా సమస్యలపై స్పందించిన తీరే వైయస్‌ జగన్‌ను ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఎన్నికల హామీలు ఇవ్వకుండా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల పక్షాన చేసిన నిరంతర పోరాటం వైయస్‌ కొడుకుగా రాజకీయాల్లో ఎంపీ స్థాయి నుంచి అనతికాలంలోనే సొంత పార్టీని స్థాపించి ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక పెద్ద కుటుంబాన్ని నిర్మించుకున్నారు. ఆపదల్లో ఉన్నామని తెలిసిన వెంటనే.. సాయం కోరకుండానే వచ్చి పలకరించిన గొంతు ఆయనది. సమస్యల్లో ఉన్నప్పుడు వచ్చి గడప తొక్కే తొలి అడుగు ఆయనది. ఇదే ఆయన్ను జననేతను చేసింది. ఆయనపై వచ్చిన ఎన్నో ఆరోపణలకు తన పనితీరుతూనే సమాధానం చెప్పారు. వ్యక్తిగతంగా  రెచ్చగొట్టాలని చూసినా సంయమనంతో వ్యవహరించి అందరి మనసులు గెలిచాడు. గరగప్రరు లాంటి సున్నిత సంఘటన సమాయాల్లో కులమతాలకు అతీతంగా వ్యవహరించి రాజీ చేసొచ్చారు. ఎవరూ చేరలేని చాపరాయి లాంటి ప్రాంతాలను నడిచెల్లి అభిమానుల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమనే సందేశం పంపారు. 

ఫిరాయింపులు అడ్డుకాలేదు..

పార్టీలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా వైయస్‌ జగన్‌ను నిలువరించాలని చూసిన టీడీపీ కుట్రలకు ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు. డబ్బులతో చేసే రాజకీయాల కన్నా ప్రజాభిమానం ఎంత గొప్పదో నిరూపించారు. పిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన చేపట్టిన పాదయాత్రలే జనాదరణకు నిదర్శనం. నంద్యాల, కాకినాడ వంటి ఎన్నికల్లో ధన ప్రవాహం, అధికారమే పెట్టుబడిగా పెట్టి చేసిన విచ్చలవిడి ధనయజ్ఞం, గూండాయిజాన్ని కూడా చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. పార్టీ ఏర్పాటైన నుంచి ఎదుర్కొన్న సవాళ్లతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్నవేనంటూ ప్రజాభిమానాన్నే నమ్ముకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఆరోగ్య శ్రీ అమలు తీరు, అమరావతి భూముల దందా, గోదావరి ఆక్వా ఫుడ్, బందరు పోర్టు భూ బాధితులు, వంశధార నిర్వాసితులు, అతివృష్టి, రాయలసీమలో కరువు ఇలా ఏ సమస్య వచ్చినా బాధితులను పరామర్శించిన మొదటి వ్యక్తి వైయస్‌ జగన్‌. అందుకే ఆయన జనం మెచ్చిన నాయకుడు.

సీమ నీటికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం

రాయలసీమ రైతుల కన్నీటి చుక్కలు బీడు నేలల్లో ఇంకి పోతున్నాయి. కరువు సీమగా పేరు పడ్డ రాయల సీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అన్యాయం రైతులు ఎప్పటికీ మర్చిపోలేరు. పట్టిసీమతో రాయలసీమ రైతులకు నీరిచ్చామని, రెయిన్ గన్ లతో పంటలు పండించామని పచ్చి అబద్ధాలు చెబుతున్న దగాకోరు బాబు బండారాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతున్నారు. 
గొంతు తడుపుకోను చుక్కనీరు లేక రాయలసీమ నేల కన్నీరు పెట్టుకుంటోంది. చివరకు పశువులు కూడా మేత కరువవడంతో కబేళాకు తరలిపోతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన చిత్తూరు జిల్లాలో కరువు కోరలు చాచింది. మదన పల్లె, తంబళ్ళ పల్లి, బి.కొత్తకోట, వి.కోట, ములకల చెరువు వంటి చోట్లైతే పొలాలు ఎండి పోయి బీళ్లువారాయి. నీటి కోసం వందల అడుగులకు పైగా బోర్లు వేసినా పాతాళ గంగ పలకరించలేదు. తీవ్ర వర్షాభావంతో బావులు, బోర్లు ఎండిపోయాయి. పంట కుంటలు, రెయిన్ గన్ లు అంటూ ప్రచారాలు చేసి, హడావిడి చేసిన సిఎమ్ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఎకరా పంటని కూడా నీటితో తడపలేకపోయింది. అరకొరగా పండిన పంటలకు గిట్టు బాటు ధర రాక రైతులు చంద్రబాబును మార్కెట్ యార్డుల్లోనే శాపనార్థాలు పెట్టారు. కేంద్రం నుంచి కరువు బృందాలు వచ్చి పర్యటించి వెళ్లడమే కానీ ప్రయోజనమే ఉండటం లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. పదే పదే హంద్రీనీవా, గాలేరు నగరి పేర్లు ప్రస్తావించడమే కానీ, ఆ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడమే లేదు. ఇవి పూర్తయ్యి రాయలసీమ పంటలతో కళకళ లాడుతుందని ఆశపడుతున్న రైతులకు నిరాశే ఎదురౌతోంది. తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న సీమకు నీళ్లు కావాలంటూ ప్రజల తరఫునా, రైతుల తరఫునా నిరంతరంగా పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 
పెండిగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, సీమ నాలుగు జిల్లాల్లోనూ పశుగ్రాసం ప్రభుత్వమే అందించాలనీ, దానితోపాటే ఉపాధిహామీ బకాయిలను వెంటనే మంజూరు చేయాలనీ డిమాండ్ చేస్తూ రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యమాలు చేస్తున్నారు. సీమను దగా చేసిన చంద్రబాబు తన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్ పి అవినాష్ రెడ్డి రాయలసీమ నీటి కేటాయింపుల కోసం ఆందోళనలు చేసారు. నగరి ఎమ్మెల్యేరోజా సీమకు నీరు ఇవ్వాలని కోరుతూ తిరుపతి వరకూ పాదయాత్ర చేసారు. 
ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని నమ్మబలికాడు చంద్రబాబు. కాని గత నాలుగేళ్లుగా రాయలసీమ ప్రాంతానికి పెట్టాల్సిన ఖర్చును తగ్గించి, ఒకే ప్రాంత అభివృద్ధికి ఆ నిధులను మళ్లిస్తున్నాడు. రాయలసీమకు 300టిఎమ్ సిల నీళ్లు అవసరం అవుతాయని గతంలో నీటిపారుదల శాఖ నిపుణులు చెప్పారు. నేటికీ సీమలో 15% భూమికి మాత్రమే నీటిలభ్యత ఉంది. రాయల సీమ మొత్తంలో ఉన్న సాగు భూమి కోటీ 68లక్షల 50వేల ఎకరాలు. ఇందులో కేవలం 70లక్షల ఎకరాలు మాత్రమే సాగౌతోంది. సీమకు 122టి.ఎమ్.సిల నికర జలాలతో 10లక్షల ఎకరాల ఆయకట్టుకు నదుల నుంచి నీటి కేటాయింపులు ఉన్నాయి. సహజ వనరులైన చెరువులు, కాల్వలు, వాగులు, బావుల నుంచి 20% సాగు అవుతుంది. నాలుగు కరువు జిల్లాల్లోనూ చెరువులు కుంటల ద్వారా సాగు అవుతున్న భూములే అధికం. సాగు నీరు అందక లక్షల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదు. అందుకే రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంది. 
వరస కరువుతో రాయలసీమ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారౌతోంది. చెరువులు, బోరు బావులూ ఎండిపోయాయి. కానీ చంద్రబాబు మాత్రం నన్ను చూసి కరువు భయపడుతుందంటూ ఉపన్యాసాలు దంచుతున్నాడు. కరువు కోరల్లో చిక్కి, ఉపాధి పనులు లేక వలస పోతున్న వారిని చూసి అధిక ఆదాయం కోసం వెళ్తున్నారంటూ విమర్శించే చంద్రబాబు లాంటి మానతవత్వం లేని నాయకుణ్ణి ఎక్కడా చూడం. ఉపాధి కూలీలకు అధిక పనిదినాలు కల్పించి, వేతనాలు సకాలంలో ఇచ్చి వలసలను ఆపాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున బంద్ లు, ధర్నాలు నిర్శహించింది. చంద్రబాబు యథాప్రకారం అరెస్టులు, లాఠీ ఛార్జీలతో ఉద్యమంపై విరుచుకుపడిందే కానీ, కరువు నివారణకు ఏ చర్యలూ తీసుకున్నదే లేదు. రాయలసీమకు నీటిని, యువతకు భవితను లేకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి సీమ ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధమౌతున్నారు.

పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి

పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి
కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు
ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పాలి
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ చేయొద్దు
రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే పదవులు వదులుకోవడానికి సిద్ధం

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్రమంత్రిని కోరారు. 2019 సంవత్సరంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వై. విజయసాయిరెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌లు కేంద్ర జలవనరుల శాఖామంత్రి గడ్కరీని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పాలని కేంద్రమంత్రిని కోరడం జరిగిందన్నారు. దుగ్గరాజపట్నం పూర్తి చేయాలని కోరామన్నారు. అదే విధంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రైవేటీకరణ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వస్తుందన్నారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా విషయాన్ని కూడా కేంద్రమంత్రితో చర్చించామన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. మా రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ క్షణమే పదవులు వదులుకుంటామని, పార్లమెంట్, రాజ్యసభల్లో హోదా కోసం పోరాడుతున్నామని చెప్పారు. 

దేవిప్రియ, వల్లభరావులకు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కించుకున్న దేవిప్రియ, వెన్న వల్లభరావులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషా రంగంలో వారు చేసిన కృషికి ఈ అవార్డు రావడం గర్వకారణమని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ద్వారా తెలుగు కీర్తి దశదిశలా విస్తరించిందన్నారు. 

ప్రజల కోసం పోరాడే నాయకుడు చల్లగా ఉండాలి

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వైయస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో కిలివేటి సంజీవయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ ఉన్నత పదవి అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అమ్మవారికి పాలాభిషేకం చేసినట్లు చెప్పారు. 
తిరుమలలో.. 
వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలలోని వెంకటేశ్వరస్వామి సన్నిధిలో 1001 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో జననేత ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

వెన్ను చూపని యోధుడు వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెన్నుచూపని యోధుడని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలలో ఆయన మాట్లాడుతూ..గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ ఒక అరుదైన నాయకుడిగా మన కళ్ల ముందు ఆవిష్కరించబడ్డాడని తెలిపారు. రాజన్న బిడ్డపై అన్ని రకాలుగా కుట్రలు పన్ని, ఆయన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెన్నుచూపి వెనకకు తిరుగలేదన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆచరణలో చూపిన కార్యక్రమాలే పునాదిగా పుట్టింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రజలకు అండగా ఉండేందుకు నిత్యం ప్రజలతోనే మమేకమవుతున్నారని చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామీగా తీసుకెళ్లే నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. ఆయన నుంచి ప్రజలతో మమేకమయ్యే గుణాన్ని, అంకితభావాన్ని ప్రతి  కార్యకర్త స్వీకరించాలన్నారు.

వైయస్‌ జగన్‌ యువతకు స్ఫూర్తి

హైదరాబాద్‌: అతిచిన్న వయస్సులో యువతకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ఏకైక నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజున వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో దుష్టశక్తులు అడ్డుపడుతున్నా.. అకుంటిత దీక్షతో ప్రజలతో మమేకమై, ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ నిండు నూరేళ్లు దేవుడి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించాలని కోరారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి రావాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వైయస్‌ జగన్‌ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 

జ‌న‌మే జ‌గ‌న్‌

విజయవాడ: పుట్టిన రోజు కూడా వైయ‌స్ జగన్ ప్రజల మధ్యే వున్నారని, జ‌న‌మే జ‌గ‌న్ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య‌శిబిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో 13 దేశాల‍్లో చక‍్కర్లు కొట‍్టడం తప‍్ప సాధించింది ఏమీలేదని  విమర్శించారు. రాష్ర‍్ట అభివృద్ధిని గాలికి వదిలిన చంద్రబాబు దేశాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవాచేశారు.   ప్రత్యేక హోదాను వదిలిపెట్టిన చంద్రబాబు పోలవరం విషయంలోనూ నిర‍్లక్ష‍్యం వహిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయ‌స్ఆర్‌సీపీ కట్టుబడిఉందని, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత‍్వంలోనే పోలవరం, ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ‍్యక‍్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును నిర‍్మించాల్సిన బాధ‍్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర‍్కొన్నారు. ప్రజా సమస్యలపై అన్ని వర్గాలను చైతన్యవంతం చేయడమే ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యమని చెప్పారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

2 December 2017

పిల్ల‌లను చదివించుకుంటే జీవితాలు బాగుంటాయి

కర్నూలు: పిల్లలను చదివించుకుంటేనే జీవితాలు బాగుంటాయని మహిళలకు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ‌నివారం రాతన గ్రామంలో మహిళలు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను వైయస్‌జగన్‌ అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు తమ రుణాలు మాఫీ చేశాడని మహిళలు ముక్తకంఠంతో చెప్పారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ వారికి భరోసా కల్పించారు. మన ప్రభుత్వం వచ్చాక మీ పిల్లలను తాను చదివిస్తానని, బ్యాంకు రుణాలన్నీ కూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని, వడ్డీ డబ్బులు కూడా బ్యాంకులకు కడుతామని చెప్పారు. 
వైయస్‌ జగన్‌ను కలిసిన టమాట రైతులు
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌జగన్‌ను టమాట రైతులు కలిశారు. ఈ సందర్భంగా టమాట ధరలను అడిగి తెలుసుకున్న వైయస్‌ జగన్‌ ఈ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులకు బాక్స్‌కు రూ.200 ఇస్తున్నారని, ఇదే చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్‌ షాపులో కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి మారుస్తానని, టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.