13 November 2017

బెల్ట్‌ షాపుల వల్ల కుటుంబాలు నాశనం


వైయ‌స్ఆర్ జిల్లా:  గ్రామాల్లో బెల్ట్‌ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని మ‌హిళ‌లు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్‌ షాపులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని మహిళలు.. వైయ‌స్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి . ఏడోరోజు పాదయాత్ర గా  సోమ‌వారం  జొన్న‌వ‌రం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా  పలువురు మహిళలు ఆయ‌న్ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. మహిళల ఆవేదన పట్ల స్పందించిన వైయ‌స్‌  జగన్‌... వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బెల్ట్‌ షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ఆయన తెలిపారు. 

No comments:

Post a Comment