8 November 2017

జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం

వైయ‌స్ఆర్ జిల్లా: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వైయ‌స్ఆర్ జిల్లాలో విశేష స్పంద‌న వ‌స్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన ప్ర‌జలు ప‌నులు మానుకొని జ‌న‌నేత కోసం ఎదురెళ్లి స్వాగ‌తాలు ప‌లుకుతున్నారు. ఈ నెల 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర బుధ‌వారం మూడో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 8.40 గంటలకు నేలతిమ్మాయిపల్లి  వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర మొదలుపెట్టారు. గ్రామంలో జెండాను ఆవిష్క‌రించి ముందుకు క‌దిలారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు.  రోడ్డుకు ఇరువైపులా నిలిచిన ప్రజలు ప్రత్యేకించి యువతరం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనాలు, సెల్ఫీల కోసం పెద్దఎత్తున పోటీపడ్డారు. అడుగు తీసి అడుగేయడానికే వీల్లేకుండా సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.

దారిపొడవునా ఎటుచూసినా జనమే..
వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌గా వ‌స్తున్న దారిపోడువునా జ‌ననే జ‌నం. దూరం నుంచి చూసే వారికి చీమలవరుసలా బారులు తీరిన జనప్రభంజనమే కనిపించింది. ప్ర‌తి ఊరి శివారులో మ‌హిళ‌లు ముగ్గులు వేసి త‌మ అభిమాన నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి.. కుంకుమ తిలకాలు దిద్దుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రిని చిరున‌వ్వుతో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ల‌క‌రిస్తూ వారి స‌మ‌స్య‌లు తెలుసుకొని స్వ‌యంగా నోటు చేసుకుంటున్నారు. ఆయ‌న్ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రికి మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, మంచి రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని భరోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

No comments:

Post a comment