6 November 2017

జగన్‌ పాదయాత్ర..బాబు పాలనకు అంతిమయాత్ర


ఇడుపులపాయ:  ప్రజల కన్నీరు తుడిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మించి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర చంద్రబాబు పాలనకు అంతిమ యాత్ర కాబోతుందని హెచ్చరించారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి సమాది కట్టేందుకు ఈ యాత్ర చేపట్టారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రగతి యాత్ర ఇది అన్నారు. దేశ చరిత్రలో ఏ నాయకుడు, ఎప్పుడు చేయని విధంగా వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్రలో వెన్నుదన్నుగా నిలుద్దాం. ప్రతి అడుగు చంద్రబాబు గుండెల మీద పడుతుందని గుర్తుంచుకొని, దడదడలాడేలా సాగుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బాబుది దొంగ యాత్ర : ఎమ్మెల్యే కోడాలి నాని
 చంద్రబాబు గతంలో చేసింది దొంగ యాత్ర అని ఎమ్మెల్యే కోడాలి నాని విమర్శించారు. వైయస్‌ జగన్‌ ప్రజల కోసం ఏడు నెలలు 13 జిల్లాలు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. దానికి మీ అందరి శుభాశీస్సులు కావాలని వైయస్‌ జగన్‌ కోరారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. పాదయాత్ర అంటేనే మొట్టమొదట గుర్తుకు వచ్చేది వైయస్‌ రాజశేఖరరెడ్డి. నాడు 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ పాదయాత్ర చే శారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఓ గుంట నక్క దొంగ యాత్ర చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. మహానేత పేదలకు న్యాయం చేసేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎందరికో ఉన్నత విద్యనందించారు. ఉచిత విద్యుత్‌ పేరుతో రైతులను ఆదుకున్నారు. అపర భగీరథుడు వైయస్‌ఆర్‌. ఆరోగ్యశ్రీ కార్డుతో పేదలను కార్పొరేట్‌ ఆసుపత్రికి పంపించిన మహానుభావుడు వైయస్‌ఆర్‌. చంద్రబాబు మాత్రం పగలంతా బస్సులో పడుకుని రాత్రి దొంగ యాత్ర చేశారు. తాను ఐదు సంతకాలు చేస్తానని చెప్పి దొంగ సంతకాలు చేశారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రతో మీ ముందుకు వస్తున్నారు.

No comments:

Post a Comment