22 December 2017

పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి

పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి
కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు
ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పాలి
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ చేయొద్దు
రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే పదవులు వదులుకోవడానికి సిద్ధం

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్రమంత్రిని కోరారు. 2019 సంవత్సరంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వై. విజయసాయిరెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌లు కేంద్ర జలవనరుల శాఖామంత్రి గడ్కరీని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పాలని కేంద్రమంత్రిని కోరడం జరిగిందన్నారు. దుగ్గరాజపట్నం పూర్తి చేయాలని కోరామన్నారు. అదే విధంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రైవేటీకరణ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వస్తుందన్నారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా విషయాన్ని కూడా కేంద్రమంత్రితో చర్చించామన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. మా రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ క్షణమే పదవులు వదులుకుంటామని, పార్లమెంట్, రాజ్యసభల్లో హోదా కోసం పోరాడుతున్నామని చెప్పారు. 

No comments:

Post a comment