30 December 2017

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

చిత్తూరు :  పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరారు. 47వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయ‌స్‌ జగన్‌ను ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు శ‌నివారం కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. అలాగే ఏళ్ల తరబడి మున్సిపాలిటీలో పనిచేస్తున్నా కనీస వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జననేత దృష్టికి తీసుకెళ్లారు. వీరి సమస్యలు విన్న వైయ‌స్ జగన్‌ సానుకూలంగా స్పందించారు. మరో ఏడాది ఓపిక పట్టండి..ఆ తరువాత మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీపై  ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment